న్యూఢిల్లీ: దేశ రాజధానిలో నీటి సంక్షోభం తలెత్తిన వేళ లెఫ్టినెంట్ గవర్నర్(ఎల్‌జీ) వీకే సక్సేనాపై ఆమ్‌ఆద్మీపార్టీ(ఆప్) విమర్శల దాడికి దిగింది. వీకే సక్సేనా హర్యానా బీజేపీకి అధికార ప్రతినిధి అనుకుంటున్నారా అని ప్రశ్నించింది. ఈ మేరకు ఆప్ నేత గోపాల్‌రాయ్ ఆదివారం(జూన్23) మీడియాతో మాట్లాడారు.
‘ఎల్జీ వీకే సక్సేనా హర్యానాకు ఎల్జీ కాదు. ఆయన ఢిల్లీకి ఎల్జీ. ఢిల్లీ ప్రజల ఇబ్బందులు ఎల్జీకి పట్టవు. ఆయకు ఇది సిగ్గుచేటు. ఢిల్లీలో నీటి కొరతపై మంత్రి ఆతిషి నిరవధిక నిరాహారదీక్ష చేస్తున్నారు’అని గోపాల్‌రాయ్ మండిపడ్డారు.
ఢిల్లీ నీటి సంక్షోభాన్ని పొరుగు రాష్ట్రాల వారిని అపఖ్యాతిపాలు చేయడానికి వాడుకుంటున్నారని ఆప్‌ను ఉద్దేశించి ఎల్జీ వ్యాఖ్యానించిన నేపథ్యంలో ఆప్ ఆయనపై విమర్శలకు దిగింది.
Comments
Please login to add a commentAdd a comment