
ఢిల్లీ:దేశ రాజధాని ఢిల్లీవాసులు ట్రాఫిక్ రూల్స్ పక్కాగా పాటించేందుకు కీలక చర్యలు తీసుకోవాలని ఢీల్లీ లెఫ్టినెంట్ గవర్నర్(ఎల్జీ) వీకే సక్సేనా అన్నారు. అతివేగం, నిర్లక్ష్యంగా నడపడం, ఇతర నేరాలకు పాల్పడేవారికి చలాన్ల సంఖ్య ఆధారంగా అధిక వాహనబీమా ప్రీమియం చెల్లించే విధానం తీసుకురావాలన్నారు.
ఇందుకోసం ట్రాఫిక్ చలానాల సంఖ్యతో వాహనాల బీమా ప్రీమియాన్ని ముడిపెట్టాలని సూచించారు. తన ఈ సూచనను పరిశీలించాలని కోరుతూ ఎల్జీ ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్‌కు ఒక లేఖ రాశారు.
Comments
Please login to add a commentAdd a comment