సాక్షి,అమరావతి: రాష్ట్రంలో పలుచోట్ల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో చోటు చేసుకున్న నకిలీ చలానాల వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. ఈ వ్యవహారంపై రాష్ట్ర స్పెషల్ సీఎస్ రజత్ భార్గవ శనివారం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లడూతూ ఈ మార్చి 20 నుంచి జరిగిన లావాదేవీలపై విచారణ చేపడతున్నట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 65 లక్షల చలానాలను మేం తనీఖీ చేశామని ఆయన చెప్పారు. ఇప్పటివరకు 9 జిల్లాల్లో నకిలీ డాక్యుమెంట్లను సృష్టించారని అన్నారు. ఈ స్కామ్‌లో 10 మంది పై క్రిమినల్ కేసులు నమోదు చేశామని వివరించారు.
ఆరుగురు సబ్ రిజిస్ట్రార్లను సస్పెండ్ చేశామని ఆయన వెల్లడించారు. రాష్ట్రంలో రూ.5.40 కోట్ల విలువైన నకిలీ చలానాలను గుర్తించాం.. మొత్తం సొమ్ము రికవరీ చేస్తామాని పేర్కొన్నారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అక్రమాలకు బాధ్యులైన వారిపై క్రిమినల్ చర్యలు చేపడతాం. అక్రమార్కులు ఎవరినీ వదిలే ప్రసక్తి లేదని రజత్ భార్గవ స్పష్టం చేశారు. నకిలీ చలానాల వ్యవహారంపై డీఆర్‌ఐ ద్వారా విచారణ చేపడతామని తెలిపారు. కొన్ని పెండింగ్ డాక్యుమెంట్లను వాణిజ్య పన్నులశాఖకు పంపిస్తున్నాం..దాని వల్ల ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుందని ఆయన అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment