న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో నెలకొన్న నీటి సంక్షోభం రోజుకో కొత్త మలుపు తీసుకుంటోంది. ఓ పక్క రాజధాని నగరానికి సరిపడా నీళ్లను హర్యానాలోని బీజేపీ ప్రభుత్వం ఇవ్వడం లేదని ఆరోపిస్తూ మంత్రి ఆతిషి నిరవధిక నిరాహారదీక్షకు దిగారు.
మరోపక్క ఆప్ పార్టీ ప్రభుత్వమే నీటి సంక్షోభానికి కారణమని బీజేపీ నేతలు శనివారం(జూన్22) ఢిల్లీ ఓక్లాలోని జల్‌బోర్డు ఆఫీస్ ముందు నిరసనకు దిగారు. వీరిపై పోలీసులు వాటర్ క్యానన్‌లను ప్రయోగించి చెల్లాచెదురు చేశారు.
VIDEO | #Delhi water crisis: BJP leader Ramesh Bidhuri leads a protest at Jal Board filling pump, Okhla. Police use water cannon on protesters.
(Full video available on PTI Videos - https://t.co/n147TvqRQz) pic.twitter.com/THrwjXZgg6— Press Trust of India (@PTI_News) June 22, 2024
నీటి కొరత వేళ నీళ్లతోనే నిరసనకారులను చెదరగొట్టడమా అని పోలీసులపై సోషల్‌మీడియాలో నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. గత కొన్ని రోజులుగా ఢిల్లీలో హీట్‌వేవ్ పరిస్థితులుండటంతో రిజర్వాయర్‌లలో నీటినిల్వలు తగ్గాయి. యమునా నదిలోనూ నీటి లభ్యత తక్కువైంది.
దీనికి తోడు కొన్ని వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్‌లలో సాంకేతిక సమస్యల కారణంగా ఢిల్లీలో కొన్ని ప్రాంతాలకు నీటి సరఫరా పూర్తిగా ఆగిపోయింది. దీంతో నీటి కోసం ప్రజలు ట్యాంకర్ల వద్ద గొడవలు పడే పరిస్థితి తలెత్తింది. దీనిపై ఆప్, బీజేపీలు తప్పు మీదంటే మీదని ఒకరిపై ఒకరు మాటల దాడి చేసుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment