
వేసవి వచ్చిందంటే.. మండించే ఎండలేకాదు. నీటి ఎద్దడి కూడా భయపెడుతుంది. పట్టణాలు, పల్లెలు అనే తేడా లేకుండా తాగు నీరు కోసం ప్రజలు పడే బాధలు, కష్టాలు అన్నీ ఇన్నీ కావు. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల మహిళల అవస్థలు వర్ణనాతీతం. బిందెడు నీళ్లకోసం వారు పడే ఆవేదనకు అద్దం పట్టే కథనం ఇది!
ఆదిలాబాద్ జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో తాగునీటి ఎద్దడి తీవ్రరూపం దాల్చుతోంది. ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతుండటంతో భూగర్భ జలాలు క్రమేణా అడుగంటిపోతున్నాయి. దీంతో నీటి సమస్య జఠిలమవుతోంది. ఆదిలాబాద్ రూరల్ మండలంలోని ఖండాల గ్రామంలో మిషన్ భగీరథ ట్యాంక్ ఉన్నప్పటికీ ఆ ట్యాంకు ఎప్పుడు నిండుతుందో తెలియక ప్రతియేటా గ్రామ శివారులోని చేదబావి నుంచి నీటిని తెచ్చుకుంటున్నారు.
అయితే ఎండల తీవ్రతతో ఆ బావి ఎండిపోవడంతో మిషన్ భగీరథే దిక్కైంది. అది కూడా మూడునాలుగు రోజులకు ఒకసారి ఆ ట్యాంకు నిండుతుంది. ఒక్కొక్కరికి రెండు బిందెలే వస్తుండటంతో వాటి కోసం గ్రామస్తులు వేకువజామునే బిందెలతో ట్యాంకు వద్దకు చేరుకుని జాగారం చేయాల్సిన పరిస్థితి తలెత్తింది. తాగునీరే అందకపోగా మూగజీవాలకు, ఇతర అవసరాలకు నీరు లభించడం గగనమైంది. దీంతో గ్రామస్తులు పాలకులపై తీవ్రంగా మండిపడుతున్నారు.
– సాక్షి స్టాఫ్ ఫొటోగ్రాఫర్ ఆదిలాబాద్
చదవండి: అలా చేస్తే అత్యాచారం కిందికి రాదు : అలహాబాద్ కోర్టు తీర్పుపై దుమారం
Comments
Please login to add a commentAdd a comment