
సిడ్నీ : ఆస్ట్రేలియాలో మనుషులకేమోగానీ పశువులకు తీవ్రమైన నీటి కరువు వచ్చి పడింది. కాల్వలు, గుంటలు, బావులు ఎండి పోవడంతో అవి బావురుమంటున్నాయి. వాటిని బతికించడం కోసం రైతులు వాటర్ ట్యాంకులు తెప్పించి మరీ వాటి దాహం తీర్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఒక్కోసారి వాటర్ ట్యాంకర్ నీటి కోసం కూడా 50 నుంచి 70 కిలోమీటర్ల దూరం వరకు వాటిని తోలుకొని పోవాల్సి వస్తోందని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు.
తన పశువుల దాహం తీర్చేందుకు తాను తరచుగా గంటసేపు వాటితో ప్రయాణించాల్సి వస్తోంది. 1300 పశువులు కలిగిన అంబర్ లియా అనే ఆవిడ మీడియాకు తెలియజేసింది. పశువుల దాహం తీర్చేందుకు తెప్పించిన ఓ వాటర్ ట్యాంకర్ వద్ద దాహం తీర్చుకునేందుకు ఎగబడుతున్న పశువుల మందను ద్రోన్ కెమెరా ద్వారా వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దాన్ని వీక్షించిన వారికి అక్కడ ఎంత కరువు పరిస్థితులున్నాయో చెప్పకనే తెలుస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment