సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కల్యాణలక్ష్మి, షాదీముబారక్ లబ్ధిదారులకు నగదుతో పాటు తులం బంగారం ఇచ్చేందుకు ప్రణాళికలు రూపొందించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రేవంత్‌రెడ్డి శనివారం బీసీ, మైనారిటీ, ట్రైబల్ వెల్ఫేర్ డిపార్టుమెంట్ల అధికారులతో సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్ష పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
నియోజకవర్గానికో ఇంటిగ్రేటేడ్ ఎడ్యుకేషన్ హబ్ ఏర్పాటు చేసేందుకు అధ్యయనం చేయాలని అధికారులను ఆదేశించారు. గురుకులాలకు సొంత భవనాలకు స్థలాల గుర్తించాలని తెలిపారు. గ్రీన్ ఛానల్ ద్వారా డైట్, కాస్మోటిక్ ఛార్జీల చెల్లింపుల కోసం ప్రణాళికలు రూపొందించాలని అన్నారు. విదేశాలకు వెళ్లే విద్యార్థులకు మరింత ప్రయోజనం చేకూర్చాలని సీఎం రేవంత్ అధికారులకు తెలిపారు.
చదవండి: రైతుబంధు అడిగితే చెప్పుతో కొడతారా? మంత్రి పదవి అందుకేనా?
Comments
Please login to add a commentAdd a comment