‘అడ్డుగా వచ్చాడని వేసుకెళ్లి పోయాడు’ | Car Driver Drags Traffic Constable On Bonnet In Delhi | Sakshi

‘అడ్డుగా వచ్చాడని వేసుకెళ్లి పోయాడు’

Feb 3 2020 3:46 PM | Updated on Mar 22 2024 11:10 AM

రోడ్డు ప్రమాదాలు అరికట్టడానికి ట్రాఫిక్‌ సిబ్బంది కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా వాహనాలకు అన్ని పత్రాలు ఉన్నాయా..? లేదా అని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. లేని పక్షంలో కేంద్ర మోటారు వాహనాల చట్టం ప్రకారం భారీ జరిమానా విధిస్తున్నారు. అయితే, కొందరు కేటుగాళ్లు చలానా తప్పించుకోవడానికి ట్రాఫిక్‌ సిబ్బందితో వాగ్వాదానికి దిగుతున్నారు. అవసరమైతే వారిపై దాడులకూ యత్నిస్తున్నారు. తాజాగా వైరల్‌ అయిన ఓ వీడియోలో.. కారు డ్రైవర్‌ ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌నే ఢీకొట్టాలని చూశాడు. అడ్డుగా వచ్చిన కానిస్టేబుల్‌ను ఏకంగా 2 కిలోమీటర్లు కారు బానెట్‌పైనే లాక్కెళ్లాడు. ఢిల్లీలోని నంగోయి చౌక్‌ వద్ద గత నవంబర్‌లో ఈ ఘటన జరగగా.. తాజాగా వైరల్‌ అయింది.

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement