ఆంధ్రప్రదేశ్‌లో తొలి విడత జరిగిన తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుల ఎన్నికల్లో పాతవారికే అవకాశం దక్కింది.
అనంతపురం ఎన్నిక వాయిదా..
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో తొలి విడత జరిగిన తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుల ఎన్నికల్లో పాతవారికే అవకాశం దక్కింది. అనంతపురం జిల్లా ఎన్నిక మాత్రం వాయిదా పడింది. శనివారం పశ్చిమ గోదావరి, గుంటూరు, నెల్లూరు, అనంతపురం జిల్లా పార్టీ అధ్యక్ష ఎన్నికలు జరిగాయి. అనంతపురం జిల్లాకు ప్రస్తుతం పెనుకొండ ఎమ్మెల్యే బీకే పార్థసారథి అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ఆయన స్థానంలో తనకు అవకాశం ఇవ్వాలని అనంతపురం ఎమ్మెల్యే ప్రభాకర చౌదరి కోరారు.
దీంతో పరిశీల కులు ఎన్నికలు వాయిదా వేసి నిర్ణయాన్ని అధ్యక్షుడికి వదిలేశారు. తూర్పు గోదావరి, గుంటూరు, నెల్లూరు జిల్లాల అధ్యక్షులుగా ప్రస్తుతం అడహాక్ కమిటీ కన్వీనర్లుగా కొనసాగుతున్న తోట సీతామహాలక్ష్మి, జీవీఎస్ ఆంజనేయులు, బీద రవిచంద్రయాదవ్ ఏక గ్రీవంగా ఎన్నికయ్యారు. ఇదిలాఉంటే జిల్లా కమిటీ ఎన్నికలను పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు తన నివాసం నుంచి పర్యవేక్షించారు. ఈ నెల 27 నుంచి 29 వరకూ జరిగే మహానాడులో చేయాల్సిన తీర్మానాలపై కమిటీ సభ్యులతో చర్చించారు.ఆది, సోమవారాల్లో మిగిలిన జిల్లా పార్టీ అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి.