రామన్నపేట(నల్లగొండ): నల్లగొండ జిల్లాలోని గురుకుల పాఠశాలల్లో ప్రవేశ పరీక్షలో అర్హత సాధించిన విద్యార్థుల సర్టిఫికెట్ల పరిశీలన ఈనెల 21వ తేదీన రామన్నపేట మండలం జనంపల్లి గురుకుల పాఠశాలలో ఉంటుందని కన్వీనర్ శ్రీనివాసప్రసాద్ తెలిపారు. మంగళవారం స్థానికంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గురుకుల విద్యాలయాల్లో 5వ తరగతిలో ప్రవేశం కోసం ఏప్రిల్ 19న పరీక్ష నిర్వహించగా 453 మంది విద్యార్థ్దులు అర్హత సాధించారని ఆయన తెలిపారు.
వారందరి తల్లిదండ్రులకు ఫోన్ మెసేజ్ అందజేసినట్లు వివరించారు. అర్హత పొందిన విద్యార్థుల తల్లిదండ్రుల ఆదాయ ధృవీకరణ పత్రం(వార్షికాదాయం 60వేలలోపు ఉండాలి), స్టడీ సర్టిఫికెట్ (3, 4 తరగతులకు సంబంధించిన), ప్రత్యేక కేటగిరీ వారు సంబంధిత ధృవీకరణ పత్రం, ఫిజికల్ ఫిట్‌నెస్ సర్టిఫికెట్‌ను తీసుకొని వస్తే సరిపోతుందని తెలిపారు. టీసీని తీసుకు రావలసిన అవసరం లేదని చెప్పారు.
21న నల్లగొండ జిల్లా గురుకులాల్లో సర్టిఫికెట్ల పరిశీలన
Published Tue, May 19 2015 4:18 PM | Last Updated on Sun, Sep 3 2017 2:19 AM
Advertisement