karna
-
కర్ణ ఆగడు
‘‘ఇక ‘కర్ణ’ లేనట్లే... ఆగిపోయింది’’ అంటూ ప్రచారంలో ఉన్న వార్తలకు బ్రేక్ పడేలా ఫ్లాష్ న్యూస్ ఇచ్చారు దర్శకుడు రాకేశ్ ఓంప్రకాశ్ మెహ్రా. సూర్య టైటిల్ రోల్లో రాకేశ్ ఓంప్రకాశ్ ‘కర్ణ’ అనే సినిమాని తెరకెక్కించనున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. దాదాపు ఏడాదిన్నర క్రితమే ఈ సినిమా గురించిన వార్త వచ్చింది. ఆ తర్వాత అప్డేట్ లేకపోవడంతో ‘కర్ణ’ ఆగిపోయిందనే వార్త తెరపైకి వచ్చింది. ఈ నేపథ్యంలో ‘‘కర్ణ’ ఆగడు. ఈ చిత్రానికి సంబంధించిన పనులు జరుగుతున్నాయి’’ అని తాజాగా పేర్కొన్నారు ఓంప్రకాశ్. మహాభారతం నేపథ్యంలో రూపొందనున్న ‘కర్ణ’లో కర్ణుడిగా సూర్య నటించనున్నారు.కర్ణుడి భార్యపాత్రకు జాన్వీ కపూర్‌ని తీసుకోవాలనుకుంటున్నారట. సంగీతదర్శకత్వానికి ఏఆర్ రెహమాన్‌ని సంప్రదించారని సమాచారం. ఈ చిత్రాన్ని హిందీ, తమిళంలో చిత్రీకరించి, తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో అనువదించి, విడుదల చేయాలనుకుంటున్నారట. ఈ విషయాల గురించి త్వరలో అధికారిక ప్రకటన రానుంది. ఇక రెండు భాగాలుగా రూపొందనున్న ఈ చిత్రానికి రచయిత ఆనంద్ నీలకంఠన్ స్క్రిప్ట్ వర్క్ చేస్తున్నారు. హిందీలో సూర్యకి ఇదే తొలి చిత్రం అవుతుంది. -
Karna Movie Review: ‘కర్ణ’ మూవీ ఎలా ఉందంటే..
టైటిల్: కర్ణ నటీనటులు:కళాధర్ కొక్కొండ, మోనా ఠాకూర్, ఆస్మా సయ్యద్, ఛత్రపతి శేఖర్, అజయ్, దిల్ రమేష్, మహేందర్, ప్రసాద్, నూకరాజు తదితరులు నిర్మాణ సంస్థ: సనాతన క్రియేషన్స్ నిర్మాత: కళాధర్ కొక్కొండ దర్శకత్వం: కళాధర్ కొక్కొండ సంగీతం: ప్రశాంత్ బీజే సినిమాటోగ్రఫీ: శ్రవణ్ జి కుమార్ విడుదల తేది: జూన్ 23, 2023 ‘కర్ణ’ కథేంటంటే.. కర్ణ(కళాధర్ కొక్కొండ..ముగ్గురిని హత్య చేసి జైలు జీవితం గడిపి బయటకు వస్తాడు. అనంతరం స్నేహితులను మోసం చేసిన వారిని టార్గెట్ చేస్తూ హత్యలకు పాల్పడుతుంటాడు. ఈ క్రమంలో ఓ మంత్రి కొడుకును కూడా చంపేస్తాడు. దీంతో కర్ణ కోసం పోలీసులు గాలిస్తుంటారు. మరి పోలీసులకు కర్ణ దొరికాడా? అసలు స్నేహితులను మోసం చేసినవారిని మాత్రమే కర్ణ ఎందుకు చంపుతున్నాడు? తన చిన్ననాటి స్నేహితుడు పండు(మహేందర్) ఏమయ్యాడు? ప్రేమించిన ఫాతిమాతో తన వివాహం జరిగిందా? అనే విషయాలు సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. ఎలా ఉందంటే.. యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కించిన చిత్రమిది. పగ, ప్రతీకారం నేపథ్యంలో ఈ మూవీ సాగుతుంది.స్నేహానికి ద్రోహం చేస్తే చంపడానికి కూడా వెనుకాడని విధంగా కర్ణ ఎలా రాటు దేలాడు? అనే విషయాన్ని చాలా కన్విన్సింగ్ గా చెప్పడంలో డైరెక్టర్ సఫలం అయ్యాడు కానీ స్క్రీన్‌ప్లే విషయంలో మాత్రం విఫలం అయ్యాడు. స్క్రీన్‌ప్లే విషయంలో ఇంకాస్త జాగ్రత్తపడి బలంగా రాసుకుంటే బాగుండేది. ‘చట్టానికి చిక్కిన రవికిరణం, సంకెళ్లతో బిగిసిన ప్రతీకారం.. ద్రోహం, విద్రోహం.. కన్నీళ్లతో రగిలే ఆగ్రహం.. మేధం నరమేధం రక్తంతో రాసిన శాసనం ’అంటూ ట్రైలర్లోనే సినిమా ఎలా ఉండబోతుందో చూపించాడు. అందుకు తగ్గట్లే భారీ యాక్షన్ సన్నివేశాలతో సినిమాలను తెరకెక్కించాడు. యాక్షన్ సన్నివేశాలకు తోడు పల్లెటూరి వాతావరణం, ఫీల్ గుడ్ లవ్ స్టోరీ సినిమాపై అభిప్రాయాన్ని మార్చేస్తుంది. కథగా బాగానే ఉన్నా స్క్రీన్ ప్లే మీద కూడా కొంత ఫోకస్ పెట్టి..పేరున్న నటీనటులతో తెరకెక్కిస్తే ఈ సినిమా ఫలితం మరోలా ఉండేది. కర్ణ పాత్రకు ‘కళాధర్ కొక్కొండ’ న్యాయం చేశాడు. ఒకవైపు దర్శకత్వ, నిర్మాణ బాధ్యతలు చేపడుతూ..సినిమాలో నటించి, చక్కటి అభినయంతో ఆకట్టుకున్నాడు. ఇక హీరోయిన్గా మోనా ఠాకూర్ తన పాత్ర పరిధిమేర ఆకట్టుకుంది. ఛత్రపతి శేఖర్, దిల్ రమేష్, మహేందర్, ప్రసాద్, నూకరాజు, అజయ్, ఎజాస్, ప్రియ, ఆస్మా సయ్యద్ వంటి వారు తమ తమ పాత్రల పరిధి మేరకు ఆకట్టుకున్నారు. ప్రశాంత్ అందించిన సంగీతం సినిమాకు ప్లస్ అయింది. పాటలు అంతంత మాత్రమే అయినా నేపథ్య సంగీతం మాత్రం సినిమా స్థాయిని పెంచేలా ఉంది. డైలాగ్స్ బాగున్నాయి. ఎడిటర్ పనితీరు బాగోలేదు. సినిమాలో అనవసరపు సన్నివేశాలు చాలా ఉన్నాయి. వాటిని మరింత క్రిస్పీగా కట్ చేయాల్సింది.శ్రవణ్ కుమార్ సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. నిర్మాణ విలువలు సినిమాకి తగినట్టు ఉన్నాయి. -
పగ.. ప్రతీకారం...
కళాధర్ కొక్కొండ హీరోగా నటించి, స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ‘కర్ణ’. మోనా ఠాకూర్ హీరోయిన్గా నటించారు. సనాతన క్రియేషన్స్‌పై రూపొందిన ఈ సినిమా ఈ నెల 23న విడుదలకానుంది. ఈ సందర్భంగా ఈ చిత్రం ట్రైలర్‌ని నిర్మాత ‘దిల్’ రాజు విడుదల చేశారు. కళాధర్ కొక్కొండ మాట్లాడుతూ– ‘‘వాస్తవ ఘటనలతో యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందిన చిత్రం ‘కర్ణ’. పగ, ప్రతీకారం నేపథ్యంలో కథ సాగుతుంది. ఈ చిత్రంలోని ఫీల్ గుడ్ లవ్‌స్టోరీ, భావోద్వేగ సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: ప్రశాంత్ బీజే, కెమెరా: శ్రవణ్ జి.కుమార్. -
'కర్ణ' కోసం వెళ్లిన దిల్ రాజు
యదార్థ సంఘటనల ఆధారంగా భారీ యాక్షన్ ఎంటర్టైనర్ కర్ణ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సనాతన క్రియేషన్స్ బ్యానర్ పతాకంపై కళాధర్ కొక్కొండ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తూనే స్వీయ నిర్మాణంలో హీరోగా నటిస్తుండడం విశేషం. ఇప్పటికే ఈ సినిమా నుంచి వదిలిన టీజర్ ప్రేక్షకుల మెప్పు పొంది ఆసక్తి పెంచేసింది. జూన్ 23వ తేదీన ఈ సినిమాను థియేటర్స్‌లో విడుదల చేస్తున్నారు. చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను దిల్ రాజు చేతుల మీదుగా రిలీజ్ చేశారు. అనంతరం యూనిట్ మొత్తానికి బెస్ట్ విషెష్ చెప్పారు. (ఇదీ చదవండి: Adipurush: ఏకంగా లక్షకు పైగా టికెట్లు కొనేశాడు..!) యుద్ధం శరణం శిక్షామి, స్నేహం శూన్యం రక్ష్యామి, లోకం స్వార్థం ప్రక్షామి అనే లైన్స్ షో చేస్తూ మొదలు పెట్టిన ఈ ట్రైలర్ ఆధ్యంతం ఆకట్టుకుంటోంది. ఈ ట్రైలర్లో మూవీ సోల్ తెలిసేలా సన్నివేశాలు కట్ చేశారు. ముఖ్యంగా హీరోయిజం, యాక్షన్ సన్నివేశాలు హైలైట్ చేస్తూ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించాయి. పగ, ప్రతీకారం నేపథ్యంలో ఈ మూవీ ఉంటుందని తెలుస్తోంది. యాక్షన్ సన్నివేశాలకు తోడు పల్లెటూరి వాతావరణం, ఫీల్ గుడ్ లవ్ స్టోరీ కూడా ఈ సినిమాలో చూడొచ్చని ట్రైలర్ స్పష్టం చేసింది. ట్రైలర్ మొత్తం కూడా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మేజర్ హైలైట్ అయింది. చట్టానికి చిక్కిన రవికిరణం, సంకెళ్లతో బిగిసిన ప్రతీకారం.. ద్రోహం, విద్రోహం.. కన్నీళ్లతో రగిలే ఆగ్రహం.. మేధం నరమేధం రక్తంతో రాసిన శాసనం అంటూ ఉత్కంఠ రేపే సీన్స్ చూపిస్తూ ఈ ట్రైలర్ క్లోజ్ చేశారు. చివరలో సెంటిమెంట్ సీన్స్ చూపించి ఆసక్తి పెంచేశారు. (ఇదీ చదవండి: Adipurush: అక్కడ కేవలం 24 టికెట్లే అమ్ముడుపోయాయట) -
కర్ణుడు స్వతహాగా మంచివాడే...కానీ...!!!
మహాభారతంలో కర్ణుడి వ్యక్తిత్వాన్ని పరిశీలిస్తే.... ఆయన పుట్టుకతో చెడ్డవాడు కాడు. కుంతీదేవికి, సూర్యభగవానుడికి జన్మించిన వాడు. నిజానికి పాండవులు యుద్ధంలో గెలుస్తారని ముందే తెలిసున్నవాడు. కురుసభలో రాయబారం ముగించుకుని శ్రీ కృష్ణ పరమాత్మ తిరిగి వెడుతూ కర్ణుడిని రథం ఎక్కించుకుని మాట్లాడుతూ వెళ్ళాడు. అప్పుడు కర్ణుడు –‘‘ధర్మరాజు నిజంగా ధర్మం ఎరిగినవాడు. దాన్ని పాటించేవాడు. ధర్మం అంతా పాండవులవైపే ఉంది. అందుకే సాక్షాత్ భగవంతుడవయిన నువ్వు ఆ పక్షాన ఉన్నావు. వారు గెలిచి తీరుతారు. ధర్మరాజు పట్టాభిషిక్తుడవుతాడు. దుర్యోధనాదులందరూ కూడా యుద్ధభూమిలో మడిసిపోతారు. ఎవరూ మిగలరు. కానీ దుర్యోధనుడిని నమ్మి ఇంతకాలం ఉండి అతడిని విడిచిపెట్టి రాలేను. నాకు కూడా మరణమే శరణ్యం. నేను కూడా అక్కడ మరణించాల్సిందే’’ అన్నాడు. అంటే – పాండవుల పక్షాన ధర్మం ఉందనీ, వారు గెలుస్తారని, వారి చేతిలో కౌరవులు మరణిస్తారని, తాను కూడా అక్కడే చనిపోతానని కర్ణుడికి ముందే తెలుసు. ఇన్ని తెలిసిన యోధానుయోధుడయిన కర్ణుడు జీవితాంతం తప్పులు చేస్తూ, ఎందుకు ప్రవర్తించాల్సి వచ్చింది !!! దుర్యోధనుడు పరమ క్రూరుడు. దుర్మార్గుడు. బద్దెనగారే మరొక పద్యంలో ‘‘తలనుండు విషము ఫణికిని, వెలయంగా తోకనుండు వశ్చికమునకున్ తలతోక యనకనుండును ఖలునకు నిలువెల్ల విషము..’’ అంటారు... ఖలుడు అంటే దుర్మార్గుడు. అటువంటి వాడికి మంచి ఆలోచనలు ఎలా వస్తాయి? అదే ధర్మరాజు పక్కన ఉంటే ...మంచి పనులు చేస్తూ ఉంటాడు.. అప్పడు ఆయన పక్కన ఉన్నవారికి కూడా అటువంటి మంచి పనులు చేయడానికి లేదా కలిసి పాలు పంచుకొనే అవకాశం దొరుకుతుంది. అలా చేస్తే ధర్మరాజు కూడా సంతోషిస్తూ ఉంటాడు. దుర్యోధనుడితో కలిసి ఉన్నందుకు అతని మెప్పుకోసం కర్ణుడు చేయకూడని పనులన్నీ చేస్తూ వెళ్ళాడు. చిట్టచివరకు ఏమయ్యాడు ...యుద్ధభూమిలో అర్జునుడి చేతిలో మరణాన్ని పొందాడు. అలాగే మనిషి ఎంత మంచివాడయినా, ఎంత చదువు చదువుకొన్నవాడయినా, ఎన్ని ఉత్తమ గుణాలు కలిగిఉన్నా... ఒక దుర్మార్గుడితో స్నేహం చేస్తే మాత్రం ఉన్న పేరుప్రతిష్ఠలు కూడా నశించిపోతాయి. సన్మార్గంలో ఉన్న వ్యక్తి దుర్మార్గులతో చేరితే... నల్లులు పట్టిన మంచం ఎలా దెబ్బలు తింటుందో అలాగే ఉంటుందని సుమతీ శతకకారుడు బద్దెనచెబుతూ ‘‘కొంచెపు నరు సంగతిచే /నంచితముగ గీడు వచ్చు నది యెట్లన్నన్ /గించిత్తు నల్లి కుట్టిన/ మంచమునకు జేటు వచ్చు మహిలో సుమతీ’’ అంటున్నారు. శవం మీద ఉన్న పూలదండనే కాదు, కింద జారిపడినా దాన్ని ఎవరూ తీసుకుని వాడుకోరు సరికదా... అసలు వేలితో ముట్టుకోరు. కర్రతో పక్కకు నెట్టేస్తారు. అదే దేవుడి మెడలో పడిన పూలదండ... మరుసటి రోజువరకు ఉన్నా, వాడిపోయినా.. కళ్ళకద్దుకుని తీసుకుని తలమీద పెట్టుకుంటారు, కొప్పుల్లో తురుముకుంటారు. పూలదండ తనంత తానుగా చేసిన మంచీ లేదు, చెడూ లేదు. శవంతో చేరితే గౌరవాన్ని పోగొట్టుకుంది, భగవంతుడి మెడను అలంకరిస్తే పవిత్ర ప్రసాదమయింది. ఎవరితో కలిసున్నామన్న దాన్నిబట్టి గౌరవమయినా, ఛీత్కారమయినా ఉంటుంది. ఇనుప ఊచ ఎంత గట్టిగా ఉంటుంది!!! అగ్నితో చేరితే మెత్తబడి ఇంటికి కిటీకీ ఊచవుతుంది, నీటితో చేరితే తుప్పుపట్టి నేలరాలిపోతుంది. అందుకే ఎప్పుడూ కూడా దుర్మార్గులతో స్నేహం చేయకూడదు. అలా చేస్తే మనం పాడయిపోవడమే కాదు, మనచుట్టూ ఉన్నవారిని కూడా భ్రష్టుపట్టించే ప్రమాదం ఉంటుందని తెలుసుకుని జీవితంలో ప్రతి క్షణం ఆచితూచి అడుగేస్తుండాలి. బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
ఆకట్టుకుంటున్న 'కర్ణ' థీమ్ సాంగ్
టాలీవుడ్ ప్రేక్షకులను థ్రిల్ చేసేందుకు యాక్షన్ ఓరియెంటెడ్ సినిమా 'కర్ణ' సిద్ధమవుతోంది. సనాతన క్రియేషన్స్ బ్యానర్‌పై కళాధర్ కొక్కొండ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందింది. అంతేకాదు ఈ చిత్రానికి అన్నీ తానై పని చూసుకుంటున్నారు కళాధర్ కొక్కొండ. ఆయనే స్వయంగా చిత్రంలోని ప్రధాన పాత్ర పోషిస్తూ నిర్మాణ బాధ్యతలు కూడా చేపట్టారు. కథ, స్క్రీన్ ప్లే కూడా కళాధర్ కొక్కొండనే చేయడం విశేషం. ఈ సినిమాకు ప్రశాంత్ బీజే సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్, ఇతర పనులు శరవేగంగా చేస్తూనే ప్రమోషన్స్ చేపట్టారు. ఈ నేపథ్యంలో తాజాగా చిత్రంలోని 'కర్ణ' థీమ్ సాంగ్ రిలీజ్ చేసి సినిమాపై ఆసక్తి రేకెత్తించారు. దివంగత నటుడు, సినీ విశ్లేషకులు టీఎన్నార్ జయంతి సందర్భంగా ఆయన పిల్లలు దివిజ, రుత్విక్ ఈ సాంగ్ లాంచ్ చేశారు. ఈ పాటకు అనిల్ ఎనమడుగు లిరిక్స్ రాయగా ప్రసాద్ ఆలపించారు. ‘భగ భగ మండే నిప్పుల కొలిమే నడిచే చూడు.. మరిగే రక్తం ఉరకలు వేసే విప్లవం వీడు’అంటూ హీరో క్యారెక్టర్ ఎలివేట్ చేసేలా ఈ పాట సాగుతుంది. జనవరి 28న ఈ కర్ణ మూవీ రిలీజ్ కానున్నట్లు చిత్ర యూనిట్ పేర్కొంది. -
నాకు ఈ యుద్ధం వద్దు బావా!
దానవీరశూరకర్ణుడి ముందు దానం కోసం నిలుచున్నాడు విప్రోత్తముడు.‘‘ఏమి విప్రోత్తమా సందేహించుచుంటిరి! ఈ మణులు మిమ్మల్ని తృప్తిపరచకున్న నా రత్నభాండగారాన్నే సమర్పించెదను’’ అన్నాడు కర్ణుడు.‘‘ఆ రాళ్లతో మాకు నిమిత్తం లేదు’’ అని మణిమాణిక్యాలను తేలిగ్గా తీసేశాడు విప్రుడు.‘‘మరి, చతురంగ బలగములా? నృత్యగీత వాద్య వినోదములా? అప్సరసల వంటి విలాసినులా?’’ అడిగాడు కర్ణుడు.‘‘అట్టి అల్పమైన కోరికలు సాధించుకొనుటకు ఈ దానకర్ణుడిని యాచించుట అర్థం లేదు’’ అన్నాడు విప్రుడు.‘‘అయినచో ఇంకేమి కావలెను. మడులా మాన్యములా? సర్వసుభిక్షమగు నా రాజ్య సర్వస్వమా?’’ మళ్లీ అడిగాడు కర్ణుడు.‘‘స్వర్గసుఖములనే తృణప్రాయంగా భావించే మా బోంట్లకు ఈ మహారాజ్య సుఖాలపై ఆశ ఉండునా కర్ణా!’’ అన్నాడు విప్రుడు.‘‘అయినచో తమ మనసులో ఏమి కలదో సంకోచించకుండా వెల్లడింపుడు. ప్రాణములైనా ఇచ్చెదను’’ అన్నాడు కర్ణుడు.‘‘నాకు కావల్సింది నీ ప్రాణములు కాదు. ప్రాణసమానములై ఈ కవచకుండలాలు’’ చివరికి తన మనసులో ఉన్న కోరికను వెల్లడించాడు విప్రుడు.కర్ణుడు ఆశ్చర్యపోయాడు.‘‘ఈ కవచకుండలాలు నాకు పుట్టుకతో వచ్చినవి. నా శరీరం నుండి వేరు చేసినచో తక్షణమే ఇవి జీవరహితమగును. ఈ నిర్జీవముల వలన తమకు కలుగు ప్రయోజనం ఏమిటి?’’ అడిగాడు కర్ణుడు. ‘‘మాకు కలిగే ప్రయోజనం మాట ఎటుల ఉన్నను...నీవు ఇచ్చెదనంటివి...ఇచ్చుట ధర్మం’’ అన్నాడు విప్రుడు.‘‘సరే’’ అన్నాడు కర్ణుడు. కొద్దిసేపట్లోనే తన శరీరం నుంచి రక్తమోడుతుండగా కవచకుండలాలను తీసి ఇచ్చాడు కర్ణుడు.ఇదెలా ఉన్నా...విప్రుడి రూపంలో వచ్చింది ఎవరో కర్ణుడికి అర్థమైంది.‘‘పుత్రరక్షణకై యాచనకు సిద్ధపడితివా మహాత్మా! ఈ మాత్రం దానికి విప్ర వేషం ఏల? స్వస్వరూపమున వచ్చినను ఈ కర్ణుడు లేదనేవాడు కాదు. త్రిలోకాధిపతివి సర్వ దివిజ పూజ్యుడవు. నీవంటి యాచకుడు నాకెక్కడ లభించును మహేంద్రా’’ అన్నాడు కర్ణుడు.‘‘కర్ణా నీకు శుభమగుగాక’’ అని ఆశీర్వదించబోయాడు మహేంద్రుడు.‘‘దానము స్వీకరించు హస్తము కింద అగును మహేంద్రా’’ నవ్వుతూ అన్నాడు కర్ణుడు.‘‘నిజం, శూరాగ్రేసరుడిగా మాత్రమే కాక దానవీరునిగా నీ కీర్తి చిరస్థాయి కాగలదు. కర్ణా...కవచం ఒలుచుటచే నీ శరీరం వికృతమైనదని విచారించకు. సూర్యకాంతితో తేజరిల్లగలదు’’ అని ఆశీర్వదించాడు మహేంద్రుడు.‘‘ధన్యుడను’’ అన్నాడు కర్ణుడు.‘‘నీ ధర్మదీక్షా, దానపరత్వమును మెచ్చితిని. ఏమి కావలయునో కోరుకో’’ అడిగాడు మహేంద్రుడు.‘‘ఇచ్చుటయే గాని పుచ్చుకొనుట యెరుగని వాడను. ఏమి కోరగలను మహేంద్ర’’ అన్నాడు కర్ణుడు.‘‘నీవు కోరకున్నా నేను ఇచ్చెదను. ఇదిగో అద్భుతమైన నా శక్తి. దీనిని ప్రాణపాయ సమయమున మాత్రమే ప్రయోగించుము’’ అని అడగకుండానే కర్ణుడికి వరాన్ని ఇచ్చాడు ఇంద్రుడు. దుర్యోధన సార్వభౌముడు అవమానాగ్నితో దహించుకుపోతున్నాడు...‘‘మా దేహము బడబాగ్నివలె దహించుచున్నది. నేను భరింపజాలను. ఈ దారుణఘాతం నా హృదయం భరింపజాలదు’’ అవమానం, ఆవేశం, ఆవేదను కలగలిసిన గొంతుతో అంటున్నాడు దుర్యోధనుడు.‘‘కేవలం ఒక్క ఆడుదాని హాసం కోసం ఇంత పరితపించాలా!’’ అన్నాడు శకుని మామ.‘‘ఒక్క ఆడుదాని హాసం మాత్రమే కాదు మామా! ఈ సమస్త ప్రకృతి నన్ను అవహేళన చేయుచున్నది. ఆ వికటాట్టహాసం సమస్త భూగోళమున పరిభ్రమించుచున్నది. ఈ పరిభ్రమణంతో నా మతి పరిభ్రమించుచున్నది. పౌరుషం పటాపంచలై, అభిమానం అవమానితమై, బతుకు భారమైన ఈ వ్య«థాభరిత వదనాన్ని ప్రజలకు ఎలా చూపించాలి! నా సోదరుల నడుమ మనలేను. నాకు ప్రాయోపవేశమేశరణ్యం’’ అన్నాడు దుర్యోధనుడు.‘‘సుయోధనా...ఏమి చేసిననను నీవు మరణించజాలవు’’ అంటూ వారించాడు శకుని.‘‘అవమానము ప్రతీకారం చేయుట చేతకాకున్నాను, మా మరణం మా చేతనే ఉన్నది’’ అన్నాడు దుర్యోధనుడు.‘‘లేదు. నీ మరణం నా చేతనే ఉన్నది. నా మరణాంతరం నీ మరణం. పాండవ లక్ష్మిని హరించి నీ కైవసం చేసిన అనంతరం, అహంకరించి నిన్ను అవమానించిన పాంచాలి పదింతలు పరాభవం పాలై రోదించిన అనంతరం...’’ అని చెప్పుకుంటూ పోతున్నాడు శకుని మామ. యుద్ధరంగం.అర్జునుడి కళ్లలో శౌర్యం కాదు వైరాగ్యం కనిపిస్తోంది.దిగులుగా ఉన్నాడు.ఏదో కోల్పోయినట్లుగా ఉన్నాడు.గాండీవాన్ని జారవిడుచుకున్నాడు.‘‘అర్జునా గాండీవాన్ని జారవిడుచుకున్నావేమిటి?’’ అడిగాడు కృష్ణుడు.‘‘నాకీ యుద్ధం వద్దు బావా! బాల్యం నుంచి ఎంతో ప్రేమగా పెంచాడు తాత. భీష్మాచార్యుడు మా వంశానికి ప్రతిష్ఠ. అలాంటి మహానుభావుడి మీద బాణాలు ఎలా వేయమంటావు? కన్నబిడ్డ కంటే మిన్నగా ఆదరించి ధనుర్విద్యా రహస్యాలను బోధించిన గురువును ఎలాధిక్కరించగలను! తాతలు, తండ్రులు, గురువులు, అన్నలు, తమ్ముళ్లు, మామలు, కొడుకులు, స్నేహితులు...ఈ స్వజన సంహారం నావల్ల కాదు బావా!మా సౌఖ్యం కోసం బంధురక్తం చిందించలేను.రాజ్యం కొరకు ఆత్మీయులను అంతం చేయలేను...’’ వైరాగ్య స్వరంతో వాపోతున్నాడు అర్జునుడు.‘‘ఎవరు ఆత్మీయులు? ఎవరు ఎవరికి బంధువులు?ఈ మమతానుబంధాలు శరీరమునకేగానీ ఆత్మకు లేవు అర్జునా!ఒక పరి నా అసలు స్వరూపమును దర్శించుము’’ అని తన విశ్వరూపాన్ని అర్జునుడికి చూపాడు శ్రీకృష్ణుడు. -
హైదరాబాద్‌లో ‘మహావీర్‌కర్ణ’
పాత్రకోసం ప్రాణం పెట్టే నటులు అతికొద్దిమందే ఉంటారు. అందులో ప్రధానంగా తమిళ నటుడు విక్రమ్ ముందు వరుసలో ఉంటాడు. సేతు, శివపుత్రుడు సినిమాల్లో నటనకు ఎన్నో అవార్డులు వచ్చాయి. శంకర్ తీసిన ‘ఐ’ సినిమా కోసం తన శరీరాన్ని హూనం చేసుకున్నాడు. ఇలా పాత్రకు తగ్గట్టుగా మారే విక్రమ్.. కర్ణుడి పాత్రను పోషిస్తూ.. ఓ సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. దాదాపు 300కోట్లతో అత్యంత భారీగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి మహావీర్‌కర్ణ అనే టైటిల్‌ను ఫిక్స్ చేసినట్టు సమాచారం. కర్ణుడి కోణంలోంచి మహాభారత గాథను చెప్పే ఈ చిత్ర షూటింగ్‌ను హైద్రాబాద్‌లో జరగుతోందని సమాచారం. సామి సినిమాతో ఇటీవలే పలకరించిన విక్రమ్.. గౌతమ్ మీనన్‌తో తెరకెక్కించే ‘ధృవనక్షత్రం’, రాజేష్ ఎమ్ సెల్వ డైరెక్షన్లో రాబోతోన్న ‘కదరం కొండన్’ షూటింగ్‌లతో బిజీగా ఉన్నాడు. -
గేమ్ ఆఫ్ థ్రోన్స్ టెక్నీషియన్స్‌తో విక్రమ్ ‘కర్ణ’
విలక్షణ నటుడు విక్రమ్ ప్రధాన పాత్రలో ఆర్ఎస్ విమల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ పౌరాణిక చిత్రం మహావీర్ కర్ణ. ముందుగా ఈ సినిమాను మలయాళ నటుడు పృథ్వీరాజ్ హీరోగా 60 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించాలని భావించారు. కానీ ప్రాజెక్ట్ విక్రమ్ చేతికి రావటంతో బడ్జెట్ రేంజ్ కూడా మారిపోయింది. యునైటెడ్ ఫిలిం కింగ్ డమ్ అనే అమెరికా నిర్మాణ సంస్థ ఈ సినిమాను 300 కోట్లతో నిర్మించనుంది. త్వరలోనే ప్రారంభం కానున్న ఈ సినిమా పూజా కార్యక్రమాలు తిరువనంతపురంలోని పద్మనాభస్వామి ఆలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో ఓ గంటకు ప్రత్యేక పూజలు నిర్వహించటం ఆసక్తికరంగా మారింది. ఈ గంట సినిమాలో కీలంగా కనిపించనుందట. పూజల తరువాత ఆ గంటలో రామోజీ ఫిలిం సిటీలో వేసిన భారీ సెట్‌కు తరలించారు. తమిళ, మలయాళ, హిందీ భాషల్లో ఒకేసారి తెరకెక్కిస్తున్న ఈ సినిమాను దాదాపు 32 భాషల్లో డబ్ చేసి రిలీజ్ చేయనున్నారు. -
దేవుడే దోస్త్
పురాణాలలో స్నేహం గురించి, ఆదర్శ స్నేహితుల గురించి అనేక గాథలు ఉన్నాయి. కృష్ణుడు–కుచేలుడు, కర్ణుడు–దుర్యోధనుడు, రాముడు–సుగ్రీవుడు కథలు దాదాపుగా అందరికీ తెలిసినవే. పురాణాల్లో కొన్ని అరుదైన స్నేహ గాథలు కూడా ఉన్నాయి. అవి మాత్రమే కాదు, భగవంతుడినే తమ స్నేహితుడిగా తలచిన పరమ భాగవతోత్తముల పలు గాథలు పురాణాల్లోను, చరిత్రలోనూ ప్రసిద్ధి పొందాయి. లౌకికంగా కుదిరే స్నేహాలలో స్వార్థం, పరస్పర ప్రయోజనాలు ఉంటాయి. భగవంతుడితో కుదిరే స్నేహంలో అలాంటివేవీ ఉండవు. ఏమీ ఆశించని స్నేహం అది. ‘భగవంతుడే నా చెలికాడు’ అన్నాడు రామకృష్ణ పరమహంస. ఇలా భగవంతుడినే చెలికాడుగా తలచిన భాగవతోత్తములు భగవంతుడిని ఊరకే స్తోత్రాలతో ముంచెత్తడంతోనో, భగవంతుడిని గుడ్డిగా ఆరాధించడంతోనో సరిపెట్టుకోరు. బాల్యమిత్రులతో కలసి ఆటలాడినట్లుగానే భగవంతుడితో ఆటలాడతారు. ఆటల్లో అలిగినప్పుడు చెలికాళ్లతో తగవు పడ్డట్టే భగవంతుడితోనూ తగవుపడతారు. కోపం వచ్చినప్పుడు భగవంతుడిని తిట్టిపోయడానికి సైతం ఏమాత్రం మొహమాటపడరు. భగవంతుడినే చెలికాడిగా తలచే భక్తి భావాన్ని ‘సఖ్య భక్తి’ అంటారు. ‘సఖ్య భక్తి’ మార్గానికి ప్రాచుర్యం కల్పించిన గురువుల్లో చైతన్య మహాప్రభువు అగ్రగణ్యుడు. నవవిధ భక్తిమార్గాల్లో ఆత్మనివేదనం ఉత్తమోత్తమమైనదైతే, సఖ్యభక్తిని ఉత్తమమైన భక్తిమార్గంగా పరిగణిస్తారు ఆధ్యాత్మికవేత్తలు. ‘సఖ్యభక్తి’ మార్గంలో సాక్షాత్తు భగవంతునితోనే నెయ్యం నెరపిన కొందరు భాగవతోత్తముల గాథలు కొన్ని... శ్రీనివాసుడితో హాథీరామ్ బాబా పాచికలాట భగవంతుడు భక్తులను పరీక్షించడానికి వారి జీవితాలతో ఆటలాడతాడని విరక్తి చెందిన కొందరు భక్తులు ఆడిపోసుకుంటారు గాని, సాక్షాత్తు భగవంతుడితోనే పాచికలాడిన భక్తుడు హాథీరామ్ బావాజీ. సఖ్యభక్తికి నిలువెత్తు నిదర్శనం ఆయన. ఉత్తరాదికి చెందిన హాథీరామ్ బావాజీ బాల్యం నుంచి రామ భక్తుడు. దేశాటనం చేస్తూ తిరుమల వచ్చాడు. తన చెలికాడైన రాముడే ఇక్కడ వేంకటేశ్వరుడిగా వెలసినట్లు తలచి, తిరుమలలోనే ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకుని స్థిరపడ్డాడు. ప్రతిరోజూ దేవదేవుడైన శ్రీనివాసుడిని దర్శించుకునేవాడు. కష్టసుఖాల ముచ్చట్లు చెప్పుకొనేవాడు. పరాచికాలాడేవాడు. హాథీరామ్ బావాజీ భక్తికి ముగ్ధుడైన శ్రీనివాసుడు రోజూ రాత్రివేళ ఆలయం విడిచి అతడి ఆశ్రమానికి వచ్చేవాడు. అక్కడే కూర్చుని అతడితో కలసి పాచికలాడేవాడు. ఒకసారి పాచికలాట దాదాపు తెల్లవారు జాము వరకు కొనసాగింది. భక్తులు తనను దర్శించుకునే వేళ కావడంతో హడావుడిగా ఆటను ఆపేసిన శ్రీనివాసుడు ఆలయానికి చేరుకున్నాడు. వేళకు ఆలయానికి చేరుకోవాలనే ఆతృతలో శ్రీనివాసుడు తన కంఠహారాన్ని బావాజీ ఆశ్రమంలో మరచిపోయాడు. ఆలయం తలుపులు తెరిచి చూసిన పూజారులు శ్రీనివాసుడి మెడలో కంఠహారం లేకపోవడాన్ని గుర్తించారు. హారం తస్కరణకు గురైందంటూ రాజుకు ఫిర్యాదు చేశారు. మాయమైన హారాన్ని వెదికి తేవాలంటూ భటులను ఆదేశించాడు రాజు. శ్రీనివాసుడు తన ఆశ్రమంలో మరచిన హారాన్ని కాస్త ఆలస్యంగా గుర్తించిన బావాజీ, దానిని తిరిగి అప్పగించాలనుకున్నాడు. హారం తీసుకుని ఆయన బయటకు వచ్చేసరికే అక్కడకు చేరుకున్న భటులు ఆయనను పట్టుకుని, రాజు వద్దకు తీసుకుపోయారు. రాత్రి శ్రీనివాసుడు తనతో కలసి పాచికలాడాడని, పొరపాటు హారం మరచాడని, దానిని అప్పగించేందుకు తీసుకు వస్తుండగా తనను భటులు పట్టుకున్నారని రాజుతో చెప్పాడు బావాజీ. ఆయన చెప్పిన మాటలను రాజు నమ్మలేదు. ‘దేవదేవుడు ఒక మామూలు సన్యాసితో పాచికలాడటమా? రాజునైన నాతోనే పరాచికాలా?’ అంటూ ఆగ్రహించాడు. హాథీరామ్ బావాజీ తాను చెప్పినంతా నిజమేనని శ్రీనివాసుడు తన చెలికాడని నమ్మకంగా బదులిచ్చాడు. బావాజీ మాటలు నిజమో, కాదో తేల్చుకోవాలని తలచిన రాజు అతడిని పరీక్షించదలచాడు. బావాజీ ఆశ్రమ ప్రాంగణం నిండా చెరకుగడల గుట్ట వేయించాడు. రాత్రి తెల్లారేలోగా చెరకు పిప్పి అయినా మిగలకుండా ఖాళీ చేయాలని, అలా చేస్తేనే బావాజీ మాటలు నమ్ముతానని చెప్పాడు. ఆశ్రమంలోకి బయటి వారెవరూ వెళ్లడానికి వీలు లేకుండా భటులతో కాపలా ఏర్పాటు చేశాడు. హాథీరామ్ బావాజీ ఆశ్రమంలో చిద్విలాసంగా కీర్తనలు పాడుకుండా ఉన్నాడు. అర్ధరాత్రి వేళ భటులు కునికి పాట్లు పడుతున్న సమయంలో ఒక తెల్లని ఏనుగు వచ్చి, నిమిషాల్లో చెరకు గుట్టను ఖాళీ చేసేసి వెళ్లిపోయింది. ఉదయాన్నే ఆశ్రమానికి వచ్చి చూసిన రాజుకు అక్కడ చెరకు గుట్ట ఆనవాలే లేకుండా కనిపించడంతో సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యాడు. పరమ భాగవతోత్తముని పట్ల తన వల్ల అపరాధం జరిగినందుకు పశ్చాత్తాపం చెందాడు. నిజానికి హాథీరామ్ బావాజీ అసలు పేరు ఆశారామ్ బల్జోత్. అతడి ఆశ్రమానికి ఏనుగు రావడం వల్ల, బావాజీ తరచు రామనామ స్మరణ చేస్తూ ఉండటం వల్ల ఆయనకు హాథీరామ్ బావాజీ అనే పేరు స్థిరపడింది. ఆపదలో ఉన్న స్నేహితుడిని సాటి స్నేహితుడు కాపాడినట్లే బావాజీని సాక్షాత్తు భగవంతుడే దిగివచ్చి కాపాడాడు. సూరదాసు గానానికి రాధాకృష్ణుల పరవశం సూరదాసు పుట్టుక నుంచి అంధుడు. అంధుడైనందున కుటుంబ సభ్యులు అతడిని ఆదరించేవారు కాదు. సొంతవారి అనాదరణను భరించలేక అతడు ఆరేళ్ల వయసులోనే ఇల్లు వదిలిపెట్టాడు. యమునా నదీ తీరం వద్ద దిక్కుతోచని స్థితిలో ఉన్న అంధబాలకుడు సూరదాసును చూసిన వల్లభాచార్యులు అతడిని చేరదీసి, శిష్యునిగా స్వీకరిస్తారు. వల్లభాచార్యుల శిష్యరికంలో సూరదాసు సఖ్యభక్తి మార్గంలో రాధాకృష్ణులపై వేలాది కీర్తనలు రచించి, గానం చేశాడు. సూరదాసు కీర్తనలు గానం చేసేటప్పుడు రాధాకృష్ణులు స్వయంగా వచ్చి, అతడి గానానికి పరవశులయ్యేవారని ప్రతీతి. కృష్ణుడు ఒకసారి సూరదాసును ఆటపట్టించిన సంఘటనపై ప్రచారంలో ఉన్న గాథ ఇది...ఒకసారి సూరదాసు ఒక వనంలో కూర్చుని గానం చేస్తుండగా, రాధాకృష్ణులు అతడికి చేరువలోనే కూర్చుని పరవశులై వినసాగారు. సూరదాసుని కాసేపు ఆటపట్టించాలనుకున్నాడు శ్రీకృష్ణుడు. అతడి వద్ద తననొక్కడినే విడిచి పెట్టి కాస్త దూరంగా వెళ్లమని రాధకు సూచించడంతో ఆమె అక్కడి నుంచి లేచి వెళ్లబోయింది. తన ముందు నుంచి ఎవరో పారిపోతున్నట్లు అనిపించడంతో సూరదాసు పట్టుకోవడానికి ప్రయత్నించాడు. అతడికి చేతికి రాధ కాలు తగిలింది. అతడి చేతికి చిక్కకుండా రాధ కాస్త దూరంగా వెళ్లింది. అక్కడే రాలి పడిన రాధ కాలి అందె సూరదాసు చేతికి దొరికింది. తన అందెను ఇవ్వాల్సిందిగా రాధ అతడిని కోరింది. ఎవరో చెబితేనే ఇస్తానన్నాడు సూరదాసు. తాను రాధనని, కాలి అందె తనదేనని బదులిచ్చింది ఆమె. అంధుడైన తాను అందె గల మనిషిని చూడలేదని, అందె నీదేనని, నీవే రాధవని నమ్మేదెలా? అని ప్రశ్నించాడు సూరదాసు. అప్పుడు కృష్ణుడు అతడికి చూపు ప్రసాదించాడు. కళ్లెదుట రాధాకృష్ణులు కనిపించడంతో సూరదాసు పరవశుడయ్యాడు. రాధా కృష్ణులను చూసిన తాను ఈ పాడు లోకాన్ని చూడలేనని, తిరిగి తన చూపును తీసుకుపోవాలని సూరదాసు పట్టుబట్టడంతో కృష్ణుడు అతడి కోరికకు సరేనన్నాడు. నిండు నూరేళ్లు జీవించిన సూరదాసు కృష్ణుడినే చెలికాడుగా భావిస్తూ రచించిన కీర్తనలు నేటికీ అజరామరంగా నిలిచి ఉన్నాయి. రాముడినే తిట్టిపోసిన భక్త రామదాసు ‘రామో విగ్రహవాన్ ధర్మః’ అనే ఆర్యోక్తిని నమ్మే మన దేశంలో రామభక్తులుగా చెప్పుకొనే వారెవరూ రాముడిని పల్లెత్తు మాట అనరు. వారంతా రాముడిని దైవంగా మాత్రమే ఆరాధిస్తారు. భక్త రామదాసు అలాంటిలాంటి భక్తుడు కాదు, ఇక్కట్లలో ఉన్న తనను ఆదుకోని రాముడిపై అలిగి అనరాని మాటలన్నీ అంటూ తిట్టిపోస్తాడు. రామదాసు అసలు పేరు కంచర్ల గోపన్న. ఆయన మేనమామలు అక్కన్న మాదన్నలు గోల్కొండ తానీషా కొలువులో పాలనా వ్యవహారాలు చూసేవారు. వారి ప్రాపకంతో గోపన్న పాల్వంచ పరగణా తహశీల్దారుగా ఉద్యోగం సంపాదిస్తాడు. రాముడు వెలసిన భద్రాచలం ఈ పరగణాలోనిదే. ఒకసారి భద్రాచలంలో జరిగిన జాతరకు వెళ్లిన గోపన్న అక్కడి శ్రీరాముని ఆలయం ఆలనపాలన లేకుండా ఉండటం చూసి చలించిపోతాడు. అక్కడ తారసపడిన పోకల దమ్మక్క అనే భక్తురాలు ‘అయ్యా! ఎలాగైనా నీవే ఆలయాన్ని బాగుచేయాలి’ అని కోరడంతో గోపన్న ఆలయ జీర్ణోద్ధరణకు సంకల్పిస్తాడు. గ్రామస్తులకు తన ఉద్దేశం చెప్పడంతో వారు కూడా ముందుకొచ్చి విరాళాలు ఇస్తారు. సేకరించిన విరాళాల సొమ్ము జీర్ణోద్ధరణ కార్యక్రమానికి కాస్త తక్కువ కావడంతో అప్పటికే తాను వసూలు చేసిన పన్నుల్లోని కొంత మొత్తాన్ని కలిపి, ఆలయ జీర్ణోద్ధరణ పూర్తి చేస్తాడు. సీతారాములకు బంగారు అలంకారాలను తయారు చేయిస్తాడు. ప్రజల నుంచి వసూలు చేసిన పన్నుల మొత్తాన్ని ఆలయం కోసం ఖర్చుపెట్టాడంటూ కొందరు అతడిపై ఫిర్యాదు చేయడంతో ఆగ్రహించిన తానీషా గోపన్నకు పన్నెండేళ్ల శిక్ష విధించి, గోల్కొండలోని చెరసాలలో బంధిస్తాడు. రాముడి ఆలయాన్ని పునరుద్ధరించిన పాపానికి తాను జైలు పాలవడాన్ని జీర్ణించుకోలేకపోతాడు. ఆపదలో ఉన్న తనను రాముడు ఆదుకోకపోతాడా అని ఎదురు చూస్తాడు. మొదట్లో ‘ఏ తీరుగ నను దయజూసెదవో ఇన వంశోత్తమ రామా’ అంటూ ప్రాధేయపడతాడు. ఫలితం లేకపోవడంతో కొంచెం చనువు తీసుకుని ‘సీతమ్మ తల్లీ చెప్పవే..’ అంటూ సీతమ్మవారితో సిఫారసు చేయించే ప్రయత్నం చేస్తాడు. అప్పటికీ ఉపయోగం లేకపోవడంతో రాముడిపై తిట్ల దండకాన్నే అందుకుంటాడు. ‘ఎవడబ్బ సొమ్మని కులుకుతూ తిరిగేవు రామచంద్రా..’ అంటూ నిలదీస్తాడు. ‘సీతమ్మకు చేయిస్తి చింతాకు పతకము..’ అంటూ ఏయే ఆభరణానికి ఎంతెంత ఖర్చు చేశాడో లెక్కలన్నీ పొల్లు పోకుండా ఏకరువు పెడతాడు. ఎంతైనా శిస్తులు వసూలు చేసే తహశీల్దారు కదా! తిట్టినవన్నీ నోరారా తిట్టేశాక ‘ఈ దెబ్బలకోర్వలేక తిట్టాను. ఏమీ అనుకోవద్దు’ అంటూ అనునయిస్తాడు. భక్తుడు అన్ని తిట్లు తిట్టిపోసి, అంత మర్యాదగా అనునయ వాక్యాలు పలుకుతుంటే ఇక రాముడే ఉండబట్టలేక రంగంలోకి దిగుతాడు. లక్ష్మణుడితో కలసి మారువేషంలో తానీషాను కలుసుకుంటాడు. తమ పేర్లు రామోజీ, లక్షో్మజీ అని, గోపన్న స్నేహితులమని పరిచయం చేసుకుంటారు. ఆలయం కోసం పన్నుల మొత్తం నుంచి రామదాసు ఖర్చు చేసిన సొమ్మును చెల్లిస్తారు. తానీషాకు సొమ్ము ముట్టడంతో గోపన్న బంధ విముక్తడవుతాడు. నాటి నుంచి రామదాసుగా ప్రఖ్యాతుడవుతాడు. తెలుగునాట తొలి వాగ్గేయకారుడు భక్తరామదాసుకు రాముడిపై ఉన్నది తిరుగులేని సఖ్యభక్తి. భక్త సాలబేగ్ కోసం ఆగిన జగన్నాథుని రథం సాలబేగ్ జగన్నాథస్వామికి పరమ భక్తుడు. ముస్లిం మతస్తుడు కావడంతో అతడికి ఆలయ ప్రవేశానికి అనుమతి ఉండేది కాదు. రథయాత్రలో బలభద్ర సుభద్రలతో కలసి జగన్నాథుడు పూరీ పురవీధుల్లోకి వచ్చినప్పుడు మాత్రమే కులమతాలకు అతీతంగా భక్తులందరికీ దర్శనం లభిస్తుంది. జగన్నాథుడిపై సఖ్యభక్తితో కీర్తనలు రచించిన సాలబేగ్‌కు రథయాత్రలో ఎలాగైనా జగన్నాథుడిని తనివితీరా చూడాలనే కోరిక ఉండేది. సాలబేగ్ తండ్రి మొఘల్ చక్రవర్తుల వద్ద సుబేదారుగా ఉండేవాడు. యువకుడైన సాలబేగ్ తండ్రితో కలసి మొగల్ సేనల తరఫున యుద్ధాల్లో పాల్గొనేవాడు. ఒకసారి యుద్ధంలో తీవ్రంగా గాయపడ్డాడు. ఇక ప్రాణాలు దక్కవేమో అనే పరిస్థితి. జగన్నాథుడిని వేడుకుంటే అతడే అన్నీ చూసుకుంటాడని తన తల్లి చెప్పడంతో ఆమె మాటపై జగన్నాథుడిని స్మరిస్తూ ఆశువుగా కీర్తనలు అల్లుతాడు. కొద్దిరోజులకే ఆశ్చర్యకరంగా కోలుకుంటాడు. జగన్నాథుడిని రథయాత్ర రోజున చూడాలని అనుకున్న దశలో రథయాత్ర వేడుకకు కొద్దిరోజుల ముందే అనారోగ్యానికి లోనవుతాడు. బయటకు కదల్లేని పరిస్థితి. తాను వచ్చేంత వరకు ముందుకు సాగిపోవద్దని జగన్నాథుడిని మనసులోనే కోరుకుంటాడు. యథావిధిగా రథయాత్ర మొదలవుతుంది. సాలబేగ్ ఇంటి వద్దకు వచ్చేసరికి ఇక రథం ముందుకు సాగదు. ఎందరు భక్తులు ఎంతగా బలప్రయోగం చేసినా, రథం అంగుళమైనా కదలదు. సాలబేగ్ను అప్పటికే భక్తుడిగా ఎరిగి ఉండటంతో పూజారులు విషయం గ్రహిస్తారు. సాలబేగ్‌కు కబురు పెడతారు. నెమ్మదిగా అతడు గుమ్మం దాటి బయటకు వచ్చి, జగన్నాథుడిని తనివితీరా చూసిన తర్వాతే రథం ముందుకు కదులుతుంది. ఒక ఆప్తమిత్రుడి ఇంటికి వచ్చినట్లే జగన్నాథుడు సాలబేగ్ ఇంటి వద్దకు వచ్చి దర్శనం ఇవ్వడం పూజారులను సైతం ఆశ్చర్యచకితులను చేసింది. సాలబేగ్ వయసు మళ్లి కన్నుమూశాక అతడి సమాధిని పూరీలో జగన్నాథుడి ఆలయం ఉండే బొడొదండొకు చేరువలోనే నిర్మించారు. ఇప్పటికీ జగన్నాథుడిని దర్శించుకునే భక్తులు భాగవతోత్తముడైన సాలబేగ్ సమాధిని కూడా తప్పక దర్శించుకుంటారు. పురాణాదోస్త్ కృష్ణుడు–కుచేలుడు శ్రీకృష్ణుడికి కుచేలుడికి మధ్యనున్న స్నేహం పురాణ స్నేహాలన్నింటిలోకీ తలమానికమైనది. శ్రీకృష్ణ బలరాములు సాందీపని మహాముని గురుకులంలో విద్యాభ్యాసం చేసే కాలంలో కుచేలుడు వారి సహాధ్యాయి. కుచేలుడు నిరుపేద బ్రాహ్మణ బాలకుడు. కుచేలుడి అసలు పేరు సుదాముడు. నిరుపేద అయినందున నలిగిన దుస్తులతో ఉండేవాడు. అందువల్ల అతడికి కుచేలుడనే పేరు వచ్చింది. విద్యాభ్యాసం తర్వాత కృష్ణుడు ద్వారక వెళ్లి రాజ్యభారం స్వీకరిస్తాడు. అష్టమహిషులను పెళ్లాడతాడు. కుచేలుడు సుశీల అనే వనితను పెళ్లాడతాడు. గంపెడు సంతానం కలగడంతో సంసారం ఈదడం కష్టమవుతుంది. భార్య సలహాపై కృష్ణుడిని చూడటానికి వెళతాడు. ఉత్త చేతులతో వెళితే బాగుండదని ఇంట్లో ఉన్న కొద్దిపాటి అటుకులను మూటగట్టి తీసుకువెళతాడు. కృష్ణుడు అతడిని ఆదరించి, సత్కరిస్తాడు. కృష్ణుడికి ఏమీ అడగకుండానే కుచేలుడు తిరిగి వెళతాడు. ఇంటికి వచ్చి చూస్తే పూరిగుడిసె కాస్త కృష్ణలీలతో భవంతిగా మారుతుంది. నాటి నుంచి కుచేలుడికి ఏ లోటూ ఉండదు. రాముడు–సుగ్రీవుడు పురాణాల్లోని స్నేహగాథల్లో రాముడికి సుగ్రీవుడికి గల మైత్రి కూడా ప్రసిద్ధి పొందింది. వీరిద్దరి మైత్రికి హనుమంతుడు అనుసంధానకర్తగా వ్యవహరించాడు. కిష్కింధ రాజ్యం నుంచి అన్న వాలి తరిమేయడంతో సుగ్రీవుడు తన సహచరులైన వానర పరివారంతో కలసి రుష్యమూక పర్వతంపై తలదాచుకున్నాడు. సుగ్రీవుడిని వాలి రాజ్యం నుంచి తరిమేయడమే కాదు, సుగ్రీవుడి భార్య రుమను చెరబట్టాడు. అలాంటి పరిస్థితుల్లో రామ లక్ష్మణులు సీత కోసం వెదుకులాడుతూ రుష్యమూక పర్వత ప్రాంతానికి చేరుకున్నారు. ధనుర్బాణాలతో వస్తున్న వారిని చూసి సుగ్రీవుడు మొదట భయపడ్డాడు. హనుమంతుడు అతడికి ధైర్యం చెప్పి, రామలక్ష్మణుల వద్దకు వెళ్లి ఎవరో, ఏమిటో తెలుసుకుంటాడు. సుగ్రీవుని వద్దకు తీసుకుపోయి పరిచయం చేస్తాడు. అన్యాయం చేసిన వాలిని వధిస్తానని మాట ఇస్తాడు రాముడు. సీతాన్వేషణలో తన వానరసేన సాయం చేస్తుందని బాస చేస్తాడు సుగ్రీవుడు. అన్న మాట ప్రకారమే రాముడు వాలిని వధిస్తాడు. సుగ్రీవుడి ఆధ్వర్యంలో వానరసేన లంకపై దండెత్తి రామ రావణ యుద్ధంలో తనవంతు పాత్ర పోషిస్తుంది. సీత–త్రిజట సీతను అపహరించిన రావణుడు ఆమెను లంకలోని అశోకవనంలో బంధిస్తాడు. రాక్షస వనితలను ఆమెకు కాపలాగా పెడతాడు. రావణుడి సోదరుడైన విభీషణుడి కూతురైన త్రిజట కూడా సీతకు కాపలా ఉండే వారిలో ఉంటుంది. రాముడిని తలచుకుంటూ శోకించే సీతను చూసి ఆమెకు జాలి కలుగుతుంది. తన పెదతండ్రి రావణుడు సీత పట్ల చేసిన దుర్మార్గానికి బాధపడేది. సీతను ఓదార్చేది. ఒకానొక దశలో ఆత్మహత్య చేసుకోవాలనుకున్న సీతను ఆ ప్రయత్నం నుంచి వారించింది. సీతకు కాపలాగా ఉంటూ కునుకు తీసిన త్రిజటకు ఒక కల వచ్చింది. తనకు వచ్చిన కలను ఆమె సీతకు చెబుతుంది. తన కల ప్రకారం రావణుడి అంతం తప్పదని, రామలక్ష్మణులు లంకను జయించి, సీతను తీసుకుపోతారని చెబుతుంది. త్రిజటకు ఆ కల వచ్చిన తర్వాతే హనుమంతుడు లంకలో అడుగుపెట్టి లంకాదహనం చేస్తాడు. రావణ సంహారం జరిగిన తర్వాత సీత తనతో పాటే త్రిజటను కూడా పుష్పకవిమానంలో అయోధ్యకు తీసుకుపోయి, ఆమెను ఘనంగా సత్కరిస్తుంది. కర్ణుడు–దుర్యోధనుడు కర్ణుడికి దుర్యోధనుడికి గల మైత్రి కూడా పురాణాల్లో ప్రధానంగా ప్రస్తావించే మరో స్నేహగాథ. వీరి గాథలో స్నేహధర్మానికి కట్టుబడ్డ నిబద్ధత కర్ణుడిదైతే, కర్ణుడి అండతో అర్జునుడిని ఎదుర్కోవాలనే స్వార్థం దుర్యోధనుడిది. కౌరవ పాండవుల విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత ద్రోణుడి ఆధ్వర్యంలో క్షాత్ర పరీక్ష జరుగుతుంది. అందులో పాల్గొనడానికి వస్తాడు కర్ణుడు. ఇది క్షాత్ర పరీక్ష అని, ఇందులో క్షత్రియ పుత్రులు మాత్రమే పాల్గొనాలని, సూతపుత్రుడైన కర్ణుడికి అందులో పాల్గొనే అర్హత లేదని అభ్యంతరపెడతాడు ద్రోణుడు. అర్జునుడిని ఎదిరించడానికి తగిన వీరుడు కర్ణుడేనని తలచిన దుర్యోధనుడు గురువు మాటకు ఎదురు చెబుతాడు. ‘కర్ణుడికి రాజ్యాధికారం లేకపోవడమే మీ అభ్యంతరమైతే, ఇప్పుడే అతడికి రాజ్యాభిషిక్తుడిని చేస్తాను’ అని పలికిన దుర్యోధనుడు అప్పటికప్పుడే అతడికి అంగరాజ్యాన్ని ధారపోస్తాడు. నిండుసభలో శాస్త్రోక్తంగా అభిషేకం జరిపిస్తాడు. సభలో తనకు అవమానం ఎదురైనప్పుడు తనను ఆదరించి, రాజ్యాభిషిక్తుడిని చేసిన దుర్యోధనుడితో మైత్రీబంధాన్ని ఏనాటికీ వదులుకోనని బాస చేస్తాడు కర్ణుడు. అప్పటి నుంచి దుర్యోధనుడికి బాసటగా ఉంటూ, చివరకు కురుక్షేత్ర యుద్ధంలో తన ప్రాణాలు ధారబోస్తాడు. – పన్యాల జగన్నాథదాసు -
300 కోట్లతో మరో ‘మహాభారతం’
సినిమా కథలను ఎక్కువగా పురాణాల నుంచి ఇన్స్పైర్ అయ్యే తయారుచేసుకుంటారు. అయితే ఇటీవల కాలంలో పౌరాణిక, జానపద కథలను సినిమాలుగా తెరకెక్కించాలన్న ఆసక్తి దర్శక నిర్మాతల్లో పెరుగుతోంది. బాహుబలి, రుద్రమదేవి లాంటి సినిమాలు ఘనవిజయాలు సాధించటంతో చాలా మంది సినీ ప్రముఖులు ఆ దిశగా ప్రయత్నాలు ప్రారంభించారు. దర్శకధీరుడు రాజమౌళి మహాభారతాన్ని తెరకెక్కించటం తన జీవితాశయమని ఇప్పటికే ప్రకటించేశారు. బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ కూడా కృష్ణుడి కోణంలో మహాభారతాన్ని రూపొందిస్తున్నట్టుగా వెల్లడించారు. మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ ప్రధాన పాత్రలో భీముడి కోణంలో మరో మహాభారతం సిద్ధమవుతోంది. తాజాగా మరో దక్షిణాది నటుడు మహాభారత గాథతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. విలక్షణ నటుడు విక్రమ్ ప్రధాన పాత్రలో ఆర్ఎస్ విమల్ దర్శకత్వంలో కర్ణుడి కోణంలో మహాభారతాన్ని తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నారు. ముందుగా ఈ సినిమాను మలయాళ నటుడు పృథ్వీరాజ్ హీరోగా 60 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించాలని భావించారు. కానీ ప్రాజెక్ట్ విక్రమ్ చేతికి రావటంతో బడ్జెట్ రేంజ్ కూడా మారిపోయింది. యునైటెడ్ ఫిలిం కింగ్ డమ్ అనే అమెరికా నిర్మాణ సంస్థ ఈ సినిమాను 300 కోట్లతో నిర్మించేందుకు ముందుకొచ్చింది. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుందని తెలుస్తోంది. ఇప్పటికే పూర్తి స్క్రిప్ట్ రెడీ కావటంతో ఇటీవల దర్శకుడు విమల్ స్క్రిప్ట్‌కు శబరిమల ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. 2019 చివరికల్లా సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. తమిళ, మలయాళ, హిందీ భాషల్లో ఒకేసారి తెరకెక్కిస్తున్న ఈ సినిమాను దాదాపు 32 భాషల్లో డబ్ చేసి రిలీజ్ చేయనున్నారు. -
300 కోట్ల భారీ ప్రాజెక్టు.. కర్ణునిగా విక్రమ్..
చెన్నై: భారతీయ చిత్ర పరిశ్రమలో మరో భారీ ప్రాజెక్టుకు రంగం సిద్ధమైంది. ప్రముఖ హీరో, చియాన్ విక్రమ్ మహాభారతంలోని ఉదాత్తమైన కర్ణుడి పాత్ర పోషించేందుకు సిద్ధమవుతున్నారు. రూ. 300 కోట్ల భారీ బడ్జెట్‌తో ‘మహావీర్ కర్ణ’ పౌరాణిక చిత్రం తెరకెక్కనుంది. ‘ఎన్ను నింతే మొయిదీన్’ సినిమాతో విమర్శకుల ప్రశంసలందుకున్న ప్రముఖ మలయాళీ దర్శకుడు ఆర్ఎస్ విమల్ తెరకెక్కించనున్న ఈ సినిమాను న్యూయార్క్‌కు చెందిన యునైటెడ్ ఫిల్మ్ కింగ్డమ్ నిర్మించనుంది. ఈ విషయాన్ని విక్రమ్ ఇన్స్టాగ్రామ్ ద్వారా అధికారికంగా ప్రకటించారు. ఈ భారీ పౌరాణిక చిత్రాన్ని హిందీలో తెరకెక్కించి తమిళ, తెలుగు, మలయాళ భాషల్లోకి డబ్ చేయనున్నారు. ఇందుకు అనుగుణంగా ప్రధాన పాత్రలకు వివిధ భాషల్లోని ప్రముఖ నటులను ఎంపికచేసే యోచనలో ఉన్నట్లు డైరెక్టర్ తెలిపారు. 2019 క్రిస్మస్ కానుకగా ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు. మొదట కర్ణుని పాత్రకు మలయాళ నటుడు పృథ్వీరాజ్‌ను తీసుకోవాలని దర్శకుడు భావించారు. రూ. 60 కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమాను తీయాలని అనుకున్నారు. అయితే, ఇంత బడ్జెట్‌ను బరిచేందుకు నిర్మాతలు వెనుకాడటంతో ఈ ప్రాజెక్టుకు వెనుకకుపోయినట్టు భావించారు. అయితే, అనూహ్యంగా న్యూయార్క్‌కు చెందిన యునైటెడ్ ఫిలిం కింగ్డమ్ సంస్థ ఈ ప్రాజెక్టును చేపట్టేందుకు ముందుకొచ్చింది. దీంతో చియాన్‌తో చేతులు కలిపి దర్శకుడు విమల్ తన ప్రాజెక్టుకు దృశ్యరూపం ఇస్తున్నారు. విక్రమ్ ప్రస్తుతం గౌతమ్ మీనన్ ‘ధ్రువ నక్షత్రం’, సామి స్క్వేర్( సామి సినిమా సీక్వెల్) సినిమాలతో బిజీగా ఉన్నాడు. -
నాన్నతో సర్కార్ ఆసుపత్రికి
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: అధికార హడావుడి లేదు. ఎలాంటి హంగామా లేదు. కారు నుంచి దిగిన ఓ వ్యక్తి తన తండ్రిని తీసుకొని అత్యంత సాధారణంగా సర్కారు దవాఖానకు వెళ్లారు. అప్పటికే విరిగిన చేతికి పట్టీ కట్టి ఉండడంతో అవసరమైన పరీక్షలు, ఇతర సేవలకు సంబంధించి డాక్టర్లతో మాట్లాడి కలెక్టరేట్లో జరిగే సమావేశం కోసం కారెక్కి వెళ్లిపోయారు. డాక్టర్, ఇతర సిబ్బంది చేయి విరిగిన వ్యక్తిని పరీక్షల కోసం ల్యాబ్‌కు తీసుకెళ్లారు. ఇది మంచిర్యాల ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి వద్ద మంగళవారం ‘సాక్షి’ కంటికి చిక్కిన దృశ్యం. కారులో తండ్రితో కలిసి వచ్చిన వ్యక్తి... మంచిర్యాల జిల్లా కలెక్టర్, ఐటీడీఏ పీవో ఆర్వీ.కర్ణన్. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల సంఖ్య పెరుగుదలలో రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలిపి ముఖ్యమంత్రి కేసీఆర్ నుంచి అభినందనలు అందుకొన్న కర్ణన్ ఇప్పుడు స్వయంగా ఆచరించి చూపారు. మారుమూల గ్రామాల ప్రజలను ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్లేలా చేయడమే కాదు... తనే స్వయంగా తన తండ్రిని మంచిర్యాల ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స చేయిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. కలెక్టర్ కర్ణన్ తన తండ్రి వీరరాఘవన్‌ను ఆసుపత్రికి తీసుకొస్తూ మంగళవారం ‘సాక్షి’ కంట పడినప్పటికీ... ఆదివారం నుంచి మూడు రోజులుగా ప్రభుత్వ ఆసుపత్రికి ప్రతిరోజు తీసుకొస్తూ ఆర్థో స్పెషలిస్ట్ డాక్టర్ అరవింద్ వద్ద చికిత్స చేయిస్తున్నారు. తండ్రి చేయికి ఫ్యాక్షర్ కావడం... తమిళనాడులో నివసించే కలెక్టర్ కర్ణన్ తండ్రి వీరరాఘవన్ ఇంట్లో కింద పడడంతో చేయి ఎముక విరిగినట్లయింది. ఈ విషయం తెలిసిన వెంటనే కలెక్టర్ ఆయనను మంచిర్యాలకు రప్పించారు. గత ఆదివారం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లి ఆర్థో స్పెషలిస్ట్ డాక్టర్ అరవింద్‌కు చూపించారు. చేయి ఎముక తొలగినట్లు (డిస్లొకేట్) అయినట్లు తేలడంతో చేతికి సిమెంట్ పట్టీ వేసి పంపించారు. సోమ, మంగళవారాలు కూడా కలెక్టరే స్వయంగా తండ్రిని తీసుకొని ఆసుపత్రికి వచ్చినట్లు డాక్టర్ అరవింద్ ‘సాక్షి’తో మాట్లాడుతూ ధ్రువీకరించారు. బుధవారం చేతికి శస్త్రచికిత్స జరుపనున్నట్లు ఆయన తెలిపారు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. తన తండ్రికి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స చేయిస్తున్న విషయాన్ని కూడా కలెక్టర్ గోప్యంగానే ఉంచడం గమనార్హం. తండ్రికి సేవ చేయడం తన విధి తప్ప ప్రచారం కాదు... అనే ధోరణిలోనే ఆయన వ్యవహారశైలి కనిపించింది. ఫొటో తీయడానికి కూడా కలెక్టర్ ఒప్పుకోలేదు. -
శల్యసారథ్యం.. కర్ణుడి పరాజయం
మద్రదేశపు రాజు శల్యుడు. పాండురాజు భార్య మాద్రికి స్వయానా అన్న. పాండవులకు మేనమామ. యుద్ధంలో పాండవులకు సహకరించడానికి బయలు దేరాడు. దారిలో దుర్యోధనుడు కుట్రతో ఆయనకు ఘనస్వాగతం పలికాడు. అడుగడుగునా బ్రహ్మరథం పట్టాడు. శల్యుడు అది ధర్మరాజు చేస్తున్న సత్కారమనే అనుకుని ఆనందంగా స్వీకరించాడు. యుద్ధభూమికి చేరుకున్నాక కానీ నిజం తెలిసి రాలేదు. అప్పటికే చాలా ఆలస్యం అయింది. యుధిష్ఠిరుడి దగ్గరకు వెళ్లి, ‘‘నాయనా! నీవు నాకు అత్యంత ప్రీతిపాత్రుడివి. మీ పక్షాన నిలబడి యుద్ధం చేయాలని బయలు దేరాను. అయితే దుర్యోధనుడు దుర్బుద్ధితో నాకు ఘనంగా స్వాగత సత్కారాలు ఏర్పాటు చేశాడు. అవి మీరే చేసి ఉంటారనే భ్రమంతో నేను వాటన్నింటినీ స్వీకరించాను కాబట్టి అతడు దుర్మార్గుడైనప్పటికీ నేను అతని పక్షానే యుద్ధం చేయాల్సి వస్తోంది. కానీ నీవు ధర్మపరుడివి, రాజనీతిజ్ఞుడివి కాబట్టి ఈ విపత్కర పరిస్థితి నుంచి బయట పడే ఉపాయం ఆలోచించు’’ అన్నాడు. ఏమి చేయమంటార ని ధర్మరాజు కృష్ణుడిని సలహా అడిగాడు. అప్పుడు కృష్ణుడిలా చెప్పాడు. ‘‘దుర్యోధనుడి సైన్యంలో కర్ణుడు మహాపరాక్రమవంతుడు. భీష్మ, ద్రోణులు కూడా పరాక్రమవంతులైనప్పటికీ వారు మనస్పూర్తిగా ధర్మరాజు విజయం కోరుకుంటున్నవారే. కాని కర్ణుడు అలా కాదు. దుర్యోధనుడికి ప్రాణమిత్రుడు. పొరపాటున కూడా అతడు ఓడిపోవాలని కోరుకోడు. పరశురాముడి శిష్యుడు, మహావీరుడు అయిన కర్ణుడిని ఓడించడం అసంభవం. అయితే, శల్యుడు మాత్రమే ఈ అసంభవాన్ని సంభవం చేయగల సమర్థుడు. కాబట్టి, మీరు శల్యుడిని కర్ణుడి రథసారథ్యం వహించమని కోరండి’’ అని చెప్పాడు. అప్పుడు ధర్మరాజు శల్యుడిని ‘‘మామా! కర్ణుడు కురుసేనకు సైన్యాధిపతి అయినప్పుడు మీరు అతని రథసారథిగా ఉంటూ, అతని మనోబలాన్ని నిరంతరం తగ్గిస్తూ ఉండాలి. ఇందుకోసం మీరు కర్ణుడి వ్యక్తిగత జీవితంలోవి, దుర్యోధనుడి సైన్యంలోని లోటుపాట్లు వినిపిస్తూ, అతన్ని, అతని సైన్యాన్ని నిరంతరం నిందిస్తూ, అతని మనోబలాన్ని కృంగదీయండి’’ అని కోరాడు. అందుకు అంగీకరించిన శల్యుడు పాండవులు కోరినట్లే సరైన సమయానికి సారథ్యం వహించి, కర్ణుడిని, అతని సైన్యాన్ని నిందిస్తూ, అంచలంచలుగా అతని మనోబలాన్ని దెబ్బతీశాడు. దాంతో కర్ణుడు యుద్ధంలో ఏకాగ్రతను కోల్పోయి, కౌరవుల పరాజయానికి పరోక్ష కారకుడయ్యాడు. అందుకే ఎవరైనా మన పక్షంలోనే ఉంటూ, మనోబలాన్ని దెబ్బతీసే విధంగా మాట్లాడుతుంటే అలాంటి వారిని శల్యసారథ్యం చేస్తున్నారంటారు. ఇక్కడ మనం తెలుసుకోవలసినవి ఏమిటంటే... మనవాడే కదా అని నిర్లక్ష్యం చేయరాదు. మర్యాదలు చేశారు కదా అని మొహమాటానికి పోయి దుర్మార్గుల పక్షం వహించరాదు. మనోబలం దెబ్బతింటే ఎంతటి వీరుడైనా బీరువు కావలసిందే! -
కర్ణుడి క్షుద్బాధ
పురానీతి కురుక్షేత్ర సంగ్రామం ముగిసింది. యుద్ధంలో మరణించిన వీరులందరూ వారి వారి పాపపుణ్యాల ఆధారంగా స్వర్గ నరకాలకు చేరుకున్నారు. వారిలో అత్యంత దానశీలిగా పేరు పొందిన కర్ణుడు స్వర్గలోకానికి వెళుతుండగా మార్గమధ్యంలో ఆకలిగా, దప్పికగా అనిపించింది. సమీపంలో ఉన్న కొలనులోని నీటిని దోసిలిలోకి తీసుకుని నోటిముందుకు చేర్చుకుని ఆత్రంగా తాగబోయాడు. చిత్రంగా ఆ నీరు కాస్తా బంగారు ద్రవంగా మారి, తాగడానికి పనికిరాకుండా పోయింది. ప్రయత్నించిన ప్రతిసారీ అంతే అయింది. ఈలోగా విపరీత మైన ఆకలి వేయడంతో కంటికి ఎదురుగా ఉన్న ఓ ఫలవృక్షాన్ని సమీపించి, చేతికి అందేంత దూరంలో ఉన్న ఓ పండును కోశాడు. మధురమైన వాసనలతో ఉన్న ఆ పండు ఆయన క్షుద్బాధను ఇనుమడింప జేయడంతో వెంటనే పండు కొరికాడు. పండు కాస్తా పంటికింద రాయిలా తగిలి నొప్పి కలిగింది. మరో పండు కోశాడు. మళ్ళీ అదే అనుభవం ఎదురయింది. ఏది తిన్నా, ఏది తాగబోయినా మొత్తం బంగారుమయంగా మారిపోతున్నాయి తప్పితే ఆకలి, దాహం తీరడం లేదు. దాంతో కర్ణుడు తన ఆకలి దప్పులు తీరే మార్గం లేక నిరాశా నిస్పృహలతో ఒక చోట కూలబడిపోయాడు. అప్పుడు ‘‘కర్ణా! నీవు దానశీలిగా పేరొందావు. చేతికి ఎముక లేకుండా దానాలు చేశావు. అయితే బంగారం, వెండి, ధనం రూపేణా చేశావు గానీ కనీసం ఒక్కరికి కూడా అన్నం పెట్టి వారి ఆకలి తీర్చలేదు. అందువల్లే నీకీ పరిస్థితి ఏర్పడింది’’ అని అశరీరవాణి పలికింది. అప్పుడు గుర్తుకొచ్చింది కర్ణుడికి ఒక సందర్భంలో ఒక పేద బ్రాహ్మడు తనను ఆకలితో కడుపు నకనకలాడిపోతోంది మహారాజా! ముందు నాకింత అన్నం పెట్టించండి మహాప్రభో అని నోరు తెరిచి అడిగాడు కూడా! అయితే అపార ధనవంతుడను, అంగరాజ్యాధిపతిని అయిన నేను పేదసాదలకు అన్నం పెట్టి పంపితే, వారు నన్ను చులకనగా చూస్తారేమో, ఆ విషయం నలుగురికీ తెలిస్తే నవ్వుకుంటారేమో అని అహంకరించి, సేవకులతో సంచీడు బంగారు నాణేలను తెప్పించి, అతని వీపుమీద పెట్టించడంతో, ఆ బరువును మోయలేక అతను అక్కడే చతికిలబడటం, తాను తిరస్కారంగా చూసి, భటుల చేత గెంటించడం గుర్తుకొచ్చింది. బంగారం వెండి ధనం వజ్రవైఢూర్యాలను దానం చేయడమే గొప్ప. వాటిని దానం చేయబట్టే కదా తనకు దానకర్ణుడనే పేరొచ్చింది... అన్నం మెతుకులంటే ఎవరైనా పెడతారు, ఇక తన గొప్పేముంది అని ఆలోచించాడు కానీ, ఆకలన్నవాడికి ముందు అన్నం పెట్టి కడుపు నింపడం కనీస బాధ్యత అని గుర్తించలేదు. దాని పర్యవసానం ఇంత తీవ్రంగా ఉంటుందనుకోలేదు... బతికి ఉండగా చేయలేని అన్నదాన కార్యక్రమాన్ని ఇప్పుడు ఎలా అమలు పర చగలడు? కర్తవ్యం ఏమిటి? అని ఆలోచించగా తన తండ్రి అయిన సూర్యదేవుడు గుర్తుకొచ్చాడు. సూర్యుని వద్దకెళ్లి జరిగిన విషయమంతా వివరించి పరిపరివిధాల ప్రాధేయపడ్డాడు. సూర్యుడు తమ రాజైన మహేంద్రునికి విన్నవించాడు. చివరకు దేవతలంతా కలసి ఆలోచించుకుని కర్ణుడికి ఒక అపురూపమైన అవకాశమిచ్చారు. అదేమంటే, సశరీరంగా భూలోకానికెళ్లి అక్కడ ఆర్తులందరికీ అన్న సంతర్పణ చేసి తిరిగి రమ్మన్నారు. దాంతో కర్ణుడు భూలోకానికి భాద్రపద బహుళ పాడ్యమినాడు వెళ్లి, అన్న సంతర్పణ చేశాడు. పితరులకు తర్పణలు వదిలి తిరిగి భాద్రపద అమావాస్యనాడు స్వర్గానికెళ్లాడు. కర్ణుడు భూలోకంలో ఉన్న కాలానికే మహాలయ పక్షమని పేరు. ఎప్పుడైతే అన్నసమారాధనతో అందరి కడుపులూ నింపాడో అప్పుడే కర్ణుడికి కూడా కడుపు నిండిపోయింది. ఆకలి, దప్పిక ఆయనను ఎన్నడూ బాధించలేదు. ఆకలితో ఉన్నవాడికి అన్నం పెట్టి కడుపు నింపాలి కానీ డబ్బు, బంగారం దానం చేస్తే ప్రయోజనం ఏముంటుంది? అన్నం పెట్టి, ఆకలి తీర్చినవారిని అన్నదాతా సుఖీభవ అని నిండు మనసుతో ఆశీర్వదిస్తారు. పితృదేవతల పేరిట ఆలయాలలో అన్నదానం చేయించడం వల్ల పేదల కడుపు నిండుతుంది, పితృలోకంలో ఉన్నవారికి ఆత్మశాంతి కలుగుతుంది. - డి.వి.ఆర్. -
మన జాతీయాలు
అసిధారావ్రతం! ‘అదేమీ ఆషామాషీ విషయం కాదు. అసిధారావ్రతం!’ అని చాలామంది అంటూ ఉంటారు. అసలు ఏమిటీ అసిధారావ్రతం? ‘అసి’ అంటే ‘కత్తి’, ‘ధార’ అంటే ‘పదునైన అంచు’ అని అర్థం. అర్థం వరకు బానే ఉంది గానీ... మధ్యలో ఈ వ్రతం ఏమిటి మరి! ‘అసిధారావ్రతం’ అనేది నిజంగానే ఒక వ్రతం. పెళ్లైనవాళ్లు బ్రహ్మచర్య దీక్షలో ఉన్నప్పుడు చేపట్టే కఠినమైన వ్రతం ఇది. ఏవైనా కారణాల చేత భార్యాభర్తలు దూరంగా ఉండాల్సి వచ్చినప్పుడు... ఒకే మంచం మీద పడు కున్న భార్యభర్తల మధ్య ఒక పదునైన కత్తి పెట్టేవారు. కత్తి ఆ భార్యాభర్తల మధ్య హద్దులా ఉంటుంది. ఉన్నచోటు నుంచి తెలిసో తెలియకో ఏ మాత్రం కదిలినా... కత్తికి బలి కాక తప్పదు. అందుకే ఎంతో అంకితభావంతో ఈ దీక్ష చేసేవారు. ఇప్పుడు ఈ ‘అసిధారావ్రతం’ ఎక్కడైనా ఆచరణలో ఉందా లేదా అనేది తెలియదుగానీ, కఠినమైన పని గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు, ఆ కఠినమైన పనిని అంతకంటే కఠినమైన దీక్షతో చేయాల్సి వచ్చినప్పుడు మాత్రం ‘అసిధారావ్రతం’ అన్న జాతీయాన్ని వాడటం జరుగుతోంది. కర్ణుడు లేని భారతం! ‘‘వాడు లేని ప్రయాణం... కర్ణుడు లేని భారతం.’’ ‘‘నువ్వు రాకుండా పెళ్లి ఎలా జరుగుతుందనుకుంటున్నావు... కర్ణుడు లేని భారతం ఉంటుందా?’’ ఏదైనా పని లేదా సమావేశంలో ఒక వ్యక్తి ప్రాధాన్యతను తెలియజేయడానికి ఉపయోగించే జాతీయం ఇది. మహాభారతంలో కర్ణుడు నాయకుడా? ఖల్నాయకుడా? అనేదాన్ని పక్కన పెడితే... అతనికి భారతంలో ఉన్న ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. పుట్టుక నుంచి చావు వరకు... కర్ణుడి జీవితంలో ప్రతి ఘట్టం ఆసక్తికరమే. అందుకే మహాభారతంలో అతడి ప్రాముఖ్యతను తెలియజెప్పే ఈ మాట... నిజ జీవితంలో ముఖ్యమైన వ్యక్తుల ప్రాధాన్యతను తెలియజేసే జాతీయం అయ్యింది. చాట్‌లో బియ్యం బావిలో నీళ్లు! ఒక పని ఎంత సులువై నదో సూచించడానికి వాడే మాట ఇది. ‘అన్నీ అందుబాట్లో ఉన్నాయి. ఇక ఆలస్యం ఎందుకు?’ అన్న అర్థం కూడా వస్తుందీ మాటకి. పనికి కావలసిన వనరులన్నీ అందుబాటులో ఉన్నప్పుడు పని పూర్తి కావడం ఎంతో సులభం. చాటలో బియ్యం, బావిలో నీళ్లు ఉన్నాయి. అంటే వంటకు కావలసినవన్నీ సిద్ధంగా ఉన్నాయి. ఇక వంట చేయడం ఎంతసేపు! అందుకే సులువుగా పూర్తయ్యే పని విషయంలో దీన్ని వాడుతుంటారు. సింగన్న ప్రయాణం చెప్పిన పని ఆలస్యంగా చేయడం ఎలాగైతే మంచిది కాదో, హడావిడిగా చేయడం కూడా అంత మంచిది కాదని చెప్పే జాతీయం ఇది. పని మీద శ్రద్ధ ఉంటేనే చాలదు. ఆ పని ఏమిటో, దాన్ని ఎలా చేయాలో తెలుసుకునే శ్రద్ధ కూడా ఉండాలి. లేకపోతే అభాసుపాలై నవ్వుల పాలవుతాం. దీనికి ఉదాహరణే సింగన్న! వెనకటికి సింగన్న అనే వ్యక్తి ఉండేవాడు. బుద్ధిమంతుడే కానీ తొందరపాటు చాలా ఎక్కువ. దాంతో తరచూ అభాసుపాలయ్యేవాడు. ఒకరోజు రాత్రి సింగన్న తల్లిదండ్రులు... ‘‘రేపు ఉదయాన్నే సింగన్నను అద్దంకి పంపిం చాలి’’ అనుకోవడం సింగన్న చెవిన పడింది. మర్నాడు తెల్ల వారుజామునే నిద్ర లేచి అద్దంకి వెళ్లిపోయాడు సింగన్న. సాయంత్రం తిరిగి వచ్చాడు. ‘‘ఎక్కడికెళ్లావురా?’’ అని అడిగాడు తండ్రి. ‘‘అద్దంకి వెళ్లొస్తున్నాను’’ అన్నాడు సింగన్న. ‘‘ఎందుకు వెళ్లావు?’’... ఆశ్చర్యంగా అడిగాడు తండ్రి. ‘‘రాత్రి విన్నాలే... నువ్వు ఎలాగూ వెళ్లమని చెప్తావు కదా అని ముందే వెళ్లి వచ్చాను’’ అన్నాడు సింగడు. నవ్వాలో ఏడ్వాలో అర్థం కాలేదు తండ్రికి. వివరం తెలుసుకోకుండా తొందరపడేవాళ్లని సింగడితో పోల్చడం అప్పట్నుంచే మొదలైంది. -
కర్ణుడు
కర్ణమంటే చుక్కాని అని ఒక అర్థముంది. ఈ చుక్కాని మనుగడ పడవని వెనుబాములోని చక్రాలగుండానైనా నడపగలదు. లేక, ఇంద్రియనాడుల గుండా బయటికి భౌతిక చైతన్యం వైపుకైనా నడపగలదు. ‘కర్ణ’మనే మాటను తిరగేస్తే ‘నరక’మవుతుంది. ఇతనికున్న లోభం నరక ద్వారాలు మూడింటిలోనూ ఒకటి. తతిమ్మా రెండూ కామరూపుడైన దుర్యోధనుడూ కోపరూపుడైన దుశ్శాసనుడూను. దుష్టచతుష్టయంలో ఒకడై, చెడు సావాసంతో పూర్తిగా చెడిపోవడాన్ని ప్రత్యక్షంగా రూపుకట్టిస్తాడు కర్ణుడు. పెద్దలు, సంగానికి దూరంగా ఉండమని చెబుతూ, సమాజంలో ఉన్నప్పుడు సంగం తప్పదు కనుక, సంగమే చేయవలసి వచ్చి నప్పుడు, మనను ఉద్ధరించగలిగే మంచి వాళ్లతోనే సహవాసం చేయాలని హెచ్చ రిస్తూ ఉంటారు. కర్ణుడు ఈ పెద్దల సుద్దిని పూర్తిగా కాదన్నాడు. అసలు కర్ణుడనే పేరు అతనికి పెట్టిన పేరు కాదు. వసుషేణు డనేదే అతని పేరు. కుంతికి కొడుకే అయినా... ఆమె, పాండురాజుకి భార్య కాకముందు ఇతను పుట్టాడు. పాండు రాజంటే బుద్ధీ విచక్షణాను. దివ్యశక్తుల్ని పిలవగలిగే కుంతి శక్తికి విచక్షణ ఇంకా తోడుకాక ముందే పుట్టాడు కనకనే ఇతనికి వివేకమబ్బలేదు. దూర్వాసుడిచ్చిన వరాన్ని చాపల్యం కొద్దీ పరీక్షిద్దామని ఎదురుగా అవుపిస్తూన్న సూర్యుణ్నే ఆహ్వా నించింది కుంతి. కొడుకు కనక కవచ కుండలాలతో వెలిగిపోతూ పుట్టినా, భయంకొద్దీ అతన్ని పెట్టెలో పెట్టి, నీళ్లల్లో విడిచిపెట్టింది. ముక్కుపచ్చలారని కొడుకుని వదిలిపెట్టిందని కొంతమంది కవులు భావుకతకు లోబడి తప్పుపట్టారు గానీ, పుట్టుకకు కారణమైన అతని కర్మను వాళ్లు పట్టించుకోలేదు. కర్మే పుట్టుకను శాసిస్తుంది కనకనే ఒకే తల్లిదండ్రులకు పుట్టినవాళ్లంతా ఒకేలా ఉండరు. పసిబిడ్డ ఉన్న పెట్టె, రథాల్ని నడుపుకొనే అధిరథు డికి దొరికింది. అతని భార్య రాధకు ఆ కుర్రాణ్ని చూపించాడు. బంగారంతో పుట్టాడు కనక అతనికి వసు షేణుడని పేరు పెట్టుకున్నారు (వసువంటే ధనం). గొప్పవాళ్లకు పుట్టి కూడా సూతుడిగా పెరగడం మునపటి కర్మ ఫలితమే. వసుషేణుడు సూర్యుణ్ని ఉపాసించే వేళ ఎవరేది అడిగినా దానం చేసేవాడు. అర్జునుడి కోసం ఇంద్రుడు వసుషేణుడి దగ్గరికి బ్రాహ్మణ వేషంలో వెళ్లి, అతని కవచకుండలాల్ని ఇమ్మనమని అడిగాడు. వాటిని ఒలిచి ఇచ్చాడు కనకనే అతనికి కర్ణుడూ వైకర్తనుడూ అనే పేర్లు వచ్చాయి (కృతీ-ఛేదనే). అయితే, ఈ దానానికి బదులుగా ఒకసారికి మాత్రమే పనికివచ్చే శక్తినొకదాన్ని ప్రతిదానంగా తీసుకొన్నాడు. ప్రతిదానం తీసుకుంటే ఆ దానం ఎంతటి దైనా గొప్పతనాన్ని పోగొట్టుకుంటుంది. కర్ణుడు ఆధ్యాత్మిక నేత్రరూపుడైన సూర్యు ణ్నించి పుట్టినా, వైరాగ్యానికి ప్రతీకయిన కుంతికి పుట్టినా కూడా, ఇంద్రియ సంబంధమైన మనసుండే స్థానంలో ధృత రాష్ట్రుడి అధీనంలో పెరిగాడు. ఇక్కణ్నించి కూడా అతను ఆధ్యాత్మిక లోకానికి తిరగ వచ్చు. కర్ణుడు అర్జునుడి మీది స్పర్ధ కొద్దీ, లోభంతో దుర్యోధనుడిచ్చిన ‘అంగ’ (శరీర) రాజ్యానికి రాజై, అతని కొమ్ము కాయడంతో శారీరక చైతన్యం వైపుకే చుక్కానిని తిప్పేశాడు. కర్ణుడు బ్రహ్మాస్త్రాన్ని అభ్యసించడానికి పరశురాముడి దగ్గరికి వెళ్లాడు. బ్రహ్మా స్త్రాన్ని స్థిరంగా నిలిపి ఉంచుకోవడానికి సాధకుడు బ్రహ్మత్వాన్ని కలిగి ఉండాలి. ఇతను పరశురాముడితో బ్రాహ్మణుణ్నని అబద్ధం చెప్పి ఆ అస్త్రాన్ని నేర్చుకున్నాడు. ఒకరోజున గురువు శిష్యుడి తొడను తల గడగా చేసుకొని నిద్రపోయాడు. అప్పుడు ఇంద్రుడు ఒక పురుగు రూపంలో వచ్చి, అతని తొడలో కన్నం పెట్టడం మొదలు పెట్టాడు. రక్తం కారుతోంది, బాగా బాధ పెడుతోంది. అయినా గురువుగారికి నిద్రా భంగం కలగకూడదని కర్ణుడు కదలకుండా బాధను భరిస్తూ కూర్చున్నాడు. ఇంతలో గురువు లేచి పరిస్థితిని చూశాడు. అతని ధైర్యాన్ని గమనించి ‘నిజం చెప్పు నువ్వెవ డివి?’ అనేసరికి, ‘నేను సూతుణ్ని’ అని నిజం చెప్పాడు. అబద్ధమాడడాన్ని గమ నించకుండా ఇంద్రుణ్ని తప్పుపడుతూ ఉంటాం మనం. సత్యాన్ని కాదంటే ఇటు వంటి పరిస్థితిలోనే పడుతూంటాం. ‘గురు వైన నన్ను మోసం చేసి అస్త్రాన్ని పొందావు గనక, అవసరం వచ్చినప్పుడు అది నీకు గుర్తుకు రాదు. నీ మరణ సమయ మప్పుడు తప్ప ఇతర సమయాల్లో అది పనిచేస్తుంది. బ్రాహ్మణత్వం లేనివాడిలో ఈ అస్త్రం స్థిరంగా ఉండదు’ అంటూ పరశురాముడు శాపమిచ్చాడు. ఓసారి, విజయుడనే బ్రాహ్మణుడి ఆశ్రమం దగ్గరిగా అస్త్రాభ్యాసం చేస్తున్నాడు కర్ణుడు. అజ్ఞానం కొద్దీ అజాగ్రత్త కొద్దీ ఆ బ్రాహ్మణుడి హోమధేనువు తాలూకు దూడను చంపాడు. అది చూసి విజయుడు ‘అజాగ్రత్తతో నువ్వు బాణాల్ని వేసి, నా హోమధేనువు బిడ్డణ్ని చంపావు గనక, యుద్ధవేళ నీ రథచక్రం గోతిలో కూరుకు పోయి ప్రాణాంతకమైన భయానికి గురి అవుతావు’ అని శపించాడు. అస్త్రాల్ని అభ్య సించాలన్న రాగం కొద్దీ అజాగ్రత్తతో ప్రవ ర్తించడం ఇతనిలో పెద్ద లోపం. ఆ బ్రాహ్మ ణుణ్ని ‘ఇంత డబ్బిస్తాను, కానుకలిస్తాను, ఆవులిస్తాను, ఎద్దులనిస్తాను’ అంటూ ప్రలోభపెట్టడంతో అతనికి ఇంకా కోపం వచ్చింది. ‘నేనెప్పుడూ అబద్ధమాడలేదు. అంచేత నేనన్న మాట అన్నట్టుగానే జరిగి తీరుతుంది’ అని రూఢి చేశాడు. ధర్మానికి ప్రతికూలమైన ప్రవర్తన వల్లనే శాపాలూ తాపాలూ సంక్రమిస్తాయి. అవి మన పనులు, ప్రవర్తన వల్లనే తారసిల్లుతాయి. పాండవ కౌరవుల అస్త్ర కళా ప్రదర్శ నలో కర్ణుణ్ని చూసి, దుర్యోధనుడు తనకు అర్జునుణ్ని ఎదిరించేవాడు దొరికాడని ఉబ్బిపోయాడు. రాజకుమారుడు కాని వాడు ఈ రంగంలోకి రాకూడదనేసరికి, అతన్ని రాజుగా చేయడానికి అప్పటి కప్పుడే కర్ణుణ్ని అంగ రాజ్యాధినేతగా చేశాడు. అలా కర్ణుడు రాజు కావాలనే కోరికకు అధీనమై, ఉచ్చ నీచాలను చూడ కుండా అధర్మం వైపు చేరిపోయాడు. తల్లే స్వయంగా ‘నువ్వు కౌంతేయుడివే’ అని చెప్పినా, అంతరాత్మ అయిన శ్రీకృష్ణుడు చెప్పినా, కురు వృద్ధుడైన భీష్ముడు చెప్పినా కూడా, అధర్మపరుడైన దుర్యోధనుడి స్నేహాన్ని నిలబెట్టుకోవడమే సరి అయిన దనుకున్నాడు. అధర్మమని తెలిసినా, కౌంతేయుడనని ఇప్పుడటు వెళ్లిపోతే చెడ్డ పేరు వస్తుందనీ, అసౌఖ్యం కలుగు తుందనీ, ఆ భావాన్నే అడ్డుకొన్నాడు. ఇటు వంటి వెర్రి తలపులకూ ఇష్టానిష్టాలకూ బానిసతనం చూపించడమే లోభం. లోభం అవసరమైన అవసరాల్నీ అనవసరమైన ‘అవసరాల్నీ’ విడదీయనివ్వని తికమకను మనస్సులో కలగజేస్తుంది. అర్జునుణ్ని ఆరునూరైనా నూరు ఆరైనా జయించాలి. దానికోసం అధర్మం కొమ్మై కాయడానికి ఒప్పుకోవడమూ అది సరి అయినదా కాదా అని కొద్దిగా కూడా ఆలోచించకుండా దుర్యోధనుడితో మాటలో మాట కలపడమూ తన కోరిక ఎలాగైనా తీరాలనే యావ కొద్దీ జరిగాయి. వికర్ణుడు, ద్రౌపది దాసి కాదని తేల్చి నప్పుడు దుర్యోధనుడి మెచ్చుకోలు కోసం కర్ణుడు అతన్ని మూర్ఖుడిగా తీసిపారేశాడు. ‘‘ధర్మజుడు తనకున్నవన్నీ ఒడ్డేసి ఓడి పోయిన మీదట, తనలోనూ తమ్ముళ్ల ల్లోనూ అర్ధాంగిగా ఉన్న ద్రౌపదిని కూడా మనం గెలుచుకున్నట్టే లెక్క. ఏకవస్త్రను సభలోకి తీసుకొని రావడమూ తప్పు గాదు. స్త్రీకి ఒకే భర్త ఉండడం రివాజు. కానీ ఈవిడకు చాలామంది భర్తలున్నారు. అంటే, ఈవిడ ఒక వేశ్య. వేశ్యను ఏక వస్త్రగా ఉన్నా అసలు బట్టలు లేకుండా ఉన్నా సభకు తీసుకొని రావడం చిత్ర మేమీగాదు. దుశ్శాసనా! ఈ మీ తమ్ముడు వికర్ణుడు మూఢుడయ్యుండీ మహా జ్ఞాని లాగ మాట్లాడుతున్నాడు. ‘పాండవానాం చ వాసాంసి ద్రౌపద్యా శ్చాప్యుపా హర’ అంటూ ఒక ఆడదాని బట్టల్ని ఒలవమని నిస్సిగ్గుగా నిండు కొలువులో దుశ్శాస నుణ్ని ప్రేరేపించి దుష్టాతి దుష్టత్వం చూపినవాడు కర్ణుడు. ‘ఇకపై దాస్యానికి నిన్ను అప్పగించని మరెవరి నైనా పతిగా వరించుకో’ అని ఒక మహా రాణిని ఘోరంగా అవమానించిన నికృష్టు డితను. దీనికి కారణం, స్వయంవర సమయంలో కర్ణుణ్ని చూసి ద్రౌపది, ‘సూతుణ్ని పెళ్లి చేసుకోను’ అనడంతో లక్ష్యాన్ని కొట్టడానికి ప్రయత్నించకుండానే వెళ్లిపోయాడు. కర్ణుడు మహాశౌర్యం కలవాడే; మహా దానాలు చేసినవాడే. శౌర్యమూ వీర త్వమూ దానగుణమూ గొప్ప ధర్మాలే. కానీ, ఒక ధర్మం మరో ధర్మంతో వ్యతిరే కించేలాగ ప్రవర్తిస్తే, ముందు చెప్పుకొన్న ధర్మాలన్నీ వ్యర్థమైపోతాయి. కొంతమంది తపస్వులు దేవుడిచ్చిన ఆ ప్రతిభను తమదే అన్నట్టు చాటుకుంటూ, తాగుడూ విచ్చలవిడి సంభోగమూ అవలంబిస్తూ, అదే గొప్పదన్నట్టు ప్రవర్తిస్తూ ఉంటారు. ఇది దైవం పట్ల చేసే అపచారమే. కర్ణుడు దానవీరుడూ శూరమానీను. అయినా, దుర్యోధన దుశ్శాసన శకునులతో కలిసి తన ప్రతిభకు మచ్చను తెచ్చుకున్నాడు. అందుకనే అతనికి గురుశాపమూ బ్రాహ్మ ణుడి శాపమూ వచ్చిపడ్డాయి. ఎవరెలాగ ప్రవర్తిస్తే వాళ్లకలాగే జరుగుతుంది. భీష్ముడు తనను అర్ధ రథుడన్నాడని అతను సేనాపతిగా ఉన్నప్పుడు, నిర్ణాయక మైన యుద్ధానికే దూరమయ్యాడు. అస్త్రా లన్నీ తెలిసినా తప్పుడు ప్రవర్తనతో వచ్చి పడ్డ శాపాల వల్ల అతను ఒక్క రథికుడి తోనూ పోరాడలేని స్థితిని తెచ్చుకొన్నాడు కనకనే అతన్ని భీష్ముడు అర్ధ రథుడని అన్నాడు. ద్రోణుడు పోయిన తరవాత కర్ణుడు సేనాపతి అయ్యాడు. తల్లికిచ్చిన మాట ప్రకారం అర్జునుణ్ని తప్ప తతిమ్మా నలుగుర్నీ చంపగలిగీ విడిచిపెట్టాడు. భీష్ముడు సేనాపతిగా ఉన్నప్పుడు యుద్ధానికి దూరం కావడం గానీ దొరికిన నలుగురు పాండవుల్నీ పట్టుకోకపోవడం గానీ స్నేహితుడని చెప్పుకొన్న దుర్యో ధనుడి విశ్వాసాన్ని వమ్ము చేయలేనని తల్లికీ కృష్ణుడికీ చెప్పిన దుర్యోధనుడి పట్ల ఇతను చేసిన ద్రోహం కిందే జమకట్టాలి. ఇతని ప్రవర్తన వల్ల వచ్చిపడిన శాపాలతో బాటు, కృష్ణుడితో సమానుడని తానే అడగ్గా దుర్యోధనుడు కల్పించిన శల్యుడి సారథ్యం కూడా ఇతని మనస్సును విరగ్గొ ట్టిన పెద్ద శాపమే అయింది. ‘అర్జునుడి ముందు నువ్వు దిగదుడుపే’ అని ముందు కూర్చొని పదేపదే అంటూ మనస్సుని కుళ్ళబొడవడం కూడా శాపం కన్నా ఏ మాత్రమూ తక్కువ కాదు. దుస్సంగంలో పడితే ఎన్నెన్ని శాపాలు వెన్నాడుతాయో ధర్మం తెలుసుండీ అధర్మాన్నే బలపర చడం వల్ల ఎన్నెన్నిసార్లు ఓడిపోవలసి వస్తుందో కర్ణుణ్ని చూస్తే అర్థమవుతుంది. దుర్యోధనుడు ఇతని మీద పెట్టుకున్న ఆశలన్నీ వట్టివే అయ్యాయి. ఘోష యాత్రలో ఓడిపోయి దూరంగా పోయాడు; ఉత్తర గోగ్రహణ యుద్ధంలో అర్జునుడి చేతిలో ఓడిపోయాడు. మహా యుద్ధంలో శాపాల బారినపడి, అర్జునుణ్ని ‘చంపుతాను,’ అని చెప్పుకొన్న గొప్పలన్నీ వట్టిపోగా, తానే నేలకొరిగిపోయాడు. లోభానికి లొంగినవాడికి ఎవడికైనా ఇంతే గతి పడుతుంది. విచక్షణతో మనలో ఉన్న మంచీచెడుల్ని విశ్లేషించుకోవాలి. మంచితో స్నేహం చెయ్యాలి. చెడును దూరంగా విడిచిపెట్టాలి. వీటన్నిటికీ వ్యతిరేకమైనవాడు బాధపడడం తప్పదు.