‘‘ఇక ‘కర్ణ’ లేనట్లే... ఆగిపోయింది’’ అంటూ ప్రచారంలో ఉన్న వార్తలకు బ్రేక్ పడేలా ఫ్లాష్ న్యూస్ ఇచ్చారు దర్శకుడు రాకేశ్ ఓంప్రకాశ్ మెహ్రా. సూర్య టైటిల్ రోల్‌లో రాకేశ్ ఓంప్రకాశ్ ‘కర్ణ’ అనే సినిమాని తెరకెక్కించనున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. దాదాపు ఏడాదిన్నర క్రితమే ఈ సినిమా గురించిన వార్త వచ్చింది. ఆ తర్వాత అప్‌డేట్ లేకపోవడంతో ‘కర్ణ’ ఆగిపోయిందనే వార్త తెరపైకి వచ్చింది. ఈ నేపథ్యంలో ‘‘కర్ణ’ ఆగడు. ఈ చిత్రానికి సంబంధించిన పనులు జరుగుతున్నాయి’’ అని తాజాగా పేర్కొన్నారు ఓంప్రకాశ్. మహాభారతం నేపథ్యంలో రూపొందనున్న ‘కర్ణ’లో కర్ణుడిగా సూర్య నటించనున్నారు.
కర్ణుడి భార్యపాత్రకు జాన్వీ కపూర్‌ని తీసుకోవాలనుకుంటున్నారట. సంగీతదర్శకత్వానికి ఏఆర్ రెహమాన్‌ని సంప్రదించారని సమాచారం. ఈ చిత్రాన్ని హిందీ, తమిళంలో చిత్రీకరించి, తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో అనువదించి, విడుదల చేయాలనుకుంటున్నారట. ఈ విషయాల గురించి త్వరలో అధికారిక ప్రకటన రానుంది. ఇక రెండు భాగాలుగా రూపొందనున్న ఈ చిత్రానికి రచయిత ఆనంద్ నీలకంఠన్ స్క్రిప్ట్ వర్క్ చేస్తున్నారు. హిందీలో సూర్యకి ఇదే తొలి చిత్రం అవుతుంది.
Comments
Please login to add a commentAdd a comment