post poned
-
మిస్సవుతున్నందుకు బాధగా ఉంది.. సుధీర్ బాబు ట్వీట్!
టాలీవుడ్ యంగ్ హీరో సుధీర్‌బాబు, మాళవిక శర్మ జంటగా నటించిన తాజా చిత్రం హరోం హర. ఈ చిత్రాన్ని జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వంలో తెరకెక్కించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుదలకు సిద్ధమైన సంగతి తెలిసిందే. ఈ మూవీని మే 31న రిలీజ్ చేస్తున్నట్లు ఇప్పటికే అనౌన్స్మెంట్ చేశారు. సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేయాలని భావించారు.కానీ ఊహించని విధంగా సినిమాను వాయిదా వేస్తున్నట్లు సుధీర్ బాబు ట్వీట్(ఎక్స్)లో పోస్ట్ చేశారు. కొన్ని కారణాల వల్ల హరోం హర మూవీని వాయిదా వేస్తున్నట్లు రాసుకొచ్చారు. సినిమా వాయిదా వేస్తున్నందుకు బాధగా ఉందన్నారు. స్పెషల్ డేట్ మిస్ అవుతున్నానని సుధీర్ బాబు ట్విటర్ ద్వారా వెల్లడించారు.సుధీర్‌బాబు తన ట్విటర్లో రాస్తూ..' వివిధ కారణాల వల్ల హరోం హర సినిమాను వాయిదా వేస్తున్నాం. వచ్చేనెల జూన్ 14న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేస్తాం. మొదట అనుకున్న ప్రకారం కృష్ణ గారి బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేయాలనుకున్నా. కానీ మిస్ అయినందుకు బాధగా ఉంది. అయినప్పటికీ జూన్ ఇప్పటికీ నా లక్కీ నెల. ఈ సమయంలోనే ప్రేమకథా చిత్రం, సమ్మోహనం చిత్రాలు విడుదలయ్యాయి. అలాగే హరోం హర కూడా మీ అంచనాలకు తగ్గట్టుగానే ఉంటుంది.' అని పోస్ట్ చేశారు. 1989 నాటి చిత్తూరు జిల్లా కుప్పం నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించారు. For various reasons, #HaromHara will now be releasing in theaters worldwide on 14th June. Although I feel sad for missing the release on the occasion of Krishna gari birthday, nevertheless June is still my lucky month. PKC & Sammohanam were both released during this time😎 I… pic.twitter.com/NZvcKA2Fdu— Sudheer Babu (@isudheerbabu) May 21, 2024 -
భారత ప్లేయర్‌కు కరోనా.. రెండో టీ20 వాయిదా!
-
దేశవ్యాప్తంగా ఉప ఎన్నికలు వాయిదా
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలోని పలు రాష్ట్రాల్లో కరోనా వైరస్ విజృంభిస్తోంది. కరోనా కేసుల సంఖ్యల రోజురోజుకు పెరుగుతోంది. దీంతో దేశవ్యాప్తంగా పలు స్థానాల్లో జరగాల్సిన లోక్‌సభ, అసెంబ్లీ ఉప ఎన్నికలను కేంద్ర ఎన్నికల సంఘం వాయిదా వేసింది. కరోనా వైరస్, వరదల నేపథ్యంలో అసెంబ్లీ స్థానాల్లో జరగాల్సిన ఉప ఎన్నికలు వాయిదా వేసినట్లు గురువారం ఎన్నికల సంఘం ప్రకటించింది. దీంతో ఆరు రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న ఎనిమిది అసెంబ్లీ స్థానాల్లో ఉపఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం ఈ ఉప ఎన్నికలు సెప్టెంబర్ 7 వరకు నిర్వహించాల్సింది. తాజాగా ఎన్నికల సంఘం ప్రకటనతో అస్సాం, కేరళ, మధ్యప్రదేశ్, నాగాలాండ్, ఉత్తర ప్రదేశ్, జార్ఖండ్ రాష్ట్రాల్లో జరగాల్సిన ఉప ఎన్నికలు వాయిదా పడ్డాయి. -
దోస్త్–2020 సేవలు నిలుపుదల
సాక్షి, హైదరాబాద్: డిగ్రీ ఆన్లైన్ ప్రవేశాల ప్రక్రియ నిలిచిపోయింది. కరోనా తీవ్రం కావడంతో యంత్రాంగం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. వాస్తవానికి దోస్త్ కన్వీనర్ ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఈనెల 1 నుంచి 14వ తేదీ వరకు రిజిస్ట్రేషన్ల ప్రక్రియ, 6 నుంచి 15వ తేదీ వరకు వెబ్ ఆప్షన్లు, 22న సీట్ అలాట్మెంట్ నిర్వహించాలి. కానీ కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఈ ప్రక్రియను వాయిదా వేసినట్లు దోస్త్ కన్వీనర్ లింబాద్రి తెలిపారు. తదుపరి తేదీలను త్వరలో ప్రకటించనున్నట్లు బుధవారం ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. -
కరోనా: వాయిదా పడిన ‘అర్జున’ విడుదల
డాక్టర్ రాజశేఖర్ ద్విపాత్రాభినయం చేసిన అర్జున చిత్రాన్నివాయిదా వేస్తున్నట్లు చిత్ర బృందం గురువారం ప్రకటించింది. సినిమాను ముందుగా ఈ నెల 6న విడుదల చేయాలని నిర్ణయించారు. కానీ ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న కారణంగా 13న విడుదల చేయనున్నట్లు నిర్మాతలు నట్టి కరుణ, నట్టి క్రాంతి వెల్లడించారు. కరోనా ప్రభావం కారణంగానే చిత్రం విడుదలను వారం రోజుల పాటు వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నామని వారు తెలిపారు. రాజశేఖర్ సరసన అందాల భామ మరియం జకారియా కథానాయికగా నటించిన ఈ చిత్రానికి కన్మణి దర్శకత్వం వహించారు. నట్టిస్ ఎంటర్ టైన్మెంట్స్, క్విటీ ఎంటర్ టైన్మెంట్స్ పతాకాలపై రూపొందుతోంది. ఇటీవల విడుదలైన ఈ చిత్రం ట్రైలర్స్ ట్రెండింగ్ లో ఉన్నాయన్నారు. ఇందులో రాజశేఖర్ తండ్రీ కొడుకులుగా అద్భుతమైన నటనను కనబరిచారని అన్నారు. సమకాలీన రాజకీయ నేపథ్య పరిస్థితులకు అద్దంపట్టే చిత్రమని, యదార్థ సంఘటనలను ప్రేరణగా తీసుకుని సహజత్వానికి దగ్గరగా దీనిని మలచడం జరిగిందని చెప్పారు. కాస్త వయసు మళ్ళిన సూర్యనారాయణ అనే రైతు పాత్రలోనూ... అలాగే ఆయన తనయుడిగా అర్జున పాత్రలోనూ రాజశేఖర్ ఒదిగిపోయారని అన్నారు. తండ్రీకొడుకుల మధ్యన వచ్చే భావోద్వేగ సన్నివేశాలు సినిమాకు మరో హైలైట్ గా నిలుస్తాయి అని అన్నారు. -
ఉగ్రవాది కరీమ్ తుండా కేసులో తుది తీర్పు వాయిదా
హైదరాబాద్: ఉగ్రవాది అబ్దుల్ కరీమ్ తుండా కేసులో తుది తీర్పు వాయిదా పడింది. తుండా కేసును మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి కోర్టు ఫిబ్రవరి 18కి వాయిదా వేసింది. ఇప్పటికే యూపీలోని ఘజియాబాద్ జైల్లో ఉన్న కరీమ్ తుండాను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నాంపల్లి కోర్టు న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టారు. అయితే విచారణ అనంతరం తుండా కేసులో తుది తీర్పును కోర్టు ఫిబ్రవరి 18కి వాయిదా వేసింది. కాగా, దేశ వ్యాప్తంగా పలు బాంబు దాడుల్లో తుండా నిందితుడిగా ఉన్నాడు. ఆయా దాడుల తర్వాత కొన్ని రోజుల పాటు పాకిస్తాన్లో తలదాచుకున్నాడు. ఢిల్లీ పోలీసులు రెండేళ్ల క్రితం నేపాల్ సరిహద్దుల్లో కరీంను పట్టుకున్నారు. ఇతన్ని ఏడేళ్ల కిందట నేపాల్ సరిహద్దుల్లో కరీంను పట్టుకున్నారు ఢిల్లీ పోలీసులు. తాంజిమ్ ఇస్లామిక్ ముజాహిద్దీన్ అనే ఉగ్రవాద సంస్థలో తుండా కీలక పాత్ర వహించాడు. ఇతను 1990లో యువకులను ఉగ్రవాదంపై మళ్లించాడు. సిట్ పిటీ వారెంట్‌పై హైదరాబాకు తీసుకొచ్చింది. హైదరాబాద్‌లో జరిగిన పలు పేలుళ్ల కేసులలో తుండా హస్తం ఉంది. తుండాపై ఆంసాట్, నకిలీ పాస్ పోర్టుల కేసులున్నాయి. పాకిస్తాన్ బంగ్లాదేశ యువకుల్ని ఉగ్రవాదంపై ఆకర్షితుల్ని చేసి శిక్షణ కూడా ఇచ్చాడు కరీమ్ తుండా. 1998లో గణేష్ ఉత్సవాల్లో బాంబ్ బ్లాస్ట్‌కు ప్లాన్ చేశాడన్న అభివయోగాలు కూడా ఇతనిపై ఉన్నాయి. -
ఆస్ట్రేలియా ప్రధాని రాక వాయిదా
మెల్బోర్న్: ఆస్ట్రేలియాలో చెలరేగిన కార్చిచ్చు నేపథ్యంలో ఆ దేశ ప్రధాని స్కాట్ మారిసన్ భారత్ పర్యటనను వాయిదా వేస్తున్నట్లు శనివారం ప్రకటించారు. జనవరి 13న నాలుగు రోజుల పర్యటనలో భాగంగా భారత్‌కు రావాల్సి ఉంది. భారత ప్రధాని మోదీతో ద్వైపాక్షిక చర్చలు జరపాల్సి ఉంది. తాజా పరిణామాల నేపథ్యంలో పర్యటనను వాయిదా వేస్తున్నామని, రానున్న నెలల్లో ఇరు దేశాలకు కుదిరే మరో సమయంలో భేటీ జరుగుందని ట్వీట్ చేశారు. భారత్‌తో భేటీ అనంతరం ఆయన జపాన్ పర్యటనకు కూడా వెళ్లాల్సి ఉండగా, ఆ పర్యటనను కూడా రద్దు చేసుకున్నారు. తన పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లు చేసినందుకు ఇరు దేశాల ప్రభుత్వాలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఆస్ట్రేలియాలో చెలరేగిన కార్చిచ్చు భారీగా ఆస్తులను దహనం చేస్తోంది. ఈ విపత్తు సమయంలో తాను దేశంలో ఉండి పౌరులకు సేవలు అందించాల్సిన అవసరం ఉందని మారిసన్ పేర్కొన్నారు. కార్చిచ్చు గురించి ప్రధాని మోదీ శుక్రవారం మారిసన్‌తో మాట్లాడారు. భారతీయుల తరఫున సానుభూతి వ్యక్తం చేస్తున్నట్లు చెప్పారు. కార్చిచ్చు కారణంగా ఇప్పటి వరకూ 23 మంది పౌరులు మృతిచెందారు. దీని నుంచి పౌరులను కాపాడేందుకు ఆ దేశ ప్రభుత్వం 3 వేల మంది మిలిటరీ రిజర్వ్ బలగాలను రంగంలోకి దించింది. -
కోహ్లి ఎంట్రీ.. సమావేశం వాయిదా!
ముంబై : వెస్టిండీస్ పర్యటన కోసం టీమిండియా ఆటగాళ్ల ఎంపిక వాయిదా పడింది. ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం శుక్రవారం భారత జట్టును ప్రకటించాల్సి ఉంది. అయితే సారథి విరాట్ కోహ్లి ఇంగ్లండ్ నుంచి భారత్‌కు తిరిగొచ్చేయడంతో పాటు విండీస్ పర్యటనకు విశ్రాంతి తీసుకోనని తెలపడంతో ఈ సమావేశాన్ని వాయిదా వేసినట్లు తెలుస్తోంది. ఈ పర్యటనకు కోహ్లి అందుబాటులో ఉండటంతో అతడి సమక్షంలో లేదా అతడితో చర్చించే కలిసే జట్టును ఎంపిక చేయాల్సి ఉంటుంది. దీంతో ఈ నెల 20న లేదా 21న భారత జట్టును ప్రకటించే అవకాశం ఉంది. ఈ పర్యటన కోసం సెలక్టర్లు ప్రయోగాలు చేయాలని తొలుత భావించారు. సీనియర్ ఆటగాళ్లు కోహ్లి, ధోని, జస్ప్రిత్ బుమ్రాలకు విశ్రాంతినిచ్చి మనీష్ పాండే, శ్రేయాస్ అయ్యర్, ఖలీల్ అహ్మద్, నవదీప్ సైనీలను జట్టులోకి తీసుకోవాలని భావించింది. అయితే కోహ్లి విశ్రాంతి తీసుకోవడానికి అయిష్టత చూపడంతో సీన్ రివర్సయింది. కేవలం ధోనికే విశ్రాంతినిస్తే తప్పుడు సంకేతాలు వెళతాయని సెలక్టర్లు ఆందోళన చెందుతున్నారు. దీంతో సెలక్టర్ల సమావేశం ఆసక్తిగా మారింది. -
ఏదేమైనా రథయాత్ర తథ్యం
న్యూఢిల్లీ: బెంగాల్లో ఎట్టి పరిస్థితులలోనూ రథయాత్ర చేపట్టే తీరతామని, తమని ఎవరూ ఆపలేరని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా అన్నారు. యాత్ర ప్రస్తుతానికి తాత్కాలికంగా వాయిదా పడిందని.. రద్దు కాలేదన్నారు. రథయాత్రకు అనుమతి నిరాకరిస్తూ కోల్‌కతా హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టుకెళ్తామన్నారు. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ బీజేపీని చూసి భయపడుతున్నారని, అందుకే తాము చేపట్టే రథయాత్రను అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ఈ యాత్ర ద్వారా ప్రజల్లో మార్పు వస్తుందనే భయంతోనే మమత ప్రభుత్వం ఇదంతా చేస్తోందని ధ్వజమెత్తారు. ప్రజాస్వామ్య హక్కులను కాలరాసే తీరుగా తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం తన పాలన కొనసాగిస్తోందని విమర్శించారు. బీజేపీని ఎంత అణగదొక్కాలని చూస్తే అంతకంతకూ ప్రజాగ్రహానికి గురికావాల్సి వస్తుందని హెచ్చరించారు. రాష్ట్ర ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, తాము కచ్చితంగా మార్పు తీసుకొస్తామని అన్నారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ మెజారిటీ సీట్లను గెలవడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. దేశంలో ప్రతి 100 రాజకీయ హత్యలకు 26 రాష్ట్రంలోనే జరుగుతున్నాయని ఓ సర్వేలో తేలిందని అమిత్‌షా ప్రస్తావించారు. -
ఢిల్లీ హైకోర్టు తీర్పుతో ఆగిన ‘మెట్రో’ సమ్మె
న్యూఢిల్లీ: ఢిల్లీ హైకోర్టు తీర్పుతో దేశ రాజధాని వాసులకు ఊరట లభించింది. హైకోర్టు ఆదేశాలతో శుక్రవారం అర్ధరాత్రి నుంచి తలపెట్టిన సమ్మెను మెట్రోరైల్ సిబ్బంది వాయిదా వేసుకున్నారు. వేతన పెంపుతోపాటు పలు డిమాండ్ల సాధన కోసం శుక్రవారం అర్ధరాత్రి నుంచి సమ్మెలోకి వెళ్లనున్నట్లు మెట్రో క్షేత్రస్థాయి సిబ్బంది నోటీసులిచ్చారు. దీంతో వారితో శుక్రవారం రెండు దఫాలుగా జరిపిన చర్చలు విఫలం కావటంతో ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్(డీఎంఆర్సీ) హైకోర్టును ఆశ్రయించింది. ఈ సమ్మె న్యాయబద్ధంగా లేదనీ, తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు సమ్మెను వాయిదా వేసుకోవాలని కోర్టు సూచించింది. సమ్మె కారణంగా 25 లక్షల మంది ప్రయాణికులు ఇబ్బందులు పడతారంది. దీంతో సమ్మెను నిలిపి వేస్తున్నట్లు ఉద్యోగుల సంఘం ప్రకటించింది. కేంద్రం, ఢిల్లీ ప్రభుత్వ సంయుక్త ఆధ్వర్యంలోని మెట్రోలో పనిచేసే సుమారు 12వేల మందిలో 9వేల మంది క్షేత్రస్థాయి ఉద్యోగులు ఉన్నారు. -
‘సవ్యసాచి’ రిలీజ్.. తాజా కబురు!
అక్కినేని అభిమానులు ఇప్పుడు ఆత్రంగా ఎదురుచూస్తున్నది నాగచైతన్య హీరోగా నటిస్తున్న ‘సవ్యసాచి’ చిత్రం విడుదల కోసమే. ‘ప్రేమమ్’ ఫేమ్ చందూ మొండేటి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా జూన్‌లో విడుదలవుతుందనే వార్తలు వినిపించాయి ఇన్ని రోజులు. కానీ తాజా సమాచారం ఏంటంటే ‘సవ్యసాచి’ జూన్‌లో కాదు జులైలో వస్తున్నాడు. అయితే దీని గురించి ఇంతవరకు ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఇంతవరకూ సినిమా నిర్మాణానికి సంబంధించి ఎటువంటి సమాచారం బయటకు రాకుండా చాలా గోప్యంగా ఉంచారు చిత్ర యూనిట్. ఈ మధ్యే చిత్ర దర్శకుడు చందూ మొండేటి ‘సవ్యసాచి’ గురించి మాట్లాడుతూ నాగచైతన్యను ఇంతవరకూ ఎప్పుడు చూడని కొత్త పాత్రలో చూస్తారని, ‘సవ్యసాచి’ అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తాడని తెలిపాడు. ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్గా నటిస్తుండగా, మాధవన్, భూమిక ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఎమ్ ఎమ్ కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. -
ఆమిర్ ఖాన్ ‘మహాభారతం’ వాయిదా..?
బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్ మహాభారతాన్ని భారీ బడ్జెట్‌తో 5 భాగాలుగా తెరకెక్కించనున్నట్టు గతంలోనే ప్రకటించారు. ప్రస్తుతం ఈ సినిమా వల్ల కలిగే లాభ, నష్టాలను అంచనా వేస్తున్నాడు ఆమిర్. అంతేకాదు అసలు సినిమాను తీయాలా, వద్దా అన్న సందిగ్ధంలో పడ్డాడన్న టాక్ బాలీవుడ్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. ఈ సినిమాను తెరకెక్కించాలంటే ఎంతో సృజనాత్మకత, ప్రశాంతమైన వాతావరణం కావాలని భావిస్తున్నాడు. మహాభారతాన్ని తీయాలన్న తన ఆలోచనలను ఆమిర్ పున:పరిశీలిస్తున్నట్లుగా బాలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. చారిత్రాత్మక కథలను, పురాణగాథలను తెరకెక్కించాలంటే ఎంతో శ్రమతో కూడుకున్నది. పద్మావత్ చిత్రీకరణ, విడుదల విషయంలో కలిగిన ఇబ్బందుకుల కూడా ఆమిర్ ను ఆలోచనలో పడేశాయి. మహాభారతం కూడా వివాదాల్లో చిక్కుకునే అవకాశం ఉందన్న అనుమానం కూడా ఆమిర్ పునరాలోచనకు కారణంగా తెలుస్తోంది. ప్రస్తుతానికి ఆమిర్ టీం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన లేకపోయినా.. మహాభారతం ప్రాజెక్ట్ ను ఆమిర్ వాయిదా వేసే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయన్న వార్త ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. -
మళ్లీ మళ్లీ అదే జరుగుతోంది..!
బాలీవుడ్లో కపిల్ శర్మ షోకు ఉన్న పాపులారిటీనే వేరు. ఎంత పెద్ద స్టార్స్ అయినా సరే...కపిల్ పిలిస్తే షోకు వస్తారు. అయితే కొంతకాలంగా కపిల్ అతిథులను ప్రోగ్రాంకు పిలవడం...అవి అనివార్య కారణాలతో వాయిదా పడటమో, రద్దు కావడమో జరుగుతోంది. తాజాగా భాగీ 2 టీం టైగర్ ష్రాఫ్, దిశాపటానీ షోకు ఆహ్వానించి తరువాత షూటింగ్ వాయిదా పడినట్టు ప్రకటించారు. సాంకేతిక కారణాల దృష్ట్యా కార్యక్రమాన్ని వాయిదా వేసినట్టు, త్వరలోనే మిగతా వివరాలను ప్రకటిస్తామని యాజమాన్యం ఓ ప్రకటనలో తెలిపింది. ఈ షోకు పెద్ద స్టార్స్‌ను ఆహ్వానించడం... తర్వాత ఏవో కారణాలు చూపి వాయిదా వేస్తున్నారు. గతంలో కూడా ఇలాంటి సంఘటనలు జరిగాయి. కపిల్ శర్మ ఆరోగ్యం సహకరించడం లేదనీ, సినీ కార్మికుల బంద్‌లు జరుగుతున్నాయనీ యాజమాన్యం చెప్పుకొస్తోంది. గతంలో బిగ్‌బీ అమితాబ్, షారుఖ్ ఖాన్, అజయ్ దేవ్గన్, పరేశ్ రావల్, మనోజ్ తివారి, అనిల్ కపూర్, అర్జున్‌కపూర్ లాంటి వారు వచ్చినప్పుడు కూడా కపిల్ శర్మ షో షూటింగ్‌లు రద్దు అయ్యాయి. -
కాళేశ్వరంపై విచారణ జనవరికి వాయిదా
సాక్షి, న్యూఢిల్లీ: కాళేశ్వరం ప్రాజెక్టు కేసు విచారణను జాతీయ హరిత ట్రిబ్యునల్ జనవరి 3వ తేదీకి వాయిదా వేసింది. రాష్ట్ర ప్రభుత్వం పర్యావరణ అనుమతులను ఉల్లంఘిస్తోందని జస్టిస్ స్వతంత్రకుమార్‌తో కూడిన ధర్మాసనానికి పిటిషనర్ల తరఫు న్యాయవాది సంజయ్ ఉపాధ్యాయ వివరించారు. దీనిపై కమిషన్‌ను ఏర్పాటు చేసేందుకు త్వరితగతిన కేసు విచారణ జరపాలని కోరారు. తెలంగాణ ప్రభుత్వ న్యాయవాది వెంకట్‌రెడ్డి కల్పించుకుని ప్రాజెక్టుకు కీలకమైన స్టేజ్–2 అటవీ అనుమతులు వచ్చాయని ట్రిబ్యునల్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో కేసును త్వరితగతిన విచారించాల్సిన అవసరం లేదని ట్రిబ్యునల్ పేర్కొంది. హైకోర్టు ప్రశ్నించినట్లు ఈ కేసును విచారించే పరిధి ట్రిబ్యునల్‌కు ఉందా లేదా అనేది ఆ రోజు తేలుస్తామని తెలిపింది. ఉమ్మడి మెదక్ జిల్లాలో 8 కొత్త చెరువులు నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు సాక్షి, హైదరాబాద్: నాలుగో విడత మిషన్ కాకతీయలో భాగంగా ఉమ్మడి మెదక్ జిల్లాలో 8 కొత్త చెరువుల తవ్వకానికి స్టేజ్ –1 కింద రూ.13 కోట్లకు పరిపాలనపరమైన ఆమోదం లభించినట్టు నీటి పారుదలశాఖ మంత్రి టి.హరీశ్‌రావు బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. భూసేకరణ తదితర చట్టపరమైన పనులను పూర్తి చేయడానికి ఈ నిధులను వెచ్చించనున్నామని ఆయన వివరించారు. భూసేకరణ పూర్తయ్యాక ఆయా చెరువుల నిర్మాణానికి సంబంధించిన అంచనాలు, ప్రతిపాదనలను పంపాలని చిన్న నీటిపారుదల శాఖ చీఫ్ ఇంజనీర్‌ను ఆదేశించినట్టు తెలిపారు. ఈ చెరువుల నిర్మాణానికి అవసరమైన భూసేకరణ త్వరితగతిన పూర్తి చేయాలని స్థానిక ఎమ్మెల్యేలు, మూడు జిల్లాల కలెక్టర్లు, ఇంజనీర్లను కోరామన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పరిధిలో 26 కొత్త చెరువులు తవ్వాలని ఇదివరకే నిర్ణయించిన విషయాన్ని హరీశ్ గుర్తు చేశారు. వాటికి సంబంధించి స్టేజ్–1 అనుమతిని మంజూరు చేస్తూ ఈ మేరకు రూ.92 కోట్ల నిధులను మంజూరు చేసినట్టు ఆయన పేర్కొన్నారు. -
కులకలం
చమన్ రాజీనామా మళ్లీ వాయిదా - 26న పదవి వదులుకుంటానని ప్రకటన - నంద్యాల ఉప ఎన్నికల నేపథ్యంలో వద్దన్న టీడీపీ! - దూదేకుల ఓటర్లకు జడిసి నిర్ణయం - అధికార పార్టీ తీరు వివాదాస్పదం - త్రిశంకు స్వర్గంలో పూల నాగరాజు సాక్షి ప్రతినిధి, అనంతపురం: తెరపడిందనుకున్న జెడ్పీ చైర్మన్ చమన్ రాజీనామా వ్యవహారం మరో చర్చకు దారితీస్తోంది. ఈనెల 26న రాజీనామా చేస్తానని చెప్పిన చమన్ తిరిగి మొండికేయడం రాజకీయంగా దుమారం రేపుతోంది. నంద్యాల ఉప ఎన్నికల నేపథ్యంలో తాము సూచించే వరకు రాజీనామా చేయొద్దని టీడీపీ అధిష్టానం ఆయనకు సూచించినట్లు తెలుస్తోంది. బుధవారం చమన్ రాజీనామా చేస్తారని టీడీపీ నేతలతో పాటు మీడియా కూడా ఆసక్తిగా ఎదురుచూసింది. మొదట సాయంత్రం 4 గంటలకు, ఆపై 6 గంటలకు రాజీనామా చేస్తారని ప్రచారం జరిగింది. అయితే చివరకు రాజీనామా చేయడం లేదని టీడీపీ వర్గాలు తేల్చేశాయి. దీనికి వారు చెబుతున్న కారణాలు చూస్తే రాజకీయ అవసరాల కోసం రాజీనామా తేదీని వాయిదా వేస్తున్నారని సుస్పష్టమైంది. నంద్యాల ఉప ఎన్నికల వరకు బ్రేక్? నంద్యాల ఎమ్మెల్యే భూమానాగిరెడ్డి హఠాన్మరణం నేపథ్యంలో అక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. నంద్యాల నియోజకవర్గంలో ముస్లిం, దూదేకుల ఓటర్లు అధికంగా ఉన్నారు. ఇటీవల ఈ సామాజిక వర్గానికి చెందిన నేతలతో సీఎం, టీడీపీ నేతలు నంద్యాలలో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. తమ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి జిల్లా పరిషత్ చైర్మన్‌గా కొనసాగుతున్నారని, రాష్ట్రంలో జిల్లా పరిషత్‌లలో ఉన్న ఒక్కడినీ రాజీనామా చేయమంటే ఎలా అని ముస్లింలు ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు నంద్యాల ఉప ఎన్నికల వరకు రాజీనామా వ్యవహారాన్ని వాయిదా వేస్తే మంచిదనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. కానీ ఆ సామాజికవర్గ నేతలతో మాత్రం చమన్‌ను కొనసాగిస్తామని హామీ ఇచ్చినట్లు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. దీంతోనే ఉప ఎన్నికలు ముగిసే వరకు రాజీనామా చేమొద్దని టీడీపీ అధిష్టానం చమన్‌కు సూచించినట్లు తెలిసింది. అంటే నంద్యాల ఉప ఎన్నికల్లో కేవలం ముస్లిం, దూదేకుల వర్గాలకు సంబంధించిన ఓట్ల కోసమే చమన్ రాజీనామా తేదీని తాత్కాలికంగా వాయిదా వేశారని, అతన్ని సుదీర్ఘంగా కొనసాగించే ఉద్దేశం లేదనేది స్పష్టమవుతోంది. పూలనాగరాజులో ఆందోళన జెడ్పీ చైర్మన్ పీఠంపై కూర్చోవాలన్న పూల నాగరాజుకు ఆటంకాలు ఎదరవుతూనే ఉన్నాయి. ఎన్నికల సమయంలో చెరీ రెండున్నరేళ్లనే ఒప్పందం మేరకు ఎన్నికల ఖర్చు కూడా ఇద్దరూ భరించినట్లు తెలుస్తోంది. ఒప్పందం మేరకు జనవరి 5న చమన్ రాజీనామా చేయాలని.. అయితే ఇప్పటి వరకూ కొనసాగడం ఏంటని నాగరాజు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఇప్పటికే ఆర్నెల్లు అదనంగా కొనసాగారని, తక్కిన రెండేళ్లు కూడా తనకు ఇవ్వకుండా మళ్లీ అధిష్టానం చమన్‌ను కొనసాగించడం ఏమిటని తన అనుచరులతో వాపోయినట్లు తెలుస్తోంది. నంద్యాల ఉప ఎన్నికల వరకు చమన్‌ను కొనసాగించాలని పార్టీ నిర్ణయం తీసుకున్నట్లు వస్తున్న వార్తలే నిజమైతే.. ఇక తనకు జెడ్పీ పీఠం అవసరం లేదని చెప్పినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో జెడ్పీ పీఠం వ్యవహారంలో తలెత్తిన వివాదం టీడీపీలో ప్రకంపనలు సృష్టించేలా ఉంది. జెడ్పీ పీఠం నుంచి దిగేందుకు చమన్ మొదట్నుంచీ విముఖంగానే ఉన్నారు. అనివార్య పరిస్థితుల్లో రాజీనామాకు సిద్ధమయ్యారు. రాజీనామా తర్వాత టీడీపీ నుంచి వీడేందుకు చమన్ సిద్ధంగా ఉన్నారని, చమన్‌తో సన్నిహితంగా ఉన్న వారు వ్యాఖ్యానిస్తున్నారు. ఇదే క్రమంలో పూలనాగరాజు కూడా పార్టీ పెద్దలు తనకు సహకరించడం లేదనే యోచనలో ఉన్నారు. పార్టీని వీడుతానని చమన్ లీకులు పంపి, పార్టీ అధిష్టానాన్ని బ్లాక్మెయిల్ చేస్తున్నారని, చమన్ రాజీనామా చేయకుండా నంద్యాల ఉప ఎన్నికల వరకు కొనసాగితే తానే పార్టీ వీడుతానని తన సన్నిహితులతో చెప్పినట్లు టీడీపీ వర్గాల ద్వారా తెలుస్తోంది. మొత్తం మీద చమన్ రాజీనామా చేస్తారా? లేదా? అనేది తేలాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే. -
బ్యాక్లాగ్ సీట్ల భర్తీ వాయిదా
చిలమత్తూరు (హిందూపురం) : మహాత్మాజ్యోతిబా పూలే బీసీ గురుకుల పాఠశాలల్లోని 6, 7, 8, 9 తరగతుల్లో బ్యాక్లాగ్ ఖాళీ సీట్ల భర్తీ ప్రక్రియను పాఠశాలల రాష్ట్ర కార్యదర్శి కృష్ణమోహన్ ఆదేశాల మేరకు తాత్కాలికంగా వాయిదా వేసినట్టు జిల్లా కన్వీనర్, టేకులోడు గురకుల పాఠశాల ప్రిన్సిపాల్ ప్రసాద్ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. జూన్‌లో ప్రారంభమయ్యే అకడమిక్ విద్యాసంవత్సరానికి బ్యాక్లాగ్ సీట్లు భర్తీ చేస్తామన్నారు. -
ఓటుకు కోట్లు కేసులో విచారణ వాయిదా
-
ఓటుకు కోట్లు కేసులో విచారణ వాయిదా
వారంలోగా కౌంటర్ దాఖలు చేయాలని మత్తయ్యకు సుప్రీం ఆదేశం సాక్షి, న్యూఢిల్లీ: ఓటుకు కోట్లు కేసులో అభియోగపత్రం నుంచి జెరూసలేం మత్తయ్య పేరును తొలగిస్తూ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ రెండు వారాలపాటు వాయిదా పడింది. సోమవారం ఈ పిటిషన్ సుప్రీంకోర్టులో విచారణకు వచ్చిన సందర్భంగా మరో 4 వారాలు గడువు కావాలని మత్తయ్య తరఫు న్యాయవాది కోర్టుకు విన్నవించారు. ఈ కేసులో మత్తయ్య పాత్రపై సాక్ష్యాలు ఉన్నాయని, రూ.50 లక్షల నగదును మత్తయ్య చేరేవేసేందుకు ప్రయత్నించారని తెలంగాణ తరపున సీనియర్ న్యాయవాది హరీన్ రావల్ కోర్టుకు తెలిపారు. సుప్రీం కోర్టులో విచారణ ఆలస్యమైతే దాని ప్రభావం హైకోర్టు విచారణపై పడుతుందని విన్నవించారు. వారంలోగా కౌంటర్ దాఖలు చేయాలని మత్తయ్యను కోర్టు ఆదేశించింది. -
పీజీ మెడికల్ కోర్సులకు దరఖాస్తు గడువు పెంపు
విజయవాడ: పీజీ మెడికల్ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే నీట్ పరీక్షకు దరఖాస్తు గడవును పొడిగించారు. ఈ మేరకు అధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు. నవంబరు 7వ తేదీ వరకూ నీట్ పరీక్షకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పిస్తున్నట్లు నేషనల్ బోర్డు ఆఫ్ ఎగ్జామ్స్ గవర్నింగ్ బాడీ కౌన్సిల్ సభ్యులు, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వైస్ చాన్సలర్ డాక్టర్ టి.రవిరాజు తెలిపారు. అదే విధంగా 2010 ఎంబీబీఎస్ బ్యాచ్‌కు ఇంటర్నెషిప్ పూర్తి చేసే గడువును ఏప్రిల్ 15 వరకూ పొడిగించినట్లు వీసీ తెలిపారు. ఇప్పటికే 2010 ఎంబీబీఎస్ బ్యాచ్ అభ్యర్ధులు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకునేందుకు త్వరలో వెబ్సైట్ ను ప్రారంభించనున్నట్లు వీసీ పేర్కొన్నారు. -
సభ వాయిదా అనైతిక చర్య
సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల గుంటూరు వెస్ట్ : ఏపీకి ప్రత్యేక హోదా కోరుతూ కాంగ్రెస్ నాయకుడు, ఎంపీ కేవీపీ రామచంద్రరావు రాజ్యసభలో ప్రవేశ పెట్టిన ప్రై వేట్ బిల్లుపై సభలో చర్చ జరగకుండా బీజేపీ కుట్రపూరితంగా వ్యవహరించిందని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు అన్నారు. బీజేపీ తీరును నిరసిస్తూ శనివారం గుంటూరులోని శంకర్ విలాస్ సెంటర్ నుంచి లాడ్జి సెంటర్ వరకు సీపీఐ నాయకులు ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా నాగేశ్వరరావు మాట్లాడుతూ బిల్లు విజయం సాధిస్తుందని భావించి సభ జరగకుండా వాయిదా వేయడం అనైతిక చర్యగా పేర్కొన్నారు. కేంద్ర మంత్రి ఎం.వెంకయ్యనాయుడు, బీజేపీకి చెందిన రాష్ట్ర నాయకులు అందరూ ప్రజలకు క్షమాపణ చెప్పాలని కోరారు. ప్రత్యేక హోదా సాధించడం ద్వారానే రాష్ట్రాభివద్ధి సాధ్యమన్నారు. సీపీఐ నగర కార్యదర్శి కోట మాల్యాద్రి మాట్లాడుతూ ఏపీకి ప్యాకేజీలు వద్దని హోదా కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఐ నాయకులు సురేష్, నూతలపాటి చిన్న, అమీర్‌వలి, కుమార్‌నాయక్ తదితరులు పాల్గొన్నారు. -
'వీల్ చైర్లో ఉన్న నేరస్తుడిని ఎలా ఉరి తీయాలి'
ఇస్లామాబాద్: పాకిస్థాన్ తొలిసారి ఓ ఉరిశిక్షను అమలు చేయకుండా వాయిదా వేసింది. ముందుగా నిర్ణయించిన సమయంలో ఉరి తీసే కార్యక్రమాన్ని నిలిపివేయడం ఆ దేశ చరిత్రలోనే ఇదే తొలిసారి కావడం కూడా గమనార్హం. ఓ హత్య కేసు విషయంలో అబ్దుల్ బాసిత్ (43) అనే వ్యక్తిని పాకిస్థాన్ పోలీసులు గతంలో అరెస్టు చేసి కోర్టులో ప్రవేశ పెట్టగా సుదీర్ఘ విచారణ చేపట్టిన కోర్టు చివరకు ఉరిశిక్ష విధించింది. కోర్టు విధించిన శిక్ష ప్రకారం అతడిని పంజాబ్‌లోని ఫైసలాబాద్ జైలులో మంగళవారం ఉదయమే ఉరితీయాలి. కానీ, అతడి విషయంలో గత కొంతకాలంగా హక్కుల సంఘంవారు పలు ఆందోళనలు నిర్వహిస్తున్నారు. ఎందుకంటే ఆ నేరస్థుడు ఒక వికలాంగుడు. ప్రస్తుతం అతడు చక్రాల కుర్చీ మీద ఉండే జైలు శిక్షను అనుభవిస్తున్నాడు. స్థానిక చట్టాల ప్రకారం ఓ వ్యక్తిని ఉరితీసేముందు అతడు ఉరికంభం వద్ద నిల్చుని ఉన్నప్పుడే తలారీ అతడి మెడకు ఉరితాడు బిగించాలి. కానీ బాసిత్ వికలాంగుడు కావడం వల్ల నిల్చునే అవకాశం లేదు. దీనిపై ఇప్పటికే జైలు అధికారులు పంజాబ్ హోంశాఖను అభిప్రాయం కోరినా ఉరిశిక్ష అమలు తేదీ వరకు కూడా వారు ఓ నిర్ణయం ప్రకటించకపోవడంతో ఉరి శిక్షను తాత్కాలికంగా నిలిపివేసి తలలు పట్టుకున్నారు. 2009లో బాసిత్ ఓ ఆస్తి వివాదానికి సంబంధించి ఓ వ్యక్తిని హత్య చేశాడు. అనంతరం టీబీ కారణంగా పక్షవాతానికి గురయ్యాడు. పక్షవాతంతోనే అతడు వీల్ చైర్లో ఉండి జైలు శిక్షను అనుభవిస్తున్నాడు. -
పాతవారికే టీడీపీ జిల్లా పార్టీ బాధ్యతలు
అనంతపురం ఎన్నిక వాయిదా.. హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో తొలి విడత జరిగిన తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుల ఎన్నికల్లో పాతవారికే అవకాశం దక్కింది. అనంతపురం జిల్లా ఎన్నిక మాత్రం వాయిదా పడింది. శనివారం పశ్చిమ గోదావరి, గుంటూరు, నెల్లూరు, అనంతపురం జిల్లా పార్టీ అధ్యక్ష ఎన్నికలు జరిగాయి. అనంతపురం జిల్లాకు ప్రస్తుతం పెనుకొండ ఎమ్మెల్యే బీకే పార్థసారథి అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ఆయన స్థానంలో తనకు అవకాశం ఇవ్వాలని అనంతపురం ఎమ్మెల్యే ప్రభాకర చౌదరి కోరారు. దీంతో పరిశీల కులు ఎన్నికలు వాయిదా వేసి నిర్ణయాన్ని అధ్యక్షుడికి వదిలేశారు. తూర్పు గోదావరి, గుంటూరు, నెల్లూరు జిల్లాల అధ్యక్షులుగా ప్రస్తుతం అడహాక్ కమిటీ కన్వీనర్లుగా కొనసాగుతున్న తోట సీతామహాలక్ష్మి, జీవీఎస్ ఆంజనేయులు, బీద రవిచంద్రయాదవ్ ఏక గ్రీవంగా ఎన్నికయ్యారు. ఇదిలాఉంటే జిల్లా కమిటీ ఎన్నికలను పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు తన నివాసం నుంచి పర్యవేక్షించారు. ఈ నెల 27 నుంచి 29 వరకూ జరిగే మహానాడులో చేయాల్సిన తీర్మానాలపై కమిటీ సభ్యులతో చర్చించారు.ఆది, సోమవారాల్లో మిగిలిన జిల్లా పార్టీ అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి.