leftinent governer
-
చలాన్ల ఆధారంగా వాహన బీమా పెంపు: ఢిల్లీ ఎల్జీ
ఢిల్లీ:దేశ రాజధాని ఢిల్లీవాసులు ట్రాఫిక్ రూల్స్ పక్కాగా పాటించేందుకు కీలక చర్యలు తీసుకోవాలని ఢీల్లీ లెఫ్టినెంట్ గవర్నర్(ఎల్జీ) వీకే సక్సేనా అన్నారు. అతివేగం, నిర్లక్ష్యంగా నడపడం, ఇతర నేరాలకు పాల్పడేవారికి చలాన్ల సంఖ్య ఆధారంగా అధిక వాహనబీమా ప్రీమియం చెల్లించే విధానం తీసుకురావాలన్నారు. ఇందుకోసం ట్రాఫిక్ చలానాల సంఖ్యతో వాహనాల బీమా ప్రీమియాన్ని ముడిపెట్టాలని సూచించారు. తన ఈ సూచనను పరిశీలించాలని కోరుతూ ఎల్జీ ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్‌కు ఒక లేఖ రాశారు. -
సీఎం పదవికి కేజ్రీవాల్ రాజీనామా
సాక్షి,ఢిల్లీ: ఢిల్లీ సీఎం పదవికి ఆమ్ఆద్మీపార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ రాజీనామా చేశారు. మంగళవారం(సెప్టెంబర్17) సాయంత్రం లెఫ్టినెంట్ గవర్నర్(ఎల్జీ) వీకేసక్సేనా నివాసానికి వెళ్లిన కేజ్రీవాల్ తన రాజీనామాను సమర్పించారు. ఎల్జీని కలిసేందుకు కేజ్రీవాల్ వెంట ఆమ్ఆద్మీపార్టీ సీనియర్ నేత మనీష్ సిసోడియా, కాబోయే సీఎం అతిషి, మంత్రులు ఉన్నారు. అతిషిని కొత్త సీఎంగా ఎంపిక చేసినట్లు ఈ సందర్భంగా ఎల్జీకి కేజ్రీవాల్ తెలిపారు. #WATCH | Delhi CM Arvind Kejriwal along with proposed CM Atishi and other cabinet ministers arrive at the LG secretariateArvind Kejriwal will tender his resignation as Delhi CM pic.twitter.com/BNVrUChlgR— ANI (@ANI) September 17, 2024కాగా, రెండు రోజల క్రితం ఆప్ పార్టీ మీటింగ్‌లో చెప్పినట్లుగానే కేజ్రీవాల్ తన సీఎం పదవికి రాజీనామా చేశారు. సీఎం పదవికి ఇప్పటికే మంత్రి ఆతిషి పేరును కేజ్రీవాల్ ప్రకటించారు. మంగళవారం జరిగిన ఆమ్ఆద్మీపార్టీ శాసనాసభాపక్షంలోనూ అతిషి పేరును కొత్త సీఎం పదవికి ఆమోదించారు. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాల్సిందిగా ఎల్జీని కోరిన అతిషి..రాజీనామా చేసేందుకు ఎల్జీ వద్దకు వెళ్లిన మాజీ సీఎం కేజ్రీవాల్‌తో పాటే కాబోయే సీఎం అతిషి కూడా వెళ్లారు. కేజ్రీవాల్ రాజీనామా సమర్పించిన తర్వాత ఆమె ఎల్జీని కలిశారు. తనను కొత్త సీఎంగా ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని ఆమె ఎల్జీని కోరారు. తనకు ఆమ్ఆద్మీపార్టీ ఎమ్మెల్యేలు మద్దతిస్తూ సంతకం చేసిన పత్రాన్ని ఆమె ఈ సందర్భంగా ఎల్జీకి అందించినట్లు తెలిసింది. #WATCH | Delhi CM Arvind Kejriwal along with proposed CM Atishi and other cabinet ministers arrive at the LG secretariateArvind Kejriwal will tender his resignation as Delhi CM pic.twitter.com/BNVrUChlgR— ANI (@ANI) September 17, 2024ఇదీ చదవండి.. కొత్త సీఎంగా అతిషి.. ప్రకటించిన కేజ్రీవాల్ -
ఆయన ఢిల్లీకి ఎల్జీ కాదు.. వీకే సక్సేనాపై ‘ఆప్’ సెటైర్లు..
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో నీటి సంక్షోభం తలెత్తిన వేళ లెఫ్టినెంట్ గవర్నర్(ఎల్జీ) వీకే సక్సేనాపై ఆమ్ఆద్మీపార్టీ(ఆప్) విమర్శల దాడికి దిగింది. వీకే సక్సేనా హర్యానా బీజేపీకి అధికార ప్రతినిధి అనుకుంటున్నారా అని ప్రశ్నించింది. ఈ మేరకు ఆప్ నేత గోపాల్‌రాయ్ ఆదివారం(జూన్23) మీడియాతో మాట్లాడారు.‘ఎల్జీ వీకే సక్సేనా హర్యానాకు ఎల్జీ కాదు. ఆయన ఢిల్లీకి ఎల్జీ. ఢిల్లీ ప్రజల ఇబ్బందులు ఎల్జీకి పట్టవు. ఆయకు ఇది సిగ్గుచేటు. ఢిల్లీలో నీటి కొరతపై మంత్రి ఆతిషి నిరవధిక నిరాహారదీక్ష చేస్తున్నారు’అని గోపాల్‌రాయ్ మండిపడ్డారు. ఢిల్లీ నీటి సంక్షోభాన్ని పొరుగు రాష్ట్రాల వారిని అపఖ్యాతిపాలు చేయడానికి వాడుకుంటున్నారని ఆప్‌ను ఉద్దేశించి ఎల్జీ వ్యాఖ్యానించిన నేపథ్యంలో ఆప్ ఆయనపై విమర్శలకు దిగింది. -
ఢిల్లీ: కేజ్రీవాల్‌కు లెఫ్టినెంట్ గవర్నర్ లేఖ
న్యూఢిల్లీ: లిక్కర్ కేసులో అరెస్టయి జైలులో ఉన్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను లెఫ్టినెంట్ గవర్నర్(ఎల్జీ) వీకే సక్సేనా ఇరుకునపెట్టారు. అసలే కష్టాల్లో ఉన్న ఆయనను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. ఢిల్లీలో ఉన్న మంచి నీటి సమస్యపై కేజ్రీవాల్‌కు మంగళవారం(ఏప్రిల్16) ఒక బహిరంగ లేఖ రాశారు. గత పదేళ్ల నుంచి ఢిల్లీ మంచి నీటి సమస్యను తీర్చడానికి ఆమ్ఆద్మీపార్టీ(ఆప్) ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదని లేఖలో ఎల్జీ విమర్శించారు. ప్రస్తుతం వచ్చిన మంచినీటి సమస్య సడెన్‌గా రాలేదని, ప్రతి ఏడాది ఈ సమస్య వస్తోందని గుర్తు చేశారు. మంచినీటి సమస్యపై గతంలో మీడియా ప్రచురించిన కథనాలను లేఖకు ఎల్జీ జత చేశారు. మంచి నీటి సరఫరా విషయంలో ఢిల్లీ కంటే ముంబై,చెన్నై,పుణె నగరాలు బెటర్‌గా ఉన్నాయని తెలిపారు. కాగా, లిక్కర్ కేసులో అరవింద్ కేజ్రీవాల్‌ను మార్చి 21న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన తీహార్ జైలులో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. ఇదీ చదవండి.. నా షుగర్ లెవెల్స్ పడిపోతున్నాయ్.. కోర్టులో కేజ్రీవాల్ -
ఓలా, ఉబెర్లపై ఢిల్లీ ప్రభుత్వ కీలక నిర్ణయం
న్యూఢిల్లీ: త్వరలో ఢిల్లీలో ఓలా, ఉబెర్ లాంటి యాప్ బేస్డ్ క్యాబ్ అగ్రిగేటర్లను ప్రభుత్వం నియంత్రించనుంది. ఇందు కోసం కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి.ఢిల్లీ ప్రభుత్వం రూపొందించిన డ్రాఫ్ట్ పాలసీకి లెఫ్టినెంట్ గవర్నర్ ఆమోదం తెలపడంతో కొత్త పాలసీని త్వరలో నోటిఫై చేస్తామని రవాణా శాఖ మంత్రి కైలాష్ గెహ్లాట్ తెలిపారు. కొత్త పాలసీ ప్రకారం ఓలా ఉబెర్ లాంటి యాప్ ఆధారిత క్యాబ్ సర్వీసు ప్రొవైడర్లు ఢిల్లీలో వాడే తమ వాహనాలను 2030లోగా ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చుకోవాల్సి ఉంటుంది. 25 కంటే ఎక్కువ వాహనాలున్న సర్వీస్ ప్రొవైడర్ కంపెనీలన్నింటికీ కొత్త పాలసీ వర్తిస్తుంది. ఈ పాలసీ కింద అగ్రిగేటర్లు లైసెన్స్ తీసుకోవాల్సి ఉంటుంది.క్యాబ్ ఆపరేటర్లు కస్టమర్ల వద్ద నుంచి పీక్ అవర్స్‌లో వసూలుచేసే అత్యధిక ఛార్జీలపై మాత్రం డ్రాఫ్ట్‌లో ఎలాంటి ప్రస్తావన లేకపోవడం గమనార్హం. ఈ కామర్స్ సేవలందించే అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌తో పాటు ఫుడ్ డెలివరీ యాప్‌లు జొమాటో, స్విగ్గీలకు కూడా ఈ కొత్త పాలసీ వర్తించనుంది.వారు కూడా తమ వాహనాలన్నింటినీ గడువులోగా విద్యుత్ వాహనాలుగా మార్చుకోవాల్సి ఉంటుంది.వాహనాలన్నీ రవాణా శాఖ నిబంధనలకు అనుగుణంగానే ఢిల్లీలో తిరగాల్సి ఉంటుంది.నిబంధనలు ఉల్లంఘించిన వారిపై లక్ష రూపాయల దాకా జరిమానాలు విధంచనున్నారు. ఇదీచదవండి..దివ్యాంగులకు రైల్వేశాఖ అందించే ప్రత్యేక సౌకర్యాలివే.. -
పాలనాధికారం ఢిల్లీ సర్కార్‌దే
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో పరిపాలనా వ్యవహారాలపై అధికారం ఎవరిదన్న వివాదంపై సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పు వెలువరించింది. ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ప్రభుత్వానికి భారీ ఊరట కలిగించింది. శాంతిభద్రతలు(పబ్లిక్ ఆర్డర్), పోలీసు శాఖ, భూమి మినహా మిగిలిన పరిపాలనా వ్యవహారాలపై శాసన, కార్యనిర్వాహక అధికారాలు స్థానిక ఢిల్లీ ప్రభుత్వానికే ఉంటాయని తేల్చిచెప్పింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం గురువారం తీర్పును ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం, ఢిల్లీ ప్రభుత్వం మధ్య ఎనిమిదేళ్లుగా కొనసాగుతున్న వివాదానికి ముగింపు పలికింది. ఢిల్లీలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వం తీసుకొనే నిర్ణయాలకు కేంద్ర ప్రభుత్వ ప్రతినిధి అయిన లెఫ్టినెంట్ గవర్నర్(ఎల్జీ) కట్టుబడి ఉండాలని ఆదేశించింది. ప్రజల చేత ఎన్నికైన ప్రభుత్వానికే అధికార యంత్రాంగంపై నియంత్రణ ఉండాలని ధర్మాసనం పేర్కొంది. అధికారులు మంత్రుల ఆదేశాలు పాటించకపోతే, వారికి నివేదించకపోతే పరిపాలనపై అది ప్రతికూల ప్రభావం చూపుతుందని వెల్లడించింది. దేశ రాజధాని అయిన ఢిల్లీకి ప్రత్యేక స్వరూపం ఉందని, ఇతర రాష్ట్రాల తరహాలో ఇక్కడ ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ఉందని ధర్మాసనం గుర్తుచేసింది. కాబట్టి ఢిల్లీలో పరిపాలనపై అధికారాలు ప్రజాప్రతినిధులతో కూడిన స్థానిక ప్రభుత్వానికే ఉంటాయని స్పష్టంచేసింది. ఢిల్లీలో పబ్లిక్ ఆర్డర్, పోలీసు శాఖ, భూమిపై అధికారాలు కేంద్రానివేనని ఉద్ఘాటించింది. సహకార సమాఖ్య స్ఫూర్తి ప్రకారం రాజ్యాంగం నిర్దేశించిన పరిధులకు లోబడి కేంద్రం తన అధికారాలను ఉపయోగించాలని సూచించింది. సివిల్ సర్వీసు అధికారులు రాజకీయంగా తటస్థంగా వ్యవహరించాలని, ప్రభుత్వం రోజువారీగా తీసుకొనే నిర్ణయాలను అమలు చేయడానికి మంత్రుల పరిపాలనాపరమైన నియంత్రణ కింద పనిచేయాలని పేర్కొంది. సమాఖ్య స్ఫూర్తిని పెంపొందించడానికి కేంద్ర ప్రభుత్వం, ఢిల్లీ ప్రభుత్వం పరస్పరం సహకరించుకోవాలని సూచించింది. కేజ్రీవాల్ కార్యాచరణ ప్రారంభం సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన కొన్ని గంటల్లోనే అరవింద్ కేజ్రీవాల్ తన కార్యాచరణ ప్రారంభించారు. ప్రజల సమస్యల పరిష్కారం విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని అధికారులను హెచ్చరించారు. ఇక తన చేతులను ఎవరూ కట్టిపారేయలేరని, అభివృద్ధిని 10 రెట్లు వేగవంతంగా చేస్తామని చెప్పారు. సర్వీసెస్ సెక్రెటరీ పోస్టు నుంచి ఆశీష్ మోరేను తొలగించారు. ఆయన స్థానంలో 1995 బ్యాచ్ ఐఏఎస్ అధికారి ఏకే సింగ్‌ను నియమించారు. ఢిల్లీలో త్వరలో బదిలీ–పోస్టింగ్ పరిశ్రమ రాబోతోందని బీజేపీ వ్యంగ్యంగా వ్యాఖ్యానించింది. చరిత్రాత్మక తీర్పు అని కాంగ్రెస్ పేర్కొంది. కేంద్ర హోం శాఖ నోటిఫికేషన్‌తో వివాదం ఢిల్లీలో పరిపాలన సర్వీసులపై అధికారాలు కేంద్ర ప్రభుత్వ నియంత్రణలోనే ఉంటాయని తేల్చిచెబుతూ 2015లో కేంద్ర హోంశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. ఇతర కేంద్ర పాలిత ప్రాంతాల మాదిరిగా కాకుండా భారత రాజ్యాంగం ఢిల్లీకి విశిష్ట హోదా కల్పించిందని తెలియజేసింది. ఈ నోటిఫికేషన్‌పై అభ్యంతరం వ్యక్తం ఆప్ ప్రభుత్వం తొలుత ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అక్కడ సానుకూల తీర్పు రాకపోవడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనిపై 2019 ఫిబ్రవరి 14న సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం తీర్పు వెలువరించింది. ఇద్దరు సభ్యులు భిన్నంగా స్పందించారు. ఢిల్లీలో పాలనపై ఢిల్లీ ప్రభుత్వానికి అధికారాలు ఉండవని జస్టిస్ అశోక్ భూషణ్ చెప్పగా, మరో సభ్యుడు జస్టిస్ ఏకే సిక్రీ దాన్ని వ్యతిరేకించారు. దీంతో ‘ఆప్’ ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు ఈ వివాదాన్ని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనానికి బదిలీ చేస్తున్నట్లు గతేడాది మే 6న సుప్రీంకోర్టు ప్రకటించింది. వివాదంపై విచారణ జరిపిన రాజ్యాంగ ధర్మాసనం తాజాగా తీర్పు వెలువరించింది. జస్టిస్ అశోక్ భూషణ్ ఇచ్చిన తీర్పును రాజ్యాంగ ధర్మాసనం తోసిపుచ్చింది. ఇది ప్రజాస్వామ్య విజయం: కేజ్రీవాల్ సుప్రీంకోర్టు తీర్పుపట్ల ‘ఆప్’ జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ హర్షం వ్యక్తం చేశారు. ఇది ప్రజాస్వామ్య విజయమని అభివర్ణించారు. ఢిల్లీ ప్రజలకు న్యాయం చేకూర్చిన సుప్రీంకోర్టుకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. ఇకపై ఢిల్లీలో అభివృద్ధిని వేగవంతం అవుతుందని అన్నారు. సర్వోన్నత న్యాయస్థానం తీర్పు కేంద్ర ప్రభుత్వానికి చెంపపెట్టు ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు పేర్కొన్నారు. ‘ఇది మైలురాయి లాంటి తీర్పు, సత్యమేవ జయతే’ అని ‘ఆప్’ రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్ధా ట్వీట్ చేశారు. చదవండి: కర్ణాటక కాంగ్రెస్‌దే! ఎగ్జిట్ పోల్స్ వెల్లడి.. ఒకవేళ హంగ్ అయితే కింగ్‌మేకర్ ఆ పార్టీయే! -
ఫిబ్రవరి 16న ఢిల్లీ మేయర్ ఎన్నిక.. ఈసారైనా జరిగేనా?
న్యూఢిల్లీ: ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ సమావేశం ఫిబ్రవరి 16న జరగనుంది. మేయర్ ఎన్నిక కోసం ఈ సెషన్ నిర్వహించాలని సీఎం అరవింద్ కేజ్రీవాల్ చేసిన ప్రతిపాదనకు లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ఆమోదం తెలిపారు. బీజేపీ, ఆప్ కార్పొరేటర్ల మధ్య రసాబాస జరగవడం వల్ల మేయర్ ఎన్నిక ఇప్పటికే మూడుసార్లు వాయిదాపడిన విషయం తెలిసిందే. మరి ఫిబ్రవరి 16న(గురువారం) అయినా ఈ ఎన్నిక జరుగుతుందో లేదో చూడాలి. మరోవైపు సీఎం అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని డిస్పెన్సేషన్ ద్వారా ఢిల్లీలోని పవర్ డిస్కమ్‌ల బోర్డులకు నియమించిన ఆప్ నేత జాస్మిన్ షాతో సహా ప్రభుత్వ నామినీలను సీనియర్ అధికారులతో భర్తీ చేశారు ఎల్జీ వీకే సక్సెనా. శనివారం ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. గవర్నర్ చర్యను ఆప్ తీవ్రంగా తప్పుబట్టింది. ఇది అక్రమం, రాజ్యాంగ విరుద్ధమని ఆరోపించింది. ఇలాంటి ఆదేశాలు జారీ చేసేందుకు ఎల్జీకి ఎలాంటి అధికారాలు లేవని పేర్కొంది. చదవండి: పెళ్లి దుస్తుల్లో వెళ్లి పరీక్ష రాసిన వధువు.. వీడియో వైరల్.. -
కేజ్రీవాల్ పార్టీకి షాకిచ్చిన ఢిల్లీ గవర్నర్.. రూ.97 కోట్లు కట్టాలని ఆదేశం..
న్యూఢిల్లీ: ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా.. అధికార ఆమ్ ఆద్మీ పార్టీకి మరోసారి షాక్ ఇచ్చారు. ప్రభుత్వ ప్రకటనల పేరుతో ఆప్ పార్టీ సొంత ప్రచారానికి చేసిన ఖర్చును చెల్లించాలని ఆదేశించారు. మొత్తం రూ.97 కోట్లు వసూలు చేయాలని ఢిల్లీ ప్రభుత్వ కార్యదర్శికి లేఖ రాశారు. ప్రభుత్వ ప్రకటనల నిబంధనలకు సంబంధించి 2016లో సుప్రీంకోర్టు, ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను ఆమ్ ఆద్మీ పార్టీ విస్మరించిందని వీకే సక్సెనా ఆరోపించారు. ప్రభుత్వ ప్రకటనల పేరు మీద ఆప్ సొంత పార్టీ కోసం ప్రచారం చేసుకుందని ఆరోపించారు. నిబంధనలు ఉల్లఘించినందుకు ఆ మొత్తాన్ని ఆప్ పార్టీనే చెల్లించాలన్నారు. అయితే వీకే సక్సేనా ఆదేశాలపై ఆప్ ఘాటుగా స్పందించింది. అసలు గవర్నర్‌కు ఆ అధికారమే లేదని పేర్కొంది. ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో ఆప్ విజయం, జాతీయ పార్టీగా అవతరించడం చూసి ఓర్వలేకే బీజేపీ ఇలాంటి చర్యలకు పాల్పడుతోందని ధ్వజమెత్తింది. ప్రధాని మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం కూడా ప్రకటనల కోసం వేల కోట్లు ఖర్చు చేసిందని ఆప్ చెప్పింది. బీజేపీ మొత్తం రూ.22 వేల కోట్లను ప్రభుత్వ ప్రకటనల పేరుతో ఖర్చు చేసిందని ఆరోపించింది. ఆ మొత్తాన్ని ఆ పార్టీ నుంచి వసూలు చేసిన తర్వాత తాము కూడా రూ.97 కోట్లు కచ్చితంగా చెల్లిస్తామని చెప్పుకొచ్చింది. చదవండి: Taj Mahal: రూ.1.9 కోట్లు ట్యాక్స్ కట్టాలని తాజ్‌మహల్‌కు నోటీసులు.. -
ఆప్ సర్కార్‌పై మరో దర్యాప్తు.. ‘బస్సుల’పై సీబీ‘ఐ’
న్యూఢిల్లీ: ఆప్ సర్కారుపై మరో దర్యాప్తుకు తెర లేచింది. ఢిల్లీలో 1,000 లో–ఫ్లోర్ బస్సుల కొనుగోలులో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై సీబీఐ దర్యాప్తుకు లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ఆదేశించారు. టెండరింగ్, బస్సుల కొనుగోలుకు ఢిల్లీ రవాణా కార్పొరేషన్(డీటీసీ) ఆధ్వర్యంలో వేసిన కమిటీకి రవాణా మంత్రిని చైర్మన్‌గా నియమించారు. ఇది ముందస్తు ఒప్పందంలో భాగంగానే జరిగిందని ఎల్జేకు ఫిర్యాదు అందింది. ఈ వ్యవహారంలో భారీగా డబ్బులు చేతులు మారిందని అందులో ఆరోపించారు. దీనిపై ఎల్జే వివరణ కోరగా అక్రమాలు నిజమేనని ఢిల్లీ చీఫ్ సెక్రెటరీ నివేదిక సమర్పించారు. ఎల్జే ఆదేశాల మేరకు సీబీఐ ఇప్పటికే ప్రాథమిక దర్యాప్తు చేపట్టింది. రెండు ఫిర్యాదులను కలిపి సీబీఐ విచారించేందుకు లెఫ్టినెంట్ గవర్నర్ అంగీకరించారు. బస్సుల కొనుగోలులో అవినీతి జరిగినట్లు వస్తున్న ఆరోపణలపై ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ప్రభుత్వం ఇంకా స్పందించలేదు. కేజ్రీవాల్, అవినీతి.. పర్యాయపదాలు: బీజేపీ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, అవినీతి అనేవి పర్యాయపదాలుగా మారిపోయాయని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి గౌరవ్ భాటియా ఆరోపించారు. సీఎం పదవిలో ఇంకా కొనసాగే అర్హత కేజ్రీవాల్‌కు ఎంతమాత్రం లేదని తేల్చిచెప్పారు. భాటియా ఆదివారం మీడియాతో మాట్లాడారు. ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వంలో ప్రతి విభాగం అవినీతిలో కూరుకుపోయిందన్నారు. కేజ్రీవాల్ మిత్రులకు లబ్ధి చేకూరేలా కాంట్రాక్టులు, టెండర్లు కట్టబెడుతున్నారని ధ్వజమెత్తారు. నిన్న ఎక్సైజ్ పాలసీలో, ఇప్పుడు బస్సుల కొనుగోలులో అవినీతి బయటపడిందని చెప్పారు. కేజ్రీవాల్ కరడుగట్టిన నిజాయతీపరుడు కాదు, కరడుగట్టిన అవినీతిపరుడని ప్రజలు భావిస్తున్నారని భాటియా వ్యాఖ్యానించారు. బస్సుల కొనుగోలు విషయంలో ‘ఆప్’ సర్కారు కేవలం కొన్ని కంపెనీలకు లాభం కలిగేలా టెండర్ నిబంధనలను, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ మార్గదర్శకాలను ఉల్లంఘించిందని ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు ఆదేశ్ గుప్తా విమర్శించారు. ఇదీ చదవండి: డిగ్రీ పరీక్షలు రాయనున్న ప్రధాని మోదీ, ఎంఎస్ ధోని! -
రూ.1400 కోట్ల స్కాం: ఆప్ నేతలపై ఎల్జీ పరువునష్టం దావా!
సాక్షి, న్యూఢిల్లీ: రూ.1,400 కోట్లు అవినీతికి పాల్పడ్డారంటూ ఆరోపణలు చేసిన ఆమ్ ఆద్మీ నేతలపై చట్టపరమైన చర్యలకు సిద్ధమయ్యారు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా. తనపై తప్పుడు, గౌరవానికి భంగం కలిగించే విధంగా అవినీతి ఆరోపణలు చేసిన ఎమ్మెల్యేలు అతిష్, సౌరభ్ భరద్వాజ్‌లతో పాటు పలువురు ఆప్ నేతలపై పరువునష్టం దావా వేయనున్నట్లు స్పష్టం చేశారు. ఈ మేరకు ఓ ప్రకటన జారీ చేసింది ఎల్జీ కార్యాలయం. 2016 నోట్ల రద్దు సమయంలో ఎల్జీ సక్సెనా సుమారు రూ.1,400 కోట్లు రద్దు చేసిన నోట్లు మార్పిడి చేయించారని ఆప్ నేతలు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ ఖాదీ విభాగనికి ఛైర్మన్‌గా ఉండి ఆ కుంభకోణానికి పాల్పడ్డారని విమర్శించారు. అయితే, ఆ ఆరోపణలను తిప్పికొట్టారు సక్సేనా. ఎమ్మెల్యేలతో పాటు ఢిల్లీ డెవలప్మెంట్ కమిషన్ ఛైర్మన్ జాస్మిన్ షాపైనా చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు అధికారులు తెలిపారు. ‘ఒకరిపై ఆరోపణలు చేసేందుకు గంతులేస్తూ వచ్చే లక్షణం కేజ్రీవాల్ అండ్ కోది. ఆప్ నేతలు చేసిన తప్పుడు, పరువునష్టం కలిగించే ఆరోపణలపై ఎల్జీ ప్రత్యేక దృష్టి సారించారు. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. ఆప్ నేతలు తప్పించుకోలేరు.’ అని ఎల్జీ సక్సేనా కార్యాలయం పేర్కొంది. ఇదీ చదవండి: Delhi Liquor Policy: ఎల్జీ దెబ్బకు వెనక్కి తగ్గిన కేజ్రీవాల్.. మరో 6 నెలలు..! -
ఢిల్లీ అసెంబ్లీలో రగడ.. ఆప్, బీజేపీ నేతల మాటల యుద్ధం
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీలో సోమవారం రాత్రి హైడ్రామా నెలకొంది. అధికార ఆమ్ ఆద్మీ పార్టీ, ప్రతిపక్ష బీజేపీ ఎమ్మెల్యేలు పోటాపోటీగా రాత్రంతా ఆందోళనలు నిర్వహించారు. ఒకరిపై ఒకరు అవినీతి ఆరోపణలు చేసుకుంటా మంగళవారం ఉదయం వరకు అసెంబ్లీ ఆవరణలో గడిపారు. ఆప్ ఎమ్మెల్యేలు ప్రలోభాలకు గురి కాలేదని నిరూపించేందుకు తాను బలపరీక్ష ఎదుర్కొంటానని కేజ్రీవాల్ ప్రకటించిన వెంటనే అసెంబ్లీలో రగడ మొదలైంది. ఆప్ ఆరోపణలు.. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సెనా 2016లో రూ.1400కోట్ల అవినీతికి పాల్పడ్డరని ఆప్ ఎమ్మెల్యేలు ఆరోపించారు. ఆయన ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్(కేవీఐసీ) ఛైర్మన్‌గా ఉన్నప్పుడు ఈ కుంభకోణం జరిగిందని చెప్పారు. దీనిపై సీబీఐకి కూడా ఫిర్యాదు చేస్తామని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే లెఫ్టినెంట్ గవర్నర్‌కు వ్యతిరేకంగా ఆప్ ఎమ్మెల్యేలు నినాదాలు చేశారు. ఆయన రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీ ఆవరణలోని మహాత్మా గాంధీ విగ్రహం ముందు నిరసన చేపట్టారు. బీజేపీ ధర్నా.. మరోవైపు బీజేపీ ఎమ్మెల్యేలు ఆప్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. లిక్కర్ పాలసీలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీ ఆవరణలోని భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్‌దేవ్ విగ్రహాల ముందు ధర్నాకు దిగారు. ఆప్ ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురి చేసి ఢిల్లీ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని కేజ్రీవాల్ ఆరోపిస్తున్నారు. ఒక్కో ఎమ్మెల్యేకు రూ.20కోట్లు ఆశచుపారని ఇదివరకే చెప్పారు. ఈ నేపథ్యంలోనే బీజేపీ చేపట్టిన ఆపరేషన్ లోటస్ విఫలమైందని నిరూపించేందుకు అసెంబ్లీలో బలపరీక్ష ఎదుర్కొంటున్నట్లు ప్రకటించారు. విశ్వాస పరీక్షపై అసెంబ్లీలో మంగళవారమే ఓటింగ్ జరగనుంది. ఒక్క ఆప్ ఎమ్మెల్యే కుడా బీజేపీ ప్రలోభాలకు లొంగలేదని నిరూపితమవుతుందని కేజ్రీవాల్ అన్నారు. చదవండి: మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం.. వారి భేటీ అందుకేనా? -
కేజ్రీవాల్‌కు ఎదురుదెబ్బ
సాక్షి, న్యూఢిల్లీ : కరోనా వైరస్ కేసులు వేగంగా పెరుగుతుండటంతో ఢిల్లీ ప్రభుత్వ ఆస్పత్రులు, ఎంపిక చేసిన ప్రైవేట్ ఆస్పత్రుల్లో బెడ్స్‌ను ఢిల్లీ వాసులకే కేటాయిస్తామని సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించిన క్రమంలో ఆయన నిర్ణయాన్ని లెఫ్టినెంట్ గవర్నర్ తిరగతోడారు. ఢిల్లీలో ప్రతి ఒక్కరికీ ఎలాంటి వివక్ష లేకుండా చికిత్స అందచేయాలని లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. స్ధానికేతరుడు పేరుతో ఏ ఒక్క రోగికీ ట్రీట్మెంట్ను నిరాకరించరాదని స్పష్టం చేశారు. రాజ్యాంగంలో పొందుపరిచిన జీవించే హక్కులో ఆరోగ్యంగా జీవించే హక్కు అంతర్భాగమని సుప్రీంకోర్టు పలు తీర్పుల్లో పేర్కొందని లెఫ్టినెంట్ గవర్నర్ తన ఉత్తర్వుల్లో ప్రస్తావించారు. స్ధానికులు, స్ధానికేతరులు అనే ఎలాంటి వివక్ష చూపకుండా అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులు, నర్సింగ్ హోంల్లో చికిత్స అందించాలని పేర్కొన్నారు. కాగా ఢిల్లీ ప్రభుత్వం 10,000 పడకలను స్ధానికులకు కేటాయించిందని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆదివారం ప్రకటించిన సంగతి తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోని బెడ్స్‌ను అందరూ వాడుకోవచ్చని, కొన్ని ప్రైవేట్ ఆస్పత్రులు అందిస్తున్న ప్రత్యేక చికిత్స కూడా అందరికీ అందుబాటులో ఉంటుందని ఆయన తెలిపారు. స్ధానికేతరులకు చికిత్స అందించబోమని కేజ్రీవాల్ చేసిన ప్రకటనను బీజేపీ, కాంగ్రెస్‌లు కూడా తీవ్రంగా తప్పుపట్టాయి. చదవండి : హోం క్వారంటైన్లోకి ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ -
ఇకనైనా దారికొస్తారా?
ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్(ఎల్జీ) స్వతంత్రంగా వ్యవహరించడానికి వీల్లేదని, ప్రజలెన్నుకున్న ప్రభుత్వం ఇచ్చే సలహాలు, సూచనల మేరకే ఆయన పనిచేయాల్సి ఉంటుందని సర్వోన్నత న్యాయ స్థానం బుధవారం వెలువరించిన తీర్పు హర్షించదగ్గది. మూడేళ్లక్రితం అరవింద్ కేజ్రీవాల్ నేతృ త్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ప్రభుత్వం ఏర్పడినప్పటినుంచీ అక్కడ ఎడతెగకుండా ఆధిపత్య పోరు సాగుతూనే ఉంది. లోగడ ఎల్జీగా ఉన్న నజీబ్ జంగ్తోనూ, ప్రస్తుత ఎల్జీ అనిల్ బైజాల్‌తోనూ కూడా కేజ్రీవాల్ సర్కారుకు పోరు తప్పలేదు. ఢిల్లీ ఒక కేంద్ర పాలిత ప్రాంతమే అయినా అది జాతీయ రాజధాని గనుక అక్కడొక ప్రత్యేక స్థితి ఉంది. 1992లో ఢిల్లీకి ప్రత్యేక ప్రతిపత్తి ఇస్తూ 69వ రాజ్యాంగ సవరణ తీసుకొచ్చారు. ఈ సవరణ ద్వారా రాజ్యాంగంలో చేర్చిన 239ఏఏ అధికరణపైనే ఈ వివాద పరంపర కొనసాగుతోంది. అది తమకు సర్వాధికారాలూ ఇచ్చిందని ఎల్జీగా ఉన్నవారి వాదనైతే...ఎక్కడైనా ప్రజా ప్రభుత్వానిదే పైచేయి అవుతుందని కేజ్రీవాల్ వాదిస్తూ వచ్చారు. లోగడ జంగ్ అయినా, ఇప్పుడు బైజాల్ అయినా ఈ అధికరణ ఆధారంగానే కేజ్రీవాల్ ప్రభుత్వ నిర్ణయాలను తోసిపుచ్చుతున్నారు. ఫైళ్లను నిరవధికంగా పెండింగ్ పెడుతున్నారు. రెండేళ్లక్రితం ఢిల్లీ హైకోర్టు సైతం వారి వాదనే సరైందని తీర్పునిచ్చింది. పాలనా పరమైన ప్రధానాధిపతి లెఫ్టినెంట్ గవర్నరేనని, ప్రభుత్వం తీసుకునే ఏ నిర్ణయానికైనా ఆయన సమ్మతి అవసరమని హైకోర్టు స్పష్టం చేసింది. ఆ తీర్పు సరికాదని ఇప్పుడు సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం తేల్చిచెప్పింది. ఎల్జీ స్వతంత్రంగా నిర్ణయం తీసుకోవడం కుదరదని, మంత్రిమండలి సలహాలు, సూచనల మేరకే ఆయన పనిచేయాలని తెలిపింది. రాజ్యాంగ అధికరణ ఈ విషయంలో స్పష్టంగా ఉన్నట్టయితే ఇంత చేటు సమస్యలు ఏర్పడేవి కాదు. పరిధికి మించి వ్యవహరించినప్పుడు తప్ప ఇతర విషయాల్లో ప్రజలెన్నుకున్న ప్రభుత్వాన్ని గౌరవించాలని, దాన్ని పనిచేయనీయాలని కేంద్రంలోని ప్రభుత్వాలు అనుకున్నా వివాదాలుండేవి కాదు. లోగడ యూపీఏ ప్రభుత్వమైనా, ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వమైనా ఈ విషయంలో సక్ర మంగా వ్యవహరించలేకపోయాయి. లెఫ్టినెంట్ గవర్నర్లుగా ఉన్నవారిని అదుపు చేయలేక పోయాయి. ప్రజలెన్నుకున్న అసెంబ్లీకి, దానిద్వారా ఏర్పడ్డ మంత్రిమండలికి నిర్ణయాధికారం లేనప్పుడు ఇక ఆ అసెంబ్లీ ఎందుకు...దానికి ఎన్నికలెందుకన్న ప్రశ్న వాటికి తట్టకపోవడం ఆశ్చర్యకరం. లోగడ ముఖ్యమంత్రులుగా పనిచేసిన మదన్‌లాల్ ఖురానా, సాహిబ్ సింగ్ వర్మ, సుష్మా స్వరాజ్(ముగ్గురూ బీజేపీ), షీలా దీక్షిత్(కాంగ్రెస్)లకు కేజ్రీవాల్ మాదిరి సమస్యలు ఏర్పడకపోవడానికి కారణముంది. అప్పుడు వారి పార్టీవారే కేంద్రంలో ఇంచుమించుగా అధి కారంలో ఉన్నారు. కేంద్రంలో యూపీఏ సర్కారున్నా షీలా దీక్షిత్‌కు ఒకటి రెండు అంశాల్లో సమ స్యలు రాకతప్పలేదు. కానీ తన రాజకీయానుభవం, పలుకుబడితో వాటిని ఆమె అవలీలగా అధి గమించారు. కానీ కేజ్రీవాల్ వీరికి భిన్నమైన నాయకుడు. చెప్పాలంటే పూర్తిగా ‘బయటి వ్యక్తి’. అందుకే ఆయన పాలనాపరంగా విఫలమైతే బాగుణ్ణని బీజేపీ, కాంగ్రెస్‌లు రెండూ బలంగా కోరుకున్నాయి. లెఫ్టినెంట్ గవర్నర్ ఆప్ సర్కారు నిర్ణయాలను తోసిపుచ్చడం లేదా వాటిపై నాన్చుడు ధోరణి అవలంబించడం ద్వారా దాన్ని నెరవేర్చారు. అయితే ఇప్పుడు సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పు సందేహాతీతంగా సమస్యను పరిష్కరించిందనుకోవడానికి లేదు. ప్రతి నిర్ణయానికీ ఎల్జీ సమ్మతి తప్పనిసరి అనడాన్ని అది తోసిపుచ్చింది. అలాగే కేబినెట్ నిర్ణయాలకు ఎల్జీ బద్ధుడై ఉండాలని కూడా చెప్పింది. కానీ ఏ నిర్ణయాన్ని అయినా ఎల్జీ తనకున్న రాజ్యాంగదత్తమైన అధికారాలతో వ్యతి రేకించడానికి, తుది నిర్ణయం కోసం రాష్ట్రపతికి నివేదించడానికి రాజ్యాంగ ధర్మాసనం అడ్డు చెప్ప లేదు. అయితే ఎల్జీ ఈ నిర్ణయాధికారాన్ని యాంత్రికంగా వినియోగించరాదని స్పష్టం చేసింది. ఏ ఏ అంశాల్లో ఎల్జీ విభేదించవచ్చునో కూడా వివరించింది. సున్నితమైన అంశాలు ఇమిడి ఉన్నవి, ప్రభుత్వ స్థోమతకు మించి ఆర్థిక భారం పడేవి, కేంద్రంతో లేదా ఇతర రాష్ట్రాలతో రాజకీయ పరమైన సమస్యలు తలెత్తడానికి ఆస్కారమిచ్చేవి ఆయన రాష్ట్రపతికి నివేదించవచ్చునని సుప్రీం కోర్టు వివరించింది. మంత్రిమండలి తీసుకున్న నిర్ణయం ఈ జాబితాలోని ఫలానా అంశం కింది కొస్తుందని ఎల్జీ అనుకుంటే ఆప్ ప్రభుత్వం చేయగలిగేదేమీ లేదు. ఇక పోలీసు, శాంతిభద్రతలు, భూ ఆదాయం అంశాలు ఎల్జీ పరిధిలోనివేనని ధర్మాసనం స్పష్టం చేసింది. కొంతమంది అధికారులను బదిలీ చేస్తూ గురువారం ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేయడం సాధ్య పడదని సర్వీసెస్ కార్యదర్శి జవాబివ్వడాన్నిబట్టి తాజా తీర్పు తర్వాత కూడా పరిస్థితి మెరుగుప డిన దాఖలాలు కనబడటం లేదు. ఢిల్లీలో పేద ప్రజలకు ఎంతో ఉపయోగపడే మొహల్లాలు(బస్తీ క్లినిక్‌లు) 1000 ఏర్పాటు చేస్తామని ఆప్ ఎన్నికల ప్రణాళిక హామీ ఇచ్చింది. ప్రజారోగ్య వ్యవస్థను వికేంద్రీకృతం చేసే ఈ పథకానికి ఇంకా ఎల్జీ ఆమోదం లభించలేదు. ఢిల్లీ బడుల్లో ఉపాధ్యా యుల నియామకం వ్యవహారమూ ఇంతే. ఖాళీగా ఉన్న 40 శాతం ఉపాధ్యాయ పోస్టుల్ని భర్తీ చేయ డానికి, కొందరు టీచర్లకు పదోన్నతులివ్వడానికి తీసుకున్న నిర్ణయాలు పెండింగ్‌లో పడ్డాయి. గెస్ట్ టీచర్లను, కాంట్రాక్టు టీచర్లను క్రమబద్ధీకరించాలన్న నిర్ణయమూ అంతే. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో ఇవి కొలిక్కి వస్తాయని చెప్పలేం. ఈ నిర్ణయాలు ఆర్థికభారమవుతాయని ఎల్జీ భావిస్తే ఆప్ సర్కారు చేయగలిగేదేమీ ఉండదు. బాధ్యతాయుత స్థానాల్లో ఉన్నవారు చిత్తశుద్ధితో, జవాబు దారీతనంతో, ప్రజల పట్ల బాధ్యతతో వ్యవహరిస్తే తప్ప ఇలాంటి వివాదాలు తేలవు. అంతిమంగా ప్రజలకు మెరుగైన పాలన అందాలన్నదే సర్వోన్నత న్యాయస్థానం తీర్పులోని సారాంశం. దాన్ని అర్ధం చేసుకుని అందరూ ప్రవర్తిస్తారని ఆశించాలి. -
కేజ్రీవాల్ ధర్నాపై పిటిషన్ : సత్వర విచారణకు సుప్రీం నో
సాక్షి, న్యూఢిల్లీ : లెఫ్టినెంట్ గవర్నర్ కార్యాలయంలో ధర్నాకు దిగిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు ఢిల్లీ హైకోర్టు షాక్ ఇచ్చిన నేపథ్యంలో తాజాగా సుప్రీం కోర్టు నిర్ణయం ఆయనకు ఊరట ఇచ్చింది. ఎల్జీ కార్యాలయంలో ధర్నాకు దిగిన సీఎం అరవింద్ కేజ్రీవాల్‌పై చర్యలు చేపట్టాలని న్యాయవాది శశాంక్ దేవ్ దాఖలు చేసిన పిటిషన్ సత్వర విచారణకు సర్వోన్నత న్యాయస్థానం నిరాకరించింది. కాగా వేరొకరి ఇల్లు, కార్యాలయాల్లో ధర్నాలు చేయడం ఏంటని సోమవారం ఢిల్లీ హైకోర్టు సీఎం కేజ్రీవాల్ సహా ఆయన మంత్రివర్గ సహచరులను ప్రశ్నించిన విషయం తెలిసిందే. మరోవైపు ఎల్జీ కార్యాలయంలో సీఎం బృందం చేపట్టిన ధర్నా రెండో వారంలోకి అడుగుపెట్టింది. ఐఏఎస్‌ల సమ్మెను నివారించాలని పట్టుబడుతూ గత కొద్దిరోజులుగా ఎల్జీ కార్యాలయంలో కేజ్రీవాల్ సహా పలువురు మంత్రులు ధర్నా చేపట్టారు. ఆప్ శ్రేణులు సైతం ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో సీఎం, మంత్రులకు మద్దతుగా నిరసన బాట పట్టాయి. -
ఆప్ భేటీపై ఉత్కంఠ
సాక్షి, న్యూఢిల్లీ : ఐఏఎస్‌ల సమ్మెను నివారించాలని కోరుతూ లెఫ్టినెంట్ గవర్నర్ కార్యాలయంలో ఆప్ నేతల సమ్మె రెండోవారానికి చేరడంతో సోమవారం పార్టీ నేతలు సీఎం అరవింద్ కేజ్రీవాల్ నివాసంలో సమావేశం కానున్నారు. కాగా ఎల్జీ కార్యాలయంలో ఆప్ ధర్నాను ఢిల్లీ హైకోర్టు తప్పుపట్టింది. వేరొకరి కార్యాలయం, నివాసంలో ధర్నా చేయడానికి మీకు ఎవరు అధికారం ఇచ్చారని కోర్టు నిలదీసింది. ఇక లెఫ్టినెంట్ గవర్నర్, ఢిల్లీ ప్రభుత్వం మధ్య కీచులాటలు కొనసాగుతున్న క్రమంలో తాజాగా ఐఏఎస్ అధికారులు రంగంలోకి దిగారు. రాజకీయ ప్రయోజనాల కోసం తమను లక్ష్యంగా చేసుకుని బాధితులని చేస్తున్నారని వారు బాహాటంగా అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే అధికారులు తమ కుటుంబంలో భాగమేనని, వారి భద్రతకు తాను భరోసా ఇస్తానని సీఎం కేజ్రీవాల్ సర్ధిచెప్పే ప్రయత్నం చేశారు. ఐఏఎస్ అధికారుల సమ్మెతో ఢిల్లీలో పరోక్షంగా రాష్ట్రపతి పాలన సాగుతోందని కేజ్రీవాల్ ఆరోపించారు. ఇక నలుగురు బీజేపీయేతర ముఖ్యమంత్రులు లెఫ్టినెంట్ గవర్నర్‌కు వ్యతిరేకంగా కేజ్రీవాల్ చేపట్టిన ఆందోళనను సమర్ధిస్తూ సమస్య పరిష్కారానికి ప్రధాని నరేంద్ర మోదీ జోక్యం చేసుకోవాలని కోరారు. -
కేజ్రీకి సీఎంల సంఘీభావం
సాక్షి, న్యూఢిల్లీ: లెఫ్ట్‌నెంట్ గవర్నర్(ఎల్జీ) తీరుపై నిరసన తెలుపుతున్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు నలుగురు ముఖ్యమంత్రుల నుంచి అనూహ్య మద్దతు లభించింది. ఆదివారం నాటి నీతి ఆయోగ్ కార్యక్రమంలో పాల్గొనేందుకు శనివారమే ఢిల్లీ చేరుకున్న పశ్చిమబెంగాల్, కేరళ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక ముఖ్యమంత్రులు వరుసగా మమత బెనర్జీ, పినరయి విజయన్, చంద్రబాబు నాయుడు, కుమారస్వామి.. ఢిల్లీ సీఎంకు సంఘీభావం ప్రకటించారు. ఈ విషయంపై సత్వరమే ప్రధాని నరేంద్ర మోదీ స్పందించాలని డిమాండ్ చేశారు. ఢిల్లీ ప్రభుత్వంలో విధులు నిర్వహిస్తున్న ఐఏఎస్ అధికారులు తమ సమ్మెను విరమించాలని, పేదలకు ఇంటివద్దకే రేషన్ అందించే ప్రతిపాదనకు ఆమోదం తెలపాలనే ప్రధాన డిమాండ్లతో కేజ్రీవాల్, తన మంత్రివర్గ సహచరులతో ఢిల్లీ లెఫ్ట్‌నెంట్ గవర్నర్ అనిల్ బైజాల్ కార్యాలయంలోని సందర్శకుల గదిలో గత ఆరు రోజులుగా నిరసన తెలుపుతున్న విషయం తెలిసిందే. నలుగురు ముఖ్యమంత్రులు వరుసగా మమత బెనర్జీ, పినరయి విజయన్, చంద్రబాబు నాయుడు, కుమారస్వామి శనివారం సాయంత్రం కేజ్రీవాల్‌ను కలిసే అవకాశం కల్పించాలంటూ ఎల్జీని కోరారు. ఆయన అనుమతించకపోవడంతో.. కేజ్రీవాల్ నివాసంలో ఆయన భార్య సునీతను, కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం అక్కడే విలేకరుల సమావేశం నిర్వహించి, కేంద్రప్రభుత్వం, ప్రధాని మోదీ తీరుపై తీవ్రంగా మండిపడ్డారు. అంతకుముందు ఆ నలుగురు ఏపీ భవన్లో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ప్రధానిపై మండిపడ్డ సీఎంలు దేశ రాజధాని అయిన ఢిల్లీ సమస్యనే పరిష్కరించలేని వారు దేశవ్యాప్తంగా ఉన్న సమస్యలను ఎలా పరిష్కరిస్తారని ప్రధాని మోదీపై మమతా బెనర్జీ మండిపడ్డారు. ‘చంద్రబాబు, కుమారస్వామి, పినరయి విజయన్‌లతో కలిసి కేజ్రీవాల్ ఇంటికి వచ్చాను. రాజకీయాలను రాజకీయాలుగానే చూడాలి. విపక్ష పార్టీలకు కూడా గౌరవం ఇవ్వాలి. ఢిల్లీలో ప్రజల అవసరాలను తీర్చాల్సిన బాధ్యత ఎన్నికైన ప్రభుత్వంపై ఉంది. ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఢిల్లీలో రాజ్యాంగ సంక్షోభం తలెత్తింది. దేశ రాజధానిలో సమస్య ఇలా ఉంటే ఎలా? దేశం, ప్రజాస్వామ్యం, రాజ్యాంగాల భవిష్యత్తు ఏమవుతుంది? ఎల్జీ పరిస్థితిని అర్థం చేసుకోవాలి. కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సత్సంబంధాలుండాలి. అది స్వపక్షమా? విపక్షమా? అని చూడరాదు. ఒక సీఎంను ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలవడానికి వీలుకానప్పుడు ఇదేం ప్రజాస్వామ్యం?’ అని తీవ్రంగా ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ‘మేం కేజ్రీవాల్‌ను కలవాలనుకున్నాం. ఈ ప్రభుత్వం పనిచేసే పరిస్థితి కల్పించాలి. అంతిమంగా మా డిమాండ్ ఒక్కటే. ఈ సమస్యను పరిష్కరించాలి. ఎన్నికైన ప్రభుత్వాన్ని పనిచేసుకోనివ్వాలి. కేంద్రం–రాష్ట్రం కలిసి పనిచేయాలి. అప్పుడే ప్రజలకు సేవ చేయగలం’ అని పేర్కొన్నారు. కుమారస్వామి మాట్లాడుతూ ‘ఢిల్లీ సీఎంకు మద్దతు తెలిపేందుకు, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం వచ్చాం. ఢిల్లీ దేశ రాజధాని. కేంద్ర ప్రభుత్వం వెంటనే పరిష్కార చర్యలు చేపట్టాలి’ అని పేర్కొన్నారు. ‘కేంద్రం వైఖరి కారణంగానే ఈ పరిస్థితి తలెత్తింది. ఇది ప్రజాస్వామిక దేశం. కేంద్రం సమాఖ్య వ్యవస్థను గౌరవించాలి. కేజ్రీవాల్‌కు మా మద్దతుంటుంది’ అని విజయన్ పేర్కొన్నారు. మండిపడ్డ కేజ్రీవాల్ సీఎంల వినతిని ఎల్జీ తిరస్కరించడంపై కేజ్రీవాల్ మండిపడ్డారు. ‘లెఫ్టినెంట్ గవర్నర్ సొంతగా ఈ నిర్ణయం తీసుకుంటారనుకోను. కచ్చితంగా ప్రధాని కార్యాలయం నుంచి వచ్చిన ఆదేశాల మేరకే ఆయన ఈ నిర్ణయం తీసుకుని ఉంటారు. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం. ఒక సీఎంను.. ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలవడాన్ని ప్రధాని అడ్డుకోగలరా? రాజ్ నివాస్ ఏ ఒక్కరి సొత్తు కాదు. ఇది దేశ ప్రజలది. ఈ ఆందోళన మరింత తీవ్రతరం అవుతుంది’ అని ట్వీట్ చేశారు. శనివారం ఏం జరిగింది? పశ్చిమబెంగాల్, కేరళ, ఏపీ, కర్ణాటక రాష్ట్రాల ముఖ్యమంత్రులు మొదట ఆంధ్రా భవన్లో సమావేశమమయ్యారు. కేజ్రీవాల్‌కు మద్దతును సమీకరించేందుకు కావాల్సిన ప్రయత్నాలపై చర్చించారు. అనంతరం రాజ్ నివాస్ (లెఫ్టినెంట్ గవర్నర్ నివాసం, కార్యాలయం)లో నిరసన చెబుతున్న కేజ్రీవాల్‌ను కలుసుకునేందుకు అనుమతించాలని ఎల్జీ బైజాల్‌కు లేఖ రాశారు. కేజ్రీవాల్‌ను కలిసేందుకు అనుమతివ్వబోనని ఎల్జీ స్పష్టంచేశారు. తర్వాత వీరంతా కేజ్రీవాల్ నివాసంలో కుటుంబ సభ్యులను కలుసుకుని సంఘీభావం తెలిపారు. అప్పుడు ఏమయ్యారు: బీజేపీ నలుగురు సీఎంలు కేజ్రీవాల్‌కు సంఘీభావం తెలపడంపై బీజేపీ మండిపడింది. ‘కేజ్రీవాల్ నివాసంలో, ఆయన సమక్షంలోనే సీఎస్ అన్షు ప్రకాశ్‌పై దాడి జరిగింది. అప్పుడు ఈ నలుగురు ఏమయ్యారు? ఆ నాలుగు రాష్ట్రాల సీఎస్‌లు కూడా అన్షు ప్రకాశ్‌కు సంఘీభావంగా ముందుకు వస్తే వీళ్లేం చేస్తారు?’ అని బీజేపీ సీనియర్ నేత విజయ్ గోయెల్ ప్రశ్నించారు. -
‘ఇది ఏసీ-సోఫా ధర్నా కాదు’
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర ప్రజల ఆత్మ గౌరవం కోసమే తాము పోరాటం చేస్తున్నామని, అంతేకాని సొంత ప్రయోజనాల కోసం ధర్నా చేయడం లేదని ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు. రాష్ట్ర హక్కులను కేంద్రం హరిస్తుందంటూ కేజ్రీవాల్ నేతృత్వంలో ఆమ్ఆద్మీ పార్టీ నేతలు లెఫ్టినెంట్ గవర్నర్ కార్యాలయం వద్ద గత ఐదు రోజులుగా నిరసన వ్యక్తం చేస్నున్న సంగతి తెలిసిందే. ఆరో రోజు కూడా వారి నిరసన కొనసాగుతోంది. కాగా కొన్ని టీవీ చానెళ్లు తమ పోరాటాన్ని ‘ ఏసీ -సోఫాకా ధర్నా’ ( ఏసీలో బెడ్‌పై కూర్చొని ధర్నా) అని ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ‘ఈ ధర్నా వల్ల వ్యక్తిగతంగా నాకు ఏం ఉపయోగం లేదు. నా కోసమో, నా పిల్లల కోసమో ధర్నా చేయడం లేదు. ఇది సరదా కోసం చేస్తుంది కాదు. కొన్ని టీవీ చానెళ్లు మా నిరసను ‘ ఏసీ సోఫాకా ధర్నా’ ( ఏసీలో బెడ్‌పై కూర్చొని ధర్నా) అని ప్రచారం చేస్తున్నారు. ఇది ఢిల్లీ ప్రజల ఆత్మ గౌరవం కోసం చేసే ధర్నా’ అని కేజ్రీవాల్ పేర్కొన్నారు. నిరాహార దీక్ష చేస్తోన్న తమ మంత్రులు మనీష్ సిసోడియా, సత్యేంద్ర జైన్లను బలవంతంగా తరలించే ప్రయత్నం చేస్తున్నారని అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. బలవంతంగా తరలిస్తే మంచి నీళ్లు కూడా తీసుకోం లెఫ్టినెంట్ గవర్నర్ కార్యాలయం నుంచి తమను బలవంతంగా తరలిస్తే పచ్చి మంచి నీళ్లను కూడా తీసుకోబోమని ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. తమ డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం నెరవేర్చే వరకూ నిరాహార దీక్ష విరమించే ప్రసక్తే లేదన్నారు. ఈ మేరకు ఆయన ఓ వీడియో విడుదల చేశారు. ‘25 మంది ఇక్కడకు వచ్చారు. వారు మమల్ని తరలించడానికే వచ్చారనుకుంటాను. కానీ మా దీక్ష మాత్రం విరమించేది లేదు. ఒక వేళ మమల్ని బలవంతంగా తరలిస్తే పచ్చి మంచి నీళ్లు కూడా తీసుకో’ అని వీడియోలో తెలిపారు. కాగా బీజేపీ, ఆప్ కలిసి ధర్నా నాటకం ఆడుతుందని కాంగ్రెస్ ఆరోపించింది. పాలనను వదిలేసి ధర్నా చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో పాలన కుంటుపడిందని మండిపడ్డారు. మరో వైపు బీజేపీ కూడా ధర్నాకు దిగింది. రాష్ట్రం ప్రభుత్వం ప్రజా సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడంలేదని, నీటి కొరతను తీర్చాలంటూ బీజేపీ నేతలు ధర్నాకు దిగారు. ఈ మేరకు వారు రాష్ట్రపతికి లేఖను కూడా రాశారు. -
‘సీఎం గారు.. ప్లీజ్ బట్టలు మార్చుకోండి’
సాక్షి, న్యూఢిల్లీ: లెఫ్టినెంట్ గవర్నర్ కార్యాలయంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ బృందం చేపట్టినధర్నాపై రెబల్ ఎమ్మెల్యే, ఆప్ మాజీ ఆప్ మంత్రి కపిల్ మిశ్రా వ్యంగ్యంగా స్పందించారు. కనీసం బట్టలు అయినా మార్చుకోండంటూ ఎద్దేవా చేశారు. ‘సీఎం గారు.. దయచేసి మీరు, మీ బృందం బట్టలు మార్చుకోండి. అలాగే ఉంటే అనారోగ్యపాలవుతారు. బట్టలు మార్చుకోవద్దని మోదీ ఏం చెప్పలేదు’ అని ట్వీట్ చేశారు. కాగా తమ ప్రభుత్వ డిమాండ్ల సాధనకు... ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ కార్యాలయంలో సీఎం కేజ్రీవాల్ బృందం చేపట్టినధర్నానాలుగో రోజుకు చేరింది. మరో వైపు డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, మంత్రి వైద్య ఆరోగ్య మంత్రి సత్యేందర్ జైన్లు ఆమర నిరాహార దీక్షకు దిగారు. బుధవారం ఆప్ ఎమ్మెల్యేలు కేజ్రీవాల్ నివాసం నుంచి గవర్నర్ కార్యాలయం వరకూ భారీ ర్యాలీ నిర్వహించారు. మాజీ కేంద్రమంత్రి, భాజపా మాజీ సీనియర్ నేత యశ్వంత్ సిన్హా కూడా ర్యాలీలో పాల్గొన్నారు. ప్రజలకు రేషన్ సరకులను డోర్‌డెలవరీ అందించే ప్రక్రియకు ఆమోదం, నాలుగు నెలలుగా విధులు బహిష్కరించి ఆందోళన చేస్తున్న ఐఏఎస్ అధికారుపై చర్యలు తీసుకోవాలని, వారు సమ్మె విరమించేలా చొరవ చూపాలని ఆప్ ప్రభుత్వం డిమాండ్ చేస్తోంది. ఇదికూడా చదవండి కేజ్రీవాల్‌కు షాక్ -
ముఖ్యమంత్రికి ఎల్జీ వార్నింగ్
సాక్షి, న్యూఢిల్లీ : ఢిల్లీ చీఫ్ సెక్రటరీపై ఆప్ ఎమ్మెల్యేల దాడిని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్ తీవ్రంగా ఖండించారు. ఈ ఘటనను సీరియస్‌గా తీసుకోవాలని సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను హెచ్చరించారు. ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదన్నారు. సీఎం కేజ్రీవాల్, ఆయన క్యాబినెట్ సహచరులను కలిశానని..ఇటీవలి దురదృష్టకర ఘటనను ఖండించానని..ఢిల్లీ అభివృద్ధి కుంటుపడకుండా అధికారుల్లో విశ్వాసం సడలకుండా ఉండేందుకు చర్యలు తీసుకోవాలని కోరినట్టు ఎల్జీ బైజల్ ట్విట్టర్లో రాసుకొచ్చారు. మరోవైపు ఎల్జీతో భేటీ అనంతరం కేజ్రీవాల్ అధికారుల తీరును తప్పుబడుతూ ట్వీట్ చేశారు. గత మూడు రోజులుగా అధికారులు సమావేశాలకు హాజరవడం లేదని..దీంతో పాలన కుంటుపడిందని..అధికారులు తిరిగి విధులకు హాజరయ్యేలా చూస్తానని ఎల్జీ హామీ ఇచ్చారని కేజ్రీవాల్ ఈ ట్వీట్లో పేర్కొన్నారు. కాగా ఢిల్లీ చీఫ్సెక్రటరీపై దాడి ఘటన సమసిపోకముందే మరో ఆప్ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు చేశారు. అలాంటి అధికారులను కొట్టడమే వారికి తగిన శాస్తి అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు పెనుదుమారం రేపాయి. -
గవర్నర్‌ను డమ్మీగా ఉండాలంటున్నారు!
హైదరాబాద్: పుదుచ్చేరి ప్రభుత్వం తానొక డమ్మీగా ఉండాలని కోరుకుంటోందని ఆ రాష్ట్ర లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్‌బేడీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నారాయణసామి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంతో కిరణ్ బేడీకి విభేదాలు పెరిగిపోతున్న నేపథ్యంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. తన విధులు, బాధ్యతలను సక్రమంగా నెరవేర్చేందుకు ఎన్ని అడ్డంకులు ఎదురైనా వెనక్కి తగ్గేది లేదన్నారు. మంగళవారం హైదరాబాద్‌లో జరిగిన 35వ ఆలిండియా పోలీస్ ఈక్వెష్ట్రియన్ చాంపియన్‌షిప్ పోటీలకు ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆమె విలేకరులతో మాట్లాడారు. వచ్చే మే 29వ తేదీన పదవి నుంచి వైదొలగనున్నట్లు గతంలో చేసిన ప్రకటనకు కట్టుబడి ఉన్నట్లు ఆమె స్పష్టం చేశారు. లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఒక లక్ష్యం కోసం పదవిని చేపట్టానని, పదవీకాలం ముగిసేవరకు ఉండాలని అనుకోవటం లేదని ఆమె చెప్పారు. ఆమె పనితీరుపై అసంతృప్తి వ్యక్తంచేస్తూ ఎనిమిది మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌కు మెమోరాండం ఇచ్చిన తర్వాతి రోజే ఆమె రిటైర్మెంట్ ప్రకటన చేశారు. ఈ విషయమై ఆమె మాట్లాడుతూ రెండేళ్లపాటు మాత్రమే ఉండాలని మొదటే అనుకున్నానని చెప్పారు. అవినీతి, నేర నిర్మూలన కోసం పలు చర్యలు తీసుకున్నానని తెలిపారు. స్వచ్ఛ పుదుచ్చేరి లక్ష్యంగా తాను చేపట్టే పనులకు రాష్ట్ర ప్రభుత్వం సహకరించటం లేదని ఆరోపించారు. పుదుచ్చేరి అప్పుల ఊబిలో కూరుకుపోయిందని, దాని నుంచి రాష్ట్రాన్ని రక్షించేందుకు శాయశక్తులా కృషి చేస్తున్నానని కిరణ్ బేడి అన్నారు. -
జనమే సార్వభౌమాధికారులు
విశ్లేషణ రాష్ట్రపతి, గవర్నర్లకు ఆర్టికల్ 361 కింద ఉన్న మినహాయింపు న్యాయసమీక్షను నిరోధించలేదు. ఒక పబ్లిక్ అథారిటీగా గవర్నర్ కానీ, రాష్ట్రపతి కానీ అవసరమైన సమాచారం ఇవ్వవలసిందే. రాజ్యాంగం రూపొందించిన పాలనా వ్యవస్థలో పూర్తిస్థాయి రాష్ట్రా నికి గవర్నర్ ఉంటారు. ఆ రాజ్యాంగ పదవిని రాజ్ పాల్ అంటారు. కేంద్రపా లిత ప్రాంతానికి పాలకు డిగా లెఫ్టినెంట్ (ఉప) గవర్నర్ ఉంటారు. శాసన సభ, ముఖ్యమంత్రితో కూడిన మంత్రివర్గం కొన్ని కేంద్రపాలిత రాష్ట్రాలలో ఉంటాయి. ఢిల్లీ, పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంతాలలో ఈ విధంగా ముఖ్యమంత్రులు ఉన్నారు. దేశ రాజధాని ఢిల్లీలో కూడా అసెంబ్లీ ఉంది. మంత్రి మండలి, అసెంబ్లీ, ఇతర పాలనా రంగాలన్నీ ఉపగవర్నర్ కింద పనిచేస్తుంటాయి. మంత్రి మండలి సలహాను అనుసరించి గవర్నర్ పాలనా నిర్ణయాలు తీసుకోవలసి ఉంటుంది. కొన్ని పరిమిత రంగాలలో గవర్నర్‌కి సొంతంగా ఆలోచించి నిర్ణయం తీçసుకునే అధికారం ఉంది. ముఖ్యంగా కావలసిన మెజారిటీ లేనపుడు ముఖ్యమంత్రి, అతని మంత్రిమండలి సలహాను గవర్నర్ వినాల్సిన అవసరం లేదు. కొత్తగా ఎవరు ముఖ్యమంత్రి కావాలనే విషయంలో కూడా గవర్నర్‌కు సొంత అధికారాలు ఉంటాయి. ఢిల్లీ కేంద్ర పాలిత ప్రాంతానికి కొన్ని ప్రత్యేక నియమాలను 64వ రాజ్యాంగ సవరణ ద్వారా 1991లో రూపొందించారు. ఉపగవర్నర్ (లెఫ్టినెంట్ గవర్నర్ లేదా ఎల్జి)కు కొన్ని సందర్భాలలో సొంత అధికారా లున్నాయి. అయితే గవర్నర్, ఉప గవర్నర్ పదవులను రాజ్యాంగం కల్పించింది. వారు సమాచార హక్కు పబ్లిక్ అథారిటీ నిర్వచనం పరిధిలోకి వస్తారు. సమాచారాన్ని ఇవ్వడానికి వారు సిద్ధంగా ఉండాలి. రాష్ట్రపతి, గవర్నర్ సార్వభౌమ అధికారాలు కలిగి ఉన్నారు కనుక మామూలు జనానికి సమాచారం చెప్పనవసరం లేదని వాదించారు. బొంబాయి హైకోర్టు సార్వభౌమాధికారం అంటే ఏమిటో వివరించింది. సార్వభౌమాధికార లక్షణాలు రెండు. మొదటిది, మొత్తం ప్రజానీకం గవర్నర్ అధీనంలో ఆజ్ఞానువర్తిగా ఉంటుంది. రెండోది, గవర్నర్ ఎవరి ఆజ్ఞలకూ బద్దుడుగా ఉండడు. సార్వభౌముడికి శాసనాధికారాలు, పాలనాధికారాలు ఉంటాయి. వివాదాలను విచారించి పరిష్క రించే అధికారమూ ఉంటుంది. అయితే ఈ అధికారం ఎవరికి ఉంది? రాజ్యాంగ పీఠిక ప్రకారం సార్వభౌమ సమసమాజ, మతాతీత, ప్రజాస్వామ్య రాజ్యాధికారం భారతదేశ ప్రజలకు కట్టబెట్టింది. రాష్ట్రపతి, గవర్నర్.. మంత్రిమండలి సలహా లేకుండా ఏ నిర్ణయాలూ తీసుకోలేరు, అతికొద్ది సందర్భాలలో తప్ప, కేంద్ర హోంమంత్రి, రాష్ట్రపతిలకు లోబడి గవర్నర్లు పనిచేయాలి. గవర్నర్ అయితే కేంద్రం ఇష్టపడినంత కాలం మాత్రమే పదవిలో ఉంటారు. కనుక వారికి సార్వభౌమ అధికార లక్షణాలు లేవన్నట్టే. రాష్ట్రపతి దేశానికి అధినేత. గవర్నర్ ఒక రాష్ట్రానికి రాజ్ పాల్. ఆర్టికల్ 361 కింద కొన్ని మినహాయిం పులు తప్ప వారికి పెద్దగా సార్వభౌమ ప్రత్యేకత లేమీలేవు. సమాచార హక్కు కింద చెప్పనవసరంలేని మినహాయింపు ఏదీ లేదు. ఆర్టీఐ చట్టం సెక్షన్ 8(1)(ఎ) ప్రకారం దేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను దెబ్బతీసే ఏ సమాచారమూ ఇవ్వనవసరం లేదు. అయితే రాష్ట్రపతి, గవర్నర్లకు సంబంధించిన సమాచారం కూడా దేశ సార్వభౌమాధికారాన్ని దెబ్బతీసే పరిస్థితి ఉంటే ఇవ్వనవసరం లేదు. ఆర్టికల్ 361 ఇచ్చే మినహాయింపు కూడా పరిమితమైనదే. దురుద్దేశపూరితంగా వ్యవహరించారనే ఆరోపణలను విచా రించే అధికారం కోర్టులకు ఉందని అక్కడ ఆర్టికల్ 361 మినహాయింపు వర్తించబోదని రామేశ్వర్ ప్రసాద్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా (2006) 2 ఎస్.సి.ఎస్.సి 1లో తీర్పు చెప్పింది. రాష్ట్రపతి, గవర్నర్లకు ఆర్టికల్ 361 కింద ఉన్న మినహాయింపు న్యాయసమీక్షను నిరోధించలేదు. ఒక పబ్లిక్ అథారిటీగా గవర్నర్‌గానీ, రాష్ట్రపతిగానీ సమాచారం ఇవ్వవలసిందే. అలా ఇవ్వకుండా ఆపడానికి ఆర్టికల్ 361 ఉపయోగపడదు. ప్రజాస్వామ్యంలో సార్వభౌమాధికారం ఒక అధికార హోదాకు పరిమితమై ఉండదు. ప్రజలు, వారెన్నుకున్న ప్రతినిధుల పార్లమెంటు, వారినుంచి వచ్చిన మంత్రిమండలి, ప్రతిని«ధు లంతా ఎన్నుకునే రాష్ట్రపతి, శాసనాలు పాలనా నిర్ణయాలు సమీక్షించే రాజ్యాంగ న్యాయస్థానాలు ఈ సార్వ భౌమాధికారాన్ని పంచుకుంటాయి. గవర్నర్ రాజ్యాంగాన్ని శాసనాన్ని రక్షిస్తానని, రాజ్యాంగం, శాసనాల ప్రకారం నడుస్తానని ప్రమాణ స్వీకారం చేస్తాడు. సమాచారం ఇవ్వాలని పీఐఓ, మొదటి అప్పీలు అధికారి, లేదా సమాచార కమిషన్‌గానీ ఆదేశిస్తే, తన ప్రమాణం ప్రకారం ఆ సమాచారాన్ని వెల్లడించాలని, ఆర్టీఐ చట్టాన్ని ఆ విధంగా పాటించి రక్షించాలని బొంబాయి హైకోర్టు వివరించింది. దీనిపై సుప్రీంకోర్టు తాత్కాలిక స్టే జారీ చేసింది. అయితే స్టే ఆ ఒక్క కేసుకే వర్తిస్తుంది కాని మొత్తం గవర్నర్లు, లెఫ్టినెంట్ గవర్నర్లంతా ఆర్టీఐ కింద జవాబులు ఇవ్వనవసరం లేదని భావించే వీల్లేదు. రాజకీయ పార్టీల నాయకులతో ఢిల్లీ ఉప గవర్నర్ సాగించిన ఉత్తర ప్రత్యుత్తరాలను వెల్లడించాలని సీఐసీ ఇదివరకు జారీ చేసిన ఉత్తర్వుపైన ఉప గవర్నర్ కార్యాలయం ఢిల్లీ హైకోర్టులో రిట్ పిటిషన్ వేసింది. తాత్కాలిక స్టే ఇచ్చారు. తరువాత కూడా ఎల్జీ కార్యాలయం ఆర్టీఐ దరఖాస్తులకు జవాబులు ఇస్తూనే ఉన్నది. కనుక పబ్లిక్ అథారిటీ హోదాపై అది స్టే కాదని గమనించాలి. కనుక రాష్ట్రాల గవర్నర్లు, కేంద్రపాలిత ప్రాంతాల ఉప గవర్నర్లు సమాచార చట్టం కింద సమాచారం ఇవ్వవలసిందే. వ్యాసకర్త కేంద్ర సమాచార కమిషనర్ professorsridhar@gmail.com మాడభూషి శ్రీధర్