Water crisis
-
కాంగ్రెస్ సర్కార్ వైఫల్యంతో
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ సర్కార్ వైఫల్యంతో రాష్ట్రం నీటి సంక్షోభం దిశగా పయనిస్తోందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. రాష్ట్ర వ్యాప్తంగా భూగర్భజలాలు గణనీయంగా తగ్గడంపై శనివారం ఒక ప్రకటనలో ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణను భూగర్భజల సంరక్షణలో ఆదర్శంగా నిలిపిన గత బీఆర్ఎస్ ప్రభుత్వ నీటి ప్రణాళికలు కాంగ్రెస్ పాలనలో పూర్తిగా నిర్లక్ష్యానికి గురవుతున్నాయని మండిపడ్డారు. ‘కేసీఆర్ హయాంలో భూగర్భజలాలు 56 శాతం పెరిగాయి. మిషన్ కాకతీయ ద్వారా 27 వేలకు పైగా చెరువులను పునరుద్ధరించడంతో నీటి నిల్వ సామర్థ్యం 8.93 టీఎంసీలకు పెరిగింది. దీంతో సాగు, తాగునీటి రంగాలు బలోపేతమయ్యా యి. కానీ కేవలం 14 నెల ల కాంగ్రెస్ పాలనలోనే ఈ వ్యవస్థ అస్తవ్యస్తమైంది. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యంతో భూగర్భ జలమట్టం రెండు మీటర్లకు పైగా పడిపోయింది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్వహణ వైఫల్యంతో 120 కిలోమీటర్ల పొడవునా నీరు లేక గోదావరి నది ఎడారిని తలపిస్తోంది. మేడిగడ్డ బ్యారేజ్ సహా ప్రాజెక్టు నీటి భద్రతను కాపాడటంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైంది. మిషన్ భగీరథ పథకం కుంటుపడటంతో తాగునీటి కోసం మళ్లీ బోరుబావులపైనే ఆధారపడాల్సిన పరిస్థితి ఉంది’అని హరీశ్‌రావు పేర్కొన్నారు. నీటిపారుదల రంగాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుండటంతో వేసవిలో తీవ్ర నీటి ఎద్దడి తలెత్తే అవకాశముందని హెచ్చరించారు. ఈ పరిస్థితిని తప్పించడానికి వెంటనే నీటి పరిరక్షణ చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. -
జలగండం!
సాక్షి, అమరావతి: జలసంక్షోభం ముంచుకొస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా తలసరి నీటి లభ్యత గణనీయంగా తగ్గుతోంది. మన దేశంలో 1951 నాటికి తలసరి నీటి లభ్యత 5,177 క్యూబిక్ మీటర్లుŠ(ఒక క్యూబిక్ మీటర్‌కు వెయ్యి లీటర్లు) ఉంటే... ప్రస్తుతం అది 1,486 క్యూబిక్ మీటర్లకు తగ్గింది. ఇది 2031 నాటికి 1,367 క్యూబిక్ మీటర్లకు... 2051 నాటికి 1,228 క్యూబిక్ మీటర్లకు తగ్గుతుందని కేంద్ర జలసంఘం(సీడబ్ల్యూసీ) అంచనా వేసింది. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా నీటి లభ్యత పెరగకపోవడం వల్లే తలసరి నీటి లభ్యత నానాటికీ తగ్గిపోతోందని వెల్లడించింది. సముద్రం పాలవుతున్న నదీ జలాలను మరింత సమర్థవంతంగా వినియోగించుకోవడం, భూగర్భ జలాలను సంరక్షించుకోవడం, వ్యర్థ జలాలను శుద్ధిచేసి మళ్లీ వినియోగించుకోవడం ద్వారా తలసరి నీటి లభ్యతను పెంచుకోవచ్చని సూచించింది. సీడబ్ల్యూసీ అధ్యయన నివేదికలో ప్రధాన అంశాలు... » ప్రపంచంలో భూమిపై ఉన్న నీటిలో 97.5 శాతం ఉప్పునీరు. 2.5 శాతం మాత్రమే మంచినీరు. భూమిపై ఉన్న మంచినీటిలో 68.9 శాతం హిమానీనదాలు(గ్లేసియర్లు)లో ఉండగా, భూగర్భజలాలు, భూమిలో తేమ రూపంలో 30.8 శాతం, నదులు, సరస్సులలో 0.3 శాతం ఉంది. » మన దేశ భౌగోళిక విస్తీర్ణం 328.75 మిలియన్ హెక్టార్లు. ప్రపంచ భౌగోళిక విస్తీర్ణంలో మన దేశ విస్తీర్ణం వాటా 2.44 శాతం. దేశంలో సగటున ఏటా 1,170 మిల్లీమీటర్ల వర్షపాతం కురుస్తుంది. వర్షపాతం వల్ల ఏటా 4,000 బిలియన్ క్యూబిక్ మీటర్లు(బీసీఎం) నీరు లభిస్తుంది. ఇందులో 1,999.2 బీసీఎంల నీటిని ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంది. ప్రస్తుతం 1,139.18 బీసీఎంల నీటిని వినియోగించుకుంటున్నాం. » ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) ప్రమాణాల ప్రకారం తలసరి నీటి లభ్యత 5 వేల క్యూబిక్ లీటర్లు ఉండాలి. ఆ ప్రమాణాల మేరకు మన దేశంలో 1951లో మాత్రమే నీటి లభ్యత ఉంది. ఆ తర్వాత క్రమేణా జనాభా పెరుగుతూ ఉండటం, దానికి అనుగుణంగా నీటి లభ్యతను పెంచుకోకపోవడం వల్లే తలసరి నీటి లభ్యత తగ్గిపోతోంది. » ఏ దేశంలో అయినా తలసరి నీటి లభ్యత 1,700 క్యూబిక్ లీటర్లు ఉంటే... ఆ దేశంలో నీటి కొరత తీవ్రంగా ఉన్నట్లు. ప్రస్తుతం మన దేశంలో తలసరి నీటి లభ్యత 1,486 క్యూబిక్ మీటర్లు ఉంది. ఈ లెక్కన మన దేశంలో తీవ్ర నీటి కొరత ఉన్నట్లు స్పష్టమవుతోంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే 2051 నాటికి దేశంలో తీవ్ర జలసంక్షోభం తలెత్తడం ఖాయమని సీడబ్ల్యూసీ ఆందోళన వ్యక్తంచేసింది.ప్రపంచంలో భూమిపై ఉన్న నీటిలో ఉప్పు నీరు: 97.5 శాతంమంచి నీరు: 2.5 శాతంప్రపంచంలో భూమిపై ఉన్న మంచినీటి విస్తరణ ఇలా.. హిమానీనదాలలో: 68.9 శాతం భూగర్భజలాలు, భూమిలో తేమ రూపంలో: 30.8 శాతం నదులు, సరస్సులలో: 0.3 శాతం -
వర్షాకాలంలో తిరుమలకు నీటి కష్టాలు..!
-
క్షీణించిన మంత్రి ఆతిషి ఆరోగ్యం.. ఆస్పత్రికి తరలింపు
దేశ రాజధాని ఢిల్లీలో నీటి సంక్షోభాన్ని నివారించాలని కోరుతూ నిరాహార దీక్షకు దిగిన ఆప్ మంత్రి ఆతిషి ఆరోగ్యం సోమవారం అర్దరాత్రి క్షీణించింది. దీంతో ఆప్ నేత సంజయ్ సింగ్, ఇతర నేతలు, కార్యకర్తలు ఆమెను లోక్ నాయక్ జైప్రకాష్ నారాయణ్ హాస్పిటల్ (ఎల్ఎన్జేపీ)కి తరలించారు.ఈ సందర్భంగా ఢిల్లీ మంత్రి సౌరభ్ భరద్వాజ్ మీడియాతో మాట్లాడుతూ ఆతిషి రక్తంలో షుగర్ లెవెల్స్ పడిపోయి 36కు చేరాయని అన్నారు. ప్రస్తుతం ఆమె వైద్యులు పర్యవేక్షణలో ఉన్నారన్నారు. ఎంపీ సంజయ్ సింగ్ మాట్లాడుతూ ఆతిషి ఆరోగ్యం క్షీణించిందని, వెంటనే ఆస్పత్రికి తరలించకపోతే ఆమె పరిస్థితి మరింత విషమించే అవకాశం ఉందని వైద్యులు తెలియజేయంతో, తాము ఆమెను ఆస్పత్రిలో చేర్చామని అన్నారు. ఆతిషి ఢిల్లీ ప్రజల కోసం పోరాడుతున్నారని ఆయన పేర్కొన్నారు.ఢిల్లీ ప్రజలకు హర్యానా నుంచి నీరు అందేలా చూడాలని జూన్ 21 నుంచి జలమండలి మంత్రి ఆతిషి నిరవధిక నిరాహార దీక్ష చేపట్టారు. జూన్ 21న ఉపవాస దీక్షకు ముందు ఆమె బరువు 65.8 కిలోలు. నిరాహార దీక్ష నాలుగో రోజుకు ఆమె బరువు 63.6 కిలోలకు తగ్గింది. నాలుగు రోజుల్లో రక్తంలో చక్కెర స్థాయి 28 యూనిట్లు తగ్గింది. రక్తపోటు స్థాయి కూడా తగ్గింది. ఇది ప్రమాదకరమని వైద్యులు చెప్పడంతో ఆమెను పార్టీ నేతలు ఆస్పత్రికి తరలించారు. #WATCH | Delhi Water Minister Atishi being taken to LNJP hospital due to deteriorating health. Atishi has been on an indefinite hunger strike since the last four days claiming that Haryana is not releasing Delhi's share of water. pic.twitter.com/BZtG4o9ThS— ANI (@ANI) June 24, 2024 -
క్షీణిస్తున్న మంత్రి ‘ఆతిషి’ ఆరోగ్యం
న్యూఢిల్లీ: తీవ్ర నీటి సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న ఢిల్లీకి హర్యానా ప్రభుత్వం మరింత నీటిని విడుదల చేయాలన్న డియాండ్‌తో ఢిల్లీ మంత్రి అతిశీ చేపట్టిన దీక్ష నాలుగో రోజుకు చేరుకుంది. సోమవారం(జూన్24) ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు ఆహారం తీసుకోకపోవడం వల్ల ఆమె ఆరోగ్యం క్షీణిస్తోందని పేర్కొన్నారు. వెంటనే ఆసుపత్రిలో చేరాలని సూచించారు. ఈ సందర్భంగా ఆతిశీ మీడియాతో మాట్లాడారు. తన రక్తపోటు, చక్కెర స్థాయిలు పడిపోతున్నాయని చెప్పారు. బరువు తగ్గానని తెలిపారు. దీని వల్ల భవిష్యత్తులో తన ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుందన్నారు. అయినా తాను ఢిల్లీ ప్రజల తరపున పోరాడతానన్నారు. హర్యానా ప్రభుత్వం ఢిల్లీకి మరింత నీటిని విడుదల చేసే వరకు నిరాహార దీక్షను కొనసాగిస్తానని స్పష్టం చేశారు. ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినప్పటికీ హర్యానా ప్రభుత్వం రోజుకు 100 మిలియన్ గ్యాలన్ల నీటిని కూడా ఢిల్లీకి విడుదల చేయడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ చర్య వల్ల ఢిల్లీలో 28 లక్షల మంది ప్రజలు తాగునీటికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. మరోవైపు ఆతిశీ దీక్షకు మద్దతుగా క్యాండిల్‌లైట్ మార్చ్ నిర్వహిస్తామని ఆప్ తెలిపింది. -
ఆయన ఢిల్లీకి ఎల్జీ కాదు.. వీకే సక్సేనాపై ‘ఆప్’ సెటైర్లు..
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో నీటి సంక్షోభం తలెత్తిన వేళ లెఫ్టినెంట్ గవర్నర్(ఎల్జీ) వీకే సక్సేనాపై ఆమ్ఆద్మీపార్టీ(ఆప్) విమర్శల దాడికి దిగింది. వీకే సక్సేనా హర్యానా బీజేపీకి అధికార ప్రతినిధి అనుకుంటున్నారా అని ప్రశ్నించింది. ఈ మేరకు ఆప్ నేత గోపాల్‌రాయ్ ఆదివారం(జూన్23) మీడియాతో మాట్లాడారు.‘ఎల్జీ వీకే సక్సేనా హర్యానాకు ఎల్జీ కాదు. ఆయన ఢిల్లీకి ఎల్జీ. ఢిల్లీ ప్రజల ఇబ్బందులు ఎల్జీకి పట్టవు. ఆయకు ఇది సిగ్గుచేటు. ఢిల్లీలో నీటి కొరతపై మంత్రి ఆతిషి నిరవధిక నిరాహారదీక్ష చేస్తున్నారు’అని గోపాల్‌రాయ్ మండిపడ్డారు. ఢిల్లీ నీటి సంక్షోభాన్ని పొరుగు రాష్ట్రాల వారిని అపఖ్యాతిపాలు చేయడానికి వాడుకుంటున్నారని ఆప్‌ను ఉద్దేశించి ఎల్జీ వ్యాఖ్యానించిన నేపథ్యంలో ఆప్ ఆయనపై విమర్శలకు దిగింది. -
నీటి కోసం నిరసన.. నీళ్లతోనే చెదరగొట్టిన పోలీసులు
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో నెలకొన్న నీటి సంక్షోభం రోజుకో కొత్త మలుపు తీసుకుంటోంది. ఓ పక్క రాజధాని నగరానికి సరిపడా నీళ్లను హర్యానాలోని బీజేపీ ప్రభుత్వం ఇవ్వడం లేదని ఆరోపిస్తూ మంత్రి ఆతిషి నిరవధిక నిరాహారదీక్షకు దిగారు.మరోపక్క ఆప్ పార్టీ ప్రభుత్వమే నీటి సంక్షోభానికి కారణమని బీజేపీ నేతలు శనివారం(జూన్22) ఢిల్లీ ఓక్లాలోని జల్‌బోర్డు ఆఫీస్ ముందు నిరసనకు దిగారు. వీరిపై పోలీసులు వాటర్ క్యానన్లను ప్రయోగించి చెల్లాచెదురు చేశారు.VIDEO | #Delhi water crisis: BJP leader Ramesh Bidhuri leads a protest at Jal Board filling pump, Okhla. Police use water cannon on protesters.(Full video available on PTI Videos - https://t.co/n147TvqRQz) pic.twitter.com/THrwjXZgg6— Press Trust of India (@PTI_News) June 22, 2024నీటి కొరత వేళ నీళ్లతోనే నిరసనకారులను చెదరగొట్టడమా అని పోలీసులపై సోషల్‌మీడియాలో నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. గత కొన్ని రోజులుగా ఢిల్లీలో హీట్‌వేవ్ పరిస్థితులుండటంతో రిజర్వాయర్లలో నీటినిల్వలు తగ్గాయి. యమునా నదిలోనూ నీటి లభ్యత తక్కువైంది.దీనికి తోడు కొన్ని వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లలో సాంకేతిక సమస్యల కారణంగా ఢిల్లీలో కొన్ని ప్రాంతాలకు నీటి సరఫరా పూర్తిగా ఆగిపోయింది. దీంతో నీటి కోసం ప్రజలు ట్యాంకర్ల వద్ద గొడవలు పడే పరిస్థితి తలెత్తింది. దీనిపై ఆప్, బీజేపీలు తప్పు మీదంటే మీదని ఒకరిపై ఒకరు మాటల దాడి చేసుకుంటున్నారు. -
ఢిల్లీలో ఆప్ జలదీక్ష
న్యూఢిల్లీ: నీటి ఎద్దడిని తీవ్రంగా ఎదుర్కొంటున్న ఢిల్లీ వాసుల కష్టాలు తీర్చాలంటూ ఆప్ నేత, ఢిల్లీ మంత్రి ఆతిశీ సింగ్ శుక్రవారం నిరాహార దీక్ష చేపట్టారు. యమునా నది అదనపు జలాలను హరియాణా తక్షణం ఢిల్లీకి విడుదల చేయాలంటూ డిమాండ్ చేశారు. రాజ్‌ఘాట్‌లో గాం«దీజీకి నివాళులరి్పంచి దీక్ష మొదలెట్టారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ భార్య సునీత, ఆప్ ఎంపీ సంజయ్ సింగ్, సౌరభ్ భరద్వాజ్ తదితరులు ఆమెకు మద్దతుగా దీక్షలో కూర్చున్నారు. దీక్షకు మద్దతుగా తిహార్ జైలు నుంచి కేజ్రీవాల్ పంపిన సందేశాన్ని సునీత చదివి వినిపించారు. ‘‘ఆతిశి తపస్సు విజయవంతమవుతుంది. గొంతెండుతున్న వారి దప్పిక తీర్చడం మన సంప్రదాయం. తీవ్రమైన ఎండకాలంలో పొరుగురాష్ట్రాలు నీళ్లిచ్చి ఆదుకోవాలి. హరియాణాలోని బీజేపీ ప్రభుత్వం నీటిని విడుదలచేయకుండా ఆపి ఢిల్లీ ప్రజలు ఆప్ ప్రభుత్వాన్ని తిట్టుకునేలా చేయాలని మోదీ సర్కారు కుట్ర పన్నింది’’ అని అందులో కేజ్రీవాల్ ఆరోపించారు. ‘‘నీటి సమస్యపై మోదీకి లేఖ రాశా. హరియాణా ప్రభుత్వాన్ని వేడుకున్నా. ఢిల్లీ ప్రజలు, ముఖ్యంగా చిన్నారులు, మహిళల నీటి సమస్యలు చూడలేక నీటి సత్యాగ్రహానికి సిద్ధపడ్డా’’ అని ఆతిశి ప్రకటించారు. రోజూ 613 లక్షల గ్యాలెన్ల నీటిని విడుదలచేసే హరియాణా గత రెండు వారాలుగా కేవలం 513 లక్షల గ్యాలెన్ల నీటినే రోజూ విడుదలచేస్తోంది. గత రెండు రోజులుగా మరో 120 లక్షల గ్యాలెన్ల మేర కోత పెట్టింది.విమర్శించిన బీజేపీ దీక్షను రాజకీయ నాటకంగా బీజేపీ అభివరి్ణంచింది. ‘‘ఆతిశి విఫల మంత్రి. నీటి కష్టాలు తప్పవని ఫిబ్రవరిలోనే సూచనలు కనిపించినా ముందస్తు ఏర్పాట్లు చేయలేదు. ఎగువ హిమాచల్ ప్రదేశ్ నుంచో, ఆప్ పాలిత పంజాబ్ నుంచి ఎందుకు నీళ్లు అడగటం లేదు? ఢిల్లీ నీటి ట్యాంకర్ మాఫియాతో ఆప్ నేతలకు సంబంధముంది’’ అని ఆరోపించింది.నా భర్త ఏమన్నా మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదా: సునీతా కేజ్రీవాల్తన భర్త ఇండియాలోనే మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది అన్నట్లుగా ఈడీ వ్యవహరిస్తోందని కేజ్రీవాల్ భార్య సునీతా కేజ్రీవాల్ మండిపడ్డారు. ఆయన బెయిల్‌ను హైకోర్టులో సవాలు చేపడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. ‘‘బెయిల్ ఉత్తర్వు వెబ్సైట్లో అప్లోడ్ కూడా కాకముందే తెల్లవారుజామునే ఈడీ హైకోర్టును ఆశ్రయించిందని ఆక్షేపించారు. కేజ్రీవాల్ ఏమైనా ఉగ్రవాదా?’’ అంటూ దీక్షా స్థలి వద్ద మండిపడ్డారు. -
ఢిల్లీ నీటి సమస్య పరిష్కరించకపోతే.. ప్రధానికి ఆప్ మంత్రి లేఖ
ఢిల్లీ: ఢిల్లీలో నీటి సంక్షోభం కొనసాగుతోంది. ఈ క్రమంలో ఢిల్లీలో తాగునీటి సంక్షోభ పరిస్థితులు మెరుగుపడకపోతే సత్యాగ్రహ దీక్ష చేపడతామని జలనరుల శాఖ మంత్రి అతిశీ అన్నారు. ఆమె బుధవారం మీడియాతో మాట్లాడారు. ‘‘ ప్రధాన మంత్రి నరేంద్రమోదీకి లేఖ రాశాను. ఢిల్లీ నీటి సంక్షోభం సమస్యను తర్వగా పరిష్కరించాలని కోరాను. రెండు రోజుల్లో ఈ సమస్యను పరిష్కరించకపోతే జూన్ 21 నుంచి సత్యాగ్రహ దీక్ష చేపడతామని తెలిపాను. ఢిల్లీకి రావల్సిన నీటి వాటాను హర్యానా రాష్ట్రం విడుదల చేయటం లేదు. హర్యానా వ్యవహరిస్తున్న తీరుతో ఢిల్లీ ప్రజలు నీటి కోసం తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు.#WATCH | Delhi Water Minister Atishi says, "Today I have written a letter to the Prime Minister saying that 28 lakh people in Delhi are not getting water. I have requested that he should help provide water as soon as possible...If the people of Delhi do not get their rightful… pic.twitter.com/25aoBprKeN— ANI (@ANI) June 19, 2024 .. నిన్న హర్యానా ఢిల్లీకి రావాల్సిన 613 ఎంజీడీ నీటికి కేవలం 513 ఎంజీడీ నీరు విడుదల చేసింది. ఒక్క ఎంజీడీ నీరు 28, 500 మందికి సరిపోతాయి. అంటే హర్యానా విడుదల చేసిన నీరు కేవలం 28 లక్షల మందికి మాత్రమే సరిపోతాయి. ఇక నీటీ సమస్య అనేకసార్లు హర్యానా ప్రభుత్వానికి లేఖలు కూడా రాశాను’’ అని మంత్రి అతిశీ తెలిపారు. -
ఢిల్లీ ఎయిర్‌పోర్టులో పవర్ కట్స్
సాక్షి,ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఓ పక్క తాగునీటికి తీవ్ర కొరత ఏర్పడి జలమండలి ఆఫీసులపై దాడులు జరుగుతున్నాయి. మరోపక్క అక్కడి ఎయిర్‌పోర్టుకు కరెంటు కోతలు తప్పడం లేదు. సోమవారం(జూన్17) ఎయిర్‌పోర్టు టర్మినల్ మూడులో కరెంటు కష్టాలు ఎదురయ్యాయి. కరెంటు కోతల వల్ల ప్రయాణికులు చెకింగ్,బోర్డింగ్ సమయంలో ప్రయాణికులు కష్టాలు ఎదుర్కోవాల్సి వచ్చింది. కరెంటు సమస్యను పరిష్కరించామని, కేవలం 10 నిమిషాలే కరెంటు పోయిందని ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్(డయల్) ఒక ప్రకటనలో తెలిపింది. -
ఢిల్లీ నీటి సంక్షోభం.. ‘వాటర్ పైప్లైన్ల వద్ద భద్రత పెంచండి’
ఢిల్లీ: ఢిల్లీలో నీటి సంక్షోభం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ జలవనరుల శాఖమంత్రి అతిశీ రాష్ట్ర పోలీసు కమిషనర్ సంజయ్ ఆరోరాకు లేఖ రాశారు. ఢిల్లీ వ్యాప్తంగా ఉన్న కీలకమైన వాటర్ పైప్లైన్ల వద్ద పోలీసులు భద్రత కల్పిస్తూ, పర్యవేక్షించాలని లేఖలో కోరారు.‘‘ రాష్ట్రంలోని కీలకమైన వాటర్ పైప్లైన్ల వద్ద మరో 15 రోజుల పాటు పోలీసులు భద్రత, పర్యవేక్షణ పెంచాలని ఢిల్లీ పోలీసు కమిషనర్‌ను కోరుతున్నా. ఢిల్లీకి జీవనాధారంగా మారిన వాటర్ పైప్లైన్లను కొందరు వ్యక్తులు దుర్వినియోగం చేయడాన్ని ఆపటం చాలా ముఖ్యం. ప్రస్తుతం ఢిల్లీ ప్రజలు తీవ్రమైన నీటి కొరతను ఎదుర్కొంటున్నారు’’ అని మంత్రి అతిశీ లేఖలో కోరారు.మరోవైపు.. ఆప్ ఎమ్మెల్యేలు కేంద్ర జల్ శక్తి మంత్రి సీఆర్ పాటిల్‌ను కలవడానికి ఆయన నివాసానికి వెళ్లారు. అయితే కేంద్రమంత్రి తన వివాసంలో లేకపోవటంతో ఆప్ ఎమ్మెల్యేలు వెనుదిరిగారు. ఈ సందర్భంగా ఆప్ ఎమ్మెల్యే రాఖీ బిర్లా మీడియాతో మాట్లాడారు.‘‘ మేము నిన్న (శనివారం) కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్‌కు లేఖ ఇచ్చాం. ఈ రోజు ఆయన్ను కలవడానికి వచ్చాం. అయితే ఆయన తన నివాసంలో లేరని సమాచారం అందింది. ఢిల్లీలో నెలకొన్న నీటి కొరతపై దృష్టి సారించాలని విజ్ఞప్తి చేయడానికి వచ్చాం’’అని తెలిపారు.నీటి సంక్షోభం వల్ల ద్వారకా ప్రాంతంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని పశ్చిమ ఢిల్లీ ఎంపీ కమల్జిత్ కమల్జీత్ సెహ్రావత్ ఆప్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ద్వారకా ప్రాంతంతో ప్రభుత్వం ట్యాంకర్లు అందుబాటులో లేవని అన్నారు. దీంతో ప్రైవేట్ ట్యాంకర్ల ప్రజల వద్ద అధికంగా డబ్బులు వసూలు చేస్తున్నాయని తెలిపారు. నీటి సంక్షోభంపై ఢిల్లీ ప్రభుత్వం ఇతర రాష్ట్రాలపై నిందలు వేస్తోందని మండిపడ్డారు. కానీ, అసలు సమస జలవనరులకు శాఖలో ఉందని అన్నారు. కనీసం మానవత్వంతో అయినా అతిశీ ఆమె శాఖపై జాగ్రత్త దృష్టి సారించి జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. -
ఢిల్లీలో దాహం.. దాహం
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని తీవ్ర జల సంక్షోభం నెలకొంది. పొరుగు రాష్ట్రాల నుంచి నీటి సరఫరా తగ్గడంతో ఢిల్లీలోని చాలా ప్రాంతాల్లో నీటి ఎద్దడి దారుణంగా పెరిగింది. యమునా నదీ జలాల సరఫరా విషయంలో ఢిల్లీ, హరియాణా, హిమాచల్‌ప్రదేశ్ మధ్య వివాదాలు తారాస్థాయికి చేరడంతో నీటి కష్టాలు తీవ్రమయ్యే ప్రమాదకర పరిస్థితి దాపురించింది. మండుతున్న ఎండలకు తోడు నీటి కొరతతో ప్రజలు అల్లాడుతుంటే ట్యాంకర్ మాఫియా, రాజకీయ నేతల మధ్య మాటల యుద్ధం ఈ సమస్యను మరింత జఠిలం చేస్తున్నాయి. ఆగిన సరఫరా.. తగ్గిన నిల్వలుఢిల్లీ తాగునీటి అవసరాల్లో 90 శాతం యమునా నదీ మునాక్ కాలువ ద్వారా తీరుతోంది. మరికొంత ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఎగువ గంగ కాల్వల ద్వారా వచ్చే నీటితో ఢిల్లీ నీటి కష్టాలు తీరుతున్నాయి. యమునా నదిపై ఉన్న చంద్రవాల్, వజీరాబాద్, ఓక్లా నీటి శుద్ధి కర్మాగారాలుసహా మరో నాలుగు ప్లాంట్ల ద్వారా ఢిల్లీకి అవసరమైన నీటి సరఫరా జరుగుతోంది. ఢిల్లీకి ప్రతి రోజూ 1,200 మిలియన్ గ్యాలన్ల నీరు అవసరం ఉండగా ఢిల్లీ జల్ బోర్డు 950 మిలియన్ గ్యాలన్ల నీటినే సరఫరా చేస్తోంది. హరియాణా ప్రభుత్వం మునాక్ ఉప కాల్వల ద్వారా 683 క్యూసెక్కులు, ఢిల్లీ చిన్న కాల్వల ద్వారా మరో 330 క్యూసెక్కుల నీటిని వజీరాబాద్ నీటి శుద్ధి రిజర్వాయర్‌కు సరఫరా చేయాల్సి ఉంది. మొత్తంగా రోజుకి 1,013 క్యూసెక్కుల నీటిని విడుదల చేయాల్సి ఉన్నా హరియాణా ప్రభుత్వం కేవలం 840 క్యూసెక్కుల నీటినే విడుదల చేస్తోందని ఢిల్లీ ప్రభుత్వం ఆరోపిస్తోంది. హరియాణా నీటి సరఫరాను తగ్గించడంతో ఉత్తర, పశ్చిమ ఢిల్లీకి నీటిని సరఫరా చేసే వజీరాబాద్ రిజర్వాయర్‌లో నీటి మట్టాలు తగ్గుతున్నాయి. రిజర్వాయర్‌లో సగటు నీటి మట్టం 674.5 అడుగులు కాగా ప్రస్తుతం 669 అడుగులకు పడిపోయింది. దీంతో రిజర్వాయర్ నుంచి రోజుకు 70 మిలియన్ గ్యాలన్ల నీరు మాత్రమే విడుదల అవుతోందని ఢిల్లీ జల వనరుల మంత్రి అతిశి ఆరోపించారు. దీంతో చాలా ప్రాంతాల్లో నీటి సరఫరా తగ్గి ట్యాంకర్లపై జనం ఆధారపడుతున్నారు. ఇదే అదునుగా ట్యాంకర్ మాఫియా రెచ్చిపోయింది. ఇష్టారీతిగా డబ్బులు వసూలు చేస్తోంది. నీటి ఎద్దడి అంశంలో ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా హరియాణా ముఖ్యమంత్రి నయాబ్‌సింగ్ షైనీతో మాట్లాడి, నీటి సరఫరా పెంచే విషయమై చర్చలు జరుపుతున్నారు. మునాక్ కాలువ, ఇతర కాల్వల నుంచి ట్యాంకర్ మాఫియా నీటి దోపిడీపై ప్రత్యేక దర్యాప్తు బృందంచే విచారణ చేపట్టాలని బుధవారం బీజేపీ రాష్ట్ర శాఖ డీజీపీకి విజ్ఞప్తి చేసింది. నీటి ఎద్దడికి రాజధానిలా మారుతున్న ఢిల్లీలో చాలా కాలనీల్లో ఎటు చూసినా మహిళలు, చిన్నారులు బిందెలు, బకెట్లు పట్టుకుని పెద్దపెద్ద క్యూ లైన్లలో నిల్చున్న దృశ్యాలే కనిపిస్తున్నాయి. మాట మార్చిన హిమాచల్ప్రదేశ్ఇన్నాళ్లూ నీటిని సరఫరా చేసిన హిమాచల్ ప్రదేశ్ మాట మార్చింది. తమ వద్ద 135 క్యుసెక్కుల మిగులు జలాలు లేవని, కావాలంటే యమునా బోర్డును ఆశ్రయించాలని ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. హిమాచల్ నుంచి హరియాణాకు వచ్చిన మిగులు జలాలను ఢిల్లీ కోసం విడుదల చేయాలంటూ కేజ్రీవాల్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలుచేసిన నేపథ్యంలో ప్రతిగా హిమాచల్ సర్కార్ కోర్టులో అఫిడవిట్ సమర్పించింది. ఈ కేసును గురువారం జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ ప్రసన్న బి.వరాలేల సుప్రీంకోర్టు ధర్మాసనం విచారించింది. ‘‘ నీటి నిర్వహణలో ఢిల్లీ ప్రభుత్వం విఫలమైంది. కాల్వల ద్వారా నీటి పంపిణీ నష్టాలను తగ్గించడంలో, నీటి చౌర్యాన్ని నియంత్రించడం, తలసరి నీటి వినియోగాన్ని నియంత్రించడంలో ఢిల్లీ వైఫల్యం చెందింది. అభివృధ్ధి చెందుతున్న దేశాల్లో పంపిణీ నష్టాలు 10శాతం ఉంటే ఢిల్లీలో ఏకంగా 52.35 శాతం నష్టాలు ఉన్నాయి. కేంద్ర పట్టణాభివృధ్ధి శాఖ నిర్దేశకాల ప్రకారం పట్టణ నీటి తలసరి సరఫరా 135 లీటర్లుగా ఉంటే ఢిల్లీలో అతిగా 172 లీటర్లు సరఫరాచేస్తున్నారు. హిమాచల్ వద్ద వాస్తవానికి మిగులు జలాలు లేవు. ఉన్నాయంటూ గతంలో ఇచ్చిన ప్రకటనను ఉపసంహరించుకునేందుకు అనుమతి ఇవ్వండి’ అని హిమాచల్ అడ్వకేట్ జనరల్ కోర్టుకు విన్నవించుకున్నారు. దీనిపై కోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. ‘‘ ఇదెంత తీవ్రమైన అంశమో మీకు తెలియట్లేదు. మీపై కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకోవాలో వద్దో తర్వాత తేలుస్తాం’ అని ఆగ్రహం వ్యక్తంచేసింది. దీంతో గత ప్రకటన ఉపసంహరణకు పద్దతి ప్రకారం అఫిడవిట్ సమర్పిస్తానని అడ్వకేట్ జనరల్ చెప్పారు.మాకంత నైపుణ్యం లేదుహిమాచల్ వాదనలు విన్నాక మానవతా దృక్పథంతో నీటిని సరఫరా చేయాలని సాయంత్రంకల్లా ఎగువ యమునా జలబోర్డ్ వద్ద దరఖాస్తు పెట్టుకోవాలని ఢిల్లీ సర్కార్‌ను సుప్రీంకోర్టు ఆదేశించింది. ‘‘ యమునా నదీ జలాల పంపకం అనేది సంక్లిష్టమైన వ్యవహారం. ఇప్పటికిప్పుడు మధ్యేమార్గంగా నదీజలాల పంపకం సమస్యను తీర్చేంత స్థాయిలో మాకు సాంకేతిక నైపుణ్యం లేదు. 1994 అవగాహనా ఒప్పందం ద్వారా రాష్ట్రాలు ఏర్పాటు చేసుకున్న యమునా బోర్డే ఈ సమస్యకు పరిష్కారం చూపగలదు. అదనంగా 150 క్యూసెక్కుల కోసం ఢిల్లీ గతంలోనే దరఖాస్తు చేసుకుంది. దానిపై జలబోర్డ్ త్వరగా నిర్ణయం వెలువర్చాలి. లేదంటే శుక్రవారం నుంచి రోజువారీగా బోర్డ్ సమావేశమై సమస్యను పరిష్కరించాలి’’ అని కోర్టు వ్యాఖ్యానించింది.ఢిల్లీ ప్రభుత్వ వాదనేంటి?నీటి ట్యాంకర్ల మాఫియాపై ఢిల్లీ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు బుధవారం తలంటిన నేపథ్యంలో గురువారం కేజ్రీవాల్ సర్కార్ అఫిడవిట్ సమర్పించింది. ‘‘ ట్యాంకర్ల మాఫియా హరియాణా వైపు ఉన్న యమునా నది వెంట రెచ్చిపోతోంది. ఆ ప్రాంతం ఢిల్లీ జలబోర్డ్ పరిధిలోకి రాదు. అసలు అక్కడ చర్యలు తీసుకునే అధికారం ఎవరికి ఉందో తేల్చాలని ఢిల్లీ లెఫ్ట్‌నెంట్ గవర్నర్‌కు ఎన్నోసార్లు మొరపెట్టుకున్నాం. స్పందన శూన్యం. హరియాణా నుంచి ఢిల్లీకి నీటి సరఫరా వృథాను 30 శాతం ఉంచి ఐదు శాతానికి తగ్గించాం’’ అని అఫిడవిట్లో పేర్కొంది. గురువారం ఢిల్లీ ప్రభుత్వం తరఫున అభిషేక్ సింఘ్వీ కోర్టులో వాదించారు. ‘‘ జలబోర్డులు ప్రభుత్వ అనుకూల అధికారులతో నిండిపోయాయి. ఇలాంటి పరిస్థితుల్లో కమిటీ వేసి సుప్రీంకోర్టే సమస్యను పరిష్కరించాలి’ అని అన్నారు. ఈ వాదనతో హరియాణా విభేధించింది. ‘‘ ఢిల్లీకి నీటిని సరఫరా చేసే వజీరాబాద్ బ్యారేజీలో కనీస నీట నిల్వలు ఉండాల్సిందే. అతి సరఫరా కుదరదు. ఈ అంశాన్ని యమునా బోర్డ్‌కు వదిలేస్తే మంచిది’ అని హరియాణా తరఫున లాయర్ శ్యామ్ దివాన్ వాదించారు. ఈ అంశాన్ని ఇకపై జలబోర్డే చూసుకుంటుందని అదననపు సొలిసిటర్ జనరల్ విక్రమ్‌జీత్ బెనర్జీ చెప్పారు. దీంతో జలబోర్డులో తేల్చుకోండంటూ ఢిల్లీ సర్కార్ వేసిన పిటిషన్‌ను కోర్టు కొట్టేసింది. మరోవైపు రోజుకు 5 కోట్ల గ్యాలెన్ల నీటి సరఫరా తగ్గడంతో నీటిని వృథా చేయకండని ఢిల్లీవాసులకు ప్రభుత్వం సూచనలు చేసింది. -
ఢిల్లీ నీటి సంక్షోభం: నీటిని విడుదల చేయాలని హిమాచల్‌కు సుప్రీం ఆదేశం
ఢిల్లీ: గత కొన్ని రోజులుగా ఢిల్లీలో నీటి సంక్షోభం తీవ్రంగా కొనసాగుతోంది. ఈ క్రమంలో ఢిల్లీకి సాయంగా మిగులు నీటిని విడుదల చేయాలని తాజాగా సుప్రీంకోర్టు హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి ఆదేశాలు జారీ చేసింది. రేపు(శుక్రవారం) 137 క్యూసెక్కుల నీటిని ఢిల్లీకి విడుదల చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. నీటి విడుదలకు హిమాచల్ ప్రదేశ్ అంగీకారం తెలిపిందని కోర్టు తెలిపింది. అదేవింధంగా వాజీరాబాద్ బ్యారేజ్ ద్వారా నీటి విడుదలకు ఎలాంటి అడ్డంకులు లేకుండా చూడాలని హర్యానాను సుప్రీం కోర్టు ఆదేశించింది. నీటి విడుదల చేసే సమయంలో హర్యానాకు ముందుస్తు సమాచారం అందించాలని హిమాచల్ ప్రదేశ్‌కు కోర్టు సూచించింది.సంక్షోభ సమయంలో నీటిని ఎట్టిపరిస్థితుల్లో వృథా చేయవద్దని ఢిల్లీ ప్రభుత్వాన్ని ప్రభుత్వాన్ని హెచ్చరించింది. ఢిల్లీలో తీవ్రమైన నీటి సంక్షోభం నెలకొనడంతో తమ రాష్ట్రానికి సరిహద్దు రాష్ట్రాలు ఉత్తర ప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, హర్యానా నుంచి నీటిని అందించాలని ఆప్ ప్రభుత్వం గతవారం సుప్రీకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.దేశ రాజధాని ఢిల్లీ వాతావరణ మార్పులు, అధిక ఉష్ణోగ్రత కారణంగా నీటి సంక్షోభం ఏర్పడింది. ఇలాంటి సమయంలో నీటిని వృథా చేస్తే రూ. 2 వేలు జరిమానా వేస్తామని ఆప్ ప్రభుత్వం ఇప్పటికే ప్రకటక చేసిన విషయం తెలిసిందే. -
Delhi water crisis: చేతులు జోడించి కోరుతున్నా.. సీఎం కేజ్రీవాల్
ఢిల్లీ: ఢిల్లీలో నెలకొన్న నీటి సంక్షోభంపై ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆందోళన వ్యక్తం చేశారు. దేశ రాజధానిలో నెలకొన్న తీవ్రమై నీటి సంక్షోభాన్ని కూడా బీజేపీ రాజకీయం చేస్తోందని మండిపడ్డారు. ఢిల్లీ నీటి సమస్యపై శుక్రవారం కేజ్రీవాల్ ‘ఎక్స్’ వేదికగా స్పందించారు. ‘‘దేశవ్యాప్తంగా ఎండలు విపరీంతంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే కరెంట్, తాగు నీటి సమస్యలు ఏర్పడుతున్నాయి. ఢిల్లీలో కరెంట్ వినియోగం 7,438 మెగావాట్లు ఉండగా.. ఈసారి గరిష్టంగా 8,302 మెగావాట్లకు పెరిగింది. ఢిల్లీలో ప్రస్తుతం పవర్ కట్ సమస్యలు లేవు. మిగిలిన రాష్ట్రాలతో పోల్చితే కరెంట్ విషయంలో ఢిల్లీ మెరుగ్గా ఉంది. మరోవైపు.. అధిక ఎండల కారణంగా నీటి వినియోగం పెరిగింది. సరిహద్దు రాష్ట్రాల నుంచి ఢిల్లీకి నీటి సరాఫరా తగ్గిపోయింది. అక్కడ కూడా నీటి డిమాండ్ చాలా పెరిగిపోయింది.इस बार पूरे देश में अभूतपूर्व गर्मी पड़ रही है जिसकी वजह से देश भर में पानी और बिजली का संकट हो गया है। पिछले वर्ष, दिल्ली में बिजली की पीक डिमांड 7438 MW थी। इसके मुक़ाबले इस साल पीक डिमांड 8302 MW तक पहुँच गयी है। पर इसके बावजूद दिल्ली में बिजली की स्थिति नियंत्रण में है, अन्य…— Arvind Kejriwal (@ArvindKejriwal) May 31, 2024 అందరం కలిసి నీటి సమస్యను పరిష్కరించాలని మేము ముందుకు వస్తే.. బీజేపీ మాత్రం మా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలుపుతోంది. ఇలా అయితే నీటి సమస్యకు పరిష్కారం లభించదు. రాజకీయాలు పక్కన పెట్టి అందరం ముందుకు వచ్చి నీటి సమస్య నుంచి ఢిల్లీ ప్రజలకు ఉపశమనం కలిగించాలని చేతులు జోడించి కోరుతున్నారు. రాజకీయాలను పక్కనపెట్టి ఒక నెల పాటు బీజేపీ పాలిత రాష్ట్రాలు హర్యానా, ఉత్తర పదేశ్ రాష్ట్రాల నుంచి నీటి సరాఫరా చేయిస్తే.. ఢిల్లీ ప్రజలు బీజేపీ చొరవను మెచ్చుకుంటారు. మనమంతా కలిసి పని చేస్తే ఢిల్లీ వాసులకు నీటి సమస్య తగ్గుతుంది’’ అని కేజ్రీవాల్ అన్నారు.నీటీ సంక్షోభం నేపథ్యంలో అప్రమత్తమైన ఢిల్లీ ప్రభుత్వం.. నీటి వాడకంపై అత్వవసర మార్గదర్శకాలు విడుదల చేసింది. తాగు నీటితో కారు వాషింగ్ చేయోద్దని, నిర్మాణ రంగ సైట్లలో కూడా తాగు నీటిని వాడవద్దని ఆదేశాలు జారీ చేసింది. -
నీటి సంక్షోభం.. సుప్రీంకోర్టుకు ఢిల్లీ సర్కారు
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో నీటి సంక్షోభంపై ఢిల్లీ సర్కారు సుప్రీం కోర్టు తలుపు తట్టింది. ఈ మేరకు శుక్రవారం(మే31) అత్యున్నత కోర్టులో ఢిల్లీ సర్కారు పిటిషన్ ఫైల్ చేసింది. హార్యానా, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాలు ఢిల్లీకి అదనపు నీళ్లు కేటాయించేలా ఆదేశాలివ్వాలని పిటిషన్లో ప్రభుత్వం కోర్టును కోరింది. ప్రస్తుతం ఢిల్లీలో ఎండలు దంచి కొడుతున్నందున దేశ రాజధానికి నీళ్లివ్వడం అందరి బాధ్యత అని పిటిషన్లో తెలిపింది. కాగా, ఢిల్లీలో నీటి సంక్షోభంపై ప్రభుత్వం ఇప్పటికే వాటర్ ట్యాంకర్ వార్‌రూమ్ ఏర్పాటు చేసి యుద్ధ పప్రాతిపదికన చర్యలు తీసుకుంటోంది.ఢిల్లీలో నివసించే ప్రతి ఒక్కరికి నీరు అందుబాటులో ఉండేలా చూస్తోంది. మరోపక్క తాగే నీటిని వృథా చేసి ఇతర అవసరాలకు వాడే వారిపై రూ.2వేల జరిమానా విధిస్తామని ఇప్పటికే ప్రకటించింది. నీటి కొరతపై గురువారం ఢిల్లీ జల వనరుల మంత్రి ఆతిషి ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. -
సిద్దరామయ్య ప్రభుత్వంపై మండిపడ్డ నిర్మలా సీతారామన్
బెంగళూరు: గత కొన్ని రోజులుగా బెంగళూరులో నీటి సమస్య ఉన్నట్లు పెద్ద ఎత్తున వార్తలు వస్తూనే ఉన్నాయి. దీనిపైన కేంద్ర ఆర్థిక మంత్రి 'నిర్మలా సీతారామన్' స్పందించారు. సిద్ధరామయ్య ప్రభుత్వంపై మండిపడ్డారు. గత ఏడాది కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే అనేక నీటిపారుదల, నీటి సంబంధిత ప్రాజెక్టుల కార్యక్రమాలను నిలిపివేసినట్లు ఆరోపించారు. బెంగళూరు నగరం నీటి సమస్యలతో ఇబ్బందిపడటం చాలా బాధాకరం అని నిర్మలా సీతారామన్ అన్నారు. మే 2023లో విశ్వేశ్వరయ్య జల నిగమ్ లిమిటెడ్, కర్ణాటక నీరవారి నిగమ్ లిమిటెడ్, కావేరి నీరవారి నిగమ లిమిటెడ్, కృష్ణా భాగ్య జల నిగమ్ లిమిటెడ్ వంటి ప్రాజెక్టుల కోసం రూ.20,000 కోట్ల విలువైన టెండర్లను ముఖ్యమంత్రి నిలిపివేశారని ఆమె ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ‘జల్ జీవన్ మిషన్’ను రాష్ట్రంలో ఎందుకు ప్రోత్సహించడం లేదని ఆమె ప్రశ్నించారు. కర్ణాటకలో శాంతి భద్రతలు తగ్గిపోయాయి. బెంగుళూరులోని రామేశ్వరం కేఫ్‌లో జరిగిన పేలుడు, అసెంబ్లీలో పాకిస్తాన్ అనుకూల నినాదాలు చేయడం వంటి ఘటనలే దీనికి ఉదాహరణ. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒక బాధ్యతాయుతమైన మంత్రి హిందూ టెర్రర్ అనే పదాన్ని సృష్టించాడని సీతారామన్ పేర్కొన్నారు. దావణగరే లోక్‌సభ స్థానంలో పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి గాయత్రి సిద్ధేశ్వరపై కాంగ్రెస్ ఎమ్మెల్యే షామనూరు శివశంకరప్ప చేసిన వ్యాఖ్యలను సీతారామన్ తప్పుబట్టారు. ఇలాంటి మాటలు పూర్తిగా ఆమోదయోగ్యం కాదని అన్నారు. కరువు సహాయ నిధుల జాప్యంపై అడిగిన ప్రశ్నకు ఆమె స్పందిస్తూ.. కర్ణాటక ప్రభుత్వం అక్టోబర్‌లో మెమోరాండం సమర్పించిందని, ఆ తరువాత కేంద్ర బృందం ఇక్కడికి వచ్చి స్పాట్ అసెస్మెంట్ నిర్వహించిందని వివరించారు. కరువు సహాయం విడుదల చేయడానికి కొన్ని విధానాలను అనుసరించాల్సి ఉందని, దీనికి సమయం పట్టిందని అన్నారు. -
9 అడుగుల్లో బోరు.. కరెంటు లేకున్నా 20 ఏళ్లుగా నీరు
సాక్షి, ఆదిలాబాద్: మండుతున్న ఎండలతో రాష్ట్రంలో నీటి సంక్షోభం తీవ్రమవుతోంది. చెరువులు ఎండిపోతున్నాయి. పంటలకు నీరందక చేలలో బీటలు కనిపిస్తున్నాయి. మరో వైపు తాగునీటి సమస్య కూడా జఠిలమవుతోంది. భూగర్భ జలాలు అంతకంతకూ అడుగంటిపోతున్నాయి. అయితే ఇలాంటి పరిస్థితుల్లోనూ ఆదిలాబాద్ జిల్లా బేల మండలం దుబ్బగూడ (ఎస్)లోని ఓ గిరిజన రైతు పంట చేనులో మాత్రం బోరు నుంచి జలం ఉబికి వస్తూనే ఉంది. విచిత్రం ఏమిటంటే అసలు ఈ బోరుకు కరెంటు కనెక్షనే లేదు. దాదాపు 20 ఏళ్లుగా సహజంగా నీళ్లు ఇలా వస్తూనే ఉన్నాయి. 2005 నుంచి కొనసాగుతున్న ధార.. గిరిజన రైతు టేకం తుకారాంకు 26 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. ఆయన ముగ్గురు కుమారులతో కలిసి దీన్ని సాగుచేస్తున్నాడు. 2005లో తుకారాం చేనులో బోరు వేయించాడు. అప్పుడు 9 అడుగులకే నీళ్లు ఉబికి వచ్చాయి. కరెంటు కనెక్షన్ ఇవ్వాల్సిన అవసరం లేకుండానే ఆ జలధార ఇప్పటికీ కొనసాగుతోంది. ప్రస్తుతం 13 ఎకరాల్లో జొన్న, గోధుమ పంటలు పండిస్తున్నాడు. వీటికి నిరంతరాయంగా బోరు నుంచి వచ్చే నీరే అందిస్తున్నాడు. ఆర్టీసియన్ బావి కారణంగానే.. దీన్ని భూగర్భ జలశాస్త్రం ప్రకారం ఆర్టిసియన్ బావి అంటారు. దుబ్బగూడ (ఎస్)కు సమీపంలో గుట్ట ఉంది. వర్షం కురిసినప్పుడు ఆ గుట్ట ప్రాంతంలో జలం రీచార్జ్ అవుతుంది. అక్కడి నుంచి నిలువుగా ఉన్నటువంటి పొర దిగువన గుట్ట దిగిన తర్వాత తుకారాం చేనులో నుంచి వెళ్తుంది. పైపొర గుట్ట పైభాగం నుంచి మొదలు కాగా చివరి పొర తుకారాం చేనును దాటి వెళ్తోంది. దుబ్బగూడలో ఒక లేయర్లో భూగర్భ జలాలు పైవరకు ఉంటాయి. మధ్య ప్రాంతంలో ఎవరైనా బోరు వేసినప్పుడు ఈ పొరను తాకడంతో నీళ్లు ఉబికి వస్తున్నాయి. ఒక ట్యూబ్‌కు మధ్యలో ఎక్కడైనా పంచర్ పడ్డప్పుడు గాలి, నీరు ప్రెషర్‌తో బయటకు వచ్చినట్లే ఇక్కడ కూడా పైపొర, చివరి పొర మధ్యన బోరువేసినప్పుడు నీటికి బయటకు వెళ్లే మార్గం ఏర్పడింది. గుట్టకు సమీపంలో ఉండే ప్రాంతాల్లో కొన్ని చోట్ల ఇలాంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆదిలాబాద్ రూరల్ మండలం బోరింగ్‌గూడలో కూడా ఇలాగే నీళ్లు ఉబికి వస్తాయి. –టి. పుల్లారావు,అసిస్టెంట్ హైడ్రో జియాలజిస్ట్, ఆదిలాబాద్ -
ప్రకృతి కరువు కాదు.. కాంగ్రెస్ సృష్టించిన కొరత: కేటీఆర్ ఫైర్
సాక్షి, హైదరాబాద్: సీఎం రేవంత్ ఢిల్లీకి నిధులు పంపించడంలో బిజీగా ఉన్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఎద్దేవా చేశారు. జల వనరులను తరలించడంపై సీఎం రేవంత్‌కు అసలు శ్రద్ధ లేదని అన్నారు. వేసవి ఆరంభంలోనే తాగునీటి కోసం తన్నులాటలు షురూ అయ్యాయని చెప్పుకొచ్చారు. కాగా, కేటీఆర్ బుధవారం తెలంగాణభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ..‘అసమర్థ ముఖ్యమంత్రికి డబ్బు తరలించడంలో ఉన్న శ్రద్ధ.. జల వనరులను తరలించడంపై లేదు. సాగునీరు, తాగు నీరు లేక పల్లె ప్రజలు, రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మూడు, నాలుగు రెట్లు ఎక్కువ ధర చెల్లించి ట్యాంకర్లు బుక్ చేసుకోవాల్సిన దుస్థితి నెలకొంది. వేసవి ఆరంభంలోనే తాగునీటి కోసం తన్నులాటలు షురూ అయ్యాయి. ఇది ప్రకృతి కరువు కాదు.. వైఫల్యాల కాంగ్రెస్ సృష్టించిన కొరత ఇది. పార్టీ గేట్లు ఎత్తడం కాదు.. చేతనైతే ముఖ్యమంత్రి ప్రాజెక్ట్‌ల గేట్లు ఎత్తాలి. హైదరాబాద్ చుట్టూ ప్రాజెక్ట్‌ల్లో నీళ్లు ఉన్నా.. నగరంలో నీటి ఎద్దడికి కారుకులు ఎవరు?. మహిళలు ఖాళీ బిందెలతో యుద్ధాలు చేస్తున్నారు. మంచి నీళ్లు మహాప్రభో అంటూ ప్రజలు అల్లాడుతున్నారు. రేవంత్ మాత్రం గొంగు చించుకుని తిడుతున్నారు. 2023లో నవంబర్లోనే మేము స్పష్టంగా చెప్పాము. కేసీఆర్ అంటే నీళ్లు.. కాంగ్రెస్ వస్తే కన్నీళ్లు అని. కాళేశ్వరంను విఫల ప్రాజెక్ట్‌గా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్రంలో 218 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ వివరాలు అన్ని రేవంత్ రెడ్డికి పంపిస్తాం.కాంగ్రెస్‌కు హైదరాబాదీలు ఓటు వేయదు. అది అందరికీ తెలుసు.. అందుకే హైదరాబాద్ ప్రజలపై కక్ష కట్టావా రేవంత్?. నీళ్ల ట్యాంకర్ పంపుతున్న మమ్మల్ని మెచ్చుకోరా అంటున్నాడు. ఒక ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన మాటలా ఇవి. సిగ్గు లేకుండా సీఎం మాట్లాడుతున్నాడు. బుక్ చేసిన వారానికి నీళ్ల ట్యాంకర్లు వస్తున్నాయి. నీకు నిజాయితీ ఉంటే ఫ్రీగా నీళ్ల ట్యాంకర్లు ఇవ్వండి’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు స్పష్టంగా ఉంది. ఒక పార్టీ గుర్తు మీద పోటీ చేసి గెలిచి, మళ్ళీ వేరే పార్టీలో పోటీ చేయటం రాజ్యాంగ విరుద్ధం. కచ్చితంగా కడియం శ్రీహరి, దానం నాగేందర్‌పై కోర్టుకు వెళ్తాం. ఘన్పూర్, ఖైరతాబాద్ లో ఉప ఎన్నిక ఖాయం. మందకృష్ణ మాదిగ ఇదే విషయం మాట్లాడారు. ఆయనకు నా అభినందనలు. అలాగే, ఫోన్ ట్యాపింగ్‌కు నాకు ఎలాంటి సంబంధం లేదు. ఎవరినో హీరోయిన్లను బెదిరించాను అనే ఓ మంత్రి మాట్లాడుతున్నారు. ట్యాపింగ్ వ్యవహారానికి నాకు ఎలాంటి సంబంధం లేదని మళ్లీ చెబుతున్నాను. లేదు ఇలాగే ఆరోపణలు చేస్తే ఎవరిని వదిలిపెట్టము.. తాట తీస్తాం. నేను ఎవరికీ భయపడను అని వార్నింగ్ ఇచ్చారు. -
ప్రకృతి కరువు కాదు.. కాంగ్రెస్ సృష్టించిన కొరత: కేటీఆర్ ఫైర్
సాక్షి, హైదరాబాద్: సీఎం రేవంత్ ఢిల్లీకి నిధులు పంపించడంలో బిజీగా ఉన్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఎద్దేవా చేశారు. జల వనరులను తరలించడంపై సీఎం రేవంత్‌కు అసలు శ్రద్ధ లేదని అన్నారు. వేసవి ఆరంభంలోనే తాగునీటి కోసం తన్నులాటలు షురూ అయ్యాయని చెప్పుకొచ్చారు. కాగా, కేటీఆర్ బుధవారం తెలంగాణభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ..‘అసమర్థ ముఖ్యమంత్రికి డబ్బు తరలించడంలో ఉన్న శ్రద్ధ.. జల వనరులను తరలించడంపై లేదు. సాగునీరు, తాగు నీరు లేక పల్లె ప్రజలు, రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మూడు, నాలుగు రెట్లు ఎక్కువ ధర చెల్లించి ట్యాంకర్లు బుక్ చేసుకోవాల్సిన దుస్థితి నెలకొంది. వేసవి ఆరంభంలోనే తాగునీటి కోసం తన్నులాటలు షురూ అయ్యాయి. ఇది ప్రకృతి కరువు కాదు.. వైఫల్యాల కాంగ్రెస్ సృష్టించిన కొరత ఇది. పార్టీ గేట్లు ఎత్తడం కాదు.. చేతనైతే ముఖ్యమంత్రి ప్రాజెక్ట్‌ల గేట్లు ఎత్తాలి. హైదరాబాద్ చుట్టూ ప్రాజెక్ట్‌ల్లో నీళ్లు ఉన్నా.. నగరంలో నీటి ఎద్దడికి కారుకులు ఎవరు?. మహిళలు ఖాళీ బిందెలతో యుద్ధాలు చేస్తున్నారు. మంచి నీళ్లు మహాప్రభో అంటూ ప్రజలు అల్లాడుతున్నారు. రేవంత్ మాత్రం గొంగు చించుకుని తిడుతున్నారు. 2023లో నవంబర్లోనే మేము స్పష్టంగా చెప్పాము. కేసీఆర్ అంటే నీళ్లు.. కాంగ్రెస్ వస్తే కన్నీళ్లు అని. కాళేశ్వరంను విఫల ప్రాజెక్ట్‌గా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్రంలో 218 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ వివరాలు అన్ని రేవంత్ రెడ్డికి పంపిస్తాం. కాంగ్రెస్‌కు హైదరాబాదీలు ఓటు వేయదు. అది అందరికీ తెలుసు.. అందుకే హైదరాబాద్ ప్రజలపై కక్ష కట్టావా రేవంత్?. నీళ్ల ట్యాంకర్ పంపుతున్న మమ్మల్ని మెచ్చుకోరా అంటున్నాడు. ఒక ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన మాటలా ఇవి. సిగ్గు లేకుండా సీఎం మాట్లాడుతున్నాడు. బుక్ చేసిన వారానికి నీళ్ల ట్యాంకర్లు వస్తున్నాయి. నీకు నిజాయితీ ఉంటే ఫ్రీగా నీళ్ల ట్యాంకర్లు ఇవ్వండి’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు స్పష్టంగా ఉంది. ఒక పార్టీ గుర్తు మీద పోటీ చేసి గెలిచి, మళ్ళీ వేరే పార్టీలో పోటీ చేయటం రాజ్యాంగ విరుద్ధం. కచ్చితంగా కడియం శ్రీహరి, దానం నాగేందర్‌పై కోర్టుకు వెళ్తాం. ఘన్పూర్, ఖైరతాబాద్ లో ఉప ఎన్నిక ఖాయం. మందకృష్ణ మాదిగ ఇదే విషయం మాట్లాడారు. ఆయనకు నా అభినందనలు. అలాగే, ఫోన్ ట్యాపింగ్‌కు నాకు ఎలాంటి సంబంధం లేదు. ఎవరినో హీరోయిన్లను బెదిరించాను అనే ఓ మంత్రి మాట్లాడుతున్నారు. ట్యాపింగ్ వ్యవహారానికి నాకు ఎలాంటి సంబంధం లేదని మళ్లీ చెబుతున్నాను. లేదు ఇలాగే ఆరోపణలు చేస్తే ఎవరిని వదిలిపెట్టము.. తాట తీస్తాం. నేను ఎవరికీ భయపడను అని వార్నింగ్ ఇచ్చారు. -
సందట్లో సడేమియా.. ఐటీ కంపెనీలకు వల వేస్తున్న కేరళ!
బెంగళూరులో నీటి కొరత.. పొరుగు రాష్ట్రాలకు పెట్టుబడుల కోసం ఐటీ కంపెనీలను తమ రాష్ట్రాలకు రప్పించే అవకాశంగా మారింది. ‘ఎకనామిక్ టైమ్స్’ ఒనివేదిక ప్రకారం.. కేరళకు మారాలని బెంగళూరులోని కొన్ని ఎంఎన్సీ కంపెనీలకు తాను లేఖ రాసినట్లు కేరళ పరిశ్రమలు, న్యాయ శాఖ మంత్రి పి.రాజీవీ తెలిపారు. తమ రాష్ట్రంలో కర్ణాటక కంటే మెరుగైన నీటి వనరులు ఉన్నాయని, గణనీయమైన పెట్టుబడులకు కేరళ అనువైన ప్రదేశం అని మంత్రి రాజీవీ పేర్కొన్నారు. ‘బెంగళూరులో తీవ్రమైన నీటి సంక్షోభం ఉందని తెలుసుకున్నాం. కాబట్టి మేము కొన్ని ఐటీ కంపెనీలను సంప్రదించి కేరళకు తరలించమని కోరాము. మా రాష్ట్రం మంచి ప్రణాళికాబద్ధమైన నీటి సదుపాయాలు కలిగి ఉంది. సహజ వనరులతో నిండి ఉంది. మేము వారికి అవసరమైన అన్ని సౌకర్యాలను అందిస్తాం’ అన్నారు. ఇదీ చదవండి: కంపెనీ మారే ఆలోచనలో ఉద్యోగి.. స్వయంగా రంగంలోకి గూగుల్ కోఫౌండర్ కేరళను దేశంలోని కొత్త సిలికాన్ వ్యాలీగా మార్చాలనే తన ఆశయాన్ని మంత్రి రాజీవీ వెల్లడించారు. ‘‘ప్రస్తుతం కేరళలో పెట్టుబడులపై కొన్ని కంపెనీలతో చర్చలు జరుగుతున్నాయి. మా రాష్ట్రం కొత్త సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియాగా మారే అవకాశం ఉంది. ఆ దిశగా కంపెనీలకు అన్ని సౌకర్యాలు కల్పించేందుకు సిద్ధంగా ఉన్నాం. బెంగళూరు కొన్ని సవాళ్లను ఎదుర్కొంటున్నందున, కంపెనీలకు తదుపరి అతిపెద్ద ఐటీ గమ్యస్థానంగా కేరళ తనను తాను ప్రదర్శించుకోవాలనుకుంటోంది’ అన్నారు. 66వ నెంబర్ జాతీయ రహదారి వెంబడి నాలుగు కొత్త ఐటీ కారిడార్లను నిర్మించాలని కేరళ ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం. -
Bengaluru Water Crisis: నీటి వృథాపై వాటర్ బోర్డు కఠిన నిర్ణయం
బెంగళూరు: తీవ్ర నీటి సంక్షోభం ఎదుర్కొంటున్నబెంగళూరు నగరంలో నీటిని వృథా చేసిన 22 కుటుంబాలపై వాటర్‌బోర్డు కన్నెర్ర చేసింది. ఒక్కో కుటుంబానికి రూ.5 వేల చొప్పున జరిమానా విధించింది. వారి వద్ద నుంచి మొత్తం రూ.1.1లక్షలు వసూలు చేసింది. తాగునీటిని కార్లు కడిగేందుకు, మొక్కలకు, ఇతర అత్యవసరం కాని వాటికి వాడతున్నారని సోషల్ మీడియాలో వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా ఆయా కుటుంబాలపై వాటర్‌బోర్డు చర్య తీసుకుంది. కావేరి నీరు, బోర్ నీళ్లతో హోలీ వేడుకలు జరపడాన్ని వాటర్‌బోర్డు ఇప్పటికే నిషేధించింది. నగరంలోని పలు హోటళ్లు హోలీ వేళ రెయిన్ డ్యాన్స్ ఈవెంట్లు ప్రకటించంతోనే వాటర్ బోర్డు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో రెయిన్ డ్యాన్సులు ఉంటాయని ప్రకటించిన హోటళ్లు తమ నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నాయి. కాగా, షాపులు, అపార్ట్మెంట్లు, హోటళ్లు, పరిశ్రమల్లో నీటి వాడకాన్ని నియంత్రించేందుకుగాను ఎయిరేటర్స్‌ను వాడాలన్న నిబంధనను నగరంలో ఇప్పటికే అమలు చేస్తున్నారు. ప్రస్తుత నీటి సంక్షోభాన్ని అధిగమించేందుకు ట్రీటెడ్ వాటర్‌తో చెరువులను నింపి తాగునీటిగా కాకుండా ఇతర అవసరాలకు వాటిని వాడేందుకు వాటర్ బోర్డు ఇప్పటికే ప్రయత్నాలు ప్రారంభించింది. ఇదీ చదవండి.. బీజేపీలో కేఆర్పీపీ విలీనం.. గాలి జనార్ధన్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు -
ఐటీకి నీటి ట్రాన్స్ఫర్
వరంగల్‌కు చెందిన నిఖిలేశ్ కొన్నేళ్లుగా బెంగళూరులోని ఓ బహుళజాతి ఐటీ కంపెనీలో పనిచేస్తున్నాడు. ఇటీవలే పెళ్లి కావడంతో భార్యతో సహా కేఆర్ పురంలో నెలకు రూ.20 వేల అద్దెతో ఓ గేటెడ్ కమ్యూనిటీలో కాపురం పెట్టాడు. అయితే ఈమధ్య కాలంలో బెంగళూరు ప్రధాన నగరంలో నీటి ఎద్దడి తీవ్రం కావడంతో యాజమాన్యం ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం ఇచ్చింది. కానీ, అపార్ట్మెంట్లో నీటి వినియోగం, సరఫరాలో రెసిడెన్షియల్ సొసైటీ ఆంక్షలు విధించింది.దీంతో అటు ఆఫీసుకు వెళ్లలేక, ఇటు ఇంట్లో ఉండలేక ఈ విషయాన్ని యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లాడు. దీంతో హైదరాబాద్‌లో ఉన్న బ్రాంచ్ ఆఫీసు నుంచి పని చేయాలని సూచించింది. అతడు భార్యను పుట్టింట్లో వదిలిపెట్టి ప్రస్తుతం హైదరాబాద్ నుంచే పనిచేస్తున్నాడు. సాక్షి, హైదరాబాద్:.. ఇదీ బెంగళూరులోని ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) ఉద్యోగికి జరిగిన నీళ్ల బదిలీ. సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియాగా పేరొందిన బెంగళూరు గతంలో ఎన్నడూ లేనివిధంగా నీటి సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఇన్ఫోసిస్, విప్రో, టీసీఎస్ వంటి ప్రముఖ ఐటీ కంపెనీలకు కేంద్రమైన వైట్‌ఫీల్డ్, వర్తూర్ వంటి ఐటీ హబ్‌లలో ఈ సమస్య తీవ్రంగా ఉంది.దీంతో ఐటీ సంస్థలు, ఉద్యోగుల కార్యకలాపాలపై ప్రభావం పడుతోంది. ఐటీ హబ్‌లు, ఉద్యోగుల నీటి కష్టాలు వీడియో పలు సామాజిక మాధ్యమాల్లోనూ వైరల్ కావడం గమనార్హం. హైదరాబాద్, పుణేలకు బదిలీ దేశీయ ఐటీ పరిశ్రమ అమెరికా, యూకే, యూరప్, ఆస్ట్రేలియా వంటి పలు దేశాల మీద ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. దీంతో రాజకీయ అస్థిరత, స్థానిక సమస్యలతో సంబంధం లేకుండా గడువులోగా ప్రాజెక్ట్‌లను పూర్తి చేయడం సాఫ్ట్వేర్ కంపెనీలకు తప్పనిసరి. ఈ నేపథ్యంలో బెంగళూరు ఐటీ పరిశ్రమ నీటి ఎద్దడిని ఎదుర్కొనేందుకు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించింది. తాత్కాలికంగా కొద్దికాలం పాటు ఉద్యోగులను సొంతూళ్ల నుంచి పని చేసే వీలు కల్పించడం, హైదరాబాద్, పుణే వంటి ఇతర నగరాల్లోని బ్రాంచ్ ఆఫీసులకు బదిలీ చేయడం వంటివి చేస్తున్నాయి. విధి నిర్వహణలో ఎదురయ్యే సందేహాలు, టాస్క్‌లను నివృత్తి చేసేందుకు సాంకేతిక నిపుణులను జూమ్ వంటి ఆన్లైన్ మాధ్యమాల్లో అందుబాటులో ఉంచుతున్నాయి. అలాగే ఉద్యోగుల పనితీరుపై ఒత్తిడి ప్రభావం పడకుండా వారాంతాల్లో వర్చువల్‌గా శిక్షణ, మీటింగ్‌లను సైతం నిర్వహిస్తున్నాయి. వేతన పెంపు, అలవెన్స్‌లు కూడా.. ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం ఇచ్చినా బెంగళూరు నుంచే పని చేస్తారని, దీంతో అపార్ట్మెంట్లలో నీటి సమస్య మరింత తీవ్రమవుతుందని భావించిన పలు ఐటీ కంపెనీలు ఉద్యోగులను వర్క్ ఫ్రం హోం బదులుగా వర్క్ ఫ్రం హోంటౌన్ (సొంతూర్ల నుంచి పని) చేయాలని సూచిస్తున్నాయి. అయితే ఉద్యోగులు ఇతర పట్టణాలు/మెట్రో సిటీల నుంచి పని చేయాలంటే వ్యయ ప్రయాసలతో కూడుకున్న పని. కుటుంబంతో సహా వేరేచోటుకు మారడం, ప్రయాణ ఖర్చులతోపాటు అప్పటికే బెంగళూరులో ఉండే ఇంటికి అద్దె చెల్లించాల్సి ఉంటుంది. ఇది ఉద్యోగులకు భారం కావడంతో పలు కంపెనీలు తాత్కాలిక వేతన పెంపు, అలవెన్స్‌లు వంటివి ఇస్తున్నాయి. బెంగళూరులో నీటి సమస్య తీరిన తర్వాత తిరిగి ఆఫీసుకు రావాలని చెబుతున్నాయి. రోజుకు 500 మిలియన్ లీటర్ల నీటి కొరత ప్రస్తుతం కర్ణాటకలో సుమారు 8,785 ఐటీ, ఐటీఈఎస్ కంపెనీల్లో 18 లక్షల మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. వేగవంతమైన పట్టణీకరణ, జనాభా పెరుగుదల, అస్తవ్యస్తమైన పట్టణ ప్రణాళిక, లోటు వర్షపాతం, తలసరి నీటి వినియోగం పెరుగుదల వంటి కారణాలతో బెంగళూరులో నీటి సమస్య జఠిలమైంది. నగరంలో రోజుకు తాగునీరు, పరిశ్రమ అవసరాలకు 2,600 ఎంఎల్డీ (రోజుకు మిలియన్ లీటర్లు) నీరు అవసరం ఉండగా.. ఇందులో 1,450 ఎంఎల్డీలు కావేరి నది నుంచి, 650 ఎంఎల్డీలు బోరు బావుల నుంచి సమకూరుతుండగా, 500 ఎంఎల్డీల నీటి కొరత ఉందని ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. గేటెడ్ కమ్యూనిటీలు, పెద్ద నివాస సముదాయాలతోపాటు ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, అగ్నిమాపక కేంద్రాలు, హోటళ్లు, రెస్టారెంట్లు కూడా నీటి సమస్యను ఎదుర్కొంటున్నాయి. ఐటీ ఆఫీసులపై ప్రభావం బెంగళూరులో నీటి సమస్య ఐటీ కార్యాలయాల మీద కూడా ఎక్కువ ప్రభావం చూపిస్తోంది. మహాదేవపుర,కెంగేరి, వైట్ ఫీల్డ్, సజ్జాపుర్ రోడ్, కోర మంగళ వంటి ప్రాంతాల్లోని ఐటీ సంస్థలు, ఉద్యోగులపై ఈ ప్రభావం ఎక్కువగా ఉంది. దీంతో పలు సంస్థలు రిమోట్ వర్కింగ్, హైబ్రిడ్ మోడల్ పని విధానంతోపాటు ఇతర నగరాల్లోని బ్రాంచీల నుంచి పని చేయాలని ఉద్యోగులకు సూచిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాలకు చెందిన ఐటీ ఉద్యోగులు ఎక్కువగా ఇలా పని చేస్తున్నారు. –సందీప్ కుమార్ మఖ్తల, ప్రెసిడెంట్, తెలంగాణ ఐటీ అసోసియేషన్ -
ముంబైలోనూ నీటి కష్టాలు.. నీటి సరఫరా 15 శాతం కట్?
దేశంలో ఐటీ హబ్‌గా పేరొందిన బెంగళూరులో చుక్క నీటి కోసం జనం తహతహలాడుతున్నారు. ఇప్పుడు ముంబైలోనూ ఇదే పరిస్థితి తలెత్తింది. బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) తాజాగా నీటి సరఫరాను ఐదు శాతంమ మేరకు తగ్గించింది. ఈరోజు (మార్చి 19) ముంబైలో నీటి కోత 15 శాతం మేరకు ఉంటుందని ప్రకటించింది. దీంతో ముంబైవాసులలో ఆందోళన పెరిగింది. నిర్వహణ పనుల కారణంగా నీటి సరఫరాను తగ్గించినట్లు బీఎంసీ పేర్కొంది. పౌర సంఘం తెలిపిన వివరాల ప్రకారం థానే జిల్లాలోని పైస్ డ్యామ్‌లో నీటి కొరత కారణంగా నగరం అంతటా అదనపు నీటి కోత విధించారు. తాజాగా బీఎంసీ ఒక ప్రకటనలో మహానగరానికి 60 కి.మీ దూరంలో ఉన్న డ్యామ్‌కు భట్సా రిజర్వాయర్ నుండి నీరు వచ్చిన తర్వాత నీటి సరఫరా పునరుద్ధరణ జరుగుతుందని తెలిపింది. ఇదిలావుండగా ఆసియాలోని అతిపెద్ద ప్లాంట్లలో ఒకటైన భాండూప్‌లోని వాటర్ ప్యూరిఫైయర్ ప్లాంట్‌లో క్లీనింగ్ కారణంగా మార్చి 15 నుండి ఏప్రిల్ 24 వరకు ముంబైలో ఐదు శాతం నీటి కోతను బీఎంసీ ప్రకటించింది. డ్యామ్‌లో నీటి మట్టం తక్కువగా ఉన్నందున గతంలో పది శాతం నీటిని తగ్గించాలని ప్రతిపాదించింది. కాగా కర్ణాటక రాజధాని బెంగళూరు ప్రజలు తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నారు. నీటి కోసం ట్యాంకర్లపైనే ఆధారపడుతున్నారు. ఇక్కడ పరిస్థితి ఎంత తీవ్రంగా ఉన్నదంటే బెంగళూరులో 14 వేల బోర్‌వెల్స్‌లో 6,900 ఎండిపోయాయి. దీంతో పాటు చెరువులన్నీ కూడా దాదాపు అడుగంటిపోయాయి. -
నీటి కొరత లేదు.. పరిష్కారం ఉంది: సీఎం సిద్ధరామయ్య
జూన్ నెలాఖరు వరకు బెంగళూరు నీటి అవసరాలు తీర్చేందుకు పరిష్కారం ఉంది. కావేరి, కబినీ నదులలో నగరానికి కావలసిన నీటిని ప్రభుత్వం నిల్వ చేసిందని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఈ రోజు (సోమవారం) ప్రకటించారు. తాగునీటికి కొరత లేదని దీనికోసం బెంగళూరు పౌరసరఫరాల సంస్థ తగినన్ని నిధులు సమకూరుస్తున్నాయని డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, నగర పాలక సంస్థ అధికారులతో సమావేశం వెల్లడించారు. బెంగళూరులోని 14,000 బోర్‌వెల్స్‌లో 6900 ఎండిపోయాయి. నగరంలో ప్రతిరోజూ దాదాపు 2600 మిలియన్ లీటర్ల నీటి అవసరం ఉంది. ఈ నీటి కొరతను తీర్చడానికి కావలసినన్ని జలాలు ఉన్నాయి. బెంగళూరులో మాత్రమే కాకుండా చుట్టుపక్కల మొత్తం 110 గ్రామాలకు కూడా నీరు అందిస్తామని సీఎం వెల్లడించారు. కబినీ, కేఆర్ఎస్ డ్యామ్‌లలో సరిపడా నీరు ఉంది. జూన్ మొదటి లేదా రెండో వారంలో రుతుపవనాలు వచ్చే అవకాశం ఉందని సీఎం చెప్పారు. ఇప్పుడు నీటి కొరతను నియంత్రించడానికి కావలసిన చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. దీనికోసం 313 కొత్త బోర్లు వేయనున్నట్లు స్పష్టం చేశారు. క్రియారహితంగా ఉన్న 1200 బోర్లను పునరుద్ధరిస్తామని చెప్పారు బెంగళూరు నగరంలోని అన్ని ప్రాంతాల్లో నిర్ణీత ధరలకే నీటిని సరఫరా చేయాలని రెండు వారాల క్రితం ప్రభుత్వం ప్రైవేటు ట్యాంకర్లను ఆదేశించింది. దీని కోసం దాదాపు 1700 వాటర్ ట్యాంకర్లను రిజిస్టర్ చేశామని, ప్రైవేట్ బోర్వెల్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నామని సీఎం చెప్పారు. -
ఇది బీజేపీ పొలిటికల్ గేమ్!.. డీకే శివకుమార్ కీలక వ్యాఖ్యలు
కర్ణాటక రాజధాని బెంగళూరులో గత కొన్ని రోజులుగా నీటి సంక్షోభం ఏర్పడింది. కొన్ని ఐటీ కంపెనీలు తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ సదుపాయం కల్పించాయి. ఈ తరుణంలో బెంగళూరులో నీటి ఎద్దడి లేదని ఉప ముఖ్యమంత్రి 'డీకే శివకుమార్' కీలక వ్యాఖ్యలు చేశారు. బెంగళూరులో నీటి సంక్షోభం లేదు. దాదాపు 7000 బోర్వెల్లు ఎండిపోయినప్పటికీ.. నీటి కొరత ఉండకూడదని తగిన ఏర్పాట్లు చేస్తున్నాము. ఇప్పటికే ట్యాంకర్లను స్వాధీనం చేసుకున్నాం. నీటి వనరులను గుర్తించాం.. నీటి సరఫరా జరిగేలా చూస్తామని డీకే శివకుమార్ అన్నారు. నీటి కొరత రాకుండా ఉండటానికి నగరంలో కార్ వాషింగ్, గార్డెనింగ్, నిర్మాణం, నిర్వహణ కోసం తాగునీటిని ఉపయోగించడాన్ని పూర్తిగా నిషేదించారు. తాగునీరు, రోజువారీ పనుల కోసం ప్రైవేట్ ట్యాంకర్లపై ఆధారపడిన నివాసితుల కోసం.. జిల్లా యంత్రాంగం ప్రైవేట్ ట్యాంకర్లకు రేట్లను ఫిక్స్ చేసింది. భారతీయ జనతా పార్టీ (బీజేపీ) 'పొలిటికల్ గేమ్' ఆడుతోందని డీకే శివకుమార్ నిందించారు. రాష్ట్రంలో తీవ్రమైన నీటి కొరత ఉన్నప్పటికీ పొరుగున ఉన్న తమిళనాడుకు కావేరీ నది నీటిని కాంగ్రెస్ ప్రభుత్వం రహస్యంగా విడుదల చేస్తోందన్న ఆరోపణలను ఆయన తోసిపుచ్చారు. రామనగర జిల్లాలోని కనకపుర తాలూకాలోని మేకేదాటు వద్ద కావేరి నదికి అడ్డంగా బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ 'వాక్ ఫర్ మేకేదాటు ప్రాజెక్ట్' నిర్వహించింది తానేనని శివకుమార్ బీజేపీ నేతలకు గుర్తు చేయాలని కోరారు. ఆ ప్రాజెక్టు సాకారం అయ్యేలా చూసేందుకే పాదయాత్ర నిర్వహించిన విషయం కూడా గుర్తు చేశారు. మేకేదాటు ప్రాజెక్టును చేపట్టేందుకు రాష్ట్రానికి అనుమతి వచ్చేలా చూడాలని బీజేపీ ఎంపీలు, కేంద్ర మంత్రులను ఆయన కోరారు. -
నీటి సంక్షోభంపై బీజేపీ విమర్శలు.. డీకే శివకుమార్ కీలక వ్యాఖ్యలు
కృష్ణరాజ సాగర్ (కేఆర్ఎస్) డ్యాం నుంచి తమిళనాడుకు కావేరీ నీటిని విడుదల చేస్తున్నారనే విషయం మీద ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తుతున్న సమయంలో.. కావేరీ నదీ జలాలను ఎట్టిపరిస్థితుల్లోనూ ఇతర రాష్ట్రాలకు విడుదల చేయబోమని కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ స్పష్టం చేశారు. తమిళనాడుకు నీటి విడుదలను ప్రారంభించలేదు. ఒకవేళ నీటిని విడుదల చేయాలన్నా దాని గమ్యాన్ని చేరుకోవడానికి నాలుగు రోజులు పడుతుందని శివకుమార్ వెల్లడించారు. నీటి సంక్షోభం తీవ్రతరమవుతున్న సమయంలో తమిళనాడుకు నీటిని విడుదల చేసేంత మూర్ఖత్వం ఈ ప్రభుత్వంలో లేదని అన్నారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో నీటి ఎద్దడి నెలకొనడంతో కేఆర్ఎస్ డ్యాం నుంచి తమిళనాడుకు నీటిని విడుదల చేస్తున్నారని ఆరోపిస్తూ ఆదివారం జిల్లా కేంద్రమైన మండ్య పట్టణంలో రైత హితరక్షణ సమితి నిరసన చేపట్టింది. కాంగ్రెస్ ప్రభుత్వం కర్ణాటక రైతులు, పౌరుల ప్రయోజనాల కంటే తమిళనాడులో దాని కూటమి భాగస్వామి 'డీఎంకే'కు అధిక ప్రాధాన్యత ఇస్తోందని ఆరోపిస్తూ బీజేపీ కూడా విమర్శించింది. మలవల్లిలోని శివ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌ను నింపేందుకు కేఆర్ఎస్ డ్యాం నుంచి కొంత నీటిని విడుదల చేశామని, అక్కడి నుంచి బెంగళూరుకు పంపింగ్ చేస్తామని శివకుమార్ స్పష్టం చేశారు. తమిళనాడుకు నీటిని విడుదల చేశామన్న వార్తలు పూర్తిగా ఆవాస్తవమని పేర్కొన్నారు. -
ఇంతటి తీవ్ర నీటి సంక్షోభాన్ని కర్ణాటక చూడలేదు: డీకే శివకుమార్
బెంగళూరులో నీటి సంక్షోభం తీవ్రతరం అవుతున్న నేపథ్యంలో.. గత మూడు-నాలుగు దశాబ్దాల్లో రాష్ట్రం ఇంత తీవ్రమైన కరువును ఎప్పుడూ చూడలేదని ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ అన్నారు. ఈ సమయంలో తమిళనాడుకు ఎట్టి పరిస్థితుల్లోనూ కావేరీ నదీ జలాలను విడుదల చేసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ఇంతకుముందు నీటి కొరత కొంత మేర ఉన్నప్పటికీ.. ఇంత పెద్ద సంఖ్యలో తాలూకాలను కరువు ప్రభావిత ప్రాంతాలుగా మేము ఎప్పుడూ ప్రకటించలేదని విలేకర్లతో జరిగిన సమావేశంలో శివకుమార్ పేర్కొన్నారు. బెంగళూరులో 13900 బోర్వెల్లలో 6900 బోర్వెల్లు పనికిరాకుండా పోయాయని పేర్కొన్నారు. బెంగళూరు అర్బన్ జిల్లాలోని 1,193 వార్డులతో పాటు కర్ణాటక వ్యాప్తంగా 7,082 గ్రామాలు తాగునీటి ఎద్దడిని ఎదుర్కొంటాయని ప్రభుత్వం అంచనా వేసింది. ఇందులో కూడా తుమకూరు జిల్లా (746 గ్రామాలు) అగ్రస్థానంలో ఉంది. ప్రభుత్వం ఇప్పటికే నీటి సరఫరా చేసేందుకు ట్యాంకర్లను ఏర్పాటు చేసిందని శివకుమార్ చెప్పారు. నీటి సమస్యను తీర్చడానికి రాష్ట్ర ప్రభుత్వం కంట్రోల్ రూమ్‌లు, ప్రత్యేక హెల్ప్‌లైన్ నంబర్లను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. అంతే కాకుండా రాష్ట్రంలోని కరువు పరిస్థితులను పరిష్కరించడానికి స్థానిక ఎమ్మెల్యేల నేతృత్వంలో టాస్క్‌ఫోర్స్‌లు ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. -
మళ్లీ వర్క్ ఫ్రమ్ హోమ్.. ఐటీ కేంద్రంలో ఊపందుకున్న డిమాండ్!
ఐటీ పరిశ్రమకు కేంద్రంగా ఉన్న బెంగళూరులో నీటి సంక్షోభం తలెత్తింది. నగరంలో నీటి కష్టాలపై స్థానికులు సోషల్ మీడియాను ఆశ్రయిస్తున్నారు. నగరవాసులు, సామాజిక సంఘాలు ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను ట్యాగ్ చేస్తూ వర్క్ ఫ్రమ్ హోమ్ అభ్యర్థనలను హోరెత్తిస్తున్నారు. నగరంలోని ఐటీ కంపెనీలు ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశాన్ని కల్పించేలా చూడాలని, పాఠశాలలు ఆన్లైన్ తరగతులను పునఃప్రారంభించడానికి అనుమతించాలని వారు సీఎంను కోరుతున్నారు. కోవిడ్ మహమ్మారి సమయంలో ఉపయోగపడిన ఈ వ్యూహాన్ని ప్రస్తుత నీటి సంక్షోభాన్ని పరిష్కరించడానికి ఎందుకు ఉపయోగించకూడదు అని ప్రశ్నిస్తున్నారు. దీని వల్ల అందరికీ ప్రయోజనం కలుగుతుందని, మండుతున్న ఎండల నుండి ఉద్యోగులకు, విద్యార్థులకు ఉపశమనం కలగడమే కాకుండా విలువైన సంక్షోభ సమయంలో నీటి సంరక్షణకు దోహదపడుతుందని వాదిస్తున్నారు. "బెంగళూరు నగరంలో పెరిగిన ఎండ వేడి, తీవ్రమైన నీటి సంక్షోభం నెలకొని ఉండటం, ఈ నెలలో పెద్దగా వర్షాలు లేనందున వర్షాకాలం ప్రారంభమయ్యే వరకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్‌ను కర్ణాటక ప్రభుత్వం పరిగణించాల్సిన సమయం ఆసన్నమైంది" అని ‘గో బై కర్ణాటక వెదర్’ (@Bnglrweatherman) అనే వాతావరణ ఔత్సాహికుల బృందం ‘ఎక్స్’లో పేర్కొంది. "నీటి సంక్షోభం.. ఆన్లైన్ తరగతులు, వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంటాయా? విద్యార్థులు, ఉద్యోగులను ఇంటి నుండి పని చేయడానికి అనుమతిస్తే, చాలా మంది వారి స్వస్థలాలకు వెళతారు. నగరంపై ఒత్తిడి తగ్గుతుంది!" అని సిటిజన్స్ ఎజెండా ఫర్ బెంగళూరు (@BengaluruAgenda) రాసుకొచ్చింది. ఉద్యోగులను ఇంటి నుండి పని చేయడానికి అనుమతించడం వల్ల చాలా మంది తమ స్వస్థలాలకు తిరిగి వెళ్లే దృష్టాంతం ఏర్పడవచ్చని మరికొంత హైలైట్ చేశారు. దీని వల్ల పట్టణ ప్రాంతాల్లో నీటి డిమాండ్ తగ్గడానికి దారితీయవచ్చు అంటున్నారు. ముఖ్యంగా ఐటీ రంగానికి ఇంటి నుండి పని కోసం ఆదేశాన్ని అమలు చేయాలని కర్ణాటక ప్రభుత్వాన్ని కోరుతూ నమ్మ వైట్‌ఫీల్డ్ అని పిలిచే నగరంలోని వైట్‌ఫీల్డ్ ప్రాంతంలోని నివాసితులు, నివాస సంక్షేమ సంఘాల సమాఖ్య ‘ఎక్స్’లో పోస్ట్ చేసింది. ఇటువంటి చర్య ఉద్యోగులు తమ స్వస్థలాలకు వెళ్లేందుకు వీలు కల్పిస్తుందని, తద్వారా బెంగళూరుపై భారం తగ్గుతుందని పేర్కొంది. -
కర్ణాటక అంతటా నీటి కటకట..!(ఫొటోలు)
-
బెంగళూరు గొంతెండుతోంది
‘‘అవడానికి మాదో లగ్జరీ అపార్ట్మెంట్. కానీ ఏం లాభం? నెల రోజులుగా చుక్క నీటికీ దిక్కు లేక అల్లాడుతున్నాం! 24 గంటలూ రావాల్సిన నల్లా నీళ్లు ఏ రాత్రి వేళో వస్తున్నాయి. అవీ మురికిమయం! స్నానపానాలకే కాదు, చివరికి టాయ్‌లెట్ అవసరాలకు కూడా నీరు లేదు. సరిగా నీళ్లు కూడా పోయక ఏ ఫ్లాట్‌లో చూసినా టాయ్లెట్లు భరించలేనంతగా కంపు కొడుతున్నాయి. దాంతో రెసిడెంట్లు మూకుమ్మడిగా ఖాళీ చేసి వెళ్లిపోతున్నారు. అలా వెళ్లలేనివాళ్లం విధిలేక పక్కనే ఉన్న ఫోరం సౌత్ మాల్‌లోకి వెళ్లి టాయ్‌లెట్ అవసరాలు తీర్చుకుంటున్నాం!’’ – రెడిట్‌లో ఓ బెంగళూరు వాసి పెట్టిన పోస్టిది! అలాంటిదేమీ లేదంటూ సదరు అపార్ట్మెంట్ అసోసియేషన్ ఖండించినా ఈ పోస్టు ప్రస్తుతం తెగ వైరలవుతోంది. దీనికి బెంగళూరు టెకీల నుంచి విపరీతమైన స్పందన వెల్లువెత్తుతోంది. తమ నీటి కష్టాలకు అంతు లేదంటూ వర్ణిస్తూ వారు పెడుతున్న పోస్టులతో ఇంటర్నెట్ హోరెత్తిపోతోంది... దేశ ఐటీ రాజధాని బెంగళూరు గొంతెండిపోతోంది. తీవ్ర నీటి కొరతతో అల్లాడుతోంది. గుక్కెడు తాగునీటి కోసం జనం అలో లక్ష్మణా అంటూ అలమటిస్తున్నారు. నగరవ్యాప్తంగా బోర్లన్నీ చుక్క నీరైనా లేకుండా ఎండిపోయాయి. నగరంలో ఏటా వేసవిలో నీటి కొరత మామూలే అయినా ఈసారి మాత్రం సమస్య చాలా దారుణంగా ఉంది. ఇంకా వేసవి మొదలైనా కాకముందే నీటి కొరత తారస్థాయికి చేరింది. కోట్లు పెట్టి లగ్జరీ అపార్ట్మెంట్లలో ఫ్లాట్లు కొనుక్కున్న వాళ్లు కూడా కనీసం స్నానానికైనా నీళ్లు లేక లబోదిబోమంటున్నారు. సమర్థమైన ప్రత్యామ్నాయ ఏర్పాట్లేవీ చేయలేక ప్రభుత్వ యంత్రాంగం కూడా ప్రస్తుతానికి చేష్టలుడిగింది. రాష్ట్రవ్యాప్తంగా నీటి ఎద్దడి నెలకొని ఉందంటూ ప్రకటించింది! నీటి సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు ఇప్పటికే తాలూకా స్థాయిలో కంట్రోల్ రూములు, హెల్ప్లైన్లు ఏర్పాటు చేసింది. బెంగళూరులో నీటి సమస్య నివారణకు ఎంతదూరమైనా వెళ్తామంటూ ఉప ముఖ్యమంత్రి డి.కె.శివకుమార్ చేసిన ప్రకటనలు ఇప్పటికైతే కార్యరూపం దాల్చలేదు. పరిస్థితి పూర్తిగా చేయి దాటకుండా చూసేందుకు నగరంలో నీటి వాడకంపై రాష్ట్ర జల బోర్డు కఠిన ఆంక్షలు విధించింది. కార్లు కడిగేందుకు, మొక్కలకు, మెయింటెన్స్, నిర్మాణ పనులకు తాగునీటి వాడకాన్ని పూర్తిగా నిషేధిస్తున్నట్టు ప్రకటించింది. ఉల్లంఘిస్తే రూ.5,000 జరిమానా తప్పదని హెచ్చరించింది. బెంగళూరులోనే గాక కర్ణాటకవ్యాప్తంగా నీటి ఎద్దడి ఆందోళనకర స్థాయిలోనే ఉంది. గత సీజన్లో వర్షాభావమే ఈ దుస్థితికి కారణమన్న ప్రభుత్వ ప్రకటనపై జనం మండిపడుతున్నారు. ఇంతటి సమస్య తప్పదని ముందే తెలిసి కూడా ప్రత్యామ్నాయ ఏర్పాట్లేవీ చేయలేదంటూ దుయ్యబడుతున్నారు. ‘‘నిజానికి మూడు నెలలుగా నీటి సమస్య వెంటాడుతోంది. నెల నుంచి పరిస్థితి మరీ విషమించింది’’ అంటూ వాపోతున్నారు. ట్యాంకర్ల రేట్లు చుక్కల్లోకి... ► బెంగళూరులో ఏకంగా 60 శాతం జనం నీటి కోసం వాటర్ ట్యాంక్‌ల మీదే ఆధారపడ్డారు! అదను చూసి ప్రైవేట్ ట్యాంకర్లు రేట్లు ఎడాపెడా పెంచేశాయి. ► మామూలు రోజుల్లోనే 6,000 లీటర్ల ట్యాంకర్‌కు రూ.600, 8,000 లీటర్లకు రూ.800, 12 వేల లీటర్ల ట్యాంకరైతే రూ.1,000 చార్జి చేస్తారు. ► ఈ రేట్లకు జీఎస్టీ అదనం. పైగా దూరం 5 కి.మీ. దాటితే మరో రూ.200 దాకా పెరుగుతుంది. ► ఇప్పుడు ప్రైవేట్ ట్యాంకర్లు రెట్టింపు, అంతకుమించి వసూలు చేస్తున్నాయంటూ జనం గగ్గోలు పెడుతున్నారు. ► దాంతో ట్యాంకర్ల రేట్లకు పరిమితి విధిస్తామన్న ప్రభుత్వ ప్రకటన ఎక్కడా పెద్దగా అమలు కావడం లేదు. ► ఇవేం ధరలంటూ గట్టిగా నిలదీస్తే ట్యాంకర్వాలాలు ఆ కాలనీల ముఖం కూడా చూడటం లేదు. ► మున్సిపాలిటీ నల్లాల వద్ద క్యూ లైన్లు కిలోమీటర్లు దాటేస్తున్నాయి. అక్కడా ఒక్క బిందెకు మించి ఇవ్వడం లేదు! ► ఆర్వో ప్లాంట్ల ముందు కూడా ఒక్కరికి ఒక్క క్యానే అంటూ బోర్డులు దర్శనమిస్తున్నాయి! ► చాలా ప్లాంట్లు ‘నో వాటర్’ అంటూ బోర్డులు పెట్టి బ్లాకులో అడ్డగోలు రేట్లకు అమ్ముకుంటున్నాయి. ► నీటి ఎద్దడి దెబ్బకు రాష్ట్రవ్యాప్తంగా విద్యా సంస్థలు ఆన్లైన్ బాట పడుతున్నాయి. ఆన్లైన్ క్లాసులతో పని కానిస్తున్నాయి. ఎందుకింత సమస్య... ► 2023లో కర్ణాటకవ్యాప్తంగా నెలకొన్న వర్షా భావ పరిస్థితులు ప్రస్తుత నీటి సమస్యకు ప్రధాన కారణాల్లో ఒకటి. ► రాష్టంలో ఎక్కడ చూసినా భూగర్భ జలాలు అడుగంటాయి. కావేరీ బేసిన్‌లోని రిజర్వాయర్లన్నీ దాదాపుగా వట్టిపోయాయి. ► కర్ణాటకలోని 16 పెద్ద రిజర్వాయర్లలో 2023లో ఇదే సమయానికి సగం వరకున్న నీటిమట్టం ఈసారి 29 శాతానికి పడిపోయింది. ► బెంగళూరులో ఎక్కడ చూసినా బోర్లే దర్శనమిస్తుంటాయి. భూగర్భ జలాలను విచ్చలవిడిగా తోడేయడం నగరంలో నీటి ఎద్దడికి ప్రధాన కారణం. ► రియల్టీ బూమ్ నేపథ్యంలో రెండు దశాబ్దాలుగా నగరంలోని చెరువులు, నీటి ఆవాసాలన్నీ కాలనీలు, అపార్ట్మెంట్లుగా మారిపోయాయి. ఆ దెబ్బకు స్థానిక నీటి వనరులు పూర్తిగా కనుమరుగయ్యాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఐటీ సిటీలో నీటి సంక్షోభం.. ప్రభుత్వంపై వెల్లువెత్తిన విమర్శలు
బెంగళూరులో నీటి సంక్షోభం తీవ్రతరం అవుతోంది. రాష్ట్ర ప్రభుత్వం రెసిడెంట్స్ అసోసియేషన్ల నుంచి రీసైకిల్ చేసిన లేదా శుద్ధి చేసిన నీరు వంటి వాటి కోసం ప్రత్యామ్నాయ పరిష్కారాలను అన్వేషిస్తోంది. రోజుకు సుమారు 2600 నుంచి 2800 మిలియన్ లీటర్ల నీటిని బెంగళూరు ప్రజలు ఉపయోగిస్తున్నట్లు.. నీటి కొరత వల్ల నేడు 1500 మిలియన్ లీటర్ల కొరత ఏర్పడిందని సమాచారం. నీటి నిర్వహణ చర్యలను అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని ప్రతిపక్ష పార్టీ నేతలు దుమ్మెత్తిపోస్తున్నారు. గత వరం రోజుల నుంచి అధికార పక్షం తీసుకుంటున్న నిర్ణయాలను కూడా బీజేపీ నేతలు తప్పుబడుతున్నారు. నీటి సమస్యను తీర్చడానికి ముఖ్యమంత్రి సిద్ధరామయ్య నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం కంట్రోల్ రూమ్‌లు, ప్రత్యేక హెల్ప్‌లైన్ నంబర్లను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. అంతే కాకుండా రాష్ట్రంలోని కరువు పరిస్థితులను పరిష్కరించడానికి స్థానిక ఎమ్మెల్యేల నేతృత్వంలో టాస్క్‌ఫోర్స్‌లు ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ఈ ఏడాది నీటి కొరత తీవ్రంగా ఉండబోతున్నట్లు.. బెంగళూరు అర్బన్ జిల్లాలోని 1,193 వార్డులతో పాటు కర్ణాటక వ్యాప్తంగా 7,082 గ్రామాలు తాగునీటి ఎద్దడిని ఎదుర్కొంటాయని ప్రభుత్వం అంచనా వేసింది. ఇందులో కూడా తుమకూరు జిల్లా (746 గ్రామాలు) అగ్రస్థానంలో ఉంది. నీటి కొరత పెరుగుతున్న తరుణంలో ట్యాంకర్ల ధరలు కూడా భారీగా పెరుగుతున్నాయి. గతంలో రూ.1000 నుంచి రూ. 1500 వరకు ఉన్న ట్యాంకర్ ధర ఇప్పుడు రూ. 2000కు చేరింది. అయితే ప్రభుత్వం కూడా కొత్త ధరలను ప్రకటించింది. ఈ ధరలకే వాటర్ ట్యాంకర్లు అందుబాటులో ఉంటాయని తెలుస్తోంది (కొత్త ధరలు GSTతో సహా ఉంటాయి). బెంగళూరులో వాటర్ ట్యాంకర్ రేట్లు 5 కిమీ పరిధిలో ట్యాంకర్ల ధరలు 6000 లీటర్ల నీటి ట్యాంకర్ - రూ.600 8,000 లీటర్ల నీటి ట్యాంకర్ - రూ.700 12,000 లీటర్ల నీటి ట్యాంకర్ - రూ.1000 5 కిమీ కంటే ఎక్కువ పరిధిలో ట్యాంకర్ల ధరలు 6,000 లీటర్ల వాటర్ ట్యాంకర్ - రూ. 750 8,000 లీటర్ల నీటి ట్యాంకర్ - రూ.850 12,000 లీటర్ల నీటి ట్యాంకర్ - రూ.1200 -
Bengaluru Water Crisis: మా ఇంట్లోనూ బోరుబావి ఎండిపోయింది: నీటి కొరతపై డీకే శివకుమార్
బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగళూరును నీటి సంక్షోభం వేధిస్తోంది. వేసవికాలం ప్రారంభంలోనే నీటి కొరత నగర వాసులకు చుక్కలు చూపిస్తోంది. దాదాపు అన్ని ప్రాంతాల్లో నీటి సమస్యతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. కుళాయిలు, బోర్ల నుంచి నీరు రాకపోవడంతో ట్యాంకర్ల నుంచి నీటిని సరఫరా చేసుకుంటున్నారు. తాజాగా బెంగళూరులో నీటి ఎద్దడిపై డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ స్పందించారు. నగరంలో రోజురోజుకీ నీటి కొరత తీవ్రతర అవుతుందని, దాదాపు 3000 పైగా బోరు బావులు ఎండిపోయాయని తెలిపారు.తన ఇంటి వద్ద ఉన్న బోరు బావి కూడా ఎండిపోయిందని తెలిపారు. నీటి సమస్యను తీర్చడానికి కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రకాలుగా ప్రయత్నిస్తోందని చెప్పారు. సంబంధిత అధికారులతో ఇప్పటికే చర్చలు జరిపినట్లు పేర్కొన్నారు. నీరు అందుబాటులో ఉన్న ప్రాంతాలను గుర్తించి, ట్యాంకర్ల ద్వారా సరాఫరా చేస్తామని చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లోనూ నీటి సరఫరా జరిగేలా చూస్తామని తెలిపారు. నగరంలో నీటి కొరతకను తీర్చలేని పరిస్థితులకు కేంద్రంలోనీ బీజేపీ కూడా కారణమేనంటూ శివకుమార్ విమర్శించారు. చదవండి: అమేథీ నుంచే లోక్‌సభ ఎన్నికల బరిలోకి రాహుల్ గాంధీ? బెంగుళురుకు మంచి నీటిని అందించాలనే ఉద్దేశంతో మేకేదాటు ప్రాజెక్టుకు తాము శ్రీకారం చుట్టామని అన్నారు. ప్రాజెక్టుకు ఆమోదం తెలపాలని పాదయాత్ర చేసినా.. కేంద్రం పట్టించుకోలేదని ఆరోపించారు. ప్రస్తుత సంక్షోభాన్ని దృష్టిలో పెట్టుకొని అయినా ఈ ప్రాజెక్టు అనుమతులు ఇస్తుందని భావిస్తున్నట్లు చెప్పారు. కరవు పరిస్థితులతో తాగునీటి కొరత గ్రామాలనే కాకుండా, సిలికాన్ సిటీలో, అందులోనూ సీఎం అధికార నివాసం కృష్ణను కూడా పీడిస్తోంది. నగరంలో తాగునీటి సరఫరా అరకొరగా ఉంది. దీంతో సీఎం నివాసానికి జలమండలి కొళాయిల నుంచి నీరు రావడం లేదు. అధికారులు హడావుడిగా ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు. మార్చి మొదటి వారమే ఇలా ఉంటే ఏప్రిల్, మే మాసాల్లో నీటి ఎద్దడి ఎలా ఉంటుందోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. -
జలకళ తీసుకువచ్చింది
బ్యాంకింగ్ రంగంలో క్షణం తీరిక లేని పనుల్లో ఉండేది వేదిక భండార్కర్. ఆ ఊపిరి సలపని పనుల్లో ఆమెకు కాస్త ఉపశమనం సామాజికసేవ. బ్యాంకింగ్ రంగాన్ని వదిలి సామాజికసేవా రంగం దారిని ఎంచుకున్న వేదిక... ‘సామాజిక సేవ మనకు వినయాన్ని నేర్పుతుంది. మనుసులో నుంచి మానవత్వ భావన పోకుండా కాపాడుతుంది. మరిన్ని మంచి పనులు చేయాలనే ఉత్సాహాన్ని ఎప్పుడూ ఇస్తుంది’ అంటోంది... ‘సామాజిక సేవారంగంలో పనిచేస్తానని కలలో కూడా అనుకోలేదు’ అంటుంది ముంబైకి చెందిన వేదిక భండార్కర్. ‘స్టార్ బ్యాంకర్’గా పేరు తెచ్చుకున్న వేదిక జేపీ మోర్గాన్‌లో ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ హెడ్‌గా పనిచేసింది. ఆ తరువాత మరో కంపెనీలో వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ హోదాలో పనిచేసింది. తన వృత్తిపనుల్లో తలమునకలయ్యే వేదిక తొలిసారిగా ముంబైలోని ‘జై వకీల్ ఫౌండేషన్’తో కలిసి పనిచేసింది. ఆ తరువాత ‘దస్రా’ అనే స్వచ్ఛందసంస్థతో కలిసి జార్ఖండ్, బిహార్ గ్రామీణ ప్రాంతాలలో మహిళలు, బాలికల విద్య, ఆరోగ్యానికి సంబంధించిన కార్యక్రమాల్లో పాల్గొంది. ‘అపుడప్పుడు’ అన్నట్లుగా ఉండే ఆమె సామాజికసేవలు ఆతరువాత నిత్యకృత్యం అయ్యాయి. అలాంటి సమయంలోనే తమ సంస్థకు ఇండియాలో సారథ్యం వహించమని ‘వాటర్.ఆర్గ్’ నుంచి పిలుపు వచ్చింది. మిస్సోరీ (యూఎస్) కేంద్రంగా పనిచేసే స్వచ్ఛందసంస్థ ‘వాటర్.ఆర్గ్’ సురక్షిత నీరు, జలసంరక్షణ, పారిశుద్ధ్యంకు సంబంధించి ఎన్నో దేశాల్లో పనిచేస్తోంది. ఆ సంస్థ నుంచి ఆహ్వానం అందినప్పుడు నిరాకరించడానికి వేదికకు ఏ కారణం కనిపించలేదు. ఒప్పుకోవడానికి మాత్రం చాలా కారణాలు కనిపించాయి. అందులో ప్రధానమైనది... ‘పేదప్రజలకు సేవ చేసే అవకాశం దొరుకుతుంది’ ‘వాటర్.ఆర్గ్’ సారథ్య బాధ్యతలు చేపట్టే ముందు నీటి సంక్షోభం గురించి లోతుగా అధ్యయనం చేసింది వేదిక. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూ హెచ్ వో) గణాంకాల ప్రకారం సురక్షితమైన నీటి సౌకర్యానికి నోచుకోని ప్రజలు కోట్లలో ఉన్నారు. నీటి కోసం అష్టకష్టాలు పడుతున్నారు మహిళలు. నీటి కోసం గంటల కొద్దీ సమయాన్ని వెచ్చించక తప్పని పరిస్థితుల వల్ల ఆ సమయాన్ని ఇతర ప్రయోజనకర పనులకోసం కేటాయించలేకపోతున్నారు. ‘మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రధానంగా దృష్టి పెడతాను’ అంటున్న వేదిక ఆ సమస్యల పరిష్కారానికి తనవంతుగా కృషి చేస్తోంది. మరుగుదొడ్లు నిర్మించుకోవడం నుంచి వాటర్ కనెక్షన్లు ఏర్పాటు చేసుకోవడం వరకు ‘వాటర్.ఆర్గ్’ ద్వారా సహాయపడుతోంది. ఒకసారి క్షేత్రపర్యటనలో భాగంగా కర్ణాటకలోని ఒక గ్రామానికి వెళ్లింది వేదిక. ఒక మహిళ తన పదకొండు సంవత్సరాల కూతురు గురించి చెప్పింది. ఆ అమ్మాయి చదువుకోడానికి వేరే ఊళ్లో బంధువుల ఇంట్లో ఉంటుంది. అయితే బడికి సెలవులు వచ్చినా ఆ అమ్మాయి ఇంటికి రావడానికి మాత్రం ఇష్టపడడం లేదు. దీనికి కారణం వారి ఇంట్లో టాయిలెట్ సౌకర్యం లేకపోవడం. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఆ మహిళ టాయిలెట్ నిర్మించుకోవడానికి సహకరించింది వేదిక. ఆ గృహిణి కళ్లలో కనిపించిన మెరుపును దగ్గర నుంచి చూసింది. ‘బ్యాంకర్‌గా క్లయింట్స్ ఆదాయం ఒక స్థాయి నుంచి మరో స్థాయి పెరగడానికి కృషి చేశాను. ఇప్పుడు...తమకున్న వనరులతోనే సౌకర్యవంతమైన జీవితం ఎలా గడపవచ్చు అనే విషయంలో సామాన్య ప్రజలతో కలిసి పనిచేస్తున్నాను’ అంటుంది వేదిక. ఒకప్పుడు ‘స్టార్ బ్యాంకర్’గా బ్యాంకింగ్ రంగంలో ఎన్నో విజయాలు సాధించిన వేదిక భండార్కర్ ఇప్పుడు ‘నీటిని మించిన అత్యున్నత పెట్టుబడి ఏదీ లేదు’ అంటూ జలసంరక్షణపై ఊరూరా ప్రచారం చేస్తోంది. -
దేశంలో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా పెరుగని నేటి లభ్యత
-
ఇలాగైతే ‘నీళ్లు నమలాల్సిందే’
సాక్షి, అమరావతి: వరద జలాలను ఒడిసి పట్టడం.. భూగర్భ జలాలను పెంపొందించడం వంటి జల సంరక్షణ చర్యలు చేపట్టకపోతే దేశంలో తీవ్ర జల సంక్షోభం తలెత్తే అవకాశం ఉందని కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) ఆందోళన వ్యక్తం చేసింది. దేశంలో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా తలసరి నీటి లభ్యత పెరగడం లేదనే అంశాన్ని స్పష్టంచేసింది. తలసరి నీటి లభ్యత 2001లో 1,816 క్యూబిక్ మీటర్లు (ఒక క్యూబిక్ మీటర్ వెయ్యి లీటర్లకు సమానం) ఉంటే.. 2021 నాటికి 1,486 క్యూబిక్ మీటర్లకు తగ్గిపోవడాన్ని గుర్తు చేసింది. నీటి లభ్యతను పెంచే చర్యలు చేపట్టకపోతే.. 2031 నాటికి 1,367 క్యూబిక్ మీటర్లకు, 2041 నాటికి 1,282 క్యూబిక్ మీటర్లకు, 2051 నాటికి 1,228 క్యూబిక్ మీటర్లకు తగ్గిపోతుందని అంచనా వేసింది. ఇలాగైతే.. కష్టమే! పరిస్థితి ఇలానే కొనసాగితే భవిష్యత్‌లో సాగునీటికే కాదు.. తాగునీటికి కూడా తీవ్ర ఇబ్బందులు తప్పవని కేంద్ర జలసంఘం ఆందోళన వ్యక్తం చేసింది. సాగునీటి సమస్య పంటల సాగుపై ప్రభావం చూపుతుందని.. ఇది ఆహార సంక్షోభానికి దారి తీస్తుందని పేర్కొంది. నీటి లభ్యతను పెంచేలా వరద నీటిని ఒడిసిపట్టి జలాశయాల్లో నిల్వ చేయడం, జల సంరక్షణ చర్యలు చేపట్టడం ద్వారా జల సంక్షోభాన్ని నివారించవచ్చనని కేంద్రానికి సూచించింది. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా దేశంలో మరిన్ని రిజర్వాయర్లు నిర్మించి.. నదీ జలాలను మళ్లించి వాటిని నింపడం ద్వారా నీటి లభ్యతను పెంచుకోవాలని స్పష్టం చేసింది. నీటి పారుదల సౌకర్యాలను మెరుగుపర్చుకోకుంటే ఆహార ధాన్యాల దిగుబడి పెరగదని తేల్చింది. జనాభా పెరుగుతున్న నేపథ్యంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి పెరగకుంటే ఆహార సంక్షోభానికి దారి తీస్తుందని హెచ్చరించింది. సీడబ్ల్యూసీ అధ్యయనంలో ఏం తేలిందంటే ♦ దేశంలో ఏటా సగటున 1,298.60 మి.మీ. వర్షపాతం కురుస్తోంది. తద్వారా 1,37,002.08 టీఎంసీల నీరు లభ్యమవుతోంది. ♦ వర్షపాతం వల్ల గంగ, బ్రహ్మపుత్ర, గోదావరి, కృష్ణా నదుల్లో ప్రవాహం రూపంలో 70,591.75 టీఎంసీలు లభిస్తుండగా.. ప్రస్తుతం జలాశయాల ద్వారా 24,367.43 టీఎంసీలను మాత్రమే ఉపయోగించుకుంటున్నాం. ♦ ఏటా 46,224.32 టీఎంసీలు కడలిలో కలిసిపోతున్నాయి. అంటే వాడుకుంటున్న నీటి కంటే దాదాపు రెండు రెట్లు అధికంగా నదీ జలాలు కడలిలో కలుస్తున్నట్టు వెల్లడవుతోంది. ♦ దేశవ్యాప్తంగా వివిధ నదులపై నిర్మించిన 5,745 డ్యామ్‌ల నీటి నిల్వ సామర్థ్యం 9,103.34 టీఎంసీలు. ఈ డ్యామ్‌లలో నీటిని నిల్వ చేస్తూ సాగు, తాగునీటి అవసరాల కోసం 24,367.43 టీఎంసీలను మాత్రమే వాడుకుంటున్నాం. ♦ ఆంధ్రప్రదేశ్‌లో 166 డ్యామ్‌ల నిల్వ సామర్థ్యం 983.59 టీఎంసీలు. అన్ని జిల్లాల్లో కలిపి 1.05 కోట్ల ఎకరాలకు నీళ్లందించేలా ఆయకట్టును రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేసింది. -
వాటర్ వార్నింగ్!
సాక్షి, అమరావతి: మానవాళికి నీటి సంక్షోభం ముంచుకొస్తోంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 200 – 300 కోట్ల మంది నీటి కొరత ఎదుర్కొంటుండగా రాబోయే దశాబ్ద కాలంలో ఇది తీవ్రం కానుంది. అంతర్జాతీయ సమాజం మేల్కొని సహకరించుకోకుంటే పరిస్థితి చేయి దాటిపోతుందని ప్రపంచ దేశాలను ఐక్యరాజ్య సమితికి చెందిన యునెస్కో హెచ్చరించింది. మార్చి 22న వరల్డ్ వాటర్ డే సందర్భంగా న్యూయార్క్‌లో ప్రత్యేక సదస్సు నిర్వహించారు. ప్రపంచ నీటి దినోత్సవం సందర్భంగా వినియోగం, నిర్వహణపై అంతర్జాతీయ సహకారాన్ని పెంపొందించుకోవాలని ఐక్యరాజ్యసమితి పిలుపునిచ్చింది. వరల్డ్ వాటర్ నివేదిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 2 బిలియన్ల (జనాభాలో 26 శాతం) మందికి సురక్షితమైన తాగునీరు దొరకడం లేదు. 3.6 బిలియన్ల (46 శాతం) జనాభాకు సురక్షితమైన పారిశుధ్య నిర్వహణ అందుబాటులో లేదు. ఉమ్మడి భవిష్యత్తును కాపాడుకుందాం.. ప్రపంచవ్యాప్తంగా నీటి కొరత ఎదుర్కొంటున్న పట్టణ జనాభా 2016లో 930 మిలియన్లు ఉండగా 2050 నాటికి 1.7–2.4 బిలియన్లకు పెరుగుతుందని వరల్డ్ వాటర్ నివేదిక అంచనా వేసింది. నీటిని సంరక్షించుకుంటూ జల వనరులను స్థిరంగా నిర్వహించేందుకు ప్రపంచ దేశాలు కలిసి పనిచేయడం ఎంతో అవసరమని యునెస్కో డైరెక్టర్ జనరల్ ఆడ్రీ అజౌలే సదస్సులో సూచించారు. అందరికీ నీరు– పారిశుధ్యం అందించాలంటే ప్రపంచ దేశాలు ఉమ్మడి ప్రణాళికను అనుసరించాలన్నారు. కలసికట్టుగా నీటి సంక్షోభ నివారణ చర్యలను వేగవంతం చేయాలని యూఎన్ వాటర్ చైర్ పర్సన్ గిల్బర్ట్ ఎఫ్.హౌంగ్బో పిలుపునిచ్చారు. సహకారంతో సంక్లిష్టతలను అధిగమిద్దాం.. అంతర్జాతీయ సరిహద్దులను పంచుకునే నదులు, జలాశయాల నిర్వహణలో నెలకొన్న సంక్లిష్టతలను అధిగమించకుంటే కష్టాలు తప్పవని యూఎన్ వాటర్ సదస్సు అంతర్జాతీయ సమాజాన్ని హెచ్చరించింది. ఇందుకు ప్రత్యేక దౌత్య మార్గాలను అనుసరించాలని కోరింది. ఇది నీటి భద్రతకు మించి అనేక ప్రయోజనాలను చేకూరుస్తుందని తెలిపింది. అంతర్జాతీయ భాగస్వామ్య ఒప్పందాలున్న 468 జలాశయాలలో కేవలం 6 మాత్రమే ఒప్పందానికి లోబడి ఉన్నట్లు వెల్లడించింది. 2013లో మెక్సికోలో ప్రారంభించిన మోంటెర్రే వాటర్ ఫండ్ కార్యక్రమం ద్వారా నీటి నాణ్యతను పెంచడంతో పాటు వరద నివారణ చర్యలు విజయవంతమయ్యాయని తెలిపింది. ఇక నైరోబీకి 95 శాతం మంచినీటిని, కెన్యాకు 50 శాతం విద్యుత్‌ను సరఫరా చేసే తానా–నైరోబి నదీ పరీవాహక ప్రాంతంతో పాటు ఆఫ్రికాలో అనుసరించిన విధానాలు పరస్పర సహకారానికి ఉదాహరణగా పేర్కొంది. -
Italy Crisis: దుర్భిక్షం దిశగా ఇటలీ.. చుక్క నీరు లేక విలవిల..
రోమ్: ఐరోపా దేశం ఇటలీ నీటి సంక్షోభంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. నదులు, జలాశయాలు, కొలనులలో చుక్క నీరు లేక విలవిల్లాడుతోంది. 70 ఏళ్ల చరిత్రలో ఎన్నడూ లేనంతగా భూగర్భ జలాలు అడుగంటాయి. గతేడాదితో పోల్చితే వర్షపాతం 40 శాతం పడిపోయింది. వేసవికాలం ముగిసి చాలా రోజులవుతున్నా వర్షాలు పడకపోడవంతో ప్రజలు పరిస్థితి వర్ణణాతీతంగా మారింది. తాగడానికి మంచి నీరు కూడా లేని పరిస్థితి వచ్చింది. దీంతో ఇటలీ ప్రభుత్వం దేశంలో అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. నీటి కొరతను అధిగమించేందు 35 మిలియన్ యూరోలను కేటాయిస్తున్నట్లు తెలిపింది. ప్రజలు నీటిని పరిమితంగా ఉపయోగించేలా ఆంక్షలు విధించింది. ఎవరైనా నీటిని పరిమితి కంటే ఎక్కువగా ఉపయోగించినా, వృథా చేసినా 500 యూరోల జరిమానా విధించేందుకు సిద్ధమైంది. ఎమర్జెన్సీ ప్రకటించినందున ప్రభుత్వం ఇలాంటి చర్యలు తీసుకోవచ్చు. నీటి సంక్షోభం కారణంగా ఇటలీలోని పలు ప్రాంతాల్లో వ్యవసాయ రంగంపై తీవ్ర ప్రభావం పడింది. నీటి స్థాయిలు సాధారణం కంటే 85 శాతం క్షీణించడంతో రైతుల పంటలకు సాగనీరు లేని దుస్థితి నెలకొంది. దీంతో దేశ ఆహార ఉత్పత్తి మూడింట ఒక వంతు తగ్గే అవకాశం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. పెరుగుతున్న ఉష్ణోగ్రతల వల్ల జంతువులు కూడా ఇబ్బంది పడుతున్నట్లు పేర్కొన్నారు. అయితే ఇటలీలో ఈ పరిస్థితికి వాతావరణ మార్పులే ప్రధాన కారణమని పర్యావరణ నిపుణులు చెప్పారు. ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరగడం, సకాలంలో వర్షాలు కురవకపోవడం ప్రపంచానికి ఓ అలర్ట్ అని పేర్కొన్నారు. చదవండి: ఒక్కరోజు నిద్రలేకపోతే ఇంత జరుగుతుందా? పరిశోధనలో షాకింగ్ నిజాలు! -
నీటి కష్టాల్లో కీవ్.. విద్యుత్ సరఫరా కేంద్రంపై రష్యా వైమానిక సేనల దాడులు
కీవ్: రష్యా వైమానిక దాడులతో ఉక్రెయిన్ రాజధాని నగరం నీటి కష్టాల్లో మునిగిపోయింది. నీటి సరఫరాకు కీలకమైన విద్యుత్ సరఫరా కేంద్రంపై రష్యా వైమానిక సేనలు సోమవారం గగనతల దాడులను హఠాత్తుగా ఉధృతం చేశాయి. దీంతో నగరంలో చాలా ప్రాంతాల్లో నీటి రవాణా వ్యవస్థ దారుణంగా దెబ్బతింది. సోమవారం కీవ్ నగరంలో 80 శాతం వినియోగదారులకు నీటి సదుపాయం లేకుండాపోయిందని నగర మేయర్ విటలీ క్లిట్స్చోకో ఆందోళన వ్యక్తంచేశారు. కీవ్‌లో సోమవారం తెల్లవారుజాము నుంచే రష్యా దాడులతో పేలుళ్ల శబ్దాలు మార్మోగాయి. ఉక్రెయిన్‌కు మద్దతు ప్రకటిస్తూ చెక్ రిపబ్లిక్ ప్రధాని పీటర్ ఫియాలా, రక్షణ, విదేశాంగ మంత్రులతో కలిసి కీవ్‌ను సందర్శిస్తున్న వేళ కీవ్‌పై బాంబు దాడులు జరగడం గమనార్హం. కీవ్ ఉత్తరప్రాంతంలో ఉక్రెయిన్, రష్యా సేనలు పరస్పర దాడులు చేసుకున్నాయి. డినిపర్ నది ఎడమవైపు తీరం దాడుల పొగతో నిండిపోయింది. కొన్ని చోట్ల రైళ్లకు విద్యుత్ సరఫరా ఆటంకాలు ఏర్పడ్డాయి. క్రిమియా ద్వీపకల్పంలో నల్ల సముద్రంలో తీర స్థావర నౌకలపై ఉక్రెయిన్ బాంబుదాడులు చేసిందని రష్యా ఆరోపిస్తుండగా, రష్యానే పేలుడుపదార్ధాలను సరిగా ‘నిర్వహించలేక’ పేలుళ్లకు కారణమైందని ఉక్రెయిన్ స్పష్టంచేసింది. నౌకలపై దాడులతో ఆగ్రహించిన రష్యా.. ఉక్రెయిన్ నుంచి ఆహార ధాన్యాల ఎగుమతి ఒప్పందాన్ని తాజాగా రద్దుచేసుకుంది. దీంతో పలు దేశాలకు ధాన్యం సరఫరా స్తంభించి మళ్లీ ధరలు పెరిగే ప్రమాదం పొంచిఉంది. -
నదిలో దిగితేనే దాహం తీరేది..
శ్రీకాకుళం: ఎల్.ఎన్.పేట మండలంలోని 38 గ్రామాల ప్రజల మంచినీటి అవసరాలు తీర్చాల్సిన మెగా రక్షిత పథకం ద్వారా సక్రమంగా నీటి సరఫరా జరగడం లేదు. తరచూ పైపుల లీకేజీలు ఏర్పడుతున్నాయి. ఈ సమస్య అధికారుల దృష్టిలో ఉన్నా పట్టించుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి. ఇటీవల ఓసారి వారం రోజులు పాటు 38 గ్రామాలకు నీటి సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు చాలా ఇబ్బంది పడ్డారు. సమీపంలోని వంశధార తీరంలో చలమలు తవ్వి ఊరిన నీటిని తెచ్చుకొని అవసరాలు తీర్చుకున్నారు. వారి సమస్య కొంత తీరినప్పటికీ దబ్బపాడు గ్రామస్తులకు మాత్రం కష్టాలు తప్పలేదు. మూడు నెలలుగా రక్షిత పథకం నుంచి నీటి సరఫరా నిలిచిపోయింది. దీంతో గొంతు తడుపుకోవడానికి చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఉన్న బోర్లు పనిచేయకపోవటం, పనిచేసినా వాటినీరు తాగేందుకు, వంట అవసరాలకు పనికిరావు. దీంతో వంశధార నదిలోని చలమల నుంచి సేకరించిన నీటినే వంట అవసరాలకు, తాగేందుకు ఉపయోగిస్తున్నారు. గత నాలుగు రోజులుగా నదిలో నీటి ప్రవాహం పెరిగినప్పటికీ.. తప్పనిసరి పరిస్థితిలో నడుమ లోతు నీటిలో దిగి వెళ్లి ఇసుక దిబ్బలపై చలమగొయ్యిలు తవ్వి నీటిని తెచ్చుకుంటున్నామని మాజీ సర్పంచ్ జమ్మి పద్మావతితో పాటు పలువురు మహిళలు తెలిపారు. ఆర్థికంగా ఉన్నవారు ఆటోలు, ద్విచక్ర వాహనాలపై పక్కనున్న గ్రామాలకు వెళ్లి క్యాన్లతో నీటిని తెచ్చుకుంటున్నారన్నారు. నీటి కష్టాలపై పది రోజుల క్రితం సర్పంచ్ ముద్దాడ మోహినితో పాటు పలువురు యువకులు ఎంపీడీఓకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోయిందని గ్రామస్తులు అందోళన వ్యక్తం చేస్తున్నారు. మండలానికి పది నెలలుగా ఆర్డబ్ల్యూఎస్ జేఈ లేకపోవటం, ఇన్చార్జి జేఈ ఎవరో కూడా తెలియకపోవటంతో సమస్య పరిష్కారం కాలేదంటున్నారు. రెండు రోజుల్లో పరిష్కరిస్తాం దబ్బపాడు గ్రామస్తులు ఎదుర్కొంటున్న నీటి సమస్యను ఎంపీడీవో ఆర్.కాళీప్రసాదరావు దృష్టికి తీసుకెళ్లాగా రెండు రోజుల్లో సమస్య పరిష్కరిస్తామన్నారు. ప్రత్యేక అధికారి కె.రామారావు, ఆర్డబ్ల్యూఎస్ జేఈతో కలసి పైపులైన్‌ను పరిశీలించామన్నారు. 800 మీటర్ల పైపు లైన్ పాడవ్వటం, పాత కాంట్రాక్టర్ మారి కొత్త కాంట్రాక్టర్ రావటం, కాంట్రాక్టు ఒప్పందం ప్రకారం నిధులు విడుదల కాకపోవడం వంటి సమస్యల కారణంగా జాప్యం జరిగిందన్నారు. -
వాన నీటిని ఒడిసి పట్టండి
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో జల సంక్షోభం సవాలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ వాన నీటిని ఒడిసి పట్టుకోవాల్సిన ఆవశ్యకత ఉందని ప్రధాని నరేంద్రమోదీ తెలిపారు. రాబోయే తరాల పట్ల బాధ్యతను ప్రస్తుత తరం నిర్వర్తించాల్సి ఉందన్నారు. ప్రభుత్వ విధానాలు, నిర్ణయాల్లో జల పాలన ప్రాధాన్య అంశంగా తీసుకుందన్నారు. ‘కెన్–బెత్వా’నదుల అనుసంధానం ప్రాజెక్టు కార్యరూపం తీసుకురావడానికి సోమవారం ఒప్పంద పత్రాలపై ప్రధాని మోదీ సమక్షంలో ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్, మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్, జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌లు సంతకం చేశారు. ఈ సందర్భంగా జలశక్తి అభియాన్–‘క్యాచ్ ద రెయిన్’ప్రచార ఉద్యమాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించిన ప్రధాని మోదీ పలు రాష్ట్రాలకు చెందిన సర్పంచులు, వార్డు సభ్యులనుద్దేశించి మాట్లాడారు. జల భద్రత, తగిన జలనిర్వహణ లేకపోతే సత్వర అభివృద్ధి సాధ్యం కాదన్నారు. వర్షాకాలం సమీపించే లోగా చెరువులు, బావుల సామర్థ్యాన్ని పెంచేందుకు పూడికతీసి, శుభ్రం చేసి సిద్ధంగా ఉంచాలనీ, ఈ పనులకు ఉపాధి హామీ పథకం నిధులను పూర్తిగా వినియోగించుకోవాలని తెలిపారు. రానున్న 100 రోజుల్లో ఈ పనులను పూర్తి చేయాలన్నారు. దేశాభివృద్ధి, దేశ స్వావలంబన, దార్శనికత జల వనరులు, నదుల అనుసంధానంపై ఆధారపడి ఉన్నాయన్నారు. ఆరేళ్లుగా జలాలకు తగిన ప్రాధాన్యం ఇచ్చామన్నారు. ప్రధానమంత్రి కృషి సింఛాయి యోజన, హర్ ఖేత్ కో పానీ , ఒక్కొక్క నీటి చుక్కకు మరింత అధిక పంట ప్రచార ఉద్యమాల గురించి, నమామీ గంగే మిషన్, జలజీవన్ మిషన్, అటల్ భుజల్ యోజనల గురించి మాట్లాడుతూ.. పనులు శరవేగంగా సాగుతున్నాయన్నారు. వర్షపు నీటిని సమర్థంగా వినియోగించుకోగలిగితే భూగర్భ జలాలపై ఆధారపడడం తగ్గుతుందన్నారు. క్యాచ్ ద రెయిన్ కార్యక్రమం మార్చి 22 నుంచి నవంబర్ 30వ తేదీ వరకు అమలు చేస్తామన్నారు. దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న జలశపథం కార్యక్రమంలో అందరూ శపథం చేయాలన్నారు. దేశంలో జలసంక్షోభం రాకుండా ఉండడానికి సత్వర కృషి చేపట్టాల్సి ఉందని,అందులో భాగంగా కెన్–బెత్వా అనుసంధానం ఉందన్నారు. నీటి నాణ్యత పరీక్షల్లో గ్రామీణ ప్రాంతలోని మహిళల్ని భాగస్వాములను చేశామన్నారు. కరోనా కాలంలో 4.5 లక్షల మందికి శిక్షణ ఇచ్చామని, ప్రస్తుతం గ్రామంలో కనీసం ఐదుగురు నీటి నాణ్యత పరీక్ష చేయగలిగే మహిళలు ఉన్నారని ప్రధాని తెలిపారు. జల పాలనలో మహిళలు భాగస్వామ్యం అవుతున్న కొద్దీ ఉత్తమ ఫలితాలు సాధించగలమని ప్రధాని మోదీ పేర్కొన్నారు. కెన్–బెత్వా నదుల అనుసంధానానికి యూపీ, ఎంపీల ఒప్పందంతో దేశంలో నదుల అనుసంధాన కార్యక్రమం ప్రారంభమైందని కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ పేర్కొన్నారు. గోదావరి–కావేరి నదుల అనుసంధానంపై రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకొచ్చి ఓ అంగీకారానికి రావాలన్నారు. రాష్ట్రాల అంగీకారం తర్వాతే కేంద్రం ముందుకెళ్తుందని షెకావత్ స్పష్టం చేశారు. రాష్ట్రాలపై చర్చిస్తాం: శ్రీరాం వెదిరె నదుల అనుసంధానం టాస్క్‌ఫోర్స్ చైర్మన్ శ్రీరాం వెదిరె మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా 256 జల సంక్షోభం జిల్లాలోని 1529 బ్లాకుల్లో జలశక్తి అభియాన్ తొలిదశ 2019లో ప్రారంభించామన్నారు. రెండోదశలో పట్టణ,గ్రామీణ ప్రాంతాలపై దృష్టి సారించామన్నారు. శాస్త్రీయ నీటి సంరక్షణ ప్రణాళిక నిమిత్తం జిల్లాకు రూ.2లక్షల చొప్పున గ్రాంటు ఇచ్చినట్లు తెలిపారు. దేశవ్యాప్తంగా 30 నదుల అనుసంధానం ప్రాజెక్టులు చేపడుతున్నామన్నారు. కెన్–బెత్వా తర్వాత గోదావరి–కావేరి అనుసంధానంపై దృష్టి సారిస్తున్నామన్నారు. ప్రాజెక్టు సమగ్ర వివరణాత్మక నివేదిక (డీపీఆర్) తయారీ దశలో ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చించి ప్రాజెక్టుపై ముందుకెళ్తామని శ్రీరాం వెదిరె తెలిపారు. -
నీళ్ల డ్రమ్ములకు తాళం.. ఎందుకంటే..
భోపాల్: భానుడి భగభగలను సైతం లెక్కచేయక కిలోమీటర్ల దూరం వెళ్లి తెచ్చుకున్న నీళ్లు చోరీకి గురవడం ఆ గ్రామస్తులను ఆవేదనకు గురి చేసింది. దీంతో నీళ్లు నింపిన డ్రమ్ములకు తాళం వేసి ఒక్కో నీటి బిందువును ఎంతో జాగ్ర్తత్తగా కాపాడుకుంటున్నారు. వివరాలు.. మధ్యప్రదేశ్‌లోని ఝబువా జిల్లా ఝాన్సార్ గ్రామంలో తీవ్ర నీటి ఎద్దడి ఉంది. భూగర్భ జలాలు అడుగంటి పోవడంతో నీటి సంక్షోభం ఏర్పడింది. దీంతో ఆ గ్రామ ప్రజలు దాదాపు మూడు కిలోమీటర్ల నుంచి నీళ్లు మోసుకువస్తున్నారు. అయితే కొంతమంది మాత్రం ఇలాంటి కష్టమేమీ పడకుండానే పక్క వాళ్ల నీళ్లు కొట్టేసి.. అవసరాలు తీర్చుకుంటున్నారు. ఈ నేపథ్యంలో నీటి దొంగలకు చెక్‌పెట్టాలనుకున్న బాధితులు.. డ్రమ్ములకు తాళం వేయడం ప్రారంభించారు. ఈ విషయం గురించి గ్రామస్తులు మాట్లాడుతూ.. ‘‘ మా గ్రామంలో నీటి కొరత ఉంది. ఎంతో దూరం నడిచి నీళ్లు తెచ్చుకుంటే కొంతమంది వాటిని దొంగలిస్తున్నారు. అందుకే ఈ పని చేశాం’’అని చెప్పుకొచ్చారు. ఇక గ్రామ ప్రజల సమస్యను జిల్లా ప్రజారోగ్య, ఇంజనీరింగ్ విభాగం ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎన్ఎస్ భిడే దృష్టికి తీసుకువెళ్లగా... ‘‘ వేసవిలో జిల్లాలో నీటి ఎద్దడి ఎక్కువగా ఉంటుంది. చేతిపంపులు పనిచేయడం లేదు. వాటిని బాగు చేయించి.. ప్రజల సమస్యలు తీరుస్తాం’’అని పేర్కొన్నారు. -
ఒక్క బొట్టు కూడా వృధా చేయకూడదు
-
ప్రళయం నుంచి పాఠాలు.. తొలిసారి వాటర్ బడ్జెట్
అనేక జీవనదులకు పుట్టినిళ్లు భారతదేశం. దేశంలో ఎన్నో జీవ నదులు ఉన్నప్పటికీ కొన్ని రాష్ట్రాల్లో అతివృష్టి, మరికొన్ని రాష్ట్రాల్లో అనావృష్టితో నీటి కొరత ఏర్పడుతోంది. దీని వల్ల ప్రజలు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా గడిచిన దశాబ్ధాల కాలంలో తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్న పట్టణాలను మనం చూస్తున్నం. ముంబైలోని లాథూర్కి నీటి సమస్యను పరిష్కరించేందుకు అక్కడి ప్రభుత్వం ప్రత్యేక రైళ్ల ద్వారా నీటిని తరలించిన విషయం తెలిసిందే. తాజాగా ఇదే పరిస్థితి చెన్నై మహానగరంలో కూడా సంభవించింది. ఇంతటి నీటి సమస్య గత వందేళ్లలో కూడా రాలేదని చెన్నై వాసులు చెబుతున్నారు. అయితే ఈ పరిస్థితి రాకముందే కేరళ కళ్లుతెరిచింది. దేశంలో తొలిసారి వాటర్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టబోతోంది. తిరువనంతపురం: భవిష్యత్తులో వచ్చే నీటి సమస్యను ఎదుర్కొనేందుకు కేరళ రాష్ట్రం ప్రణాళికలను రచిస్తోంది. దీనిలోభాగంగానే ప్రతి ఏటా వాటర్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. రాష్ట్రంలో ఎంతనీటి లభ్యత ఉంది. ఎంత అవసరం కానుంది, వంటి అంశాలను పొందుపరచనుంది. దాని ఆధారంగా ప్రాజెక్టులకు రూపకల్పన కూడా చేయాలని నిర్ణయించింది. పక్క రాష్ట్రాల కష్టాలను చూసి భవిష్యత్తులో రాబోయే నీటి కొరతను దృష్టిలో పెట్టుకొని కేరళ జాగ్రత్త పడుతోంది. నీటి వృథాను అరికట్టేందుకు ముందుగానే చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగానే వాటర్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టబోతోంది.కేరళలో ఎంత నీరు అందుబాటులో ఉంటుంది, ఎంత నీరు వాడుకలో ఉంటుంది, భవిష్యత్తులో ఎంత నీరు అవసరం, అదనపు నీటి కోసం ఉన్న వనరులేంటి? వంటి అంశాల్ని బడ్జెట్లో వివరించబోతోంది. తొలి రాష్ట్రం కేరళనే.. అవసరాల దృష్టిలో ఉంచుకుని భవిష్యత్తులో నీటి వాడకం మరింత పెరుగుతుందని కేరళ ప్రభుత్వం అంచనా వేస్తోంది. ప్రధానమైన అంశం ఏంటంటే... దేశంలో ఇలాంటి బడ్జెట్ ప్రవేశపెడుతున్న తొలి రాష్ట్రం కేరళనే. నీటిని ఎలా పొదుపుచెయ్యాలి, అందుకోసం ప్రభుత్వం ఏం చెయ్యాలి, ప్రజలు ఏం చెయ్యాలి అనే అంశాల్ని ఈ బడ్జెట్లో చెప్పబోతున్నారు.అలాగే దీనిపై ప్రజలకు, అధికారులకు అవగహన కూడా కల్పించాలని ప్రభుత్వం భావిస్తోంది. స్థానిక అధికారులు, నీటి పారుదల శాఖ అధికారులు, మంత్రులు అందరూ కలిసి ఈ ప్రత్యేక బడ్జెట్‌ను రూపొందిస్తున్నారు. తద్వారా ఏ ప్రాంతంలో ఎంత నీరు తెలుసుకునే వీలు ఉంటుందని సులువుగా తెలుసుకునే అవకాశం ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్రంలో ఎక్కడైనా నీటి కొరత ఉంటే.. అక్కడికి నీటిని ఎలా తరలించాలి, అందుకోసం ఏయే ప్రాజెక్టులు చేపట్టాలి, అంచనా ఖర్చులు ఎంత అన్నది బడ్జెట్లో పొందుపరచే అవకాశం ఉంది. ప్రళయం నుంచి పాఠాలు.. నదులు, చెరువు, బావులు, కుంటలు, రిజర్వాయర్లు ఇలా అన్నింటిలో ఉన్న మొత్తం నీటిని అంచనా వేసి బడ్జె్ట్లో చెప్పబోతున్నారు. డిమాండ్‌కి తగినట్లు సప్లై చేసేందుకు ఉన్న మార్గాల్ని వివరించనున్నారు. ఈ సందర్భంగా పాతవైపోయిన రిజర్వాయర్లు, డ్యాములు, ఇతరత్రా కట్టడాల్ని తిరిగి నిర్మించేందుకు, రిపేర్లు చేసేందుకు ప్రభుత్వం దృష్టి సారించబోతోంది. నీటి ఇంజినీరింగ్ అధికారులు, నీటి పారుదల విభాగం, వ్యవసాయ శాఖ, పశు సంవర్ధక శాఖ, స్థానిక సంస్థలు అందరూ ఇందులో భాగస్వామ్యం కానున్నారు. అన్నీ అనుకూలిస్తే..ఈ ఏడాది డిసెంబర్ 1 నుంచి అమల్లోకి తెచ్చేందుకు కేరళ సర్కార్ ప్రయత్నిస్తోంది. కాగా పూర్తిగా కొండ ప్రాంతమైన రాష్ట్రం కావున.. వరదలను నివారించేందుకు చర్యలు కూడా చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. గత ఏడాది సృష్టించిన ప్రళయం కారణంగా కేరళ అతలాకుతలమయిన విషయం తెలిసిందే. దాని నుంచే దైవభూమి పాఠాలు నేర్చుకున్నట్లుంది. -
నీళ్ల నిలువను, విలువను తెలిపే థీమ్‌పార్క్
బొట్టు.. బొట్టును ఒడిసిపడితేనే క్షేమం.. లేకుంటే క్షామం.. ఈ మాట అక్షరసత్యమవుతోంది.. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్‌లో.. వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో వాన నీటి సంరక్షణ తాలూకు ప్రాముఖ్యాన్ని ప్రతి ఒక్కరూ గుర్తెరగాల్సిన తరుణమిది.. అందుకే తాజాగా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారకరామారావు కూడా దీనిపై ట్విట్టర్ వేదికగా పిలుపునిచ్చారు. వాన నీటి సంరక్షణపై ఆసక్తి కలిగినవారు తప్పనిసరిగా రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ థీమ్ పార్కును సందర్శించాలంటూ దానికి సంబంధించిన పలు చిత్రాలను షేర్ చేశారు.. ఇంతకీ ఎక్కడుందీ థీమ్ పార్క్.. ఏమిటి ఉపయోగం అన్న వివరాలను ఓసారి చూసేద్దామా.. సాక్షి, హైదరాబాద్ : నగరంలోని జూబ్లీహిల్స్ రోడ్‌నం.51లో జలమండలి ఆధ్వర్యంలో రూ.3 కోట్ల వ్యయంతో ఈ థీమ్‌పార్క్‌ను ఏర్పాటు చేశారు. ఇందులో వర్షపునీటిని ఒడిసిపట్టడానికి వీలుగా 42 రకాల వినూత్న విధానాలపై అందరికీ అవగాహన కల్పిస్తున్నారు. గతేడాది అక్టోబరులో ఈ పార్క్‌ను ప్రారంభించారు. ఇప్పటివరకు పదివేలమందికి పైగా సందర్శించారు. భూగర్భ జలాలు అడుగంటిన నేపథ్యంలో ఇల్లు, కార్యాలయం, పాఠశాల, అపార్టుమెంటు ఇలా ఎక్కడైనా నేలపై కురిసే ప్రతీ వర్షపునీటి బొట్టును ఒడిసిపట్టి భూగర్భంలోకి చేర్చేందుకు వీలుగా విభిన్నరకాల ఇంకుడు గుంతల వెరైటీలు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. మీ ఆసక్తి.. చేసే వ్యయం ఆధారంగా ఒక మోడల్‌ను ఎన్నుకొని మీ ఇంటి ఆవరణలో ఏర్పాటు చేసుకోవచ్చు. ఇందుకు సంబంధించిన సాంకేతిక అంశాలను ఈ థీమ్‌పార్క్‌ను సందర్శించి తెలుసుకోవచ్చు. అంతేనా.. అడవుల ప్రాముఖ్యాన్ని వివరించే ‘మాట్లాడే చెట్టు’.. వర్షపు నీటి సంరక్షణపై వీడియో గేమ్స్ ఇలా ఎన్నో ఉన్నాయి.. పార్కు వేళలు ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 వరకూ.. ప్రవేశం ఉచితం.. ఎక్కువ మంది బృందంగా వెళ్లాలనుకుంటే ముందుగా స్లాట్ బుక్ చేసుకోవాలి. జలమండలి అధికారిక వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.హైదరాబాద్‌వాటర్.జీఓవీ.ఐఎన్‌ను సంప్రదించి అందులో థీమ్‌పార్క్ రిజిస్ట్రేషన్ యువర్‌స్లాట్ అన్న లింక్‌కు వెళ్లి వివరాలు నమోదు చేసుకోవాలి లేదా జలమండలి ప్రత్యేకాధికారి సత్యనారాయణను 9989985102 నంబరులో సంప్రదించవచ్చు. మరింకేంటి ఆలస్యం.. నీటి బొట్టును నేల తల్లికి అందించే ఈ మహాయజ్ఞంలో మనమూ భాగస్వాములమవుదాం. చల్ చలోచలో.. -
నీళ్ల కోసం ఇంత దారుణమా!
సాక్షి, లక్నో: ఉత్తరప్రదేశ్‌లో మరో ఘోర విషాదం సంభవించింది. నీటి వివాదంలో గర్భిణీని కాల్చి చంపిన ఘటన కలకలం రేపింది. ఈటా జిల్లా సమౌర్ గ్రామంలో బుధవారం ఈ ఉదంతం చోటు చేసుకుంది. ముంచుకొస్తున్న నీటి కొరత ముప్పునకు అద్దం పట్టిన ఘటన ఇది. నీళ్ల కోసం వాగ్వాదానికి దిగిన కొంతమంది వ్యక్తులు గర్భిణీ అన్న కనికరం కూడా లేకుండా ఓ మహిళపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. దీంతో ఆమె అక్కడికక్కడే కుప్ప కూలిపోయింది. హుటాహుటిన ఆమెను ఆసుపత్రికి తరలించినప్పటికీ ఫలితం లేదు. అప్పటికే ఆమె చనిపోయినట్టుగా వైద్యులు ధృవీకరించారు. బాధిత మహిళను మమత (25) గా గుర్తించారు. నిందితులు గతంలో కూడా ఇతర గ్రామస్తులతో ఘర్షణ దిగారని గ్రామపెద్ద భాను ప్రతాప్ మీడియాకు తెలిపారు. గ్రామానికి చెందిన కొంతమంది వ్యక్తులను నిందితులుగా తేల్చిన పోలీసులు ప్రధాన నిందితుడు సంతోష్‌ను అరెస్ట్ చేశారు. -
పట్టాలపై 2.5 మిలియన్ లీటర్ల నీరు..!
సాక్షి, చెన్నై : భూగర్భజలాలు అడుగంటిపోవడం, నైరుతి రుతుపననాల మందగనంతో వర్షాలులేక చైన్నైలో తీవ్ర నీటి ఎద్దడి నెలకొంది. నగరానికి నీరందించే నాలుగు సరస్సులు ఎడారిని తలపిస్తున్నాయి. దీంతో గత నాలుగు నెలలుగా చైన్నై వాసులు నీటి సమస్యతో సతమతమవుతున్నారు. అక్కడ రోజుకు 200 మిలియన్ లీటర్ల నీటి కొరత ఉందంటే పరిస్థితి ఎంత దారణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక ఈ సమస్యపై తమకు సాయమందించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరడంతో రైల్వేశాఖ ముందుకొచ్చింది. రైళ్లద్వారా కొన్ని ప్రాంతాలకు నీరందించడానికి సుమారు 2.5 మిలియన్ లీటర్ల నీటిని మోసుకొచ్చే రెండు వాటర్ వ్యాగన్ల రైళ్లను అందుబాటులోకి తెచ్చింది. చెన్నైకి 217 కిలోమీటర్ల దూరంలోని వేలూరులోని జోలార్‌పెట్టాయ్ నుంచి ఈ రైళ్లు బయలుదేరాయి. విల్లివక్కం రైల్వే స్టేషన్‌కు శుక్రవారం చేరుకున్నాయి. మరికొద్దిసేపట్లో వాటిని రాష్ట్ర మంత్రులు ప్రారంభించిన అనంతరం విల్లివక్కం, కిల్పాక్ ప్రాంతాలకు నీటిని పైపుల ద్వారా సప్లయ్ చేయనున్నారు. ఒక్కో రైలు 50 వేల లీటర్ల నీటి సామర్థ్యంగల 50 వ్యాగన్లను కలిగి ఉండటం విశేషం. రెండు రైళ్ల ద్వారా రోజుకు 11 మిలియన్ లీటర్ల నీరు సరఫరా కానుంది. 200 మిలియన్ల కొరతకు కేవలం 11 మిలియన్ల నీరు మాత్రమే రవాణా అవుతుండటం గమనార్హం. -
కర్నూలుకు ‘జల’దరింపేనా..
సాక్షి, కర్నూలు : కర్నూలు నగరానికి నీటి ముప్పు పొంచి ఉంది. ఇప్పటికే పలు కాలనీల్లో బిందెడు నీటి కోసం నానా అవస్థలు పడుతున్నారు. వర్షాభావ పరిస్థితుల వల్ల జలాశయాలు అడుగంటిపోవడం, తుంగభద్ర నదికి ఇప్పటికీ వరద రాకపోవడం, ప్రత్యామ్నాయ వనరులు అందుబాటులో లేకపోవడంతో రానురాను పరిస్థితులు ఆందోళనకరంగా మారుతున్నాయి. ఏప్రిల్‌లో పందికోన రిజర్వాయర్ నుంచి గాజులదిన్నె ప్రాజెక్టు (జీడీపీ)కు తరలించిన నీటినే ఇప్పటికీ నగరవాసులకు సరఫరా చేస్తున్నారు. ఇవి కూడా త్వరలోనే ఖాళీ అయ్యే అవకాశముంది. ప్రత్యామ్నాయ మార్గాలు కన్పించకపోవడంతో చెన్నై కష్టాలను తలచుకుంటూ కందనవోలు ప్రజలు కూడా ఆందోళన చెందుతున్నారు. అడుగంటిన సుంకేసుల, జీడీపీ కర్నూలు ప్రజల దాహార్తి తీర్చడానికి సుంకేసుల ప్రధాన వనరు. తుంగభద్రపై ఉన్న ఈ జలాశయం ఇప్పటికే అడుగంటిపోయింది. శుక్రవారం నాటి లెక్కల ప్రకారం కేవలం 0.143 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఇది మహా అయితే ఆరేడు రోజులకు సరిపోతుంది. ఆలోపు తుంగభద్ర నదికి వరద వస్తే కష్టాల నుంచి గట్టెక్కవచ్చు. కానీ ఆ పరిస్థితి కన్పించడం లేదు. ఎగువభాగంలో వర్షాలు లేకపోవడంతో తుంగభద్ర జలాశయానికి సైతం వరదనీటి చేరిక లేక వెలవెలబోతోంది. ఇక రెండో ప్రధాన నీటి వనరు గాజులదిన్నె ప్రాజెక్టు (జీడీపీ). ప్రస్తుతం దీని నుంచే నీటిని సరఫరా చేస్తున్నారు. ఇది కూడా అడుగంటింది. ప్రస్తుతం 0.117 టీఎంసీల నీరు మాత్రమే నిల్వ ఉంది. ఈ నీరు ఐదు రోజులకు మించి చాలదని అధికారులు చెబుతున్నారు. రోజు విడిచి రోజు సరఫరా కర్నూలు, కోడుమూరు, పాణ్యం.. ఈ మూడు నియోజక వర్గాలకు చెందిన ప్రజలు నగర పాలక సంస్థ పరిధిలో నివసిస్తున్నారు. పాణ్యం నియోజకవర్గ పరిధిలోని కల్లూరు, కోడుమూరు నియోజకవర్గంలోని మామిదాల పాడు, మునగాలపాడు, స్టాంటన్ పురం కాలనీలకు రోజు విడిచి రోజు నీటిని సరఫరా చేస్తున్నారు. శివారు కాలనీలలో పైపులైన్ ఇబ్బందుల దృష్ట్యా మూడు రోజులకు ఒకసారి ఇస్తున్నారు. కర్నూలు నియోజకవర్గ పరిధిలో మాత్రం నిన్నటి వరకు ప్రతి రోజూ నీటిని సరఫరా చేసేవారు. అయితే.. ప్రస్తుతం నీటి నిల్వలు అడుగంటిపోవడంతో పాటు ప్రత్యామ్నాయ మార్గాలు కనిపించకపోవడంతో నగర పాలక పరిధిలోని అన్ని కాలనీలకు రోజు విడిచి రోజు సరఫరా చేస్తున్నట్లు ఎస్ఈ వేణుగోపాల్ వెల్లడించారు. వర్షాలు రాకపోతే పరిస్థితి మరింత ఇబ్బంది కరంగా మారే అవకాశముందని, కాబట్టి పొదుపు చర్యలు చేపడుతున్నామని ఆయన తెలిపారు. ట్యాంకర్ల ద్వారా నీరు వృథా కాకుండా చూస్తున్నామని, పబ్లిక్ కుళాయిలకు బిరడాలు బిగించామని వివరించారు. సమ్మర్ స్టోరేజీ ట్యాంకులు ఎండుతున్నాయి కర్నూలు నగరవాసులకు వేసవి కాలంలో నీటి కష్టాలు రాకూడదని సమ్మర్ స్టోరేజీ ట్యాంకు నిర్మించారు. దీని సామర్థ్యం 4,410 మిలియన్ లీటర్లు. పూర్తి స్థాయిలో నీటిని నిల్వ చేస్తే నగరానికి 45 రోజుల పాటు సరఫరా చేయొచ్చు. అయితే 2001వ సంవత్సరంలో నిర్మించిన ఈ ట్యాంకులో ఏనాడూ పూర్తిస్థాయిలో నిల్వ చేసిన దాఖలాలు లేవు. ప్రస్తుతం ఇందులో ఉన్న నీరు ఆరు రోజులకు మాత్రమే సరిపోతుంది. మొత్తంగా సుంకేసుల, జీడీపీ, సమ్మర్ స్టోరేజీ ట్యాంకుల్లోని నీరు 20 రోజులకు మించి రాదు. ఆ తర్వాత పరిస్థితి ఏంటన్న ఆందోళన నగరవాసులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. -
జలగండం
-
తోడి పారేస్తున్నాం..!
నైరుతీ రుతుపవనాలు ఆశించిన వర్షాన్ని ఇవ్వకపోవడంతో దేశంలో నీటి సంక్షోభం నెలకొంది. ఇప్పటికే చెన్నై, బెంగళూరు నగరాలు నీటి కొరతతో అల్లాడుతున్నాయనీ, 2020 నాటికి హైదరాబాద్, విజయవాడ సహా 21 నగరాల్లో తీవ్ర నీటి కొరత ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. చెన్నైలో ప్రజలకు అందించే నీటిపై రేషన్ విధించగా, బెంగళూరులో నీటికొరత కారణంగా కొత్త భవన నిర్మాణాలను ఐదేళ్లు నిషేధించాలని ప్రభుత్వం యోచిస్తోంది. కేంద్రం ఇప్పటికే జలశక్తి మంత్రిత్వశాఖను ఏర్పాటుచేసింది. అవసరాల కంటే ఎక్కువ వర్షపాతం నమోదవుతున్నప్పటికీ నీటి కొరత ఎందుకొచ్చింది? నీటి కోసం భారీ క్యూలైన్లలో నిల్చోవాల్సిన పరిస్థితి ఎందుకు దాపురించింది. మితిమీరిన వాడకం.. అమెరికా, చైనాలతో పోల్చుకుంటే భారత్‌లో భూగర్భ జలాలను మితిమీరి వాడేస్తున్నారని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం మన అవసరాల్లో సగానికిపైగా భూగర్భ జలాలే తీరుస్తున్నాయి. ఇందులో సాగుకు 89 శాతం, గృçహావసరాలకు 9 శాతం, పారిశ్రామిక అవసరాలకు 2 శాతం వాడేస్తున్నాం. అయితే జనాభా పెరుగుదల, పట్టణీకరణ కారణంగా భూగర్భ జలాలు అంతకంతకూ తగ్గిపోతున్నాయి. ప్రజలకు మంచినీటి సరఫరాలోనూ తీవ్రమైన వ్యత్యాసాలు నమోదవుతున్నాయి. అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం ఓ వ్యక్తికి రోజుకు 150 లీటర్ల నీరు కావాల్సి ఉండగా, దేశంలో 81 శాతం గృహాలకు రోజుకు 40 లీటర్ల నీటిని మాత్రమే ప్రభుత్వం సరఫరా చేయగలుగుతోంది. వరుణదేవుడు కరుణించినా.. దేశంలో నీటి కటకటకు ఇష్టారాజ్యంగా నీళ్లను వృథా చేయడం కూడా ఓ కారణమేనని సెంట్రల్ వాటర్ కమిషన్ చెబుతోంది. భారత్‌కు ఏటా 3,000 బిలియన్ క్యూబిక్ మీటర్ల నీరు అవసరం. కానీ ఏటా 4 వేల బిలియన్ క్యూబిక్ మీటర్ల వర్షం కురుస్తోంది. వాన నీటిని నిల్వ చేసుకోలేకపోవడంతో అదంతా వృథా అవుతోంది. వర్షపు నీటిలో 8 శాతాన్ని మాత్రమే సంరక్షిస్తున్నారు. నీటిని శుద్ధిచేసి పునర్వినియోగించే విషయంలోనూ భారత్ బాగా వెనుకబడింది. పైపుల ద్వారా సరఫరా అయ్యే నీటిలో 40 శాతం వృ«థా అవుతోంది. చుట్టంగా మారిన చట్టాలు.. భారత్‌లో ప్రస్తుతం భూగర్భ జలాల వినియోగ చట్టం–1882 ఇంకా అమలవుతోంది. దీనిప్రకారం భూయజమానికి తన ఇల్లు, పొలంలో భూగర్భ జలాలపై సర్వాధికారాలు ఉన్నాయి. దీంతో ప్రజలంతా ఇష్టానుసారం బోర్లు వేసి నీటిని తోడేస్తున్నారు. దీన్ని నియంత్రించేందుకు కేంద్రం 2011లో భూగర్భ జలాల నిర్వహణ బిల్లును రూపొందించింది. తమ భూముల్లోని నీటిని ఇష్టానుసారం వాడుకునే హక్కు ప్రజలకు ఉండదని నిబంధనలు చేర్చింది. అయితే నీటి అంశం రాష్ట్రాల జాబితాలో ఉండటంతో ఏకాభిప్రాయం సాధ్యం కాక ఇది మూలనపడింది. దీనికితోడు నదులు, సరస్సులు, చెరువుల ఆక్రమణలతో పరిస్థితి మరింత తీవ్రం అవుతోంది. పారిశ్రామికీకరణ కారణంగా గంగా తీరం లో 80 శాతం సరస్సులు తీవ్రంగా కలుషితమయ్యాయి. ‘2040 నాటికి మన దేశ జనాభాలో 40 శాతం మందికి తాగేందుకు నీళ్లు కూడా దొరకవు. 2021 నాటికి ఢిల్లీ సహా 21 నగరాల్లో భూగర్భ జలాలు కనుమరుగైపోతాయి’ అని నీటి నిర్వహణ నిపుణుడు రాజేంద్ర సింగ్ హెచ్చరించారు. దేశంపై ప్రభావం ► నీటి దుర్వినియోగం కొనసాగితే 2050 నాటికి భారత్ జీడీపీలో 6 శాతాన్ని కోల్పోతుంది. ► ఆరోగ్యం, వ్యవసాయం, స్థిర–చరాస్తి రంగాలపై నీటి కొరత తీవ్ర ప్రభావం చూపనుంది. ► స్మార్ట్ సిటీల జాబితాలో ఉన్న షోలాపూర్ (మహారాష్ట్ర)లో నీటిఎద్దడితో పలు ప్రాజెక్టులు నిలిచిపోయాయి. ► కలుషిత నీటితో 21% అంటు వ్యాధులు వ్యాపిస్తున్నాయి ఊ డయేరియా కారణంగా దేశవ్యాప్తంగా రోజుకు 1600 మంది చనిపోతున్నారు. -
తిరుమల కొండకు నీటి కష్టాలు పొంచి ఉన్నాయి
-
చెన్నై నీటి సంక్షోభంపై రజనీ స్పందన
సాక్షి, చెన్నై: తమిళనాడు రాజధాని చెన్నైలో నెలకొన్న తీవ్ర నీటి ఎద్దడిపై దక్షిణాది సూపర్‌స్టార్ రజనీకాంత్ స్పందించారు. చెన్నైలో తీవ్రతరమవుతున్న నీటి సంక్షోభాన్ని ప్రభుత్వం సీరియస్‌గా తీసుకొని.. సత్వర పరిష్కారం కోసం చర్యలు చేపట్టాలని ఆయన కోరారు. నగరంలోని చెరువులు, రిజర్వాయర్లలో యుద్దప్రాతిపదికన పూడికలు తీసి వర్షపునీటిని సంరక్షించాలని సూచించారు. నీటి కొరతతో ఇబ్బంది పడుతున్న పలు ప్రాంతాలలో మంచినీరు సరఫరా చేస్తున్న రజనీ మక్కల్ మండ్రం సేవలను తలైవా అభినందించారు. పోస్టల్ బ్యాలెట్ అందని కారణంగా నడిగర్ సంఘం ఎన్నికలలో ఓటు వేయలేకపోవడం బాధ కలిగించిందని రజనీ తెలిపారు. -
‘నీటి సంక్షోభానికి అదే ప్రధాన కారణం’
సాక్షి, న్యూఢిల్లీ : నదుల అనుసంధానంతోనే నీటి సంక్షోభాన్ని పరిష్కరించగలమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ వి.విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. దేశంలో తాగునీరు, సాగునీరు సంక్షోభం - సవాళ్లు అనే అంశంపై బుధవారం రాజ్యసభలో జరిగిన చర్చలో విజయసాయి రెడ్డి మాట్లాడారు. రుతుపవనాల వైఫల్యమే నీటి సంక్షోభానికి ప్రధాన కారణమన్నారు. అంతరించి పోతున్న అడవులు మరో కారణమని తెలిపారు. నదుల అనుసంధానమే నీటి సంక్షోభానికి సరైన పరిష్కారం అన్నారు. కేంద్రం ప్రతిపాదించిన నదుల అనుసంధానంలో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లో గోదావరి - పెన్నా నదుల అనుసంధానం తక్షణమే చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. -
నేతలకు పట్టని ‘నేచర్’ సమస్యలు
సాక్షి, న్యూఢిల్లీ : ‘50 లక్షల జనాభా కలిగిన మెట్రోపాలిటన్ నగరం చెన్నై తాగునీరు కోసం తల్లడిల్లుతోంది. బిహార్‌లో వీచిన వడగాడ్పులకు ఇప్పటివరకు 150 మంది మరణించారు. దక్షిణాఫ్రికాలో స్థిరపడిన ఎన్ఆర్ఐ గుప్తా ఇంట్లో ఇటీవల జరిగిన పెళ్ళిలో 4000 కిలోల చెత్త మహాకూడింది’ గత కొన్ని వారాల్లో చోటుచేసుకున్న ఈ పరిణామాలన్నీ పర్యావరణ సమస్యకు సంబంధించినవే. రానున్న రోజుల్లో దేశం ఎంతటి పర్యావరణ సంక్షోభాన్ని ఎదుర్కొనే ప్రమాదం ఉందో ఈ పరిణామాలు సూచిస్తున్నాయి. అయినా ఇంతటి తీవ్రమైన అంశం ఎందుకు రాజకీయ నాయకులకు పట్టదో అర్థం కాదు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల సందర్భంగా పాకిస్థాన్ నుంచి పన్నుల వరకు పలు అంశాలు ప్రస్థావనకు వచ్చినప్పటికీ పర్యావరణ సమస్య మాత్రం పెద్దగా రాలేదు. ఏ ఎన్నికల సందర్భంగా కూడా ఈ సమస్యలు ప్రస్తావనకు రావు. క్యాన్సర్, టీబీ, ఎయిడ్స్, డయాబిటీస్ లాంటి రోగాలన్నింటి వల్ల చనిపోతున్న వారి కంటే వాయు కాలుష్యం వల్ల ఎక్కువ మంది మరణిస్తున్నారని గణాంకాలు తెలియజేస్తున్నాయి. 2020కల్లా దేశంలోని 21 నగరాల్లో భూగర్భ జలాలు ఇంకిపోతాయని ‘నీతి ఆయోగ్’ సంస్థ అంచనాలు. 2030 సంవత్సరం నాటికి దేశంలోని 40 శాతం నగరాలు మంచినీటికి కటకట లాడుతాయని అంచనాలు తెలియజేస్తున్నాయి. రానున్న ముప్పు నుంచి బయటపడాలంటే ఇప్పటి నుంచే దిద్దుబాటు చర్యలు తీసుకోవాలి. తాత్కాలిక ప్రయోజనాలు, అవసరాల మీద రాజకీయ నాయకులకు అంతటి దూరదష్టి ఉండడం కష్టమే. -
‘తన్నీర్’ కోసం తల్లడిల్లుతున్న తమిళనాడు
సాక్షి, చైన్నై : తమిళనాడు ‘తన్నీరు’ కోసం తల్లడిల్లిపోతోంది. ముఖ్యంగా 50 లక్షల మంది జనాభా కలిగిన తమిళనాడు రాజధాని చెన్నై నగరంలో మంచి నీళ్లు దొర క్క ప్రజల గొంతల తడారిపోతోంది. నగరానికి నీరందించే ప్రధాన రిజర్వాయర్ ‘లేక్ పుఝాల్’లో బుక్కెడు నీళ్లు లేవు. గత ఏడాది జూన్ 15వ తేదీన తీసిన శాటిలైట్ చిత్రంతో, సరిగ్గా ఏడాది తర్వాత గత ఆదివారం శాటిలైట్ తీసిన ఛాయా చిత్రాన్ని పోల్చి చూసినట్లయితే పరిస్థితి ఏమిటో అర్థం అవుతుంది. గతేడాది ఈపాటికి బాగానే నీళ్లు ఉండగా, ఈసారి ఎండిపోయి అట్టడుగున చిన్న బురద గుంట మిగిలిపోయింది. నగరానికి మంచినీరు సరఫరా చేసే మరో చిన్న రిజర్వాయర్ చెమ్మరమ్‌బాక్కమ్ రిజర్వాయర్ కూడా ఎండిపోవస్తోంది. ఈ పరిస్థితిపై అంతర్జాతీయ పత్రికయిన ‘న్యూయార్క్ టైమ్స్’ కూడా ప్రత్యేక వార్తా కథనాన్ని ప్రచురించింది. చెన్నైకి ఈపాటికి ఎప్పుడో వర్షాలు రావాలి. ఈసారి రుతుపవనాల రాక దేశవ్యాప్తంగా ఆలస్యం కాగా ఇప్పటికీ తమిళనాడుకు వర్షాలు రాలేదు. మంచినీటి కోసం తల్లడిల్లుతూ నగర ప్రజలో వీధుల్లోకి వచ్చి ఆందోళన చేసినా తేవడానికి నీళ్లు లేవంటూ రాజకీయ నాయకులు తప్పించుకు తిరుగుతున్నారు. తమిళనాట ప్రభుత్వాలకు ముందు చూపులేక పోవడం వల్ల పరిస్థితి ఇంతదూరం వచ్చింది. -
జలం కోసం నిరసన గళం
చెన్నై : తమిళనాడు రాజధాని చెన్నై సహా పలు ప్రాంతాల్లో నెలకొన్న తీవ్ర నీటి ఎద్దడిపై డీఎంకే ఆందోళన బాటపట్టింది. చెన్నైలో సోమవారం డీఎంకే ఆధ్వర్యంలో భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు. చపాక్ స్టేడియం వద్ద నిర్వహించిన నిరసన కార్యక్రమంలో డీఎంకే శ్రేణులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. నీటి సమస్యను పరిష్కరించడంలో పాలక ఏఐఏడీఎంకే ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని డీఎంకే నేతలు పాలక పార్టీపై విరుచుకుపడ్డారు. చెన్నైలో నగర ప్రజలతో పాటు ఐటీ కంపెనీలు, వివిధ పరిశ్రమలు తీవ్ర నీటి కొరతను ఎదుర్కొంటూ ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు తమిళనాడులో నీటి ఎద్దడిపై డీఎంకే సభ్యుడు టీఆర్ బాలు లోక్‌సభలో నోటీసు ఇచ్చారు. కాగా చెన్నైలో నీటి సమస్యను అధిగమించేందుకు అన్ని చర్యలు చేపడుతున్నామని తమిళనాడు ప్రభుత్వం స్పష్టం చేసింది. జోలార్‌పేట్ నుంచి రైళ్ల ద్వారా రోజుకు 10 మిలియన్ లీటర్ల నీటిని ప్రభుత్వం తీసుకువస్తుందని తమిళనాడు ముఖ్యమంత్రి ఈ పళనిస్వామి ఇప్పటికే ప్రకటించారు. కాగా చెన్నైలో తీవ్ర నీటికొరత నెలకొనడంతో ఐటీ కంపెనీలు తమ ఉద్యోగులను ఇంటి నుంచి పనిచేయాలని కోరిన సంగతి తెలిసిందే. -
చెమ్మ దొరకని చెన్నపట్నం
ఎండిపోయిన బోర్లు. నిండుకున్న రిజర్వాయర్లు. నీటికోసం తల్లడిల్లే పల్లెలు అనగానే మనకు వెంటనే గుర్తువచ్చేది మహారాష్ట్రలోని వెనుకబడిన మరఠ్వాడా, విదర్భ. నీటికోసం అల్లాడిపోతున్న మరాఠాలను ఆదుకునేందుకు ప్రత్యేకంగా రైలు భోగీలను ఏర్పాటు చేసి.. నీటిని తరలించిన పరిస్థితిని గతంలో లాతూర్‌లో చూశాం. కానీ ఇప్పుడు మహారాష్ట్ర సరసన తమిళనాడు చేరింది. తమిళనాట నీటి కటకట. నీరు కోసం తమిళ తంబీల తండ్లాట. నీటి చెమ్మ దొరకని చెన్నపట్నం. గుక్కెడు జలం కోసం జనం విలవిళ్లాడుతున్న పరిస్థితి. మొన్న మహారాష్ట్ర, నేడు తమిళనాడులో నీటి కోసం చిన్నపాటి యుద్ధలే జరుగుతున్నాయి. సాక్షి, చెన్నై: గుక్కెడు మంచినీళ్ల కోసం తమిళనాడులోని చెన్నై నగరం విలపిస్తోంది. మునుపెన్నడూ లేనంతగా తీవ్ర నీటి సంక్షోభంతో చెన్నై విలవిలలాడుతోంది. రిజర్వాయర్లలో నీళ్లు పూర్తిగా అడుగంటిపోయాయి. బోర్లు ఎండిపోయాయి. వాటర్ ట్యాంకర్ బుక్ చేసినా.. వస్తుందో రాదో తెలియని పరిస్థితి. బిందెడు నీళ్లు కావాలంటే.. లక్కీ డ్రాలో గెలవాల్సిందే. మంచినీళ్ల కోసం టోకెన్లు తీసుకోవాల్సిన పరిస్థితి. ఆఖరికి కాలకృత్యాలు తీర్చుకుందామన్నా ఎక్కడా నీళ్లు దొరకడం లేదు. వంటలకు నీళ్లు లేక హోటళ్లు మూతపడుతున్నాయి. నీటికోసం ఏకంగా యుద్ధాలే జరుగుతున్నాయి. ఒక ట్యాంకరు వస్తే చాలు నీళ్ల కోసం పెద్ద క్యూలలో ప్రజలు నిలబడుతున్నారు. గంటలకొద్దీ నీటికోసం క్యూలో నిలబడి సహనం కోల్పోయి గొడవలు పడుతున్నారు. తంజావూరులో నీటిని అక్రమంగా నిల్వ చేసుకుంటున్నారని ప్రశ్నించిన సామాజిక కార్యకర్త ఆనంద్ బాబును కొట్టి చంపారు. చెన్నైలో నీళ్ల పంపకాల విషయంలో జరిగిన గొడవలో మహిళపై పదునైన పరికరంతో దాడి చేశారన్న ఆరోపణలతో.. అసెంబ్లీ స్పీకర్ ధనపాల్ కారు డ్రైవర్ ఆదిమూలంను పోలీసులు అరెస్ట్ చేశారు. సూపర్ స్టార్ రజనీకాంత్ చేయూత... ఎక్కడ నీళ్లు ఎక్కువ వాడాల్సి వస్తుందోనని.. తమకిష్టమైన సాంబారు కూడా చేసుకోవడం లేదు తమిళ తంబీలు. ఇదీ ప్రస్తుతం తమిళనాడును వెంటాడుతున్న దుర్భర నీటి కష్టం. చెన్నైలో ఓవైపు నీటి ట్యాంకర్ల వద్ద నీటియుద్ధాలు జరుగుతుంటే.. మరోవైపు అధికార, విపక్ష పార్టీలు కత్తులు దూసుకుంటున్నాయి. నీటిఎద్దడిపై డీఎంకే ఆందోళన చేస్తుంటే.. ఏమంత ఎద్దడి లేదంటూ కొట్టిపారేస్తోంది అధికార అన్నాడీఎంకే. జలాశాయాలు అడుగంటిపోవడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని.. పక్క రాష్ట్రాల నుంచి చైన్నై రావాల్సిన నీరు రావడం లేదని చెబుతోంది పళని సర్కార్. ప్రభుత్వ వైఫల్యంపై సాక్షాత్తు మద్రాస్ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. నీటి ఎద్దడి తీవ్రరూపం దాల్చే వరకు ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయని తీవ్రంగా మందలించింది. అప్పటికి గాని సీఎం పళనిస్వామి పరిస్థితిపై మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేయలేదు. ప్రజల కష్టాలను చూసి చలించిన సూపర్ స్టార్ రజనీకాంత్ తన సొంత ఖర్చుతో నీటి ట్యాంకర్లను ఏర్పాటు చేసి.. ప్రజల దాహర్తిని తీర్చే ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని బట్టి చూస్తే తమిళనాడులో పరిస్థితి ఏవిధంగా ఉండో అర్థమవుతోంది. వాటర్ ట్యాంకర్ బుకింగ్.. సాధారణంగా చెన్నై నగరం నీటి పేరుచెబితే భయంతో వణుకుతుంది. ఎందుకంటే.. దేశంలో వరదల తాకిడికి ఎక్కువగా గురయ్యే నగరం అదే. కానీ, ఇప్పుడదే చెన్నై నీటి చుక్క కోసం తపిస్తోంది. తీవ్ర నీటి ఎద్దడితో తమిళ ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. కళ్లెదుట మహా సముద్రం కనిపిస్తున్నా.. కనీసం గొంతు తడుపుకోవడానికి గుక్కెడు నీళ్లు దొరక్క ప్రజలు విలవిలలాడుతున్నారు. స్నానాలు చేసి రెండు, మూడులు రోజులవుతున్నా భరిస్తున్న చెన్నై వాసులు.. మంచినీటి కోసం మాత్రం దాహం.. దాహం అంటూ తపిస్తున్నారు. పుజల్, పాండీతో సహా.. చెన్నై నగరానికి దాహార్తిని తీర్చే రిజర్వాయర్లన్నీ అడుగంటిపోయాయి. బోరుబావులు ఎండిపోయాయి. భూగర్భ జలాలు అడుగంటడంతో జనం ఆగచాట్లు పడుతున్నారు. నీటి ట్యాంకర్లు బుక్ చేసినా వస్తుందో లేదో తెలియని పరిస్థితి. నీళ్లు లేక హాస్టళ్లు, హోటళ్లు మూతపడుతున్నాయి. కొన్ని హాస్టళ్లలో కేవలం ఒక గంట పాటు మాత్రమే నీటిని సప్లై చేస్తున్నారు. ఆ గంటలోనే స్నానాలు, బట్టలు ఉతుక్కోవడం అన్నీ పూర్తికావాలి. లేదంటే అంతే. మరోవైపు నీళ్లు ఎక్కువగా వాడాల్సి రావడంతో.. తమకిష్టమైన సాంబారును కూడా వదులుకుంటున్నారు చెన్నై ప్రజలు. కొన్ని హోటళ్లలో సాంబారు వండటం లేదు. నీళ్లు లేక కొన్ని హోటళ్లను పూర్తిగా మూసేశారు. చెన్నై నగరవాసుల నీటి అవసరాలు తీర్చేందుకు ప్రతి రోజు 80 కోట్ల లీటర్ల నీరు అవసరం. అయితే ప్రభుత్వం ప్రతి రోజు 50 కోట్ల లీటర్ల నీటిని మాత్రమే సరఫరా చేస్తోంది. దీంతో నీటి కోసం చెన్నైవాసులు అష్టకష్టాలు పడుతున్నారు. ఐటీపై ఆంక్షలు.. ప్రైవేటు ట్యాంకర్ల వద్ద మహిళలు రోజంతా బారులు తీరుతున్నారు. ఉదయం 4 గంటలకు బయటకు వస్తే మధ్యాహ్నం 3 గంటల వరకు కూడా తమ వంతు రావడం లేదని, కుటుంబానికి పది బిందెలకు మించి నీరు సరఫరా కావడం లేదని గృహిణులు ఆవేదిన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలావుంటే, నీటి ఎద్దడిని ఎదుర్కోవడం కోసం రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల నుంచి రైలు ట్యాంకర్ల ద్వారా చెన్నైకి నీటిని తరలించాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. ఒక్క చెన్నైలోనే కాదు.. తమిళనాడు రాష్ట్రవ్యాప్తంగా దాదాపు ఇదే పరిస్థితి. బిందెడు నీళ్ల కోసం బావుల వద్ద మహిళలు కిలోమీటర్ల కొద్దీ క్యూ కడుతున్నారు. జనం నీటి అవసరాలను అవకాశంగా తీసుకుంటున్న కొందరు ట్యాంకర్ యజమానులు, బిందె నీటిని 50 రూపాయలకు అమ్ముతున్నారట. చాలీచాలని జీతాలతో జీవితాలను నెట్టుకొచ్చే కుటుంబాలు.. సాధారణ అవసరాలకు కూడా ప్రతీరోజూ నీళ్లను కొనుగోలు చేయాలంటే తమవల్ల కాదంటున్నారు. నీటి కొరతను దృష్టిలో పెట్టుకుని చెన్నైలోని ఐటీ కంపెనీలు తమ ఉద్యోగులకు ఆంక్షలు విధించాయి. కొన్ని సంస్థలు ఇంటి వద్దే పనిచేయమంటే, మరికొన్ని సంస్థలు భోజనం ఇంటి నుండే తెచ్చుకోమని సూచిస్తున్నాయి. రైళ్ల ద్వారా మంచినీటిని సరఫరా వేసవి వచ్చిందంటే నీటి కొరత గురించి గుర్తుకొస్తుంది. అంతకుముందు నీటి అవసరం పెద్దగా లేకపోవడం వల్ల నీళ్ల గురించి ఎవరికీ పట్టింపు వుండదు. వేసవిలో భూగర్భల జాలాలు అడుగంటినప్పుడు మళ్లీ నీటి గురించి వెతుక్కునే పరిస్థితులు, నీటి కటకటలు మొదలవుతాయి. ఇక ఎక్కడ చూసినా దాహార్తులే. గుక్కెడు మంచినీటికోసం ఎదురుచూడాల్సిన పరిస్థితులు. అందుబాటులో వున్న జలాలను సద్వినియోగం చేసుకోలేకపోవడం వల్ల తలెత్తే పరిణామాలివి. ప్రస్తుతం తమిళనాడు లాగే.. గతంలో మహారాష్ట్ర కూడా తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొంది. 2016లో తీవ్ర కరువు తాండవించినప్పుడు మరఠ్వాడాలోని లాతూరు వంటి ప్రాంతాల్లో తాగడానికి కూడా మంచినీరు లభించలేదు. దీంతో రైళ్ల ద్వారా మంచినీటిని సరఫరా చేయాల్సివచ్చింది. మహారాష్ట్రలోని మొత్తం 358 తాలూకాల్లో సగానికిపైగా కరువు కోరల్లో మగ్గుతున్నాయి. ఈ తాలూకాల్లోని దాదాపు 30 వేల గ్రామాలు నీటి ఎద్దడితో అలమటిస్తున్నాయి. వందకు పైగా పల్లెలు నరకం చూస్తున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. మహారాష్ట్ర మాత్రమే కాదు.. రాజస్థాన్ వంటి రాష్ట్రాల్లో సైతం నీటి ఎద్దడి ఎక్కువగా వుంటోంది. ముఖ్యంగా మహానగరాల్లో ప్రతీ ఏటా నీటి ఎద్దడి పెరుగుతూనేవుంది. నగరాలన్నీ కాంక్రీట్ జంగిల్స్ గా మారిపోవడంతో.. వర్షపు నీరు నేల ఒడికి చేరడం లేదు. -
ఆ ఒక్కటి అడక్కండి..!
ముంబై : ప్రస్తుతం మహారాష్ట్రలో కొన్ని గ్రామాల్లో ఇంటి ద్వారం మీద మరాఠీలో ‘దయచేయండి.. భోజనం చేయండి.. కానీ మంచి నీళ్లు మాత్రం అడక్కండి’ అని రాసి ఉంటుంది. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు అక్కడ కరువు ఎంత తీవ్రంగా ఉందో. మహారాష్ట్రలోని మరఠ్వాడాలో గత 32 వారాల నుంచి కరువు కరాళ నృత్యం చేస్తోంది. ఈ ప్రాంతానికి నీరు అందించే రిజార్వయర్లు పూర్తిగా అడుగంటిపోయాయి. బోర్లు, బావులు ఎండిపోయాయి. ప్రస్తుతం ఔరంగబాద్, మధ్య మహారాష్ట్రలోని పలు జిల్లాల్లో కరవు కోరలు చాచింది. దాంతో ప్రజలు నీటిని అతి జాగ్రత్తగా, పొదుపుగా ఒక్క చుక్క కూడా వృథా కాకుండా వాడుకుంటున్నారు. దానిలో భాగంగా ఒంటికి సబ్బు పెట్టి స్నానం చేయడం మానేశారు. ఓ నులక మంచంలో కూర్చుని.. కింద మరో టబ్బు పెట్టుకుని స్నానం చేస్తున్నారు. ఇలా చేయడం వల్ల నీరు వృథా కాకుండా టబ్బులో పడుతుంది. తర్వాత ఆ నీటితోనే మిగతా కుటుంబ సభ్యులు స్నానం చేయడం ఆఖరున వాటిని బట్టలు ఉతకడానికి వినియోగించడం వంటివి చేస్తున్నారు. దాదాపు ప్రతి గ్రామంలో ఇదే తంతు. దీని గురించి ఓ గ్రామస్థుడు మాట్లాడుతూ.. ‘ఇది మీకు షాకింగ్‌గా.. చండాలంగా అనిపించవచ్చు. కానీ మాకు మాత్రం ఇదే సరైన మార్గంగా తోస్తుంది. తీవ్ర నీటి ఎద్దడి ఉన్నప్పుడు మీ ముందు రెండే మార్గాలుంటాయి. ఒకటి చావడం రెండు బతకడం. చావలేం కాబట్టి మాకు తోచిన రీతిలో ఉన్న నీటినే ఇలా వాడుకుంటున్నాం’ అని తెలిపారు. ఈ ప్రాంతాలకు ప్రభుత్వం వారంలో మూడు రోజుల పాటు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తుంది. అలా పట్టుకున్న నీటినే అతి జాగ్రత్తగా.. పొదుపుగా వాడుకోవాల్సి వస్తుంది. లేదంటే డబ్బు చెల్లించి నీళ్లు కొనుక్కోవాలి. పది లీటర్ల నీటికి రూ. 12, వంద లీటర్ల నీటిని రూ. 80 చెల్లించాల్సిందే. కానీ ఇంత డబ్బు ఖర్చు పెట్టే స్థోమత ఇక్కడి జనాలకు లేదు. దాంతో ప్రభుత్వం సరఫరా చేసే నీటిని పట్టుకుని జాగ్రత్తగా వాడుకుంటారు. -
సాయం చేస్తామంటే వద్దన్నారు..
చెన్నై : తమిళనాడులో నీటి ఎద్దడి అంతకంతకూ పెరుగుతోంది. జలాశయాలు ఎండిపోవడంతో చెన్నైతో సహా పలు ప్రాంతాలలో సమస్య తీవ్ర రూపం దాల్చింది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా హోటళ్లు, రెస్టారెంట్లు మూతపడగా.. ఐటీ కార్యాలయాలు వర్క్ ఫ్రమ్ హోమ్‌కు ప్రాధాన్యతనిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాగునీటి కోసం తమిళ ప్రజల పడుతున్న కష్టాలకు చలించిపోయిన కేరళ ప్రభుత్వం తమిళ ప్రజల దాహార్తి తీరుస్తామంటూ ముందుకొచ్చింది. రైలు ద్వారా 20 లక్షల లీటర్ల మంచినీళ్లు సరఫరా చేస్తామని కేరళ ముఖ్యమంత్రి కార్యాలయం తమిళనాడు ప్రభుత్వానికి ప్రతిపాదించింది. అయితే తమ ప్రతిపాదనను తమిళనాడు ముఖ్యమంత్రి కార్యాలయం తిరస్కరించిందని.. ఇప్పటికైతే ఆ అవసరం లేదని పేర్కొన్నట్లు కేరళ సీఎంవో ఒక ప్రకటనలో తెలిపింది. వర్షాలు ముఖం చాటేయడంతో రిజర్వాయర్లన్నీ ఎండిపోయి చెన్నరు, తదితర ప్రాంతాల ప్రజలు తాగునీటికి, సాగునీటికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్న కథనాల నేపథ్యంలో వారికి కనీసం తాగు నీరైనా అందిద్దామని కేరళ సంకల్పించింది. కానీ కేరళ సాయాన్ని తమిళనాడు తిరస్కరించింది. కేరళ సాయాన్ని తిరస్కరించడంపై విపక్షాలు మండిపడుతున్నాయి. ప్రతిపక్ష నేత స్టాలిన్ మాట్లాడుతూ.. ఓ వైపు వర్షాలు లేక రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు తీవ్ర నీటి ఎద్దడితో అలమటిస్తుంటే.. ప్రభుత్వానికి కనిపించడం లేదన్నారు. మంచి మనసుతో కేరళ సీఎం పినరయ్ విజయన్ సాయం చేయడానికి ముందుకు వచ్చినందుకు ఆయనకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలిపారు. కేరళ సాయాన్ని వద్దునుకోవడం తెలివితక్కువ తనమన్నారు. కేరళ సాయాన్ని అంగీకరించి.. జనాలకు నీటి కరువు నుంచి ఉపశమనం కల్గించాలన్నారు. -
నైరుతి నైరాశ్యం
-
‘నీటి కరవు.. 400 వాటర్ ట్యాంకులు’
చెన్నై: తమిళనాడులో నీటి కరువు తాండవిస్తోందని, ఈ సమయంలో నీటి సమస్యపై రాజకీయాలు చేయడం తగదని ఆ రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి డీ. జయకుమార్ మీడియాతో పేర్కొన్నారు. తాగునీటి వ్యవస్థలను చక్కదిద్దడం ఎంతో కీలకమైనందని, నీటి సమస్యను పరిష్కరించడాని సాధ్యమైనంత మేరకు కృషి చేస్తున్నామన్నారు. ఈ సంవత్సరం వర్షాలు తగినంతగా కురవకపోయినా.. ప్రజలందరికీ తాగు నీటి ఎద్దడి లేకుండా చూస్తామన్నారు. చెన్నైలో దాదాపు 400 నీటి ట్యాంకుల ద్వారా తాగునీటిని ప్రజలకు అందిస్తామన్నారు. మున్సిపల్ మంత్రి వేలుమణి నీటి సమస్యపై ఓ ఉన్నత స్థాయి అధికారుల కమిటీని ఏర్పాటు చేసి పర్యవేక్షించనున్నారని వెల్లడించారు. నీటి సమస్య పరిష్కారమయ్యే వరకు కొన్ని హోటల్స్ తెరవకూడదని చెన్నై హోటల్ ఓనర్స్ అసోషియేషన్ను ఆయన కోరారు. ఇక, నీటి సమస్య తీవ్రతరం కావడంతో చెన్నైలోని ఐటీ కంపెనీలు ఉద్యోగులకు ‘వర్క్ ఫ్రమ్ హోమ్’ వెసులుబాటు కల్పిస్తున్న సంగతి తెలిసిందే. -
ఇంత నిర్లక్ష్యమా.. హైకోర్టు ఆగ్రహం
సాక్షి, చెన్నై: నీటిపై ఇంత నిర్లక్ష్యమా..చెరువుల్లో చేపట్టిన పూడికతీత పనులపై నివేదిక సమర్పించండి’ అంటూ మద్రాసు హైకోర్టు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు ఆగ్రహానికి తగినట్లు సీనియర్ ఐఏఎస్ అధికారి సహాయం కూడా ప్రభుత్వాలదే బాధ్యతని తప్పుపట్టారు. ఒకవైపు ప్రతిపక్షాలు, మరోవైపు న్యాయస్థానం విమర్శలతో సీఎం ఎడపాడి బుధవారం మంచినీటి సమస్యలపై చర్చించేందుకు సమావేశం కానున్నారు. రాష్ట్రంలో ముఖ్యంగా చెన్నైలో నీటి కరువు ఎంత చెప్పినా తక్కువే అనేలా మారింది. తాగునీటి కష్టాలు రోజురోజుకూ ఎక్కువైపోతున్నాయి. మంగళవారం నాటి సమాచారం ప్రకారం చెన్నై దాహార్తిని తీర్చే 3231 మిలియన్ క్యూబిక్ అడుగులు నీటి నిల్వ సామర్థ్యం కలిగిన పూండి జలాశయం నోరెళ్లబెట్టేసింది. అలాగే చోళవరం, చెంబరబాక్కం, రెడ్‌హిల్స్ చెరువులు సైతం పూండితోపాటూ నెలరోజుల కిందటే పూర్తిగా ఎండిపోయాయి. చెన్నై దాహం కోసం రోజుకు 830 మిలియన్ లీటర్లు అవసరం కాగా 525 మిలియన్ లీటర్లను మాత్రమే సరఫరా చేయగలగుతున్నారు. 1465 మిలియన్ క్యూబిక్ అడుగుల నీటి నిల్వసామర్ద్యం కలిగిన వీరాణం జలాశయం 530 మిలియన్ క్యూబిక్ అడుగుల నీటి నిల్వతో ఒకింత దాహాన్ని తీరుస్తోంది. అలాగే సముద్రపు నీటిని మంచినీటిగా మార్చే నెమ్మలి, మీంజూరులోని నీటి నిర్లవణీకరణ కేంద్రాలు 180 మిలియన్ లీటర్ల నీటితో, మరికొన్ని తాగునీటి సరఫరాల శాఖ బావులు ఆదుకుంటున్నాయి. చెన్నై తాగునీటి అవసరాలను తీర్చే శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరుజిల్లాల్లో కండలేరు జలాశయం నుంచి ఏడాదికి 12 టీఎంసీల నీరు అందాల్సి ఉంది. అయితే కండలేరు సైతం కేవలం 4.5 టీఎంసీలతో నిస్సహాయస్థితికి చేరుకుంది. తాగునీటి సరఫరా శాఖ 1005 టాంకర్ల ద్వారా నగరంలో నీటిని సరఫరా చేస్తున్నా చాలడంలేదు. 2000 సంవత్సరం తరువాత చెన్నై ఇంతటి దుర్భర పరిస్థితిని ఎదుర్కొంటోంది. నగరంలోని కొన్ని ప్రయివేటు పాఠశాలలు నీటి ఇబ్బందులతో రెండురోజులు సెలవులు ప్రకటించాయి. చెన్నై నగరంలో 15 ఉమెన్ మాన్షన్లను మూసివేయగా పురుషుల మాన్షన్లలో నీటి సరఫరా వేళలను బోర్డులపై ప్రకటించి ఆచరించాలని ఆదేశించారు. నగరంలోని ఆసుపత్రులు నీరులేక అల్లాడుతున్నాయి. నగరంలోని మెట్రోరైల్వేస్టేషన్లలో టాయిలెట్లకు తాళాలు వేశారు. హైకోర్టు అక్షింతలు: నీటి వనరులను కాపాడడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చూపుతోందని మద్రాసు హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తూ జిల్లాల వారీగా నివేదిక సమర్పించాలని ఆదేశించింది. వేలూరులో మంచినీటిలో మురుగునీరు కలవడాన్ని నివారించాలని కోరుతూ దాఖలైన పిటిషన్ విచారణకు వచ్చిన సందర్భంగా హైకోర్టు న్యాయమూర్తులు మణికుమార్, సుబ్రమణ్యప్రసాద్ ఈ మేరకు ప్రభుత్వాన్ని ఆదేశించారు. ఈ ఆదేశాలమేరకు గ్రేటర్ మెట్రోవాటర్, డ్రైనేజ్ బోర్డు చీఫ్ ఇంజినీర్ అర్ముగం మంగళవారం బదులు పిటిషన్ దాఖలు చేశారు. 2017లో కనీసస్థాయిలో వర్షాలు లేని కారణంగా చెన్నైకి తాగునీట అవసరాలను తీర్చే చెరువులు, జలాశయాలు ఎండిపోయాయని, ఈ కారణంగా రోజుకు 830 మిలియన్ లీటర్లకు బదులుగా 525 మిలియన్ల మాత్రమే సరఫరా చేస్తున్నామని తెలిపారు. తాగునీటికి మరో చిన్నారి బలి: పుదుక్కోట్టై జిల్లాలో మంచినీటి కోసం తవ్విన గుంతలో పడి మూడేళ్ల చిన్నారి బలైన దారుణం చోటుచేసుకుంది. వెత్తూరు గ్రామంలో నీటి కోసం స్థానికులు లోతైన గుంటను తవ్వి అందులో ఊరుతున్న నీటిని తోడుకుంటున్నారు. ఇటీవల వర్షం పడడంతో ఆ గుంట నిండిపోయింది. అదే గ్రామానికి చెందిన చంద్రశేఖర్, వెన్నిల దంపతుల మూడేళ్ల చిన్నారి భవతారిణి నీటి గుంటకు పక్కనే ఉండే అవ్వ ఇంటికి వెళ్లి తిరిగి తన ఇంటికి వెళుతూ గుంటలో పడిపోయింది. ఎంతకూ చిన్నారి తిరిగి రాకపోవడంతో అనుమానించిన తల్లిదండ్రులు గుంటలోని నీటిని తోడిచూడగా అందులో శవమై పడి ఉంది. -
మారుతి ఆఫర్ : పొల్యూషన్ చెక్, డ్రై వాష్ ఫ్రీ
సాక్షి, ముంబై : దేశీయ అతిపెద్ద వాహన తయారీదారు మారుతి సుజుకి కీలక నిర్ణయం తీసుకుంది. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా పర్యావరణ పరిరక్షణతోపాటు, వినియోగదారులకు కూడా ఉచిత ప్రయోజనాలను అందివ్వనుంది. తద్వారా తక్కువ నీటి వినియోగం, పర్యావరణంపై అవగాహన కల్పించనుంది. ఉచిత కాలుష్య చెక్, కాంప్లిమెంటరీ డ్రైవాష్ సౌకరాన్ని అందిస్తోంది. ఈ ఆఫర్ 2019 జూన్ 10 వరకు ఈ ఆఫర్ చెల్లుతుంది. దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో తీవ్రమైన నీటి ఎద్దడి కారణంగా ప్రధాన నగరాల్లో ఈ చర్య చేపట్టినట్టు తెలిపింది. వాహనాల డ్రై వాష్ ద్వారా 2018-19 ఏడాదిలో సుమారు 656 మిలియన్ లీటర్ల నీటిని ఆదా చేశామని సుజుకి పేర్కొంది. ఈ కార్యక్రమానికి మంచి స్పందన రావడంతో నీటి పొదుపు అంశాన్ని తమ వర్క్‌షాపులలో మూడు రెట్లు పెంచినట్టు వెల్లడించింది. తాజాగా బెంగళూరు, ఢిల్లీ, హైదరాబాద్, పూణే, నాగ్‌పూర్, చెన్నై ఆరు నగరాల్లో వాహనాల డ్రై వాష్ ద్వారా 160 మిలియన్ లీటర్ల నీటిని ఆదా చేయాలని భావిస్తోంది. తమ వర్క్‌షాపుల వద్ద డ్రై వాష్‌కు ప్రాధాన్యత ఇవ్వాలని 18 మిలియన్లకుపైగా ఉన్న వినియోగదారులకు ఆటో మేజర్ విజ్ఞప్తి చేసింది. తద్వారా రాబోయే తరాలకోసం నీటిని ఆదా చేయాలని మారుతి సుజుకి ఇండియా సర్వీసెస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పార్థో బెనర్జీ కోరారు. -
కూకట్‌పల్లిలో మంచినీటి కటకట
-
‘ఉచిత పథకాలు కాదు.. నీటి నిల్వ ముఖ్యం’
సాక్షి, చెన్నై : మద్రాసు హై కోర్టు.. తమిళనాడు ప్రభుత్వానికి సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. నీటి నిల్వలను పరిరక్షించేందుకు సీఎస్ అధ్వర్యంలో తక్షణమే ఓ కమిటిని ఏర్పాటు చేయాలని ఆదేశించింది. ఈ సందర్భంగా కోర్టు పలు కీలక వ్యాఖ్యలు చేసింది. ‘ప్రజలు కట్టే సొమ్ముతో ఉచిత పథకాలు కాకుండా నీటి నిల్వలు పెంచేందుకు తగిన చర్యలు తీసుకుంటే మంచిది. ప్రభుత్వం ఇప్పటికైనా నీటి నిల్వలపై దృష్టి సారించకపోతే.. తమిళనాడు మరో దక్షిణాఫ్రికా అతుతుంద’ని కోర్టు హెచ్చరించింది. మంచినీటి కోసం ప్రజలు గొంతెండి బాటిళ్లు కొనుక్కునే దారుణమైన పరిస్థితి రానివ్వకండని ప్రభుత్వాన్ని ఆదేశించింది. -
రోజుకు రెండు లక్షల మంది చస్తారట!
సాక్షి, న్యూఢిల్లీ : ‘జల్ జీవన్ మిషన్ కింద 2024 సంవత్సరం నాటికి దేశంలోని ప్రతి ఇంటికి కుళాయి ద్వారా నీటిని సరఫరా చేస్తాం’ అని ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల పార్టీ ఎన్నికల ప్రణాళిక విడుదల సందర్భంగా దేశ ప్రజలకు హామీ ఇచ్చారు. 2014లో జరిగిన ఎన్నికల సందర్భంగా కూడా ఆయన ప్రజల మంచినీటి సదుపాయానికి, దేశంలో జల వనరుల సంరక్షణకు అధిక ప్రాధాన్యత ఇస్తానని హామీ ఇచ్చారు. అందులో భాగంగా గంగా నదిని ప్రక్షాళిస్తానంటూ హామీ ఇచ్చారు. గంగా జలాల ప్రక్షాళన కోసం స్వామి సనంద్‌గా గుర్తింపు పొందిన జీడీ అగర్వాల్ ఆమరణ దీక్ష చేస్తూ మరణించినప్పటికీ గంగా జలాల ప్రక్షాళనలో పెద్దగా కదలిక లేదు. గ్రామీణ ప్రాంతాలకు మంచినీటి సౌకర్యం విస్తరణకు అధిక ప్రాధాన్యత ఇస్తానంటూ మోదీ హామీ ఇచ్చినప్పటికీ గత కొన్ని సంవత్సరాలుగా గ్రామీణ ప్రాంతాల రక్షిత మంచినీటి సౌకర్యం పథకాలకు కేటాయింపులు తగ్గిస్తూ వచ్చారు. నేడు దేశంలో కోట్లాది మంది ప్రజలు మంచినీటి కోసం అల్లాడి పోతున్నారు. అందుకనే నేడు దేశంలో పలు చోట్ల మంచినీళ్ల కోసం ఆందోళనలు కొనసాగుతున్నాయి. క్రమం తప్పకుండా కుళాయిల ద్వారా నీటిని సరఫరా చేసే వరకు ఓట్లు వేయమంటూ కేరళలోని కుట్టానడ్ ప్రజలు ఆందోళనలు చేస్తున్నారు. ఎలాంటి మంచినీటి సౌకర్యాలు మెరగుపరుస్తారో, మురుగునీరు పారుదలకు ఎలాంటి పటిష్ట చర్యలు తీసుకుంటారో ముందు వివరించండంటూ ఐటీ కారిడార్ పరిధిలోని ‘ఫెడరేషన్ ఆఫ్ రెసిడెంట్స్ అసోసియేషన్స్’ ఎన్నికల ప్రచారానికి వస్తున్న అభ్యర్థులను నిలదీస్తున్నాయి. దేశ వ్యాప్తంగా భూగర్భ జలాలు అంతరించి పోతుండడం వల్ల జల వనరుల కోసం ఒత్తిడి పెరుగుతోంది. మున్ముందు పరిస్థితి మరింత దారుణంగా తయారవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 2020 నాటికి 21 నగరాల పరిస్థితి మరో ఏడాది కల్లా దేశంలోని 21 నగరాల్లో భూగర్భ జలాలు అంతరించి పోతాయని పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. 75 శాతం ఇళ్లకు మంచినీరు అందుబాటులో ఉండదు. అందుబాటులో ఉన్న ఇళ్లలో కూడా 70 శాతం ఇళ్లకు కలుషిత జలాలే వెళతాయి. ఫలితంగా తాగునీరు అందుబాటులో లేక రోజుకు రెండు లక్షల మంది ప్రజలు చనిపోతారట. 2030 నాటికి నీటి సరఫరాకన్నా రెట్టింపు ఉంటుందట. ప్రస్తుత ప్రభుత్వమే కాదు, గత ప్రభుత్వాలు కూడా జల వనరుల పరిరక్షణ, అభివద్ధికి తగిన చర్యలు తీసుకోలేదు. ఎప్పటిలాగా పాలకులు ఎన్నికల సందర్భంగా హామీలు ఇచ్చి తప్పుకోకుండా దేశంలో జల వనరుల అభివద్ధికి చర్యలు తీసుకోవాలంటే విద్య ప్రాథమిక హక్కు తరహాలో ‘మంచినీరును ప్రాథమిక హక్కు’గా మార్చాలి. -
రైతన్నకు నీటి కష్టాలు
సాక్షి, మోటకొండూర్(నల్గొండ) : దేశానికి అన్నం పెట్టే రైతన్నకు ఏ సీజన్లోనైనా కష్టాలు మాత్రం తప్పటం లేదు. సకాలంలో సమృద్ధిగా వర్షాలు కురవకపోవడం ఒక కారణమైతే.. కురిసిన వర్షపు నీటిని నిల్వచేసే చెరువులు, కుంటలు, వాగులు, వంకలు అన్యాక్రాంతం అయి నీటి నిల్వ సామర్థ్యం తగ్గడం మరో కారణం. వేసవి ప్రారంభంలోనే ఎండలు మండుతుందటంతో భూగర్భ జలాలు నానాటికి అడుగంటి బోర్లు వట్టిపోతుండటంతో రైతులకు కన్నీళ్లే మిగిలేలా ఉన్నాయి. రబీ సాగు వివరాలు ఇలా.. మండల వ్యాప్తంగా 15,275 హెక్టార్ల వ్యవసాయ భూమి ఉండగా అందులో రబీలో 1,322 హెక్టార్ల విస్తీరణంలో సాగుచేశారు. అందులో వరి 890 హెక్టార్లు, జొన్నలు 6 హెక్టార్లు, మినుములు 6 హెక్టార్లు, శెనిగలు 25 హెక్టార్లు, వేరుశెనిగలు 30 హెక్టార్లు, కొర్రలు ఒక హెక్టార్, కూరగాయలు 90హెక్టార్లు, మొక్కజొన్న 270హెక్టార్లు సాగు చేపట్టారు. కాగా గత రబీ సీజన్లో 3,412 హెక్టార్లలో సాగుచేయగా వర్షాల లేమి కారణంగా ఈ రబీ సీజన్లో సగానికి పైగా సాగు తగ్గింది. ప్రసుత్తం సాగు చేసిన పంటలు చేతికొచ్చే పరిస్థితి కనిపించడంలేదు. దీంతో రైతున్నలు ఆకాశంవైపు ఆశగా చూస్తున్నారు. భూగర్భజలాలు అడుగంటాయి వర్టూర్ గంగబావి వద్ద నాకు 9ఎకరాల భూమి ఉంది. అందులో 3ఎకరాలు పత్తి, 2ఎకరాలు కంది, ఎకరం వరి పంట వేశాను. వరికి మరో 20 రోజులు నీళ్లు అందితే పంట చేతికొచ్చేది. కానీ నీళ్లు అందక ప్రస్తుతం ఎండిపోయింది. కాగా నాకు రెండు బోర్లు ఉన్నాయి. గత రబీ సీజన్లో 2.5ఎకరాలలో వరి పంట పండించాను. ఇప్పుడు ఎకరం కూడా పారే పరిస్థితిలేదు. – సింగిరెడ్డి సాయిరెడ్డి, రైతు -
తాగడానికి గుక్కెడు నీరు కరువాయే..!
సాక్షి, గండేడ్: వేసవి రాకముందే పల్లెల్లో తీవ్ర తాగునీటి ఎద్దడి మొదలయింది. ఏటా మే, జూన్ నెలల్లో తాగునీటి సమస్య ప్రారంభమయ్యేది. కానీ ఈ ఏడాది వర్షాలు సకాలంలో కురవకపోవడంతో భూగర్భజలాలు తగ్గిపోయి తాగునీటికి తీవ్ర సమస్యలు మొదలయ్యాయి. మండలంలోని 24 పాత గ్రామ పంచాయతీలు ఉండగా మరో 25 నూతన గ్రామపంచాయతీలు ఏర్పడ్డాయి. అలాంటి గ్రామ పంచాయతీల్లో సహితం తాగునీటికి ఎన్నో ఇబ్బందులు ఉన్నా సంబంధిత అధికారులు మాత్రం పట్టించుకున్న పాపానపోవడం లేదని ఆయా గ్రామాల ప్రజలు అంటున్నారు. మండలంలోని నంచర్ల, కొంరెడ్డిపల్లి, దేశాయిపల్లి, జూలపల్లి, రుసుంపల్లి, వడ్డెగుడిసెలు, గండేడ్ తదితర గ్రామాల్లో మాత్రం తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని మహిళలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆయా గ్రామాల్లో తాగునీటికోసం కాలనీల్లో ఎన్నో బోర్లు వేసినా వాటిలో నీరులేక ఎండిపోయాయి. మండలంలో 150కి పైగా త్రీఫేజ్ బోరుమోటార్లు ఉండగా వాటిలో సగానికి పైగా నీరులేక పనిచేయడంలేదు. ఆయా గ్రామాల్లో సుమారు 400లకు పైగా సింగిల్‌ఫేజ్ బోరుమోటార్లు ఉండగా వాటిలో 250లోపు మాత్రమే పనిచేస్తున్నాయి. దీంతో గ్రామాల్లోని ప్రజలకు తాగునీటికి తీవ్ర ఇబ్బందులు కలగడంతో వ్యవసాయ బోర్ల వద్దకు పరుగులు తీస్తున్నారు. ఎంతోదూరం వెళ్లి తాగునీరు, వినియోగించేందుకు తెచ్చుకొని కాలం వెళ్లదీస్తున్నారు. పట్టించుకోని అధికారులు, కార్యదర్శులు సర్పంచ్ల పదవీకాలం ముగిసి మూడునెలలు గడుస్తున్నా.. సంబంధిత ప్రత్యేక అధికారులు గ్రామాల్లోకి వచ్చి సమస్యలు చూసిన పాపానపోవడంలేదని ఆయా గ్రామాల ప్రజలు అంటున్నారు. ఇక గ్రామాల్లో ఏ చిన్న సమస్య వచ్చినా గ్రామ కార్యదర్శి దగ్గరుండి చేయించాల్సిందిపోయి వారు కూడా నిర్లక్ష్యం వహిస్తూ డబ్బులు లేవని తేల్చిచెబుతున్నారు. ముఖ్యంగా ఆయా గ్రామాల్లో తాగునీటి సమస్య వచ్చిన వెంటనే దగ్గరుండి పరిష్కరించలేక నెలలు గడుస్తున్నా పట్టించుకోవడంలేదు. తాగునీటి సమస్య ఉన్నచోట వ్యవసాయ బోర్లనుంచి, ట్యాంకర్ల ద్వారా గాని తాగునీరు అందించక విఫలమవుతున్నారని ప్రజలు తెలిపారు. పలుగ్రామాల ప్రజలు మాత్రం గండేడ్ కార్యాలయానికి చేరుకుని తీవ్ర నిరసన తెలిపినా, రోడ్డెక్కి నిరసన కార్యక్రమాలు చేపట్టిన్నా గ్రామ కార్యదర్శులు స్పందించడం లేదు. సమస్యలు పరిష్కరిస్తాం మండలంలో ఏఏ గ్రామాల్లో తాగునీటి సమస్య ఉన్నా ట్యాంకర్ల ద్వారా, బోర్లు లీజుకు తీసుకొని నీటిని అందించే ఏర్పాట్లు చేస్తున్నాం. నెలరోజుల్లో మిషన్ భగీరథ ద్వారా ప్రతి గ్రామానికి తాగునీరు అందించే ఏర్పాట్లు చేస్తున్నాం. దీం తో గ్రామాల్లో తాగునీటి సమస్య దూరమవు తుంది. చిన్న చిన్న మరమ్మతులు వస్తే సం బంధిత గ్రామ కార్యదర్శులు పరిష్కరించాలి. – దివ్యసంతోషి, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ, గండేడ్ -
కేరళకు కొత్త కష్టం
-
ఆస్ట్రేలియాలో తీవ్రమైన కరువు
-
అక్కడ ఎంత కరువుందో..వైరల్!
-
ఇదేమి ‘మందా’ ఓరి యలమందా!
సిడ్నీ : ఆస్ట్రేలియాలో మనుషులకేమోగానీ పశువులకు తీవ్రమైన నీటి కరువు వచ్చి పడింది. కాల్వలు, గుంటలు, బావులు ఎండి పోవడంతో అవి బావురుమంటున్నాయి. వాటిని బతికించడం కోసం రైతులు వాటర్ ట్యాంకులు తెప్పించి మరీ వాటి దాహం తీర్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఒక్కోసారి వాటర్ ట్యాంకర్ నీటి కోసం కూడా 50 నుంచి 70 కిలోమీటర్ల దూరం వరకు వాటిని తోలుకొని పోవాల్సి వస్తోందని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. తన పశువుల దాహం తీర్చేందుకు తాను తరచుగా గంటసేపు వాటితో ప్రయాణించాల్సి వస్తోంది. 1300 పశువులు కలిగిన అంబర్ లియా అనే ఆవిడ మీడియాకు తెలియజేసింది. పశువుల దాహం తీర్చేందుకు తెప్పించిన ఓ వాటర్ ట్యాంకర్ వద్ద దాహం తీర్చుకునేందుకు ఎగబడుతున్న పశువుల మందను ద్రోన్ కెమెరా ద్వారా వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దాన్ని వీక్షించిన వారికి అక్కడ ఎంత కరువు పరిస్థితులున్నాయో చెప్పకనే తెలుస్తుంది. -
రానున్నవి జలయుద్ధాలే!
సాక్షి, న్యూఢిల్లీ : ‘భారత దేశం మున్నెన్నడు లేని విధంగా నీటి సంక్షోభాన్ని ఎదుర్కోబోతోంది. కోట్లాది మంది ప్రజల జీవితాలకు, వారి జీవనాధారాలకు ముప్పు పొంచి ఉంది’ అంటూ కేంద్ర ప్రభుత్వ మేధావుల సంఘం ‘నీతి ఆయోగ్’ వారం రోజుల క్రితం ఓ నివేదికను విడుదల చేసింది. భారత ప్రణాళికా సంఘాన్ని రద్దు చేసి ఆ స్థానంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం ఈ నీతి ఆయోగ్ వ్యవస్థను తీసుకొచ్చిన విషయం తెల్సిందే. ప్రపంచానికి పెనుముప్పుగా మారుతున్న నీటి సంక్షోభం గురించి అనేక దేశాలు గత కొన్నేళ్లుగా ఆందోళన వ్యక్తం చేస్తున్నా, పట్టించుకోని నీతి ఆయోగ్ ఇప్పుడు మొదటి సారిగా తన గళం విప్పింది. 2020 నాటికి దేశంలో పచ్చదనం పరుచుకున్న బెంగళూరు సహా 21 నగరాల్లో భూగర్భ జలాలు అంతరించి పోతాయని, దేశవ్యాప్తంగా 60 కోట్ల మంది ప్రజలు నీటి కోసం కటకటలాడుతారని నీతి ఆయోగ్ ఆ నివేదికలో హెచ్చరించింది. కేవలం నీటి కొరత కారణంగా దేశంలో ఏటా రెండు లక్షల మంది ప్రజలు మరణిస్తారని కూడా ఆందోళన వ్యక్తం చేసింది. మరో రెండు, మూడేళ్లలో దేశంలోని 75 శాతం ఇళ్లకు కుళాయిల ద్వారా మంచినీళ్లు అందవని, గ్రామీణ ప్రాంతాల్లో 84 శాతం ఇళ్లకు పైపుల ద్వారా నీటి సరఫరా నిలిచిపోతుందని కూడా హెచ్చరించింది. అందుబాటులో ఉండే 70 శాతం నీళ్లు కూడా కలుషతమవుతాయని అంచనా వేసింది. ఇప్పటికే మన భారత స్వచ్ఛమైన నీరు కలిగిన 122 దేశాల్లో 120వ స్థానంలో ఉంది. నీటి సంక్షోభం కారణంగా ప్రస్తుతం తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల మధ్య నలుగుతున్న కావేరీ జలాల వివాదం లాంటి వివాదాలు వివిధ రాష్ట్రాల మధ్య కనీసం ఏడు ఏర్పడతాయని, రాష్ట్రాల మధ్య జల యుద్ధాలే జరగవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 2019లో జరుగనున్న సార్వత్రిక ఎన్నికల్లో నీటి సంక్షోభమే ప్రధాన అంశం కావచ్చని కూడా వారు భావిస్తున్నారు. భారత్‌కు ఇంతటి నీటి సంక్షోభం ఎందుకు వచ్చింది? ఇందుకు కారణాలేమిటీ? గత ప్రభుత్వాలుగానీ, నేటి ప్రభుత్వంగానీ నివారణ చర్యలు తీసుకోలేదా? దేశంలో వ్యవసాయం కోసం 70 శాతం జల వనరులను యధేశ్చగా వినియోగించడం, అందుకోసం లెక్కలేనన్ని డ్యామ్‌లు నిర్మించడం, భూగర్భ జలాలను దుర్వినియోగం చేయడం, నీరు కలుషితం కాకుండా పటిష్ట చర్యలు తీసుకోక పోవడం, కలుషితమైన నీటిని శుద్ధి చేయడం పట్ల శ్రద్ధ చూపకపోవడం నీటి సంక్షోభానికి ప్రత్యక్ష కారణాలుగా నిపుణులు తెలియజేస్తున్నారు. చెట్లను నరికివేయడం, పర్యావరణ పరిస్థితులను పట్టించుకోకపోవడం పరోక్ష కారణాలని వారు చెబుతున్నారు. దేశంలో జల వన రుల అభివద్ధి కోసం వేసిన వివిధ కమిటీలు చేసిన సిఫార్సులను ఏ ప్రభుత్వం కూడా అంతగా పట్టించుకోలేదని ఆ కమిటీలకు సారధ్యం వíß ంచిన నిపుణులు మిహిర్ షా తెలిపారు. నిర్మించిన డ్యామ్లకన్నా నిర్మాణంలో ఆగిపోయిన డ్యామ్‌ల వల్ల జల వనరులకు ఎక్కువ నష్టం జరుగుతోందని ఆయన చెప్పారు. 2018–2019 ఆర్థిక సంవత్సరం వ్యవసాయ బడ్జెట్‌కన్నా ఏడింతలు ఎక్కువ అంటే, నాలుగు లక్షల కోట్ల రూపాయలను ఇదే ఆర్థిక సంవత్సరంలో డ్యామ్‌ల నిర్మాణం కోసం వెచ్చిస్తున్నారని అన్నారు. నేడు దేశంలో అవసరంకన్నా ఆర్థిక అవినీతి కోసమే ఎక్కువ డ్యామ్‌ల నిర్మాణాన్ని చేపడుతున్నారని ఆయన విమర్శించారు. అమెరికా, చైనా ప్రజలకన్నా భారతీయులు రెట్టింపు భూగర్భ జలాలను ఉపయోగిస్తున్నారు. 2030 నాటికి భూగర్భ జలాల లభ్యతకన్నా డిమాండ్ రెట్టింపు ఉంటుందన్నది నిపుణుల అంచనా. దేశంలోని వివిధ నగరాల్లో రోడ్ల విస్తరణకు, ఇతర అభివద్ధి ప్రాజెక్టుల కోసం కోటానుకోట్ల చెట్లను నరికి వేశారు. ఇటీవలనే ఢిల్లీలో పర్యావరణవేత్తలు ఎంత మొత్తుకున్నా పట్టించుకోకుండా ప్రభుత్వం క్వాటర్ల పునర్నిర్మాణం కోసం 14వేల పైచిలుకు చెట్లను నరికివేశారు. దేశంలో చార్ ధామ్‌గా ప్రసిద్ధి చెందిన భద్రీనాథ్, ద్వారక, పూరి, రామేళ్వరం పుణ్యక్షేత్రాలను కలుపుతూ నిర్మిస్తున్న జాతీయ రహదారి ‘చార్ధామ్ మహామార్గ్ వికాస్ పరియోజన’కు 2016లో ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేసిన విషయం తెల్సిందే. ఈ రోడ్డు నిర్మాణం వల్ల పర్యావరణానికి అంతులోని నష్టం జరుగుతోందని పర్యావరణ వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.దీనికోసం అటవి ప్రాంతాల్లో కొన్ని శతకోట్ల చెట్లను నరికి వేయడంతోపాటు కోట్ల టన్నుల శకలాలను తీసుకొచ్చి అడవుల్లో, నదుల్లో పారబోస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. -
అడుగంటుతున్న నీటి యాజమాన్యం..!
దేశ చరిత్రలోనే అతి క్లిష్టమైన నీటి సంక్షోభాన్ని ప్రస్తుతం భారత్ ఎదుర్కుంటోంది. సగం జనాభా అంటే...60 కోట్ల మందికి పైగా నీరు అందుబాటులో లేక తీవ్ర సమస్యల పాలవుతున్నారు. సురక్షితమైన నీటిని పొందలేని పరిస్థితుల్లో ఏడాదికి దాదాపు రెండులక్షల మంది తనువులు చాలిస్తున్నారు. రానున్న రోజుల్లో ఈ సమస్య మరింత తీవ్రరూపం దాల్చనున్న నేపథ్యంలో జీవనోపాధి అవకాశాలు గణనీయంగా దెబ్బతింటాయి...రాబోయే రోజుల్లో నీటి సంక్షోభం మరింత పెరుగుతుంది. వచ్చే పదేళ్లలోనే ఈ సమస్య తీవ్రాతి తీవ్రమవుతుందని ‘సమ్మిళిత నీటి నిర్వహణ సూచి’ (కాంపోజిట్ వాటర్ మేనేజ్మెంట్ ఇండెక్స్) పేరిట నీతి ఆయోగ్ తాజా నివేదిక విడుదల చేసింది. ఇందులో దేశం ఎదుర్కుంటున్న నీటి సంక్షోభం గురించి హెచ్చరిస్తూ... దేశ ఆహార భద్రత సమస్యకు కూడా ఇది దారితీయొచ్చని తెలిపింది. 2016-17లో దేశంలోని రాష్ట్రాలు నీటి నిర్వహణకు తీసుకున్న చర్యల ఆధారంగా దీనిని తయారు చేసింది. తగ్గనున్న హైదరాబాద్ భూగర్భజలాలు.. మరీ ముఖ్యంగా మరో ఏడాదిన్నర సమయంలోగానే... అంటే 2020 కల్లా న్యూఢిల్లీ , బెంగళూరు, చెన్నై, హైదరాబాద్‌లతో సహా దేశంలోని 21 నగరాల్లోని భూగర్భజలాలు పూర్తిస్థాయిలో అడుగంటì పోతాయి. దీని ప్రభావం పదికోట్ల మందిపై తీవ్రంగా పడుతుంది. మొత్తం 122 దేశాల్లోని ‘నీటి నాణ్యతా సూచి’లో భారత్ 120 స్థానంలో నిలుస్తోంది. దేశంలోని దాదాపు 70 శాతం వరకు నీరు కలుషితమైందని వివిధ స్వతంత్రసంస్థల గణాంకాలను ఈ అధ్యయనంలో ఉటంకించారు. దల్‌బర్గ్ అనాలిసిస్, ఎఫ్ఏఓ, యూనిసెఫ్ వంటి సంస్థలు అందించిన వివరాలను బట్టి 2030 కల్లా 40 శాతం జనాభాకు మంచినీరు అందుబాటులో ఉండదు.దేశవ్యాప్తంగా నీటి వనరుల నిర్వహణ, యాజమాన్యం విషయంలో మొట్టమొదటిసారిగా ఓ సూచి ఆధారంగా వివిధ నగరాలకు ర్యాంకింగ్‌లిచ్చింది. భూగర్భజలాలు, నీటి వనరుల పునరుద్ధరణ, నీటిపారుదలరంగం, వ్యవసాయ పద్థతులు, తాగునీరు, విధానాలు, పాలన పద్ధతులు వంటి విస్తృత రంగాలు, అంశాల పరిధిలోని వివిధ ఇండికేటర్ల ఆధారంగా ఈ నివేదిక రూపొందించారు. అగ్రస్థానం గుజరాత్... అథమం జార్ఖండ్... నీటి నిర్వహణసూచి ర్యాంకింగ్‌లలో గుజరాత్ ప్రధమస్థానం సొంతం చేసుకుంది.ఆ తర్వాతి స్థానాల్లో మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర నిలిచాయి. మధ్యస్థ పనితీరు కనబరిచిన రాష్ట్రాల్లో తెలంగాణ నిలుస్తోంది. జార్ఖండ్, బిహార్, హర్యానా చివరిస్థానాలతో సరిపెట్టుకున్నాయి. ఈ జాబితాలో ఉత్తరప్రదేశ్, ఒడిశా, చత్తీస్‌గఢ్‌తో పాటు ఇతర రాష్ట్రాల పనితీరు బాగా లేదు. ఈ రాష్ట్రాలకు ‘నాన్ హిమాలయన్ స్టేట్స్’ కే టగిరిలో ర్యాంకులిచ్చారు. ‘ఈశాన్య, హిమాలయన్’ కేటగిరిలో తీవ్రమైన నీటి సమస్యను ఎదుర్కుంటున్న హిమాచల్‌ప్రదేశ్ 8 సభ్యరాష్ట్రాల జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది. ఒక్కో రాష్ట్రం భిన్నమైన నీటి సూచి స్కోర్లు సాధించాయి. అత్యధిక రాష్ట్రాలు 50 శాతం కంటే తక్కువ మార్కులు పొందాయి. నీటి నిర్వహణ,యాజమాన్య పద్ధతులను చాలా మటుకు రాష్ట్రాలు మరింత మెరుగుపరుచుకోవాల్సిన ఆవశ్యత ఉందని ఈ పరిశీలనలో వెల్లడైంది. సవాళ్లేమిటీ ? 2030 కల్లా దేశంలో అందుబాటులో ఉన్న నీటి కంటే డిమాండ్ రెండింతలు పెరగనుంది కోట్లాది మంది తీవ్రమైన నీటి సంక్షోభాన్ని ఎదుర్కుంటారు దేశంలోని 52 శాతం వ్యవసాయ ప్రాంతం వర్షాధారం కావడంతో చిట్టచివరి భూములకు నీళ్లు అందేలా నీటిపారుదల భవిష్యత్ విస్తరణ చేపట్టాల్సి ఉంటుంది నీటి సమస్య కారణంగా 2050 కల్లా స్థూల దేశీయ ఉత్పత్తి (జీడీపీ) 6 శాతం మేర నష్టపోయే అవకాశాలున్నాయి. సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
నీటి సంక్షోభం: నీతి ఆయోగ్ సంచలన నివేదిక
సాక్షి, న్యూఢిల్లీ : భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలో ప్రణాళికా సంఘం స్థానంలో ఏర్పడిన వ్యవస్థ నీతి ఆయోగ్ (నేషనల్ ఇనిస్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా) సంచలన నివేదికనువిడుదల చేసింది. భారతదేశం అత్యంత ఘోరమైన నీటి సంక్షోభంతో బాధపడుతోందని వ్యాఖ్యానించింది. దాదాపు 60 కోట్లమంది తీవ్ర నీటి ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. సురక్షితమైన నీటికి నోచుకోక ప్రతి ఏటా సుమారు 2 లక్షల మంది మరణిస్తున్నారంటూ నితీ ఆయోగ్ కాంపోజిట్ వాటర్ మేనేజ్ మెంట్ ఇండెక్స్ (సీడబ్ల్యూఎంఐ) పేరిట గురువారం విడుదల చేసిన ఒక నివేదికలో వెల్లడించింది. అంతేకాదు భారత చరిత్రలో ఎన్నడూ లేనంత నీటి కొరత సమీప భవిష్యత్తులో రానుందని, కోట్లాది మంది ప్రజల ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయని నీతి ఆయోగ్ హెచ్చరించింది. 2030 నాటికి నీటి కష్టాలు తీవ్ర రూపం దాలుస్తాయని అంచనా వేసింది. నీటి వనరుల రక్షణ, వాడుకపై అవగాహన పెంచుకోవాల్సిన తక్షణ సమయమిదని నొక్కి చెప్పింది. దేశంలోని అత్యధిక ప్రాంతాల్లో భూగర్భ జల వనరులు కనిపించని పరిస్థితి రానుందని నీటి వనరుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ విడుదల చేసిన నీతి ఆయోగ్ నివేదికలో తెలిపారు. నీటి నిర్వహణ చాలా పెద్ద సమస్యగా ఉందని, అయితే వ్యవసాయ రంగాలలో కొన్నిరాష్ట్రాలు మంచి ఫలితాలు సాధించాయని గడ్కరీ అన్నారు. ఢిల్లీలో వాయు కాలుష్యం మరియు నీటి నిర్వహణ సమస్యను పరిష్కరించేందుకు , ఢిల్లీ ముఖ్యమంత్రితో సమావేశంకానున్నామని ఆయన చెప్పారు. 2030 నాటికి దేశంలో నీటి సరఫరాకు డిమాండ్ రెండు రెట్లు ఎక్కువగా ఉంటుందన్నారు. దేశం జీడీపీ 6 శాతం నష్టపోతుందని పేర్కొన్నారు. అయితే 2015-16 పరిస్థితులతో పోలిస్తే, 2016-17 సంవత్సరానికిగాను నీటి నిర్వహణ విషయంలో గుజరాత్ ముందు వరుసలో ఉందనీ, ఆ తరువాత మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాలు సమర్థవంతంగా పని చేస్తున్నాయని పేర్కొంది. మరోవైపు జార్ఖండ్, హర్యానా, ఉత్తర ప్రదేశ్, బీహార్ రాష్ట్రాల్లో పరిస్థితి అత్యంత దయనీయంగా ఉందని నీతి ఆయోగ్ పేర్కొంది. హిమాలయ రాష్ట్రాల విషయానికి వస్తే, త్రిపురలో నీటి లభ్యత బాగుందని, ఆపై హిమాచల్ ప్రదేశ్, సిక్కిం, అసోం రాష్ట్రాలున్నాయని తెలిపింది. నీటి కొరతకు ఇరుగు పొరుగు రాష్ట్రాల మధ్య ఉన్న విభేదాలు కూడా కారణం అవుతున్నాయని, ముఖ్యమైన ప్రాజెక్టులు, నీటి పంపకాల విషయంలో ఉన్న అడ్డంకులు తొలగాల్సిన అవసరం ఉందని, ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం కల్పించుకోవాలని సూచించింది. స్వతంత్ర సంస్థల నివేదికను ఉదాహరించిన నీతి ఆయోగ్ దేశంలో దాదాపు 70 శాతం నీరు కలుషితమైందని, నీటి నాణ్యత సూచికలో 122 దేశాలలో భారత దేశం 120 వ స్థానంలో ఉందని నీతి అయోగ్ తన నివేదికలో పేర్కొంది. -
నీళ్ల కోసం రోడ్దుపై బైఠాయించిన మహిళలు
-
ఆ ఊళ్లో తాళాలు వేస్తారు, కానీ...
జైపూర్: ఓ వైపు నీటి ఎద్దటితో ప్రజలు నరకయాతన అనుభవిస్తున్నారు. ప్రభుత్వం చేపడుతున్న చర్యలు సరైన ఫలితాలను ఇవ్వటం లేదు. ఆజ్మీర్ చుట్టు పక్కల ప్రాంతాల్లో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఎంతలా అంటే దొరికిన నీటిని నిల్వ చేసుకుని, వాటికి తాళాలు వేసుకునేంతగా... వైశాలి నగర్ ప్రాంత ప్రజలు డ్రమ్‌లలో నీటిని నిల్వ చేసుకుని వాటికి తాళాలు వేసుకుంటున్నారు. ‘తాగు నీరు మాకు ప్రతీ రోజూ రాదు. వచ్చిన నీటినే అపురూపంగా చూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. పైగా నీటి దొంగలు ఎక్కువగా చెలరేగిపోతున్నారు. అందుకే తాళాలు వేసుకుంటున్నాం’ అని స్థానికులు చెబుతున్నారు. రాజస్థాన్‌లో ప్రతీ ఏటా ఇలాంటి పరిస్థితులు మాములే అయినప్పటికీ ప్రస్తుతం ఆ ప్రాంతంలో మాత్రం అది తారాస్థాయికి చేరింది. పరిస్థితికి దర్పణం పడుతున్న ఫోటోలు కొన్ని మీడియాలో వైరల్ అవుతున్నాయి. -
నీటి కోసం హైవే ముట్టడి
సాక్షి, న్యూఢిల్లీ : సిమ్లాలో తీవ్ర నీటిఎద్దడితో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలు గత కొన్ని రోజులుగా ఆందోళన చేపడుతున్న క్రమంలో గురువారం జాతీయ రహదారిపై కచి ఘటి ప్రాంతంలో భారీ నిరసనకు దిగారు. నీటి సమస్యను పరిష్కరించాలని కోరుతూ హైవేను దిగ్భందించారు. నీటి సంక్షోభానికి నిరసనగా జాతీయ రహదారిపై ధర్నా చేపట్టారు. తమకు కుళాయిల నుంచి నీళ్లు రావడం లేదని, పైప్లైన్ల ద్వారా నీటి సరఫరా చాలారోజుల నుంచి నిలిచిపోయిందని స్ధానికులు ఆవేదన వ్యక్తం చేశారు. ట్యాంకర్లు సైతం నివాస ప్రాంతాలకు రాకుండా, వీఐపీ ప్రాంతాలకు తరలిస్తున్నారని ఆరోపించారు. సిమ్లాలో పరిస్థితి ఇలా ఉంటే గ్రామాల్లో పరిస్ధితి దయనీయంగా ఉంది. తాగునీటి కోసం సిమ్లా పట్టణం సహా పరిసర ప్రాంతాల ప్రజలు వారం రోజులు పైగా వేచిచూస్తున్నారు. నీటిఎద్దడి నెలకొన్న నేపథ్యంలో వీఐపీ ప్రాంతాలకు ప్రత్యేక ట్యాంకర్ల ద్వారా నీటిసరఫరా చేయవద్దని హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. టూరిస్టులు సైతం కొద్దిరోజులు హిల్స్టేషన్కు దూరంగా ఉండాలని, నిర్మాణ కార్యకలాపాలను కొద్దిరోజుల పాటు నిలిపివేయాలని కోర్టు ఆదేశించింది. -
అదిలాబాద్ తండాలో నీటి గోస
-
ఆదిలాబాద్ తాండాల్లో నీటి గోస
-
డేంజర్‌కు దగ్గరగా బెంగళూరు
సాక్షి, న్యూఢిల్లీ : నీరే జీవకోటికి ప్రాణాధారం. జలం లేకపోతే జీవమే ఉండదు. ఇతర గ్రహాలు మనుషుల ఆవాసానికి అనుకూలమా, కాదా అనే విషయం కూడా అక్కడి నీటి లభ్యత మీద ఆధారపడి ఉంటుంది. నీరు లేకపోతే ఈ సృష్టే అంతరిస్తుంది. ఈ విషయం తెలిసి కూడా చేజేతులా భూతాపాన్ని పెంచి తీవ్రమైన వాతావరణ మార్పులకు కారణమవుతున్నాము. అందుకే అతివృష్టి, అనావృష్టిలాంటి పరిస్థితులు. ఇంకా వేసవి పూర్తిగా ప్రారంభమవలేదు. అయినప్పటికీ అప్పుడే నీటి ఎద్దడి సమస్యలు ప్రారంభమయ్యాయి. ఈ సమస్య తీవ్రంగా ఉండి ఇప్పుడు సిలికాన్ సిటీ బెంగళూరును బెంబేలెత్తిస్తోంది. ప్రపంచ నీటి దినోత్సవం సందర్భంగా సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ (సీఎస్ఈ) పత్రిక ప్రపంచవ్యాప్తంగా తీవ్ర నీటి ఎద్దడి ఎదుర్కొంటున్న10 నగరాల జాబితాను విడుదల చేసింది. వాటిలో బెంగళూరు ఒకటి. అనతి కాలంలోనే బెంగళూరు మరో కేప్ టౌన్ కానుంది. వరుస కరువు, ముందుచూపులేని ప్రభుత్వం తీరుతో కేప్‌టౌన్ తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొంటోంది. గత జూన్-.జూలైలో అక్కడ 'డే జీరో' (ట్యాప్లలో నీరు రాకుండా పూర్తిగా నిలిచిపోవడం) పరిస్థితి. ప్రస్తుతం అక్కడ నీటిని కూడా రేషన్‌లో తీసుకోవాల్సిన దుస్థితి. మరికొన్ని రోజుల్లో బెంగళూరులోను ఇవే దృశ్యాలు కనిపించనున్నట్లు సీఎస్ఈ వెల్లడించింది. ఈ పత్రిక వెల్లడించిన అంశాల ప్రకారం ప్రణాళిక ప్రకారం లేని నగరీకరణ, నిర్మాణాల వల్ల 79శాతం నీటి వనరులు తగ్గిపోయాయి. 1973 నుంచి నిర్మాణాలకు సంబంధించిన స్థల విస్తీర్ణం 8 శాతం నుంచి 77 శాతానికి పెరిగింది. బెంగుళూరులో ఇంతకుముందు నీటి లభ్యత 10-12 మీటర్ల లోతు లోపు ఉండేది, కానీ ప్రస్తుతం ఇది 76-91 మీటర్లకు పడిపోయింది. 30 ఏళ్ల క్రితం 5 వేల వరకూ ఉన్న బావుల సంఖ్య ప్రస్తుతం 0.45 మిలియన్లకు పెరిగింది. బెంగుళూరు జనాభా ప్రతి సంవత్సరం 3.5శాతం పెరుగుతూ 2031 నాటికి 20.3మిలియన్లకు చేరుకుంటుంది. నూతన ఆవిష్కరణలు చేయడంతోపాటు ప్రస్తుతం ఉన్న నీటి వనరులను సవ్యంగా వినియోగించుకోకపోతే కేప్‌టౌన్‌లాంటి పరిస్థితులు ఇక్కడ కూడా ఎదురవ్వడానికి ఎంతో సమయం పట్టదు. ఈ పది నగరాలు ఇప్పటికైనా మేల్కోనకపోతే అతి త్వరలోనే తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొంటాయని ఈ పత్రిక వెల్లడించింది. బెంగుళూరుతోపాటు చైనాలోని బీజింగ్, మెక్సికోలోని మెక్సికో సిటీ, కెన్యాలోని నైరోబీ, పాకిస్తాన్‌లోని కరాచీ, ఆఫ్గానిస్తాన్‌లోని కాబూల్, టర్కీలోని ఇస్తాంబుల్‌లో కూడా ఇవే పరిస్ధితులు నెలకొని ఉన్నాయి.