చిలమత్తూరు (హిందూపురం) : మహాత్మాజ్యోతిబా పూలే బీసీ గురుకుల పాఠశాలల్లోని 6, 7, 8, 9 తరగతుల్లో బ్యాక్‌లాగ్ ఖాళీ సీట్ల భర్తీ ప్రక్రియను పాఠశాలల రాష్ట్ర కార్యదర్శి కృష్ణమోహన్ ఆదేశాల మేరకు తాత్కాలికంగా వాయిదా వేసినట్టు జిల్లా కన్వీనర్, టేకులోడు గురకుల పాఠశాల ప్రిన్సిపాల్ ప్రసాద్ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. జూన్‌లో ప్రారంభమయ్యే అకడమిక్ విద్యాసంవత్సరానికి బ్యాక్‌లాగ్ సీట్లు భర్తీ చేస్తామన్నారు.