Chalans
-
చలాన్ల ఆధారంగా వాహన బీమా పెంపు: ఢిల్లీ ఎల్జీ
ఢిల్లీ:దేశ రాజధాని ఢిల్లీవాసులు ట్రాఫిక్ రూల్స్ పక్కాగా పాటించేందుకు కీలక చర్యలు తీసుకోవాలని ఢీల్లీ లెఫ్టినెంట్ గవర్నర్(ఎల్జీ) వీకే సక్సేనా అన్నారు. అతివేగం, నిర్లక్ష్యంగా నడపడం, ఇతర నేరాలకు పాల్పడేవారికి చలాన్ల సంఖ్య ఆధారంగా అధిక వాహనబీమా ప్రీమియం చెల్లించే విధానం తీసుకురావాలన్నారు. ఇందుకోసం ట్రాఫిక్ చలానాల సంఖ్యతో వాహనాల బీమా ప్రీమియాన్ని ముడిపెట్టాలని సూచించారు. తన ఈ సూచనను పరిశీలించాలని కోరుతూ ఎల్జీ ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్‌కు ఒక లేఖ రాశారు. -
చాంతాడంతా చలానాలు పెండింగ్..మూడు రోజుల్లో రూ. 25 కోట్లు వసూళ్లు
సాక్షి, బనశంకరి: ఈనెల 11 లోపు ట్రాఫిక్ బకాయిలు చెల్లిస్తే 50 శాతం రాయితీ ఇస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో ఊహించని విధంగా చెల్లింపులు జరుగుతున్నాయి. ఈనెల 3న రాయితీ అమల్లోకి రావడంతో మొదటి రోజే రూ. 5.61 కోట్లు, రెండో రోజు రూ. 6.80 కోట్లు, మూడో రోజు ఆదివారం రూ. 6.31 కోట్లకు పైగా వసూలైంది. సోమవారం కూడా భారీగా జరిమానాలు చెల్లించారు. సాయంత్రానికి మొత్తంగా రూ. 25 కోట్లు వసూలైంది. నగరంలోని ట్రాఫిక్ పోలీస్స్టేషన్లలోనే కాకుండా ఇన్ఫ్యాంట్రీ రోడ్డులోని ట్రాఫిక్ నిర్వహణ కేంద్రంలో కౌంటర్ తెరిచి జరిమానా చెల్లించడానికి అవకాశం కల్పించారు. హైకోర్టు న్యాయమూర్తి, రాష్ట్ర న్యాయసేవల ప్రాధికార అధ్యక్షుడు న్యాయమూర్తి బీ.వీరప్ప అధ్యక్షతన గత నెల 27న నిర్వహించిన సమావేశంలో రాష్ట్ర రవాణాశాఖ అధికారులతో చర్చించి జరిమానా బకాయిలపై రాయితీ ఇవ్వాలని నిర్ణయించారు. దీనికి రాష్ట్ర రవాణా రోడ్డు భద్రతా కమిషనర్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. (చదవండి: వాట్సాప్‌తో ఫుడ్ ఆర్డర్ చేయొచ్చు) -
ఏపీ: నకిలీ చలానాల కేసులో రూ. 4 కోట్లు దాటిన రికవరీ
-
నకిలీ చలాన్ల వ్యవహారం: ముగ్గురు అరెస్టు
వైఎస్సార్ కడప: నకిలీ చలానాల కేసులో ముగ్గురు స్టాంప్ రైటర్లను శుక్రవారం స్థానిక పోలీసులు అరెస్టు చేశారు. కాగా, జింకా రామకృష్ణ, అనములు లక్ష్మీనారాయణ, గురుప్రకాశ్ లు అరెస్టు అయిన వారిలో ఉన్నారు. వీరందరూ కడప అర్బన్, రూరల్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో రూ.కోటి 3 లక్షలు కాజేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ మేరకు నిందితులను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
నకిలీ చలాన్ల వ్యవహారంపై సీఎం జగన్ సీరియస్
-
నకిలీ చలాన్ల వ్యవహారంపై సీఎం జగన్ సీరియస్
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్రవ్యాప్తంగా పలు సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో వెలుగు చూసిన నకిలీ చలాన్లపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సీరియస్ అయ్యారు. తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో గురువారం నిర్వహించిన సమీక్ష కార్యక్రమంలో సీఎం జగన్ ఈ అంశంపై స్పందించారు. అసలు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో నకిలీ చలాన్లు ఎలా వచ్చాయి.. ఏసీబీ దాడులు చేస్తే తప్ప ఈ వ్యవహారం వెలుగులోకి రాలేదు అని సీఎం జగన్ అసహనం వ్యక్తం చేశారు. ఎలాంటి చర్యలు తీసుకున్నారని అధికారులను ప్రశ్నించారు. అక్రమాలకు పాల్పడ్డ అధికారులను సస్పెండ్ చేశామని అధికారులు సీఎం జగన్‌కి తెలిపారు. ‘‘తప్పులు జరుగుతుంటే ఎందుకు మన దృష్టికి రావడం లేదు.. ఎప్పటి నుంచి ఈ తప్పులు జరుగుతున్నాయి.. వ్యవస్థలు సవ్యంగా నడుస్తున్నాయో, లేదో ఎందుకు చూడటంలేదు’’ అని సీఎం జగన్ అధికారులను ప్రశ్నించారు. ‘‘క్షేత్రస్థాయిలో ఇంటెలిజెన్స్ నుంచి సమాచారం తెప్పించుకోవాలి. అవినీతిపై ఎవరికి కాల్ చేయాలో ప్రతి ఆఫీసులోనూ నంబర్ ఉంచాలి. కాల్ సెంటర్‌కు వచ్చే కాల్స్‌పై అధికారులు దృష్టి పెట్టాలి. కాల్‌సెంటర్‌మీద అధికారులు ఓనర్షిప్ తీసుకోండి. అవినీతి నిర్మూలనకు సరైన ఎస్ఓపీలను తీసుకురావాలి. సబ్‌రిజిస్ట్రార్ సహా అన్ని ఆఫీసుల్లోనూ చలానాల చెల్లింపు ప్రక్రియ పరిశీలించాలి’’ అని సీఎం జగన్ అధికారులకు సూచించారు. ఈ క్రమంలో సాఫ్ట్వేర్ మొత్తాన్ని నిశితంగా పరిశీలించామన్న ఆర్థికశాఖ అధికారులు.. అవినీతికి చోటు లేకుండా పూర్తిస్థాయిలో మార్పులు చేశామని తెలిపారు. మీ-సేవల్లో పరిస్థితులపైనా పరిశీలన చేయాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. -
ఆరుగురు సబ్ రిజిస్టార్లను సస్పెండ్ చేసాం
-
ఆరుగురు సబ్ రిజిస్ట్రార్లను సస్పెండ్ చేశాం: స్పెషల్ సీఎస్
సాక్షి,అమరావతి: రాష్ట్రంలో పలుచోట్ల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో చోటు చేసుకున్న నకిలీ చలానాల వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. ఈ వ్యవహారంపై రాష్ట్ర స్పెషల్ సీఎస్ రజత్ భార్గవ శనివారం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లడూతూ ఈ మార్చి 20 నుంచి జరిగిన లావాదేవీలపై విచారణ చేపడతున్నట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 65 లక్షల చలానాలను మేం తనీఖీ చేశామని ఆయన చెప్పారు. ఇప్పటివరకు 9 జిల్లాల్లో నకిలీ డాక్యుమెంట్లను సృష్టించారని అన్నారు. ఈ స్కామ్‌లో 10 మంది పై క్రిమినల్ కేసులు నమోదు చేశామని వివరించారు. ఆరుగురు సబ్ రిజిస్ట్రార్లను సస్పెండ్ చేశామని ఆయన వెల్లడించారు. రాష్ట్రంలో రూ.5.40 కోట్ల విలువైన నకిలీ చలానాలను గుర్తించాం.. మొత్తం సొమ్ము రికవరీ చేస్తామాని పేర్కొన్నారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అక్రమాలకు బాధ్యులైన వారిపై క్రిమినల్ చర్యలు చేపడతాం. అక్రమార్కులు ఎవరినీ వదిలే ప్రసక్తి లేదని రజత్ భార్గవ స్పష్టం చేశారు. నకిలీ చలానాల వ్యవహారంపై డీఆర్ఐ ద్వారా విచారణ చేపడతామని తెలిపారు. కొన్ని పెండింగ్ డాక్యుమెంట్లను వాణిజ్య పన్నులశాఖకు పంపిస్తున్నాం..దాని వల్ల ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుందని ఆయన అన్నారు. -
రిజిస్ట్రేషన్ల చలానాలు సీఎఫ్ఎంఎస్కు అనుసంధానం
సాక్షి, అమరావతి: రిజిస్ట్రేషన్ల నిమిత్తం స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖకు చెల్లించే చలానాలను నేరుగా సమగ్ర ఆర్థిక యాజమాన్య వ్యవస్థ (సీఎఫ్ఎంఎస్)కు అనుసంధానించారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో సోమవారం నుంచి ఈ వ్యవస్థను ప్రవేశపెట్టినట్లు స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ కమిషనర్ అండ్ ఐజీ శేషగిరిబాబు తెలిపారు. కడప సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో నకిలీ చలానాల కుంభకోణం బయటపడిన నేపథ్యంలో ఈ విధానాన్ని అమల్లోకి తెచ్చారు. తొలుత కుప్పం, కార్వేటినగరం, చీరాల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో దీని అమలును పైలెట్‌గా చేపట్టారు. సోమవారం నుంచి అన్ని కార్యాలయాల్లోనూ అమల్లోకి తెచ్చారు. స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ల ఫీజు కోసం చెల్లించే చలానాలను కొందరు దుర్వినియోగం చేసి కడపలో కోటి రూపాయలకుపైగా పక్కదారి పట్టించారు. ఈ విషయంలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ అధికారులు, సిబ్బందిపై ప్రభుత్వం చర్యలు తీసుకుంది. రిజిస్ట్రేషన్ల కోసం బ్యాంకులో చలానా తీసి, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సమర్పించాక కొందరు మళ్లీ దాన్ని వినియోగిస్తున్నట్లు గుర్తించారు. మాన్యువల్‌గా చలానాను స్వీకరించడం, దాన్ని పీడీఎఫ్‌గా అప్లోడ్ చేసే క్రమంలో దుర్వినియోగానికి ఆస్కారం ఏర్పడింది. అలాగే చలానాలు కట్టి రిజిస్ట్రేషన్‌కు రాకుండా వేచి ఉండేవారి చలానాలను దుర్వినియోగం చేసే అవకాశం ఉన్నట్లు గుర్తించారు. ఇప్పుడు చలానాలను నేరుగా సీఎఫ్ఎంఎస్కు అనుసంధానం చేయడంతో ఇలాంటి తప్పులకు అవకాశం ఉండదని శేషగిరిబాబు వివరించారు. -
సైకిళ్లకు రిజిస్ట్రేషన్.. అతిక్రమిస్తే చలాన్లు!
నిజాం సంస్థానంలో ప్రధాన ప్రయాణ సాధనం సైకిల్. అప్పట్లో నగర రోడ్లపై ఎటు చూసినా ఇవే దర్శనమిచ్చేవి. 1918లో హైదరాబాద్‌లో అందుబాటులోకి వచ్చిన సైకిళ్లు... 2000 సంవత్సరం వరకు రాజ్యమేలాయి. అయితేసంస్థానంలో సైకిళ్లకు రిజిస్ట్రేషన్ ఉండేది. వినియోగదారులు పన్నులు కూడా చెల్లించేవారు. నిబంధనలు అతిక్రమిస్తేచలాన్లు కూడా విధించేవారు. సిటీలో సైకిల్ రాజ్యంపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం. సాక్షి, హైదరాబాద్ : యూరోపియన్ దేశాల్లో 1860లలోనే సైకిళ్లు అందుబాటులోకి వచ్చినప్పటికీ... హైదరాబాద్‌లో 1918 నుంచి వాడుకలోకి వచ్చాయి. అప్పట్లో వీటిని ఇంగ్లాండ్, ఫ్రాన్స్ తదితర దేశాల నుంచి దిగుమతి చేసుకునేవారు. ఆర్డర్ ఇచ్చిన మూడు నాలుగు నెలల్లో ముంబైకి వస్తే.. అక్కడి నుంచి రైలు మార్గంలో నగరానికి తీసుకొచ్చేవారు. అయితే తొలుత ఇవి కేవలం ఉన్నత వర్గాలు, ధనిక కుటుంబాలకే పరిమితమయ్యాయి. ప్రభుత్వ అధికారులు, పోలీస్‌ల దగ్గర ఉండేవి. 1938లో కోఠి, అబిడ్స్ ప్రాంతాల్లో సైకిల్ షాపులు ప్రారంభమయ్యాయి. వ్యాపారులు విదేశాల్లో తయారయ్యే సైకిళ్లను ముంబై నుంచి దిగుమతి చేసుకొని ఇక్కడ విక్రయించేవారు. షాపులు ఏర్పాటు చేయడంతో సాధారణ ప్రజలకు కూడా ఇవి అందుబాటులోకి వచ్చాయి. ముఖ్యంగా 1951లో అట్లాస్ తదితర కంపెనీలు మన దేశంలో ప్రారంభమవడంతో సైకిళ్ల వినియోగం విరివిగా పెరిగింది. రిజిస్ట్రేషన్ తప్పనిసరి... హైదరాబాద్ సంస్థానంలో సైకిల్ కొంటే దాన్ని తప్పనిసరిగా బల్దియాలో రిజిస్ట్రేషన్ చేయించాలనే నిబంధన ఉండేది. సైకిల్ కొనుగోలుకు సంబంధించిన రసీదు, యజమాని చిరునామాతో సహా రుసుం చెల్లించి రిజిస్ట్రేషన్ చేయించేవారు. బల్దియా అధికారులు సిల్వర్ టోకెన్‌పై సైకిల్ రిజిస్ట్రేషన్ నెంబర్, గడువు వివరాలు మెషిన్‌తో ముద్రించి ఇచ్చేవారు. ఆ సిల్వర్ టోకెన్‌ను సైకిల్ ముందు భాగంలో అమర్చేవారు. సైకిళ్లకు రిజిస్ట్రేషన్ లేని పక్షంలో పోలీసులు జరిమానా విధించడంతోస్వాధీనం చేసుకునేవారు. ప్రతిఏటా రుసుం చెల్లించి రిజిస్ట్రేషన్ రెన్యూవల్ చేయించాల్సి ఉండేది. సైకిళ్లు వినియోగించేవారు నిజాం కాలంలో పలు నిబంధనలు తప్పనిసరిగా పాటించాల్సి ఉండేవి. సైకిల్‌పై ఇద్దరి కంటే ఎక్కువ మంది ప్రయాణించరాదు. రాత్రి సమయంలో సైకిల్ నడిపితే.. దాని ముందు భాగంలో లాంతర్ లైట్ తప్పనిసరి ఉండాలి. లాంతర్ల అనంతరం డైనమాను వెనక టైరుకు అమర్చి దాని ద్వారా లైట్‌ను వెలిగించేవారు. నిబంధనలు పాటించని పక్షంలో చలాన్లు విధించేవారు. ఒకటి కంటే ఎక్కువ సార్లు పోలీసులకు పట్టుబడితే సైకిల్ సీజ్ చేసేవారు. స్వాతంత్య్రానంతరం 1976 వరకు చలాన్ల వ్యవస్థ కొనసాగింది. ఆ తర్వాత దీన్ని ప్రభుత్వం రద్దు చేసింది. అలా 50 ఏళ్లు... 1951లో దేశీయ సైకిల్ తయారీ కంపెనీలు అందుబాటులోకి వచ్చిన తర్వాత వాటి వాడకం విరివిగా పెరిగింది. 2,000 సంవత్సరం వరకు నగర రోడ్లపై సైకిళ్లు రయ్‌మంటూ దూసుకెళ్లాయి. గ్రామాల్లోనూ సైకిళ్ల వినియోగం ఎక్కువగా ఉండేది. అయితే 2,000 సంవత్సరం తర్వాత మోటార్ బైక్‌లు అందుబాటులోకి రావడంతో సైకిళ్ల వినియోగం తగ్గింది. కానీ మళ్లీ ఇప్పుడు సైక్లింగ్‌పై చాలామంది ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా నగర యువత వారాంతంలో ప్రత్యేకంగా సైక్లింగ్ పోటీలు నిర్వహిస్తూ పాల్గొంటున్నారు. -
చలానాలకు రిజిస్ట్రేషన్ల శాఖ చెల్లుచీటీ
సాక్షి, హైదరాబాద్: దశాబ్దాలుగా కొనసాగుతున్న మూస పద్ధతులకు రిజిస్ట్రేషన్ల శాఖ త్వరలోనే చెల్లుచీటి ఇవ్వబోతోంది. వివిధ క్రయ విక్రయాలకు సంబంధించిన స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజుల చెల్లింపునకు ప్రస్తుతం అమ ల్లో ఉన్న బ్యాంకు చలానాలకు బదులుగా, ఆన్లైన్ చెల్లింపు విధానాలను అవలంభిస్తే మేలని ఆ శాఖ ఉన్నతాధికారులు భావిస్తున్నారు. వినియోగదారుల ఆకాంక్షల మేరకు క్రెడిట్‌కార్డ్, డెబిట్‌కార్డ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్.. వంటి మోడరన్ బ్యాంకింగ్ సేవలను అందిపుచ్చుకోవాలని నిర్ణయించారు. ఈ క్రమంలోనే రాష్ట్రవ్యాప్తంగా ఎక్కువ బ్యాంకు శాఖలున్న స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ)తో అవగాహన ఒప్పందం కుదుర్చుకునేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. తాజా నిర్ణయానికి సంబంధించి సర్కారు అనుమతి కోసం శాఖ నుంచి ప్రతిపాదనలు పంపారు. ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే వెంటనే ఆన్లైన్ చెల్లింపులను ప్రారంభించేందుకు ఉన్నతాధికారులు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఒకే బ్యాంకు ఖాతా.. వినియోగదారుల నుంచి స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజులు స్వీకరించేందుకు ప్రస్తుతం సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాలన్నీ స్థానికంగా అం దుబాట్లో ఉన్న బ్యాంకుల్లో ఖాతాలు కలిగి ఉన్నాయి. దీనివల్ల ఏదైనా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేయించుకోవాలనుకున్న వినియోగదారులు అక్కడే ఉన్న బ్యాంకులో చ లానా ద్వారా సొమ్ము చెల్లించాల్సి వస్తోంది. రద్దీగా ఉండే ప్రాంతాల్లో బ్యాంకుల వద్ద గంటల కొద్దీ వేచి ఉండాల్సిన పరిస్థితులున్నాయి. అలాగే, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు వేర్వేరు బ్యాంకుల్లో ఖాతాలు ఉండటం వల్ల వచ్చిన సొమ్మును రాష్ట్ర ఖాతాకు జమ చేయడంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. దీంతో ఎప్పటికప్పుడు రెవెన్యూ వసూళ్లకు సం బంధించిన లెక్కలు తెలుసుకునేందుకు ఉన్నతాధికారులకు వీలు కావడం లేదు. ఈ నేపథ్యంలో రిజిస్ట్రేషన్ల శాఖ ఇన్స్పెక్టర్ జనరల్ పేరిట రాష్ట్రవ్యాప్తంగా ఒకే బ్యాంకు ఖాతాను నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. దీని ద్వారా వినియోగదారులు ఏ ప్రాంతంలో సొమ్ము చెల్లించినా సదరు వివరాలను తెలుసుకునేందుకు వీలవుతుందని, రెవెన్యూ వసూళ్లలో పారదర్శకతకు దోహదపడుతుందని ఉన్నతాధికారులు అభిప్రాయపడుతున్నారు. ఆధార్‌తో అక్రమాలకు చెక్.. అక్రమ రిజిస్ట్రేషన్లను అరికట్టేందుకు వినియోగదారుల ఆధార్ నంబరును సేకరించాలని ఆ శాఖ ఉన్నతాధికారులు తాజాగా నిర్ణయించారు. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో.. ఆధార్ నంబరు ఇవ్వడం తప్పనిసరి కాకున్నా, అక్రమాలను నివారించేందుకు ఇది దోహదపడుతుందని అధికారులు చెబుతున్నారు. వినియోగదారులను ఒప్పించి వారు ఇష్టపూర్వకంగా ఇస్తేనే ఆధార్ వివరాలను సేకరించాలని అధికారులు భావిస్తున్నారు.