gurukula schools
-
గురుకుల పాఠశాల విద్యార్థుల నిరసన
-
హాస్టళ్లు, గురుకులాల్లో కామన్ డైట్ ప్లాన్ ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
-
భర్తీ ఎన్ని? మిగిలినవి ఎన్ని?
సాక్షి, హైదరాబాద్: గురుకుల విద్యా సంస్థల్లో ఉద్యోగ ఖాళీల భర్తీ గణాంకాలపై ఇప్పట్లో స్పష్టత వచ్చే అవకాశం కనిపించడం లేదు. వివిధ కేటగిరీల్లో ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల జాబితా సిద్ధం కావడంతో పాటు ఇప్పటికే మెజార్టీ కేటగిరీల్లో అభ్యర్థులకు అపాయింట్మెంట్ ఆర్డర్లను సైతం పంపిణీ చేశారు. కానీ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఉమ్మడి మహబూబ్‌నగర్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల్లో మాత్రం పలువురు అభ్యర్థులు ఇంకా అపాయింట్మెంట్ ఆర్డర్లు అందుకోలేదు. ఇంతలోనే పార్లమెంటు ఎన్నికల షెడ్యూల్ కూడా వెలువడటం.. దానికితోడు జూన్ మొదటి వారం వరకు ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో పెండింగ్‌లో ఉన్న అపాయింట్మెంట్ ఆర్డర్లు అందజేయడానికి అప్పటివరకు వేచి చూడాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆ ప్రక్రియ పూర్తయ్యే వరకు ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు ఎంతమంది అపాయింట్మెంట్ ఆర్డర్లు తీసుకున్నారనే గణాంకాలపై స్పష్టత వచ్చే అవకాశం లేదని అధికారులు చెపుతున్నారు. 9,231 కొలువులకు నోటిఫికేషన్లు.. రాష్ట్రంలో ఐదు ప్రభుత్వ గురుకుల సొసైటీలు న్నాయి. తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ (టీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్), తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ(టీటీడబ్ల్యూఆర్ఈఐఎస్), మహాత్మా జ్యోతిభా పూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ(ఎంజేపీటీబీసీడబ్ల్యూఆర్‌ఈఐఎస్), తెలంగాణ మైనార్టీ గురుకుల విద్యా సంస్థల సొసైటీ (టీఎంఆర్ఈఐఎస్)లతో పాటు విద్యాశాఖ పరిధిలో కొనసాగుతున్న తెలంగాణ గురుకుల విద్యా సంస్థల సొసైటీ (టీఆర్ఈఐఎస్)ల పరిధిలో వివిధ కేటగిరీల్లో 9,231 ఉద్యోగ ఖాళీలకు గురుకుల బోర్డు గతేడాది ఏప్రిల్ 5వ తేదీన ఏక కాలంలో నోటిఫికేషన్లు జారీ చేసింది. ఇందులో ఆర్ట్, క్రాప్ట్, మ్యూజిక్ కేటగిరీల్లోని 350 ఉద్యోగాల భర్తీ పెండింగ్‌లో ఉండగా.. మిగతా 8,881 ఉద్యోగాలకు సంబంధించి అభ్యర్థుల ఎంపిక దాదాపు పూర్తయింది. అపాయింట్మెంట్ ఆర్డర్లు సైతం సిద్ధం చేసిన అధికారులు.. కొన్ని జిల్లాల్లో ఇంకా పూర్తిస్థాయిలో పంపిణీ చేయలేదు. పెద్ద సంఖ్యలో ఉద్యోగాలుండటంతో అభ్యర్థులు ఒకటికంటే ఎక్కువ పోస్టులకు దరఖాస్తు చేసుకుని పరీక్ష రాశారు. దీంతో దాదాపు రెండు వేల మంది అభ్యర్థులు ఒకటి కంటే ఎక్కువ ఉద్యోగాలు సాధించారు. కొందరైతే మూడు, నాలుగు ఉద్యోగాలు కూడా సాధించడం గమనార్హం. అయితే ఎన్ని ఉద్యోగాలు వచ్చినా అందులో ఉత్తమమైన కేటగిరీని ఎంపిక చేసుకోవడంతో పాటు పోస్టింగ్ వచ్చిన ప్రాంతం ఆధారంగా విధుల్లో చేరేందుకు అభ్యర్థి సిద్ధమవుతారు. ప్రస్తుతం చాలావరకు అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇచ్చిననప్పటికీ.. ఇంకా ఒక్క కేటగిరీలోనూ పోస్టింగులు ఇవ్వలేదు. ఎన్నికల కోడ్ ముగిశాకే.. అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇవ్వడం పూర్తయిన తర్వాత అందరికీ వెబ్ కౌన్సెలింగ్ నిర్వహించి పోస్టింగ్ ఇవ్వాలని గురుకుల సొసైటీలు నిర్ణయించాయి. ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత ఈప్రక్రియ మొదలు కానుంది. దీంతో కౌన్సెలింగ్ ముగిసి విధుల్లో చేరే గడువు పూర్తయిన తర్వాతే ఎంతమంది అభ్యర్థులు ఉద్యోగాల్లో చేరతారన్న అంశంపై స్పష్టత వస్తుంది. అప్పటివరకు నోటిఫికేషన్లో పేర్కొన్న ఉద్యోగాల్లో భర్తీ అయిన కొలువులు ఎన్ని, మిగిలిన పోస్టులు ఎన్ని.. అనే దానిపై స్పష్టత వస్తుందని అధికారులు భావిస్తున్నారు. ఇందుకు మరో రెండు నెలల సమయం పట్టవచ్చని గురుకుల అధికారులు చెపుతున్నారు. -
‘ఇంటర్నేషనల్’ గురుకుల భవనాలు!
సాక్షి, హైదరాబాద్: ఇంటర్నేషనల్ స్కూళ్లకు దీటుగా సమీకృత గురుకుల పాఠశాలల భవనాల నిర్మాణాలు చేపట్టాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆదేశించారు. రూ.2,500 కోట్లతో ఈ ఏడాది రాష్ట్రంలో 100 ఎస్సీ, బీసీ, మైనారిటీల గురుకుల పాఠశాల భవనాల నిర్మాణం చేపడుతు న్నామని, ఒక్కో భవనానికి రూ.25 కోట్ల చొప్పున మంజూరు చేసినట్లు చెప్పారు. సచివాలయంలో గురుకుల పాఠశాలల భవన నిర్మాణాలపై విద్య, సంక్షేమ శాఖల అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఎస్సీ, బీసీ, మైనార్టీల గురుకుల పాఠశాలల భవనాలను సమీకృతంగా ఒకేచోట నిర్మిస్తుండటంతో స్థల సమస్య తీరుతుందని, క్రీడా మైదానాలు వంటి ఉమ్మడి సదుపాయాలను అన్ని గురుకులాల విద్యార్థులు వాడుకోవచ్చన్నారు. మధిరలో పైలట్ ప్రాజెక్టు సమీకృత గురుకుల పాఠశాలల భవన నిర్మాణానికి మధిర నియోజకవర్గాన్ని పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసినట్టు భట్టి విక్రమార్క తెలిపారు. చింతకాని మండల కేంద్రంలోని ఇండోర్ స్టేడియం సమీపంలోని 10 ఎకరాల్లో నిర్మిస్తామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా స్థలాల ఎంపికను త్వరగా పూర్తి చేయాలని సూచించారు. భవనాల నిర్మాణం సత్వరంగా పూర్తి చేయడానికి సంబంధిత శాఖలతో సమన్వయం చేసుకోవాలని ప్రణాళిక శాఖ ముఖ్యకార్యదర్శి అహమ్మద్ నదీమ్‌ను ఆదేశించారు. దేశంలో తాము నిర్మించిన ఇంటర్నేషనల్ మోడల్ పాఠశాలలపై బెంగళూరు ఆర్కిటెక్ట్ సంస్థ సమావేశంలో పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చింది. నాలెడ్జ్ కేంద్రాల ఏర్పాటు పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే నిరుద్యోగులకు శిక్షణ కోసం నియోజకవర్గ కేంద్రాల వారీగా నాలెడ్జ్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్టు భట్టి తెలిపారు. త్వరలో టీఎస్పీఎస్సీ ద్వారా జాబ్ క్యాలెండర్ ప్రకటించనున్న నేపథ్యంలో పేద, మధ్య తరగతి కుటుంబాల నిరుద్యోగులకు ఆర్థిక వెసులుబాటు కల్పించడానికి వీటిని ప్రారంభిస్తున్నామన్నారు. జ్యోతిబా ఫూలే ప్రజాభవన్ క్షేత్రంగా నియోజకవర్గాల్లోని నాలెడ్జ్ సెంటర్లకు వచ్చే నిరుద్యోగులకు నేరుగా ఆన్లైన్ కోచింగ్ ఇప్పించే ప్రణాళికను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. -
నియోజకవర్గానికో ఇంటిగ్రేటేడ్ ఎడ్యుకేషన్ హబ్: సీఎం రేవంత్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కల్యాణలక్ష్మి, షాదీముబారక్ లబ్ధిదారులకు నగదుతో పాటు తులం బంగారం ఇచ్చేందుకు ప్రణాళికలు రూపొందించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రేవంత్‌రెడ్డి శనివారం బీసీ, మైనారిటీ, ట్రైబల్ వెల్ఫేర్ డిపార్టుమెంట్ల అధికారులతో సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్ష పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. నియోజకవర్గానికో ఇంటిగ్రేటేడ్ ఎడ్యుకేషన్ హబ్ ఏర్పాటు చేసేందుకు అధ్యయనం చేయాలని అధికారులను ఆదేశించారు. గురుకులాలకు సొంత భవనాలకు స్థలాల గుర్తించాలని తెలిపారు. గ్రీన్ ఛానల్ ద్వారా డైట్, కాస్మోటిక్ ఛార్జీల చెల్లింపుల కోసం ప్రణాళికలు రూపొందించాలని అన్నారు. విదేశాలకు వెళ్లే విద్యార్థులకు మరింత ప్రయోజనం చేకూర్చాలని సీఎం రేవంత్ అధికారులకు తెలిపారు. చదవండి: రైతుబంధు అడిగితే చెప్పుతో కొడతారా? మంత్రి పదవి అందుకేనా? -
ఒక్కో గిరిజన గురుకులానికి రూ. 5 కోట్లు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ(టీటీడబ్ల్యూఆర్ఈఐఎస్) పరిధిలోని గురుకుల పాఠశాలలకు అదనపు హంగులు దిద్దాలని గిరిజన సంక్షేమ శాఖ నిర్ణయించింది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుకు ముందు తెలంగాణలో 47 గిరిజన గురుకుల పాఠశాలలున్నాయి. ఇవన్నీ శాశ్వత భవనాల్లోనే నిర్వహిస్తున్నప్పటికీ... ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా ఈ భవనాల సామర్థ్యం సరిపోవడం లేదు. దీంతో శాశ్వత ప్రాతిపదికన అదనపు గదులు, డారి్మటరీలు, డైనింగ్ హాల్స్ ఏర్పాటు కోసం గిరిజన సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యాచరణ రూపొందించింది. గిరిజనుల కోసం ప్రత్యేకంగా అమలు చేస్తున్న షెడ్యూల్డ్ ట్రైబ్ స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్(ఎస్టీ ఎస్డీఎఫ్) ద్వారా సివిల్ పనులు చేపట్టేలా ప్రతిపాదనలు తయారు చేయగా... రాష్ట్ర ప్రభుత్వం వెనువెంటనే ఆమోదం తెలిపింది. ఒక్కో పాఠశాలకు రూ. 5 కోట్లు... గిరిజన గురుకుల సొసైటీ పరిధిలో పాత పాఠశాలల్లో నిర్మాణ పనుల కోసం ఒక్కో గురుకులానికి రూ.5 కోట్లు చొప్పున కేటాయించింది. చాలాచోట్ల తరగతి గదులతో పాటు డార్మిటరీ భవనాల ఆవశ్యకత ఎక్కువగా ఉంది. ఇదివరకు ఒక్కో పాఠశాలలో ఒక తరగతికి ఒక సెక్షన్ మాత్రమే ఉండేది. ఇప్పుడు విద్యార్థుల సంఖ్య రెట్టింపు అయ్యింది. దీంతో పాటు ఇంటరీ్మడియట్ కాలేజీలుగా దాదాపు అన్నీ అప్‌గ్రేడ్ అయ్యాయి. ఈ క్రమంలో విద్యార్థుల సంఖ్యకు తగినట్లుగా వసతి లేకపోవడంతో ప్రత్యామ్నాయ చర్యలతో ఇప్పటివరకు నెట్టుకొచ్చారు. తాజాగా ఎస్టీ ఎస్డీఎఫ్ ద్వారా నిధుల లభ్యతకు అనుగుణంగా నిధులు కేటాయించారు. మొత్తం 47 పాఠశాలలకు రూ.235 కోట్లు కేటాయించారు. అతి త్వరలో ఈ పనులకు సంబంధించి టెండర్లు ఖరారు చేసిన తర్వాత పనులు ప్రారంభించనున్నారు. గిరిజన విద్యార్థుల అడ్మిషన్ల డిమాండ్‌కు అనుగుణంగా 2023–24 వార్షికంలో కొత్తగా మరో రెండు పాఠశాలల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ క్రమంలో వీటికి శాశ్వత ప్రాతిపదికన భవనాలను నిర్మించేందుకు ప్రత్యేక నిధులను సైతం కేటాయించింది. ఒక్కో పాఠశాలకు రూ.12కోట్లు చొప్పున రెండింటికి కలిపి రూ.24కోట్లు కేటాయించింది. దీంతో గురుకుల పాఠశాలల నిర్మాణ పనులకు మొత్తంగా రూ.259 కోట్లు ఖర్చు చేయనుంది. గిరిజన ఇంజనీరింగ్ పర్యవేక్షణ... ఎస్టీ గురుకులాల్లో త్వరలో చేపట్టనున్న ఈ సివిల్ పనుల బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వం గిరిజన సంక్షేమ శాఖ పరిధిలో ఉన్న గిరిజన ఇంజనీరింగ్ విభాగానికి అప్పగించింది. టెండర్ల ఖరారు, పనుల కేటాయింపు, పర్యవేక్షణ, నాణ్యత పరిశీలన తదితర పూర్తిస్థాయి బాధ్యతలను గిరిజన ఇంజనీరింగ్ అధికారులే చూసుకుంటారు. గత మూడేళ్లుగా నిర్మాణ పనులకు ప్రభుత్వం అనుమతులు ఇవ్వకపోవడంతో స్తబ్ధుగా ఉన్న గిరిజన ఇంజనీరింగ్ విభాగానికి తాజాగా ఊరట లభించినట్లయింది. -
AP: రూ.3,364 కోట్లతో సకల వసతులు.. మారనున్న రూపురేఖలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని హాస్టళ్ల రూపురేఖలు మార్చి, అత్యుత్తమ విద్యను అందించేలా చర్యలు తీసుకోవాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇందులో భాగంగా రూ.3,364 కోట్లతో 3,013 సంక్షేమ హాస్టళ్లు, గురుకుల పాఠశాలల ఆధునీకరణకు నాడు–నేడు కార్యక్రమాన్ని చేపడుతున్నామని చెప్పారు. అంగన్వాడీ కేంద్రాల్లోనూ నాడు–నేడు పనులు, అనంతర నిర్వహణపై సమగ్ర కార్యాచరణ రూపొందించాలన్నారు. మహిళా, శిశు సంక్షేమ శాఖ, సంక్షేమ హాస్టళ్లు, అంగన్వాడీ కేంద్రాలపై శుక్రవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. హాస్టళ్లలో మంచి మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు కిచెన్లు సైతం ఆధునీకరించేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధతో పని చేయాలన్నారు. హాస్టళ్లలో ఇప్పుడున్న పరిస్థితులు పూర్తిగా మారాలని, సమాజంలో అట్టడుగున ఉన్న వారు చదువుకోవడానికి తగిన పరిస్థితులు కల్పించాలని చెప్పారు. బంకర్ బెడ్స్, తదితర అన్ని సౌకర్యాలు నాణ్యతతో ఉండేలా చర్యలు తీసుకోవాలని, భవనాలను పరిగణనలోకి తీసుకుని వాటి డిజైన్లను రూపొందించాలని ఆదేశించారు. ఈ సమీక్షలో సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే.. ‘హాస్టళ్లలో ఇప్పుడున్న పరిస్థితులు పూర్తిగా మారాలి. పిల్లలు చదువుకోవడానికి మంచి వాతావరణం కల్పించాల్సిన బాధ్యత మనపై ఉంది. హాస్టళ్లలోకి వెళ్లగానే జైల్లోకి వెళ్లామనే భావన వారికి కలగకూడదు. చదువులు కొనలేని కుటుంబాల వారే పిల్లలను హాస్టళ్లకు పంపిస్తారు. అందువల్ల అలాంటి పిల్లలు బాగా చదువుకుని, బాగా ఎదగడానికి హాస్టళ్లు వేదిక కావాలి. మన పిల్లలనే హాస్టళ్లలో ఉంచితే ఎలాంటి వసతులు, వాతావరణం ఉండాలనుకుంటామో సంక్షేమ హాస్టళ్లన్నింటినీ అలా తీర్చిదిద్దాలి.’ – సీఎం వైఎస్ జగన్ మూడు దశల్లో పనులు ► మూడు దశల్లో హాస్టళ్ల ఆధునీకరణ పూర్తి చేయాలి. రాష్ట్రంలో గురుకుల పాఠశాలలు, హాస్టళ్లు అన్నీ కలిపి మొత్తంగా 3,013 చోట్ల రూ.3,364 కోట్లతో నాడు–నేడు పనులు చేపట్టాలి. మొదటి దశలో మొత్తం సుమారు 1,366 చోట్ల పనులు చేపట్టాలి. దశాబ్దాలుగా వెనకబాటుకు గురైన కర్నూలు పశ్చిమ ప్రాంతంలోని హాస్టళ్లన్నింటినీ తొలి విడతలోనే బాగు చేయాలి. తొలి విడత పనులు జనవరి నుంచి ప్రారంభించి, ఏడాదిలోగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలి. ► హాస్టళ్లలో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడంతో పాటు, కిచెన్లను కూడా ఆధునీకరించే పనులు చేపట్టాలి. కిచెన్‌కు అవసరమైన దాదాపు 10 రకాల వస్తువులను కొనుగోలు చేయాలి. హాస్టళ్ల పరిస్థితుల్లో గణనీయమైన మార్పులు స్పష్టంగా కన్పించాలి. పిల్లలకు ఇవ్వాల్సిన వస్తువులను సకాలంలో నాణ్యమైన వాటిని అందించాలి. హాస్టళ్ల పర్యవేక్షణ పద్ధతిని సమూలంగా మార్చాలి. మండలాల వారీగా పర్యవేక్షణ ఉండాలి. వెల్ఫేర్ అధికారులు, కేర్ టేకర్ల పోస్టులు భర్తీ చేయండి ► హాస్టళ్లలో ఉండాల్సిన సిబ్బంది కచ్చితంగా ఉండాలి. ఖాళీగా ఉన్న 759 మంది సంక్షేమ అధికారులు, 80 మంది కేర్ టేకర్ల పోస్టులను భర్తీ చేయాలి. గిరిజన సంక్షేమ గురుకులాల్లో 171 మంది హాస్టల్ వెల్ఫేర్ అధికారుల నియామకానికి వెంటనే చర్యలు తీసుకోవాలి. పోస్ట్ మెట్రిక్ హాస్టళ్లలో క్లాస్–4 ఉద్యోగుల నియామకంపై దృష్టి పెట్టాలి. ప్రతి హాస్టల్‌ను పరిశీలించి, కల్పించాల్సిన సౌకర్యాలు, ఉండాల్సిన సిబ్బంది తదితర అంశాలపై ముందుగా సమాచారాన్ని తెప్పించుకోవాలి. ► హాస్టళ్ల నిర్వహణలో ఏమైనా సమస్యలు ఉంటే ఫిర్యాదు చేయడానికి ప్రతి హాస్టల్లో ఒక నంబర్ ఉంచాలి. అంగన్వాడీ కేంద్రాల్లో కూడా ఫిర్యాదులు స్వీకరించడానికి ఒక నంబర్ ఉంచాలి. అంగన్వాడీలలో నాడు–నేడు పనులు, అనంతర నిర్వహణపై సమగ్ర కార్యాచరణ ఉండాలి. టాయిలెట్ల నిర్వహణ, పరిశుభ్రతకు పెద్దపీట వేయాలి. ఇందుకోసం సమగ్ర కార్యాచరణ సిద్ధం చేయాలి. అంగన్వాడీల్లో ఫ్లేవర్డ్ మిల్క్ ► అంగన్వాడీలలో సూపర్వైజర్ల పోస్టులను భర్తీ చేసినట్టు అధికారులు సీఎం వైఎస్ జగన్‌కు తెలిపారు. గత సమీక్షలో ముఖ్యమంత్రి ఇచ్చిన ఆదేశాల అమలు ప్రగతిని ఈ సందర్భంగా వివరించారు. అంగన్వాడీలలో పాల సరఫరాపై నిరంతర పర్యవేక్షణతో మంచి ఫలితాలు వచ్చాయన్నారు. ► అక్టోబర్ నెలలో నూటికి నూరు శాతం పాల సరఫరా జరిగింది. డిసెంబర్ 1 నుంచి ఫ్లేవర్డ్ మిల్క్‌ను అంగన్వాడీల్లో సరఫరా చేయడానికి చర్యలు తీసుకుంటున్నాం. ఇందులో భాగంగా కొన్ని అంగన్వాడీ కేంద్రాల్లో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేస్తున్నాం’ అని వివరించారు. ► మూడు నెలల్లోగా రాష్ట్రంలోని అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో ఫ్లేవర్డ్ మిల్క్‌ను సరఫరా చేయడానికి చర్యలు తీసుకోవాలని సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు. ఈ సమీక్షా సమావేశంలో మహిళ, శిశు సంక్షేమ శాఖ మంత్రి కేవీ ఉష శ్రీచరణ్, ప్ర«భుత్వ ప్రధాన కార్యాదర్శి సమీర్ శర్మ, బీసీ సంక్షేమ, మహిళా శిశు సంక్షేమ శాఖల ముఖ్య కార్యదర్శులు జి.జయలక్ష్మి, ముద్దాడ రవి చంద్ర, ఆర్థిక శాఖ కార్యదర్శి కేవీవీ సత్యనారాయణ, ఏపీ డీడీసీఎఫ్ ఎండీ ఎ.బాబు, మహిళా శిశు సంక్షేమ, గిరిజన సంక్షేమ, మైనారిటీ వెల్ఫేర్ డైరెక్టర్లు ఎ.సిరి, ఎం.జాహ్నవి, జీసీ కిషోర్ కుమార్ తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఇదీ చదవండి: Jagananna Gorumudda: ‘గోరుముద్ద’లో కొత్త రుచులు -
బీసీ సంక్షేమ భవన్ ముట్టడి
విజయనగర్‌కాలనీ: బీసీ గురుకుల పాఠశాలల్లో చేరేందుకు విద్యార్థులు లక్షల సంఖ్యల్లో వస్తున్న నేపథ్యంలో కొత్తగా 120 బీసీ గురుకుల పాఠశాలలు మంజూరు చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. శనివారం మాసబ్ ట్యాంక్‌లోని దామోదరం సంక్షేమ సంఘం వద్ద తెలంగాణ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నీల వెంకటేష్ ఆధ్వర్యంలో బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేముల రామకృష్ణ నేతృత్వంలో వందలాది మంది విద్యార్థులతో సంక్షేమ భవన్‌ను ముట్టడించారు. కార్యక్రమానికి హాజరైన ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ... బీసీ గురుకుల పాఠశాలల్లో సీట్లు లభించక విద్యార్థులు బీసీ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వారికి చదువుకునే అవకాశం కల్పించాలని కోరారు. ప్రస్తుతం బీసీ గురుకుల పాఠశాలల్లో అడ్మిషన్లకు 3 లక్షల దరఖాస్తులు రాగా 14 వేల మందికి మాత్రమే సీట్లు ఇచ్చారని గుర్తుచేశారు. మిగతా 2.86 లక్షల మంది విద్యార్థులు ప్రవేశాలు లభించక ఆవేదన చెందుతున్నారన్నారు. అలాగే 238 బీసీ గురుకుల పాఠశాలల్లో 5 నుంచి 8వ తరగతుల వరకు అదనపు సెక్షన్లు ప్రారంభించాలన్నారు. గురుకుల పాఠశాలలకు సొంత భవనాలు నిర్మించడంతో పాటు 6 వేల మంది టీచర్లను నియమించాలని ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. గురుకుల పాఠశాలల హాస్టల్ విద్యార్థుల మెస్ చార్జీలను రూ. 1100 నుంచి రూ. 1600కు, కాలేజీ విద్యార్థుల మెస్ చార్జీలు రూ. 1500 నుంచి రూ. 3000కు పెంచాలని కోరారు. అనంతరం సంబంధిత అధికారులకు వినతి పత్రం సమర్పించారు. కార్యక్రమంలో తెలంగాణ బీసీ ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు జి.అనంతయ్య, నేతలు కూనూరు నర్సింహగౌడ్, చరణ్ యాదవ్, మోదీ, రామ్‌దేవ్, మల్లేశ్ యాదవ్, భాస్కర్, నిఖిల్, ప్రజాపతి, సునిత, మాధవి, అంజలి, అనిత, సిరి తదితరులు పాల్గొన్నారు. -
పటాన్చెరు: గురుకుల పాఠశాలలో కరోనా కలకలం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ గురుకుల పాఠశాలల్లో కరోనా కలకలం రేపుతోంది. ఇటీవలే ముత్తంగి గురుకుల పాఠశాలలో 48 మందికి కరోనా పాజిటివ్ వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా పటాన్చెరు, ఖమ్మం వైరా గురుకులు పాఠశాలల్లో కరోనా కేసులు వెలుగు చూశాయి. (చదవండి: ఈ ఆదివారం ట్యాంక్‌బండ్‌పై సండే– ఫన్డే రద్దు.. కారణమిదే!) పటాన్చెరు-ఇంద్రేశం గురుకుల పాఠశాలలో 25 మందికి కరోనా పాజిటివ్‌గా తేలగా.. ఖమ్మం వైరా గురుకుల పాఠశాలలో 27 మందికి పాజిటివ్‌గా తేలింది. ఈ క్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తరగతుల నిర్వహణపై విద్యాశాఖ తగిన నిర్ణయం తీసుకోవాలిని కోరుతున్నారు. (చదవండి: తరుముకొస్తున్న ఒమిక్రాన్.. టీకా రక్షిస్తుందా.. లేదా..?!) తాజాగా ఒమిక్రాన్ వేరియంట్ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ ధరించకుండా తిరిగితే.. రూ. 1000 జరిమానా విధించనున్నట్లు తెలిపింది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. చదవండి: నా ఎదుగుదల సర్వేల్ గురుకులం భిక్షే -
Telangana: ఒక్కరోజులో 190 కరోనా కేసులు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మంగళవారం 38,615 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా, 196 పాజిటివ్ కేసులు నమోదవడం ఆందోళన కలిగిస్తోంది. ఇటీవల కాలంలో ఈస్థాయిలో కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. గత పదిరోజుల రికార్డును చూస్తే కేసుల్లో పెరుగుదల కనిపిస్తోంది. ముఖ్యంగా విద్యాసంస్థలు, గురుకుల పాఠశాలల్లో కేసులు వెలుగుచూడడం, ఇతరత్రా కూడా కేసులు పెరుగుతుండటం గమనార్హం. గత నెల (నవంబర్) ఒకటో తేదీన 160 కేసులు నమోదు కాగా, 20వ తేదీన 134 కేసులు రికార్డయ్యాయి. 29వ తేదీన కేసుల సంఖ్య 184కు పెరిగింది. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 6,75,994కు చేరింది. ఈమేరకు ప్రజారోగ్య సంచాలకుడు శ్రీనివాసరావు కరోనా బులెటిన్ విడుదల చేశారు. కరోనాతో ఒక్కరోజులో ఇద్దరు మరణించగా, రాష్ట్రంలో ఇప్పటి వరకు మృతి చెందిన వారి సంఖ్య 3,992కి చేరిందన్నారు. ఒక్కరోజు వ్యవధిలో 184 మంది కోలుకోగా, మొత్తం కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 6,68,411కి చేరిందని వెల్లడించారు. -
ఇక గురుకుల జూనియర్ కాలేజీలు
సాక్షి, హైదరాబాద్: కేజీ టు పీజీ మిషన్‌లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన సంక్షేమ గురుకుల పాఠశాలలు కొత్త రూపును సంతరించుకోనున్నాయి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత కొత్తగా ప్రారంభించిన గురుకుల పాఠశాలలు ఇప్పటివరకు పదో తరగతికే పరిమితం కాగా.. వాటిల్లో కొత్తగా జూనియర్ కాలేజీలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. ఈ మేరకు ఆయా సొసైటీలు ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించగా సూత్రప్రాయ ఆమోదం తెలిపింది. ఈ నేపథ్యంలో విడతల వారీగా మంజూరైన గురుకుల పాఠశాలలను ప్రాధాన్యత ఇంటర్మీడియట్ వరకు అప్‌గ్రేడ్ చేస్తారు. ఈ మేరకు సంక్షేమ గురుకుల సొసైటీలు కసరత్తు చేస్తున్నాయి. ఒక్కో తరగతి పెరుగుతూ.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, జనరల్ గురుకుల సొసైటీల పరిధిలో 959 విద్యా సంస్థలున్నాయి. ఇందులో 54 గురుకుల డిగ్రీ కాలేజీలు కాగా.. మిగతావి పాఠశాలలు, జూనియర్ కాలేజీలే. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత 54 గురుకుల డిగ్రీ కాలేజీలతో పాటు 585 గురుకుల పాఠశాలలను ప్రభుత్వం మంజూరు చేసింది. 2015–16 విద్యా సంవత్సరం నుంచి విడతల వారీగా గురుకుల పాఠశాలలు ప్రారంభమయ్యాయి. ప్రారంభ దశలో గురుకుల పాఠశాలలను ప్రభుత్వం మంజూరు చేసినప్పటికీ... వీటిలో 5 ,6, 7 తరగతులకు మాత్రమే ప్రభుత్వం అనుమతినిచ్చింది. అలా తొలి ఏడాది మూడు తరగతులతో ప్రారంభమైన గురుకుల పాఠశాలల్లో ప్రతి సంవత్సరం ఒక తరగతి పెరుగుతూ వస్తోంది. ఈ క్రమంలో పదో తగతికి చేరిన గురుకుల పాఠశాలల్లో ఇప్పుడు ఇంటర్మీడియట్ కోర్సులను ప్రారంభించనున్నారు. 71 మైనార్టీ జూనియర్ కాలేజీలు వచ్చే విద్యా సంవత్సరంలో మైనార్టీ గురుకుల విద్యా సంస్థల సొసైటీ పరిధిలో కొత్తగా 71 గురుకుల పాఠశాలలు ఏర్పాటు కానున్నాయి. ఈ పాఠశాలల్లో ప్రస్తుతం పదో తరగతి బ్యాచ్ వార్షిక పరీక్షలకు సిద్ధమవుతోంది. అదేవిధంగా 2021–22 విద్యా సంవత్సరంలో బీసీ గురుకుల సొసైటీ పరిధిలో 119, మైనార్టీ గురుకుల సొసైటీ పరిధిలో 80, గిరిజన గురుకుల సొసైటీ పరిధిలో 50 జూనియర్ కాలేజీలు ఏర్పాటు కానున్నాయి. వీటితో పాటుగా సాంఘిక సంక్షేమ గురుకుల సొసైటీ పరిధిలో మరో వంద జూనియర్ కాలేజీల ఏర్పాటుకు సంబంధించిన అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది. మొత్తంగా గురుకుల విద్యా సంస్థల్లో పాఠశాలలన్నింటా జూనియర్ కాలేజీలుగా ఏర్పాటు కానున్నాయి. నాలుగు కోర్సులతో ఇంటర్ గురుకుల జూనియర్ కాలేజీల్లో నాలుగు కోర్సులకు ప్రభుత్వం అనుమతిస్తోంది. ఎంపీసీ, బీపీసీ, ఎంఈసీ, సీఈసీ కోర్సులుంటాయి. ఒక్కో కోర్సులో 60 సీట్లుంటాయి. గురుకుల జూనియర్ కాలేజీల్లో చేరే విద్యార్థులకు ఇంటర్మీడియట్ కోర్సుతో పాటు పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యేలా ప్రత్యేక శిక్షణ ఇస్తారు. ఎంసెట్, నీట్, క్లాట్, జేఈఈ తదితర పోటీ పరీక్షలకు ఫస్టియర్ నుంచే అదనపు తరగతులు నిర్వహిస్తారు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన గురుకుల పాఠశాలలు సొసైటీ పాఠశాలలు ఎస్సీ 104 ఎస్టీ 51 బీసీ 238 మైనారిటీ 192 -
గురుకుల ప్రిన్సిపాల్‌ను తొలగించాలి
సాక్షి, మద్నూర్: గురుకుల ప్రిన్సిపాల్ శ్రీనివాస్ వివాదాస్పదంగా ఉంటూ మహిళా ఉద్యోగుల జీవితాలతో చెలగాటమాడేవాడని, అతడిని వెంటనే ఉద్యోగం నుంచి తొలగించి కఠిన చర్యలు తీసుకోవాలని యువకులు, పెద్దలు డిమాండ్ చేశారు. ప్రిన్సిపాల్ శ్రీనివాస్ లైంగిక వేధింపులకు నిరసనగా మండల కేంద్రంలోని పాత బస్టాండ్ వద్ద జాతీయ రహదారిపై మంగళవారం గ్రామస్తులు పెద్ద సంఖ్యలో బైఠాయించారు. ప్రిన్స్‌పాల్ డౌన్ డౌన్ అంటూ వారు నినదించారు. ప్రిన్స్‌పాల్‌ను జాబ్ నుంచి తొలగించకుండా హైదరాబాద్ కార్యాలయానికి అటాచ్ చేయడం ఏమిటని వారు ప్రశ్నించారు. బహిరంగ శిక్ష విధించాలని వారు డిమాండ్ చేశారు. అనంతరం ప్రిన్సిపాల్ శ్రీనివాస్ దిష్టిబొమ్మ దహనం చేశారు. రాస్తారోకో, ధర్నాతో జాతీయ రహదారిపై రెండు వైపుల వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఎస్సై సురేశ్ రాస్తారోకో చేస్తున్న వారికి సముదాయించి ధర్నా విరమింపజేశారు. మద్నూర్‌లో జాతీయ రహదారిపై రాస్తారోకో చేస్తున్న గ్రామస్తులు పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత.. ప్రిన్స్‌పాల్ శ్రీనివాస్‌ను మంగళవారం ఉదయం పోలీసులు అదుపులోకి తీసుకున్నామని ఎస్సై సురేశ్ తెలిపారు. పోలీస్‌స్టేషన్‌లో ఉన్న ప్రిన్సిపాల్‌తో పా టు మరో ముగ్గురు పాఠశాల సిబ్బంది ఎందుకు ఉన్నారని యువకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితుడికి పోలీస్ స్టేషన్లో సెల్‌ఫోన్ మాట్లాడడం ఎలా అనుమతించారని యువకులు పోలీసులను ప్రశ్నించారు. దీంతో ఎస్సై ముగ్గురి ఉపాధ్యాయుల ను వెళ్లిపోవాలని సూచించారు. ప్రిన్సిపాల్ వద్ద ఉన్న రెండు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. అక్రమాలకు సహకరిస్తున్నారంటూ ముగ్గురు సి బ్బందిపై గ్రామస్తులు దాడి చేశారు. పోలీస్ వాహనంలో ముగ్గురి సిబ్బందిని పాఠశాలకు తరలిస్తుండ గా యువకులు, గ్రామస్తులు అడ్డుకున్నారు. పోలీసు లు యువకులను చెదరగొట్టారు. సెక్షన్ 354ఏ, 509, 506 ప్రకారం కేసు నమోదు చేసి శ్రీనివాస్‌ను రిమాండ్‌కు తరలించామని ఎస్సై వెల్లడించారు. హైదరాబాద్ కార్యాలయానికి సరెండర్ లైంగిక వేధింపులకు పాల్పడిన గురుకుల ప్రిన్సిపాల్ శ్రీనివాస్‌పై వేటు పడింది. ప్రిన్సిపాల్ బాధ్యతల నుంచి తప్పిస్తూ మరో ఉపాధ్యాయిని సునీతకు ఇన్చార్జిగా బాధ్యతలు అప్పగిస్తున్నట్లు పాఠశాలకు మెయిల్ వచ్చింది. ప్రిన్సిపాల్ శ్రీనివాస్‌ను హైదరాబాద్‌లోని గురుకుల సొసైటీ కార్యదర్శికి అటాచ్ చేశారు. ప్రిన్సిపాల్ తన ప్రాబల్యంతో పోస్టింగ్ తెచ్చుకుంటాడని యువకులు మండిపడుతున్నారు. -
ఫ్రీడం స్కూల్ విధానానికి గురుకుల సొసైటీ శ్రీకారం
సాక్షి, జమ్మికుంట(కరీంనగర్): సంప్రదాయ బోధనా పద్ధతులకు భిన్నంగా విద్యార్థుల్లో సృజనాత్మక శక్తిని పెంపొందిస్తూ, వారిలో బోధన, గ్రహణ, పఠన నైపుణ్యాలను పెంపొందించేందుకు రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురుకుల సొసైటీ స్వేచ్ఛా పాఠశాలల (ఫ్రీడం స్కూళ్లు) విధానం తీసుకువచ్చింది. స్వేచ్ఛా పాఠశాలల్లో పరీక్షల విధానం, కార్యాచరణ అంతా విద్యార్థుల అభీష్టం మేరకు నడుస్తోంది. దీంతో ఈ విధానంపై విద్యార్థుల తల్లిదండ్రులు హర్షంవ్యక్తం చేస్తున్నారు. ప్రార్థనతో సేచ్ఛ ప్రారంభం ఉదయం ప్రార్థనతో విద్యార్థులకు సేచ్ఛ ప్రారంభం అవుతుంది. మాడ్యూల్స్‌లోని అంశాలపై విద్యార్థులు పరస్పరం వేర్వేరుగా, బృందాలుగా చర్చలు జరుపుకోవడంతోపాటు లోతుగా పరిశీలించడం చేస్తుంటారు. సాధారణ పాఠశాలల్లో నిర్వహించే పరీక్షలు ఈ పాఠశాలల్లో కానరావు. పరీక్షల్లో విద్యార్థులు పెన్ను, పేపర్లను వినియోగించరు. స్కిట్, డిబేట్స్, క్విజ్, డ్రామా లాంటి అంశాలతో విద్యార్థులకు మార్కులు కేటాయిస్తారు. పాఠాల బోధనకు స్వస్తి స్వేచ్ఛా పాఠశాలల్లో ఉపాధ్యాయులు పాఠాలు బోధించరు. సలహాదారులుగా మాత్రమే ఉంటారు. తరగతిగదుల్లో చదువుకోవాలనే నిబంధనలేమీ ఉండవు. పరీక్షల్లో మార్కులు తక్కువ వస్తాయనే భయం ఉండదు. విద్యార్థుల ప్రతిభను బట్టి మార్కులు వేస్తుంటారు. ఈ పాఠశాలల్లో ప్రిన్సిపాల్, ఉపాధ్యాయుడు అంటే విద్యార్థులకు భయం ఉండదు. ఆటలు ఆడుకోవచ్చు, పాటలు పాడుకోవచ్చు. అంతా విద్యార్థుల ఇష్టం. ఉపాధ్యాయులు, విద్యార్థుల మధ్య ఆప్యాయత పెంపొందించేందుకు వివిధ రకాల కార్యక్రమాలు చేపడుతుంటారు. వీటి ద్వారా విద్యార్థులు, ఉపాధ్యాయులు ఒకరికొకరు కరచాలనం, ఆలింగనం చేసుకుంటారు. దీంతో పిల్లల్లో భయం పోయి ఉపాధ్యాయులతో ఆత్మీయంగా ఉంటారు. 23 గురుకుల పాఠశాలల్లో.. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే 23 గురుకుల పాఠశాలల్లో ప్రభుత్వం సేచ్ఛా పాఠశాలల విధానాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేస్తోంది. సొసైటీ క్రమక్రమంగా వాటిని మెరుగుపరిచేందుకు సరికొత్త కార్యాచరణను రూపొందిస్తున్నట్లు సంబంధిత అధికారులు పేర్కొంటున్నారు. అన్ని గురుకులాల్లో ఏర్పాటు చేయాలి ఫ్రీడం స్కూల్ విధానాన్ని దశలవారిగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గురుకులాల్లో అమలు చేయాలి. గురుకులంలో చదువుతున్న విద్యార్థిని 13 ఏళ్ల వయసులోనే ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించింది. వందలాది మంది విద్యార్థులు ఢిల్లీ, బెంగుళూరులో పేరుగాంచిన యూనివర్శిటీల్లో ఉన్నత చదువులు చదువుతున్నారు. ఫ్రీడం స్కూల్ విధానం అమలులోకి వస్తే విద్యార్థుల్లో సృజనాత్మకత పెరుగుతుంది. – అంబాల ప్రభాకర్, తెలంగాణ పేరెంట్స్ అసోసియేషన్(టీజీపీఏ) రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, జమ్మికుంట పరిజ్ఞానం పెరుగుతుంది రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే 23 గురుకులాల్లో స్వేచ్ఛా పాఠశాలల విధానం కొనసాగుతోంది. విద్యార్థుల్లో పరి జ్ఞానం పెరుగుతుంది. బోధన, అభ్యసన తదితర కార్యక్రమాలన్నీ విద్యార్థులే చూసుకోవడం వల్ల ప్రతీ అంశంపై చర్చించుకునే అవకాశం ఉంటుంది. ఇది భయాన్ని పోగొట్టే కార్యక్రమం. – పల్లె సురేందర్,రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, టీజీపీఏ, చింతకుంట కొత్త విషయాలు తెలుస్తాయి ఫ్రీడం స్కూల్ విధానంలో విద్యార్థులు కొత్త విషయాలు తెలుసుకుంటారు. కొత్తకొత్త పద్ధతులు అలవాటు చేసుకునేందుకు అవకాశం ఉంది. విద్యార్థులపై ఒత్తిడి లేని బోధన, అభ్యసన సాగాలనే ఉద్దేశంతో అమలు చేసిన స్వేచ్ఛా పాఠశాలల విధానాన్ని అన్ని గురుకుల పాఠశాలల్లో ప్రవేశపెట్టాలి. – గుడిసె అనిత, ముస్తాబాద్ -
గురుకులంలో కలకలం
సాక్షి, నిజామాబాద్ : గురుకులాల్లో పెడుతున్న ఆహారం నాణ్యమైనదేనా..? పౌష్టికాహారం పేరుతో నాసిరకం భోజనం పెడుతున్నారా..? అసలు గురుకులాల్లో ఏం జరుగుతోంది. రెండు రోజుల క్రితం బిచ్కుంద మండలంలోని మైనారిటీ గురుకులంలో కలుషిత ఆహారం తిని విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటన మరువక ముందే.. మరో గురుకులంలో అచ్చం ఇదే తరహా పరిస్థితి పునరావృతమైంది. నిజామాబాద్ శివారులోని నాగారంలో గల గిరిజన డిగ్రీ గురుకులంలో ఫుడ్ పాయిజన్‌తో 62 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. శనివారం రాత్రి భోజనం చేసిన తర్వాత విద్యార్థినులు కడుపునొప్పితో విలవిల్లాడి పోయారు. దీంతో వారిని హుటాహుటినప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేవలం రెండు రోజుల వ్యవధిలో ఒకే తరహా ఘటనలు జరగడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. రెండ్రోజుల్లో రెండు ఘటనలు.. కామారెడ్డి జిల్లాలోని బిచ్కుంద మండలంలో గల మైనారిటీ బాలుర గురుకుల పాఠశాలలో రెండు రోజుల క్రితం కలుషిత ఆహారం తిని 70 మంది ఆస్పత్రి పాలయ్యారు. నిజామాబాద్ నగర శివారులోని గొల్లగుట్ట తండా ప్రాంతంలో గల గిరిజన మహిళా డిగ్రి కళాశాలలో శనివారం రాత్రి భోజనం చేసిన 62 మంది విద్యార్థినులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. నాణ్యతపై అనుమానాలు.. నిజామాబాద్ జిల్లాలో ఐదు, కామారెడ్డిలో ఎనిమిది కలిపి ఉమ్మడి జిల్లాలో మొత్తం 13 గిరిజన సంక్షేమ గురుకులాలు ఉన్నాయి. ఉమ్మడి జిల్లాలో 25 మైనార్టీ గురుకులాలలు ఉన్నాయి. ఇందులో బాలుర–13, బాలికల గురుకులాలు–10, రెండు బాలుర ఇంటర్ బాలుర కళాశాలలున్నాయి. కేవలం రెండు రోజుల వ్యవధిలో గురుకులాల్లో ఫుడ్‌పాయిజన్ ఘటనలు జరగడం కలకలం రేపుతోంది. దీంతో గురకులాల్లో పెట్టే ఆహార నాణ్యతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నాసిరకంగా ఆహారాన్ని అందించడం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నాసిరకం వస్తువులు.. గురుకులాల్లో నాసిరకం వస్తువులు వినియోగిస్తున్నాయి. తాజా కూరగాయలు వినియోగించడం లేదు. గిరిజన గురుకులంలోని కిచెన్‌లో పరిశీలిస్తే ఆలుగడ్డలకు మొలకలు వచ్చి ఉన్నాయి. వీటీతోనే శనివారం ఆలు బజ్జీలు వేయించి విద్యార్థినులకు స్నాక్స్ పెట్టారు. అలాగే, టమాటలు సైతం కుళ్లి పోయి, వాటిపై చిన్నపాటి పురుగులు వాలుతున్నాయి. దోసకాయలు బాగా లేవు. పరిసరాలు సైతం అపరిశుభ్రంగా ఉన్నాయి. కారం, ఇతర సరుకులు కూడా నాసిరకమైనవి వినియోగిస్తున్నారు. బిచ్కుంద మైనారిటీ గురుకులంలోనూ కుళ్లిపోయిన గుడ్లను విద్యార్థులకు పెట్టారు. నాసిరకం కూరగాయలు సరఫరా చేస్తున్నట్లు విద్యార్థులే చెబుతున్నారు. గురుకుల్లో నాసిరకమైన ఆహారాన్ని అందించడం వల్లే విద్యార్థులు తరచూ అస్వస్థతకు గురవుతున్న ఘటనలు జరుగుతున్నాయి. తల్లిదండ్రుల ఆందోళన.. నాణ్యమైన విద్యతో పాటు పౌష్టికాహారాన్ని గురుకులాల్లో అందిస్తారనే భావన తల్లిదండ్రుల్లో ఉంది. అయితే, రెండు రోజుల వ్యవధిలో రెండు గురుకులాల్లో ఒకే రకమైన ఘటనలు జరగడంతో విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. విద్యార్థులు వాంతులు చేసుకున్న వెంటనే ఆస్పత్రులకు తరలించడంతో ఎవరికి ఏం జరగలేదు. ఏదైనా అనుకోని ఘటన జరిగితే ఎవరు బాధ్యులు అని తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని వారు వేడుకుంటున్నారు. గొల్లగుట్టలోని గిరిజన గురుకులం గిరిజన గురుకులంలో ఫుడ్ పాయిజన్! నిజామాబాద్ : గిరిజన రెసిడెన్షియల్ కళాశాల వసతి గృహంలో కలుషిత ఆహారం కారణంగా 62 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు!. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని నాగారం గొల్లగుట్ట ప్రాంతంలో గల గిరిజన రెసిడెన్షియల్ కళాశాల వసతి గృహంలో శనివారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. రాత్రి భోజనం చేసిన అనంతరం విద్యార్థులు కడుపునొప్పితో విలవిల్లాడారు. దీంతో వారిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి వైద్య పరీక్షలు చేయించారు. విద్యార్థులను పరామర్శించిన కలెక్టర్.. ఘటనపై విచారణకు ఆదేశించారు. గొల్లగుట్ట ప్రాంతంలో గిరిజన గురుకుల హాస్టల్లో 292 మంది విద్యార్థినులు ఉంటున్నారు. గురుకులాల కార్యదర్శి ప్రవీణ్‌కుమార్ జన్మదినం కావడంతో శనివారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో విద్యార్థులకు ప్రత్యేకంగా సేమియా చేసి పెట్టారు. అలాగే, పకోడి వడ్డించారు. రాత్రి 9 గంటల సమయంలో విద్యార్థినులు భోజనం చేశారు. అయితే, అరగంట తర్వాత వారికి కడుపు నొప్పి మొదలైంది. 62 మందికి తీవ్రమైన కడుపు నొప్పి రావడం, అందులో 10 మంది వాంతులు చేసుకోవడంతో అప్రమత్తమైన సిబ్బంది.. హుటాహుటిన ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తరలించారు. వారిని పరీక్షించిన వైద్యులు.. ఎలాంటి ప్రాణాపాయం లేదని తెలిపారు. విద్యార్థుల అస్వస్థతకు భోజనమే కారణమై ఉంటుందని వారు పేర్కొన్నారు. భోజనంపై కలెక్టర్ ఆరా.. కలెక్టర్ రామ్మోహన్రావు ఆదివారం ఉదయం ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చి విద్యార్థినులను పరామర్శించారు. హాస్టల్లో భోజనం ఎలా ఉంటుంది.. పౌష్టికాహారం పెడుతున్నారా? అని ఆయన అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు మెరుగైన చికిత్స అందించాలని వైద్యులను ఆదేశించారు. విద్యార్థులు రాత్రి చేసిన భోజనం శాంపిల్స్ సేకరించాలని సూచించారు. విద్యార్థులు అస్వస్థతకు గురైన విషయం తెలిసి తల్లిదండ్రులు ఆస్పత్రికి తరలి వచ్చారు. -
మా పిల్లలకు టీసీలు ఇవ్వండి..
సాక్షి, ఖమ్మం : అసలే అద్దెభవనాలు, ఆపై వాటిలో అరకొర వసతులు, విద్యార్థులకు సరిపడా టాయిలెట్స్, నీటి సౌకర్యం లేకుండా అవస్థలు పడుతూ గురుకుల పాఠశాలలో చదువులు కొనసాగించలేమని విద్యార్థులు, తల్లిదండ్రులు టీసీలు ఇవ్వాలని సోమవారం ఆందోళనకు దిగారు. వేరే ప్రాంతం నుంచి గురుకుల పాఠశాలను తరలించి ఒకే క్యాంపస్‌లో ఏర్పాటు చేయడాన్ని నిరసిస్తూ నగరంలోని వెలుగుమట్ల గుట్టపై ఉన్న ఖమ్మం నియోజకవర్గ గురుకుల పాఠశాలకు చెందిన విద్యార్థులు, వారి తల్లితండ్రులు ఆందోళనకు దిగారు. ఇలాంటి ఇబ్బందికర పరిస్థితిలో తమ పిల్లలను చదివించలేమని, టీసీలు ఇస్తే ఇంటికి తీసుకెళ్తామని పాఠశాలకు తాళం వేసి అందోళన చేశారు. జ్యోతిరావుపూలే బీసీ గురుకుల పాఠశాలను గత ఏడాది ఒక ప్రైవేటు కాలేజీ భవనాన్ని అద్దెకు తీసుకొని ఏర్పాటు చేశారు. పాఠశాలలో 5, 6, 7 తరగతులకు సంబంధించిన సుమారు 200 మందికిపైగా విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. అదే పాఠశాల ఆవరణంలో ఒక భవనంలో వైరా నియోజకవర్గంలోని తాటిపూడిలో ఉన్న బీసీ గురుకుల పాఠశాలకు కేటాయించారు. దసరా సెలవులకంటే ముందే తీసుకొచ్చే ప్రయత్నం చేస్తే అప్పటిలో తెలుసుకున్న విద్యార్థులు, తల్లితండ్రులు ఆందోళన చేశారు. తర్వాత దాన్ని వాయిదా వేశారు. తీరా సెలవులు అనంతరం పాఠశాలలు పునః ప్రారంభం రోజున ఖమ్మం నియోజకవర్గం పాఠశాలకు, ఒక భవనం, వైరా నియోజకవర్గం పాఠశాలకు మరొక భవనం కేటాయించి ఇక్కడ వసతి ఏర్పాటు చేశారు. రెండు పాఠశాల విద్యార్థులు తమ లగేజీలతో బస్సులు, ఆటోలలో పాఠశాలకు వచ్చారు. అసలే అరకొర వసతులతో ఇబ్బంది పడుతుంటే దానికి తోడు వేరే పాఠశాల నుంచి 200 మంది విద్యార్థులను ఇక్కడకు తరలించడంతో సమస్యలు ఏర్పడ్డాయి. చిన్నపాటి క్యాంపస్‌లో 400 మంది పైగా విద్యార్థులు ఉండటాన్ని బట్టి చూస్తే పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఈ సమస్యల మధ్య తమ పిల్లలను చదివించలేమని టీసీలు ఇవ్వాలంటూ ఉపాధ్యాయులపై వత్తిడి చేశారు. ఒకేసారి వందలాది మంది విద్యార్థులు, తల్లితండ్రుల రాకతో ఆ ప్రాంతం కోలాహలంగా మారింది. అసలే రోడ్డు పక్కన లేక పోవడంతో లోపల ఉన్న కిలో మీటరు రావడం కష్టంగా ఉందని, ఇలాంటి చోట వైద్య పరంగా ఇబ్బందులు ఉన్నాయని, ఇంత మందితో అద్దె భవనంలో సాగడం కష్టంగా ఉంటుందని నినాదాలు చేశారు. పాఠశాల గేటు వద్ద, ఖమ్మం–వైరా ప్రధాన రహదారిపై కూడా ఆందోళనకు దిగారు. -
ఫ్రీడం స్కూళ్లు: చదువు, పరీక్షలు మన ఇష్టం
సాక్షి, హైదరాబాద్: ఫ్రీడం స్కూల్.. అక్కడ పిల్లలకు పాఠ్యాంశ పుస్తకాలుండవు.. టీచర్లు గంటల తరబడి బ్లాకు బోర్డుపై బోధించే పద్ధతి కనిపించదు. బట్టీ పట్టే విధానం అస్సలుండదు. ఇదీ తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ (టీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్) పాఠశాలల్లో తీసుకొచ్చిన సరికొత్త కాన్సెప్ట్. విద్యార్థులపై ఒత్తిడి లేని విధంగా బోధన, అభ్యసన సాగాలనే లక్ష్యంతో ఎస్సీ గురుకుల సొసైటీ సరికొత్తగా ‘ఫ్రీడం స్కూల్’విధానాన్ని తీసుకొచ్చింది. గురుకులం నిర్వహణంతా సొసైటీ ఆధ్వర్యంలోనే సాగినప్పటికీ.. ఇక్కడ నిర్వాహకులు, బోధకులు, పరీక్షల విధానం, కార్యాచరణ అంతా విద్యార్థుల అభీష్టం మేరకే నడుస్తుంది. విద్యార్థుల సందేహాలను నివృత్తి చేయడమే ఉపాధ్యాయుల పని. మిగతా కార్యక్రమాలన్నీ విద్యార్థుల ఆలోచనలు, సూచనల మేరకే నడుస్తాయి. పాశ్చాత్య దేశాల్లో ఇప్పటికే అమల్లో ఉన్న ఈ విధానంపై పూర్తిగా అధ్యయనం చేసిన ఎస్సీ గురుకుల సొసైటీ.. రాష్ట్రంలో 23 గురుకుల పాఠశాలల్లో 6, 7, 8, 9 తరగతుల్లో ప్రయోగాత్మకంగా అమలు చేస్తోంది. ఈ విధానం విజయవంతమైతే అన్ని గురుకుల పాఠశాలల్లో అమలు చేయాలని సొసైటీ భావిస్తోంది. పెన్ను, పేపర్ లేని పరీక్షలు సాధారణంగా బడికి వేళ్లే పిల్లలకు పాఠ్యాంశ పుస్తకాలుంటాయి. వీటి ప్రకారం నిర్దేశించిన తేదీల్లో బోధన చేపడతారు. ఆమేరకు అభ్యసన పూర్తి చేసిన విద్యార్థులకు నిర్దేశిత షెడ్యూల్ ప్రకారం పరీక్షలు నిర్వహించి, అనంతరం ఫలితాలు ప్రకటిస్తారు. కానీ ఫ్రీడం స్కూల్ విధానంలో ఈ పద్ధతులేవీ కనిపించవు. ఒక్కో క్లాస్ 90 నిమిషాల పాటు ఉంటుంది. ప్రతి రోజూ 4 íపీరియడ్లు మాత్రమే ఉంటాయి. ప్రతి తరగతిలో 40 మంది విద్యార్థులుంటారు. ప్రతి నలుగురు విద్యార్థులతో ఒక బృందం చొప్పున క్లాస్‌రూముల్లో 10 బృందాలుంటాయి. ప్రతి బృందానికి ఒక లీడర్ ఉంటారు. విద్యార్థులకు పాఠ్య పుస్తకాలకు బదులుగా మాడ్యూల్స్ ఉంటాయి. వీటిలోని అంశాలపై విద్యార్థులే పరస్పరం వేర్వేరుగా, బృందంగా చర్చలు జరపడం, లోతుగా పరిశోధించడం లాంటివి చేస్తారు. ప్రతి మాడ్యూల్లో అం శం, దాని తాలూకూ చరిత్ర ఉం టుంది. వీటిపై గ్రూప్ డిస్కర్షన్స్తో పాటు మాడ్యూల్‌లోని అంశాలపై స్కిట్లు రూపొందించడం, డిబేట్, క్విజ్ ఏర్పాటు చేయడం లాంటివి చేస్తారు. దీంతో ప్రతి అంశంపై విద్యార్థులకు లోతైన జ్ఞానం వస్తుంది. ఇక్కడి విద్యార్థులకు సాధారణ స్కూల్లో నిర్వహించే పరీక్షలుండవు. ఇక్కడ జరిగే పరీక్షల్లో విద్యార్థులు పెన్ను, పేపర్లను వినియోగించరు. స్కిట్స్, డిబేట్స్, క్విజ్, డ్రామా లాంటి అంశాలతోనే వారికి మార్కులు పడతాయి. బోధన, అభ్యసన అంశాలు, పరీక్షల నిర్వహణకు విద్యార్థుల ఆమోదం తప్పనిసరి. తరగతి గదిలో మెజార్టీ విద్యార్థుల అభిప్రాయం మేరకు ఆరోజు కార్యక్రమాలు సాగుతాయి. ఈ స్కూళ్లు ఎక్కడెక్కడంటే.. రాష్ట్రవ్యాప్తంగా 23 గురుకుల పాఠశాలలను ఫ్రీడం స్కూల్ పద్ధతిలో నిర్వహిస్తున్నారు. బోథ్, బెల్లంపల్లి, మంచిర్యాల, హయత్‌నగర్, సరూర్‌నగర్, కొందుర్గు, శంషాబాద్, ఆర్కేపురం, చేవెళ్ల, నార్సింగి, షేక్‌పేట్, చొప్పదండి, తిరుమలాయపాలెం, వెల్దండ, గద్వాల్, ఆర్.ఆర్.గూడెం, సిద్దిపేట్ రూరల్, ములుగు, చండూరు, వేల్పుర్, వరంగల్ ఈస్ట్, అడ్డగూడురు, చౌటుప్పల్ గురుకుల పాఠశాలల్లో ఈ విధానాన్ని అమలు చేస్తున్నారు. ఈ పాఠశాలల నిర్వహణపై ప్రతి నెలా సమీక్ష నిర్వహిస్తున్న సొసైటీ క్రమక్రమంగా వాటిని మెరుగుపర్చేందుకు సరికొత్త కార్యాచరణ ప్రణాళికలు తయారు చేస్తున్నారు. -
గురుకులాలు దేశానికే ఆదర్శం: మంత్రి కొప్పుల
సాక్షి, హైదరాబాద్ : గురుకుల పాఠశాలల్లో అడ్మిషన్ల కోసం వేలాది మంది పోటీ పడడం ఏ రాష్ట్రంలో లేదని, ఈ విషయంలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఉద్ఘాటించారు. మంగళవారం ఖైరతాబాద్ బాలికలు, సనత్‌నగర్‌లో బాలుర మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలలను మంత్రి తనిఖీ చేశారు. విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకుని వారితో కలిసి భోజ నం చేశారు. కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా గురుకుల పాఠశాలల్లో విద్యను అందించిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. -
గురుకులంలో టెన్షన్ టెన్షన్..
సాక్షి, ఆదిలాబాద్‌రూరల్ :ఐరన్ మాత్రలు వికటించి.. 57 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురైన ఘటన ఆదిలాబాద్ అనుకుంట మహాత్మా జ్యోతి బాపూలే బాలికల గురుకుల పాఠశాలలో గురువారం వెలుగు చూసింది. మండల వైద్యాధికారి రోజారాణి విద్యార్థులకు పాఠశాలలో పరీక్షలు నిర్వహించారు. పాఠశాలలో 400 మంది విద్యార్థినులు చదువకుంటున్నారని, గురువారం అల్పాహారం చేసి.. ఐరన్ మాత్రలు వేసుకున్నారని, మధ్యాహ్నం కొందరు వాంతులు చేసుకున్నారని, తల తిప్పుతున్నట్లు అనిపిస్తోందని చెప్పగా.. వెంటనే ఆదిలాబాద్‌లోని రిమ్స్‌కు తరలించామన్నారు. 57మంది విద్యార్థినుల్లో 40 మందికి తీవ్ర అస్వస్థత ఉన్నట్లు పేర్కొన్నారు. కాగా, డీఎంహెచ్‌వో డాక్టర్ చందు, జిల్లా విద్యాశాఖ అధికారి రవీందర్ రెడ్డి, గురుకుల పాఠశాల రీజినల్ కోఆర్డినేటర్ గోపీచంద్ పరిస్థితిని సమీక్షించారు. వాంతులు చేసుకుంటున్న విద్యార్థిని -
11 గురుకులాలు
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో నూతన గురుకులాలు ప్రారంభం కానున్నాయి. నియోజకవర్గానికి ఒకటి చొప్పున ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వ యంత్రాంగం సిద్ధమైంది. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని పూర్తిస్థాయిలో ఉన్న 11 నియోజకవర్గాల్లో 11 గురుకులాలను జూన్ 1వ తేదీన ప్రారంభించనున్నారు. అయితే కల్వకుర్తి నియోజకవర్గానికి సంబంధించి కడ్తాల(రంగారెడ్డి జిల్లా)లో ఏర్పాటు చేయనున్నారు. కొడంగల్, షాద్‌నగర్ రంగారెడ్డి జిల్లా పరిధిలోకి వెళ్లాయి. కొత్తవాటి ఏర్పాటుతో ఉమ్మడి జిల్లాలో గురుకులాల సంఖ్య 26కి పెరగనుంది. ఒక్కో గురుకులంలో 240 మంది విద్యార్థులకు అడ్మిషన్లు ఇచ్చే అవకాశం. తెలంగాణరాష్ట్ర ఏర్పాటు కాకముందు నాగర్‌కర్నూల్, కల్వకుర్తి, చిట్యాల్‌లో మాత్రమే గురుకులాలు ఉండేవి. అయితే 2017–18 విద్యాసంవత్సరంలో ప్రభుత్వం 12 గురుకులాలను ఏర్పాటు చేసింది. ఇక ఈ విద్యాసంవత్సరంలో కూడా 11 గురుకులాలను ఏర్పాటు చేయడంతో మొత్తం సంఖ్య 26కు చేరనుంది. ఇది వరకు ఆయా నియోజకవర్గాల్లో బాలుర గురుకులం ఉంటే కొత్తగా బాలికలకు సంబంధించి, బాలికల గురుకులం ఉంటే బాలురులకు సంబంధించి ఏర్పాటు చేయనున్నారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ఉమ్మడి జిల్లాలో విద్యార్థులకు నాణ్యమైన విద్యతో అందే అవకాశం. విద్యార్థులకు నాణ్యమైన విద్య.. విద్యాపరంగా వెనుకబడిన పాలమూరు జిల్లాలో నూతన గురుకులాల ఏర్పాటు పేద విద్యార్థులకు వరంగా మారనుంది. ఏటేటా గురుకులాల్లో ఫలితాలు చాలా మెరుగుపడడంతో వాటిలోనే విద్యార్థులను చేర్పించేందుకు తల్లిదండ్రులు మొగ్గు చూపుతున్నారు. విద్యతో పాటు నాణ్యమైన భోజనం, పుస్తకాలు, దుస్తులు వంటి అనేకం ఉచితంగా లభించడంతో కార్పొరేట్ స్థాయి విద్యను ప్రభుత్వం అందించే అవకాశాలు మొండుగా ఉన్నాయి. సీట్ల భర్తీ ఇలా.. బీసీ గురుకులాల్లో సీట్ల భర్తీ ప్రక్రియ కోసం ప్రభుత్వం బీసీ గురుకులాలకు ప్రవేశాలకు సంబంధించి గతనెల ప్రవేశ పరీక్ష నిర్వహించింది. వీటితో పాటు అన్ని గురుకులాలకు కామన్ ప్రవేశ పరీక్ష కూడా నిర్వహించారు. వీటిలో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు సీట్లును కేటాయిస్తారు. బీసీ గురుకుల్లాలో మొదటి ప్రాధానత్య కింద 70శాతం సీట్లను బీసీ వర్గాలకు చెందిన వారికి కేటాయిస్తారు. మిగిలిన వాటిని వివిధ వర్గాల వారి రిజర్వేషన్ల ఆధారంగా కేటాయిస్తారు. ప్రస్తుతం ప్రారంభమయ్యే గురుకులాల్లో మొదటగా 5, 6, 7 తరగతులకు సంబంధించి అడ్మిషన్లు తీసుకోనున్నారు. వీటిలో ఒక్కో తరగతికి రెండు సెక్షన్ల చొప్పున విభజిస్తారు. ఒక్కో సెక్షన్లో 40 మంది విద్యార్థులను చేరిస్తారు. ఇలా రెండో సెక్షన్లలు కలిపి 80 మంది విద్యార్థులు, మూడు తరగతులు కలిపి మొత్తం ఒక్క గురుకులాల్లో 240 మందిని చేర్పిస్తారు. వీటితో పాటు నూతన గురుకులాల్లో బోధన, బోధనేతర సిబ్బంది కూడా పెద్ద ఎత్తున భర్తీ చేసేందుకు ప్రభుత్వం ముమ్మర కసరత్తు చేస్తోంది. గతంలో గురుకులా టీఆర్టీ ద్వారా భర్తీ చేసిన అధ్యాపకులతో పాటు, గతంలో వివిధ గురుకులాల్లో పనిచేసిన గెస్టు, ఔట్ సోర్సింగ్ అధ్యాపకులు, బోధనేతర సిబ్బందిని విధుల్లోకి తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. దీని ద్వారా జిల్లా లో యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కూడా మెరుగుపడే అవకాశం ఉంది. -
బీసీ గురుకులాలదే అగ్రస్థానం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఇంటర్మీడియెట్ ఫలితాల్లో ఈసారి బీసీ గురుకులాల విద్యార్థులు సత్తా చాటారు. ఏకంగా 89.8 శాతం ఉత్తీర్ణత సాధించి అగ్రభాగాన నిలిచారు. ఆ తరువాతి స్థానంలో విద్యాశాఖ గురుకులాలు 88.8 శాతం ఉత్తీర్ణత సాధించాయి. ఎయిడెడ్ కాలేజీలు మాత్రం 50.1 శాతం ఉత్తీర్ణతతో చివరి స్థానంలో నిలిచాయి. తెలంగాణ ఇంటర్మీడియెట్ ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాలను విద్యాశాఖ కార్యదర్శి బి. జనార్దన్‌రెడ్డి గురువారం సాయంత్రం 5 గంటలకు హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఎప్పటిలాగే బాలికలు అత్యధిక ఉత్తీర్ణత సాధించారు. తగ్గిన ఉత్తీర్ణత శాతం... రాష్ట్రంలో ఫిబ్రవరి 27 నుంచి మార్చి 18 వరకు జరిగిన ఇంటర్ పరీక్షలకు ప్రథమ, ద్వితీయ సంవత్సరాల రెగ్యులర్ విద్యార్థులు 8,70,924 మంది హాజరయ్యారు. అందులో ప్రథమ సంవత్సర విద్యార్థులు 4,52,653 మంది పరీక్షలకు హాజరవగా 2,70,575 మంది (59.8 శాతం) ఉత్తీర్ణులయ్యారు. ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 4,18,271 మంది పరీక్షలకు హాజరవగా వారిలో 2,71,949 మంది (65 శాతం) ఉత్తీర్ణులయ్యారు. ప్రథమ సంవత్సరం జనరల్‌లో బాలికలు 66.2 శాతం ఉత్తీర్ణత సాధిస్తే బాలురు 55 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. ద్వితీయ సంవత్సరం జనరల్ రెగ్యులర్ విద్యార్థుల్లో బాలికలు 70.8 శాతం మంది ఉత్తీర్ణులు కాగా, బాలురు 58.2 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. గతేడాదితో పోల్చితే ఈసారి ఉత్తీర్ణత శాతం తగ్గిపోయింది. గతేడాది ద్వితీయ సంవత్సరంలో 67.06 శాతం మంది ఉత్తీర్ణులవగా ఈసారి 65 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. ప్రథమ సంవత్సరంలో 1,18,455 మంది బాలురు ఉత్తీర్ణత సాధించగా 1,52,120 మంది బాలికలు ఉత్తీర్ణులయ్యారు. ద్వితీయ సంవత్సరంలో 1,18,591 మంది బాలురు ఉత్తీర్ణులుకాగా 1,53,358 మంది బాలికలు ఉత్తీర్ణులయ్యారు. ద్వితీయ సంవత్సరం ప్రైవేటు విద్యార్థులు 72,365 మంది పరీక్షలకు హాజరుకాగా 18,365 మంది (25.8 శాతం) ఉత్తీర్ణులయ్యారు. మేడ్చల్ టాప్.. మెదక్ లాస్ట్ ఇంటర్ ఫలితాల్లో మేడ్చల్ జిల్లా తొలిస్థానంలో నిలిచింది. ప్రథమ సంవత్సరం జనరల్‌లో మేడ్చల్ జిల్లా 76 శాతం ఉత్తీర్ణత సాధించగా 71 శాతం ఉత్తీర్ణతతో రంగారెడ్డి జిల్లా రెండో స్థానంలో నిలించింది. మెదక్ జిల్లా మాత్రం 29 శాతం ఉత్తీర్ణతతో చివరి స్థానానికి పరిమితమైంది. ద్వితీయ సంవత్సరం జనరల్‌లో మేడ్చల్ జిల్లా 76 శాతం ఉత్తీర్ణతతో ప్రథమ స్థానంలో నిలవగా 75 శాతం ఉత్తీర్ణతతో కొమురం భీం జిల్లా రెండో స్థానంలో నిలిచింది. కేవలం 35 శాతం ఉత్తీర్ణతతో మెదక్ జిల్లా చివరి స్థానంలో ఉంది. ద్వితీయ సంవత్సరం వొకేషనల్‌లో 87 శాతం ఉత్తీర్ణతతో ఆదిలాబాద్ ప్రథమ స్థానంలో నిలవగా, కొమురం భీం జిల్లా 83 శాతం ఉత్తీర్ణతతో రెండో స్థానంలో నిలిచింది. 51 శాతం ఉత్తీర్ణతతో జగిత్యాల జిల్లా చివరి స్థానంలో ఉంది. వచ్చే నెల 14 నుంచి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలను మే 14 నుంచి నిర్వహించాలని బోర్డు నిర్ణయించింది. అయితే ఎన్నికలనుబట్టి ఈ తేదీల్లో మార్పులు ఉండే అవకాశం ఉందని పేర్కొంది. పరీక్షలకు హాజరు కావాలనుకునే విద్యార్థులతోపాటు రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్ కావాలనుకునే విద్యార్థులు ఈ నెల 25లోగా ఫీజు చెల్లించాలని బోర్డు కార్యదర్శి అశోక్ తెలిపారు. ప్రథమ సంవత్సరంలో అన్ని పేపర్లు ఉత్తీర్ణులైన విద్యార్థులు పరీక్ష ఫీజుకు అదనంగా ఒక్కో పేపరుకు రూ. 150 చొప్పున చెల్లించి ఇంప్రూవ్మెంట్ రాసుకోవచ్చని పేర్కొన్నారు. రెండింటిలో ఎందులో ఎక్కువ మార్కులుంటే వాటిని పరిగణనలోకి తీసుకుంటామని వెల్లడించారు. ద్వితీయ సంవత్సరం విద్యార్థులు రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్ కమ్ స్కాన్డ్ జవాబు పత్రాల కాపీ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. విద్యార్థులు రీ కౌంటింగ్ కోసం ప్రతి పేపరుకు రూ. 100 చొప్పున చెల్లించాలని, ఇందుకోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అలాగే రీ వెరిఫికేషన్ కమ్ స్కాన్డ్ జవాబు పత్రాల కాపీ కోసం ఒక్కో పేపరుకు రూ. 600 చొప్పున చెల్లించాలని సూచించారు. విద్యార్థులు ఈ నెల 19 నుంచి 25లోగా ఆన్లైన్లో ( ఠీఠీఠీ. bజ్ఛీ. ్ట్ఛl్చnజ్చn్చ. జౌఠి. జీn) దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. సాఫ్ట్వేర్ ఇంజనీర్‌నవుతా.. వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన నేను అధ్యాపకుల స్ఫూర్తి, తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ఎంపీసీలో 993 మార్కులు సాధించి రాష్ట్రస్థాయిలో మొదటి ర్యాంకు సాధించా. సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలనేది నా లక్ష్యం. బిట్స్ పిలానీలో సీఎస్సీలో సీటు సంపాదిస్తా. -ఎన్. శశిధర్‌రెడ్డి, ఎంపీసీ స్టేట్ ఫస్ట్ ర్యాంకర్ (993 మార్కులు), అల్పోర్స్ కళాశాల(ద్వితీయ), కరీంనగర్ ఫలితాల తగ్గుదలకు ప్రధాన కారణాలు.. ఇంటర్మీడియెట్ ఫలితాలు గతేడాది కంటే ఈసారి 2 శాతం తగ్గిపోయాయి. గతేడాది ప్రథమ సంవత్సరంలో 62.73 శాతం మంది ఉత్తీర్ణులుకాగా ఈసారి 60.5 శాతం మందే ఉత్తీర్ణులయ్యారు. అలాగే గతేడాది ద్వితీయ సంవత్సరం 67.06 శాతం మంది ఉత్తీర్ణులుకాగా ఈసారి 65 శాతం మంది మాత్రమే ఉత్తీర్ణులయ్యారు. ద్వితీయ సంవత్సరంలో గత రెండేళ్లతో పోల్చుకున్నా ఈసారి ఫలితాలు తగ్గిపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఇందుకు అనేక కారణాలు ఉన్నాయి. 2018–19 విద్యా సంవత్సరం జూన్‌లో పూర్తి కావాల్సిన మొదటి దశ ప్రవేశాలు ఆగస్టు చివరి వరకు కొనసాగడం. ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో జూన్‌లో తరగతులు ప్రారంభమైనా 1,200 మంది గెస్ట్ ఫ్యాకల్టీని ఆగస్టులో నియమించడం. జూన్, జూలైలలో అధ్యాపకుల బదిలీలతో పాఠ్యాంశాల బోధనకు ఆటంకం ఏర్పడటం. గ్రామ పంచాయతీ ఎన్నికలు, ముందస్తు అసెంబ్లీ ఎన్నికల వల్ల పాఠ్యాంశాల బోధన సకాలంలో పూర్తికాకపోవడం. ఎంపీసీలో 993.. బైపీసీలో 992.. ఇంటర్మీడియెట్ ఫలితాల్లో టాప్ మార్కులివే తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాల్లో ఈసారి అత్యధిక మార్కులు 993. ఈ మార్కులను ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఎంపీసీలో ఒకే ఒక్క విద్యార్థి నల్ల శశిధర్‌రెడ్డి సాధించగా ఆ తరువాత 992 మార్కులను బి. ఉమామహేశ్వర్‌రెడ్డి, ఎస్. దినేశ్‌రెడ్డి సాధించారు. బైపీసీలో 992 మార్కులతో చల్లా దీపికారెడ్డి టాపర్‌గా నిలవగా ఆ తరువాత 991 మార్కులతో బింగి సాయితేజ రెండో ర్యాంకు సాధించాడు. ఎంఈసీలో 987 మార్కులతో వి. వంశీ తొలి ర్యాంకు సాధించగా ఆ తరువాత 985 మార్కులతో డి. వైష్ణవి రెండో ర్యాంకు సాధించింది. హెచ్ఈసీలో అత్యధిక మార్కులు 964 పీఎస్ఎన్ సౌగంధికకు లభించాయి. సీఈసీలో అత్యధిక మార్కులు 979 దివాన్ శివానీకి లభించాయి. చల్లా దీపికారెడ్డి, నల్ల శశిధర్‌రెడ్డి ప్రథమ సంవత్సరంలో.. ప్రథమ సంవత్సరం ఎంపీసీలో నలుగురికి అత్యధికంగా 467 మార్కులు లభించగా 33 మందికి 466 మార్కులు వచ్చాయి. బైపీసీలో ముగ్గురికి అత్యధికంగా 437 మార్కులు లభించాయి. ఎంఈసీలో ముగ్గురికి అత్యధికంగా 494 మార్కులు రాగా హెచ్ఈసీలో ఒక్కరికే అత్యధికంగా 486 మార్కులు లభించాయి. సీఈసీలో ఇద్దరికి అత్యధికంగా 492 మార్కులు లభించాయి. పరీక్షకు హాజరైనా ఆబ్సెంట్? ఇంటర్ పరీక్షల ప్రాసెసింగ్‌లో లోపాలు తలెత్తినట్లు తెలిసింది. సాఫ్ట్వేర్ సమస్యలతో వందలాది మంది విద్యార్థులకు తప్పుల తడకగా మార్కులు వచ్చాయని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. పరీక్షలకు హాజరైనా పలువురు విద్యార్థులను ఆబ్సెంట్ అయినట్లు చూపించి ఫెయిల్ చేసినట్లు సమాచారం. ముఖ్యంగా మేడ్చల్ జిల్లాలోని ఓ కార్పొరేట్ కాలేజీకి చెందిన విద్యార్థులు పరీక్షకు హాజరైనా ఫలితాల్లో ఫెయిల్ చేసినట్లు విద్యార్థి సంఘాలు పేర్కొన్నాయి. ఒక్క సబ్జెక్ట్ మినహా అన్ని సబ్జెక్టుల్లో 831 మార్కులు వచ్చిన ఒక విద్యార్థి ఇంగ్లీష్ పేపర్–2 పరీక్షకు హాజరుకానట్లుగా మెమోల్లో ఆబ్సెంట్ వచ్చింది. అయితే ఆ విద్యార్థి పరీక్షకు హాజరయ్యారని సదరు కాలేజీ వర్గాలు పేర్కొన్నాయి. 810 మార్కులు వచ్చిన మరో విద్యార్థికి మాథ్స్ పేపర్–2బీలో 17 మార్కులే వచ్చినట్లు చూపించారని, బాగా చదివే ఆ విద్యార్థికి అంత తక్కువ మార్కులు వచ్చే అవకాశమే లేదని చెప్పారు. 841 మార్కులు వచ్చిన మరో విద్యార్థిని సంస్కృతం పేపర్–2లో ఆబ్సెంట్గా చూపించి ఫెయిల్ చేశారన్నారు. మరోవైపు వందల మంది విద్యార్థులకు ఫలితాలే ఇవ్వలేదని విద్యార్థి సంఘాల నేతలు ఆరోపించారు. అనేక మంది విద్యార్థులు తమ హాల్ టికెట్ నంబర్‌తో ఫలితాలు చూసుకోగా ఇన్వ్యాలిడ్ హాల్ టికెట్ నంబర్ అని వస్తోందని, దీంతో వారంతా తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని పేర్కొన్నారు. సామర్థ్యంలేని సాఫ్ట్వెర్ సంస్థకు ఫలితాల ప్రాసెస్ పనులను అప్పగించడం వల్లే ఇలాంటి తప్పిదాలు దొర్లాయని అధ్యాపకులు పేర్కొంటున్నారు. సమస్యలపై మొదటి నుంచీ మొత్తుకుంటున్నా బోర్డు అధికారులు పాటించకుండా విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడారని అధ్యాపకులు మండిపడుతున్నారు మేడ్చల్‌లోని సదరు కార్పొరేటు కాలేజీ యాజమాన్యానికి బోర్డు ఉన్నతాధికారుల నుంచి అందిన ఆదేశాల మేరకు విద్యార్థులను కూడా బయటకు రాకుండా కాలేజీ క్యాంపస్ గదుల్లోనే పెట్టినట్లు విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. -
గురుకులంలో ప్రవేశానికి దరఖాస్తుల స్వీకరణ
వైరా: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ కేజీ టూ పీజీ’ మిషన్‌లో భాగంగా నిర్వహిస్తున్న సాంఘిక సంక్షేమ, గిరిజన సంక్షేమ, వెనుకబడిన తరగతుల సంక్షేమ, విద్యాశాఖ గురుకుల పాఠశాలల్లో 2019–020 విద్యా ఏడాదికి 5వ తరగతిలో ఆంగ్ల ప్రవేశాలకు దరఖాస్తుల స్వీకరణ ఫిబ్రవరి 18న ప్రారంభమైంది. ఈ ప్రక్రియ మార్చి 10 వరకు కొనసాగుతుంది. ఏప్రిల్ 7న ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నాం 1 గంట వరకు ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. జిల్లాలో 2017 జూన్‌లో ప్రారంభించబడిన 26 బీసీ, ఎస్సీ, ఎస్టీ టీఎస్ గురుకుల పాఠశాలలు, గురుకుల పాఠశాలల్లో ప్రవేశాలకు కోసం ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇవే పాఠశాలలు.. సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలలు.. అడవి మల్లేల, కల్లూరు, వైరా, నేలకొండపల్లి, టేకులపల్లి, దానవాయిగూడెం, ఎర్రుపాలెం సాంఘిక సంక్షేమ గురుకుల బాలుర పాఠశాలలు. కూసుమంచి, తిరుమాలయపాలెం, మధిర, ముదిగొండ, సత్తుపల్లి, బీసీ సాంఘిక సంక్షేమ బాలికల పాఠశాలలు ఎర్రుపాలెం, చెరువుమాదారం, దానవాయిగూడెం, ముసలిమడుగు, లంకపల్లి, వైరా బీసీ సాంఘిక సంక్షేమ బాలుర పాఠశాలలు. బోనకల్, కుంచపర్తి, గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో తిరుమాలయాపాలెం, కారేపల్లి,(బాలురు), వైరా (బాలికలు). మైనారిటీ వెల్ఫేర్ పాఠశాలలు.. ఖమ్మం, నేలకొండపల్లి, మధిర, సత్తుపల్లి (బాలుర), రఘునాధపాలెం, వైరా, ఖమ్మం (బాలికలు) టీఎస్‌ఆర్‌ఎస్‌లో... వైరా (బాలికలు), ఏన్కూరు (బాలురు) ప్రవేశానికి అర్హతలు.. ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో 2018–19 విద్యా సంవత్సరంలో 4వ తరగతి చదువుతున్న విద్యార్థులు. 01.09.2019 నాటికి 9 నుంచి 11 ఏళ్ల వయ స్సు కలిగిన పిల్లలు అర్హులు కాగా, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు రెండేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది. తల్లిదండ్రుల వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాల వారికైతే రూ.లక్ష 50 వేలు, పట్టణ ప్రాంతాల్లో రూ.2లక్షలు మించరాదు. ఇవన్నీ ఉంటే గురుకులంలో 5వ తరగతిలో ప్రవేశం పొందవచ్చు. రిజర్వేషన్లు... సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో ఎస్సీలకు 75 శాతం, బీసీ (సీ)లకు 2 శాతం, ఎస్టీలకు 6శాతం, బీసీలకు 12శాతం, ఇతరులకు 2 శాతం, మైనార్టిలకు 3 శాతం రిజర్వేషన్లు వర్తిస్తాయి. గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలల్లో ఎస్సీలు 12 శాతం, ఎస్టీలకు 80 శాతం, బీసీలకు 5 శాతం, ఇతరులకు 3 శాతం ఉంటాయి. బీసీ సంక్షేమ గురుకుల పాఠశాలల్లో ఎస్సీలకు 15శాతం, బీసీ–సీలకు 3 శాతం, ఎస్టీలకు 6 శాతం, బీసీలకుక 71శాతం (బీసీ–ఏ 20 శాతం, బీసీ–బీ 28శాతం, బీసీ–డీ 19 శాతం, బీసీ–ఈ 4శాతం) సైనిక ఉద్యోగుల పిల్లలకు 3 శాతం ఉంటాయి. ముస్లిం మైనారిటీ గురుకుల పాఠశాలల్లో ఎస్సీలకు 15 శాతం, ఎస్టీలకు 6 శాతం, మైనార్టీలకు 73 శాతం, అనాథలకు 3 శాతం, వికలాంగులకు 3 శాతం చొప్పున సీట్లు కేటాయించారు. దరఖాస్తు విధానం.. దరఖాస్తు విధానం పూర్తిగా ఆన్లైన్లో నిర్వహిస్తున్నారు. టీఆర్ఈఎస్ఐడీఈ ఎన్టీఐఏఎల్.సీజీజీ.జీఓవీ.ఇన్ వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఆన్లైన్ అప్లికేషన్ల కోసం విద్యార్థులు రూ.100 చెల్లించాల్సి ఉంటుంది. ఉద్దేశపూర్వకంగా ఎలాంటి తప్పుడు సమాచారం ఇచ్చినా, వేరేవారి ఫొటోలు పెట్టి దరఖాస్తు చేసినా సెక్షన్ 416 ఐపీసీ (1860) ప్రకారం క్రిమినల్ చర్యలు తీసుకుంటారు. ఇతర సమాచారం కోసం ఉచిత హెల్ప్‌లైన్ నం బర్ 1800 425 45678లో సంప్రదించవచ్చు. మైనార్టీ గురుకులాలకు ప్రత్యేక నోటిఫికేషన్.. ప్రస్తుతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, విద్యాశాఖ సొసైటీ గురకుల పాఠశాలల్లో 5వ తరగతి సీట్ల భర్తీకి మాత్రమే నోటిఫికేషన్ ఇచ్చారు. మైనార్టీ గురుకుల పాఠశాలలో కోసం ప్రత్యేక నియామక నోటిఫికేషన్ విడుదల చేశారు. దరఖాస్తుకు చివరి తేదీ మార్చి 31, ప్రవేశపరీక్ష ఏప్రిల్ 24వ తేదీన నిర్వహిస్తారు. రాత పరీక్ష... ఏప్రిల్ 07,2019న ఉదయం 11 నుంచి 1 గంట వరకు నిర్వహించే ప్రవే శపరీక్ష జిల్లా కేంద్రంలోని పరీక్ష కేంద్రాల్లో తెలుగు, ఉర్దూ, ఆంగ్లమాధ్యమాల్లో ఉంటుంది. 4వ తరగతి సామార్థ్యాల స్థాయికి అనుగుణంగా తెలుగు, ఉర్ధూ, గణితం, పరిసరాల విజ్ఞానం, ఆంగ్ల విషాయాలపై 25 మార్కుల చొప్పున 100 మార్కులు ఐచ్చిక తరహ ప్రశ్నలు ఉంటాయి. ఇందులో వచ్చిన మార్కుల ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు. ముఖ్యమైన తేదీలు... ఏప్రిల్ 2 నుంచి 7 వరకు హాల్‌టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఏప్రిల్ 7 ఆదివారం ఉదయం 11 నుంచి 1 గంట వరకు 5వ తరగతి ప్రవేశపరీక్ష మే నెలలో ఫలితాలు వెల్లడి మెరిట్ లిస్ట్ ఆధారంగా విద్యార్ధులను ఎంపిక చేసి, అనంతరం ధృవీకరణ పత్రాలను పరిశీలిస్తారు. జూన్ 1 నుంచి తరగతులు ప్రారంభం. -
గురుకులాల నోటిఫికేషన్
సాక్షి, హైదరాబాద్: సాంఘిక సంక్షేమ గురు కుల పాఠశాలల్లో ఐదో తరగతి ప్రవేశాల నోటిఫికేషన్ విడుదలైంది. ఈనెల 18వ తేదీ నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ శాఖలు, విద్యాశాఖ పరిధిలో 497 గురుకుల పాఠశాలలు కొనసాగుతున్నాయి. 2019–20 విద్యా సంవత్సరంలో బీసీ సంక్షేమ శాఖ పరిధిలో అదనంగా 119 గురుకుల పాఠశాలలు తెరిచేందుకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈనేపథ్యంలో నాలుగు సొసైటీల పరిధిలో 616 గురుకుల పాఠశాలలు అందుబాటులోకి రానున్నాయి. ఒక్కో గురుకుల పాఠశాలలో ఐదో తరగతి కింద 80మందికి ప్రవేశాలు కల్పించనున్నారు. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని గురుకులాల్లో కలిపి 49,280 సీట్లు భర్తీ చేయనున్నారు. ధరఖాస్తు రుసుం రెట్టింపు: గురుకుల పాఠశాలలో ప్రవేశానికి సంబంధించిన దరఖాస్తును ఆన్లైన్లో పూర్తిచేయాల్సి ఉంటుంది. ఇందుకు సమీపంలోని మీ–సేవా కేంద్రాలు లేదా ఇంటర్నెట్లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు సమర్పణ సమయంలోనే ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. కాగా, ఈసారి దరఖాస్తు రుసుమును ప్రభుత్వం రెట్టింపు చేసింది. గతేడాది దరఖాస్తు రూ.50 ఉండగా.. ఈసారి ఆ మొత్తాన్ని రూ.100కు పెంచారు. ఈనెల 18వ తేదీనుంచి మార్చి 10వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తులు సమర్పించవచ్చు. ప్రతి దరఖాస్తుదారుడు తన ఆధార్ వివరాల్ని కచ్చితంగా పొందుపరచాల్సిందే. ఏప్రిల్ 7వ తేదీన అర్హత పరీక్ష నిర్వహిస్తారు. ఉదయం 11గంటల నుంచి మధ్యాహ్నం 1గంటల వరకు పరీక్ష జరగనుంది. దరఖాస్తుకు సంబంధించి సందేహాల నివృత్తి, గురుకుల పాఠశాలలకు సంబంధించిన సమాచారం కోసం హెల్ప్‌లైన్ నంబర్ 1800–425–45678 నంబర్లో.. లేదా http://tswreis.in, http://tresidential. cgg.gov.in, http://tgtwgurukulam. telangana.gov.in, http://mjptb cwreis.cgg.gov.in, http://tgcet.cgg. gov.in వెబ్సైట్లను చూడాలని సెట్ చీఫ్ కన్వీనర్ ఆర్.ఎస్. ప్రవీణ్‌కుమార్ తెలిపారు. మైనార్టీల్లో ప్రత్యేకం ప్రస్తుతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, విద్యాశాఖ సొసైటీల్లోని గురుకుల పాఠశాలల్లో ఐదోతరగతి సీట్లభర్తీకి మాత్రమే నోటిఫికేషన్ ఇచ్చారు. మైనార్టీ గురుకుల పాఠశాలలకోసం ప్రత్యేక నియామక నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. అదేవిధంగా అన్ని గురుకుల సొసైటీల్లో 6 నుంచి 10వ తరగతి వరకున్న ఖాళీల భర్తీకి కూడా ప్రత్యేక నోటిఫికేషన్లు ఇస్తారు. వీటి భర్తీ ఈ విద్యాసంవత్సరం ముగిసిన తర్వాత ఏర్పడే ఖాళీలపై ఆధారపడి ఉంటుంది. -
గురుకుల సంస్థలు మెరవాలంటే..?
పీవీ నరసింహారావు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పదవి చేపట్టక ముందు కాసు బ్రహ్మానందరెడ్డి కేబినెట్లో విద్యాశాఖ నిర్వహించారు. సీఎం అయ్యాక విద్యా రంగంలో ఉన్న అనుభవంతో కొన్ని వినూ త్న కార్యక్రమాలు చేపట్టారు. అలా మొదలైనవే రెసిడెన్షియల్ విద్యాసంస్థలు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతిభా వంతులైన విద్యార్థులను ఒక చోట చేర్చి ఉన్నత ప్రమాణాలతో విద్యను బోధించడమే వాటి ప్రధాన ఉద్దేశం. అందుకు అనుగుణంగా వసతి సౌకర్యాలు ఏర్పాటు చేసి ఉపకారవేతనాల ద్వారా విద్యార్థులకు కల్పించారు. వారి దృష్టి చదువు మీద కేంద్రీకరించేట్లు చేయడమే ప్రధాన లక్ష్యం. ఈ విధా నానికి అనుగుణంగా తెలంగాణ ప్రాంతంలోని సర్వేల్, కోస్తా ప్రాంతంలోని తాడికొండ, రాయలసీమలోని కొడిగెనహళ్లిలో రెసిడెన్షియల్ స్కూళ్లు ప్రారంభించారు. 1972లో స్వాతంత్య్ర రజతో త్సవాలను çసందర్భగా కర్నూలులో రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాలగా సిల్వర్ జూబ్లీ ప్రభుత్వ కాలేజీ ఏర్పాటుచేశారు. తర్వాత నాగార్జునసాగర్‌లో రెసి డెన్షియల్ జూనియర్ కళాశాల స్థాపనతో రాష్ట్రం లో రెసిడెన్షియల్ విద్యాసంస్థల ఏర్పాటు పూర్తయింది. పీవీ కేంద్రంలో మానవ వనరుల అభివృద్ధి శాఖ స్వీకరించాక దేశవ్యాప్తంగా నవోదయ స్కూళ్ల పేరుతో ఇలాంటి రెసిడెన్షియల్ సంస్థలను దేశ వ్యాప్తంగా ఏర్పాటు చేశారు. గ్రామీణ యువకులకు నాణ్యతతో కూడిన విద్య అందించడంలో ఈ సంస్థలు ముఖ్యపాత్ర పోషించాయి. 1972లో స్థాపిం చిన సిల్వర్ జూబ్లీ ప్రభుత్వ కాలేజీ ప్రథమ బ్యాచ్ విద్యార్థుల్లో నేను ఒకడిని. అప్పటికే ఎస్సీ, ఎస్టీల కేకాక బీసీలకు రిజర్వేషన్లు వర్తింప చేయడంతో ఆ కాలేజీ విద్యార్థులు వివిధ సామాజిక, ఆర్థిక పరిస్థితులు గల కుటుంబాల నుంచి వచ్చారు. విద్యా ర్థులను రాష్ట్రం లోని మూడు ప్రాంతాల నుంచి దామాషాలో తీసుకోవడం వల్ల అన్ని ప్రాంతాల విద్యార్థులతో కలిసి హాస్టల్లో నివసించే అవకాశం లభించింది. హాస్టల్లో నా గదిలో నాతోపాటు ఉన్న వారిలో కోయిలకుంట్లకు చెందిన గాబ్రియల్ సుధాకర్ ఒకరు. ఆయన తం్రyì గ్రామంలో పాస్టర్‌గా పనిచేసే వారు. కొడుకును చూడడానికి వచ్చినప్పుడు హాస్టల్ లో మాతో పాటే ఉండేవారు. ఈ రెసిడెన్షియల్ విద్యా సంస్థలు విద్యాశాఖ నిర్వహించేది. క్రమక్రమంగా సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఈ రెసిడెన్షియల్ విద్యాసంస్థలు ఏర్పాటు మొదలైంది. వెనుకబడిన తరగతుల శాఖ, షెడ్యూల్ కులాల శాఖ కింద వేర్వే రుగా ఈ విద్యా సంస్థలు ఏర్పాటు చేయడం మొద లైంది. నేడు మైనారిటీల కూడా ప్రత్యేకంగా రెసిడె న్షియల్ విద్యా సంస్థలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ సంస్థల్లో కూడా ఇతరులకు కొన్ని సీట్లు కేటాయిం చినాగాని విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన రెసిడెన్షియల్ విద్యా సంస్థల్లో విద్యార్థుల ఎంపికల్లో ఉన్న విశాలత వీటిలో లోపిస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో 842 రెసిడెన్షియల్ విద్యాసంస్థలు 3లక్షల విద్యార్థులతో మూడు వేల కోట్ల రూపాయల బడ్జెట్‌తో నడుస్తున్నాయి. ఆంధ్ర ప్రదేశ్ 454 రెసిడెన్షియల్ విద్యాసంస్థలు రెండు లక్షల విద్యార్థులతో పదమూడు వందల కోట్లతో నిర్వహిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ఈ విషయంలో ఏపీ కన్నా ఎక్కువ శ్రద్ధ చూపిస్తోంది. రెసిడెన్షియల్ విద్యాసంస్థలు సాంఘిక సంక్షేమ శాఖ, విద్యాశాఖ నిర్వహణలో మరో ప్రభుత్వ కార్యక్రమంలాగానే చాలా రోజులు నడిచాయి. వీటిపై శ్రద్ధ పెట్టిన నాథు డు లేక గణనీయ ఫలితాలను ఈ సంస్థలు సాధిం చలేకపోయాయి. సాంఘిక సంక్షేమ, గిరిజన సంక్షేమ రెసిడెన్షియల్ విద్యా సంస్థలు మాత్రం 2012 తర్వాత ప్రవీణ్ కుమార్ ఈ సంస్థ కార్యదర్శి కావడంతో మంచి ఫలితాలు చూపించడం మొదలెట్టాయి. ఐపీఎస్‌కు చెందిన ప్రవీణ్ కుమార్ ఇలాం టి విద్యాసంస్థల్లో విద్యాభ్యాసం చేసి అఖిలభారత సర్వీస్ అధికారిగా ఎదిగారు. సమాజానికి తన వంతు చేయాలనే సదుద్దేశంతో ఈ శాఖలో పని చేయడానికి వచ్చి గత ఆరేళ్ల నుంచి ఈ సంస్థల నిర్వహణలో గణనీయ మార్పు తెచ్చారు. ఈ సంస్థల్లో విద్యనభ్యసించిన విద్యార్థులు జేఎన్‌యూ వంటి ప్రసిద్ధ సంస్థల్లో సులభంగా సీట్లు సంపా దించు కుంటున్నారు. ఈమధ్య తెలంగాణ ముఖ్యమంత్రి అగ్రవర్ణ పేదలకు ఇలాంటి రెసిడెన్షియల్ సంస్థలు ఏర్పాటు చేస్తానని ప్రకటించారు. వేరువేరుగా ఈ రెసిడెన్షి యల్ విద్యాసంస్థలను నిర్వహించడం వాంఛనీయం కాదు. అక్కడ చదివే విద్యార్థులకు వివిధ సామాజిక ఆర్థిక పరిస్థితుల నుంచి వచ్చే విద్యార్థులతో కలిసి మెలిసి ఉండే అవకాశం ఉండదు కాబట్టి సంకుచిత ధోరణి ఏర్పడే ప్రమాదం ఉంది. ఈ రెసిడెన్షియల్ విద్యాసంస్థలను ఒకే గొడుగు కింది కి తెచ్చి అన్ని వర్గాల విద్యార్థులు కలసి చదువుకునే విధంగా ఏర్పా టు చేస్తే బాగుంటుంది. ఇప్పుడు ఉన్న విద్యా సంస్థ్థలను సమగ్ర రెసిడెన్షియల్ విద్యా సంసలుగా మార్పు చేస్తే మంచిది. దీనివల్ల విద్యార్థుల ఎంపి కలో ఇప్పుడున్న దామాషా పద్ధతికి ఎలాంటి భంగం కలగదు. లేకుంటే ఈ విద్యా సంస్థలు విద్యార్థులకు విశాల దృక్పథం ఏర్పడడానికి దోహదం చేయవు. ఐవైఆర్ కృష్ణారావు వ్యాసకర్త ఏపీ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి yrk45@gmail.com -
రాష్ట్రంలో మరో 296 మైనారిటీ గురుకులాలు
భీమారం (వరంగల్ అర్బన్): రాష్ట్రంలో మరో 296 మైనారిటీ గురుకుల పాఠశాలల ఏర్పాటుకు ప్రభుత్వం యోచిస్తోందని రాష్ట్ర మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ సయ్యద్ అక్బర్ హుస్సేన్ వెల్లడించారు. ఆదివారం ఆయన వరంగల్ అర్బన్ జిల్లా భీమారంలోని మైనారిటీ బాలికల గురుకుల పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం మైనారిటీల విద్య కోసం 204 గురుకుల పాఠశాలలు, 8 జూని యర్ కాలేజీలు ప్రారంభించిందన్నారు. దేశంలో ఎక్కడ కూడా మైనారిటీ వర్గాలకు ప్రత్యేక రెసిడెన్షియల్ పాఠశాలలు లేవన్నారు. ముస్లిం జనాభా అధికంగా ఉన్న జమ్మూ కశ్మీర్లో కూడా ముస్లింలకు గురుకుల వ్యవస్థ లేదని వివరించారు. గురుకుల పాఠశాలల్లో చదువుతున్న ఒక్కో విద్యార్థిపై ప్రభు త్వం రూ.1.31 లక్షలు ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు. -
భద్రత నిల్
నెల్లూరు రూరల్ : గురుకుల పాఠశాలల్లో బాలికలకు రక్షణ కరువవుతోంది. ప్రిన్సిపల్స్ తప్ప మిగతా సిబ్బంది, అధ్యాపకులు అవుట్ సోర్సింగ్ కావడంతో వారిలో బాధ్యత కొరవడింది. ప్రభుత్వ నిర్లక్ష్యంతో కనీస వసతులు కరువయ్యాయి. దీంతో విద్యార్థుల బాధలు వర్ణనాతీతం. రెగ్యులర్ అధ్యాపక సిబ్బంది లేకపోవడం, అరకొర అద్దె భవనాలు, మరుగుదొడ్లు, స్నానపు గదుల కొరతతో పాటు భద్రత కరువవడంతో విద్యార్థినులు క్షణ క్షణం భయంతో గడుపుతున్నారు. నెల్లూరులోని ఎస్టీ బాలికల గురుకుల పాఠశాలలో ఐదో తరగతి విద్యార్థినిపై అత్యాచార సంఘటన జిల్లాలో కలకలం రేపింది. ..ఈ నేపథ్యంలో గురుకులాల భద్రతపై సాక్షి ప్రత్యేక కథనం..గ్రామీణ ప్రాంత పేద విద్యార్థులకు గురుకుల పాఠశాల ద్వారా సౌకర్యాలతో కూడిన నాణ్యమైన విద్యను అందిస్తామని ఊదరకొడుతున్న టీడీపీ ప్రభుత్వం ఆదిశగా అడుగులు వేయడం లేదు. నేటికీ అద్దెభవనాల్లో చాలీచాలని గదుల్లో నిర్వహిస్తూ విద్యార్థుల జీవితాలతో ఆటలాడుతోంది. విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు, బాత్రూంలు, మరుగుదొడ్ల మరమ్మతుల కోసం నిధుల విడుదల జాప్యంతో గురుకులాల పరిస్థితి మరింత అధ్వానంగా మారింది. హాస్టళ్లలోని బాత్రూమ్లు, మరుగుదొడ్లు శిథిలావస్తకు చేరాయి. తలుపులు విరిగి, ఉన్నవాటికి కన్నాలు పడి ఉన్నాయి. మరి కొన్నింటికి తలుపులు లేకుండా దర్శనమిస్తున్నాయి. ప్రభుత్వం ఏడాదికి ఒక్క సారైనా హాస్టల్‌కు రంగులు వేయించడం, విద్యార్థులకు కనీస మౌళిక సదుపాయాలు కల్పించడం మరిచారు. బాలికల గురుకులాల్లో రక్షణ కరువవుతోది. విద్యాబుద్ధులు చెప్పాల్సిన ఉపాధ్యాయులు, రక్షణగా ఉండాల్సిన సిబ్బంది బాలికలపై అత్యాచారాలకు ఒడిగడుతున్నారు. ఇలాంటి సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాల్సిన అధికారులు పరువు పోతుందని బాధిత విద్యార్థులను భయపెట్టి దారుణాలు బయటకు పొక్కకుండా జాగ్రత్త పడుతున్నారు. ఒకరిద్దరు ధైర్యం చేసి తమకు జరిగిన అన్యాయాన్ని ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా వారికి న్యాయం జరగడం లేదు. నెల్లూరు బాలికల గురుకుల పాఠశాలలో గత నెల 21వ తేదీన అత్యాచారం జరిగిందని చిన్నారి టీచర్‌కు, వార్డెన్‌కు ఫిర్యాదు చేసిన వెంటనే స్పందించి ఉంటే దారుణానికి పాల్పడిన వారు దొరికేవారు. బంధువులు కేసు పెట్టినా ఉన్నతాధికారులు రాజీ కోసం ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. ఈ సంఘటనతో గురుకులాల్లోని బాలికలు, వారి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో 43 గురుకుల పాఠశాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. వీటిలో 15 వేల మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. ఏపీ రెసిడెన్సియల్ స్కూల్స్ వెంకటగిరి, ఉదయగిరి, చిలమానుచేను, తుమ్మలపెంట, ఆత్మకూరు, గండిపాళెం, నెల్లూరులోని మైనారిటీ గురుకులాలు నిర్వహిస్తున్నారు. గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కొడవలూరు మండలం చంద్రశేఖర్‌పురంలో బాలికల గురుకుల పాఠశాల, చిట్టేడు, సోమశిల బాలుర గురుకుల పాఠశాలు నడుస్తున్నాయి. అదే విధంగా చెన్నూరు, ఓజిలి, సర్వేపల్లి, నెల్లూరు నగరంతో పాటు మొత్తం 13 మినీ గురుకులాలు గిరిజన కురులకు పాఠశాలలు నడుస్తున్నాయి. బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కోట, దొరవారిసత్రం, గొలగమూడిలో గురుకులాలు నడుస్తున్నాయి. ఈ ఏడాది నుంచి కావలి నియోజకవర్గంలోని నార్త్ అమలూరు, గూడూరు, ఆత్మకూరు పట్టణాల్లోని బాలికల హాస్టల్స్, సర్వేపల్లి నియోజకవర్గంలోని మహ్మదాపురం, వెంకటగిరి బాయ్స్ హాస్టల్స్‌ను రెసిడెన్షియల్ స్కూళ్లుగా మార్చుతున్నట్లు ప్రభుత్వం జీఓ విడుదల చేసింది. సాంఘీక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సూళ్లూరుపేట, కుదురు, నాయుడుపేట, కండలేరు, డక్కిలి, ఆదూరుపల్లి, సంగం, బుచ్చిరెడ్డిపాళెం, కోడూరు, కావలి, ముత్తుకూరులోని బాలికల గురుకులాలు, నాయుడుపేట, చిల్లకూరు, కోట, వాకాడు బాలురు మొత్తం 14 ఎస్సీ, గురుకులాలు నడుస్తున్నాయి. కొడవలూరు: గిరిజన బాలికల కోసం కొడవలూరు మండలం చంద్రశేఖరపురంలో గురుకుల పాఠశాల, జూనియర్ కళాశాల ఉంది. ఐదో తరగతి నుంచి పదో తరగతి దాకా ఉన్న పాఠశాలలో 554 మంది బాలికలుండగా, జూనియర్ కళాశాలలో 220 మంది విద్యార్థినులున్నారు. వీరి భద్రత కోసం పాఠశాల, కళాశాల ప్రాంగణంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఇద్దరు మహిళా కాపాలాదార్లు, ఇద్దరు మహిళా పీఈటీలు రాత్రిళ్లు గురుకులంలోనే ఉండేలా చర్యలు తీసుకొన్నారు. పాఠశాల, కళాశాలకు కలిపి 35 మంది దాకా బోధన సిబ్బంది ఉండగా, వీరందరికీ ఇక్కడే క్వార్టర్ల సౌకర్యం ఉండడంతో రాత్రింబవళ్లు ఇక్కడే ఉంటున్నారు. అనుమతి లేకుండా ఎవరినీ లోనికి రాకుండా చూస్తున్నారు. సంగంలో లేదు భద్రత సంగం: సంగంలో నెల్లూరు – ముంబయి జాతీయ రహదారి పక్కన ఉన్న సంగం గురుకుల కళాశాలలోని బాలికల భద్రత అంతంత మాత్రంగానే ఉంది. గురుకుల కళాశాలలో 640 మంది బాలికలు 6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం వరకు విద్యను అభ్యసిస్తున్నారు. 34 మంది టీచింగ్, నాన్ టీచింగ్ అధ్యాపకులు ఈ కళాశాలలో పనిచేస్తున్నారు. కొండకు దిగువ భాగంలో కళాశాల ఉండడంతో పై నుంచి వచ్చే వారు గురుకుల కళాశాలకు ప్రవేశించేందుకు అనువుగా ఉంది. కళాశాలలో మహిళా వాచ్మెన్లు ఉన్నప్పటికీ రాత్రి సమయంలో ఏదైనా జరిగితే తమ పిల్లల పరిస్థితి ఏమిటంటూ బాలికల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. పోలీసులు సైతం గస్తీ నిర్వహించకపోవడంతో విద్యార్థినులు భయాందోళలకు గురవుతున్నారు. గతంలో ఓ యువకుడు గురుకుల కళాశాలలోకి అర్ధరాత్రి సమయంలో ప్రవేశించి హల్చల్ సృష్టించిన సంఘటన ఉంది. అయినా ఇక్కడ ఎలాంటి భద్రతా చర్యలు తీసుకోలేదు. -
119 బీసీగురుకులాల ఏర్పాటు
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో కొత్తగా 119 గురుకుల పాఠశాలల ఏర్పాటుకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. నియోజకవర్గానికి ఒక గురుకులం చొప్పున మంజూరు చేసింది. ఈమేరకు బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శి బి.వెంకటేశం శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. 2017–18 విద్యా సంవత్సరంలో రాష్ట్రవ్యాప్తంగా 119 గురుకుల పాఠశాలలను నియోజకవర్గానికి ఒకటి చొప్పున మంజూరు చేశారు. ఇందులో సగం బాలికల గురుకులాలు కాగా మిగతా సగం బాలుర గురుకులాలున్నాయి. తాజాగా నియోజకవర్గానికొకటి చొప్పున గురుకుల పాఠశాలను ప్రభుత్వం మంజూరు చేసిన నేపథ్యంలో బాలుర గురుకులం ఉన్నచోట బాలికలు, బాలికల గురుకులం ఉన్న చోట బాలుర గురుకులాన్ని ప్రారంభించనున్నారు. వీటి ఏర్పాటుకు సంబంధించి భవనాలను గుర్తించాలని ప్రభుత్వం మహాత్మా జ్యోతిబాపూలే తెలంగాణ బీసీ గురుకుల విద్యా సంస్థల సొసైటీ కార్యదర్శి మల్లయ్యభట్టును ఆదేశించింది. ఈ గురుకులాల్లో ఉద్యోగాలను తెలంగాణ గురుకుల విద్యాసంస్థల నియామకాల బోర్డు ద్వారా చేపట్టాలని సూచించింది. -
‘జనరల్ విద్యార్థులకూ గురుకులాలు’
సాక్షి, వరంగల్ రూరల్ : రాష్ట్రంలో విద్యావవస్థను గాడిలో పెట్టడానికి కృషి చేస్తున్నామని విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి వెల్లడించారు. సరైన సదుపాయాలు కల్పిస్తే మన విద్యార్థులు ఎందులోనూ తీసిపోరని పేర్కొన్నారు. జిల్లాలోని నెక్కొండ గురుకుల పాఠశాలలో ఆయన మంగళవారం మొక్కలు నాటారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. విద్యార్థులకు పౌష్టికాహారం అందించే లక్ష్యంతో ప్రభుత్వం మంచి మెనూ తయారు చేసిందని అన్నారు. ముఖ్యంగా ఎదిగే ఆడపిల్లల ఆరోగ్యం కోసం.. ఒక్కో విద్యార్థినికి 1600 రూపాయల చొప్పున ఖర్చు చేసి 6 లక్షల మందికి హెల్త్, హైజనిక్ కిట్లు అందిస్తున్నామని తెలిపారు. దేశంలోనే మొట్టమొదటిసారిగా షెడ్యూల్డ్ కులాల బాలికల విద్యావృద్థికి తెలంగాణలో 53 గురుకులాలను ప్రారంభించామన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలతో పాటు జనరల్ కేటగిరీ విద్యార్థులకు కూడా గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేస్తామని అన్నారు. -
‘ప్రిన్సిపాల్’ పోస్టుల పరీక్ష రద్దుపై వెనక్కి!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని వివిధ గురుకుల పాఠశాలల్లోని 304 ప్రిన్సిపాల్ పోస్టుల భర్తీకి నిర్వహించిన రాత పరీక్షలో ఓ ప్రైవేటు బ్లాగ్ నుంచి కాపీ చేసి ఇచ్చిన ప్రశ్నలను తొలగించి మిగతా ప్రశ్నలతో పేపర్ వ్యాల్యుయేషన్ చేయాలని టీఎస్పీఎస్సీ నిర్ణయించింది. ఈ నెల 14న ఈ (పేపర్–1, పేపర్–2) పరీక్షలు టీఎస్పీఎస్సీ నిర్వహించింది. ఒక్కో పేపర్లో 150 చొప్పున 300 మార్కులకు పరీక్షలు పెట్టింది. అయితే ఓ ప్రైవేటు బ్లాగ్ నుంచి దాదాపు 200 ప్రశ్నలను యథాతథంగా ఇచ్చారంటూ పలువురు అభ్యర్థులు టీఎస్పీఎస్సీకి ఫిర్యాదు చేశారు. దీంతో టీఎస్పీఎస్సీ అధికారులు బ్లాగ్‌లో ఉన్న ప్రశ్నలను, పరీక్షలో వచ్చిన ప్రశ్నలను పరిశీలించి.. రెండు పేపర్లలోనూ కొన్ని ప్రశ్నలు యథాతథంగా వచ్చినట్లు తేల్చారు. దీనిపై లోతుగా అధ్యయనం చేసేందుకు త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసి.. మూడు రోజుల్లో నివేదిక ఇవ్వాలని సూచించారు. ఈ మేరకు కమిటీ తన నివేదికను శనివారమే టీఎస్పీఎస్సీకి అందజేసింది. సోమవారం టీఎస్పీఎస్సీ చైర్మన్ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి అధ్యక్షతన జరిగిన సమావేశంలో కమిటీ నివేదికను సభ్యులు, అధికారులు పరిశీలించారు. 67 ప్రశ్నలు తొలగింపు.. ప్రైవేటు బ్లాగ్ నుంచి కొన్ని ప్రశ్నలను యథాతథంగా ఇచ్చినట్లుగా కమిటీ తన నివేదికలో పేర్కొంది. పేపర్–1లో 12 ప్రశ్నలు, పేపర్–2లో 55 ప్రశ్నలను యథాతథంగా ఇచ్చారని వెల్లడించింది. దీంతో కమిషన్ వివిధ కోణాల్లో పరిశీలన జరిపింది. పరీక్షను రద్దు చేయాలా.. అన్న దానిపై ఆలోచనలు చేసింది. అయితే పేపర్ లీకేజీ, పెద్ద ఎత్తున మాల్ ప్రాక్టీస్ జరిగిన సందర్భాల్లోనే పరీక్షను రద్దు చేయాలన్న నిబంధన ఉందని, బ్లాగ్ నుంచి ప్రశ్నలను కాపీ చేయడం లీకేజీ కిందకు రాదన్న అభిప్రాయానికి వచ్చింది. మరోవైపు గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు కూడా అదే చెబుతోందని, కాపీ చేసిన ప్రశ్నలను తొలగించి మిగతా ప్రశ్నలతో పేపర్ వ్యాల్యుయేషన్ చేయాలని, వాటిని మొత్తం మార్కులతో నార్మలైజ్ చేయాలని సుప్రీంకోర్టు చెప్పిందని కమిషన్ ఆలోచనకు వచ్చింది. ఆ మేరకు 67 ప్రశ్నలను తొలగించి మిగతా ప్రశ్నలతో పేపర్లు వ్యాల్యుయేషన్ చేసి 300 మార్కులకు నార్మలైజ్ చేయాలని నిర్ణయించింది. అదే బ్లాగ్ నుంచి మరో పరీక్షకు.. ఈ నెల 16న జరిగిన గురుకుల జూనియర్ కాలేజీ ప్రిన్సిపల్ పోస్టుల భర్తీకి నిర్వహించిన పరీక్షలలోనూ అదే బ్లాగ్ నుంచి ప్రశ్నలు వచ్చాయని విమర్శలు వస్తున్న నేపథ్యంలో వాటిని పరిశీలించాలని అధికారులను టీఎస్పీఎస్సీ ఆదేశించింది. అవసరమైతే కమిటీకి అప్పగించి దర్యాప్తు చేయించాలని పేర్కొంది. మరోవైపు బ్లాగ్ నుంచి ప్రశ్నలను కాపీ చేసి ప్రశ్నపత్రం రూపొందించిన అధికారిని శాశ్వతంగా బ్లాక్‌లిస్టులో పెట్టడంతోపాటు ఆయనకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని నిర్ణయించింది. అలాగే చట్టపరంగా చర్యలు చేపట్టాలని సంబంధిత యూనివర్సిటీ వైస్ చాన్సలర్‌కు లేఖ రాయాలని నిర్ణయం తీసుకుంది. -
గురుకులంలో దారుణం.. ప్రిన్సిపాల్ భర్త అసభ్య ప్రవర్తన!
సాక్షి, హైదరాబాద్ : తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్ధిని పట్ల అసభ్యంగా ప్రవర్తించాడో కామాంధుడు. నగరంలోని శేర్లింగంపల్లి గోపంపల్లిలోని గురుకుల పాఠశాలలో జరిగిన దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ భర్త తొమ్మిదో తరగతి విద్యార్థిని పట్ల నీచంగా ప్రవర్తించాడని ఈ నెల 3న గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. సెక్షన్ 354 ఫోక్సో చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గోపంపల్లిలోని గురుకుల పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న బాలికపై పాఠశాల ప్రిన్సిపాల్ ప్రమోదీని భర్త నాగేశ్వర్ రావు అసభ్యంగా ప్రవర్తించాడు. దాంతో బాలిక తల్లిదండ్రులు గచ్చిబౌలి పోలీసు స్టేషన్లో పిర్యాదు చేశారు. ఈ విషయం తెలుసుకున్న గురుకుల పాఠశాల ఉన్నతాధికారులు ప్రిన్సిపాల్ ప్రమోదీని సస్సెండ్ చేశారు. అయితే ఈ నీచానికి పాల్పడిన నాగేశ్వర్ రావు పరారీలో ఉన్నట్లు పోలీసు తెలిపారు. -
12 నుంచి మెయిన్స్
సాక్షి, హైదరాబాద్: గురుకుల జూనియర్, డిగ్రీ కాలేజీల్లో వివిధ పోస్టుల భర్తీలో భాగంగా పలు సబ్జెక్టుల మెయిన్ పరీక్షల సవరించిన షెడ్యూల్‌ను టీఎస్పీఎస్సీ జారీ చేసింది. ఈ నెల 12 నుంచి పరీక్షలను నిర్వహిస్తామని పేర్కొంది. ఒక సబ్జెక్టు కంటే ఎక్కువ సబ్జెక్టుల్లో ప్రిలిమినరీ పరీక్షల్లో అర్హత సాధించిన వారి విజ్ఞప్తి మేరకు షెడ్యూల్‌ను సవరించినట్లు తెలిపింది. మెయిన్ పరీక్షలకు 1:15 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేసినట్లు వెల్లడించింది. జూనియర్, డిగ్రీ కాలేజీల్లో లైబ్రేరియన్, స్కూల్స్, జూనియర్ కాలేజీల ప్రిన్సిపాల్స్, జూనియర్, డిగ్రీ కాలేజీల ఫిజికల్ డైరెక్టర్ పరీక్ష తేదీల్లో మార్పు లేదని పేర్కొంది. డిగ్రీ లెక్చరర్స్, జూనియర్ లెక్చరర్స్ పరీక్ష తేదీల్లో మార్పులు ఉన్నట్లు వివరించింది. హెచ్ఎండీఏ పరిధిలో కంప్యూటర్ ఆధారితంగా మెయిన్ పరీక్షలను నిర్వహించనున్నట్లు తెలిపింది. -
కొత్తగా పది మైనారిటీ గురుకుల కాలేజీలు
సాక్షి, హైదరాబాద్: ఈ విద్యాసంవత్సరం కొత్తగా 10 మైనారిటీ గురుకుల జూనియర్ కాలేజీలు ఏర్పాటు కానున్నాయి. ఈ మేరకు మైనారిటీ గురుకుల విద్యాసంస్థల సొసైటీ సన్నాహాలు ప్రారంభించింది. ఈ సొసైటీ కింద 204 గురుకుల పాఠశాలలు, 2 జూనియర్ కాలేజీలు కొనసాగుతున్నాయి. కొత్త గురుకుల పాఠశాలల్లో 5 నుంచి తొమ్మిదో తరగతి వరకు, పాత 12 గురుకులాల్లో పదో తరగతి వరకు విద్యాబోధన కొనసాగుతోంది. పాత జూనియర్ కాలేజీలు 2 ఉన్నా యి. దీంతో కొత్తగా 10 జూనియర్ కాలేజీల ఏర్పాటు కు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేయడంతో కాలేజీల ఏర్పాటుకు చర్యలు చేపట్టింది. అందులో భాగంగా పాత పది గురుకుల పాఠశాలల భవనాల్లోనే కాలేజీల విభాగాలు ఏర్పాటు చేయాలని సొసైటీ నిర్ణయించింది. అధ్యాపకుల భర్తీకి కసరత్తు..: కొత్త మైనారిటీ గురుకుల జూనియర్ కాలేజీల్లో అధ్యాపకులను భర్తీ చేసేందుకు మైనారిటీ గురుకుల సొసైటీ కసరత్తు చేస్తోంది. పది కాలేజీలకు బోధనావిభాగంలో 80 పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించింది. కాలేజీలకు టీఎస్పీఎస్సీ నుంచి అధ్యాపకులు భర్తీ అయ్యేవరకు ఔట్సోర్సింగ్ పద్ధతిలో నియామకాలు చేపట్టాలని నిర్ణయించింది. అందులో భాగంగా రెండు రోజులక్రితం ఆ సొసైటీ కార్యదర్శి ఔట్సోర్సింగ్ ఏజెన్సీలతో సమావేశమయ్యారు. ఏజెన్సీల ద్వారా అర్హులైన అభ్యర్థుల నుంచి ఈ నెల 30 వరకు ఒక పోస్టుకు ముగ్గురు చొప్పున దరఖాస్తులు స్వీకరించాలని నిర్ణయించారు. సబ్జెక్టులవారీగా మే 5 నుంచి 10 వరకు ఇంటర్వ్యూలు నిర్వహించి మే 12న ఎంపిక జాబితా వెల్లడించనున్నారు. ఎంపికైన జూనియర్ లెక్చరర్లకు మే 13న నియామకపత్రాలు అందించి 15 నుంచి 25 వరకు శిక్షణ ఇవ్వనున్నారు. జూన్ 1 నుంచి విధులకు హాజరయ్యేవిధంగా కార్యాచరణ రూపొందించారు. 27 తర్వాత అడ్మిషన్ నోటిఫికేషన్ మైనారిటీ గురుకుల జూనియర్ కాలేజీలో ఇంటర్ తొలి ఏడాదిలో ప్రవేశాలకు ఈ నెల 27 తర్వాత నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించనున్నారు. మైనారిటీ గురుకులాల్లో చదివిన విద్యార్థులకు మొదటి ప్రాధాన్యత వర్తింపజేస్తారు. గురుకుల పాఠశాలల మాదిరిగానే 75 శాతం సీట్లు మైనారిటీలకు, 25 శాతం మైనార్టీయేతరులకు కేటాయించనున్నారు. -
సమ్మర్ క్యాంపులకు బియ్యం ఇయ్యం!
సాక్షి, హైదరాబాద్ : గురుకుల సొసైటీలు సంకటంలో పడ్డాయి. సమ్మర్ క్యాంపు(వేసవి శిబి రం)లకు బియ్యం కోటా ఇవ్వలేమని పౌర సరఫరాలశాఖ తేల్చి చెప్పడంతో ఆందోళన చెందుతున్నాయి. గురుకుల విద్యాలయాల సొసైటీలు ఏటా సమ్మర్ క్యాంపుల్లో భాగంగా గురు కుల పాఠశాలల్లోని చురుకైన విద్యార్థులకు పలు కోర్సుల్లో ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వ హిస్తాయి. క్రీడలు, నృత్యాలతోపాటు సబ్జెక్ట్‌కు సంబంధించి అవగాహన, భావ వ్యక్తీకరణ నైపుణ్యం, వ్యక్తిత్వ వికాసం తదితర కార్యక్రమాలను నిర్వహిస్తారు. వీటికి రోజంతా సమ యం పడుతుండడంతో విద్యార్థులకు వసతితోపాటు భోజన సదుపాయాన్ని కూడా గురుకుల సొసైటీలే ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ప్రత్యేకంగా బియ్యం కోటా ఇవ్వాలని గురుకుల సొసైటీలు కోరగా ఇవ్వలేమని పౌర సరఫరాల శాఖ తేల్చి చెప్పింది. -
గురుకులాలను దేశానికి ఆదర్శంగా తీర్చిదిద్దాలి
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ గురుకులాలను దేశానికి ఆదర్శంగా తీర్చిదిద్దాలని, జాతీయస్థాయి పరీక్షలు జేఈఈ, నీట్‌లలో గురుకుల విద్యార్థులకే ఎక్కువ సీట్లు రావాలని ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఆకాంక్షించారు. గురువారం గురుకుల సొసైటీల అధికారులతో ఆయన సమీక్ష జరిపారు. గురుకులాలన్నింటిలో ఉమ్మడి పరీక్షావిధానం, కామన్ మెను, మంచి వసతులు ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. నియోజకవర్గాల్లోని గురుకులాల్లో స్థానికులకు కొంత ప్రాధాన్యం ఇచ్చేవిధంగా ప్లాన్ చెయ్యాలని, వేసవి సెలవుల్లో ప్రతి విద్యాలయంలో వసతులు ఉండేలా చూసుకోవాలన్నారు. కిరాయి భవనాలకు మరమ్మత్తులు చేయించి తగిన వసతులు కల్పించాలని సూచించారు. రక్తహీనతతో బాధపడుతున్న అమ్మాయిలకు ప్రత్యేక పోషకాహారం ఇవ్వాలని, విద్యార్థులందరికీ హెల్త్ అండ్ హైజీన్ కిట్స్ అందించాలన్నారు. ప్రతి గురుకులంలో ఏఎన్ఎం, పీఈటీ తప్పనిసరిగా ఉండాలన్నారు. -
8434 ఉపాధ్యాయ ఖాళీలు భర్తీ చేస్తాం
సాక్షి, హైదరాబాద్: రెసిడెన్షియల్ స్కూళ్లలో 8434 ఉపాధ్యాయ ఖాళీలలను త్వరలో భర్తీ చేస్తామని విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి శుక్రవారం శాసన మండలిలో ప్రకటించారు. మండలిలో రెసిడెన్షియల్ పాఠశాలలపై జరిగిన స్వల్ప కాలిక చర్చలో ఆయన ప్రసంగించారు. ఉమ్మడి రాష్ట్రంలో వివక్షకు గురైన గురుకుల పాఠశాలలకు తెలంగాణ ప్రభుత్వం కొత్త వెలుగులు నింపిందని వెల్లడించారు. రెసిడెన్షియల్ స్కూళ్లకు బడ్జెట్లో రూ.2835 కోట్లు కేటాయించామని అన్నారు. ప్రతి విద్యార్థి చదువుకోసం ఏటా రూ.లక్ష ఖర్చు చేస్తున్నామని తెలిపారు. రెసిడెన్షియల్ స్కూళ్లలో పనిచేసే సిబ్బంది వేతనాలను పెంచే యోచనలో ఉన్నామని పేర్కొన్నారు. నూతన రాష్ట్రంలో విద్యాలయాలు.. తెలంగాణ రాష్ర్ట ఆవిర్భావం తర్వాత కొత్తగా 577 గురుకులాలను ఏర్పాటు చేశామని కడియం తెలిపారు. మొత్తం 877 గురుకులాల్లో 2 లక్షల 70 వేల విద్యార్థులు చదువుకుంటున్నారని వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా 27 లక్షల మంది ప్రభుత్వ పాఠశాలల్లో విద్యనభ్యసిస్తున్నారని కడియం తెలిపారు.33 రెసిడెన్షియల్ పాఠశాలలను జూనియర్ కాలేజీలుగా అప్‌గ్రేడ్ చేశామనీ...ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కేటగిరీగా ఉన్న అన్ని రెసిడెన్షియల్ స్కూల్స్‌ను ఒకే వేదికపైకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నామని వెల్లడించారు. -
గురుకుల కాలేజీలు
బెల్లంపల్లి : తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలకు మహర్ధశ పట్టబోతోంది. కొత్తగా ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా 27 గురుకుల పాఠశాలలను జూనియర్ కళాశాలలుగా అప్‌గ్రేడ్ చేస్తూ నిర్ణయం తీçసుకుంది. ఈమేరకు జీవో నెంబర్ 7 జారీ చేసింది. వీటిలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని బెల్లంపల్లి బాలుర, నిర్మల్ బాలికల పాఠశాలలకు అవకాశం దక్కింది. దశాబ్దాల నుంచి హైస్కూళ్లకే పరిమితమైన ఆయా పాఠశాలలు ఎట్టకేలకు అప్‌గ్రేడ్‌కు నోచుకోవడంతో ప్రతిభావంతులైన విద్యార్థులకు ప్రయోజనం కలుగనుంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచే.. అప్‌గ్రేడ్ అయిన గురుకుల కళాశాలల్లో వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇంటర్మీడియేట్ విద్యాబోధన చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. తొలుత ఎంపీసీ, బైపీసీ కోర్సులను ప్రవేశపెడతారు. ఒక్కో కోర్సులో 40 మంది విద్యార్థులను చేర్చుకుంటారు. రెండు కోర్సులకు కలిపి 80 మంది విద్యార్థులకు ప్రవేశం దక్కుతుంది. ఈ కళాశాలల్లో ప్రవేశాల కోసం ఇతర పాఠశాలలు, కళాశాలలతో పాటే ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. కొత్త భవనాల నిర్మాణాలు జరిగే వరకు ప్రస్తుతం నిర్వహిస్తున్న పాఠశాల తరగతి గదుల్లో లేదా కొత్తగా అద్దె ప్రాతిపదికన ప్రైవేట్ భవనాలను తీసుకుని తరగతులు నిర్వహించే అవకాశాలు ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 27 గురుకుల జూనియర్ కళాశాలలను ప్రారంభించనుండగా ఇందులో బాలుర కోసం 13, బాలికల కోసం 14 జూనియర్ కళాశాలలను ఏర్పాటు చేయనున్నారు. గురుకుల జూనియర్ కళాశాలల్లో బోధన, బోధనేతర సిబ్బంది 405 మందిని నియమించాలని సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు సంబంధించి ప్రభుత్వం రూ.117.79 కోట్ల నిధులను విడుదల చేయనుంది. ఐదు దశాబ్దాల క్రితం అంకురార్పణ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సుమారు ఐదు దశాబ్దాల క్రితం ప్రభుత్వం గురుకుల పాఠశాలలను మంజూరు చేసింది. బెల్లంపల్లిలో బాలుర, నిర్మల్‌లో బాలికల గురుకుల పాఠశాలలు పని చేస్తున్నాయి. వీటిలో ప్రవేశ పరీక్ష ద్వారా ప్రతి ఏటా ఐదో తరగతి నుంచి ప్రవేశం కల్పిస్తారు. ప్రవేశ పరీక్షలో వచ్చిన మెరిట్ మార్కుల ప్రాతిపదికన సీటును కేటాయిస్తారు. అన్ని సామాజిక వర్గాల విద్యార్థులకు ప్రతిభాపాటవాలతోనే అడ్మిషన్ ఇస్తారు. పదో తరగతి వరకు గురుకుల పాఠశాలల్లో చదివి ఉత్తీర్ణత సాధించిన తర్వాత ఇంటర్మీడియేట్ విద్యను గురుకులాల్లో అభ్యసించడానికి బాలబాలికలు పోటీ పరీక్ష రాయాల్సి ఉంటుంది. గురుకుల జూనియర్ కళాశాలల్లోనూ ప్రవేశ పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా ప్రవేశం కల్పిస్తారు. అయితే మెరిట్ మార్కులు సాధించి సీటు వచ్చిన బాలబాలికలు ఇతర జిల్లాలకు వెళ్లి చదువుకోవడానికి అంతగా ఆసక్తి కనబర్చడం లేదు. కొద్ది మంది మాత్రమే దూరప్రాంతాలకు వెళ్లి గురుకుల కళాశాలల్లో ఇంటర్ విద్యను చదువుకుంటున్నారు. వ్యయప్రయాసాలకోర్చి ఇతర ప్రాంతాలకు వెళ్లడం, అభద్రత, ఆర్థిక సమస్యలు తదితర కారణాలతో బాలికలు డ్రాఫౌట్స్ అవుతున్నారు. లేదా స్థానికంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ కళా«శాలల్లో విద్యాభ్యాసం చేస్తున్నారు. ఇంటర్మీడియేట్ను కూడా ప్రభుత్వ గురుకుల కళాశాలల్లో చదవాలనే కోరికను అనివార్యంగా చంపుకుంటున్నారు. ప్రస్తుతం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో విద్యార్థుల ఆశ నెరవేరే అవకాశాలు మెరుగుపడ్డాయి. తీరనున్న దూరభారం గురుకుల విద్యార్థులకు చాలామట్టుకు ఇంటర్ విద్యను అభ్యసించడానికి దూరభారం తగ్గనుంది. ఉమ్మడి జిల్లాలో నిర్మల్‌లో బాలికలు, బెల్లంపల్లిలో బాలుర గురుకుల జూనియర్ కళాశాలలు ఏర్పాటు కాబోతున్నాయి. ప్రస్తుతం ఒక్కో గురుకుల పాఠశాలల్లో పదో తరగతిలో 80 మంది చొప్పున విద్యాభ్యాసం చేస్తున్నారు. వీటిలో పదో తరగతి ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులతో పాటు ఇతర ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో చదువుకున్న విద్యార్థులకు కూడా కళాశాలల్లో ప్రవేశం కల్పిస్తారు. టీఎస్ఆర్జేసీ ప్రవేశ పరీక్ష రాసి మెరిట్ మార్కులు తెచ్చుకున్న విద్యార్థులకు మాత్రమే గురుకుల కళాశాలల్లో సీటు దక్కుతుంది. దీంతో సీట్ల కోసం విద్యార్థుల మధ్య తీవ్రమైన పోటీ ఉంటుంది. విద్యార్థులకు ఉపయోగకరం ప్రభుత్వం గురుకుల పాఠశాలలను అప్‌గ్రేడ్ చేయడం హర్షణీయం. నాణ్యమైన విద్యకు ఇన్నాళ్లుగా గురుకుల పాఠశాలలు, కళాశాలలు కేరాఫ్‌గా నిలుస్తున్నాయి. బెల్లంపల్లి బాలుర, నిర్మల్ బాలికల గురుకుల పాఠశాలలను అప్‌గ్రేడ్ చేసి జూనియర్ కళాశాలలుగా మార్చడం వల్ల విద్యార్థులకు మేలు జరుగుతుంది. కొత్త భవనం నిర్మాణం జరిగే వరకు ప్రస్తుత పాఠశాల తరగతి గదుల్లో ఇంటర్ విద్య బోధించడం జరుగుతుంది. – ఎస్.సత్యనారాయణ, ప్రిన్సిపాల్, బెల్లంపల్లి గురుకుల పాఠశాల -
మెనూ ప్రకారం భోజనం అందించాలి
తాడ్వాయి(ఎల్లారెడ్డి) : విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందించాలని కలెక్టర్ సత్యనారాయణ సూచించారు. తాడ్వాయి మండలంలోని ఎర్రపహాడ్‌లో గల మహాత్మజ్యోతిబా పూలే బాలుర గురుకుల పాఠశాలను ఆదివారం తనిఖీ చేశారు. హాస్టల్‌ను ఎçప్పుడు పరిశుభ్రంగా ఉంచాలని, ఆవరణలో రకరకాల మొక్కలను నాటాలని సూచించారు. పిల్లలను ప్రణాళిక ప్రకారం చదివించాలని, వార్షిక పరీక్షలో వందశాతం ఉత్తీర్ణత సాధించాలన్నారు. అనంతరం గురుకుల పాఠశాలకు సంబంధించిన రికార్డులు, విద్యార్థుల హాజరు రిజిస్టర్లను పరిశీలించారు. ఆయన వెంట సర్పంచ్ పోతగౌడ్, ఎంపీటీసీ సభ్యుడు లింగారెడ్డి, ఉపాధ్యాయులు, విద్యార్థులు ఉన్నారు. -
యాదాద్రిలో మిస్ ఆస్ట్రేలియా వరల్డ్-2017
యాదాద్రి భువనగిరి జిల్లా : చౌటుప్పల్ మండల కేంద్రంలోని బాలికల గురుకుల పాఠశాలను ఆస్ట్రేలియా మిస్ వరల్డ్-2017 ఎస్మా వోలోడేర్ సోమవారం సందర్శించారు. అనంతరం పాఠశాలలో జరిగిన డాన్స్ పోటీలలో బాలికలతో కలసి డాన్స్ చేశారు. హైదరాబాద్‌లోని నారాయణ కాలేజీలో జరిగే ఓ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ఎస్మా హాజరయ్యారు. గురుకుల పాఠశాల అధికారుల విజ్ఞప్తి మేరకు చౌటుప్పల్‌లోని గురుకుల పాఠశాలకు వచ్చారు. ఆమెతో కలిసి ఫోటోలు దిగేందుకు పలువురు ఉత్సాహం చూపారు. -
మీరే కోటిసార్లు సిగ్గు పడండి
సాక్షి, హైదరాబాద్: నల్లగొండలోని ఓ గురుకుల హాస్టల్లో టాయిలెట్ సౌకర్యం లేకపోవడంతో ఓ విద్యార్థి బహిర్భూమికి వెళ్లి కాలువలో పడి మృతి చెందాడంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మంత్రి జగదీశ్‌రెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కోమటిరెడ్డి చెబుతున్నట్లుగా కెనాల్లో పడి చనిపోయిన విద్యార్థికి గురుకులాలు, హాస్టళ్లతో సంబంధం లేదని స్పష్టం చేస్తూనే కాంగ్రెస్ తీరుపై ఆయన విరుచుకుపడ్డారు. ‘‘కాంగ్రెస్ అధికారంలో ఉండగా చేసిన నిర్వాకం వల్లే ఇప్పటికీ తెలంగాణను సమస్యలు పీడిస్తున్నాయి. హాస్టళ్లు ఇట్లున్నాయంటే దానికి కారణం కాంగ్రెస్ పార్టీనే. బడుగు బలహీనవర్గాల ప్రజలను ఆ పార్టీ మోసం చేసింది. దీనికి వారు ఒకసారి కాదు కోటిసార్లు సిగ్గుపడాలి. నల్లగొండలో ఓ విద్యార్థి కాలువలో పడి చనిపోయాడంటున్నారు కదా.. ఇక్కడి నుంచి నల్లగొండ వరకు ముక్కు నేలకు రాసుకుంటూ పోవాలి. చేసిన పాపాలకు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పాలి’’అని డిమాండ్ చేశారు. ‘కార్పొరేట్’కు దీటుగా.. గురుకులాల్లో పనిచేస్తున్న తాత్కాలిక అధ్యాపకులను పర్మినెంట్ చేసేందుకు సిద్ధంగానే ఉన్నామని, ఈలోగా ఎవరి ఒత్తిడి వల్లో వారు కోర్టుకెళ్లారని, అక్కడ తీర్పు రిజర్వ్ చేసినందున అది తేలాక చర్యలు తీసుకుంటామని జగదీశ్‌రెడ్డి తెలిపారు. కార్పొరేట్ కాలేజీలను తలదన్నే స్థాయిలో కేజీ టూ పీజీలో భాగంగా గురుకులాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు.సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో అదనపు వసతుల కోసం రూ. 347 కోట్లు, 18 బీసీ గురుకుల పాఠశాలలకు భవనాల నిర్మాణం, అసంపూర్తి వాటిని పూర్తి చేసేందుకు కలిపి రూ. 250 కోట్లు ఖర్చు చేస్తున్నామన్నారు. విద్యార్థులకు నెలలో నాలుగు పర్యాయాలు చికన్, రెండుమార్లు మటన్, ఐదుసార్లు కోడిగుడ్డు, నిత్యం పప్పు, కూర, చా రుతో పౌష్టికాహారం పెడుతున్నామన్నారు. -
ప్రైవేటు నుంచి గురుకులాల్లోకి..
సాక్షి, హైదరాబాద్: ప్రైవేటు విద్యాసంస్థల నుంచి ప్రభుత్వ గురుకులాలవైపు విద్యార్థులు తరలి వస్తున్నారని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. శాసనమండలిలో గురువారం ‘రాష్ట్రంలో ఆశ్రమ పాఠశాలలు, కళాశాలల ఏర్పాటు’పై జరిగిన లఘు చర్చ సందర్భంగా కడియం మాట్లాడారు. ఒకప్పుడు ప్రభుత్వ పాఠశాలల నుంచి ప్రైవేటు విద్యా సంస్థల వైపు విద్యార్థులు తరలివెళ్లేవారని, ప్రస్తుతం ఆ పరిస్థితి మారిందన్నారు. గతంలో రాష్ట్రంలో 296 గురుకుల పాఠశాలలుంటే, తెలంగాణ వచ్చాక కొత్తగా 546 గురుకులాలను ఏర్పాటు చేశామన్నారు. గురుకులాల్లో ఒక్కో విద్యార్థిపై ఏడాదికి రూ. 1.02 లక్షలు ప్రభుత్వం ఖర్చు చేస్తోందని వెల్లడించారు. మండలిలో ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీ మాట్లాడుతూ.. గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేయడం అభినందనీయమని, కానీ వాటిల్లో పూర్తిస్థాయిలో ఉపాధ్యాయుల భర్తీ జరగలేదన్నారు. ముఖ్యమంత్రి నియోజకవర్గం గజ్వేల్‌లోని ఆశ్రమ పాఠశాలలో నీటి వసతి లేదని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ చీఫ్ విప్ పాతూరి సుధాకర్‌రెడ్డి మధ్యలో జోక్యం చేసుకోగా, ‘ఏమండీ... ఓపిక లేకపోతే ఎలా? పంతులై ఉండి.. ఇలాగైతే చదువు ఎలా చెబుతారు?’అంటూ షబ్బీర్ అన్నారు. దీంతో కాసేపు సభలో వాగ్వాదం చోటు చేసుకుంది. బీజేపీ సభ్యుడు రామచందర్‌రావు మాట్లాడుతూ.. హేతుబద్ధీకరణ, ఆశ్రమ పాఠశాలలు రావడం వల్ల ఇతర ప్రభుత్వ పాఠశాలలు మూతపడుతున్నాయని పేర్కొన్నారు. గురుకులాల్లో ఆర్థికంగా వెనుకబడిన వారికి కూడా రిజర్వేషన్లు కల్పించాలన్నారు. ఇదే అంశంపై సభ్యులు సతీశ్‌కుమార్, ఫరూక్ హుస్సేన్, బాలసాని లక్ష్మీనారాయణ మాట్లాడారు. -
జిల్లాకు రెండు గురుకులాలు
► ఒకటి బాలురకు, మరొకటి బాలికలకు.. ► అధికారులతో సమీక్షలో డిప్యూటీ సీఎం కడియం వెల్లడి సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రతి జిల్లాకు ఓ బాలుర, ఓ బాలికల గురుకుల పాఠశాలను విద్యా శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్నట్లు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి తెలిపారు. ఇందుకోసం ప్రతిపాదనలు పంపాలని విద్యా శాఖ అధికారులను ఆదేశించారు. కొత్తగా ఏర్పడిన కొన్ని జిల్లాల్లో సాధారణ గురుకులాల కొరత ఏర్పడినందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. బుధవారం సచివాలయంలో రాష్ట్ర గురుకులాల సొసైటీ, మోడల్ స్కూల్స్, కేజీబీవీ, విద్యా శాఖ అధికారులతో కడియం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రస్తుతం రాష్ట్రంలో జనరల్ రెసిడెన్షియల్ స్కూళ్లు 35 ఉన్నాయని, వాటిలో 6 స్కూళ్లను కాలేజీలుగా మార్చామని, మరో 29 స్కూళ్లను వచ్చే విద్యా సంవత్సరం అప్‌గ్రేడ్ చేస్తామని పేర్కొన్నారు. కాలేజీలుగా అప్‌గ్రేడ్ అయిన, వచ్చే విద్యా సంవత్సరం నుంచి అప్‌గ్రేడ్ కానున్న పాఠశాలల్లో మౌలిక వసతులు, బోధన, బోధనేతర సిబ్బంది, నిధుల విషయమై ప్రతిపాదనలు పంపాలన్నారు. కేజీబీవీలు, మోడల్ స్కూళ్లు, రెసిడెన్షియల్ పాఠశాలల్లో ఇబ్బందులు ఉండకూడదని, ఈసారి వాటిల్లో 100 శాతం ఫలితాలు సాధించాలని చెప్పారు. డిజిటల్ తరగతుల నిర్వహణపై కమిటీ.. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రమాణాల పెంచేందు కు జాతీయ, రాష్ట్ర ఉత్తమ ప్రధానోపాధ్యాయు లతో కమిటీ ఏర్పాటు చేయాలని అధికారుల ను కడియం ఆదేశించారు. పాఠశాలల పనితీరు మెరుగుపరిచేందుకు అవసరమైన సిఫార్సుల నివేదికను 3 నెలల్లో ఈ కమిటీ అందజేయాలన్నారు. డిజిటల్ తరగతుల నిర్వహణ, డిజిటల్ సబ్జెక్టుల అప్డేట్పై ఎస్సీఈఆర్టీ, సైట్ డెరెక్టర్ కమిటీగా ఏర్పడి 3 నెలల్లో నివేదికివ్వాలన్నారు. టీచర్లందరికీ సబ్జెక్టు, స్పోకెన్ ఇంగ్లిష్‌లో పురోగతి ఉండేలా ఇన్ సర్వీస్ శిక్షణ ఇవ్వాలని చెప్పారు. ప్రధానోపాధ్యాయులకు లీడర్ షిప్ శిక్షణ ఇవ్వాలని, ఇందుకు ఇఫ్లూ, విప్రో, బ్రిటీష్ కౌన్సిల్ వంటి సంస్థల సహకారం తీసుకోవాలని సూచించారు. సమావేశంలో విద్యా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రంజీవ్ ఆర్ ఆచార్య, పాఠశాల విద్యా డైరెక్టర్ కిషన్, మోడల్ స్కూల్స్ డైరెక్టర్ సత్యనారాయణరెడ్డి, ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ శేషుకుమారి, కేజీబీవీ అదనపు ప్రాజెక్టు డైరెక్టర్ పీవీ శ్రీహరి, సైట్ డైరెక్టర్ రమణకుమార్ పాల్గొన్నారు. -
కార్పొరేట్‌కు దీటుగా ‘గురుకుల’ంలో విద్యాబోధన
చిలమత్తూరు : గురుకుల పాఠశాలల్లో కార్పొరేట్ విద్యాసంస్థలకు దీటుగా అన్ని వసతులతో విద్యాబోధన అందిస్తున్నట్టు బీసీ సంక్షేమ శాఖ సహాయ కార్యదర్శి హెచ్.కృష్ణమోహన్ తెలిపారు. ఆదివారం ఉదయం ఆయన టేకులోడు బాలికల గురుకుల పాఠశాలను సందర్శించారు. కేంద్ర ప్రభుత్వం గురుకుల పాఠశాలల అభివృద్ధికి ప్రభుత్వం రూ.3.75 కోట్ల నిధులు విడుదల చేసిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 9 గురుకుల పాఠశాలలు మంజూరు కాగా ఆరింటిని మత్య్సకారుల పిల్లల కోసం కేటాయించినట్లు చెప్పారు. మరో మూడు రాయదుర్గం మండలం కోనేబావి, మడకశిర మండలం గుండుమల, గుడిబండకు మంజూరయ్యాయన్నారు. రాబోయే విద్యా సంవత్సరంలో ఆయా పాఠశాలల్లో తరుగతులు ప్రారంభమవుతాయని చెప్పారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ ప్రసాద్, జయసింహ నాయుడు, శ్యాంభూపాల్‌రెడ్డి, లేపాక్షి, కొడిగెనహళ్లి ప్రిన్సిపాళ్లు పాల్గొన్నారు. -
బ్యాక్లాగ్ సీట్ల భర్తీ వాయిదా
చిలమత్తూరు (హిందూపురం) : మహాత్మాజ్యోతిబా పూలే బీసీ గురుకుల పాఠశాలల్లోని 6, 7, 8, 9 తరగతుల్లో బ్యాక్లాగ్ ఖాళీ సీట్ల భర్తీ ప్రక్రియను పాఠశాలల రాష్ట్ర కార్యదర్శి కృష్ణమోహన్ ఆదేశాల మేరకు తాత్కాలికంగా వాయిదా వేసినట్టు జిల్లా కన్వీనర్, టేకులోడు గురకుల పాఠశాల ప్రిన్సిపాల్ ప్రసాద్ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. జూన్‌లో ప్రారంభమయ్యే అకడమిక్ విద్యాసంవత్సరానికి బ్యాక్లాగ్ సీట్లు భర్తీ చేస్తామన్నారు. -
మార్పులతో గురుకుల నోటిఫికేషన్
-
మార్పులతో గురుకుల నోటిఫికేషన్
7,306 పోస్టులు.. 18 నుంచి ఆన్లైన్ దరఖాస్తులు సాక్షి, హైదరాబాద్: గురుకుల ఉపాధ్యా యులు, ఇతర పోస్టుల భర్తీకి తొమ్మిది కొత్త నోటిఫికేషన్లు (రీ నోటిఫికేషన్స్) గురువారం జారీ అయ్యాయి. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి (ఎన్సీటీఈ) మార్గదర్శకాలకు అనుగుణంగా రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) మొత్తంగా 7,306 పోస్టులతో ఈ నోటిఫికేషన్లను జారీ చేసింది. అభ్యర్థులు ఈనెల 18వ తేదీ నుంచి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని.. పూర్తి వివరాలను త్వరలో వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతామని తెలిపింది. గతంలో ఇచ్చిన నోటిఫికేషన్లో పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్ (పీజీటీ) పోస్టులకు బీఎడ్‌తోపాటు పీజీలో 60 శాతం మార్కులు, ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (టీజీటీ) పోస్టులకు బీఎడ్‌తోపాటు డిగ్రీలో 60 శాతం మార్కులు ఉండాలన్న నిబంధనపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైన విషయం తెలిసిందే. దాంతో ఈ విషయంలో సీఎం కేసీఆర్ జోక్యం చేసుకుని మార్పులు చేయాలని ఆదేశించారు. ఈ మేరకు ఎన్సీటీఈ మార్గదర్శకాలకు అనుగుణంగా సంక్షేమ శాఖలు రూపొందించిన నిబంధనలతో తాజా నోటిఫికేషన్లు జారీ అయ్యాయి. తాజా నిబంధనలు ఇలా.. తాజా నోటిఫికేషన్ ప్రకారం.. ఉపాధ్యాయ పోస్టులకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, వికలాంగ అభ్యర్థులు బీఎడ్‌తోపాటు పీజీ, డిగ్రీలో 45 శాతం మార్కులు సాధించి ఉంటే చాలు. ఇతరులు బీఎడ్‌తో పాటు 50 శాతం మార్కులు సాధించి ఉండాలి. ఎక్స్ సర్వీస్‌మెన్‌కు రిజర్వేషన్ ఉంటుంది. ఇక డీఎడ్–డిగ్రీ పూర్తి చేసిన వారికి టీజీటీ పోస్టుల్లో అవకాశం కల్పించనున్నట్లు తెలిసింది. బీకాం వారికి, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ చేసిన వారికి కూడా పోస్టుల్లో అర్హత కల్పించినట్లు సమాచారం. టీజీటీ పోస్టులకు అభ్యర్థులు బీఎడ్‌తో పాటు టెట్‌లోనూ అర్హత సాధించి ఉండాలి. అర్హతలకు సంబంధించిన పూర్తి వివరాలు పూర్తిస్థాయి నోటిఫికేషన్ వచ్చాకే వెల్లడికానున్నాయి. -
బ్యాక్లాగ్ సీట్ల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం
చిలమత్తూరు (హిందూపురం) : మహాత్మా జ్యోతిబా పూలే బీసీ గురుకుల పాఠశాలల్లోని 6,7,8,9 తరగతుల్లో బ్యాక్లాగ్ ఖాళీ సీట్ల భర్తీకి అర్హుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా కన్వీనర్, టేకులోడు గురకుల పాఠశాల ప్రిన్సిపాల్ ప్రసాద్ తెలిపారు. ఈమేరకు శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు. మొత్తం బాలికలకు 12, బాలురకు 32 సీట్లు ఖాళీగా ఉన్నందున శాసనకోట పాఠశాలలో బాలికలకు, పేరూరు, పెన్నహోబిలం, లేపాక్షి పాఠశాలలో బాలురకు అవకాశం ఉందన్నారు. 6వ తరగతిలో 13, 7వ తరగతిలో 8 సీట్లు, 8వ తరగతిలో 7, 9వ తరగతిలో 4 ఖాళీలు ఉన్నాయన్నారు. టేకులోడు, పేరూరు, లేపాక్షి, శాసనకోట, పెన్నహోబిలం పాఠశాలలో ఈ నెల 10 నుంచి ఉచితంగా దరఖాస్తులు పొందొచ్చన్నారు. దరఖాస్తులను ఈనెల 15వ తేదీ లోపు పాఠశాలలో అందజేయాలన్నారు.ఈనెల 20న టేకులోడు గురుకుల పాఠశాలలో ఉదయం 11 గంటలకు పరీక్ష ఉంటుందన్నారు. మరిన్ని వివరాలకు సెల్ : 98665 59655లో సంప్రదించాలన్నారు. -
గురుకుల పోస్టులకు బ్రేక్
⇒ నోటిఫికేషన్ రద్దు చేస్తున్నట్లు టీఎస్పీఎస్సీ ప్రకటన ⇒ ఇంకా ఖరారుకాని కొత్త నిబంధనల రూపకల్పన ⇒ జాప్యం కారణంగా నోటిఫికేషన్ రద్దు ⇒ అర్హతలతో కూడిన మార్గదర్శకాలు వచ్చాకే నోటిఫికేషన్ సాక్షి, హైదరాబాద్ రాష్ట్రంలోని గురుకులాల్లో 7,306 బోధన, బోధనేతర పోస్టుల భర్తీకి జారీ చేసిన నోటిఫికేషన్‌ను టీఎస్పీఎస్సీ గురువారం రద్దు చేసింది. ఉపాధ్యాయ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు డిగ్రీ, పీజీల్లో 60 శాతం మార్కులు సాధించి ఉండాలని ఆ నోటిఫికేషన్లో పేర్కొన్న నిబంధనపై తీవ్ర వ్యతిరేకత, కొత్త నిబంధనల రూపకల్పన నేపథ్యంలో ఈ నిర్ణయం వెలువడింది. నూతన నిబంధనలు వచ్చాక తిరిగి నోటిఫికేషన్ జారీ చేస్తామని టీఎస్పీఎస్సీ ప్రకటించింది. ఇష్టారాజ్యంగా నిబంధనలు గురుకులాల్లో తొమ్మిది కేటగిరీల్లోని 7,306 పోస్టుల భర్తీకి టీఎస్పీఎస్సీ ఫిబ్రవరి 6వ తేదీన నోటిఫికేషన్ జారీ చేసింది. ఫిబ్రవరి 10 నుంచి మార్చి 4 వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని ప్రకటించింది. అయితే ఆ నోటిఫికేషన్లో పేర్కొన్న కొన్ని నిబంధనలపై తీవ్ర నిరసన వెల్లువెత్తింది. టీజీటీ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు డిగ్రీలో కనీసం 60 శాతం, పీజీటీ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు పీజీలో కనీసం 60 శాతం మార్కులు సాధించి ఉండాలన్న నిబంధన పెట్టారు. మూడేళ్ల బోధన అనుభవం నిబంధన, టీజీటీ పోస్టుల్లో డిగ్రీ–డీఎడ్ కలిగిన వారికి అవకాశమివ్వకపోవడం, పీఈటీ పోస్టుల్లో బీపీఈడీ చేసిన వారికి అవకాశం కల్పించకపోవడంపై వ్యతిరేకత వ్యక్తమైంది. పైగా ఈ నిబంధనలు జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి (ఎన్సీటీఈ) నిబంధనలు, మార్గదర్శకాలకు విరుద్ధంగా ఉండడం గమనార్హం. జాప్యం జరగడంతో.. తీవ్ర వ్యతిరేకత నేపథ్యంలో నోటిఫికేషన్ నిబంధనలను సవరించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు. దాంతో ఫిబ్రవరి 10వ తేదీ నుంచి చేపట్టాల్సిన దరఖాస్తుల స్వీకరణను టీఎస్పీఎస్సీ నిలిపివేసింది. గురుకుల సొసైటీలు, ప్రభుత్వం మార్పులతో కూడిన తాజా మార్గదర్శకాల రూపకల్పనపై కసరత్తు ప్రారంభించాయి. కానీ దీనిపై జాప్యం జరుగుతోంది. కొత్త మార్గదర్శకాలు ఇంకా టీఎస్పీఎస్సీకి చేరకపోవడంతో ఆ నోటిఫికేషన్‌ను రద్దు చేస్తున్నట్లు టీఎస్పీఎస్సీ ప్రకటించింది. కొత్త నిబంధనలు వచ్చాక, వాటి ప్రకారం మళ్లీ కొత్త నోటిఫికేషన్‌ను జారీ చేస్తామని వెల్లడించింది. మరోవైపు ఈ వ్యవహారంలో నిరుద్యోగులు, ఉపాధ్యాయ అభ్యర్థులు ఆందోళనలో మునిగిపోతున్నారు. సీఎం కేసీఆర్ జోక్యం చేసుకుని త్వరగా నోటిఫికేషన్ జారీ చేసేలా చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు. -
గురుకుల నోటిఫికేషన్ రద్దు
హైదరాబాద్: అనుకున్నదే అయింది. గురుకుల నోటిఫికేషన్ రద్దయింది. త్వరలో కొత్త మార్గదర్శకాలతో మళ్లీ నోటిఫికేషన్ విడుదల చేస్తామని టీఎస్పీఎస్సీ ప్రకటించింది. గురువారం ఈ మేరకు ఒక ప్రకటన చేసింది. గురుకుల విద్యాలయాల్లో 7,306 బోధన, బోధనేతర పోస్టులకు రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే, ఈ నోటిఫికేషన్లో గురుకుల పోస్టుల పరీక్ష రాసేందుకు డిగ్రీ, పీజీల్లో 60 శాతం మార్కులు సాధించి ఉండాలని, బోధన అనుభవం ఉండాలని తదితర కొత్త నిబంధనలు పెట్టారు. దీంతో అభ్యర్థుల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఫలితంగా గురుకుల పోస్టుల పరీక్ష రాసేందుకు డిగ్రీ, పీజీల్లో 60 శాతం మార్కులు సాధించి ఉండాలన్న నిబంధనను, బోధన అనుభవం నిబంధనను తొలగించాలని.. ఎన్సీటీఈ నిబంధనల మేరకు 50% మార్కులతోనే దరఖాస్తులను స్వీకరించాలని సీఎం కేసీఆర్ గురుకుల విద్యాలయాల సంస్థలను ఆదేశించారు. దీంతో సంక్షేమ శాఖలు, గురుకుల విద్యాలయాల సంస్థలు హుటాహుటిన సమావేశమై... జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి మార్గదర్శ కాల ప్రకారం కొత్త నిబంధనల రూప కల్పనపై కసరత్తు చేశాయి. సాంఘిక సంక్షేమ, గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థల కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ నేతృత్వంలో అధికారులు చర్చించారు. సీఎం ఆదేశాల ప్రకారం వాటిని సవరించి తిరిగి వారంలోగా నోటిఫికేషన్ విడుదల చేసేందుకు దరఖాస్తుల స్వీకరణను ఆపేసింది. అయితే, ఆ సవరణలు ఇప్పట్లో కావని, కనీసం నెల రోజులు పడుతుందని కొందురు సీనియర్ అధికారులు చెప్పారు. అసలు నోటిఫికేషన్ రద్దయ్యి కొత్త నోటిఫికేషన్ వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదని కూడా వార్తలు వినిపించాయి. సరిగ్గా ఆ ప్రకారమే కొత్త మార్గదర్శకాలతో త్వరలోనే నోటిఫికేషన్ వేస్తామంటూ ఇప్పటికే విడుదల చేసిన నోటిఫికేషన్స్‌ను టీఎస్ పీఎస్సీ రద్దు చేసింది. -
గురుకులాల్లోని పార్ట్‌టైం టీచర్ల వేతనాలు రెట్టింపు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని వివిధ సంక్షేమ శాఖల ఆధ్వర్యంలోని గురుకుల పాఠశాలలు, కళాశాల పార్ట్‌టైం ఉద్యోగుల వేతనాలు రెట్టింపయ్యాయి. సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సొసైటీతోపాటు మహాత్మా జ్యోతిరావు ఫూలే బీసీ గురుకులాల సొసైటీ పరిధిలోని గురుకులాల్లో పనిచేస్తున్న 7 కేటగిరీలకు చెందిన 935 మంది పార్ట్‌టైం ఉద్యోగుల వేతనాలను పెంచుతూ సర్కార్ నిర్ణయం తీసుకుంది. గురుకుల టీచర్ల సమస్యలపై ఎస్సీ అభివృద్ధిశాఖ మంత్రి జి. జగదీశ్‌రెడ్డితో చర్చల అనంతరం ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు జాయింట్ స్టాఫ్ సొసైటీ నేతలు కె. వెంకటరెడ్డి, ఎ.వి. రంగారెడ్డి, అర్జున, ప్రమోద్‌కుమార్ తెలిపా రు. సర్కారు నిర్ణయంపై హర్షం వ్యక్తం చేశారు. -
గురుకుల విద్యాలయాల్లో 1,794 పోస్టులు
భర్తీ చేసేందుకు సర్కారు అనుమతి పాఠశాలల్లో 1,164, డిగ్రీ కాలేజీల్లో 630 పోస్టులు ఉత్తర్వులు జారీ చేసిన ఆర్థిక శాఖ హైదరాబాద్: సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సంస్థల్లో ఖాళీగా ఉన్న 1,794 పోస్టులను భర్తీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతినిచ్చింది. ఇందులో గురుకుల పాఠశాలల్లో 1,164 పోస్టులు, గురుకుల మహిళా డిగ్రీ కాలేజీల్లో 630 పోస్టులను భర్తీ చేసేందుకు ఆమోదిస్తూ ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) ద్వారా డెరైక్ట్ రిక్రూట్మెంట్ విధానంలో ఈ పోస్టులను భర్తీ చేస్తారు. గతంలో అనుమతించిన 758 పోస్టులకు ఇవి అదనమని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ (టీఎస్డబ్ల్యుఆర్ఐఎస్) ఆధ్వర్యంలో బాల బాలికలకు 103 గురుకుల పాఠశాలలు, మహిళలకు 30 డిగ్రీ కాలేజీలను మంజూరు చేసిన విషయం తెలిసింది. వాటిల్లో అవసరమైన టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులను భర్తీ ప్రక్రియను ప్రభుత్వం చేపట్టింది. అందులో భాగంగా కొత్త పోస్టుల వివరాలను వెల్లడించడంతో పాటు భర్తీకి చేపట్టాల్సిన చర్యలను ఆర్థిక శాఖ తాజా ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ జారీకి వీలుగా అవసరమైన రోస్టర్ పాయింట్లు, అర్హతలు, లోకల్ కేడర్, సబ్జెక్ట్‌ల వారీ వివరాలను టీఎస్పీఎస్సీకి అందించాలని ఎస్సీ అభివృద్ధి శాఖకు సూచించింది. గురుకుల పాఠశాలల్లో పోస్టులు ప్రిన్సిపాల్ 31 టీజీటీ 721 పీఈటీ 103 ఆర్ట్ టీచర్ 47 మ్యూజిక్ టీచర్ 56 లైబ్రేరియన్ 103 స్టాఫ్ నర్స్ 103 మొత్తం 1,164 గురుకుల మహిళా డిగ్రీ కాలేజీల్లో పోస్టులు ప్రిన్సిపాల్ 30 డిగ్రీ లెక్చరర్లు 510 లైబ్రేరియన్ 30 పీడీ 30 హెల్త్ సూపర్వైజర్ 30 మొత్తం 630 -
‘గురుకులాలు’ ఆదర్శంగా నిలవాలి
నాణ్యమైన విద్యను అందించడమే ప్రభుత్వ ధ్యేయం డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి పరకాల : ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొస్తున్న గురుకుల పాఠశాలలు దేశానికే ఆదర్శం గా నిలవాలని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి అన్నారు. ఆత్మకూరు మండలానికి మంజూరైన గురుకుల పాఠశాలను మండలంలోని మల్లక్కపేట గురుకులంలో బుధవారం ఆయన ప్రా రంభించారు. అనంతరం పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో కడియం మాట్లాడుతూ.. 1995–99 మధ్య కాలంలో ఉమ్మడి రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రిగా పనిచేసిన తాను రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గురుకులాలను కళాశాలలుగా అప్‌గ్రేడ్ చేశానని చెప్పారు. ఇప్పుడు ప్రత్యేక రా ష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించేందుకు పాటుపడుతున్నామని చెప్పా రు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా కొత్తగా 319 గురుకులాలను ప్రారంభించినట్లు చెప్పారు.16 గురుకులాలనుకాలేజీలుగా అప్‌గ్రేడ్ చేశామన్నారు. కొత్తగా ఏర్పా టు చేసిన గురుకులాల్లో 7వేల కోట్ల ఖర్చుతో 10 వేల ఉద్యోగాల భర్తీ చేయనున్నట్లు చెప్పా రు. సాంఘిక సంక్షేమ కార్యదర్శి ప్రవీణ్‌కుమార్ ఎంతో కష్టపడుతూ విద్యార్థుల అభివృద్ధి కోసం పని చేస్తున్నారని అభినందించారు. నడికూడలో 15 వేల మొక్కలను నాటి సంరక్షించాలని, వందశాతం మరుగుదొడ్లు నిర్మించుకుం టే 25 లక్షల నిధులను మంజూరు చేస్తామని గ్రామస్తులకు హామీ ఇచ్చారు. కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ గద్దల పద్మ, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు తక్కళ్లపల్లి రవీందర్రావు, జడ్పీటీసీ సభ్యురాలు పాడి కల్పనాదేవి–ప్రతాప్‌రెడ్డి, ఎంపీపీ నేతాని సులోచన–శ్రీనివాస్‌రెడ్డి, నగర పంచాయతి చైర్మన్ మార్త రాజభద్రయ్య, డీసీవో రూపాదేవి పాల్గొన్నారు. మనసున్న మహారాజు కేసీఆర్ చదువుతోపాటు సన్న బియ్యంతో విద్యార్థుల కడుపు నింపుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్ మనసున్న మహారాజని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి కొని యాడారు. కేసీఆర్ మనువడు, మనుమరాలు తింటున్న సన్న బియ్యా న్ని విద్యార్ధులకు అందించిన మహామనిషి అని కొనియాడారు. రాష్ట్రంలో 319 గురుకులాలను ఏర్పాటు చేస్తే అందులో 200 గురుకులాలను కేవలం బాలికల కోసం కేటాయించడం జరిగిందన్నారు. అవకాశం కల్పిస్తే ఆడపిల్లలు ఆకాశమే హద్దుగా ఎదుగుతారన్నారు. మన రాష్ట్రంలోనే చేపట్టిన హరితహారం కార్యక్రమాన్ని ప్రధాన మంత్రి మోదీ సైతం అభినందించారని చెప్పారు. ఏడాదికి 46కోట్ల మొక్కల చొప్పున ఐదేళ్లలో 230 కోట్ల మొక్కలను పెంచడం కోసం హరితహారం కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందన్నారు. ప్రభుత్వం రూ.46వేల కోట్లతో మిషన్ భగీరథతో ఇంటింటికి సురక్షితమైన నల్లా నీళ్లు అందిస్తుందన్నారు. చెరువుల పూడికతీత కోసం ప్రారంభించిన మిషన్ కాకతీయ ప్రపం చ ప్రజల దృష్టిని ఆకర్షించిందన్నారు. ఆసరా పింఛన్ల కోసం ఏటా రూ.4600 కోట్లను ప్రభుత్వం ఖర్చు చేస్తుందని, రూ.17వేల కోట్లతో రుణమాఫీని అమ లు చేస్తున్న ఘనత ప్రభుత్వానికే దక్కుతుందని ఆయన అన్నారు. మంత్రి వెం ట ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ గద్దల పద్మ పాల్గొన్నారు. -
ఉద్యోగ ఆధారిత కోర్సులకు శ్రీకారం
వచ్చే జూన్ కల్లా 250 కొత్త గురుకులాల ప్రారంభం వీటి ఏర్పాటుకు మొత్తం రూ.5,500 కోట్ల వ్యయం డిగ్రీ నుంచే పోటీ పరీక్షలకు శిక్షణ: ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ సాక్షి, హైదరాబాద్: సంప్రదాయ బీఏ, బీఎస్సీ, బీకాం వంటి డిగ్రీ కోర్సులకు భిన్నంగా కాలేజీల నుంచి విద్యార్థులు బయటకు రాగానే ఏదో ఒక ఉద్యోగం, ఉపాధి లభించేలా సంక్షేమ గురుకుల డిగ్రీ కోర్సుల సిలబస్‌కు తుదిరూపునిస్తున్నారు. ప్రభుత్వ, ప్రైవేట్, కార్పొరేట్, పరిశ్రమల్లో సిబ్బంది, ఉద్యోగులు, సదుపాయాల కల్పనకు ఉత్పన్నమయ్యే అవసరాలకు తగ్గట్లుగా సిలబస్‌ను రూపొందిస్తున్నారు. వివిధ విశ్వవిద్యాలయాలు, పరిశ్రమలతో అనుసంధానం చేయనున్నారు. దీనికి సంబంధించి ఆయా పరిశ్రమల ప్రతినిధులతో చర్చలప్రక్రియను ప్రారంభించారు. ఆంగ్లం, కంప్యూటర్ వినియోగంలో విద్యార్థులు పైచేయిని సాధించేలా శిక్షణను ఇవ్వనున్నారు. ప్రవేశ పరీక్షను నిర్వహించడం ద్వారా డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ఈ కాలేజీలను పెద్ద పట్టణాలు, నగరాలకు దగ్గరగా ఉండేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. జూన్‌కల్లా కొత్త గురుకుల పాఠశాలలు ఏర్పాటు.. వచ్చే జూన్ చివరికల్లా రాష్ర్టంలో ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ విద్యార్థుల కోసం కొత్త గురుకుల పాఠశాలలు ప్రారంభం కానున్నాయి. అవసరమైన బడ్జెట్, మౌలిక సదుపాయాలు, టీచర్లు, సిబ్బంది, భవనాల ఏర్పాట్లకు సంబంధించి ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చిన వెంటనే పనులను చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఆయా శాఖలు వెల్లడించాయి. ప్రధానంగా ఎస్సీ, ఎస్టీ గురుకుల పాఠశాలల సొసైటీ, మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్స్ సొసైటీ ఈ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నాయి. 250 గురుకులాల ఏర్పాటుకు రూ.5,500 కోట్లు.. కొత్తగా ఏర్పాటు చేయనున్న 250 గురుకుల విద్యాలయాల ద్వారా 1.6 లక్షల మంది ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ విద్యార్థులకు లబ్ధి చేకూరుతుందని ప్రభుత్వం భావిస్తోంది. వీటి ఏర్పాటుకు రూ. 5,500 కోట్లు వ్యయం అవుతుందని అంచనావేస్తున్నారు. ఒక్కో రె సిడెన్షియల్ స్కూల్‌కు 7 ఎకరాల స్థలంతో పాటు రూ.22 కోట్ల మేర ఖర్చు అవుతుందని అధికారులు తేల్చారు. ఈ విద్యాసంవత్సరం (2016-17) నుంచే ఎస్సీ విద్యార్థుల కోసం వంద రెసిడెన్షియల్ పాఠశాలలు, మైనారిటీ విద్యార్థుల కోసం 70 గురుకులాలు, ఎస్టీ విద్యార్థులకు 50 రెసిడెన్షియల్ స్కూళ్లు, మహిళల కోసం 25, అబ్బాయిల కోసం 5 రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీలను ఏర్పాటు చేయనున్నట్లు సీఎం ప్రకటించిన విషయం తెలిసిందే. ఫ్రెంచ్, స్పానిష్నూ బోధిస్తాం.. ‘‘ డిగ్రీ నుంచే సివిల్స్, కేంద్ర, రాష్ట్ర, కార్పొరేట్ రంగాల్లోని పోటీ పరీక్షలకు అవసరమైన లాంగ్‌టర్మ్ శిక్షణను అందిస్తాం. దేశంలో ఎక్కడ ఉద్యోగ అవకాశాలు వచ్చినా వాటిలో సింహభాగం తెలంగాణ వారికే దక్కేలా చూడాలన్నది ప్రభుత్వ ధ్యేయం. డిగ్రీ కోర్సులన్నీ ఇంగ్లిష్ మీడియంలోనే. ఫ్రెంచ్, స్పానిష్ వంటి భాషలను బోధిస్తాం. సెల్ఫ్ డెవలప్మెంట్, సెల్ఫ్ ఎంప్లాయిమెంట్, ఫ్రీలాన్సింగ్‌లో విద్యార్థులు ఆరితేరేలా తరగతులుంటాయి. బయట జాబ్ మార్కెట్ అవసరాలకు అనుగుణంగా కోర్సులను రూపొందిస్తున్నాం. వృత్తివిద్యా కోర్సుల్లో శిక్షణనిచ్చి, స్కూల్ నుంచి బయటకు రాగానే ఉపాధి దొరికేలా సశక్తులను చేస్తాం. మ్యూజిక్, ఆర్ట్, డాన్స్‌లలో శిక్షణనిచ్చేలా రూపొందిస్తున్నాం.’’ - ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్, ఎస్సీ, ఎస్టీ గురుకులాల కార్యదర్శి -
21న నల్లగొండ జిల్లా గురుకులాల్లో సర్టిఫికెట్ల పరిశీలన
రామన్నపేట(నల్లగొండ): నల్లగొండ జిల్లాలోని గురుకుల పాఠశాలల్లో ప్రవేశ పరీక్షలో అర్హత సాధించిన విద్యార్థుల సర్టిఫికెట్ల పరిశీలన ఈనెల 21వ తేదీన రామన్నపేట మండలం జనంపల్లి గురుకుల పాఠశాలలో ఉంటుందని కన్వీనర్ శ్రీనివాసప్రసాద్ తెలిపారు. మంగళవారం స్థానికంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గురుకుల విద్యాలయాల్లో 5వ తరగతిలో ప్రవేశం కోసం ఏప్రిల్ 19న పరీక్ష నిర్వహించగా 453 మంది విద్యార్థ్దులు అర్హత సాధించారని ఆయన తెలిపారు. వారందరి తల్లిదండ్రులకు ఫోన్ మెసేజ్ అందజేసినట్లు వివరించారు. అర్హత పొందిన విద్యార్థుల తల్లిదండ్రుల ఆదాయ ధృవీకరణ పత్రం(వార్షికాదాయం 60వేలలోపు ఉండాలి), స్టడీ సర్టిఫికెట్ (3, 4 తరగతులకు సంబంధించిన), ప్రత్యేక కేటగిరీ వారు సంబంధిత ధృవీకరణ పత్రం, ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికెట్‌ను తీసుకొని వస్తే సరిపోతుందని తెలిపారు. టీసీని తీసుకు రావలసిన అవసరం లేదని చెప్పారు. -
గురుకులాల్లోనూ ‘వెనుకబాటే’
అవగాహన లోపంతో దరఖాస్తు కూడా చేసుకోలేని పరిస్థితి సాక్షి, హైదరాబాద్: వెనుకబడిన తరగతుల సంక్షేమం కోసం ఏర్పాటు చేసిన గురుకుల పాఠశాలలు, వసతిగృహాలు అందరికీ చేరువ కావడం లేదు. వారి లోని కొందరికే ఈ ఫలాలు అందుతున్నాయి. మొత్తం 138 బీసీ కులాల్లో 20 నుంచి 25 కులాల వారే ఈ పాఠశాలల్లో ప్రవేశాలు పొందుతున్నారన్నది ఓ అధ్యయనం వెల్లడించిన నిజం. రాష్ట్రంలోని బీసీ గురుకుల పాఠశాలలు, వసతి గృహాల్లో సెంటర్ ఫర్ గుడ్ గవర్నెర్స్ (సీజీజీ) ఈ సర్వే నిర్వహించింది. దీని ప్రకారం బీసీల్లోని ఎ, బి, సి, డి, గ్రూపుల కులాలు గురుకులాల్లో ప్రవేశ పరీక్షకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోలేకపోవడంతో ప్రవేశం పొంద లేకపో తున్నారు. కొన్ని కులాల వారు కనీసం దరఖాస్తు కూడా చేసుకోలేదని తెలిసింది. వెనుకబాటుతనమే కారణం: ఒక్కసారి కూడా పోస్ట్‌మెట్రిక్ స్కాలర్షిప్లను పొందని కులాలు 52 వరకు ఉన్నట్లు తెలుస్తోంది. ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడటం మూలనా అధిక శాతం కులాల వారు ఈ పాఠశాలల్లో చేరట్లేదని అధికారులు భావిస్తున్నారు. చదువుకోవాలనే ఆసక్తి కొరవడటం, ఈ పాఠశాలల వల్ల కలిగే ప్రయోజనాల గురించి కనీస విషయాలు తెలియకపోవడం వల్ల దరఖాస్తుకు వెనకాడుతున్నారన్నారు. సంచార జాతులు గా ఆయా వృత్తులకు పరిమితం కావడం వంటి కారణాలతో చేరడం లేదనేది స్పష్టమైంది. సీజీజీ నివేదిక ప్రకారం 36 కులాల వారు భిక్షాటనే ప్రధాన వృత్తిగా ఇప్పటికీ జీవితం వెల్లదీస్తున్నారు. ఈ నేపథ్యంలో వీరిని భిక్షాటన నుంచి దూరం చేసి వారి పిల్లలను గురుకుల పాఠశాలల్లో చదివించే దిశగా ప్రభుత్వం నడుం బిగించింది. బీసీ గురుకులల్లో 5వ తరగతిలోకి ప్రవేశానికి దరఖాస్తు చేసుకునేందుకు మే 8వ తేదీ చివరితేదీ. ఆ లోగా ఈ 36 కులాలతో పాటు, ప్రవేశం పొందని కులాల విద్యార్థులు దరఖాస్తు చేసుకునేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించింది. ఈ మేరకు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ ముఖ్యకార్యదర్శి టి.రాధ ఆదేశాలు జారీ చేశారు. -
గురుకులాల్లో ‘గ్రేడింగ్’
సాక్షి, హైదరాబాద్: సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో ఉపాధ్యాయుల వర్గీకరణ కార్యక్రమం వివాదాస్పదమవుతోంది. విద్యార్థుల అభ్యసన స్థాయిని పరిశీలించి ఉపాధ్యాయులను ఏ,బీ,సీ,డీ గ్రేడ్లుగా వర్గీకరించాలని గత నెల 31న సొసైటీ కార్యదర్శి కార్యాలయం నుంచి సర్క్యులర్ జారీ అయింది. ఈ సర్క్యులర్ ప్రకారం ప్యానెల్ ఇన్స్పెక్టర్లు సొసైటీ పరిధిలోని విద్యాసంస్థలకు వెళ్లి అక్కడి సౌకర్యాలను పరిశీలించి ఆ పాఠశాలల పరిస్థితిని బట్టి గొప్పగా ఉంది (ఎ), చాలా బాగుంది (బి), సంతృప్తస్థాయిలో ఉంది (సి), బాగాలేదు (డి) అని వర్గీకరించాల్సి ఉంటుంది. దీంతో పాటు పాఠశాలల్లోని ఉపాధ్యాయుల పనితీరును బట్టి వారిని కూడా అదే రీతిలో వర్గీకరించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఉపాధ్యాయులను కూడా గ్రేడింగ్ చేయాలని ఉత్తర్వులివ్వడంపట్ల సొసైటీ పరిధిలోని ఉపాధ్యాయ సంఘాలు మండిపడుతున్నాయి. ఒక ఉపాధ్యాయుని పనితీరును అంచనా వేయాల్సింది వార్షిక పరీక్షల్లో వచ్చిన ఫలితాలను బట్టి తప్ప... ఒక్క పీరియడ్‌లో అంటే కేవలం 45 నిమిషాల కాలవ్యవధిలో ఒక నిర్ధారణకు రావడం అశాస్త్రీయమని ఉపాధ్యాయ సంఘాల నేతలంటున్నారు. అసలు దేశంలో ఎక్కడైనా ఉపాధ్యాయులను ప్యానెల్ ఇన్స్పెక్టర్లు వర్గీకరించడం ఉందా? అని ప్రశ్నిస్తున్నారు. గతంలో కేంద్ర ప్రభుత్వం కూడా సీబీఎస్ఈ విద్యాసంస్థల్లోని టీచర్లను వర్గీకరించాలనే ప్రయత్నం చేసిందని, అయితే పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం కావడంతో వెనక్కు తగ్గాల్సి వచ్చిందని గుర్తు చేస్తున్నారు. ఈ విషయమై ఎస్టీయూ ప్రధాన కార్యదర్శి కత్తి నర్సింహారెడ్డి మాట్లాడుతూ... విద్యార్థుల ప్రతిభాపాటవాలను మెరుగుపరిచేందుకు ఇది సరైన పద్ధతి కాదని వ్యాఖ్యానించారు. డిగ్రీలు, పీజీలు, వృత్తివిద్యా కోర్సులు పూర్తి చేసి ఉపాధ్యాయులుగా నియమితులైన వారి పనితీరు సంతృప్తికరంగా లేకపోతే మరిన్ని శిక్షణా తరగతులు నిర్వహించి సిలబస్‌పై అవగాహన కల్పించాలే తప్ప ఇలా అవమానించే విధానాలను అమల్లోకి తేవడం విద్యావ్యవస్థకు మంచిది కాదని చెప్పారు. సొసైటీ తీసుకున్న నిర్ణయం కారణంగా ఉపాధ్యాయుల్లో విభేదాలు రావడంతో పాటు ఒకరంటే ఒకరికి చులకన భావం ఏర్పడే పరిస్థితులు వస్తాయని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల ఉపాధ్యాయులు, సిబ్బంది సంఘం ప్రధాన కార్యదర్శి సి.హెచ్.బాలరాజు అభిప్రాయపడ్డారు. వెంటనే ఈ ప్రతిపాదనను విరమించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.