Traffic violations
-
చలాన్ల ఆధారంగా వాహన బీమా పెంపు: ఢిల్లీ ఎల్జీ
ఢిల్లీ:దేశ రాజధాని ఢిల్లీవాసులు ట్రాఫిక్ రూల్స్ పక్కాగా పాటించేందుకు కీలక చర్యలు తీసుకోవాలని ఢీల్లీ లెఫ్టినెంట్ గవర్నర్(ఎల్జీ) వీకే సక్సేనా అన్నారు. అతివేగం, నిర్లక్ష్యంగా నడపడం, ఇతర నేరాలకు పాల్పడేవారికి చలాన్ల సంఖ్య ఆధారంగా అధిక వాహనబీమా ప్రీమియం చెల్లించే విధానం తీసుకురావాలన్నారు. ఇందుకోసం ట్రాఫిక్ చలానాల సంఖ్యతో వాహనాల బీమా ప్రీమియాన్ని ముడిపెట్టాలని సూచించారు. తన ఈ సూచనను పరిశీలించాలని కోరుతూ ఎల్జీ ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్‌కు ఒక లేఖ రాశారు. -
‘ప్లేట్’ ఫిరాయిస్తే కేసే!
ట్రాఫిక్ ఉల్లంఘనులు నగరంలో రోజురోజుకూ రెచ్చిపోతున్నారు. జరిమానాలు తప్పించుకోవడానికి నిఘా నేత్రాలు, ట్రాఫిక్ కెమెరాలకుతమ వాహన నంబర్ చిక్కకుండా ఉండేందుకు వాటిని ‘కవర్’ చేస్తున్నారు. దీనికోసం నంబర్ ప్లేట్స్‌కు మాస్కులు తొడగటం, వంచేయడం, విరిచేయడం చేస్తున్నారు. ఇప్పటి వరకు ఇలాంటి ఉల్లంఘనులపై పోలీసులు మోటారు వాహనాల చట్టం ప్రకారం జరిమానాలు విధిస్తూ వచ్చారు. అయితే ఈ తరహా ఉల్లంఘనుల్లో మార్పు రాకపోవడం, స్నాచింగ్స్, చోరీలకు పాల్పడేవారు సైతం ఇదే బాటపట్టడంతో హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఉద్దేశపూర్వకంగా నంబర్ ప్లేట్స్ మూసేసిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తున్నారు. గత నెలలోనే 35 కేసులు నమోదు చేయించారు. - సాక్షి, హైదరాబాద్ఈ–చలాన్లు తప్పించు కోవాలనే ఉద్దేశంతో..ఈ– చలాన్లు తప్పించుకోవడానికే నంబర్ ప్లేట్లు మూసేసే వారే ఎక్కువగా ఉంటున్నారు. ప్రస్తుతం నగరవ్యాప్తంగా నాన్–కాంటాక్ట్ ఎన్ఫోర్స్మెంట్ విధానాలు అమలవుతున్నాయి. క్షేత్రస్థాయి సిబ్బంది తమ చేతిలో ఉన్న డిజిటల్ కెమెరాలతో, కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ అధికారులు జంక్షన్లతోపాటు వివిధ ప్రాంతాల్లో ఉన్న సీసీ కెమెరాల ద్వారా ఉల్లంఘనలకు పాల్పడిన వాహనాల ఫొటోలు నంబరు ప్లేట్స్‌తో సహా చిత్రీకరిస్తున్నారు.వీటి ఆధారంగా ఆయా ఉల్లంఘనులకు ఈ–చలాన్లు జారీ చేస్తున్నారు. ఈ విధానంలో ఉల్లంఘనులు వినియోగించిన వాహన రిజిస్ట్రేషన్ నంబర్, దాని ఆధారంగా సేకరించే రిజిస్టర్డ్ చిరునామానే కీలకం. కొందరు తమ వాహనాలకు సంబంధించిన నంబర్ ప్లేట్లను వివిధ రకాలుగా కవర్ చేస్తూ ట్రాఫిక్ కెమెరాలకు చిక్కుకుండా చేస్తున్నారు. కొందరు నేరగాళ్లు సైతం నంబరు ప్లేట్లు కనిపించకుండా చేసి నేరాలకు పాల్పడుతున్నారు. నగరంలో ఇలా జరిగిన కొన్ని నేరాలను కొలిక్కి తేవడానికి పోలీసులు ఇబ్బందులు పడాల్సి వచ్చింది.ముందు వాటి కంటే వెనుకవే ఎక్కువవాహనాల నంబర్ ప్లేట్స్ ఎదుటి వారికి, సీసీ కెమెరాలకు చిక్కకుండా కవర్ చేయడం అనేది కార్లు వంటి తేలికపాటి వాహనాల కంటే ద్విచక్ర వాహనాలకే ఎక్కువగా కనిపిస్తోంది. రోడ్లపై ఈ తరహా నంబర్ ప్లేట్‌ను పోలీసులు గుర్తించి ఆపడానికి ప్రయత్నిస్తే బైక్స్ మాదిరిగా ఫోర్ వీలర్స్ వాహనాలు తప్పించుకొని వెళ్లిపోలేవు. దీంతో వారు అలాంటి చర్యల జోలికివెళ్లరు. ద్విచక్ర వాహనాల్లోనూ 90 శాతం వెనుక వైపు నంబర్ ప్లేట్‌కే రూపురేఖలు లేకుండా చేస్తున్నారు.క్షేత్రస్థాయిలో స్పెషల్ డ్రైవ్స్ చేసేప్పుడు రహదారులపై కొన్ని వాహనాలను తనిఖీ చేస్తారు. ముందు ఉండే నంబర్ ప్లేట్ వారికి స్పష్టంగా కనిపిస్తుండటంతో ఆ వాహనాలను ఆపి చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. అదే వెనుక నంబర్ ప్లేట్ అయితే వాహనం ముందుకు వెళ్లిపోయాకే ట్రాఫిక్ పోలీసులకు కనిపిస్తుంది. ఇలా ఉద్దేశపూర్వకంగా ఇలాంటి ఉల్లంఘనలకు పాల్పడిన వారిని గుర్తించి క్రిమినల్ కేసులు నమోదు చేయడం మొదలెట్టారు. గత నెల వరకు ఐపీసీలోని సెక్షన్ 420 ప్రకారం నమోదు చేయగా, ఈ నెల నుంచి బీఎన్ఎస్లోని సెక్షన్ 318 వినియోగించనున్నారు. ఈ కేసుల్లో నేరం నిరూపణ అయితే ఏడేళ్ల వరకు జైలు లేదా జరిమానా విధించే అవకాశం ఉంది.ఉద్దేశపూర్వకంగా చేసిన వారిపైనే కేసులుఅనివార్య కారణాల వల్ల, పొరపాటుగా వాహనాల రిజిస్ట్రేషన్ నంబర్ ప్లేట్లు డ్యామేజ్ అవుతుంటాయి. మరికొందరికి తమ నంబర్ ప్లేట్ డ్యామేజ్ అయిన విషయం తెలిసినా పని ఒత్తిడి, నిర్లక్ష్యం వంటి కారణాలతో దాన్ని సరి చేసుకోరు. స్పెషల్ డ్రైవ్‌లో ఇలాంటి వాహనాలు చిక్కితే వారికి చలాన్ ద్వారా జరిమానా మాత్రమే విధిస్తున్నారు. కొందరు మాత్రం నేరాలు చేయాలని, ఈ–చలాన్‌కు చిక్కకూడదనే ఉద్దేశంతో ఉద్దేశపూర్వకంగా నంబర్ ప్లేట్లను డ్యామేజ్ చేయడం, వాటిపై ఉన్న నంబర్లు మార్చడం, వంచేయడం, స్టిక్కర్లు వేసి మూసేయడం చేస్తున్నారు. ఇలాంటి వారిపై మాత్రమే శాంతిభద్రతల విభాగం పోలీస్స్టేషన్లలో కేసులు నమోదు చేయిస్తున్నాం. – పి.విశ్వప్రసాద్, అదనపు పోలీసు కమిషనర్ (ట్రాఫిక్) -
ట్రాఫిక్ ఉల్లంఘనలకు నో ఫైన్! వారంపాటు.. ఎక్కడంటే..
దీపావళి సందర్భంగా అక్కడ వారంపాటు ట్రాఫిక్ రూల్స్ ఎత్తేశారు. పండుగ సందర్భంగా ట్రాఫిక్ ఉల్లంఘనలకు గానూ ఎలాంటి ఫైన్ విధించబోమని ప్రకటించింది గుజరాత్ ప్రభుత్వం. అక్టోబర్ 21 నుంచి 27 తేదీల మధ్య ఈ నిర్ణయం అమలులో ఉంటుందని హోం శాఖ మంత్రి హర్ష్ సంఘవీ ప్రకటించారు. దీపావళి సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ఈ వార్త చెబుతున్నాం. అలాగని ఈ నిర్ణయంతో రూల్స్‌ను అతిక్రమించాలని మాత్రం చూడకండి. ఒకవేళ రూల్స్ బ్రేక్ చేస్తూ పోలీసులు చూస్తూ ఊరుకోరు. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే, గుజరాత్ పోలీసులు వెంటనే పూలు ఇచ్చి శిక్షిస్తారు అని ప్రకటించారు. అంతేకాదు.. దీపావళి సందర్భంగా భూపేంద్ర పటేల్ ప్రభుత్వం మరిన్ని ప్రజా సంక్షేమ నిర్ణయాలు ప్రకటించబోతోందని హర్ష్ సంఘవీ తెలిపారు. గుజరాత్లో ఈ ఏడాది చివర్లో ఎన్నికలు ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇక ట్రాఫిక్ ఉల్లంఘనలకు నో జరిమానా నిర్ణయంపై నెట్లో మిశ్రమ స్పందన లభిస్తోంది. ભારતીય સંસ્કૃતિનો સૌથી મોટો ઉજાસ ઉત્સવ એટલે દિવાળી. રંગોળીઓના રંગ, મિષ્ટાનોની ભરમાર અને દીવા તેમજ ફટાકડાનો ઉમંગ લઈને આ તહેવાર આવે છે. આ તહેવાર નિમિત્તે મૃદુ અને મક્કમ ગુજરાત સરકારના મુખ્ય મંત્રી શ્રી @Bhupendrapbjp જી નો વધુ એક પ્રજાલક્ષી નિર્ણય pic.twitter.com/V1omwopeWV — Harsh Sanghavi (@sanghaviharsh) October 21, 2022 -
30 వాహనాలు..రూ.68.57 లక్షలు..!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడి జరిమానా చెల్లించిన ‘టాప్ టెన్’ వాహనాల జాబితాను మూడు కేటగిరీలుగా ట్రాఫిక్ విభాగం అధికారులు రూపొందించారు. డీసీఎం వంటివి, ఆటోలు, ద్విచక్ర వాహనాలు.. ఈ మూడు విభాగాల్లోనూ టాప్ టెన్ చొప్పున మొత్తం 30 వాహనాలు ఐదేళ్ల కాలంలో ఏకంగా రూ.68,57,230 చెల్లించినట్లు తేలింది. వీటిపైనే ట్రాఫిక్ విభాగం 24,510 చలాన్లు జారీ చేసింది. జరిమానాగా చెల్లించిన టాప్ టెన్ వాహనాల్లో కమర్షియల్, సరుకు రవాణా కేటగిరీవే ఎక్కువగా ఉన్నాయి. కేవలం పౌరసరఫరాల శాఖతో పాటు అత్యవసర సేవలకు సంబంధించిన రవాణా వాహనాలకే నగరంలో 24 గంటలూ సంచరించే ఆస్కారం ఉంది. మిగిలిన వాణిజ్య వాహనాలు, లారీలను రాత్రి వేళల్లో మాత్రమే సిటీలోకి అనుమతిస్తారు. అయితే నగరంలో నిత్యం శీతల పానీయాల సరఫరా, తినుబండారాలు, సరుకులు డెలివరీ చేసే అనే వాహనాలు సంచరిస్తుంటాయి. ఇవి ఆయా దుకాణాల పని వేళల్లోనే తిరగాల్సి ఉండటంతో నగరంలోకి ప్రవేశించడం అనివార్యం. ఇలా వచ్చిన వాహనాలకు ట్రాఫిక్ పోలీసుల గరిష్టంగా రూ.1000 వరకు జరిమానా విధిస్తుంటారు. నిబంధనల ప్రకారం ఒకసారి జరిమానా విధించిన తర్వాత మళ్లీ 24 గంటల దాటే వరకు మరో జరిమానా విధించడానికి ఆస్కారం లేదు. దీన్ని ఆసరాగా చేసుకుంటున్న అనేక వాణిజ్య, సరుకు రవాణా వాహనాలు నగరంలో సంచరిస్తున్నాయి. తమ వ్యాపారంలో వచ్చే లాభం కంటే చెల్లించే జరిమానా అతితక్కువ కావడంతో ఈ పని చేస్తున్నాయి. ఈ తరహాకు చెందిన 10 వాహనాలు ఐదేళ్ల కాలంలో రూ.56,43,700 జరిమానాగా చెల్లించాయి. ఇలాంటి వాహనాలు అనుమతి లేని వేళల్లో తిరిగితే ట్రాఫిక్ ఇబ్బందులు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇకపై 24 గంటలకు ఒక చలాన్ కాకుండా ప్రతి ప్రాంతంలోనూ ఓ చలాన్ విధించడానికి ఉన్న అవకాశాన్ని అధికారులు పరిశీలిస్తున్నారు. కమర్షియల్ వాహనాల విషయం ఇలా ఉంటే.. ద్విచక్ర వాహనచోదకులూ ‘రికార్డులు’ సృష్టిస్తున్నారు. టూ వీలర్ నడిపే వ్యక్తి కచ్చితంగా హెల్మెట్ ధరించాలన్న నిబంధన ఉంది. ఇలా చేయని వారికి ట్రాఫిక్ పోలీసులు చలాన్ విధిస్తుంటారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన పది ద్విచక్ర వాహనాలపైనే ఐదేళ్లల్లో 2,236 ‘హెల్మెట్’ జరిమానాలు పడ్డాయి. ఇతర ఉల్లంఘనలతో కలిపి మొత్తం 2,818 చలాన్లకు సంబంధించి ఇవి చెల్లించిన జరిమానా మొత్తం రూ.4,01,370గా ఉంది. ఫైన్లను ఈ వాహనచోదకులు పట్టించుకోకపోవడంతోనే ఈ పరిస్థితి నెలకొంది. ఇక గూడ్స్, సాధారణ ఆటోలు చేసే ఉల్లంఘనల్లో అత్య«ధికం ఓవర్ లోడింగ్, రాంగ్ పార్కింగ్‌లకు సంబంధించినవే ఉంటున్నాయి. ఈ కేటగిరీలో ‘టాప్ టెన్’ వాహనాలపై ఐదేళ్లల్లో 6,516 చలాన్లు జారీ కాగా వీటిలో అత్యధికంగా 2,847 సరుకు ఓవర్ లోడింగ్వే ఉన్నాయి. ఆ తర్వాతి స్థానంలో ప్రయాణికులను ఎక్కువగా ఎక్కించుకోవడంపై 2,659, రాంగ్ పార్కింగ్‌పై 574 జారీ అయ్యాయి. వీటితో సహా పది వాహనాలు ఐదేళ్లల్లో రూ.8,12,160 జరిమానా చెల్లించాయి. (చదవండి: ఫార్ములా- ఈ పనులు రయ్ ..రయ్) -
ట్రాఫిక్ ఉల్లంఘనల్లో రికార్డు.. ఒకే రోజులో 40 వేలకుపైగా కేసులు
సాక్షి, ముంబై: ముంబైలో ట్రాఫిక్ నియమాలు ఉల్లంఘించే వాహన చోదకులకు ముకుతాడు వేసేందుకు ట్రాఫిక్ విభాగపు పోలీసులు ప్రత్యేక డ్రైవ్ చేపట్టారు. అందులో శనివారం ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు అంటే 12 గంటలపాటు చేపట్టిన డ్రైవ్‌లో వివిధ ట్రాఫిక్ నియమాలు ఉల్లంఘిస్తూ దాదాపు 40 వేలకుపైగా వాహన చోదకులు పట్టుబడ్డారు. ఇందులో అత్యధికంగా అంటే 10,957 కేసులు హెల్మెట్ ధరించకుండా ద్విచక్ర వాహనాలు నడుపుతున్నవారివే. లాక్డౌన్ కాలంలో ట్రాఫిక్ నియమాలు ఉల్లంఘిస్తున్న వారిపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కాలక్రమేణా అది డ్రైవర్లకు ఒక అలవాటుగా మారింది. ప్రస్తుతం లాక్డౌన్ ఎత్తివేయడంతో వాహనాలు యథావిధిగా రోడ్లపై నడుస్తున్నాయి. కానీ అలవాటు ప్రకారం ట్రాఫిక్ నియమాలు ఉల్లంఘించడంతో ప్రతిరోజూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. దీంతో ట్రాఫిక్ శాఖ, రీజినల్ పోలీసులు, దాదర్ నాయ్‌గావ్‌లోని సాయుధ విభాగ పోలీసులు, అధికారులు, కానిస్టేబుళ్లు ఇలా 255 మంది అధికారులు, 1,842 మంది కానిస్టేబుళ్లు సంయుక్తంగా తనిఖీలు చేపట్టారు. అందులో ట్రాఫిక్ నియమాలు ఉల్లంఘించిన 40,320 వాహన చోదకులను పట్టుకుని కేసులు నమోదు చేశారని ట్రాఫిక్ శాఖ డిప్యూటీ కమిషనర్ రాజ్ తిలక్ రోషన్ తెలిపారు. చదవండి: మహారాష్ట్ర మాజీ సీఎం ఫడ్నవీస్‌కు రెండోసారి కరోనా -
నానాటికీ పెరిగిపోతున్న ‘ట్రాఫిక్ కేసులు’.. కనిపించకుండానే చలాన్ పడిపోద్ది!
సాక్షి, సిటీబ్యూరో: ట్రాఫిక్ ఉల్లంఘనలు నానాటికీ పెరిగిపోతున్నాయి. రోడ్డు ప్రమాదాలు లక్షల్లో, మృతులు వేల సంఖ్యలో ఉండటానికీ ఇవే ప్రధాన కారణం. ఈ ఉల్లంఘనల్ని తగ్గించడానికి ప్రయత్నించాల్సిన యంత్రాంగాలు ఏటా పెరిగిపోతున్నా పట్టించుకోవట్లేదు. పైగా అదేదో ఘనతగా ఆర్భాటంగా ప్రకటిస్తున్నాయి. 2018లో 1.02 కోట్లుగా ఉన్న ట్రాఫిక్ వయెలేషన్స్ గత ఏడాది నాటికి 2.33 కోట్లకు చేరింది. పాశ్చాత్య దేశాల్లో మాదిరిగా ఇక్కడా వీటిని ఆదాయ వనరుగా చూడటంతోనే ఈ పరిస్థితి దాపురించిందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. తెలియకుండా తడిసిమోపెడు... ►ట్రాఫిక్ విభాగం అధికారులు నమోదు చేస్తున్న ఉల్లంఘనల కేసుల్లో అత్యధికం హెల్మెట్ కేసులే ఉంటున్నాయి. కొన్నాళ్ల క్రితం వరకు కేవలం వాహన చోదకుడు హెల్మెట్ ధరించకపోతేనే ఈ– చలాన్ జారీ చేసే వారు. ఇటీవల కాలంలో వాహనం వెనుక కూర్చున్న వ్యక్తి (పిలియన్ రైడర్) హెల్మెట్ ధరించకపోయినా చలాన్ జారీ చేస్తున్నారు. మరోపక్క వాహనచోదకులు హాఫ్ హెల్మెట్ ధరించినా జరిమానా తప్పట్లేదు. ఒకటి రెండుసార్లు అనుభవంలోకి వస్తే తప్ప ఈ విషయం వాహనచోదకులకు అర్థం కావట్లేదు. ఇలాంటి సున్నితాంశాలపై అవగాహన కల్పించాల్సిన పోలీసులు ఆ విషయం మర్చిపోతున్నారు. అదేమని ప్రశ్నిస్తే మోటారు వాహనాల చట్టంలో (ఎంవీ యాక్ట్) ఉన్న నిబంధనల్నే తాము అమలు చేస్తున్నామని తప్పించుకుంటున్నారు. ట్రాఫిక్ పోలీసుల లెక్కలో డ్రైవింగ్ చేసే ప్రతి వ్యక్తీ ఎంవీ యాక్ట్‌లో నిష్ణాతుడి కిందికే వస్తుండటం గమనార్హం. కనిపించకుండా బాదేస్తున్నారు.. ►ఒకప్పుడు ట్రాఫిక్ పోలీసులు కేవలం కాంటాక్ట్ ఎన్ఫోర్స్మెంట్ నిర్వహించే వారు. దీని ప్రకారం రోడ్డు మీద ఉల్లంఘనుడిని ఆపి చలాన్లు జారీ చేసేవారు. ఇటీవల కాలంలో 95 శాతం నాన్ కాంటాక్ట్ ఎన్ఫోర్స్మెంట్ జరుగుతోంది. రహదారులపై సంచరిస్తున్న ట్రాఫిక్ ఉల్లంఘనుల ఫొటోలను వివిధ మార్గాల్లో సేకరిస్తున్న పోలీసులు ఈ– చలాన్లు జారీ చేస్తున్నారు. దాదాపు ఎక్కడా కనిపించకుండా జరిమానా విధించేస్తున్నారు. ►వాహన చోదకుల్లో అనేక మంది పోలీసులు కనిపించినప్పుడు మాత్రమే నిబంధనలు పాటిస్తుంటారు. నాన్ కాంటాక్ట్ ఎన్ఫోర్స్మెంట్లో వాళ్లు కనిపించే అవకాశం లేకపోవడంతో అడ్డంగా బుక్కవుతున్నారు. నగరంలో సంచరించే ద్విచక్ర వాహన చోదకుల్లో దాదాపు 90 శాతం మంది వద్ద హెల్మెట్లు ఉంటాయి. వీళ్లలో చాలా మంది వాటిని వాహనానికో, పెట్రోల్ ట్యాంక్ మీదో ఉంచుతారు. చౌరస్తాలకు సమీపంలోనో, ట్రాఫిక్ పోలీసులు ఉన్న చోటో మాత్రమే తీసి తలకు పెట్టుకుంటారు. ఇలాంటి నిర్లక్ష్యాలకు పాల్పడే వాళ్లూ నాన్ కాంటాక్ట్ ఎన్ఫోర్స్మెంట్లో బుక్కైపోతున్నారు. ►రహదారి భద్రత, ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వారికి జరిమానాలు విధించడమనే విదేశాల్లోనూ ఉంది. కొన్ని పాశ్చాత్య దేశాల్లో ఈ ఆదాయమే పోలీసులకు జీతంగా వస్తుంటుంది. ఆయా చోట్ల పోలీసు విభాగాలు ప్రభుత్వంలో భాగంగా కాకుండా, మున్సిపల్ కార్పొరేషన్లలో అంతర్భాగంగా పని చేస్తాయి. మేయర్ ఆధీనంలో ఉండే వీరికి జీతాలను ఆయా కార్పొరేషన్లే చెల్లిస్తుంటాయి. ఈ కారణంగానే ఆయా పోలీసు విభాగాలు ప్రతి నెలా కనీసం తమ జీతాలకు సరిపడా అయినా జరిమానాల రూపంలో వసూలు చేసి మున్సిపల్ కార్పొరేషన్ల ఖజానాకు చేర్చాల్సి ఉంటుంది. నగరంలో పరిస్థితులు అలా ఉండవు. పోలీసులు ప్రభుత్వంలో భాగంగా పని చేస్తుంటారు. వీరికి జీతాలు సర్కారు ఖజానా నుంచి వస్తాయి. అయినప్పటికీ ట్రాఫిక్ పోలీసులు మాత్రం జరిమానాలు విధించడానికి ఆసక్తి చూపుతుంటారు. తగ్గితేనే విజయం సాధించినట్లు ప్రతి ఏటా తాము గతేడాది కంటే ఇన్ని వేల, లక్షల చలాన్లు ఎక్కువగా విధించామంటూ పోలీసులే ప్రకటిస్తుంటారు. ప్రాక్టికల్‌గా చూస్తే ఏటా ఉల్లంఘనుల సంఖ్య తగ్గించడం ద్వారా ప్రమాదాలు నిరోధిస్తేనే పోలీసులు విజయం సాధించినట్లు. ఈ అంశంలో నిర్దిష్టమైన ప్రణాళిక కొరవడింది. అవగాహన పేరుతో చేపట్టే కార్యక్రమాలన్నీ ఆర్భాటాలకు, ప్రచారానికే పరిమితం అవుతున్నాయి. ఒకటో తరగతి నుంచీ ట్రాఫిక్ పాఠాలు నేర్పాలనే ప్రతిపాదన ఏళ్లుగా పెండింగ్‌లో ఉండిపోయింది. ఇలాంటి చర్యల వల్లే ప్రతి ఒక్కరిలో అవగాహన పెరిగి, ఉల్లంఘనులు తగ్గుతారు. – శ్రీనివాస్, మాజీ పోలీసు అధికారి -
బంజారాహిల్స్, జూబ్లీహిల్స్లోనే ఎక్కువ!
మద్యం మత్తులో మితిమీరిన వేగంతో వాహనాలు నడపడం... హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనాల డ్రైవింగ్... రాంగ్రూట్లో వెళ్తూ ప్రమాదాలకు గురికావటం... సిగ్నల్ జంపింగ్... సీటు బెల్టు ధరించకపోవడం... వెనుక కూర్చున్న వారు హెల్మెట్ ధరించకపోవడం ఇలాంటివన్నీ ట్రాఫిక్ నిబంధనలకు వ్యతిరేకం. ప్రాణాంతం కూడా. పోలీసులు ఎంత చెప్పినా.. అవగాహన కార్యక్రమాలు నిర్వహించినా ఉల్లంఘనులు కొనసాగుతూనే ఉన్నాయి. సాక్షి, హైదరాబాద్: బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ట్రాఫిక్ పోలీసులు వారం రోజుల పాటు స్పెషల్ డ్రైవ్ నిర్వహించి భారీగా ‘ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన’ల కేసులు నమోదు చేశారు. ఈ నెల 4 నుంచి 11వ తేదీ వరకు బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ట్రాఫిక్ పోలీసులు రాత్రి 9 నుంచి 11 గంటల వరకు 3 గంటల పాటు ఈ డ్రైవ్ చేపట్టారు. ఇందులో అధికంగా మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న వారిపైనే దృష్టిసారించారు. మద్యం సేవించి వాహనాలపై వెళ్లే ప్రాంతాలను గుర్తించి అక్కడే రోజూ ఈ తనిఖీలు నిర్వహించారు. (చదవండి: హైదరాబాద్ పోలీస్.. టార్గెట్ న్యూ ఇయర్ పార్టీస్!) బంజారాహిల్స్ ట్రాఫిక్ పీఎస్ పరిధిలో.. బంజారాహిల్స్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో వారం రోజుల పాటు నిర్వహించిన స్పెషల్ డ్రైవ్‌లో మొత్తం 7024 ఉల్లంఘన కేసులు నమోదయ్యాయి. ఇందులో సెల్‌ఫోన్ మాట్లాడుతూ వాహనాలు నడుపుతున్న 14 మందితో పాటు హెల్మెట్ లేకుండా వాహనాలు నడుపుతున్న 1794 మందిపై కేసులు నమోదు చేశారు. (చదవండి: రోడ్డు ప్రమాదం.. నిందితుడిని అరెస్టు చేయరా?) ► సక్రమంగా నంబర్ ప్లేట్ లేని 81 మంది, ట్రిబుల్ రైడింగ్ చేస్తున్న 50 మందిపై కేసులు నమోదు చేశారు. ► నంబర్ ప్లేట్ లేకుండా వాహనాలు నడుపుతున్న 33 మందిపై కేసు నమోదు చేశారు. డ్రంక్ అండ్ డ్రైవ్‌లో 54 కేసులు నమోదయ్యాయి. ► రాంగ్‌సైడ్ డ్రైవింగ్ చేస్తూ 105 మంది పట్టుబడ్డారు. ► ఇతరత్రా నిబంధనలు ఉల్లంఘించిన ఇంకో 1640 మందిపై కేసులు నమోదయ్యాయి. జూబ్లీహిల్స్ ట్రాఫిక్ పీఎస్ పరిధిలో.. జూబ్లీహిల్స్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో 589 కేసులు నమోదయ్యాయి. ► డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు 70 నమోదు కాగా మైనర్లు వాహనాలు నడుపుతూ ఒకరు పట్టుబడ్డారు. ► నంబర్ ప్లేట్సరిగా లేని 35 మందిపై హెల్మెట్ ధరించకుండా వాహనాలు నడుపుతున్న 71 మందిపై కేసులు నమోదు చేశారు. ► సంబంధం లేని ఇతరులకు వాహనాలు ఇచ్చి నడిపిస్తుండగా అలా 57 మందిపై కేసులు నమోదు చేశారు. ► సైలెన్సర్లు మార్చి అధిక శబ్ధంతో వాహనాలు నడుపుతున్న ఏడు మందిపై కేసులు నమోదు చేశారు. ప్రమాదకరంగా వాహనాలు నడుపుతున్న ఒకరిపై కేసు నమోదైంది. -
హైదరాబాద్ పోలీసుల ప్రత్యేక డ్రైవ్: 8 రోజులు.. 1.66 లక్షల కేసులు!
సాక్షి, హైదరాబాద్ : నగరంలో రోడ్డు ప్రమాదాలు గణనీయంగా తగ్గించాలనే లక్ష్యంతో పోలీసు విభాగం ప్రత్యేక డ్రైవ్‌లకు శ్రీకారం చుట్టింది. ఈ నెల 4 నుంచి వీటిని ప్రారంభించారు. అప్పటి నుంచి శనివారం వరకు జరిగిన స్పెషల్ డ్రైవ్స్‌లో మొత్తం 1.66 లక్షల కేసులు నమోదు చేసినట్లు నగర కొత్వాల్ అంజనీకుమార్ వెల్లడించారు. (జూబ్లీహిల్స్‌లో అదుపుతప్పిన బీఎండబ్ల్యూ.. 3 రోజుల కిందటే కొనుగోలు) ట్రాఫిక్ అధికారులు, శాంతిభద్రతల విభాగంతో పాటు సిటీ ఆర్డ్మ్ రిజర్వ్ హెడ్–క్వార్టర్స్ నుంచి సిబ్బందిని కలిపి ఏర్పాటు చేసిన ప్రత్యేక బృందాలు ఈ డ్రైవ్స్ నిర్వహిస్తున్నాయని, ఈ విధానం కొనసాగుతుందని కమిషనర్ తెలిపారు. వాహనచోదకులకు, ఎదుటి వారికీ ప్రాణసంకటంగా మారే ఉల్లంఘనలతో పాటు తీవ్రమైన ట్రాఫిక్ ఇబ్బందులు కలిగించే వాటికి ప్రాధాన్యం ఇస్తున్నారు. ఎనిమిది రోజుల్లో నమోదు చేసిన కేసుల గణాంకాలను కొత్వాల్ విడుదల చేశారు. (చదవండి: సారు చాలా బిజీ; కదలరు.. వదలరు..) -
ఇది మామూలు లిస్టు కాదు.. నాలుగేళ్లుగా ‘జంప్’ అవుతున్నాడు, కానీ ఈసారి
బంజారాహిల్స్: స్కేటింగ్ కోచ్ జునైద్ శనివారం (టీఎస్09 ఎఫ్డీ 3792) యాక్టివాపై వెళ్తుండగా.. జూబ్లీహిల్స్ ట్రాఫిక్ పోలీసులు వాహనాల తనిఖీలు చేస్తున్న సమయంలో పట్టుబడ్డాడు. ఆ స్కూటర్‌కు సంబంధించిన పెండింగ్ చలానాలు పరిశీలించగా గత నాలుగేళ్లుగా పెండింగ్ చలానాలతో పోలీసుల కళ్లుగప్పి తిరుగుతున్నట్లుగా తేలింది. మొత్తం 107 పెండింగ్ చలానాలు ఈ బైక్‌పై నమోదై ఉన్నాయి. చలాన్ల జాబితా చాంతాడంత ఉండటంతో ట్రాఫిక్ పోలీసులు అవాక్కయ్యారు. రూ. 35,835 జరిమానా పెండింగ్‌లో ఉండటంతో ఆ మొత్తాన్ని సదరు వాహనదారుడు చెల్లించడంలో విఫలమయ్యాడు. దీంతో బైక్‌ను పోలీసులు సీజ్ చేశారు. హెల్మెట్ లేకుండా పోలీసులను తప్పించుకొని తిరుగుతున్న అతడు ఎట్టకేలకు జూబ్లీహిల్స్‌లో పోలీసులకు చిక్కాడు. అబిడ్స్‌లో నివసించే జునైద్ హైటెక్ సిటీ గూగుల్ బిల్డింగ్‌లో స్కేటింగ్ కోచ్‌గా పనిచేస్తున్నట్లు పోలీసులు చెప్పారు. (చదవండి: ‘మేడారం’ పనులు మొదలయ్యేదెప్పుడు?) -
Lockdown: 38 రోజులు.. రూ. 61 లక్షలు..
సాక్షి, సిరిసిల్లక్రైం: కరోనా వైరస్‌ను నివారించేందుకు ప్రభుత్వం లాక్డౌన్ విధించిన విషయం తెలిసిందే. గత నెల 12 నుంచి ఈ నెల 19 వరకు లాక్డౌన్ నిబంధనలు అమలులో ఉన్నాయి. ఈ లాక్డౌన్ కాలంలో నిబంధనలు ఉల్లంఘించిన పలువురిపై పోలీసులు కేసుల నమోదుతోపాటు జరిమానాలు విధించారు. ఇలా నిబంధనలు ఉల్లంఘించిన వారి నుంచి జిల్లాలో రూ.61.03 లక్షలు జరిమానా రూపంలో వసూలు చేశారు. ప్రతీ నిత్యం ఎస్పీ రాహుల్‌హెగ్డే లాక్డౌన్ అమలును పరిశీలించారు. కాలినడకనా.. బైక్‌పై కాలనీల్లో ! లాక్డౌన్ అమలు చేసే క్రమంలో ఎస్పీ, డీఎస్పీ, సీఐలు కాలినడకన ప్రధాన రహదారుల్లో తనిఖీలు చేసిన సందర్భాలు అనేకం. శివారుప్రాంతాలు, కాలనీల్లో కొందరు లాక్డౌన్ నిబంధనలు పాటించడం లేదని బైక్‌లపై పోలీసులు గస్తీ చేపట్టారు. జిల్లాలోని వేములవాడ, సిరిసిల్ల పట్టణాల్లో ఏర్పాటు చేసిన పోలీసుల ప్రత్యేక ఐసోలేషన్ వ్యాన్ విధానం ఉల్లంఘనుల్లో భయాన్ని కల్పించింది. రూ.61.03 లక్షల జరిమానా జిల్లాలో 38 రోజులపాటు కొనసాగిన లాక్డౌన్లో నిబంధనలు అతిక్రమించినందుకు వాహనదారులపై పోలీసులు రూ.61.03 లక్షల జరిమానా విధించినట్లు గణాంకాలున్నాయి. జిల్లాలో 602 వాహనాలు, 80 దుకాణాలు సీజ్ చేశారు. 573 ఈ పెట్టి కేసులు నమోదు చేశారు. మాస్కు ధరించని 682 మందిపై కేసు నమోదు చేసినట్లు అధికారులు వెల్ల డించారు. డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్టు ప్రకారం 5,431 కేసులు నమోదైనట్లు తెలిపారు. మాస్క్, భౌతికదూరం తప్పనిసరి కరోనా నియంత్రణకు అందరూ మాస్క్ ధరించడం, భౌతికదూరం పాటించడం తప్పనిసరి. సామాజిక బాధ్యతగా లాక్డౌన్ నిబంధనలు అందరూ పాటించాలి. దీని ద్వారా సమాజానికి, వ్యక్తిగతంగా, కుటుంబాన్ని కరోనా బారిన పడకుండా చూసిన వారవుతారు. – రాహుల్‌హెగ్డే, ఎస్పీ, సిరిసిల్ల చదవండి: 6 నుంచి 8 వారాల్లో థర్డ్ వేవ్..! -
ట్రాఫిక్ రూల్స్ అతిక్రమిస్తే ఇక చుక్కలే!
న్యూఢిల్లీ: మన దేశంలో ఎన్ని కొత్త ట్రాఫిక్ రూల్స్ తీసుకొచ్చిన కొందరు వాహనదారులు వాటిని ఏమాత్రం పట్టించుకోకుండా ట్రాఫిక్ నిబంధనలను అతిక్రమిస్తూ ఉంటారు. వీరి వల్ల ఇతర వాహనదారులు ఇబ్బందికి గురి అవుతుంటారు. అయితే ఇలా ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించే వారు ఇప్పుడు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. భీమా రెగ్యులేటర్ ఐఆర్డిఎఐ కొత్త రూల్స్ తీసుకురాబోతుంది.(చదవండి: లండన్‌ను వెనక్కినెట్టిన బెంగళూరు) ట్రాఫిక్‌కు ఇన్సూరెన్స్‌కు సంబంధం ఏంటని మీరు ఆలోచిస్తున్నారా? ఇక్కడే ఒక లింకు ఉంది. ఎవరైతే ట్రాఫిక్ నిబంధనలను తరుచూ ఉల్లంఘిస్తారో.. వారి వాహనం యొక్క భీమా ప్రీమియం కూడా పెరిగిపోతుంది. ఈ కొత్త రూల్ వల్ల మీరు ట్రాఫిక్ చలనాతో పాటు మీ వెహికల్ భీమా ప్రీమియాన్ని అధికంగా చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పటికే దీనికి సంబందించిన తుది నివేదికను ఐఆర్డిఎఐ సిద్ధం చేసింది. తొలిసారిగా ఈ కొత్త నిబంధనలు దేశ రాజధాని ఢిల్లీలో అమలులోకి రావచ్చు. తర్వాత దేశవ్యాప్తంగా అమలులోకి తీసుకురానున్నారు. వాహన భీమా ప్రీమియం సమయంలో గత రెండేళ్ల నాటి ట్రాఫిక్ చలానాలను పరిగణలోకి తీసుకొని మీకు ప్రీమియం నిర్ణయిస్తారు. -
తాట తీసేందుకు కొత్త సెక్షన్
మంచిర్యాలక్రైం: రోడ్డు ప్రమాదాల నివారణకు రాష్ట్ర పోలీస్ శాఖ ఇదివరకే అనేక రకాల ప్రయోగాలు చేపట్టింది. ట్రాఫిక్ ఉల్లంఘనులపై ఇప్పటికే కొరడా ఝలిపిస్తోంది. తరచూ ప్రమాదాలు జరిగే స్థలాలను గుర్తించి బ్లాక్ స్పాట్లను ఏర్పాటు చేశారు. దీనిపై పూర్తిగా శాస్త్రీయ అధ్యయనం చేసి ప్రమాద స్థలాల వద్దకు రాగానే డ్రైవర్‌కు ఇండికేషన్ వచ్చే విధంగా గూగుల్ మ్యాప్స్ ద్వారా శ్రీకారం చుట్టారు. అయినా రోడ్డు ప్రమాదాల సంఖ్య తగ్గుముఖం పట్టకపోవడం, ప్రమాదాల్లో రోజురోజుకూ మృతుల సంఖ్య పెరగడంతో ఈ సారి రోడ్డుప్రమాదాలపై కఠినంగా వ్యవహరించేందుకు సిద్ధమైంది. ఈ కఠిన విధానాన్ని ప్రయోగాత్మకంగా హైదరాబాద్ నగరంలో అమలు చేస్తున్నారు. 2016 జూలై 1న హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో అభం, శుభం తెలియని తొమ్మిదేళ్ల బాలిక మృతి చెందడంతో మొదటిసారి రోడ్డు ప్రమాదాలపై కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించారు. ఏమిటా కఠినాస్త్రం ఇకపై నుంచి ఎవరైనా వాహనదారులు నిర్లక్ష్యంగా వాహనం నడిపి ఎదుటి వారి మరణానికి కారణమైతే వారిపై ఇకనుంచి ఐపీసీ 304(2) సెక్షన్ కింద కేసు నమోదు చేయనున్నారు. ఈ సెక్షన్ కింద కేసు నమోదైతే 10సంవత్సరాల పాటు జైలు శిక్ష పడే అవకాశముంది. ఈ సెక్షన్‌ను మర్డర్ కేసులకు ఉపయోగిస్తారు. ప్రస్తుతం ఈ చట్టం ద్వారా హైదరాబాద్‌లో మాత్రమే కేసులు నమోదు చేస్తున్నారు. 2016లో తొలి కేసు నమోదైనప్పటి నుంచి హైదరాబాద్ వాహనదారుల్లో గుబులు మొదలైంది. ఈ చట్టం కొంత మేర సత్ఫలితాలను ఇవ్వడంతో ఈ ఏడాదిలో రాష్ట్రవ్యాప్తంగా అమలు చేసేందుకు పోలీస్‌శాఖ యోచిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పెద్దపెల్లి జిల్లాలో ఐపీసీ 304(2) కింద 10 కేసులు నమోదు చేసినట్లు సీపీ సత్యనారాయణ తెలిపారు. వస్తామో రామో తెలియని పరిస్థితి కొత్త జిల్లాలు ఏర్పడ్డ తర్వాత ట్రాఫిక్ విపరీతంగా పెరిగిపోయింది. మరో పక్క వాహనాల సంఖ్య సైతం రోజురోజుకూ పెరుగుతోంది. వాహనంపై బయటకెళ్తే క్షేమంగా ఇంటికి తిరిగి వస్తామో రామో తెలియని పరిస్థితి నెలకొంది. దీన్ని దృష్టిలో ఉంచుకున్న డీజీపీ మహేందర్ రెడ్డి వాహనాలను నిర్లక్ష్యంగా నడుపుతూ ప్రమాదాలకు కారణమయ్యేవారిపై కఠినంగా వ్యవహరించాలని ఖచ్చితమైన ఆదేశాలు జారీ చేశారు. రాంగ్ రూట్లో వెళ్లడం, డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనం నడపడం, సెల్ ఫోన్ డ్రైవింగ్, డ్రంక్ అండ్ డ్రైవ్, మైనర్లు వాహనాలు నడపడం వల్లే రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని వీటిపై కఠినంగా వ్యవహరించాలని యోచిస్తున్నారు. తప్పు చేశామో.. పదేళ్లపాటు జైలుకే ఇప్పటివరకు పోలీసులు ట్రాఫిక్ ఉల్లంఘనులపై కేసులు నమోదు చేస్తూ ఈ–చలాన్ ద్వారా జరిమానాలు విధిస్తున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో న్యాయస్థానం ఒకటి, రెండు, మూడు రోజులు జైలు శిక్ష, జరిమానా విధిస్తూ తీర్పులు వెలువరిస్తోంది. ఈ విధానం వాహనదారులకు పరిపాటిగా మారింది. ప్రస్తుతం పోలీస్‌శాఖ తీసుకున్న కొత్త నిర్ణయం ప్రకారం ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడుతూ రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతికి కారణమైన వారిపై పోలీసులు ఈ సెక్షన్ కింద కేసులు నమోదు చేయనున్నారు. నిర్లక్ష్యంతో ప్రాణాలు పోతున్నాయి వాహనాదారుల నిర్లక్ష్యం వల్లే నిండు ప్రాణాలు బలైపోతున్నాయి. రోడ్డు ప్రమాదాల నివారణకు రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మంచిర్యాల, పెద్దపెల్లి జిల్లాల్లో అన్ని విధాలా చర్యలు తీసుకుంటున్నాం. గతంలో ప్రమాద స్థలాలను గుర్తించి బ్లాక్ స్పాట్లను ఏర్పాటు చేశాం. అయినప్పటికీ ప్రమాదాలు జరుగుతుండటం బాధాకరం. ఇప్పటికే కమిషనరేట్ పరి«ధిలో ఐపీసీ304(2) సెక్షన్ కింద 10 కేసులు నమోదు చేశాం. – సత్యనారాయణ, రామగుండం పోలీస్ కమిషనర్ -
‘అడ్డుగా వచ్చాడని వేసుకెళ్లి పోయాడు’
-
‘అడ్డుగా వచ్చాడని వేసుకెళ్లి పోయాడు’
ఢిల్లీ : రోడ్డు ప్రమాదాలు అరికట్టడానికి ట్రాఫిక్ సిబ్బంది కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా వాహనాలకు అన్ని పత్రాలు ఉన్నాయా..? లేదా అని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. లేని పక్షంలో కేంద్ర మోటారు వాహనాల చట్టం ప్రకారం భారీ జరిమానా విధిస్తున్నారు. అయితే, కొందరు కేటుగాళ్లు చలానా తప్పించుకోవడానికి ట్రాఫిక్ సిబ్బందితో వాగ్వాదానికి దిగుతున్నారు. అవసరమైతే వారిపై దాడులకూ యత్నిస్తున్నారు. తాజాగా వైరల్ అయిన ఓ వీడియోలో.. కారు డ్రైవర్ ట్రాఫిక్ కానిస్టేబుల్‌నే ఢీకొట్టాలని చూశాడు. అడ్డుగా వచ్చిన కానిస్టేబుల్‌ను ఏకంగా 2 కిలోమీటర్లు కారు బానెట్‌పైనే లాక్కెళ్లాడు. ఢిల్లీలోని నంగోయి చౌక్ వద్ద గత నవంబర్‌లో ఈ ఘటన జరగగా.. తాజాగా వైరల్ అయింది. సునీల్ అనే ట్రాఫిక్ కానిస్టేబుల్ ఓ కారును అడ్డగించాడు. వాహన పత్రాలు చూపించాలని చెప్పాడు. అయితే, కారు డ్రైవర్ పత్రాలు ఇవ్వకపోగా.. అడ్డు తప్పుకోవాలని కానిస్టేబుల్‌నే హెచ్చరించాడు. అతను వినకపోవడంతో.. కారు ముందుకు పోనిచ్చాడు. దీంతో కానిస్టేబుల్ ఒక్క ఉదుటున బానెట్‌పైకి చేరి.. వాహనాన్ని ఆపాలని మరోసారి హెచ్చరించాడు. అయినప్పటికీ.. కారు డ్రైవర్ నిర్లక్ష్యంగా దాదాపు 2 కిలోమీటర్లు అలాగే పోనిచ్చాడు. ఇదంతా ఆ కారులోనే ఉన్న ఓ ప్రయాణికుడు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. ఇక డ్రైవర్ నిర్లక్ష్యంపై నెటిజన్లు మండిపడుతున్నారు. ‘వెర్రి వేషాలకు ఇది పరాకాష్టా అతని పై చర్యలు తీసుకోండి’ అని డిమాండ్ చేస్తున్నారు. -
ట్రాఫిక్ ఉల్లంఘనలకు..భారీ బాదుడొద్దు
సాక్షి, అమరావతి ట్రాఫిక్ ఉల్లంఘనలపై కేంద్రం నిర్ణయించినట్లుగా పదిరెట్ల జరిమానాలొద్దని.. మధ్యస్థంగానే విధించాలని ఏపీ రవాణా అధికారుల కమిటీ సిఫారసు చేసింది. అపరాథ రుసుంలపై ఈ కమిటీ రూపొందించిన సిఫారసుల నివేదిక రాష్ట్ర ప్రభుత్వానికి చేరింది. దీనిపై త్వరలో విధానపరమైన నిర్ణయం తీసుకోనున్నారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే పదిరెట్ల వరకు జరిమానాలు విధించేందుకు కేంద్ర ప్రభుత్వం మోటారు వాహన సవరణ బిల్లు–2019ను గత పార్లమెంట్ సమావేశాల్లో సవరించి ఆమోదించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అన్ని రాష్ట్రాల్లో కేంద్ర మోటారు వాహన చట్టం సెక్షన్–200 ప్రకారం సెప్టెంబరు నుంచి నూతన జరిమానాలు అమలుచేయాల్సి ఉంది. అయితే, ఈ చట్టం కింద జరిమానాలు అంత పెద్ద మొత్తంలో విధించే ముందు ప్రజలకు అవగాహన కల్పించి, మధ్యస్తంగా జరిమానాలు ఉండేలా ఏపీ రవాణా అధికారుల కమిటీ రాష్ట్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది. పలు రాష్ట్రాలతోపాటు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా అంత పెద్ద మొత్తంలో వాహనదారులపై జరిమానాలు విధించేందుకు ఆయా ప్రభుత్వాలు సుముఖంగా లేవు. ఈ నేపథ్యంలో.. ఏపీలోనూ ట్రాఫిక్ జరిమానాలపై రవాణా శాఖ డిప్యూటీ రవాణా కమిషనర్లు, ప్రాంతీయ రవాణా అధికారులు, మోటారు వెహికల్ ఇన్స్పెక్టర్లతో అంతర్గతంగా ఓ కమిటీని నియమించుకుంది. ఈ కమిటీ రాష్ట్రంలో ప్రస్తుతం విధిస్తున్న జరిమానాలు, కేంద్రం కొత్తగా విధించాలన్న జరిమానాలపై అధ్యయనం చేసి ఓ నివేదిక రూపొందించింది. పదిరెట్ల జరిమానాలు రాష్ట్రంలో విధించవద్దని, కేంద్రం నిర్దేశించినట్లుగా కాకుండా మధ్యస్తంగా జరిమానాలు విధించాలని కమిటీ అభిప్రాయపడి ఆ నివేదికను ప్రభుత్వానికి పంపింది. అలాగే, ముందుగా వాహనదారులకు కౌన్సెలింగ్ ఇవ్వాలని, అప్పటివరకు ఓ మోస్తరు జరిమానాలతో సరిపుచ్చాలని అందులో సూచించారు. ప్రభుత్వ నుంచి ఆమోదం వస్తే కేంద్రం నిర్దేశించిన దానికంటే తక్కువగానే జరిమానాలు విధించేందుకు రాష్ట్ర రవాణా శాఖ సన్నద్ధమవుతోంది. లైసెన్సులు లేనివారే ఎక్కువ కాగా, రాష్ట్రంలో అన్ని కేటగిరీల వాహనాలు మొత్తం 90 లక్షలకు పైగా ఉన్నాయి. వీటిని నడిపే వారిలో 45 శాతం మందికి లైసెన్సు లేనట్లు రవాణా శాఖ గతంలో నిర్వహించిన సర్వేలో తేలింది. ముఖ్యంగా ద్విచక్ర వాహనాలు నడిపే వారిలో అధిక శాతం మందికి లైసెన్సు లేనట్లు రవాణా శాఖ అంచనా వేస్తోంది. లైసెన్సు లేకుండా వాహనం నడిపితే ఇప్పటివరకు రూ.500 జరిమానా విధిస్తున్నారు. మోటారు వాహన సవరణ బిల్లులో రూ.5 వేల జరిమానా విధించేలా పొందుపరిచారు. అయితే, రాష్ట్రంలో లైసెన్సు లేకుండా వాహనం నడిపితే జరిగే అనర్ధాలు, రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పించి మధ్యస్తంగా జరిమానాలు విధించనున్నారు. -
హెల్మెట్ లేకున్నా.. ఒక్క రూపాయి కట్టలేదు..!
అహ్మదాబాద్ : నూతన మోటారు వాహన చట్టంతో జనం బెంబేలెత్తుతున్నారు. భారీ చలాన్లకు భయపడి వాహనాలతో రోడ్లపైకి రావాలంటేనే జడుసుకుంటున్నారు. అయితే, ఉదయ్‌పూర్ జిల్లాలోని బొడేలిలో నివాముండే జకీర్ మోమన్ అనే వ్యక్తి మాత్రం హెల్మెట్ లేకుండానే యథేచ్ఛగా బైక్‌పై తిరుగుతున్నాడు. దీంతో ఇటీవల ట్రాఫిక్ పోలీసులు అతన్ని పట్టుకుని భారీ ఫైన్ వేశారు. కానీ, అతను జరిమానా చెల్లించేందుకు నిరాకరించాడు. ఆ చుట్టుపక్కల పట్టణాలన్నీ వెతికినా తన తలకు సరిపడా హెల్మెట్ దొరకడం లేదని పోలీసుల ఎదుట వాపోయాడు. దయుంచి తన భారీ తలకు ఓ హెల్మెట్ జాడ చెప్పండని వేడుకున్నాడు. కావాలంటే చెక్ చేసుకోండని అక్కడున్న హెల్మెట్లు పెట్టుకుని చూశాడు. ఒక్కటి కూడా అతని తలకు సరిపోలేదు. భారీ తల కారణంగానే హెల్మెట్ లేకుండా తిరుగుతున్నానని.. తనకు ఫైన్ వేయొద్దని పోలీసులకు విన్నవించాడు. (చదవండి : ట్రాఫిక్ జరిమానాలు సగానికి తగ్గించారు) జకీర్ వాహనానికి మిగతా అన్ని పేపర్లు సక్రమంగా ఉండటంతో అతనికి ఎలాంటి ఫైన్ వేయకుండా ట్రాఫిక్ పోలీసులు వదిలేశారు. ఇదిలాఉండగా.. నూతన మోటారు వాహన సవరణ చట్టంపై తీవ్ర విమర్శలు రావడంతో గుజరాత్‌లోని బీజేపీ ప్రభుత్వం అనూహ్య నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త మోటారు వాహన చట్టాన్ని అమలుచేస్తూనే.. అందులోని జరిమానాలను సగానికి సగం తగ్గిస్టున్న ముఖ్యమంత్రి విజయ్ రూపాని ప్రకటించారు. ఇక గుజరాత్ బాటలోనే కర్ణాటక ప్రభుత్వం నడిచే యోచనలో ఉన్నట్టు తెలిసింది. గుజరాత్ తరహాలో ట్రాఫిక్ చలాన్లు తగ్గిస్తామని సీఎం బీఎస్ యడ్యూరప్ప మీడియాతో అన్నారు. (చదవండి : ట్రాఫిక్ చలాన్లను తగ్గించనున్న మరో రాష్ట్రం!) -
ఫొటో తీసి 95428 00800కు వాట్సప్ చేయండి
సాక్షి, అమరావతి: కళ్లెదుట ఎవరైనా రాంగ్ రూట్లో వస్తున్నా, ర్యాష్ డ్రైవింగ్ చేస్తున్నా, హెల్మెట్, సీటు బెల్టు లేకుండా వాహనం నడుపుతున్నా, సెల్‌ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేస్తున్నా ఏమీ చేయలేకపోతున్నామని చాలా మంది బాధపడుతుంటారు. ఇకపై ఇలా బాధపడనక్కర్లేదు. మీ చేతిలోని స్మార్ట్ ఫోన్‌తో ఒక్క ఫొటో క్లిక్ మనిపించి.. దాన్ని రవాణా శాఖకు అందుబాటులోకి తీసుకురానున్న ఫోన్ నంబర్‌కు వాట్సప్ చేస్తే చాలు. ఆ వెంటనే రవాణా శాఖ ఎన్ఫోర్సుమెంట్ అధికారులు రంగంలోకి దిగి వారి భరతం పడతారు. రాష్ట్రంలో ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడేవారికి పౌర భాగస్వామ్యంతో ముకుతాడు వేసేందుకు రవాణా శాఖ సెప్టెంబర్ 1వ తేదీ నుంచి వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుడుతోంది. ఇందులో భాగంగా 95428 00800 వాట్సప్ నంబర్‌ను అందుబాటులోకి తీసుకొస్తోంది. రాష్ట్రంలో ఎక్కడైనా ట్రాఫిక్ నిబంధనల అతిక్రమణకు పాల్పడేవారి ఫొటోల్ని ప్రజలు ఈ వాట్సాప్ నంబర్‌కు పంపితే చాలు. అయితే ఇలా పంపే ఫొటోలో వాహన నంబర్ స్పష్టంగా కనిపించేలా జాగ్రత్త వహించాలి. ఈ ఫొటోలను రవాణా శాఖ ఎన్ఫోర్సుమెంట్ బృందాలు పరిశీలించి, వాహన నంబర్ ఆధారంగా వాహనదారుడి అడ్రస్‌కు నేరుగా చలానా పంపుతాయి. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుంచి వచ్చిన ఫొటోల్ని ఆయా జిల్లాల రవాణా శాఖ అధికారులకు పంపి ఉల్లంఘనులకు ముకుతాడు వేస్తారు. పదేపదే ఉల్లంఘనలకు పాల్పడే వారిని గుర్తించేందుకు జిల్లాలవారీగా ప్రత్యేక డ్రైవ్ చేపట్టి లైసెన్సు రద్దు చేసేందుకు ప్రతిపాదనలు రూపొందిస్తారు. ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమిస్తే భారీ జరిమానాతో కూడిన చలానాలు నేరుగా ఇంటికే రానున్నాయి. ప్రజలను నేరుగా భాగస్వాములను చేయడం ద్వారా ట్రాఫిక్ నిబంధనల అతిక్రమణకు పాల్పడేవారికి అడ్డుకట్ట వేయడం సులభతరమవుతుందని రవాణా శాఖ ఆశిస్తోంది. ఈ విధానంపై అధికారులకు సూచనలు చేసినట్లు రవాణా శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. (చదవండి: ట్రాఫిక్ ఉల్లం‘ఘనుల’ ఆటలు చెల్లవిక) -
ట్రాఫిక్ ఉల్లం‘ఘనుల’ ఆటలు చెల్లవిక
సాక్షి, అమరావతి: ఇక లైసెన్సులు లేకుండా వాహనం నడిపినా, అతివేగంతో, మద్యం తాగి డ్రైవ్ చేసినా భారీగా జరిమానాలు చెల్లించాల్సిందే! ఈ మేరకు మోటారు వాహనాల సవరణ బిల్లు–2019లో కేంద్రం నిబంధనలు రూపొందించింది. ఇప్పటికే లోక్‌సభ ఆమోదం పొందిన ఈ బిల్లు రాజ్యసభ ఆమోదం తర్వాత చట్ట రూపం దాల్చనుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర పోలీసులతో కలిసి రవాణా అధికారులు ట్రాఫిక్ నిబంధనలను కఠినతరం చేయడంతోపాటు రాష్ట్రంలో పరిస్థితులపై ఓ నివేదిక రూపొందించనున్నారు. బిల్లులో ట్రాఫిక్ ఉల్లంఘనలకు జరిమానా పది రెట్లు వరకు పెంచడంతో ఆ మేరకు వాహనదారులకు కౌన్సెలింగ్ ఇచ్చేందుకు రవాణా శాఖ సన్నద్ధమవుతోంది. ఉల్లంఘనులకు పునశ్చరణ తరగతులను నిర్వహించి, కమ్యూనిటీ సర్వీసు చేసేలా కౌన్సెలింగ్ చేయనుంది. ఏటా 9 వేల మంది మృతి రాష్ట్రంలో మొత్తం 90 లక్షలకు పైగా వాహనాలు ఉన్నాయి. వీటిని నడిపే వారిలో 45 శాతం మందికి లైసెన్సు లేనట్లు రవాణా శాఖ సర్వేలోనే తేలింది. గణాంకాల ప్రకారం.. రాష్ట్రంలో ఏటా రోడ్డు ప్రమాదాల్లో 9 వేల మంది వరకు మరణిస్తుండగా 30 వేల మంది వరకు క్షతగాత్రులవుతున్నారు. రోడ్డు ప్రమాదాలకు గురైన వారికి సాయం చేసిన వారి వివరాలను ఆస్పత్రులు అడుగుతున్నాయి. మరోవైపు పోలీసులు సాక్ష్యం కోసం ఇబ్బందులు పెడుతున్నారు. నూతన బిల్లు ప్రకారం.. ఆస్పత్రులు క్షతగాత్రులను చేర్చే వారి వివరాలను అడగకూడదు. పోలీసులు ఇబ్బందులకు గురి చేయకూడదు. అంబులెన్స్‌కు దారి ఇవ్వకపోతే రూ.10 వేల వరకు జరిమానా విధిస్తారు. రోడ్డు ప్రమాదం జరిగితే.. ఆ రోడ్డు నిర్మాణంలో లోపముంటే కాంట్రాక్టర్ నుంచి అపరాధ రుసుం వసూలు చేయొచ్చు. రోడ్డు భద్రతా చర్యలకు రూ.50 కోట్లు గుర్తు తెలియని వాహనాలు ఢీకొని వ్యక్తులు మరణించిన సందర్భాల్లో ఆ వాహనాల సమాచారం దొరకదు. దీంతో బీమా క్లెయిమ్ చేసేందుకు కుదరడం లేదు. ఈ తరహా కేసుల్లో బాధితులు పరిహారం కోసం కలెక్టర్లకు దరఖాస్తు చేసుకునే వీలు కొత్త బిల్లులో కల్పించారు. దీని ప్రకారం.. రూ.2 లక్షల వరకు బాధితులకు పరిహారం అందుతుంది. వాహనాల థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ప్రకారం.. ప్రమాద మృతులకు రూ.5 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి రూ.2.50 లక్షలు అందేలా బిల్లులో పొందుపరిచారు. క్యాబ్‌ల నిర్వాహకుల్ని కూడా చట్టం పరిధిలోకి తెచ్చేలా బిల్లు రూపొందించారు. ఏపీలో క్యాబ్ నిర్వాహకులు ఇష్టారీతిన చార్జీలు వసూలు చేస్తుండటంతో ఛార్జీలను నియంత్రించేలా రాష్ట్ర రవాణా శాఖ నిబంధనలు రూపొందించనుంది. రహదారి భద్రత చర్యలకు గత టీడీపీ ప్రభుత్వం రూ.10 కోట్లే కేటాయించి చేతులు దులుపుకోగా వైఎస్సార్సీపీ ప్రభుత్వం రూ.50 కోట్లను కేటాయించింది. స్పీడ్ గన్లు, బ్రీత్ ఎనలైజర్లు, ఎన్ఫోర్సుమెంట్ పరికరాలు కొనుగోలు చేయడానికి రవాణా శాఖకు అవకాశం లభించింది. -
రాంగ్ పార్కింగ్ చేస్తే రూ.23 వేలు కట్టాల్సిందే..!
ముంబై : అక్రమ పార్కింగ్‌లతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న ముంబై ప్రజలకు కాస్త ఉపశమనం లభించనుంది. ఎక్కడపడితే అక్కడ బండి పార్కింగ్ చేసే వారి జేబుకు భారీ చిల్లు పడనుంది. ముంబైలో ఉన్న 26 పబ్లిక్ పార్కింగ్ జోన్లలో కాకుండా ఇతర చోట్ల వాహనాలు నిలిపి ట్రాఫిక్ నియమాల్ని ఉల్లంఘించే వారికి భారీ జరిమానాలు విధిస్తున్నామని బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్, మంబై ట్రాఫిక్ పోలీసులు వెల్లడించారు. ఆదివారం (జూలై 7) నుంచి అమలౌతున్న కొత్త నిబంధనల ప్రకారం.. పైన పేర్కొన్న పార్కింగ్ జోన్లలో కాకుండా వాటికి 500 మీటర్ల లోపున అక్రమ పార్కింగ్ చేసేవారికి.. ద్విచక్రవాహనాలకు రూ.5 వేల నుంచి 8,300, ఫోర్ వీలర్‌కైతే రూ.10 వేల నుంచి రూ.23,250, త్రీ వీలర్‌కైతే రూ.8 వేల నుంచి 12,200 వరకు పెనాల్టీ విధిస్తారు. ఇక మీడియం వాహనాలకు 11 వేల నుంచి 17 వేలు, లైట్ మోటార్ వాహనాలకైతే రూ.10 వేల నుంచి 15 వేల చలాన్లు తప్పవని పోలీసులు హెచ్చరించారు. అక్రమ పార్కింగ్ ద్వారా ట్రాఫిక్ జామ్ అవడంతోపాటు రోడ్డు అభివృద్ధి పనులకు ఆటంకం కలుగుతోందని అధికారులు చెప్పారు. చలాన్ల రేట్లలో తొలుత తక్కువ మొత్తంలోనే జరిమానా విధిస్తామని, వాటిని చెల్లించడంలో ఆలస్యం చేసేకొద్దీ పెనాల్టీ మొత్తం రోజురోజుకీ పెరుగుతుందని చెప్పారు. మంబై మహానగరంలో దాదాపు 30 లక్షల వాహనాలు ఉండటం గమనార్హం. ట్రాఫిక్ సిబ్బందికి తోడుగా మాజీ సైనికోద్యోగులు, ప్రైవేటు సెక్కురిటీ సిబ్బంది సేవల్ని కూడా వినియోగించుకుంటామని అధికారులు తెలిపారు. -
సీసీ'ఠీవి'గా ట్రాఫిక్..
సాక్షి, హైదరాబాద్: ట్రాఫిక్ ఉల్లంఘనుల్లో క్రమశిక్షణ పెంచడం.. స్వైర ‘విహారం’చేసే నేరగాళ్లకు చెక్ చెప్పడం.. వాహనచోదకులు గమ్యం చేరుకునే సమయాన్ని గణనీయంగా తగ్గించడం.. ట్రాఫిక్ జామ్స్‌ను దాదాపు కనుమరుగు చేయడం వంటి లక్ష్యాలతో ఏర్పాటవుతున్న అత్యాధునిక వ్యవస్థ ఇంటెలిజెంట్ అండ్ ఇంటిగ్రేటెడ్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్ (ఐటీఎంఎస్) ట్రయల్ రన్ ప్రారంభమైంది. జూన్ వరకు ఈ వ్యవస్థ నిర్వహణలో ఉన్న ఇబ్బందులు, తలెత్తే సాంకేతిక సమస్యల్ని అధ్యయనం చేయాలని ట్రాఫిక్ విభాగం అధికారులు నిర్ణయించారు. వాటన్నింటినీ సరిచేయడంతో పాటు సమర్థవంతంగా అభివృద్ధి చేసి రాష్ట్రావతరణ రోజైన జూన్ 2 నుంచి పూర్తిస్థాయిలో అధికారికంగా అమల్లోకి తీసుకురావడానికి నగర ట్రాఫిక్ పోలీసులు సన్నాహాలు చేస్తున్నారు. దాదాపు రూ.100 కోట్ల వ్యయంతో నగరంలోని 3 పోలీసు కమిషనరేట్లలో ఉన్న 250 జంక్షన్లలో తొలి దశలో ఈ వ్యవస్థ అమలుకానుంది. ఈ వ్యవస్థ అందుబాటులోకి వస్తే ట్రాఫిక్ నిర్వహణ, పరిశీలన మొత్తం కమిషనరేట్ కేంద్రంగా పనిచేసే ట్రాఫిక్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ (టీసీసీసీ) నుంచే జరగనుంది. రాత్రి వేళల్లోనూ పనిచేసే 16 మెగాపిక్సల్ కెమెరాలతో దేశంలోనే తొలిసారిగా హైదరాబాద్‌లో అందుబాటులోకి వస్తున్న ఐటీఎంఎస్‌లో ఉండే కీలకాంశాలివి.. వాహన మార్గంపై నిఘా.. నగరవ్యాప్తంగా సంచరించే వాహనాల ట్రాకింగ్ విధానం ఐటీఎంఎస్ ద్వారా అందుబాటులోకి రానుంది. సీసీ కెమెరాలు ఆయా ప్రాంతాల్లో తిరిగే ప్రతి వాహనాన్నీ నంబర్‌తో సహా చిత్రీకరించి సర్వర్‌లో నిక్షిప్తం చేస్తాయి. దీంతో ఓ వాహనం నగర పరిధిలో ఎక్కడెక్కడ తిరిగిందన్న వివరాలు క్షణాల్లో తెలుసుకోవచ్చు. ఇక నేరానికి పాల్పడిన వాహనమో, అనుమానిత వాహనాన్ని గుర్తించి.. సత్వర చర్యలకు ఇది దోహదం చేస్తుంది. బస్సుల వివరాలూ.. సిటీలో సంచరిస్తున్న ఆర్టీసీ బస్సులు ఓ క్రమపద్ధతిలో సాగవు. ఒకే మార్గంలో వెళ్లే అనేక బస్సులు ఏకకాలంలో బస్టాప్స్ వద్దకు చేరుకుంటుంటాయి. దీనివల్ల ఆయా బస్టాప్లతోపాటు అవి వెళ్లే మార్గాల్లోనూ ట్రాఫిక్ జామ్స్ తప్పవు. దీనికి విరుగుడుగా అమల్లోకి రానున్నదే డైనమిక్ బస్ ప్లాట్‌ఫాం అసైన్మెంట్ (డీబీపీఏ) వ్యవస్థ. ఒకే మార్గంలో వెళ్లే అనేక బస్సులు ఒకే స్టాప్ దగ్గరకు వస్తుంటే.. జంక్షన్లు, బస్‌బేల్లో ఉన్న సీసీ కెమెరాలు అప్రమత్తమవుతాయి. రెండు కూడళ్ల మధ్యలోనే వాటి వేగం తగ్గించాల్సిందిగా క్షేత్రస్థాయిలో ఉన్న పోలీసులకు సూచనలు చేస్తాయి. ఇక ప్లేటు మార్చలేరు నేరగాళ్లు, ఉల్లంఘనులు పోలీసుల్ని తప్పించుకోవడానికి అనేక ఎత్తులు వేస్తుంటారు. ఇందులో భాగంగా ఇతర వాహనాల నంబర్లను తమ వాహనాల నంబర్ ప్లేట్లపై వేసుకుని సంచరిస్తుంటారు. ఇలాంటి వాళ్ల ఆట కట్టించేందుకు ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రీడింగ్ సిస్టమ్ (ఏఎన్పీఆర్) సాఫ్ట్వేర్ ఉపయోగపడనుంది. నగర వ్యాప్తంగా ఉండే కెమెరాల ద్వారా ఒకే నంబర్‌తో రెండు వాహనాలు, కార్ల నంబర్లతో ద్విచక్ర వాహనాలు, వేరే నంబర్లతో తిరిగే ఆటోలను తక్షణం గుర్తిస్తుంది. ఆ విషయాన్ని ఆ వాహనం ప్రయాణించే ముందు జంక్షన్లలో ఉన్న క్షేత్రస్థాయి పోలీసులకు సమాచారం ఇచ్చి అప్రమత్తం చేస్తుంది. అత్యవసర వాహనాలకు గ్రీన్ చానల్ సిటీలోని అనేక రోడ్లలో ట్రాఫిక్ మధ్య అంబులెన్స్‌లు ఇరుక్కుపోతున్నాయి. అత్యంత ప్రముఖుల వాహనాలు రహదారులపై ప్రయాణిస్తున్నప్పుడు వీటికి ట్రాఫిక్ జామ్స్ ఎఫెక్ట్ లేకుండా గ్రీన్ చానల్ కల్పించడానికి ట్రాఫిక్ పోలీసులు అష్టకష్టాలు పడాల్సి వస్తోంది. ఈ రెండు సమస్యలకు పరిష్కారంగా ‘డివైజ్’ను అందుబాటులోకి తీసుకువస్తున్నారు. ఎంపిక చేసిన అంబులెన్స్‌ను, అర్హులైన ప్రముఖుల వాహనాలకు ఈ డివైజ్‌లను ఏర్పాటు చేస్తారు. ఫలితంగా జంక్షన్‌కు 200 మీటర్ల దూరానికి ఆ వాహనాలు వచ్చిన వెంటనే.. అవి వస్తున్న వైపు సిగ్నల్ లైట్ గ్రీన్‌గా మారిపోతుంది. మిగిలిన మార్గాల్లో వాహనాలు ఆపడానికి రెడ్ లైట్ పడుతుంది. ట్రాఫిక్ స్థితిగతులు.. నగరంలోని కొన్ని జంక్షన్లలో వేరియబుల్ మెసేజ్ సైన్ బోర్డులుగా (వీఎంఎస్) పిలిచే డిజిటల్ బోర్డులద్వారా వాహనదారులు ట్రాఫిక్ జామ్‌లో చిక్కుకోకుండా ప్రత్యామ్నాయ మార్గాలూ ప్రదర్శిస్తారు. సాంకేతిక లోపాలతో ఆగిపోయే వాహనాల గుర్తింపునకు ఐటీఎంఎస్‌లో ఇన్సిడెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ (ఐఎంఎస్) ఏర్పాటు చేస్తున్నారు. ఇది బ్రేక్‌డౌన్ వాహనాలను గుర్తించడంతోపాటు ఏ మార్గాల్లో ట్రాఫిక్ని నియంత్రించాలి, ఎక్కడ ఆపేయాలి అనే అంశాలను విశ్లేషిస్తుంది. ఆగకుండా ముందుకు సాగేలా రద్దీ వేళల్లో వాహనచోదకుల్ని ట్రాఫిక్ జామ్స్ కంటే ఎక్కువగా రెడ్ సిగ్నల్స్ ఇబ్బంది పెడుతుంటాయి. గమ్య స్థానాల వైపు ప్రయాణించే వాహనాలను దాదాపు ప్రతి చౌరస్తాలోనూ రెడ్ సిగ్నల్ నేపథ్యంలో ఆగుతూ వెళ్లాల్సిన పరిస్థితులు సర్వసాధారణం. ఇలా కాకుండా ఉండేందుకు అన్ని జంక్షన్ల ట్రాఫిక్ సిగ్నల్స్‌ను అనుసంధానం చేయనున్నారు. ఇలా చేయడంతో ఓ జంక్షన్లో ఆగిన వాహనం గ్రీన్ సిగ్నల్ వచ్చిన తర్వాత ముందుకు కదిలితే.. సమీపంలో ఉన్న మిగిలిన జంక్షన్లలో ఆగాల్సిన పని ఉండదు. ఈవెంట్ ఉంటే ‘నో గ్రీన్’ ఓ చౌరస్తాకు అవతలి వైపు ఏమైనా ధర్నాలు, నిరసనలు, సభలు, సమావేశాలతోపాటు అనుకోకుండా ఏర్పడే అవాంతరాలు వంటి ‘ఈవెంట్’ఉన్నా.. ఈ విషయాన్ని ముందే సర్వర్‌లో ఫీడ్ చేస్తారు. ఫలితంగా ఆ రూట్లోకి వెళ్లాలని ప్రయత్నించే వాహనాలకు నిత్యం రెడ్ లైటే కనిపిస్తుంది. అక్కడుండే వీఎంఎస్ బోర్డుల ద్వారా వాహనచోదకుడికి విషయాన్ని వివరిస్తూ ప్రత్యామ్నాయ మార్గంలోకి వెళ్లేలా చర్యలు తీసుకుంటారు. ఉల్లంఘనులకు ఈ–చెక్ వాహనచోదకుల్లో క్రమశిక్షణ పెంచడంతోపాటు ఉల్లంఘనులకు చెక్ చెప్పడానికి ఐటీఎంఎస్‌లో పెద్దపీట వేస్తున్నారు. అన్ని రకాలైన ఉల్లంఘనలపై కెమెరాలు వాటంతట అవే ఆయా ఉల్లంఘనుల వాహనాలను ఫొటో తీస్తాయి. సర్వర్ ఆధారంగా ఈ–చలాన్ సైతం ఆటోమేటిక్‌గా సంబంధిత వాహనచోదకుడి చిరునామాకు చేరిపోతుంది. చౌరస్తాల్లో కాల్ బ్యాక్స్ ఐటీఎంఎస్‌లో భాగంగా చౌరస్తాలు, కీలక ప్రాంతాల్లో ఎమర్జెన్సీ కాల్ బాక్స్ (ఈసీబీ)లను ఏర్పాటు చేస్తున్నారు. ఆ బాక్సులోని బటన్ నొక్కిన వెంటనే.. అక్కడ ఉండే కెమెరా సైతం యాక్టివేట్ అవుతుంది. దీంతో టీసీసీసీలో ఉండే సిబ్బంది ఫిర్యాదు చేస్తున్న వ్యక్తిని చూడటంతోపాటు అతడు చెప్పేది విని స్పందిస్తారు. -
రోడ్డెక్కిన గబ్బర్ సింగ్, సాంబ
గురుగ్రాం : ‘అరెవో సాంబ వాహనం నడిపేటప్పుడు హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించకపోవడం వల్ల లాభమా? నష్టమా?’అని గబ్బర్ ప్రశ్నించగా.. ‘ప్రమాదాలు జరిగినప్పుడు హెల్మెట్ లేకపోవడం వలన తలకు తీవ్ర గాయాలయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రమాదం ఇంకా పెద్దదయినపుడు ఆ వ్యక్తి కోమాలోకి వెళ్లవచ్చు కొన్ని సార్లు ప్రాణాలూ విడవచ్చు. ఎలా చూసినా హెల్మెట్ లేకుండా వాహనం నడపడం ప్రయాణికుడికి తీవ్ర నష్టమే’అంటూ గబ్బర్ ప్రశ్నకు సాంబ సమాధానమిస్తాడు. ఏంటీ గబ్బర్, సాంబల పేర్లు చెప్పి షోలే సినిమా డైలాగులు కాకుండా వేరే డైలాగులు చెబుతున్నారనుకుంటున్నారా?. అయితే వాహనదారులకు ట్రాఫిక్ నిబంధనలను వివరించడానికి హర్యానా రాష్ట్రంలోని గురుగ్రాం జిల్లా ట్రాఫిక్ పోలీసులు చేస్తున్న వినూత్న ప్రయత్నం ఇది. ట్రాఫిక్ నియమాలు పాటించమని ఎన్ని సార్లు చెప్పినా, ప్రచారాలు చేసినా, భారీ జరిమానాలు విధించినా వాహనదారుల్లో ఎలాంటి మార్పు రాకపోవడంతో పోలీసులు విసుగెత్తిపోయారు. దీంతో ఏదైన వెరైటీగా చేసయినా సరే ప్రజల్లో చైతన్యం తీసుకరావాలని ఆలోచన మెదలెట్టారు గురుగ్రాం ట్రాఫిక్ పోలీసులు. దీంతో స్థానిక విద్యార్థులతో కలిసి ప్రజలకు ట్రాఫిక్ పాఠాలు చెప్పాలని నిశ్చయించుకున్నారు. దీనిలో భాగంగా దీపక్, అరుణ్‌లు గబ్బర్ సింగ్, సాంబ వేషధారణలో ట్రాఫిక్ నిబంధనలకు విరుద్ధంగా వాహనాలు నడిపేవారికి క్లాస్ తీసుకుంటున్నారు. షోలే సినిమాలోని పవర్ఫుల్ డైలాగ్‌లను ట్రాఫిక్ భాషలో చెప్పి ప్రజల్లో చైతన్యం తీసుకరావాలని ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో తెగ హల్చల్ చేస్తోంది. ట్రాఫిక్ పోలీసులు, విద్యార్ధులు ప్రయత్నానికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. -
రోడ్డెక్కిన గబ్బర్ సింగ్, సాంబ
-
రూ.100 ఫైన్ కట్టమంటే.. కత్తి తీసి..
సాక్షి, బెంగళూరు : వాహన తనిఖీలు చేస్తున్న ట్రాఫిక్ పోలీసులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. హెల్మెట్ లేకుండా బైక్ నడుపుతున్న ఓ వ్యక్తిని అడ్డగించిన సిబ్బంది అతనికి రూ.100 ఫైన్ వేశారు. ఈ క్రమంలో అతను చెప్పిన సమాధానం విని నోరెళ్ల బెట్టారు. ‘త్వరగా వెళ్లాలి సార్. మా ఫ్రెండ్‌ను కత్తితో పొడిచా. పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోవడానికి వెళ్తున్నా. నన్ను విడిచిపెట్టండి’ అని 26 ఏళ్ల సందీప్ శెట్టి చెప్పడంతో ట్రాఫిక్ సిబ్బందికి నమ్మబుద్ధి కాలేదు. ‘నిజం సార్. కావాలంటే చూడండి. ఇదే కత్తితో పొడిచా’ అని సందీప్ రక్తం మరకలతో ఉన్న కత్తి చూపించాడు. దీంతో కంగుతిన్న పోలీసులు నిందితున్ని అదుపులోకి తీసుకుని విచారించారు. ఘటనా స్థలానికి చేరుకుని బాధితున్ని ఆస్పత్రికి తరలించారు. వివరాలు..చిక్కబళ్లపురకు చెందిన సందీప్ శెట్టి, దేవరాజ్ స్నేహితులు. దేవరాజ్ స్థానికంగా కుకింగ్ ఆయిల్ షాప్ నిర్వహిస్తున్నాడు. అయితే, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పెట్టుబడి పెడదామని చెప్పిన దేవరాజ్.. కొంతకాలం క్రితం సందీప్ శెట్టి నుంచి లక్ష రూపాయలు తీసుకున్నాడు. కానీ, దేవరాజ్ ఆ సొమ్మును ఎక్కడా పెట్టుబడి పెట్టలేదు. దీంతో తన డబ్బు తిరిగి ఇవ్వాలని సందీప్.. దేవరాజ్‌పై ఒత్తిడి తెచ్చాడు. ఇద్దరి మధ్య మాటామాటా పెరగడంతో సందీప్ దేవరాజ్‌పై కత్తితో దాడి చేశాడు. అనంతరం పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయేందుకు బైక్‌పై వెళ్తున్న క్రమంలో ట్రాఫిక్ పోలీసుల తనిఖీల్లో పట్టుబడ్డాడు. కాగా, బాధితుడి పొట్ట, వీపుపై కత్తి పోట్లున్నాయనీ, అతని పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. -
వేగమే తొలి శత్రువు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రహదారులు రక్తసిక్తమవుతున్నాయి. ముఖ్యంగా జాతీయ, రాష్ట్ర పరిధిలో ఉన్న రహదార్లపై రోడ్డు ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. పెరుగుతున్న వాహనాలకు అనుగుణంగా రోడ్డు విస్తరణలు జరుగుతున్నా.. మితిమీరిన వేగం ప్రమాదాలకు ముఖ్యకారణం అవుతోంది. తర్వాతి స్థానాల్లో డ్రంకెన్ డ్రైవ్, నిర్లక్ష్యంగా ఉండటం గమనార్హం. మనదేశంలో ఉన్న పరిస్థితుల ఆధారంగా ఏ వాహనానికైనా గరిష్ట వేగ పరిమితి 80 కి.మీ. మాత్రమే. కానీ ఇక్కడ కార్లు, ఇతర వాహనాలు 120 కిలోమీటర్లు దాటి కూడా వెళుతున్నాయి. రోడ్డు రవాణా, హైవే శాఖ 2016 నివేదిక ప్రకారం ఏటా దేశవ్యాప్తంగా 4,80,652 ప్రమాదాలు జరుగుతుండగా 1.5 లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. మితిమీరిన వేగం కారణంగానే 68 శాతం ప్రమా దాలు జరగడం గమనార్హం. తెలంగాణలో దాదాపు 5 వేలకు పైగా మరణాలు జరిగాయి. కాగితాల్లోనే రోడ్ సేఫ్టీ కమిటీ! రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాల నివారణకు రోడ్ సేఫ్టీ కమిటీని ఏర్పాటు చేయాలని ఏడాది కింద ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో మెడికల్, రవాణా, పోలీసు, ఆర్ అండ్ బీ అధికారులు భాగస్వామ్యం కావాలి. అయితే ఇదింకా తుదిరూపు దాల్చలేదు. దీనికి ఎవరు నేతృత్వం వహించాలన్న దానిపై ఇంకా స్పష్టత రాలేదు. నిరంతర నిఘా అవసరం మితిమీరిన వేగం, డ్రంకెన్ డ్రైవ్, ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనల నియంత్రణకు రహదారులపై నిరంతర డ్రైవ్‌లు చేపట్టాలి. కెమెరాలతో పర్యవేక్షణ అవసరం. ట్రాఫిక్ ఉల్లంఘనలకు భారీగా జరిమానాలు విధించాలి. – పాండురంగ్ నాయక్, జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్,ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయం -
ట్రాఫిక్ ఉల్లంఘనులూ జర జాగ్రత్త..!
సాక్షి, సిటీబ్యూరో: సైబరాబాద్‌లో ట్రాఫిక్ ఉల్లంఘనులు ఇక మరింత జాగ్రత్తగా ఉండాల్సిందే...ఇప్పటికే ట్రాఫిక్ జంక్షన్లలో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాలు,కానిస్టేబుళ్ల చేతుల్లో ఉన్న కెమెరాల చేతికి చిక్కుతున్న వీరు... పోలీసు సిబ్బంది లేరు కదా అని ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడితే మూల్యం చెల్లించుకోవాల్సిందే. ఇప్పటికే హైదరాబాద్, సైబరాబాద్ పోలీసుకమిషనరేట్లలో ఉత్సవాలు, సమస్యాత్మక ప్రాంతాల్లో వినియోగించే వెహికల్ మౌంటెడ్ కెమెరాలను ఇప్పుడూ ట్రాఫిక్ ఉల్లంఘనుల భరతం పట్టేం దుకు వాడాలని యోచిస్తున్నారు. సీసీ టీవీ కెమెరాలు లేని గల్లీల్లో వీటిని వినియోగించాలని భావిస్తున్నారు. ప్ర యోగాత్మకంగా ఐటీ కారిడార్‌లో ఈ వాహనాలను వినియోగించి ఫలితాలను పరి శీలించిన అనంతరం తదుపరి చర్యలకు ఉపక్రమించనున్నారు. 360 డిగ్రీల్లో..... ‘ఈ వాహనాల్లో ఉన్న 20 కెమెరాలు ఎప్పటికప్పుడూ ఆయా ప్రాంతాల్లో జరిగే దృశ్యాలను బంధిస్తుంటాయి. పాన్, పింట్, జూమ్...అటూ ఇటూ చూడటం...360 డిగ్రీల కోణంలో తిరిగి అన్ని దృశ్యాలను రికార్డు చేస్తాయి. వాహనానికి పక్కన, వెనుక కూడా ఒక్కో కెమెరా ఉంటాయి. వాహనం ఉన్న ప్రాంతం నుంచి చుట్టు పక్కల 500 మీటర్ల మేర ఫొటోలను క్లిక్ మనిపిస్తుంది. ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమించే వారి వాహనాల ఫొటోల ఆధారంగా వాహనదారుడి ఇంటికి ఈ–చలాన్ పంపించనున్నారు. ఇప్పటికే వెహికల్ మౌంటెడ్ కెమెరాలను గణేశ్ ఉత్సవాల బందోబస్తు సమయంలో ఉపయోగిస్తున్న వాహనాలను ట్రాఫిక్ ఉల్లంఘనలకు వినియోగించే అంశాన్ని పరిశీలిస్తున్నామని ట్రాఫిక్ డీసీపీ విజయ్ కుమార్ తెలిపారు.