బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్ మహాభారతాన్ని భారీ బడ్జెట్‌తో 5 భాగాలుగా తెరకెక్కించనున్నట్టు గతంలోనే ప్రకటించారు. ప్రస్తుతం ఈ సినిమా వల్ల కలిగే లాభ, నష్టాలను అంచనా వేస్తున్నాడు ఆమిర్. అంతేకాదు అసలు సినిమాను తీయాలా, వద్దా అన్న సందిగ్ధంలో పడ్డాడన్న టాక్ బాలీవుడ్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. ఈ సినిమాను తెరకెక్కించాలంటే ఎంతో సృజనాత్మకత, ప్రశాంతమైన వాతావరణం కావాలని భావిస్తున్నాడు.
మహాభారతాన్ని తీయాలన్న తన ఆలోచనలను ఆమిర్ పున:పరిశీలిస్తున్నట్లుగా బాలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. చారిత్రాత్మక కథలను, పురాణగాథలను తెరకెక్కించాలంటే ఎంతో శ్రమతో కూడుకున్నది. పద్మావత్ చిత్రీకరణ, విడుదల విషయంలో కలిగిన ఇబ్బందుకుల కూడా ఆమిర్ ను ఆలోచనలో పడేశాయి. మహాభారతం కూడా వివాదాల్లో చిక్కుకునే అవకాశం ఉందన్న అనుమానం కూడా ఆమిర్ పునరాలోచనకు కారణంగా తెలుస్తోంది. ప్రస్తుతానికి ఆమిర్ టీం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన లేకపోయినా.. మహాభారతం ప్రాజెక్ట్ ను ఆమిర్ వాయిదా వేసే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయన్న వార్త ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
Comments
Please login to add a commentAdd a comment