న్యూఢిల్లీ: తీవ్ర నీటి సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న ఢిల్లీకి హర్యానా ప్రభుత్వం మరింత నీటిని విడుదల చేయాలన్న డియాండ్‌తో ఢిల్లీ మంత్రి అతిశీ చేపట్టిన దీక్ష నాలుగో రోజుకు చేరుకుంది. సోమవారం(జూన్24) ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు ఆహారం తీసుకోకపోవడం వల్ల ఆమె ఆరోగ్యం క్షీణిస్తోందని పేర్కొన్నారు.
వెంటనే ఆసుపత్రిలో చేరాలని సూచించారు. ఈ సందర్భంగా ఆతిశీ మీడియాతో మాట్లాడారు. తన రక్తపోటు, చక్కెర స్థాయిలు పడిపోతున్నాయని చెప్పారు. బరువు తగ్గానని తెలిపారు. దీని వల్ల భవిష్యత్తులో తన ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుందన్నారు. అయినా తాను ఢిల్లీ ప్రజల తరపున పోరాడతానన్నారు.
హర్యానా ప్రభుత్వం ఢిల్లీకి మరింత నీటిని విడుదల చేసే వరకు నిరాహార దీక్షను కొనసాగిస్తానని స్పష్టం చేశారు. ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినప్పటికీ హర్యానా ప్రభుత్వం రోజుకు 100 మిలియన్ గ్యాలన్ల నీటిని కూడా ఢిల్లీకి విడుదల చేయడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ చర్య వల్ల ఢిల్లీలో 28 లక్షల మంది ప్రజలు తాగునీటికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. మరోవైపు ఆతిశీ దీక్షకు మద్దతుగా క్యాండిల్‌లైట్ మార్చ్ నిర్వహిస్తామని ఆప్ తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment