maha bharatham
-
సభలో మహాభారత కథలొద్దు: స్పీకర్ ఓంబిర్లా ఆగ్రహం
న్యూఢిల్లీ: స్పీకర్ ఓంబిర్లా ఒడిషాకు చెందిన ఎంపీపై శుక్రవారం(ఆగస్టు2) లోక్‌సభలో మండిపడ్డారు. ఒడిషా బీజేపీ ఎంపీ ప్రదీప్ పురోహిత్ కేంద్ర ఆయుష్ మంత్రిని ఓ ఆయుర్వేద కాలేజీపై ప్రశ్నిస్తూ అక్కడి మూలికల చరిత్రను వివరించబోయారు. దీనికి విసుగు చెందిన స్పీకర్ మహాభారత కథలు వద్దు. ప్రశ్నలడగండి. ఈ మధ్య సభలో మహాభారతం గురించి చెప్పడం ఫ్యాషన్‌గా మారింది అని ఆగ్రహం వ్యక్తం చేశారు. సభలో అడగాలనుకున్న విషయాలు సూటిగా అడగాలని, కథలు చెప్పొద్దని చురకలంటించారు. -
అంకిత భావం
అంకము అంటే గుర్తు, ముద్ర. అంకితం అంటే గుర్తు, లేక ముద్ర కలిగినది. తమ పని ఏదైనా ఏ విధంగా గుర్తించబడాలో సూచించే గుర్తును చెప్పటం అంకితం. మన కవులు అందరు తమ కావ్యాలను అంకితం చేశారు. రచన తమది అయినా ఆ రచనను చదివే వారికి మరొకరు మనసులో మెదులుతారు. అది తమ ఇష్టదైవం కావచ్చు. ఆదరించిన రాజో, మిత్రుడో, ఆత్మీయులో కావచ్చు. అది మరెవరి గుర్తింపు కొరకో తాము చేసే కృషి అని చెప్పటం. కావ్య అవతారికలోనే చెప్పటం సంప్రదాయం. ఆదికవి నన్నయ ఈ ఒరవడి ప్రారంభించినట్టు కనపడుతుంది. తన సహాధ్యాయి, రాజు, పోషకుడు అయిన రాజరాజ నరేంద్రుడి కోరిక మీద ఆయనకి అంకితంగా భారతసంహితా రచనా ధురంధురుడయ్యాడు. ఈ అంకితం కారణంగానే తిక్కనామాత్యులవారు అరణ్యపర్వశేషాన్ని స్పృశించలేదని కొండరు సాహిత్యవిమర్శకుల అభిప్రాయం. నన్నయభట్టు నరాంకితంగా చేసిన దానిలో మిగిలిన భాగాన్ని దైవానికి అంకితం ఇవ్వటం ఇష్టం లేక విరాటపర్వం నుండి ప్రారంభించి ఉంటారని భావన. పైగా ఆయనకి హరిహరనాథుడు స్వప్నంలో కనపడి ఆదేశించాడు కూడా. పోతనామాత్యుల వారి అంకితం కించిత్ ఆశ్చర్యాన్ని కలిగించక మానదు. శివధ్యానం చేస్తున్న పోతనకి శ్రీరామచంద్రుడు దర్శనమిచ్చి కృష్ణకథ ప్రధానంగా ఉన్న భాగవతాన్ని తనకి అంకితంగా రచించమని కోరాడు. వాగ్గేయకారులు తమ కీర్తనలలో ప్రతిదానిలోనూ తమ ఇష్టదైవం నామాన్ని గాని ఒక ప్రత్యేకమైన పదాన్ని గాని గుర్తుగా పేర్కొంటారు. దానిని ముద్ర అంటారు. కీర్తనలు వేటికి అవి విడిగా ఉంటాయి. కావ్యంలో లాగా అవతారికలో ఒకసారి పేర్కొంటే సరిపోదు కదా! అందుకని ప్రతి కృతిలోనూ ముద్ర తప్పనిసరి. త్యాగరాజ కృతులలో ప్రతి దానిలోనూ త్యాగరాజనుత అనే ముద్ర కనపడుతుంది. శ్యామశాస్త్రివారి కీర్తనలలో శ్యామకృష్ణ అని, ముత్తుస్వామి దీక్షితులవారి కీర్తనలలో గురుగుహ అనే ముద్రలు దర్శనమిస్తాయి. ఆ ముద్ర చూడగానే అది ఎవరి రచన అన్నది తెలిసిపోతుంది. నిజానికి వారు మనకి తేలికగా తెలియటం కోసం పెట్టలేదు ముద్రలని. ఆ ముద్ర తనకి, ఎవరిని గురించి పాడుతున్నారో వారికి గుర్తింపు. వాచస్పతి మిశ్రుడు తన రచనకు ఏ మాత్రం ఇబ్బంది కలిగించకుండా సహకరించిన, అప్పటివరకు ముఖమైనా చూడని ధర్మపత్ని ‘భామతి’ పేరుని తన గ్రంథనామంగా ఉంచాడు. తమకు ఉన్న ప్రేమాభిమానాలను వ్యక్తపరచటానికి రచనాదికాలు చేయలేక పోయినా, తాము చేసిన ఏ ఘనకార్యమైనా అంకితం చేస్తూ ఉంటారు. అందరు ఏదో ఒక ఘనకార్యం చేసి అంకితం ఇవ్వలేక పోవచ్చు. వారు తమ జీవితాన్నే అంకితం చేయటం మనం గమనించ వచ్చు.‘‘నా జీవితం నీకే అంకితం..’’ అంటూ పాడిన పాటలు ఉదాహరణలు. అంటే, తన అస్తిత్వానికి ఒక గుర్తింపు అవసరం లేదు, అస్తిత్వంతో సహా అంతా సమర్పణమే ఇష్టదైవానికో, ఇష్టమైన వ్యక్తికో. చివరికి ఈ అంకిత ప్రక్రియ ఏ స్థాయికి చేరింది అంటే, ఆకాశవాణిలో గాని, దృశ్యశ్రవణ ప్రసార మాధ్యమాలలో గాని ఇష్టమైన పాటలని వేయించి, వాటిని అంకితం చేస్తున్నారు. వీరజవానులు తమ జీవితాలను దేశరక్షణకు అంకితం చేస్తారు. కొందరు దైవానికి తమ జీవితాలని అంకితం చేస్తారు. తన ఉనికి కోసం, గుర్తింపు కోసం తాపత్రయ పడకుండా మరెవరి గుర్తింపుకో నిస్వార్థంగా చేయటం అంకితం. కావ్యాలు, కీర్తనలు మాత్రమే కాదు ఏ సృజనాత్మక సృష్టి అయినా తన గుర్తింపు కోసం కాక ఇతరులకు గుర్తింపు కలగటం కోసం చేసినప్పుడు ఆ ప్రక్రియని అంకితం అంటారు. ఉదాహరణకి నన్నయభట్టు భారతాన్ని ఆంధ్రీకరించాడు. ఆయన పేరుతో పాటు అంకితం పుచ్చుకున్న రాజరాజనరేంద్రుడి పేరు కూడా చరిత్రలో శాశ్వతంగా నిలిచి ఉంటుంది. రాజుగా కన్న ఆంధ్రమహాభారతాన్ని అంకితం పుచ్చుకున్నవాడిగా గుర్తింపు అధికం. శ్రీనాథ కవిసార్వభౌముడి పేరు నిలిచి ఉన్నంత కాలం వీరారెడ్డి, అవచి తిప్పయ్య శెట్టి, పెదకోమటి వేమారెడ్డి మొదలైన వారందరి పేర్లు శాశ్వతం. రచనలు చేయలేదు కాని, కావ్యాలు అంకితం పుచ్చుకున్నారు కనక, ఆ కావ్యాలు ఆదరించబడినంత కాలం వారి పేరు చిరస్థాయిగా ఉంటుంది. – డా. ఎన్. అనంతలక్ష్మి -
గురువాణి: యువత భగవద్గీత సారాన్ని తెలుసుకోవాలి
మహాభారతం పంచమవేదంగా చెప్పబడుతోంది. మహాభారతంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి బోధించిన భగవద్గీతలోని సారాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. ముఖ్యంగా యువత భగవద్గీత చదివి సారాన్ని పూర్తిగా అర్ధం చేసుకోవాలి. శ్రీకృష్ణుడు చెప్పినట్లు ఫలితాన్ని ఆశించకుండా కర్తవ్యాన్ని నిర్వర్తించుకుంటూ ముందుకెళ్లాలి. గీతాసారాన్ని తెలుసుకుంటే మాట్లాడే ప్రతి మాట, ప్రతి అడుగు తిరుగులేని కచ్చితత్వంతో ఉంటాయి. అన్ని సమస్యలకు పరిష్కారం చూపించే సారం గీతలో ఉంది. దత్తాత్రేయుడిగా గురువు అవతారమెత్తిన మహావిష్ణువు కృతయుగంలో శ్రీరాముడిగా, ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడిగా అవతరించి మానవాళికి మార్గదర్శకులయ్యారు. వీరి అవతారాలకు భారతదేశం వేదిక కావడం అదృష్టం. దీంతో ప్రపంచ దేశాలకు భారతదేశం ఎనలేని విజ్ఞానాన్ని అందించినట్లైంది. భారతదేశం ఎప్పుడూ ప్రపంచంలోని అన్ని దేశాలు బాగుండాలని కోరుకుంటూ వస్తోంది. ఇతర దేశాలతో ప్రేమపూర్వకంగా ఉంటూ వస్తున్న భారతదేశ విధానాన్నే స్ఫూర్తిగా తీసుకుని యువత ముందుకెళ్లాలి. దీంతో యువతలో సానుకూల దృక్పథం కలుగుతుంది. అనేక దేశాల అభివృద్ధిలో కీలక ΄ాత్ర ΄ోషిస్తున్న భారత యువత అక్కడ భారత సంస్కృతి, సాంప్రదాయాల గురించి గర్వంగా చెప్పుకోవాలి. అదేవిధంగా ప్రకృతి, పంచభూతాలను ఎవరు నడిపిస్తున్నారనే విషయాలను తెలుసుకోవాలి. దీంతో అందరికీ సద్బుద్ధి కలుగుతుంది. పరమాత్మను పరిపూర్ణంగా శరణు వేడడమే అన్నింటికీ పరిష్కార మార్గం. ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు బోధించిన భగవద్గీత మానవాళికి దిశానిర్దేశం చేస్తోంది. భాగవతంలో శ్రీకృష్ణుడి అవతారం ్ర΄ారంభం నుంచి ముగింపు వరకు ఉంటుంది. త్రేతాయుగంలో శ్రీరాముడిగా కష్టాలు అనుభవిస్తూ ధర్మమార్గంలో ఎలా నడవాలో చూపించిన పరమాత్మ, ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడిగా ఎన్ని ఒడిదొడుకులు ఎదుర్కొన్నాడో భాగవతం చదివితే తెలుస్తుంది. చిన్నతనం నుంచే భగవద్గీత, రామాయణం, మహాభారతం, భాగవతం గురించి తెలుసుకుంటే యువత తిరుగులేని సానుకూల దృక్పధాన్ని సాధిస్తుంది. – తూమాటి భద్రారెడ్డి సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ -
దూరం చేసే అహంకారం
అహంకారం... అయిన వాళ్ళనే కాదు, కానివాళ్లనూ దూరం చేస్తుంది. అందరితో వ్యతిరేకతను పెంచి, సమాజానికి దూరంగా బతికేలా చేస్తుంది. అహంకారం ఉన్న వ్యక్తులను ఏ సమాజమూ గుర్తించదు. ఏ మనిషీ గౌరవించడు. సరికదా, అవసరమయినపుడు ఆదుకునేవారు లేక అలాంటి వ్యక్తులు నానా ఇబ్బందులూ పడతారు. నిత్య జీవితంలో చాలామంది తమ గురించి, తమ ఆలోచనల గురించి గొప్పగా ఊహించుకుంటూ, తాము అందరికంటే ఉన్నతులమని, తమకంటే గొప్ప వారు మరొకరు లేరని భ్రమిస్తూంటారు. చేస్తున్న ప్రతిపనిలోనూ తమ గొప్పతనాన్ని చాటుకుంటూ, తాము ఇతరులకు భిన్నమని, ఇతరులకంటే తాము చాలా ఎక్కువమని భావిస్తూ వాస్తవానికి దూరంగా జీవిస్తారు. వారిలో ఏ విశేషమూ లేకపోయినా, ఎంతో విఖ్యాతులమని విర్రవీగుతారు. తమలోని వాపును కూడా మహాబలమని భ్రమిస్తారు. అణకువతో ఓ మెట్టు దిగుదామన్న విషయాన్ని అటుంచి దానిని అవమానంగా భావిస్తారు. ఇలా అంతర్యామికీ, అంతరాత్మకూ మధ్య ఉన్న ఆ అదృశ్య, అతి ప్రమాదకర అంతఃశత్రువే అహంకారం. దానినే మనం గర్వమని కూడా పిలుస్తుంటాం. వినమ్రతకు అహంకారం బద్ధ వ్యతిరేకం. గర్విష్టికి భగవంతుడు ఆమడదూరంలో ఉంటాడు. ముందు ‘నేను’ అనే మాయ నుంచి బయట పడితే, ఆ తరువాత తన దరికి చేర్చుకుంటానంటాడు. నిజానికి ఆధ్యాత్మిక సాధనల లక్ష్యం ఆత్మను పొందడం కాదు. అహంకారాన్ని పోగొట్టుకోవడమే. మనం తినే తిండిలో కారం ఎక్కువైతే శరీరంలోని రక్తం మలినమవుతుంది. అదే అహంకారం పాలు ఎక్కువైతే మానవత్వమే మంటకలసి పోతుంది. ఎవరిలో అహంకారం ప్రవేశిస్తుందో అలాంటి వారు అధోగతి పాలవుతారు. చెదపురుగు పట్టిన వస్తువు ఏ విధంగా పనికి రాకుండా పోతుందో, అదేవిధంగా అహంకారం అనే చెదపురుగు పడితే మానవవత్వం మృగ్యమైపోతుంది. మనిషికి బుర్ర నిండా వెర్రి ఆలోచనలు కలిగిస్తుంది. మానవత్వం నుంచి రాక్షసత్వంలోకి మనిషిని నెట్టేస్తుంది. గర్వం లేదా అహంకారం ఎవరిలో ప్రవేశిస్తుందో వారి గతి అధోగతే. మనిషిలో గర్వం, అహంకారం కొంచెం ఉన్నా అవి మనిషిని నిలువునా ముంచేస్తాయి. గర్వంతో కూడిన విజయం ఎల్లప్పుడూ శాశ్వతం కాదు. అలాంటి విజయం వలన తాత్కాలిక ఆనందం పొందినప్పటికీ, సమస్యలు వచ్చినప్పుడు మనకు తోడుగా ఎవరూ ఉండరని గుర్తుంచుకోవాలి. నాది, నేను అనే భావనలు మనిషిలో గర్వాన్ని, అహంకారాన్ని పెంచుతాయి. ఈ రెండు భావనలను మనసు నుంచి తుడిచేస్తే జీవితంలో ఎలాంటి విజయాన్నైనా సొంతం చేసుకోవచ్చు. దుర్యోధనుడి విపరీతమయిన అహంకారం వల్లే మహా భారత సంగ్రామం జరిగింది. గర్వితుడయిన దుర్యోధనుడి అహంకారం వల్ల పాండవులకు ధర్మంగా రావల్సిన రాజ్యం కూడా రాకుండా పోయింది. అంతేకాదు ద్రౌపది వస్త్రాపహరణానికి, కౌరవ సేనల అకృత్యాలకు, జూదంలో ధర్మరాజును మాయతో గెలిచిన తీరుకు... ఇలా అన్నింటికీ దుర్యోధరుని అహంకారమే కారణమయ్యింది. ఆ అహంకారం వల్లే సాక్షాత్తు శ్రీ కృష్ట భగవానుడు యుద్ధం వద్దని వారించడానికి వచ్చినా దుర్యోధనుడు వినలేదు.. కయ్యానికి కాలు దువ్వి , తాను నాశనమవడమే కాకుండా ఏకంగా కురు వంశం నాశనమవ్వడానికి కారణమయ్యాడు. ఇలా దుర్యోధనుడే కాదు మన పురాణాలలో అనేక మంది పురాణ పురుషులు అహంకారంతో తమ నాశనాన్ని తామే కోరి తెచ్చుకున్నారు. గర్వమనేది మనిషిని పూర్తిగా నిర్వీర్యుడ్ని చేసి, పతనానికి పునాది వేస్తుంది. కనుక ఎవరైనా ఒకరిపై గెలిచామనే గర్వంతో ఆనందిస్తున్నారంటే వారిలో మానసిక వైకల్యం ఉన్నట్టుగానే భావించాలి. గర్వం నాశనానికి తొలి మెట్టు. మనిషిలో గర్వం అనే అగ్నిని రాజేస్తే, ఆ తర్వాత అది దుఃఖానికి కారణమవుతుంది. మనషి బతికి ఉన్నప్పుడే నేను, నాది అనే భావనలు కలుగుతాయి. మరణించాక శ్మశానంలో రాజైనా,సేవకుడైనా,ధనికుడైనా, పేదవాడైనా ఒక్కటే. అందువల్ల ఈ భూమి మీద బతికున్నంత కాలం ధర్మబద్ధంగా, న్యాయబద్ధంగా జీవించడానికి కృషి చేయాలి. గర్వాన్ని ఎలాంటి పరిస్థితుల్లో దరి చేరనివ్వకుండా సచ్ఛీలతతో తమకున్నదానిలో ఇతరులకు సహాయం చేసేవాడే నిజమైన విజేత అవుతాడన్న వాస్తవాన్ని గుర్తెరగాలి. విధేయత, అణకువ లాంటి లక్షణాలు మనుషులను విజయతీరాలకు తీసుకువెళతాయి. అందువలన జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరినప్పటికీ గర్వం, తలకెక్కించు కోకుంటే అసలైన విజయం సొంతం అవుతుంది. గర్వం లేనివారు ఏ పని మొదలుపెట్టినా ఆ పనిలో తప్పక విజయం సాధిస్తారు. గర్వం లేనప్పుడు దురభిప్రాయం ఉండదు. ఎందుకంటే గర్వం, దురభిప్రాయం రెండూ వేరు వేరు కాదు. మనిషికి ఒకదాని పట్ల గర్వభావన ఉంటే వేరొక దాని పట్ల దురభిప్రాయం, అంటే చిన్న చూపు ఉన్నట్లే. కనుక గర్వం ఒక విధమైన దురభిప్రాయంలో నాటుకుపోయి ఉంటుంది. అహంకారం అనేది ఎక్కడో ఉండదు. అజ్ఞాతంగా మనలోనే ఉంటుంది. ఇది అనేక అనర్థాలకు మూలకారణమవుతుంది. ఉన్న పళంగా ఆకాశానికి ఎత్తేసి, ఆ ఆకాశం నుంచి ఒక్క ఉదుటన పాతాళంలోకి తోసేస్తుంది. అహంకారం ఉన్న వ్యక్తులెవరైనా అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంటారు. – దాసరి దుర్గా ప్రసాద్ -
విషాదం: 'మహాభారత్' భీముడు కన్నుమూత
Mahabharat Bheem Actor Praveen Kumar Sobti Passes Away: సినీ ఇండస్ట్రీలో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రఖ్యాత మహాభారత్ సీరియల్లో భీముడి పాత్ర పోషించిన నటుడు ప్రవీణ్ కుమార్ సోబ్తీ (75) కన్నుమూశారు. ఈ విషయాన్ని ఆయన కుమార్తె నికునికా అధికారికంగా ధృవీకరించారు. గతరాత్రి 9.30నిమిషాలకు హార్ట్ ఎటాక్ కారణంగా ఇంట్లోనే ఆయన తుదిశ్వాస విడిచినట్లు ఆమె పేర్కొంది. కాగా మభాభారత్ సిరీయల్లో భీముడి పాత్రతో ప్రవీణ్‌కుమార్ దేశ వ్యాప్తంగా పాపులర్ అయ్యారు. రెండు దశాబ్దాల పాటు యాభైకి పైగా సిరియల్స్‌తో పాటు పలు సినిమాల్లో నటించి మెప్పించారు. ప్రవీణ్ కుమార్ మృతి పట్ల పలువురు బీటౌన్ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. -
కుడి ఎడమలు వేరు కాదు...
మహాభారతంలోని ఆదిపర్వంలో ఒక కథ ఉంది. ఒకానొకప్పుడు విభావసుడు, సుప్రదీపుడు అనే ఇద్దరు అన్నదమ్ములుండేవారు. చాలా మంచివాళ్ళు. అపార ఐశ్వర్యానికి వారసులు. అకస్మాత్తుగా ఒకరోజు తమ్ముడు వచ్చి ఆస్తిలో తనవాటా పంచివ్వమని అడిగాడు. సర్దిచెప్పి అనునయంగా మాట్లాడి సమస్యను పరిష్కరించగలిగిన అన్న ఆగ్రహోదగ్రుడైనాడు. నన్ను అగౌరవపరిచినందుకు ఏనుగువై అడవులను పట్టుకు తిరుగుపో... అంటూ శపించాడు. తమ్ముడు కూడా ఏం తక్కువ తినలేదు. నువ్వొక తాబేలువయి చెరువుల్లో పడి ఉండమని తిరిగి అన్నను శపించాడు. ఇద్దరి జన్మలు వేరువేరు. రెండూవేర్వేరు జంతువులయినా శత్రుభావనలుండిపోయాయి. తరచూ కలహించుకుంటూండేవి. ఒకసారి గరుత్మంతుడికి ఆకలేసి తండ్రి కశ్యప ప్రజాపతిని అడిగితే... ఆ రెండింటినీ తినెయ్యమన్నాడు. ఇది కథే కావచ్చు... ఇటువంటి కథలను విని పాఠాలు నేర్చుకోకపోతే... మనం నిత్యం చూసే అన్నదమ్ముల గొడవలు ఇలానే ముగుస్తుంటాయి. అందుకే బంధువులతో తగాదాలు శ్రేయస్కరం కాదు. అవి వారిద్దరితో పోవు... కుటుంబాలకు కుటుంబాలు తరాల తరబడి కక్షలు పెంచుకుని అన్నివిధాలా నష్టపోతుంటారు. నలుగురిలో చులకనౌతుంటారు. చిన్నతనంలో నువ్వేం అలవాటు చేసుకుంటావో అదే పెద్దయిన తరువాత కూడా నిలబడిపోతుంది. చిన్నప్పుడు దుర్యోధనుడు పొద్దస్తమానం భీముడితో కలియబడుతుండేవాడు. భీముడిమీద అక్కసు పెంచుకున్నాడు. అదే చిట్టచివరికి కురుక్షేత్ర సంగ్రామం వరకు వెళ్ళింది. చిన్నప్పటి పగ భీముడు దుర్యోధనుడి తొడ విరగ్గొట్టేదాకా వెళ్ళింది. చిన్నప్పుడు కలిసిమెలిసి ఉంటే పెద్దయిన తరువాత కూడా సఖ్యత గా ఉంటారు. సచిన్ టెండూల్కర్ చిన్నతనంలో క్రికెట్ ఆటలో కనబరుస్తున్న నైపుణ్యం చూసి అన్న అజిత్ టెండూల్కర్ క్రికెట్ ఆటను నేర్పించే అచ్రేకర్ దగ్గరకు తీసుకెళ్ళాడు. ఆయన ఒక పరీక్షపెట్టాడు. అచ్రేకర్ పట్ల ఉన్న భయాందోళనలతో ఆ పరీక్ష సచిన్ నెగ్గలేకపోయాడు. శిష్యుడిగా తీసుకోవడానికి ఆయన నిరాకరించాడు. కానీ అన్న వదలకుండా... ‘‘మిమ్మల్ని చూసి భయపడినట్టున్నాడు. నిజానికి బాగా ఆడతాడు. మరొక్క అవకాశం ఇవ్వమని బతిమిలాడుకున్నాడు. మీరు దూరంగా ఉండి పరిశీలించమన్నాడు. ఈసారి గురువు అక్కడ లేడనే ధైర్యం కొద్దీ సచిన్ అద్భుతంగా ఆడాడు. సచిన్‌ను శిష్యుడిగా స్వీకరించడానికి వెంటనే అచ్రేకర్ సమ్మతించాడు. ఇదెలా సాధ్యపడింది...అన్నదమ్ముల సఖ్యత వల్ల. అబ్దుల్ కలాంగారికి మద్రాస్‌లో ఒక ప్రఖ్యాత ఇంజనీరింగ్ కళాశాలలో సీటు వస్తే... ఫీజు కట్టడానికి తండ్రివద్ద అంత డబ్బు లేదు. అప్పటికే పెళ్ళయిపోయిన అతని సోదరి జోహ్రా తన నగలు తాకట్టుపెట్టి డబ్బు సర్దుబాటు చేసింది. ఇదెలా సాధ్యపడింది ... తోడబుట్టినవారి సఖ్యత కారణంగానే కదా ... అందువల్ల పాండవుల్లా, రామలక్ష్మణభరతశత్రుఘ్నుల్లా చిన్నప్పటినుంచి కలిసుండడం అలవాటు కావాలి. పెద్దయ్యాక మారడం అంత తేలిక కాదు. అదే బద్దెనగారు చెప్పేది... ఆస్తులు, అంతస్తులు, హోదాలు, లేదా మాటామాటా పెరిగి వాదులాడుకోవడాలవంటివి మనసులో ఉంచుకుని, పైకి సఖ్యత నటిస్తూ బంధువులను చిన్నచూపు చూడవద్దు. వారిని దూరం చేసుకోవద్దు. ఎక్కడికెళ్ళినా స్నేహితులు, శ్రేయోభిలాషులు దొరుకుతారు... కానీ జన్మతః నీకు భగవంతుడు అనుగ్రహించిన బంధువులు ఈ జన్మకు మళ్ళీ దొరకరు. కుడి చేయి ఎడమ చేయి వేరు కాదు. దేని బలం దానికున్నా.. ఆ రెండూ కలిస్తే బలం ఎన్నో రెట్లు పెరుగుతుంది. చిన్నప్పటినుంచి ఒకరి గురించి మరొకరికి పూర్తి అవగాహన ఉన్న కారణంగా ఒకరి ఎదుగుదలకు మరొకరు సహకరించుకోవాలి. అప్పుడు మీ ఐకమత్యబలం సమాజంలో మరో నలుగురికి కూడా ఉపయోగపడుతుంది. -
హైదరాబాద్‌లో ‘మహావీర్‌కర్ణ’
పాత్రకోసం ప్రాణం పెట్టే నటులు అతికొద్దిమందే ఉంటారు. అందులో ప్రధానంగా తమిళ నటుడు విక్రమ్ ముందు వరుసలో ఉంటాడు. సేతు, శివపుత్రుడు సినిమాల్లో నటనకు ఎన్నో అవార్డులు వచ్చాయి. శంకర్ తీసిన ‘ఐ’ సినిమా కోసం తన శరీరాన్ని హూనం చేసుకున్నాడు. ఇలా పాత్రకు తగ్గట్టుగా మారే విక్రమ్.. కర్ణుడి పాత్రను పోషిస్తూ.. ఓ సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. దాదాపు 300కోట్లతో అత్యంత భారీగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి మహావీర్‌కర్ణ అనే టైటిల్‌ను ఫిక్స్ చేసినట్టు సమాచారం. కర్ణుడి కోణంలోంచి మహాభారత గాథను చెప్పే ఈ చిత్ర షూటింగ్‌ను హైద్రాబాద్‌లో జరగుతోందని సమాచారం. సామి సినిమాతో ఇటీవలే పలకరించిన విక్రమ్.. గౌతమ్ మీనన్‌తో తెరకెక్కించే ‘ధృవనక్షత్రం’, రాజేష్ ఎమ్ సెల్వ డైరెక్షన్లో రాబోతోన్న ‘కదరం కొండన్’ షూటింగ్‌లతో బిజీగా ఉన్నాడు. -
చిక్కుల్లో 1000 కోట్ల ‘మహాభారతం’
మహాభారతగాథని వెండితెరకెక్కించేందుకు చాలా మంది ఫిలిం మేకర్స్ ప్రయత్నాలు చేస్తున్నారు. టాలీవుడ్లో రాజమౌళి, బాలీవుడ్ నుంచి ఆమిర్ ఖాన్, మాలీవుడ్ నుంచి మోహన్‌లాల్ ఇలా చాలా మందే ఈ ప్రయత్నాల్లో ఉన్నారు. అయితే వీటితో అధికారికంగా ప్రకటించిన సినిమా మాత్రం ఒక్క మోహన్‌లాల్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న మహాభారతం మాత్రమే. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ కూడా అటకెక్కినట్టుగా తెలుస్తోంది. ప్రముఖ వ్యాపార వేత్త బీఆర్ శెట్టి 1000 కోట్ల బడ్జెట్‌తో శ్రీకుమార్ దర్శకత్వంలో అంతర్జాతీయ స్థాయిలో ఈ ప్రాజెక్ట్‌ను తెరకెక్కించేందుకు నిర్ణయించారు. ప్రముఖ రచయిత ఎమ్టీ వాసుదేవన్ నాయర్ రచించిన రంధమూలం నవల ఆధారం సినిమాను రూపొందించాలని ప్లాన్ చేశారు. అందుకు కావాల్సిన స్క్రీన్‌ప్లేను కూడా వాసుదేవన్ నాయరే సమకూర్చారు. అయితే నాలుగేళ్లు గడుస్తున్న ఇంత వరకు సినిమా ప్రారంభించకపోవటంపై రచయిత అసహనం వ్యక్తం చేశారు. కాంట్రాక్ట్ కేవలం మూడేళ్లకే చేయించుకున్నారని.. అయినా తాను మరో ఏడాది పాటు ఎక్కువగా ఎదురుచూసినా షూటింగ్ పనులు ఇంకా ప్రారంభించలేదంటూ దర్శక నిర్మాతలపై ఫైర్ అయ్యారు. నాయర్.. తన కథా కథనాలు తిరిగి ఇప్పించాల్సిందిగా కోర్టును ఆశ్రయించనున్నట్టుగా తెలుస్తోంది. -
ఆమిర్ ఖాన్ ‘మహాభారతం’ వాయిదా..?
బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్ మహాభారతాన్ని భారీ బడ్జెట్‌తో 5 భాగాలుగా తెరకెక్కించనున్నట్టు గతంలోనే ప్రకటించారు. ప్రస్తుతం ఈ సినిమా వల్ల కలిగే లాభ, నష్టాలను అంచనా వేస్తున్నాడు ఆమిర్. అంతేకాదు అసలు సినిమాను తీయాలా, వద్దా అన్న సందిగ్ధంలో పడ్డాడన్న టాక్ బాలీవుడ్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. ఈ సినిమాను తెరకెక్కించాలంటే ఎంతో సృజనాత్మకత, ప్రశాంతమైన వాతావరణం కావాలని భావిస్తున్నాడు. మహాభారతాన్ని తీయాలన్న తన ఆలోచనలను ఆమిర్ పున:పరిశీలిస్తున్నట్లుగా బాలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. చారిత్రాత్మక కథలను, పురాణగాథలను తెరకెక్కించాలంటే ఎంతో శ్రమతో కూడుకున్నది. పద్మావత్ చిత్రీకరణ, విడుదల విషయంలో కలిగిన ఇబ్బందుకుల కూడా ఆమిర్ ను ఆలోచనలో పడేశాయి. మహాభారతం కూడా వివాదాల్లో చిక్కుకునే అవకాశం ఉందన్న అనుమానం కూడా ఆమిర్ పునరాలోచనకు కారణంగా తెలుస్తోంది. ప్రస్తుతానికి ఆమిర్ టీం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన లేకపోయినా.. మహాభారతం ప్రాజెక్ట్ ను ఆమిర్ వాయిదా వేసే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయన్న వార్త ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. -
భాగవతం
ఋషుల ప్రశ్నలతో భాగవతం ప్రథమ స్కంధం ప్రారంభమవుతుంది. తరువాత వివిధ అవతారాలకు సంబంధించిన వివరణ వస్తుంది. అటు పిమ్మట భాగవతం ఎలా మొదలైందో వివరిస్తుంది. మహాభారతం రచించి, పురాణాలు రాసిన వ్యాసభగవానునికి మనశ్శాంతి లేకుండా పోయింది. అప్పుడు వ్యాసభగవానుని ఆధ్యాత్మిక గురువు అయిన నారద మహర్షి విచ్చేసి భాగవతం రాయమని ఉపదేశించి, అనేక విషయాలను బోధించి వెళ్లిన కథ ప్రథమ స్కంధం చెబుతుంది. తన మనస్సులో కలిగిన ఆందోళనకు ఉపశమనంగా వ్యాసుల వారు భాగవత రచన ఆరంభించిన విధానం, ఆ తరువాత భాగవతాన్ని ఏ విధంగా ప్రాచుర్యంలోకి తీసుకువచ్చారో ఈ స్కంధం వివరిస్తుంది. భీష్ముని నిర్యాణం, శ్రీకృష్ణుడు ద్వారకకు పయనం కావడం, ద్వారకలో ప్రవేశించడం, పరీక్షిత్తు జననం, ధృతరాష్ట్రుడు అడవులకు వెళ్లడం, శ్రీకృష్ణనిర్యాణం, పాండవులు రాజ్యాన్ని వదిలి వెళ్లడం, పరీక్షిత్తు – కలి సంవాదం, కలిపురుషుడిని పరీక్షిత్తు దండించడం, దయ చూపడం, పరీక్షిత్తుకి బ్రాహ్మణ బాలుడు శాపం ఇవ్వడం, శుకమహర్షి ఆగమనం, పరీక్షిత్తు ప్రశ్నలు అడగడం... ప్రథమ స్కంధం వివరిస్తుంది. – జయ -
మహాభారతం మరియు గాన్ విత్ ద విండ్
మహాభారతంలోలానే ఒక కులీనవర్గం, దాని కట్టుబాట్లు, అభిరుచులు, దర్పం, కాల్పనిక ఊహా ప్రపంచం, వీరత్వంతో సహా అన్నీ యుద్ధమనే ఉగ్రతాపానికి మంచులా కరిగిపోయి, సాధారణ ప్రవాహంలో అనామకంగా కలిసిపోవడాన్ని ఈ నవల చెబుతుంది. ఈమధ్య పశ్చిమ బెంగాల్‌లోని సిలిగురి నుంచి హిమాలయ రాష్ట్రమైన సిక్కిం వెడుతున్నాం. ఘాట్ రోడ్డు మీద బస్సు ఎక్కుతూ దిగుతూ, వంపులు తిరుగుతూ, పచ్చని లోయల వెంబడే ప్రయాణిస్తోంది. ఆ లోయలను ఒరుసుకుంటూ తీస్తానది. ప్రకృతి అందంగానే కాదు, నిశ్చలచిత్రంలానూ, ప్రశాంతంగానూ ఉంది. అంతలో హిమాలయాలు తీవ్ర భూకంప స్థావరాలన్న సంగతీ, ఇటీవల నేపాల్‌లో సంభవించిన భారీ భూకంపం గుర్తొచ్చాయి. ‘‘ఇప్పుడు ఈ క్షణంలో కూడా భూకంపం రావచ్చు’’ ననిపించింది. ‘‘భూమిలో ఉన్న రాతి పలకల్లో విపరీతమైన రాపిడీ, చలనమూ నిరంతరాయంగా సంభవిస్తూ ఉంటాయి. అవి కుదుటపడటానికి నిర్విరామంగా ప్రయత్నిస్తూ ఉంటాయి. ఒక దశలో ఆ ప్రయత్నం విస్ఫోటస్థితికి చేరి భూకంప రూపం తీసుకుంటుంది. నిజమే, ప్రకృతి సమస్తం ఒక సమస్థితిని తెచ్చుకునే ప్రయత్నం నిర్విరామంగా చేస్తూనే ఉంటుంది. అది తుపానులు, వరదలు వగైరా ఇతర ఉత్పాతాలుగా కూడా బయటపడుతూ ఉంటుంది. అలాగే, మానవ సమాజాలు కూడా సమస్థితిని తెచ్చుకోడానికి నిరంతరం ప్రయత్నిస్తూ ఉంటాయా? యుద్ధాలు అందుకేనా?! యుద్ధాలను ఎవరూ కోరుకోరు. కానీ వాటిని ప్రాకృతిక న్యాయంతో ముడిపెట్టి చూసినప్పుడు ఆపడమూ సాధ్యమా అనిపిస్తుంది. యుద్ధం అపార విధ్వంసాన్ని, మానవ సంబంధాల క్షీణతను, విలువల పతనాన్ని తెస్తుంది. కానీ విచిత్రంగా సరికొత్త నిర్మాణానికీ, వినూత్న మానవ సంబంధాలకూ, విలువలకూ దారితీస్తుంది. జవహర్లాల్ నెహ్రూ వంటి శాంతికాముకుడు కూడా, ఈ దేశ ప్రజల పెనునిద్దర వదిలించి జాతిని ప్రక్షాళన చేసే యుద్ధమొస్తే బాగుండునని కోరుకున్న సంగతి (డిస్కవరీ ఆఫ్ ఇండియా) తెలిస్తే ఆశ్చర్యంగా ఉంటుంది. దేశం మొత్తాన్ని కుదిపేసే ఒక మహాయుద్ధం మనదేశంలో సంభవించి ఎంతకాలమైంది?! ‘వీరో’చితంగా స్వాతంత్య్రం తేవాలనుకున్న సుభాష్ చంద్రబోస్ లాంటి నాయకుల పట్ల ఇప్పటికీ జనసామాన్యంలో గూడుకట్టుకున్న ఆరాధన ఆనవాళ్లు కనిపించినప్పుడు ఒక వీరుడి కోసం, ఒక మహాయుద్ధం కోసం ఈ జాతి ఎంతగా మొహం వాచిందో అనిపిస్తుంది. కళింగయుద్ధం లాంటి పెద్ద పెద్ద యుద్ధాలే జరిగి, జనజీవితాన్ని అల్లకల్లోలం చేసి ఉండవచ్చు. వాటిలో గొప్ప ఇతిహాసంగా పరిణమించిన యుద్ధాలున్నాయా? ఈ స్థితిలో ఈ క్షణాన నా చూపుల్ని ఆక్రమించుకుంటున్న మహాయుద్ధ ఇతిహాసం మహాభారతం. కురుక్షేత్ర యుద్ధం ఇతిహాసం వర్ణించిన స్థాయిలో గొప్ప యుద్ధం కాకపోవచ్చు. అదొక కీలకమైన యుద్ధం. మౌలికమైన అనేక రాజకీయ, సామాజిక, మానసిక పరివర్తనలతో జనచేతనపై గాఢమైన ముద్రవేసిన యుద్ధం. ఆ యుద్ధానికి ముందూ, తర్వాతా ఉన్న సమాజాలు ఒకలాంటివి కావు. ఏకశరీరిగా ఉండే నాటి గణసమాజంలో అంతవరకూ అంతర్యుద్ధాలు లేవు. అది ఊహించడానికే వీలుకాని విపరిణామం. అర్జునుడు ఎదుర్కొన్న విషాదం అదే. దాంతో కృష్ణుడు అతణ్ణి యుద్ధోన్ముఖుణ్ని చేయడానికి చాలా కౌన్సెలింగ్ జరపాల్సివచ్చింది. అదే భగవద్గీత అయింది. మహాభారతం మొత్తం యుద్ధాలు తెచ్చిపెట్టే జనక్షయం గురించీ, ఆచారాలు, కట్టుబాట్లు సడలిపోవడం గురించీ చెబుతుంది. ‘‘(యుద్ధం వల్ల) కులక్షయం అవుతుంది. సనాతన కులధర్మాలు నశిస్తాయి. అధర్మం వృద్ధి అవుతుంది. స్త్రీలు చెడిపోతారు. వర్ణసంకరం అవుతుంది’’ అని అర్జునుడు అంటాడు. అప్పుడు కృష్ణుడు, ‘‘ఈ విషమఘట్టంలో ఆర్యులకు తగని, అపకీర్తికరమైన ఇలాంటి మాటలు ఎలా మాట్లాడుతున్నా’’ వంటూ మందలిస్తాడు. మహాభారతాన్ని చదువుతూ, మార్గరెట్ మిచెల్ రాసిన గాన్ విత్ ద విండ్ చదవడం యుద్ధం గురించిన గొప్ప ఎరుక. యుద్ధం అన్ని రకాల మానవ సంబంధాలలో తీసుకువచ్చే మార్పుల గురించి మహాభారతం చెప్పిందే, మరింత బాగా అర్థమయ్యే భాషలో గాన్ విత్ ద విండ్ చెబుతుంది. అమెరికా అంతర్యుద్ధం (1861-65), యుద్ధానంతర పునర్నిర్మాణం (1865-77) దాని నేపథ్యం. భారతంలోలానే ఒక కులీనవర్గం, దాని కట్టుబాట్లు, అభిరుచులు, దర్పం, కాల్పనిక ఊహా ప్రపంచం, వీరత్వంతో సహా అన్నీ యుద్ధమనే ఉగ్రతాపానికి మంచులా కరిగిపోయి, సాధారణ ప్రవాహంలో అనామకంగా కలిసిపోవడాన్ని ఈ నవల చెబుతుంది. యుద్ధం తెచ్చిపెట్టే మానసిక, భౌతికకల్లోలాన్ని అనితరసాధ్యంగా చిత్రించిన ఈ రచన వెయ్యి పుటల విస్తృతిలోనూ, వస్తువులోనూ కూడా ఇతిహాసస్థాయిని అందుకుంది. సువిశాలమైన పత్తి వ్యవసాయ క్షేత్రాలతో బానిసల శ్రమమీద కాటన్ సామ్రాజ్యాన్ని నిర్మించుకుంటూ వచ్చిన అమెరికాలోని ఏడు దక్షిణాది రాష్ట్రాలు తమ భద్రస్థితిని, తమ పరిమిత ప్రపంచాన్ని కాపాడు కోవాలనుకుంటాయి. యూనియన్‌లో చేరడానికి నిరాకరించి కాన్ఫెడరేట్గా ఏర్పడి యుద్ధానికి దిగుతాయి. విందు వినోదాలతోనూ, కాల్పనిక ప్రణయావేశంలోనూ, వీరత్వపు ఊహల్లోనూ గడిపే యువతకు తమది ఓడిపోయే యుద్ధమన్న నిజం తెలియదు. కాలం చెల్లిన తమ వ్యవస్థ కడతేరక తప్పదన్న తెలివిడి వారికి లేదు. ఈ నవలలోని ఒక ప్రధానపాత్ర రెట్ బట్లర్ మాటల్లో చెప్పాలంటే, ఉత్తరాదిన ఉన్నట్టు దక్షిణాదిన ఒక్క తుపాకుల ఫ్యాక్టరీ కానీ, ఇనప కర్మాగారం కానీ, వులెన్ మిల్లు కానీ, యుద్ధనౌక కానీ లేవు. ఇక్కడి జనానికి పత్తి సాగు, బానిసల శ్రమ, అలవిమాలిన పొగరు తప్ప ప్రపంచానుభవం లేదు. వీళ్ళను మట్టి కరిపించడానికి యూనియన్ సైన్యాలకు ఒక్క నెల చాలు. అదే జరుగుతుంది. దశాబ్దాలపాటు వీరు నిర్మించుకున్న కాల్పనిక భద్రప్రపంచం కొన్ని నెలల్లోనే కుప్పకూలిపోతుంది. సామాజిక సంబంధాలు, విలువలు తారుమారు కావడమే కాదు; అన్న పుష్కలత్వం నుంచి ఆకలి ఆర్తనాదాలకు, పిడికెడు ఆహారం కోసం హత్యలు చేయడానికి తెగబడే స్థితికి చేరుకుంటారు. యుద్ధంలో బతికి బట్టకట్టిన వాళ్లు సాధారణ ఉపాధి అవకాశాలను వెతుక్కుంటారు. అంతవరకూ ప్రేమ గురించీ, పెళ్లి గురించీ కమ్మని కలలు కంటూ వచ్చిన ఆడపిల్లలు ఒక్కసారిగా కఠోర వాస్తవిక ప్రపంచంలోకి అడుగుపెట్టి ఎవరో ఒకరు కట్టుకుంటే చాలనుకుంటారు. స్కార్లెట్ ఒహారా, రెట్ బట్లర్, మెలనీ.. ఈ మూడూ గుర్తుండిపోయే పాత్రలు. స్కార్లెట్ ముఖంగా రచయిత్రి కథ చెబుతుంది. కలల ప్రపంచం నుంచి కఠోర ప్రపంచానికి మారే అన్ని దశలనూ, అనుభవాలనూ చవిచూసిన స్కార్లెట్ అచంచలమైన జీవితేచ్ఛకు ప్రతినిధి. గొప్ప కాలికస్పృహతో యుద్ధపరిస్థితులను అనుకూలంగా మలచుకుంటూ సంపదకు పడగెత్తి కొత్త నీటిలో చేపలా కలిసిపోయిన పాత్ర రెట్ బట్లర్. ఎటువంటి కల్లోలంలోనైనా మానవీయతను, నిష్కల్మషతను, ప్రేమించే గుణాన్ని నిలుపుకున్న గొప్ప పాత్ర మెలనీ. భౌతికంగా చూస్తే, ఈ నవలకు ప్రధాన రంగస్థలం జార్జియా రాష్ట్రంలోని అట్లాంటా. యుద్ధానికి ముందు ఒక గ్రామంగా ఉన్న అట్లాంటా, యుద్ధసమయంలోనూ, ఆ తర్వాతా ఒక మహానగరస్థాయికి ఎలా చేరుకుందో; వెనకటి కులీన, భద్రప్రపంచం అక్కడి రకరకాల జనసందోహంలో ఎలా నామరూపాలు లేకుండా కలసిపోయిందో రచయిత్రి అద్భుతంగా చిత్రిస్తుంది. మహాభారతం చిత్రించింది కూడా అదే! మెలనీ భర్త ఆష్లే మాటల్లో అర్జునుడి విషాదం తాలూకు ప్రతిధ్వనులే వినిపిస్తాయి. అతను కూడా అందరిలానే యుద్ధానికి వెడతాడు. యుద్ధంలో మనం గెలిచినా, ఓడినా చివరికి మిగిలేది ఓటమే నంటాడు. ‘‘గెలిస్తే మన కాటన్ సామ్రాజ్యాన్ని మరింత విస్తరించుకుని, ఉత్తరాది వారిలో మనం ఏవగించుకునే వ్యాపార సంస్కృతిలోకి దిగజారిపోతాం. ఓడితే భవిష్యత్తులో ఎందులోనూ ఇమడని వ్యర్థజీవులుగా మిగిలిపోతాం. యుద్ధఫలితం ఎలా ఉన్నా మన పాతకాలాన్నీ, పాతప్రపంచాన్నీ కోల్పోతాం’’ అంటాడు. అమెరికా అంతర్యుద్ధ కథనంలో మన మహాభారత ప్రతిబింబాన్ని చూడడం ఎంత విచిత్రమైన అనుభవం! -భాస్కరం కల్లూరి 9703445985 -
మహాభారతంలో కృష్ణుడిగా యంగ్‌టైగర్
-
టీవీక్షణం: భక్తి రసాత్మకం... ఈ ధారావాహికం!
భక్తి సీరియళ్లకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారని రామాయణం, మహాభారతం, శ్రీకృష్ణ వంటి సీరియల్స్ నిరూపించాయి. యేళ్లపాటు వాటిని ఆదరించి, వీక్షించి తరించారు తెలుగు ప్రేక్షకులు. వాటి సరసన మరోటి చేరింది. అదే... హరహర మహాదేవ. లయకారుడైన పరమశివుడి గాథ ఇది. లైఫ్ ఓకే చానెల్లో ‘దేవోంకే దేవ్ మహాదేవ్’ పేరుతో ప్రసారమవుతోన్న ఈ సీరియల్‌ను ‘హరహర మహాదేవ’గా తెలుగు ప్రేక్షకుల ముందుకు తెచ్చారు మాటీవీ వారు. శివుడిగా మోహిత్ రైనా అద్భుతమైన అభినయం అందరినీ కట్టిపడేస్తోంది. సాక్షాత్తూ పరమ శివుడినే చూస్తున్నట్టుగా ీఫీలయ్యి శివనామ స్మరణలో తరిస్తున్నారు జనం. పార్వతిగా సోనారిక భదోరియా కూడా చూపు తిప్పుకోనివ్వకుండా చేస్తోంది. అందుకే ఈ సీరియల్ హిందీతో పాటు తెలుగులో కూడా విజయవంతంగా సాగిపోతోంది. ఇతర భక్తి సీరియళ్లను తన టీఆర్పీతో అధిగమిస్తోంది. అయినా మహాదేవుణ్నే తీసుకొచ్చి ముంగిట నిలుపుతామంటే ఎవరు మాత్రం కాదంటారు! ఈశ్వరుడి లీలలకు అందమైన చిత్ర రూపమిచ్చి కళ్లకు కడతామంటే ఎవరు చూడనంటారు! మళ్లీ ఆడేసుకుంటారట! డ్యాన్స్‌షోలకు విపరీతంగా క్రేజ్ పెరిగిపోయింది. చిన్నపిల్లల దగ్గర్నుంచి పెద్దవాళ్ల వరకూ వాటిని చూసి ఎంజాయ్ చేస్తున్నారు. దాంతో అన్ని చానెళ్లవారూ అటువంటి షోలు ప్రదర్శించేందుకు పోటీ పడుతున్నారు. వాటిలో ఒకటి... ‘ఆట’. ఓంకార్ నిర్వహించే ఈ డ్యాన్స్షో మాంచి సక్సెస్ అయ్యింది. తీవ్ర విమర్శలు ఎదురైనా... షో మాత్రం ఆగకుండా సాగుతోంది. త్వరలోనే మరో సిరీస్ మొదలు పెట్టడానికి ప్లాన్ చేస్తున్నాడు ఓంకార్. వేసవి సెలవుల్లో మొదలుపెడితే అందరూ బాగా ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాడట. సుందరం మాస్టారితో పాటు, కొరియోగ్రాఫర్ ప్రేమ్క్ష్రిత్, నటి చార్మిలను న్యాయ నిర్ణేతలుగా తీసుకురావాలని ప్లాన్లు వేస్తున్నాడట. పైగా... ఈసారి కాన్సెప్ట్ కొత్తగా ఉంటుందట. కొత్తదనం సంగతేమో గానీ మెలోడ్రామాతో కృత్రిమంగా అనిపిస్తుందని ఈ షో మీద సెటైర్లు వేస్తుంటారంతా. ఈసారైనా ఓంకార్ షో స్టయిల్ మార్చి, ఈ సెటైర్లకు సెలవిస్తాడేమో చూడాలి! ‘నాన్న’ రెండోసారీ నచ్చాడు! హిందీ చానెళ్లలో ప్రతి సీరియల్ ఎపిసోడ్ రోజుకి రెండుమూడుసార్లు వస్తుంది. దాంతో ఒకసారి మిస్ అయినా మరోసారి చూడవచ్చు. కానీ మన తెలుగులో ఆ అవకాశం లేదు. ఒక్కసారి మిస్సయ్యామా... ఇక అంతే సంగతులు! ఎపిసోడే రెండోసారి చూడలేం అని ఫీలయ్యేవాళ్లకు ఏకంగా సీరియల్‌నే రెండోసారి ప్రసారం చేస్తే ఎలా ఉంటుంది? మొదట చూడనివాళ్లు, కొన్ని ఎపిసోడ్లు మిస్ అయినవాళ్లు, చూసి కూడా బాగా నచ్చి మరోసారి చూడాలనుకునేవాళ్లందరికీ అది శుభవార్తే కదా! అందుకే ‘నాన్న’ సీరియల్ రెండోసారి కూడా సక్సెస్‌ఫుల్‌గా సాగిపోతోంది. కొత్తగా పెళ్లయిన ఓ యువకుడి దగ్గరకు నేను నీ కొడుకునంటూ ఓ పిల్లాడు వస్తే... ఆ యువకుడి భార్య మనసులో, వారి కుటుంబంలో చెలరేగే అలజడి ఎలా ఉంటుంది? వారి జీవితాలు ఎలాంటి మలుపు తిరుగుతాయి? అసలా పిల్లాడు ఎవరు? ఎందుకొచ్చాడు? ఆద్యంతం సస్పెన్స్‌తో సాగే ఈ సీరియల్ అప్పట్లో జెమినీ చానెల్లో ప్రసారమై నంది అవార్డును అందుకుంది. ఇప్పుడు మాటీవీలో మరోసారి ప్రసారమవుతూ ప్రేక్షకులను టెలివిజన్ సెట్లకు కట్టిపడేస్తోంది! -
టీవీక్షణం: చూస్తే భారతమే చూడాలి!
ఒకప్పుడు ఆదివారం వస్తే చాలు... ఉదయాన్నే ఇల్లాళ్లు హడావుడిగా వంటలు పూర్తి చేసేసేవాళ్లు. బడికెళ్లే రోజుల్లో బద్దకంగా ఒళ్లు విరుచుకునే పిల్లలు కూడా పొద్దున్నే లేచి స్నానాలు చేసి, టిఫిన్లు ముగించేవాళ్లు. అందరూ అన్నీ చక్కబెట్టేసుకుని టీవీ సెట్ల ముందు తిష్ట వేసేసేవారు. కాసేపటికి తెర మీద ప్రత్యక్షమయ్యేది... మహాభారత్. అంతే, సూది మొన పడినా వినిపించేంత నిశ్శబ్దం. అందరి కళ్లూ తెరమీద అతుక్కుపోయేవి. అందరి మనసులూ భక్తి పారవశ్యంతో మునిగిపోయేవి. అది కేవలం సీరియల్ కాదు వారికి. సాక్షాత్తూ మహాభారత కథకు తమ ఇల్లే వేదిక అయ్యిందన్నంత తన్మయత్వం వారిలో. రెండేళ్ల పాటు అంద రూ తమ ఆదివారాలను భారతానికే అంకితం చేసేశారు. మళ్లీ పదమూడేళ్ల తర్వాత అదే పరిస్థితి ఏర్పడింది. ఈసారి స్టార్ ప్లస్ చానల్ మహాభారతాన్ని తీసుకొచ్చింది. ఆదివారానికి బదులు ప్రతిరోజూ రాత్రి ఎనిమిదిన్నరకు ప్రతి ఇంటా కృష్ణలీలన్ని, పాండవుల వీరోచిత గాథల్ని చూపిస్తోంది. మరోసారి ఆ అతిగొప్ప ఇతిహాసాన్ని కళ్లకు కడుతోంది. అప్పటికీ ఇప్పటికీ... నటులు మారారు. తీసే విధానం మారింది. కెమెరా టెక్నిక్స్ వచ్చి చేరాయి. గ్రాఫిక్స్ పెద్ద పీట వేస్తున్నాయి. మారనిది ఒక్కటే... ప్రేక్షకాదరణ. దాన్ని ఆదరణ అనే కంటే, భక్తి భావన అనడం బెటరేమో. ఆ భావనే ఇప్పటికీ భారతాన్ని ఆస్వాదించేలా చేస్తోంది. మరో పాతికేళ్ల తర్వాత ప్రసారం చేసినా, ప్రేక్షకులను టీవీల ముందు కూర్చోబెట్టి తీరుతుంది!