
పాత్రకోసం ప్రాణం పెట్టే నటులు అతికొద్దిమందే ఉంటారు. అందులో ప్రధానంగా తమిళ నటుడు విక్రమ్ ముందు వరుసలో ఉంటాడు. సేతు, శివపుత్రుడు సినిమాల్లో నటనకు ఎన్నో అవార్డులు వచ్చాయి. శంకర్ తీసిన ‘ఐ’ సినిమా కోసం తన శరీరాన్ని హూనం చేసుకున్నాడు. ఇలా పాత్రకు తగ్గట్టుగా మారే విక్రమ్.. కర్ణుడి పాత్రను పోషిస్తూ.. ఓ సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే.
దాదాపు 300కోట్లతో అత్యంత భారీగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి మహావీర్‌కర్ణ అనే టైటిల్‌ను ఫిక్స్ చేసినట్టు సమాచారం. కర్ణుడి కోణంలోంచి మహాభారత గాథను చెప్పే ఈ చిత్ర షూటింగ్‌ను హైద్రాబాద్‌లో జరగుతోందని సమాచారం. సామి సినిమాతో ఇటీవలే పలకరించిన విక్రమ్.. గౌతమ్ మీనన్‌తో తెరకెక్కించే ‘ధృవనక్షత్రం’, రాజేష్ ఎమ్ సెల్వ డైరెక్షన్‌లో రాబోతోన్న ‘కదరం కొండన్’ షూటింగ్‌లతో బిజీగా ఉన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment