కేంద్రానికి కేజ్రీవాల్ థ్యాంక్స్ | arvind kejriwal thanks centre for solving water crisis | Sakshi
Sakshi News home page

కేంద్రానికి కేజ్రీవాల్ థ్యాంక్స్

Published Mon, Feb 22 2016 10:43 AM | Last Updated on Sun, Sep 3 2017 6:11 PM

కేంద్రానికి కేజ్రీవాల్ థ్యాంక్స్

కేంద్రానికి కేజ్రీవాల్ థ్యాంక్స్

ఢిల్లీ మంచి నీటి సమస్యను తీర్చడంలో ఎంతగానో సహకరించిన కేంద్ర ప్రభుత్వానికి, ఆర్మీకి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కృతజ్ఞతలు తెలిపారు. మునాక్ కాల్వను సంరక్షించడంతో ఢిల్లీకి చాలా ఊరట లభించిందని ఆయన సోమవారం ఉదయం ఓ ట్వీట్‌లో పేర్కొన్నారు.

అంతకుముందు.. తమకు నీళ్లు పూర్తిగా అయిపోయాయని, అందువల్ల వెంటనే జోక్యం చేసుకుని హరియాణాలో మునాక్ కాల్వ నుంచి నీళ్లు వదిలేలా చూడాలని చేతులు జోడించి వేడుకుంటున్నానని తెలిపారు. మునాక్ కాల్వ నుంచి ఢిల్లీలోని పలు ప్రాంతాలకు నీటి సరఫరా జరుగుతుంది. అయితే జాట్ల ఆందోళన కారణంగా ఆ కాల్వ నుంచి ఢిల్లీకి  నీటి సరఫరాను నిలిపివేశారు. తన ఇంటికి కూడా సోమవారం ఉదయం నుంచి నీటి సరఫరా నిలిచిపోయిందంటూ ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోదియా తెలిపారు. తమకు 'డ్రై డే' మొదలైందని అన్నారు. ఢిల్లీకి ఇక ముందున్నది కష్టకాలమేనని ఆయన చెప్పారు.

హరియాణా నుంచి నీటి సరఫరా నిలిచిపోతే రాజధానిలో జలసంక్షోభం ఏర్పడుతుందని, రాబోయే రోజుల్లో పరిస్థితి మరింత తీవ్రమవుతుందని ఢిల్లీ నీటి శాఖ మంత్రి కపిల్ మిశ్రా ఆదివారం హెచ్చరించారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఢిల్లీ ప్రజలు నీటిని జాగ్రత్తగా వాడుకోవాలని సూచించారు. ఢిల్లీ జల బోర్డ్ (డిజెబి) మొత్తం 9 నీటి శుద్ధి యంత్రాల ద్వారా రోజుకు 820 మిలియన్ గ్యాలన్ల నీటిని ఉత్పత్తి చేస్తుందని, వీటిలో ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ నుంచి నీటిని సేకరించే సోనియా విహార్, భాగీరథి రెండు మాత్రమే పనిచేస్తున్నాయని కపిల్ మిశ్రా తెలిపారు. దీంతో 240 మిలియన్ గ్యాలన్ల నీరు మాత్రమే ఉత్పత్తి అవుతోందని, మిగిలిన నీటిని హరియాణా నుంచే పొందుతున్నట్లు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement