నవంబరులో స్టార్ట్‌ | Suriya Joins RJ Balaji For Dream Warrior Pictures Film | Sakshi
Sakshi News home page

నవంబరులో స్టార్ట్‌

Published Tue, Oct 15 2024 1:51 AM | Last Updated on Tue, Oct 15 2024 1:51 AM

Suriya Joins RJ Balaji For Dream Warrior Pictures Film

సూర్య హీరోగా ఆర్‌జే బాలాజీ దర్శకత్వంలో ఓ భారీ యాక్షన్  అడ్వెంచరస్‌ మూవీ రూపుదిద్దుకోనుంది. సూర్య కెరీర్‌లో 45వ సినిమాగా రూపొందనున్న ఈ మూవీని డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌ పతాకంపై ఎస్‌ఆర్‌ ప్రకాష్‌బాబు, ఎస్‌ఆర్‌ ప్రభు నిర్మించనున్నారు. 

ఈ సినిమా చిత్రీకరణను నవంబరులో ప్రారంభించి, వచ్చే ఏడాది ద్వితీయార్ధంలో విడుదల చేసేందుకు ప్లాన్  చేశారు మేకర్స్‌. ‘‘ప్రస్తుతం ఈ సినిమా ప్రీప్రోడక్షన్  వర్క్స్‌లో ఆర్‌జే బాలాజీ బిజీగా ఉన్నారు. ఈ కథపై ఆయన ఏడాదిగా వర్క్‌ చేస్తున్నారు. చిత్రీకరణకు అనువైన లొకేషన్ల సందర్శన కూడా చేస్తున్నారాయన’’ అని చిత్రయూనిట్‌ తెలిపింది. ఈ సినిమాకు సంగీతం: ఏఆర్‌ రెహమాన్ .

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement