ఢిల్లీ: ఢిల్లీలో నీటి సంక్షోభం కొనసాగుతోంది. ఈ క్రమంలో ఢిల్లీలో తాగునీటి సంక్షోభ పరిస్థితులు మెరుగుపడకపోతే సత్యాగ్రహ దీక్ష చేపడతామని జలనరుల శాఖ మంత్రి అతిశీ అన్నారు. ఆమె బుధవారం మీడియాతో మాట్లాడారు.
‘‘ ప్రధాన మంత్రి నరేంద్రమోదీకి లేఖ రాశాను. ఢిల్లీ నీటి సంక్షోభం సమస్యను తర్వగా పరిష్కరించాలని కోరాను. రెండు రోజుల్లో ఈ సమస్యను పరిష్కరించకపోతే జూన్ 21 నుంచి సత్యాగ్రహ దీక్ష చేపడతామని తెలిపాను. ఢిల్లీకి రావల్సిన నీటి వాటాను హర్యానా రాష్ట్రం విడుదల చేయటం లేదు. హర్యానా వ్యవహరిస్తున్న తీరుతో ఢిల్లీ ప్రజలు నీటి కోసం తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు.
#WATCH | Delhi Water Minister Atishi says, "Today I have written a letter to the Prime Minister saying that 28 lakh people in Delhi are not getting water. I have requested that he should help provide water as soon as possible...If the people of Delhi do not get their rightful… pic.twitter.com/25aoBprKeN
— ANI (@ANI) June 19, 2024
.. నిన్న హర్యానా ఢిల్లీకి రావాల్సిన 613 ఎంజీడీ నీటికి కేవలం 513 ఎంజీడీ నీరు విడుదల చేసింది. ఒక్క ఎంజీడీ నీరు 28, 500 మందికి సరిపోతాయి. అంటే హర్యానా విడుదల చేసిన నీరు కేవలం 28 లక్షల మందికి మాత్రమే సరిపోతాయి. ఇక నీటీ సమస్య అనేకసార్లు హర్యానా ప్రభుత్వానికి లేఖలు కూడా రాశాను’’ అని మంత్రి అతిశీ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment