ఢిల్లీ: ఢిల్లీలో నెలకొన్న నీటి సంక్షోభాన్ని పరిష్కరించాలని ఆప్ జలవనరుల శాఖ మంత్రి అతిశీ చేపట్టిన నిరవధిక నిరాహార దీక్ష రెండోరోజు కొనసాగుతోంది. హర్యానా ప్రభుత్వం ఢిల్లీకి వచ్చే వాటాను విడుదల చేసేవరకు తన నిరహార దీక్ష కొనసాగుతూనే ఉంటుందని స్పష్టం చేశారు. ఆమె శనివారం మీడియాతో మాట్లాడారు.
‘హర్యానా ప్రభుత్వం ఢిల్లీలోని 28 లక్షల మందికి అవసరమయ్యే నీటిని విడుదల చేసేవరకు నేను చేపట్టిన నిరవధిక నిరాహార దీక్షను విరమించను. హర్యానా ప్రభుత్వం.. ఢిల్లీకి 613 ఎంజీడీ వాటర్ ఇవ్వాల్సి ఉంది. కానీ, కొన్ని వారాల నుంచి కేవలం 513 ఎంజీడీ నీటిని మాత్రమే హర్యానా రాష్ట్రం సరాఫరా చేస్తోంది. అన్ని ప్రయత్నాలు చేసినా ఎటువంటి ప్రయోజనం లేదు. అందుకే నా నిరాహార దీక్ష కూడా విరమించను’అని అతిశీ అన్నారు.
గత కొన్ని రోజులు ఢిల్లీ తీవ్రమైన నీటి కొరతను ఎదుర్కొంటోంది. యమునా నది వాటర్‌లో హిమాచల్ ప్రదేశ్, హర్యానా రాష్ట్రాలను ఢిల్లీకి రావాల్సిన నీటి వాటాను ఇవ్వటం లేదని ఆరోపణలు చేస్తోంది. ఇక.. బుధవారం అతిశీ ప్రధాని మోదీకి లేఖ రాశారు. ఢిల్లీ నీటి సంక్షోభం విషయంలో జోక్యం చేసుకొని సమస్క పరిష్కరించాలని కోరింది. లేదంటే తాను 21 తేదీ నుంచి నిరాహార దీక్ష చేపడతానని పేర్కొన్నారు. అందులో భాగంగా అతిశీ రెండోరోజు నిరవధిక దీక్ష కొనసాగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment