
సూర్యకు థ్యాంక్స్ చెప్పుకోవాలి
సూర్యది చాలా పెద్ద మనసు. ఆయనకు థ్యాంక్స్ చెప్పుకోవాలి అంటున్నారు నటి శ్రుతీహాసన్. ఈమె ఇప్పుడు చాలా పాపులర్ హీరోయిన్. తమిళం, తెలుగు, హిందీ అంటూ పలు భాషలలో ప్రముఖ హీరోలతో వరస పెట్టి నటించేస్తున్నారు. మధ్య మధ్యలో ఐటమ్ సాంగ్స్‌లోనూ దుమ్ము రేపుతున్నారు. తెలుగు చిత్రం ఆగడులో ఓ ఐటమ్ సాంగ్‌లో అందాలారబోతతో అదిరే స్టెప్స్ వేసి ఆ పాటకు యమ క్రేజ్ తీసుకొచ్చారు. అంతే కాదు ఒక నాటి ఐటమ్ సాంగ్స్‌కే చిరునామా అనేంతగా పేరు గడించిన నటి జయమాలిని ప్రశంసలను కూడా అందుకున్నారు. తాజాగా నాగార్జున, కార్తీ నటిస్తున్న చిత్రంలో కూడా శ్రుతీహాసన్ ఐటమ్ సాంగ్ చూడొచ్చు అంటున్నారు. శ్రుతీ కోలీవుడ్‌లో పరిచయమైన చిత్రం 7ఆమ్ అరివు అన్న విషయం తెలిసిందే. ఇందులో హీరో సూర్య. ఈ చిత్రంలో శ్రుతీహాసన్ పాత్ర సూర్య పాత్రకు ధీటుగా ఉంటుంది.
ఇకపోతే తాజాగా మరోసారి సూర్యతో రొమాన్స్‌కు సిద్ధం అవుతున్నారు శ్రుతీ. కమర్షియల్ చిత్రాల దర్శకుడు హరి దర్శకత్వంలో తెరకెక్కనున్న సింగం-3లో ఈ క్రేజీ జంట నటించనున్నారు. ఇందులోనూ శ్రుతీహాసన్‌కు చాలా ప్రాముఖ్యత ఉన్న పాత్ర అట. దీని గురించి శ్రుతీహాసన్ తెలుపుతూ సూర్య కథానాయకుడిగా నటించే చిత్రాలలో కథానాయికలకు ప్రాధాన్యత ఉంటుందన్నారు. అందుకు అంగీకరించే పెద్ద మనసు ఆయనకు ఉందని పేర్కోన్నారు. 7ఆమ్ అరివు చిత్రంలో మాదిరిగానే సింగం-3 చిత్రంలోనే తన పాత్రకు ప్రాధాన్యత ఉంటుందన్నారు. దర్శకుడు హరి ఈ చిత్ర కథ చెప్పగానే బాగా నచ్చేసిందని అన్నారు. హీరో పాత్రకు సమానమైన పాత్ర ఉండడాన్ని అంగీకరించిన సూర్యకు థ్యాంక్స్ చెప్పాలని శ్రుతీహాసన్ అన్నారు. ఇటీవలే విజయ్‌తో పులి చిత్రాన్ని పూర్తి చేసిన శ్రుతీహాసన్ ప్రస్తుతం అజిత్‌కు జంట గా నటిస్తున్నారు. సింగం-3 త్వరలో సెట్స్ పైకి రానుంది.