
విద్యార్థినితో మాట్లాడుతున్న కలెక్టర్
సాక్షి, ఆదిలాబాద్‌రూరల్ :ఐరన్ మాత్రలు వికటించి.. 57 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురైన ఘటన ఆదిలాబాద్ అనుకుంట మహాత్మా జ్యోతి బాపూలే బాలికల గురుకుల పాఠశాలలో గురువారం వెలుగు చూసింది. మండల వైద్యాధికారి రోజారాణి విద్యార్థులకు పాఠశాలలో పరీక్షలు నిర్వహించారు. పాఠశాలలో 400 మంది విద్యార్థినులు చదువకుంటున్నారని, గురువారం అల్పాహారం చేసి.. ఐరన్ మాత్రలు వేసుకున్నారని, మధ్యాహ్నం కొందరు వాంతులు చేసుకున్నారని, తల తిప్పుతున్నట్లు అనిపిస్తోందని చెప్పగా.. వెంటనే ఆదిలాబాద్‌లోని రిమ్స్‌కు తరలించామన్నారు. 57మంది విద్యార్థినుల్లో 40 మందికి తీవ్ర అస్వస్థత ఉన్నట్లు పేర్కొన్నారు. కాగా, డీఎంహెచ్‌వో డాక్టర్ చందు, జిల్లా విద్యాశాఖ అధికారి రవీందర్ రెడ్డి, గురుకుల పాఠశాల రీజినల్ కోఆర్డినేటర్ గోపీచంద్ పరిస్థితిని సమీక్షించారు.
వాంతులు చేసుకుంటున్న విద్యార్థిని
Comments
Please login to add a commentAdd a comment