delhi water crisis
-
ముగిసిన ఆతిశి నిరాహార దీక్ష
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో నీటి సమస్యను పరిష్కరించాలంటూ ఈనెల 21వ తేదీ నుంచి మంత్రి ఆతిశి కొనసాగిస్తున్న నిరాహార దీక్ష అర్ధంతరంగా ముగిసింది. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆమెను లోక్‌నాయక్ ఆస్పత్రిలో చేర్పించారు. ఐసీయూలో చికిత్స పొందుతున్న మంత్రి ఆతిశి పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉన్నట్లు ఆస్పత్రి మెడికల్ డైరెక్టర్ డాక్టర్ సురేశ్ కుమార్ తెలిపారు.అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన మంత్రి ఆతిశి దాదాపు ఐదు రోజులుగా సాగిస్తున్న నిరాహార దీక్షను విరమించారని ఆప్ రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ చెప్పారు. ఢిల్లీకి న్యాయబద్ధంగా అందాల్సిన నీటిని హరియాణా నుంచి విడుదల చేయించాలంటూ ప్రధానికి ఆప్ ఎంపీలు లేఖ రాస్తారన్నారు. -
క్షీణించిన మంత్రి అతిశీ ఆరోగ్యం.. నిరసన దీక్ష విరమణ
ఢిల్లీ: ఢిల్లీ నీటి సంక్షోభాన్ని పరిష్కరించాలని చేపట్టిన నిరవధిక నిరాహారదీక్షను ఆప్ జలవనరుల శాఖ మంత్రి అతిశీ విరమించారని ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ వెల్లడించారు. నిరవధిక నిరాహారదీక్ష చేపట్టిన మంత్రి అతిశీ ఆరోగ్యం క్షీణించటంతో ఆమెను ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు. అదే విధంగా హర్యానా నుంచి ఢిల్లీకి రావాల్సిన నీటి వాటాను అందించాలని ప్రధాని నరేంద్రమోదీకి లేఖ రాసినట్లు తెలిపారు.‘‘మంత్రి అతిశీ ఆరోగ్యం క్షీణించింది. ఆమె బీపీ లెవల్స్ పడిపోయాయి. ఎల్ఎన్జేపీ ఆస్పత్రి వైద్యులు వెంటనే ఆమెను ఆస్పత్రితలో చేరి చికిత్స తీసుకోవాలన్నారు. హర్యానా నుంచి ఢిల్లీకి రావాల్సిన న్యాయమైన నీటి వాటాను కేటాయించాలని ఆమె గత ఐదు రోజులుగా నిరవధిక నిరాహారదీక్షలో ఉన్నారు. ప్రస్తుతం ఆమె ఎల్ఎన్జేపీ ఆస్పత్రి ఐసీయూలో జాయిన్ అయ్యారు. ఆమె త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా’’ అని ఆయన ‘ఎక్స్’లో తెలిపారు.తీవ్ర నీటీ సంక్షోభ సమయంలో హర్యానా నుంచి ఢిల్లీకి రావాల్సిన నీటి వాటా విషయంలో ప్రధాని మోదీ జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేస్తూ మంత్రి అతిశీ జూన్ 21 నుంచి నిరవధిక నిరాహారాదీక్ష చేపట్టారు. మంగళవారం ఆమె ఆరోగ్యం క్షీణించటంతో దీక్ష విరమించి హాస్పిటల్లో చేరారు. -
ఢిల్లీ నీటి సంక్షోభం: ‘అప్పటివరకు నిరాహార దీక్ష విరమించను’
ఢిల్లీ: ఢిల్లీలో నెలకొన్న నీటి సంక్షోభాన్ని పరిష్కరించాలని ఆప్ జలవనరుల శాఖ మంత్రి అతిశీ చేపట్టిన నిరవధిక నిరాహార దీక్ష రెండోరోజు కొనసాగుతోంది. హర్యానా ప్రభుత్వం ఢిల్లీకి వచ్చే వాటాను విడుదల చేసేవరకు తన నిరహార దీక్ష కొనసాగుతూనే ఉంటుందని స్పష్టం చేశారు. ఆమె శనివారం మీడియాతో మాట్లాడారు.‘హర్యానా ప్రభుత్వం ఢిల్లీలోని 28 లక్షల మందికి అవసరమయ్యే నీటిని విడుదల చేసేవరకు నేను చేపట్టిన నిరవధిక నిరాహార దీక్షను విరమించను. హర్యానా ప్రభుత్వం.. ఢిల్లీకి 613 ఎంజీడీ వాటర్ ఇవ్వాల్సి ఉంది. కానీ, కొన్ని వారాల నుంచి కేవలం 513 ఎంజీడీ నీటిని మాత్రమే హర్యానా రాష్ట్రం సరాఫరా చేస్తోంది. అన్ని ప్రయత్నాలు చేసినా ఎటువంటి ప్రయోజనం లేదు. అందుకే నా నిరాహార దీక్ష కూడా విరమించను’అని అతిశీ అన్నారు.గత కొన్ని రోజులు ఢిల్లీ తీవ్రమైన నీటి కొరతను ఎదుర్కొంటోంది. యమునా నది వాటర్‌లో హిమాచల్ ప్రదేశ్, హర్యానా రాష్ట్రాలను ఢిల్లీకి రావాల్సిన నీటి వాటాను ఇవ్వటం లేదని ఆరోపణలు చేస్తోంది. ఇక.. బుధవారం అతిశీ ప్రధాని మోదీకి లేఖ రాశారు. ఢిల్లీ నీటి సంక్షోభం విషయంలో జోక్యం చేసుకొని సమస్క పరిష్కరించాలని కోరింది. లేదంటే తాను 21 తేదీ నుంచి నిరాహార దీక్ష చేపడతానని పేర్కొన్నారు. అందులో భాగంగా అతిశీ రెండోరోజు నిరవధిక దీక్ష కొనసాగుతోంది. -
ఢిల్లీ నీటి సమస్య పరిష్కరించకపోతే.. ప్రధానికి ఆప్ మంత్రి లేఖ
ఢిల్లీ: ఢిల్లీలో నీటి సంక్షోభం కొనసాగుతోంది. ఈ క్రమంలో ఢిల్లీలో తాగునీటి సంక్షోభ పరిస్థితులు మెరుగుపడకపోతే సత్యాగ్రహ దీక్ష చేపడతామని జలనరుల శాఖ మంత్రి అతిశీ అన్నారు. ఆమె బుధవారం మీడియాతో మాట్లాడారు. ‘‘ ప్రధాన మంత్రి నరేంద్రమోదీకి లేఖ రాశాను. ఢిల్లీ నీటి సంక్షోభం సమస్యను తర్వగా పరిష్కరించాలని కోరాను. రెండు రోజుల్లో ఈ సమస్యను పరిష్కరించకపోతే జూన్ 21 నుంచి సత్యాగ్రహ దీక్ష చేపడతామని తెలిపాను. ఢిల్లీకి రావల్సిన నీటి వాటాను హర్యానా రాష్ట్రం విడుదల చేయటం లేదు. హర్యానా వ్యవహరిస్తున్న తీరుతో ఢిల్లీ ప్రజలు నీటి కోసం తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు.#WATCH | Delhi Water Minister Atishi says, "Today I have written a letter to the Prime Minister saying that 28 lakh people in Delhi are not getting water. I have requested that he should help provide water as soon as possible...If the people of Delhi do not get their rightful… pic.twitter.com/25aoBprKeN— ANI (@ANI) June 19, 2024 .. నిన్న హర్యానా ఢిల్లీకి రావాల్సిన 613 ఎంజీడీ నీటికి కేవలం 513 ఎంజీడీ నీరు విడుదల చేసింది. ఒక్క ఎంజీడీ నీరు 28, 500 మందికి సరిపోతాయి. అంటే హర్యానా విడుదల చేసిన నీరు కేవలం 28 లక్షల మందికి మాత్రమే సరిపోతాయి. ఇక నీటీ సమస్య అనేకసార్లు హర్యానా ప్రభుత్వానికి లేఖలు కూడా రాశాను’’ అని మంత్రి అతిశీ తెలిపారు. -
సమస్యను గాలికొదిలి ఇక్కడ కూర్చుంటారా?
ఢిల్లీ నీటి శాఖ మంత్రి కపిల్ మిశ్రాకు సుప్రీంకోర్టు అక్షింతలు వేసింది. ఆయన కోర్టుకు రావడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. సామాన్య ప్రజలు నీటి కొరతతో అక్కడ ఇబ్బంది పడుతుంటే.. దాన్ని గాలికి వదిలేసి ఇక్కడ కోర్టుకు వచ్చి కూర్చుంటారా అని మండిపడింది. ఇది రెండు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వివాదమని, తక్షణం దీన్ని పరిష్కరించుకోవాలని తెలిపింది. మునాక్ కాలువ గేట్లను మూసేసి, ఢిల్లీకి నీటి సరఫరాను అడ్డుకున్న విషయంపై కేంద్ర ప్రభుత్వానికి, హర్యానా, యూపీ ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు నోటీసులు జారీచేసింది. ఈ కేసు తదుపరి విచారణను ఈనెల 25వ తేదీకి వాయిదా వేసింది. -
కేంద్రానికి కేజ్రీవాల్ థ్యాంక్స్
ఢిల్లీ మంచి నీటి సమస్యను తీర్చడంలో ఎంతగానో సహకరించిన కేంద్ర ప్రభుత్వానికి, ఆర్మీకి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కృతజ్ఞతలు తెలిపారు. మునాక్ కాల్వను సంరక్షించడంతో ఢిల్లీకి చాలా ఊరట లభించిందని ఆయన సోమవారం ఉదయం ఓ ట్వీట్లో పేర్కొన్నారు. అంతకుముందు.. తమకు నీళ్లు పూర్తిగా అయిపోయాయని, అందువల్ల వెంటనే జోక్యం చేసుకుని హరియాణాలో మునాక్ కాల్వ నుంచి నీళ్లు వదిలేలా చూడాలని చేతులు జోడించి వేడుకుంటున్నానని తెలిపారు. మునాక్ కాల్వ నుంచి ఢిల్లీలోని పలు ప్రాంతాలకు నీటి సరఫరా జరుగుతుంది. అయితే జాట్ల ఆందోళన కారణంగా ఆ కాల్వ నుంచి ఢిల్లీకి నీటి సరఫరాను నిలిపివేశారు. తన ఇంటికి కూడా సోమవారం ఉదయం నుంచి నీటి సరఫరా నిలిచిపోయిందంటూ ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోదియా తెలిపారు. తమకు 'డ్రై డే' మొదలైందని అన్నారు. ఢిల్లీకి ఇక ముందున్నది కష్టకాలమేనని ఆయన చెప్పారు. హరియాణా నుంచి నీటి సరఫరా నిలిచిపోతే రాజధానిలో జలసంక్షోభం ఏర్పడుతుందని, రాబోయే రోజుల్లో పరిస్థితి మరింత తీవ్రమవుతుందని ఢిల్లీ నీటి శాఖ మంత్రి కపిల్ మిశ్రా ఆదివారం హెచ్చరించారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఢిల్లీ ప్రజలు నీటిని జాగ్రత్తగా వాడుకోవాలని సూచించారు. ఢిల్లీ జల బోర్డ్ (డిజెబి) మొత్తం 9 నీటి శుద్ధి యంత్రాల ద్వారా రోజుకు 820 మిలియన్ గ్యాలన్ల నీటిని ఉత్పత్తి చేస్తుందని, వీటిలో ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ నుంచి నీటిని సేకరించే సోనియా విహార్, భాగీరథి రెండు మాత్రమే పనిచేస్తున్నాయని కపిల్ మిశ్రా తెలిపారు. దీంతో 240 మిలియన్ గ్యాలన్ల నీరు మాత్రమే ఉత్పత్తి అవుతోందని, మిగిలిన నీటిని హరియాణా నుంచే పొందుతున్నట్లు చెప్పారు. Thank u army, thank u centre for securing munak canal back. Great relief for delhi — Arvind Kejriwal (@ArvindKejriwal) February 22, 2016 We've completely run out of water. I appeal to the centre with folded hands to immediately intervene and get munak canal started in Haryana — Arvind Kejriwal (@ArvindKejriwal) February 22, 2016 So! dry day starts from today? No water supply at my home this morning. No hope to get water in Munak Canal. Tough days ahead for Delhi. — Manish Sisodia (@msisodia) February 22, 2016