Motor Vehicles (Amendment) Bill
-
స్కూటీ నడిపాడు.. రూ. 25,000 ఫైన్!
భువనేశ్వర్: మైనర్‌ను స్కూటీ నడిపేందుకు అనుమతినిచ్చిన ఓ వ్యక్తికి పోలీసులు షాకిచ్చారు. మోటారు వాహన చట్టం- 2019 ఉల్లంఘించిన కారణంగా అతడికి బుధవారం రూ.26 వేలు ఫైన్ వేశారు. వివరాలు... భువనేశ్వర్‌లోని కందగిరి ప్రాంతంలో మైనర్ ఇంకో వ్యక్తి స్కూటీ నడపడంతో జరిమానా విధించారు. ఈ స్కూటీ నిరంజన్ డాష్ అనే వ్యక్తికి చెందినదిగా అధికారులు తెలిపారు. యజమాని స్కూటీని పిల్లవాడికి ఇచ్చి చట్టాన్ని ఉల్లఘించడంతో రూ.25 వేల రూపాయలు జరిమానా విధించగా , బాలుడు హెల్మెట్ ధరించకపోవడంతో మరో రూ.1000 జరిమానా విధించారు. అంతే కాకుండా డ్రైవింగ్ లైసెన్స్ లేకపోవడంతో సెక్షన్ 207 కింద కేసు నమోదు చేసి వాహనాన్ని సీజ్ చేశారు. కాగా ఈ ఏడాది ఫిబ్రవరిలో ఓ మైనర్ బండి నడపడంతో అతడికి తండ్రికి భారీ జరిమానా పడిన విషయం తెలిసిందే. నిబంధనలు అతిక్రమించినందుకు గానూ మొత్తంగా అన్నీ కలి కలిపి రూ. 42,500 చలాన్ విధించారు. రూ. 500 సాధారణ నేరం, రూ. 5000 డ్రైవింగ్ లైసెన్స్ లేకపోవడం, రూ. 5000 ట్రాఫిక్ నిబంధనలకు వ్యతిరేకంగా బండి నడపడం, రూ. 1000 టూ వీలర్లో ఇద్దరి కంటే ఎక్కువ మంది ఉండటం, రూ. 1000 హెల్మెట్ లేకుండా నడపటం, రూ. 25,000 మోటార్ వాహన చట్టం- 2019 కింద జరిమానాను విధించారు. ఇక రహదారి భద్రతపై సుప్రీంకోర్టు కమిటీ సూచనల ప్రకారం రాష్ట్ర రవాణా అథారిటీ (ఎస్టీఏ) ఇటీవల ద్విచక్ర వాహనంపై ప్రయాణించే ఇద్దరు వ్యక్తులు హెల్మెట్ ధరించాలని తప్పనిసరి నిబంధనల విధించింది. హెల్మెట్ లేకుండా పిలియన్ రైడర్స్ పట్టుబడితే రైడర్స్ డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేస్తామని హెచ్చరించింది. -
‘అడ్డుగా వచ్చాడని వేసుకెళ్లి పోయాడు’
-
‘అడ్డుగా వచ్చాడని వేసుకెళ్లి పోయాడు’
ఢిల్లీ : రోడ్డు ప్రమాదాలు అరికట్టడానికి ట్రాఫిక్ సిబ్బంది కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా వాహనాలకు అన్ని పత్రాలు ఉన్నాయా..? లేదా అని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. లేని పక్షంలో కేంద్ర మోటారు వాహనాల చట్టం ప్రకారం భారీ జరిమానా విధిస్తున్నారు. అయితే, కొందరు కేటుగాళ్లు చలానా తప్పించుకోవడానికి ట్రాఫిక్ సిబ్బందితో వాగ్వాదానికి దిగుతున్నారు. అవసరమైతే వారిపై దాడులకూ యత్నిస్తున్నారు. తాజాగా వైరల్ అయిన ఓ వీడియోలో.. కారు డ్రైవర్ ట్రాఫిక్ కానిస్టేబుల్‌నే ఢీకొట్టాలని చూశాడు. అడ్డుగా వచ్చిన కానిస్టేబుల్‌ను ఏకంగా 2 కిలోమీటర్లు కారు బానెట్‌పైనే లాక్కెళ్లాడు. ఢిల్లీలోని నంగోయి చౌక్ వద్ద గత నవంబర్‌లో ఈ ఘటన జరగగా.. తాజాగా వైరల్ అయింది. సునీల్ అనే ట్రాఫిక్ కానిస్టేబుల్ ఓ కారును అడ్డగించాడు. వాహన పత్రాలు చూపించాలని చెప్పాడు. అయితే, కారు డ్రైవర్ పత్రాలు ఇవ్వకపోగా.. అడ్డు తప్పుకోవాలని కానిస్టేబుల్‌నే హెచ్చరించాడు. అతను వినకపోవడంతో.. కారు ముందుకు పోనిచ్చాడు. దీంతో కానిస్టేబుల్ ఒక్క ఉదుటున బానెట్‌పైకి చేరి.. వాహనాన్ని ఆపాలని మరోసారి హెచ్చరించాడు. అయినప్పటికీ.. కారు డ్రైవర్ నిర్లక్ష్యంగా దాదాపు 2 కిలోమీటర్లు అలాగే పోనిచ్చాడు. ఇదంతా ఆ కారులోనే ఉన్న ఓ ప్రయాణికుడు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. ఇక డ్రైవర్ నిర్లక్ష్యంపై నెటిజన్లు మండిపడుతున్నారు. ‘వెర్రి వేషాలకు ఇది పరాకాష్టా అతని పై చర్యలు తీసుకోండి’ అని డిమాండ్ చేస్తున్నారు. -
‘ఆ చట్టంలో ఆర్టీసీ ప్రైవేటీకరణ లేదు’
సాక్షి, హైదరాబాద్ : కరీంనగర్లో నిన్న బీజేపీ ఎంపీ బండి సంజయ్ పట్ల పోలీసుల తీరును ఖండిస్తున్నామని బీజేపీ జాతీయ కార్యనిర్వాహక సభ్యుడు ఇంద్రసేనారెడ్డి అన్నారు. తెలంగాణ వస్తే స్వేచ్ఛ ఉంటుందని భావించామని, కేసీఆర్ స్వేచ్ఛను హరించారని విమర్శించారు. సమగ్ర సర్వేతో అందరి వ్యక్తిగత వివరాలు సేకరించి, రాజకీయ ప్రత్యర్ధుల ఫోన్లు ట్యాప్ చేశారని ఆరోపించారు. రాజకీయ ప్రయోజనాల కోసమే కాకుండా వ్యాపారం కోసం కూడా పౌరుల వ్యక్తిగత సమాచారం వాడుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. నష్టం వచ్చినా భరించాలే.. పేద ప్రజలందరికీ ప్రభుత్వం వాహనాలు ఏర్పాటు చేయలేదు కాబట్టి, కేంద్రం ఆర్టీసీని ఏర్పాటు చేసిందని ఇంద్రసేనారెడ్డి గుర్తు చేశారు. తర్వాతి కాలంలో రాష్ట్రాలు ఆర్టీసీని ఏర్పాటు చేసుకున్నాయని వెల్లడించారు. ఆర్టీసీలో కేంద్రం 31శాతం పెట్టబడి పెట్టినా.. ఎక్కడా అజమాయిషీ చేయలేదని స్పష్టం చేశారు. కేసీఆర్ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నష్టం వచ్చినా, లాభం వచ్చినా మెజారిటీ షేర్ ఉన్న వాల్లే భరిస్తారని, ఇది కూడా ముఖ్యమంత్రికి తెలియదనుకోవడం సరైంది కాదని అన్నారు. ఆ హక్కు ప్రభుత్వానికి లేదు.. ఆర్టీసీ ప్రైవేటీకరణకు సంబంధించి కేంద్ర ప్రభుత్వ మోటార్ వెహికల్ చట్టంలో ఎక్కడ చెప్పలేదని ఇంద్రసేనారెడ్డి అన్నారు. 1950 కేంద్ర ప్రభుత్వ చట్టం ప్రకారం ఆర్టీసీ ఆస్తులను అమ్మే హక్కు రాష్ట్ర ప్రభుత్వానికి లేదని స్పష్టం చేశారు. మెట్రోలో వచ్చే నష్టాన్ని సర్దుబాటు చేసుకోడానికి కొన్ని కమర్షియల్ స్థలాల్ని మెట్రో కు ఇచ్చారని, ఆర్టీసీకి కూడా అదేవిధంగా ఇవ్వాలని కదా అని ప్రశ్నించారు. ప్రపంచ వ్యాప్తంగా చాలా ఆర్టీసీ లు నష్టాలలో ఉన్నాయని, అయినప్పటికీ పేదవాడి సంక్షేమం కోసం నడుస్తున్నాయని వెల్లడించారు. గతంలో అనేక కార్పోరేషన్లను ప్రభుత్వంలో కలిపారని పేర్కొన్నారు. -
18వేల చలానా.. ఫినాయిల్ తాగి
గాంధీనగర్: కొత్త మోటారు వాహన చట్టం వాహనదారులకు చుక్కలు చూపిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కొత్త చలానాలకు జడిసి ఏకంగా ప్రాణాలు తీసుకుంటున్న సంఘటనల గురించి కూడా చదువుతూనే ఉన్నాం. తాజాగా ఇలాంటి సంఘటన ఒకటి గుజరాత్లో చోటు చేసుకుంది. ట్రాఫిక్ పోలీసులు విధించిన చలానా చూసి ఆత్మహత్యాయత్నం చేశాడో ఆటో డ్రైవర్. ఈ సంఘటన అహ్మదాబాద్‌లో చోటు చేసుకుంది. రాజు సోలంకి అనే ఆటో డ్రైవర్‌కు ట్రాఫిక్ పోలీసులు ఏకంగా రూ.18 వేల చలానా విధించారు. దాంతో తీవ్ర మనస్థాపానికి గురయిన రాజు.. ఫినాయిల్ తాగి ఆత్మహత్య ప్రయత్నం చేశాడు. దాంతో అతడిని ఆస్పత్రిలో చేర్చారు. రాజు మాట్లాడుతూ.. ‘నేను చాలా పేదవాడిని. అలాంటది ట్రాఫిక్ అధికారులు నాకు ఏకంగా రూ. 18వేలు చలానా విధించారు. ఇంత భారీ మొత్తాన్ని నేను ఎలా చెల్లించాలి. నా ఆటోను కూడా సీజ్ చేశారు. ఇప్పుడు నేను నా కుటుంబాన్ని ఎలా పోషించాలి’ అని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు రాజు. -
గుండీలు పెట్టుకోలేదని జరిమానా
జైపూర్ : కేంద్రం ప్రభుత్వం తీసుకొచ్చిన మోటార్ వాహన సవరణ చట్టం-2019 వాహనదారులకు చుక్కలు చూపిస్తోన్న సంగతి తెలిసిందే. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారికి అధిక మొత్తంలో జరిమానాలు విధిస్తూ.. జేబు గుల్ల చేస్తున్నారు. కారులో హెల్మెట్ పెట్టుకోలేదని, లుంగీతో వాహనం నడిపారంటూ వింత కారణాలు చూపిస్తూ జరిమానాలు విధించడంపై పోలీసులు విమర్శల పాలవుతున్నారు. అలాంటి సంఘటనే మరోకటి రాజస్తాన్‌లో చోటు చేసుకుంది. చెప్పులు వేసుకోలేదని, చొక్కా గుండీలు పెట్టుకోకుండా వాహనం నడిపాడని మథోసింగ్ అనే టాక్సీ డ్రైవర్‌కి చలానా విధించారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన సెప్టెంబర్ 6న చోటు చేసుకుంది. కాగా రాజస్తాన్ ప్రభుత్వం నూతన మోటారు వాహన చట్టాన్ని అమలులోకి తేలేదు. -
‘క్యాబ్‌లో కండోమ్ లేకపోతే చలానా’
న్యూఢిల్లీ: కొత్త మోటారు వాహన చట్టం పట్ల దేశవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. దాంతో పాటు ఈ చట్టం గురించి కొత్త కొత్త పుకార్లు కూడా బాగానే షికారు చేస్తున్నాయి. ఈ క్రమంలో ఢిల్లీలో ఓ చెత్త పుకారు బాగా వ్యాప్తి చేందుతుంది. అదేంటంటే.. బైక్ మీద వెళ్లే వారికి హెల్మెట్, కారులో వెళ్లేవారు సీటు బెల్టు ధరించడం తప్పనిసరి ఎలానో.. అలానే క్యాబ్ డ్రైవర్లు కార్లలో కండోమ్‌లు తప్పనిసరిగా తీసుకెళ్లాలి.. లేదంటే చలానా విధిస్తారంటూ ఓ తప్పుడు వార్త ప్రచారం అవుతోంది. కండోమ్ లేని కారణంగా ధర్మేంద్ర అనే క్యాబ్ డ్రైవర్‌కు ట్రాఫిక్ పోలీసులు చలానా విధించారట. ఇందుకు సంబంధించిన రిసిప్ట్‌ను అతడు షేర్ చేయడంతో ప్రస్తుతం ఈ వార్త బాగా వ్యాప్తి చెందుతుంది. దీని గురించి ధర్మేంద్ర మాట్లాడుతూ.. ‘ట్రాఫిక్ సిబ్బంది నా క్యాబ్‌ని చెక్ చేసినప్పుడు ఫస్ట్ ఎయిడ్ కిట్‌లో కండోమ్ లేదు అని చెప్పి చలానా విధించారు. నాలా ఇంకొకరికి జరగకూడదనే ఉద్దేశంతో.. చలానా కట్టిన రిసిప్ట్‌ను సోషల్ మీడియాలో షేర్ చేశాను’ అని తెలిపాడు. అంతేకాక ఢిల్లీ సర్వోదయ డ్రైవర్ అసోసియేట్ ప్రెసిడెంట్ ఇక మీదట క్యాబ్ డ్రైవర్లందరు కార్లలో కండోమ్ తప్పనిసరిగా తీసుకెళ్లాలని ఆదేశించాడు. ఈ విషయం గురించి పలువురు క్యాబ్ డ్రైవర్లు మాట్లాడుతూ.. ‘ఫిటనెస్ టెస్ట్‌లో భాగంగా చాలాసార్లు ట్రాఫిక్ అధికారులు క్యాబ్‌లో కండోమ్ ఉందా అని ప్రశ్నించేవారు. దాంతో ఒకటి తీసుకుని అలా పడేశాను’ అన్నారు. మరి కొందరు ‘ఎప్పుడైనా యాక్సిడెంట్ లాంటి ప్రమాదాలు జరిగితే కట్టుకట్టడానికి ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో క్యాబ్‌లో కండోమ్ ఒకటి ఎప్పుడు ఉంచుతాను’ అన్నారు. అయితే దీని గురించి ట్రాఫిక్ అధికారులను ప్రశ్నించగా కొత్త మోటారు వాహన చట్టంలో ఇలాంటి రూల్ ఎక్కడా లేదని.. ఫిట్నెస్ టెస్ట్‌లో కూడా కండోమ్ గురించి ఎప్పుడు ప్రశ్నించలేదని తెలిపారు. క్యాబ్‌లో కండోమ్ లేదని ఎవరికైనా జరిమానా విధిస్తే.. వారు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయవచ్చని సూచించారు. -
ఇదేం బాదుడు..ఫేస్బుక్ స్టోరీ వైరల్
న్యూఢిల్లీ: కేంద్రం తీసుకువచ్చిన నూతన మోటారు వాహన చట్టం-2019 జనాలను బెంబేలెత్తిస్తోన్న సంగతి తెలిసిందే. దేశ వ్యాప్తంగా ఈ నూతన చట్టంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. చట్టం పేరు చెప్పి సామాన్యుల జేబు గుల్ల చేస్తున్నారంటూ విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే పలు రాష్ట్రాలు కేంద్రం తీసుకువచ్చిన నూతన చట్టాన్ని తమ రాష్ట్రాల్లో అమలు చేయబోవడం లేదని ప్రకటించాయి. ఈ నేపథ్యంలో నూతన చట్టం పేరు చెప్పి.. అధికారులు వాహనదారులను ఎలా ఇబ్బందులకు గురి చేస్తున్నారో తెలిపే సంఘటన ఒకటి దేశ రాజధానిలో చోటు చేసుకుంది. రాఘవ్ స్వాతి పృథి అనే వ్యక్తి తన ఫేస్బుక్లో షేర్ చేసిన ఈ స్టోరీ ప్రస్తుతం తెగ వైరలవుతోంది. ఆ వివరాలు.. రాఘవ్ స్వాతి పృథి కొద్ది రోజుల క్రితమే హార్లీ డేవిడ్సన్ రోడ్ గ్లైడ్ బైక్‌ని కొన్నాడు. ఈ బండి ప్రత్యేకత ఏంటంటే.. దీనిలో ఆడియో సిస్టం ఇన్‌బిల్ట్‌గానే వస్తుంది. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం జరిగిన సంఘటన గురించి అతడి మాటల్లోనే.. ‘తిలక్ నగర్లో నేను నా బైక్‌పై తిరుగుతుండగా.. నా ఎదురుగా ఓ పోలీసు వాహనం వచ్చింది. అందులోంచి ఓ అధికారి దిగి నా బండిని ఆపమని చెప్పాడు. ఆ తర్వాత బండికి సంబంధించిన అన్ని పేపర్లు తీసుకుని నన్ను పోలీస్ స్టేషన్‌కు రమ్మన్నారు. బాధ్యత గల పౌరుడిగా నేను వారు చెప్పినట్లే చేశాను. పోలీస్ స్టేషన్‌లోనికి వెళ్లాక అధికారులు ఉన్నట్లుండి నా మీద అరవడం ప్రారంభించారు. బైక్‌లో లౌడ్ స్పీకర్లు పెట్టి రోడ్ల మీద తిరుగుతున్నావా అని ప్రశ్నిచారు. దాంతో నేను బైక్‌లో ఆడియో సిస్టం ఇన్‌బిల్ట్‌గా ఉంది. నేనేం మార్పులు చేయలేదు. ఇది బుల్లెట్ కాదు అని వివరించే ప్రయత్నం చేశాను. కానీ ఆ అధికారులు నా మాటలు పట్టించుకోలేదు. ఇది ఇల్లీగల్ బైక్.. దీన్ని నడపాలంటే పర్మిషన్ తీసుకోవాలని చెప్పారు. అప్పుడు నేను హార్లీ ఇండియా వెబ్సైట్లో బైక్‌కు సంబంధించిన వీడియో చూపించే ప్రయత్నం చేశాను. కానీ అది కూడా ఫలించలేదు. నన్ను చలానా కట్టాల్సిందిగా ఆదేశించారు’అన్నాడు. ‘ఇంతలో ఓ ట్రాఫిక్ అధికారి అక్కడకు వచ్చి సర్ ఈ బైక్‌కు అనుమతులున్నాయి. ఇది ఇల్లీగల్ కాదని నచ్చజేప్పే ప్రయత్నం చేశాడు. కానీ ఆ అధికారులు అతడి మాట కూడా వినలేదు. చలానా కట్టాల్సిందే అన్నారు. నేను బండికి సంబంధించిన ప్రతి కాగితాన్ని వారికి చూపించాను. చలానా ఎందుకు కట్టాలని ప్రశ్నించాను. అందుకు వారు బైక్‌లో మ్యూజిక్ ప్లే చేసినందుకు అన్నారు. పోలీసులు నా బండి ఆపినప్పుడు నా బైక్‌లో నుంచి వస్తోన్న మ్యూజిక్ సౌండ్ కేవలం 30 శాతం మాత్రమే. దాంతో నేను బండిలో పెద్దగా మ్యూజిక్ ప్లే చేసి ఎవరికి ఇబ్బంది కలిగించలేదని స్పష్టం చేశాను. అప్పుడు అధికారులు నా బైక్ సౌండ్ పూర్తిగా పెంచి వీడియో తీసి ఇప్పుడు చలానా కట్టు అని ఆదేశించారు. నా బైక్‌కు సంబంధించి అన్ని పన్నులు చెల్లించాను. ట్రాన్స్‌పోర్టు డిపార్ట్మెంట్ వారి నిబంధనల మేరకు అన్ని కాగితాలను చూపించడమే కాక.. అన్ని ట్రాఫిక్ నియమాలను పాటించాను. అయినా పోలీసులు నన్ను చలానా కట్టాలని ఆదేశించారు’ అంటూ వాపోయాడు రాఘవ్. ‘నేను చేసిన దాంట్లో ఏమైనా తప్పుందా.. మీరే చెప్పండి. ఏ నేరం చేయని నన్ను రెండు గంటల పాటు ఎండలో నిల్చోబెట్టి.. అమర్యాదగా ప్రవిర్తంచారు. ఇదెక్కడి న్యాయం. ఇప్పుడిదంతా ఎందుకు చెప్తున్న అంటే.. ఈ రోజు నాకు జరిగింది.. రేపు మీకు జరగవచ్చు. మనం ఒకిరికొకరం మద్దతిచ్చుకుని.. ఈ అన్యాయాన్ని ఎదిరించాల’ని చెప్పుకొచ్చాడు రాఘవ్. ప్రస్తుతం ఈ పోస్ట్ ఫేస్బుక్లో తెగ వైరలవుతోంది. భారీ సంఖ్యలో నెటిజనులు రాఘవ్‌కు మద్దతు తెలుపుతున్నారు. మరి దీనిపై రవాణా శాఖ ఉన్నతాధికారులతో పాటు, పోలీస్ డిపార్ట్మెంట్ అధికారులు ఎలా స్పందిస్తారో చూడాలి. -
అప్పట్లోనే రూ.6.50 లక్షల చలానా
భువనేశ్వర్: గతంలో ట్రాఫిక్ చలానాలు వేలల్లో వస్తేనే వాహనదారులు గుండెలు బాదుకునేవారు. అలాంటిది ఇప్పుడు కొత్త మోటారు వాహన చట్టం-2019 అమల్లోకి వచ్చాక ట్రాఫిక్ చలానాలు ఏకంగా లక్షల్లోకి మారిపోయాయి. ఈ నేపథ్యంలో తాజాగా నాగలాండ్‌లో రిజస్టర్ అయిన ఓ ఒడిశా ట్రక్కుపై ఏకంగా రూ.6.50లక్షల చలానా విధించారు అధికారులు. అయితే కొత్త ట్రాఫిక్ చట్టం అమల్లోకి రాకముందు ఈ భారీ చలానాను విధించడం గమనార్హం. ఒడిశా సంబల్పూర్ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి ట్రక్కుపై ఈ భారీ చలానా విధించారు. గత నెల 10న ఈ సంఘటన చోటు చేసుకుంది. అప్పటికింకా కొత్త మోటారు వాహన చట్టం అమల్లోకి రాలేదు. నూతన చట్టం సెప్టెంబర్ 1నుంచి అమల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. మొత్తం ఏడుసార్లు ట్రాఫిక్ నియమాలను ఉల్లఘించాడంటూ.. ఆ ప్రాంత ఆర్టీవో రూ. 6.53లక్షల చలానా విధించాడు. వీటిలో గత ఐదేళ్ల నుంచి రోడ్డు ట్యాక్స్ కట్టనందుకుగాను.. రూ.6,40,500 చలానా విధించగా.. ఇన్సూరెన్స్, పొల్యూషన్ వంటి ఇతర కాగితాలు లేకపోవడమే కాక, పర్మిట్ షరతులను ఉల్లంఘిచినందుకు గాను మిగతా మొత్తాన్ని విధించారు. (చదవండి: లుంగీవాలాకు కంగారు పుట్టించే వార్త..) చనిపోయిన వ్యక్తి లైసెన్స్ క్యాన్సిల్ ఇదిలా ఉండగా అధికారుల నిర్లక్ష్యానికి అద్దంపట్టే సంఘటన ఒకటి రాజస్తాన్‌లో చోటు చేసుకుంది. జలవార్ జిల్లా ట్రాన్స్‌పోర్టు అధికారులు సీటు బెల్ట్ ధరించకపోవడమే కాక, అతివేగంతో వెళ్తున్నాడనే కారణంతో ఓ వ్యక్తి డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేశారు. ఈ మేరకు సదరు వ్యక్తికి నోటీసులు కూడా జారీ చేశారు. కానీ ఇక్కడ ఆశ్చర్యకరమైన అంశం ఏంటంటే.. ఏ వ్యక్తి పేరు మీదనైతే నోటీసులు జారీ చేశారో.. అతడు ఏడాది క్రితమే మరణించడం గమనార్హం. -
జరిమానాల జమానాకు బ్రేక్
ఈ నెల 1 నుంచి అమల్లోకి వచ్చిన మోటారు వాహనాల (సవరణ) చట్టాన్ని అన్ని రాష్ట్రాలూ అమలు చేయడం ఇంకా ప్రారంభించలేదు. అమలు మొదలెట్టిన కొన్ని రాష్ట్రాలు పక్షం రోజులు గడవ కుండానే పునరాలోచనలో పడ్డాయి. జరిమానాలను గణనీయంగా తగ్గించే యోచన చేస్తున్నాయి. వాహన వినియోగదారులను చైతన్యం చేశాకే కొత్త చట్టం అమలు ప్రారంభిస్తామన్న రాష్ట్రాలు కూడా బహుశా ఇలా తగ్గించాకే అమలు చేయడం మొదలుపెట్టవచ్చు. వాహనాలు వినియోగించేవారిలో అత్యధికులు మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతికి చెందినవారు కనుక కొత్త చట్టం వల్ల వచ్చిపడిన ‘కష్టాల’పై సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం జరిగింది. పాలకులు కూడా బాగానే పట్టిం చుకున్నారు. మొదట్లో భారీ జరిమానాల విషయంలో తగ్గేది లేదని చెప్పిన కేంద్ర ఉపరితల రవాణా మంత్రి నితిన్ గడ్కరీ... వారం రోజులు గడిచాక రాష్ట్రాలు కావాలనుకుంటే జరిమానాలను సవరించు కోవచ్చునని అంటున్నారు. భారీ జరిమానాలు అందరిలోనూ బెంబేలెత్తించిన మాట వాస్తవం. తొలి నాడే ఒక స్కూటరిస్టుకి రూ. 23,000 జరిమానా విధించడం, బండి విలువ కూడా అంత ఉండదని అతను మొత్తుకోవడం, ఒక ట్రక్కు డ్రైవర్‌కు రూ. 1,41,000, ఒక ఆటోవాలాకు రూ. 47,500 జరి మానాలు వడ్డించడం మీడియాలో ప్రముఖంగా వచ్చింది. హర్యానా, ఒడిశాలు అత్యధికంగా జరిమా నాలు వసూలు చేసి రికార్డు సృష్టించాయి. హెల్మెట్ కొనుగోళ్లు పెరిగాయి. భారీ శబ్దం చేసే హారన్లు మార్చుకునేవారి సంఖ్య పెరిగింది. పరిమిత స్థాయిలో కాలుష్యం ఉన్నదనే ధ్రువ పత్రాల కోసం జనం పరుగులంకించుకున్నారు. ఇక భారీ జరిమానాలపై వచ్చిన వ్యంగ్యాస్త్రాలు సరేసరి. ఈ సవరణ చట్టం హఠాత్తుగా వచ్చింది కాదు. దీనికి సంబంధించిన బిల్లు రూపకల్పనకు సుదీర్ఘకాలం పట్టింది. రాష్ట్రాల రవాణా మంత్రులున్న కమిటీ ఈ ప్రక్రియలో పాలుపంచుకుంది. ఆ తర్వాత పార్లమెంటు స్థాయీ సంఘం అధ్యయనం చేసి మార్పులు, చేర్పులు సూచించింది. 2014లో సుప్రీంకోర్టు చొర వతో విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ కె.ఎస్. రాధాకృష్ణన్ ఆధ్వర్యాన ఏర్పడిన ముగ్గురు సభ్యుల కమిటీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉదాసీన వైఖరిని ఎత్తిచూపింది. డ్రైవింగ్ లైసెన్స్‌ల జారీ మొదలు కొని కాలం చెల్లిన వాహనాల నియంత్రణలో విఫలం కావడం వరకూ జరుగుతున్న అనేకానేక లోటు పాట్లను ఎత్తిచూపింది. ఇదంతా అయిన తర్వాతే కేంద్రం సవరణ బిల్లు రూపకల్పనకు పూనుకుంది. ప్రభుత్వాలు తమ వంతుగా చేయాల్సిన పనుల్లో కొన్నయినా ఈపాటికే చేసి ఉంటే బహుశా సవరణ చట్టం అమల్లో ఇప్పుడెదురవుతున్న ప్రశ్నలు ఉండేవి కాదు. భారీ జరిమానా వాతలు పడినవారు రహదార్లు సవ్యంగా ఉంటున్నాయా... సిగ్నలింగ్ వ్యవస్థ ఎక్కడైనా పనిచేస్తోందా... వీఐపీలు నిబంధ నలు పాటిస్తున్నారా అంటూ నిలదీస్తుంటే ప్రభుత్వాల దగ్గర వాటికి జవాబు లేదు. కనుకనే అటు కేంద్రం, ఇటు రాష్ట్రాలు తగ్గాయి. కొత్త చట్టంలో నిర్దేశించిన జరిమానాలు గరిష్ట మొత్తాలని, వాటికి పరిమితులు విధించే అధికారం రాష్ట్రాలకుంటుందని కేంద్ర ఉపరితల రవాణా మంత్రిత్వ శాఖ అధికారి ప్రకటించారు. అయితే సాధారణ ఉల్లంఘనలకు సంబంధించిన నిబం ధనల విషయంలోనే ఈ తగ్గింపు సాధ్యమవుతుంది. మొత్తం 64 నిబంధనలున్న కొత్త చట్టంలో వాటి సంఖ్య 24. అయితే ఈ నిబంధనల ప్రకారం విధించే జరిమానాలు కూడా తక్కువ లేవు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించేవారికి విధించే కనీస జరిమానా ఇంతక్రితం రూ. 100 ఉంటే ఇప్పుడది రూ. 500 అయింది. గరిష్ట మొత్తం రూ. 10,000 జోలికి ప్రభుత్వాలు వెళ్లకపోవచ్చుగానీ రూ. 500 అయితే కట్టి తీరాలి. తాగి వాహనాలు నడపడం, లోపాలున్న వాహనాన్ని వినియోగిం చడం వంటివి తీవ్ర ఉల్లంఘనలకిందికొస్తాయి. అలాగే రహదారి నిర్మాణంలో, దాని నిర్వహణలో కాంట్రాక్టర్లు చేసే లోపాలు కూడా తీవ్ర ఉల్లంఘన పరిధిలోకొస్తాయి. ఈ ఉల్లంఘనల విషయంలో జరిమానాలు తగ్గించడానికి అవకాశం లేదు. మన దేశంలో ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన, పర్యవ సానంగా జరుగుతున్న ప్రమాదాలు తక్కువేమీ కాదు. మృతుల్లో 72 శాతంమంది 18–45 మధ్య వయస్కులే. శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉండే వయస్సులో ఇలా అకాల మరణం చెంద డం వల్ల వారి కుటుంబాలతోపాటు దేశం కూడా ఎంతో నష్టపోతోంది. ప్రకృతి వైపరీత్యాల్లో మరణి స్తున్నవారితో పోల్చినా, ఉగ్రవాద ఘటనల్లో మరణించేవారితో పోల్చినా, ఎయిడ్స్‌వంటి ప్రాణాం తక వ్యాధుల్లో మరణించేవారితో పోల్చినా రోడ్డు ప్రమాదాల్లో మరణించే వారి సంఖ్య ఎక్కువగా ఉంటున్నది. ఏటా మన దేశంలో దరిదాపు లక్షన్నరమంది కేవలం రోడ్డు ప్రమాదాల్లో అకాల మృత్యువాత పడుతున్నారు. 2001–2017 మధ్య దేశంలో 79 లక్షల ప్రమాదాలు జరిగితే దాదాపు 21 లక్షలమంది ప్రాణాలు కోల్పోయారు. 82 లక్షలమంది గాయాలపాలయ్యారు. రోడ్డు ప్రమాదాల వల్ల ఏటా దాదాపు రూ. 3,80,000 కోట్ల మేర నష్టం వాటిల్లుతున్నదని గణాంకాలు చెబుతున్నాయి. వాహనచోదకుల్ని క్రమశిక్షణలో పెట్టాల్సిందే. కానీ భారీగా జరిమానాలు విధించడం ఒక్కటే సర్వరోగ నివారిణిగా భావించకూడదు. రహదారుల నిర్మాణం సరిగా లేనిపక్షంలో కారకులపై చర్యలు తీసుకోవడం, రహదారులు దెబ్బతిన్నప్పుడు తక్షణం మరమ్మతులు చేయించడం, అన్ని చోట్లా సిగ్నల్ వ్యవస్థలు పకడ్బందీగా ఉండేలా చూడటం, డ్రైవింగ్ లైసెన్స్‌ల జారీలో చోటుచేసు కుంటున్న అవకతవకల్ని సవరించడం, అవినీతికి పాల్పడుతున్న సిబ్బందిపై కఠిన చర్యలు వగైరా అంశాలపై కూడా దృష్టి సారించాలి. ఇప్పటికి 13 రోజులైనా దేశంలో ఒక్కచోట కూడా కాంట్రా క్టర్లపైగానీ, ప్రభుత్వాల సిబ్బందిపైగానీ చర్యలు తీసుకున్న వైనం ఎక్కడా లేదు. వాహన చోదకు లకు భారీ జరిమానాలు విధించడంలోనే అత్యుత్సాహం కనబడుతోంది. కొత్త చట్టం విషయంలో బాగా ప్రచారం చేయడంతోపాటు ప్రజా రవాణా వ్యవస్థ పటిష్టానికి చర్యలు తీసుకోవడం అవసర మని రాష్ట్రాలు గుర్తించాలి. -
చలానాల చితకబాదుడు
న్యూఢిల్లీ: రోడ్డు ప్రమాదాలను నియంత్రించేందుకు కేంద్రం తెచ్చిన కొత్త మోటారు వాహనాల చట్టం కింద జరిమానాలు భారీగా వసూలవుతున్నాయి. ఢిల్లీలోని ఓ ట్రక్కు యజమానికి ఏకంగా రూ. 2లక్షల జరిమానా పడిందని ఢిల్లీ రవాణా శాఖ అధికారులు గురువారం వెల్లడించారు. హరియాణ రిజిస్ట్రేషన్ కలిగి ఉన్న ఈ ట్రక్కు డ్రైవరుకు సరైన డ్రైవింగ్ లైసెన్స్ లేకపోవడం, కాలుష్య పత్రాలు, రిజిస్ట్రేషన్ పత్రాలు, ఇన్సూరెన్స్ పత్రాలు లేకపోవడం, అధికలోడు, సీటుబెల్టు ధరించకపోవడం వంటి పలు కారణాలతో రూ. 2లక్షల భారీ జరిమానా విధించారు. ఈ మొత్తాన్ని ఆ లారీ ఓనర్ ఢిల్లీ కోర్టులో గురువారం చెల్లించినట్లు అధికారులు తెలిపారు. ఈ చట్టం అమల్లోకి వచ్చినప్పటి నుంచి వసూలైన అత్యధిక జరిమానా ఇదే కావడం గమనార్హం. దీనికి ముందు ఓ రాజస్తాన్ ట్రక్కుకు రూ. 1.41లక్షల ఫైన్ విధించారు. -
ట్రాఫిక్ చలానాలు; పస్తులతో ఆత్మహత్యలు!
ముంబై : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మోటారు వాహన సవరణ చట్టం-2019పై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధిక జరిమానాలను విధించే ఈ చట్టం సామాన్యుడి నడ్డి విరిచేలా ఉందంటూ దేశ వ్యాప్తంగా నిరసన వ్యక్తమవుతోంది. ఈ క్రమంలో కొత్త ట్రాఫిక్ జరిమానాలు సగానికి తగ్గిస్తూ గుజరాత్ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం సంచలనంగా మారింది. బీజేపీ పాలిత రాష్ట్రంలోనే కొత్త చట్టంపై ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటే తాము మాత్రం ఎందుకు దీనిని అమలు చేయాలని పలువురు నాయకులు ప్రశ్నిస్తున్నారు. సాక్షాత్తూ ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షా సొంత రాష్ట్రమైన గుజరాత్లో జరిమానాలు తగ్గించడంపై రవాణా మంత్రి నితిన్ గడ్కరీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.ఈ నేపథ్యంలో మహారాష్ట్ర రైతు సంఘం ప్యానెల్ చీఫ్ కిశోర్ తివారీ సంచలన వ్యాఖ్యలు చేశారు. కొత్త చట్టం పౌరులను ఆత్మహత్యలకు పురిగొల్పేలా ఉందని వ్యాఖ్యానించారు. ఈ చట్టం కారణంగా దేశ వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందని పేర్కొన్నారు. బుధవారం ఓ కార్యక్రమంలో కిశోర్ తివారీ మాట్లాడుతూ...‘ ప్రధాని, హోం మంత్రి సొంత రాష్ట్రమైన గుజరాత్లో ట్రాఫిక్ చలానాలు తగ్గించారు. దీనిని బట్టి కొత్త చట్టానికి బీజేపీ పాలిత రాష్ట్రాలు కూడా వ్యతిరేకంగా ఉన్నాయని అర్థమవుతోంది. కాబట్టి ప్రధాని నరేంద్ర మోదీకి కూడా ఈ చట్టంపై రెండో అభిప్రాయం ఉందని భావించవచ్చు. 10 వేల నుంచి 20 వేల వరకు జరిమానా విధిస్తున్నారు. అద్దెకు వాహనాలు నడుపుకొని జీవనం సాగించే నెల జీతానికి సమానంగా జరిమానాలు ఉండటం దారుణం. అటువంటి బడుగు జీవులకు ఒక్కసారి జరిమానా పడిందంటే వాళ్ల కుటుంబం మొత్తం పస్తులతో ఆత్మహత్య చేసుకోవాల్సి వస్తుంది’ అని వ్యాఖ్యానించారు. కాగా వసంతరావు నాయక్ శెట్టి స్వాలంబన్ మిషన్ చైర్మన్‌గా ఉన్న కిశోర్ తివారీ ప్రస్తుతం మహారాష్ట్ర ప్రభుత్వంలో క్యాబినెట్ మంత్రి హోదా అనుభవిస్తున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా మహారాష్ట్ర రవాణా శాఖా మంత్రి దివాకర్ రౌత్ కూడా కొత్త మోటారు వాహన సవరణ చట్టాన్ని విమర్శించారు. ఈ మేరకు...‘ కొత్త చట్టం సామాన్యుల పాలిట భారంగా మారుతోంది. కేంద్ర ప్రభుత్వం ఈ చట్టాన్ని మరోసారి సమీక్షించి.. సవరించాల్సిన అవసరం ఉంది అని నితిన్ గడ్కరీకి లేఖ రాశారు. కాగా దివాకర్ శివసేన పార్టీకి చెందిన వారన్న సంగతి తెలిసిందే. పొత్తులో భాగంగా బీజేపీ ప్రభుత్వం ఆయనకు మంత్రి పదవినిచ్చింది. -
‘మా రాష్ట్రంలో ట్రాఫిక్ చలాన్లు పెంచం’
కోల్‌కతా: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మోటారు వాహన సవరణ చట్టం-2019పై దేశవ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. కొత్త చట్టం మూలంగా ట్రాఫిక్ చలాన్లు భారీగా పెరిగి.. సామాన్యులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోన్న సంగతి తెలిసిందే. కొత్త మోటారు వాహన చట్టాన్ని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ చట్టం ఎంతో కఠినంగా ఉందని.. సామాన్యుల తాట తీసేందుకే ఈ చట్టాన్ని తీసుకొచ్చారని ఆమె ఆరోపించారు. అంతేకాక ఈ చట్టాన్ని తమ రాష్ట్రంలో అమలు చేయడం లేదని దీదీ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా దీదీ మీడియాతో మాట్లాడుతూ.. ‘ఈ చట్టాన్ని మేం పార్లమెంటులోనే వ్యతిరేకించాం. ఈ చట్టాన్ని అమలు చేస్తే.. సామాన్యులు తీవ్రంగా ఇబ్బంది పడతారు. ధనార్జనే ప్రభుత్వ లక్ష్యం కాకూడదు. కొన్ని సందర్భాల్లో సమస్యను మానవతా దృక్పథంలో కూడా చూడాలి. ప్రస్తుతం మా రాష్ట్రంలో ‘సేఫ్ డ్రైవ్-సేవ్ లైఫ్’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. గతంతో పోలిస్తే ప్రస్తుతం రాష్ట్రంలో యాక్సిడెంట్ల సంఖ్య తగ్గింద’న్నారు దీదీ. (చదవండి: ఇప్పుడెలా వేస్తారు ట్రాఫిక్ చలానా!?) -
ట్రాఫిక్ చలాన్లను కడితే బికారే!
సాక్షి, న్యూఢిల్లీ : దేశంలో సెప్టెంబర్ ఒకటవ తేదీ నుంచి అమల్లోకి వచ్చిన కొత్త ట్రాఫిక్ నిబంధనలపై సోషల్ మీడియా తనదైన రీతిలో స్పందిస్తోంది. ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలపై భారీగా చలాన్లను పెంచడాన్ని తీవ్రంగా దూషిస్తోంది. చలాన్లను చెల్లించిన తర్వాత రోడ్డుపై అడుక్కుతినాల్సిన పరిస్థితి వచ్చిందంటూ ఒకరు బాలీవుడ్ చిత్రం ‘సంజూ’లో రణీబీర్ కపూర్ రోడ్డుపై అడుక్కుంటున్న దృశ్యాన్ని పోస్ట్ చేశారు. అప్పటి వరకు జల్సాగా రోడ్లపై బలాదూర్ తిరిగిన ఓ యువకుడు ట్రాఫిక్ చలాన్లను చెల్లించాక బస్టాండ్‌లో వచ్చిపోయే బస్సుల వెంట తిరిగుతూ నూనె డబ్బులు అమ్ముతున్న దశ్యం అంటూ మరో బాలీవుడ్ చిత్రంలోనే ఓ ఫొటోను పోస్ట్ చేశారు. ట్రాఫిక్ చలాన్లను చెల్లించేందుకు రుణాల కోసం బ్యాంకుల ముందు బారులు తీరిన ప్రజలంటూ తమదైన శైలిలో ట్వీట్ల మీద ట్వీట్లు చేస్తున్నారు. చదవండి: ట్రాఫిక్ జరిమానాలు సగానికి తగ్గించారు ఆటోమొబైల్ కంపెనీల అమ్మకాలు భారీగా పడిపోవడానికి కారణం యూత్ కొత్త కార్ల కొనుగోలుకు మొగ్గుచూపకుండా ఊబర్, ఓలా క్యాబ్‌ల పట్ల ఆకర్షితులవడమేనంటూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన వ్యాఖ్యలను కూడా వారు వదిలి పెట్టలేదు. ఇంతకుముందు సంగతేమోగానీ సెప్టెంబర్ ఒకటవ తేదీ నుంచి పెంచిన చలాన్లు అమల్లోకి వస్తాయని ప్రకటించిన నాటి నుంచి వాహనాల కొనుగోలు భయంకరంగా పడిపోయిందని పలువురు సెటైర్లు వేశారు. రోడ్లు, ట్రాఫిక్ లైన్లు అన్ని సవ్యంగా ఉన్నప్పుడు ట్రాఫిక్ నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని, అందుకు భారీ వడ్డింపులే మార్గమని ఆలోచిస్తే బాగుండేదని కూడా సోషల్ మీడియా యూజర్లు సూచిస్తున్నారు. రోడ్డుపై ఎన్ని గుంతలు ఉంటే గుంతకు రోజుకు వెయ్యి రూపాయల చొప్పున మున్సిపాలిటీకి, తెల్లటి, నల్లటి ట్రాఫిక్ చారికల్ సవ్యంగా లేకపోతే లైన్‌కు ఐదు వందల రూపాయల చొప్పున ట్రాఫిక్ విభాగానికి ముందుగా చలాన్లు విధించండని, ఆ తర్వాతనే వాహనదారుల జోలికి రావడమే సమంజసమని పలువురు సూచించారు. -
ట్రాఫిక్ జరిమానాలు సగానికి తగ్గించారు
అహ్మదాబాద్ : నూతన మోటారు వాహన సవరణ చట్టంపై దేశ వ్యాప్తంగా ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతున్న వేళ గుజరాత్‌లోని బీజేపీ ప్రభుత్వం అనూహ్య నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త మోటారు వాహన చట్టాన్ని అమలుచేస్తూనే.. అందులోని జరిమానాలను సగానికి సగం తగ్గిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. కొత్త మోటారు వాహన చట్టంలో భారీగా జరిమానాలు విధిస్తుండటంతో వాహనదారులు బండిని బయటకు తీయాలంటేనే బెదిరిపోతున్నారు. భారీగా ట్రాఫిక్ చలాన్లు విధిస్తుండటంపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గుజరాత్ సీఎం విజయ్‌రూపానీ మంగళవారం మీడియాతో మాట్లాడుతూ ట్రాఫిక్ ఉల్లంఘనలపై తాజాగా విధిస్తున్న జరిమానాలను తగ్గిస్తున్నామని ప్రకటించారు. కేంద్రంలోని బీజేపీ సర్కారు తెచ్చిన చట్టాన్ని గుజరాత్‌లోని సొంత పార్టీ సర్కారే యథాతథంగా అమలుచేయకపోవడం గమనార్హం. సాక్షాత్తు గుజరాత్‌లోనే ఈ నిర్ణయం తీసుకోవడంతో పలు రాష్ట్రాలు కూడా ఇదే దారిలో సాగే అవకాశముందని అంటున్నారు. గుజరాత్ ప్రభుత్వం తాజాగా సవరించిన జరిమానాలివి.. హెల్మెట్ లేకుండా వాహనం నడిపితే రూ.1,000 జరిమానా విధిస్తుండగా.. దానిని రూ.500కి తగ్గించింది. డ్రైవింగ్ లైసెన్స్ లేకపోతే రూ. 5వేల జరిమానాను విధిస్తుండగా.. దానిని రూ.3వేలకు తగ్గించింది. సీటు బెల్టు పెట్టుకోకుండా డ్రైవ్ చేస్తూ పట్టుబడితే రూ.1,000గా ఉన్న జరిమానాను రూ.500కి తగ్గించింది. ఆర్సీ, పీయూసీ, ఇన్సూరెన్స్ తదితర పేపర్లు లేకుంటే రూ.1,000గా ఉన్న జరిమానాను రూ.500కి తగ్గించింది. ట్రిపుల్ రైడింగ్ చేస్తే రూ.1,000 జరిమానాను ఏకంగా రూ.100కి తగ్గించింది వాహన కాలుష్యంపై రూ.10వేల జరిమానాను చిన్న వాహనాలకు రూ.1,000, పెద్ద వాహనాలకు రూ. 3వేలు తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ప్రజలు ట్రాఫిక్ చట్టాలను చాలా తేలికగా తీసుకుంటున్నారని, చట్టం పట్ల భయంకానీ, గౌరవంకానీ లేనందుకే కఠినమైన చట్టం తీసుకొచ్చామని మోటారు వాహన చట్టం సవరణ సందర్భంగా కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ వ్యాఖ్యానించడం తెలిసిందే. జరిమానాలు తగ్గించడం ద్వారా గడ్కరీ అభిప్రాయంతో రూపానీ సర్కారు పరోక్షంగా విభేదించినట్టయిందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. చదవండి : లుంగీకి గుడ్‌బై చెప్పకపోతే.. మోత మోగుడే -
కారు ఆపిన ట్రాఫిక్ పోలీస్.. ‘గుండెపోటు’
నోయిడా : నూతన మోటారు వాహన సవరణ చట్టం వచ్చాక వాహనదారుల కష్టాలు పెరిగిపోయాయి. ఈ చట్టం పేరుతో పోలీసులు దురుసుగా ప్రవర్తిస్తున్నారంటూ పలువురు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఓ పోలీసు తనిఖీల పేరుతో ఓవర్ యాక్షన్ చేయడంతో ఓ సాఫ్ట్వేర్ గుండెపోటుతో మృతి చెందిన ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో చోటుచేసుకుంది. ఘజియాబాద్‌కు చెందిన 35 సంవత్సరాల ఓ సాఫ్ట్వేర్ తన తల్లిదండ్రులతో కలసి కారులో వెళ్తుండగా పోలీసులు అతడిని ఆపారు. ఓ పోలీసు లాఠీతో కారును గట్టిగా కొడుతూ కారు పత్రాలు చూపించమని అడగడంతో కోపం వచ్చిన ఆ టెక్కీ.. పోలీసుతో వాగ్వాదానికి దిగాడు. దీంతో రెచ్చిపోయిన ఆ పోలీసు అతన్ని తీవ్రంగా హెచ్చరించడంతో ఉన్నట్టుండి గుండెపోటు వచ్చి అక్కడికక్కడే కుప్పకూలాడు. చదవండి : లుంగీకి గుడ్‌బై చెప్పకపోతే.. మోత మోగుడే ఈ హఠాత్పరిణామం నుంచి కారులో ఉన్న అతని తల్లిదండ్రులు తేరుకునేలోపే అతను చనిపోయాడు. పోలీసు దురుసుగా ప్రవర్తించినందుకే తమ కుమారుడు చనిపోయాడని అతని తండ్రి ఆవేదనవ్యక్తం చేస్తున్నాడు. ‘నా కుమారునికి 5 సంవత్సరాల కూతురు ఉంది. నాకు ఇప్పుడు 65 సంవత్సరాలు. నడిరోడ్డుపైన ఓ పోలీసు చేసిన పనికి నా కొడుకు ప్రాణాలు కోల్పోయాడు. ఇప్పుడు నా మనవరాలి భవిష్యత్ ఏం కావాలి’ అంటూ కన్నీరు పెట్టుకున్నాడు. ఈ ఘటనపై అంతర్గత విచారణ చేస్తున్నామని పోలీస్ డిపార్ట్మెంటు వెల్లడించింది. ‘చనిపోయిన వ్యక్తికి డయాబెటీస్ ఉంది. గుండెపోటుతో మరణించాడని’ జరిగిన దానిని తక్కువ చేసేందుకు ఓ పోలీస్ అధికారి ప్రయత్నించాడు. కాగా దేశవ్యాప్తంగా మోటారు వాహన సవరణ చట్టంపై తీవ్ర విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ చట్టం కారణంగా పోలీసులు దురుసుగా ప్రవర్తిస్తూ తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని వాహనదారులను ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చదవండి : ‘అందుకే కారులో హెల్మెట్ పెట్టుకుంటున్నా’ -
లుంగీవాలాకు కంగారు పుట్టించే వార్త..
లక్నో: హెల్మెట్ పెట్టుకోకపోతే ఫైన్, సీట్ బెల్ట్ ధరించకపోతే ఫైన్.. ముగ్గుర్ని ఎక్కించుకుని తిరిగావంటే.. దెబ్బకు దేవుడు గుర్తొచ్చేంత ఫైన్. ఇప్పుడు వీటి సరసన కొత్తగా చేరిన ఆంక్ష వింటే ఆశ్చర్యపోకుండా ఉండలేరు. ఇప్పటికే జూలైలో పాసయిన నూతన మోటార్ వాహన చట్టం 2019తో వాహనదారులకు కంటి మీద కునుకు లేకుండా పోయింది. ఎప్పుడు ఏ వైపు నుంచి ఫైన్ మోత మోగుతుందో అని భయంతో వణికిపోతున్నారు. పెరిగిన జరిమానాలు ఆ రీతిలో ఉన్నాయి మరి! ఇవేవీ చాలవన్నట్టు కొత్తగా మరో ఆంక్షను అమల్లోకి తీసుకువచ్చింది ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం. లుంగీలు ధరించి వాహనం నడిపితే పైసా వసూలు చేస్తామని ట్రాఫిక్ పోలీసులు హెచ్చరిస్తున్నారు. ట్రక్ డ్రైవర్లు లుంగీ కట్టుకుని వాహనం నడిపిస్తూ కంటపడితే రూ.2000 జరిమానా విధిస్తున్నారు ట్రాఫిక్ పోలీసులు. బనియన్, లుంగీల ధారణకు స్వస్తి పలకాలని పిలుపునిచ్చారు. లుంగీలకు బదులుగా ఫుల్ ప్యాంట్, బనియన్లకు బదులుగా టీషర్ట్స్ ధరించాలని కోరుతున్నారు. ఈ నియమం స్కూలు వాహనాలకు కూడా వర్తిస్తుందని యూపీ ట్రాఫిక్ ఏఎస్పీ పూర్నేందు సింగ్ పత్రికాముఖంగా వెల్లడించారు. ఈ కొత్త ఆంక్షల కోసం తెలిసిన జనాలు ఇదేం విడ్డూరం అని నోరెళ్లబెడుతున్నారు. చదవండి: ఇప్పుడెలా వేస్తారు ట్రాఫిక్ చలానా!? నూతన మోటార్ వాహన చట్టం అమల్లోకి వచ్చిన కొన్ని రోజుల్లోనే చలానాల మోత మోగుతోంది దేశంలో. కొన్ని జరిమానాలు ఏకంగా రూ.80 వేలను దాటడం గమనార్హం. ఇక వాహనాలు నడిపేవారు చెప్పులు వేసుకోకూడదు అనే నియమం ఉన్నప్పటికీ అది ఇంకా పూర్తిగా అమల్లోకి రాలేదు. దీన్ని ఉల్లంఘిస్తే రూ.1000 చెల్లించాలి. ట్రాఫిక్ ఆంక్షలను ఉల్లంఘించినవారికి కళ్లు తేలేసే జరిమానాలు విధిస్తున్నప్పటికీ ఏకకాలంలో సామన్యుల నడ్డి విరుస్తున్నారని ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. ఇక ఈ నిబంధనలతో నిద్రలోనూ ఉలిక్కిపడుతున్నారు లుంగీవాలాలు. చదవండి: కారు ఆపిన ట్రాఫిక్ పోలీస్.. ‘గుండెపోటు’ -
ఇప్పుడెలా వేస్తారు ట్రాఫిక్ చలానా!?
గాంధీనగర్: కేంద్రం ప్రభుత్వం తీసుకొచ్చిన మోటార్ వాహన సవరణ చట్టం-2019 వాహనదారులకు చుక్కలు చూపిస్తోన్న సంగతి తెలిసిందే. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారికి భారీ జరిమానాలు విధిస్తూ.. జేబు గుల్ల చేస్తోంది. వాహనానికి సంబంధించి ఏ చిన్న కాగితం లేకపోయినా భారీ మూల్యం చెల్లించాల్సి వస్తోంది. గతంలో మాదిరి ఇంట్లో మర్చిపోయాను సర్ అంటే కుదరదు. అన్ని కాగితాలను మనతో పాటు తీసుకెళ్లాల్సిందే. ఈ క్రమంలో ఓ వ్యక్తి బండికి సంబంధించిన కాగితాలన్నింటిని హెల్మెట్‌కు అంటించుకుని తిరుగుతున్నాడు. వివరాలు.. గుజరాత్ వడోదరకు చెందిన రామ్ షా అనే వ్యక్తి ఇన్సూరెన్స్ ఏజెంట్‌గా పని చేస్తున్నాడు. విధి నిర్వహణలో భాగంగా రోజంతా ఎక్కడెక్కడో తిరగాల్సి ఉంటుంది. ప్రస్తుతం వచ్చిన నూతన మోటార్ వాహన చట్టం వల్ల ఏ చిన్న కాగితం మిస్ అయినా పెద్ద మొత్తంలో చలాన్ కట్టాల్సి వస్తుంది. ఈ ఇబ్బందుల నుంచి తప్పించుకోవడానికి రామ్ షా ఓ వినూత్న మార్గం కనుగొన్నాడు. ఎక్కడికెళ్లినా హెల్మెట్ తప్పనిసరిగా తీసుకెళ్లాల్సిందే. దాంతో బండికి సంబంధించిన కాగితాలన్నింటిని హెల్మెట్‌కు అంటించాడు. ఇక నేను కాగితాలు చూపించడానికి ఎక్కువ సమయం వేచి ఉండాల్సిన పని లేదు.. ఫైన్ కట్టాల్సిన అవసరం లేదంటున్నాడు రామ్ షా. ఇతని ప్రయత్నాన్ని ట్రాఫిక్ పోలీసులు కూడా అభినందిస్తున్నారు. (చదవండి: విక్రమ్ ల్యాండర్‌కు చలాన్ విధించం) -
‘అందుకే కారులో హెల్మెట్ పెట్టుకుంటున్నా’
లక్నో : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మోటార్ వాహన సవరణ చట్టం-2019 వల్ల ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారు భారీ జరిమానాల బారిన పడుతున్న విషయం తెలిసిందే. అయితే కొన్ని సాంకేతిక తప్పిదాల కారణంగా నిబంధనలు పాటించిన వారికి సైతం ట్రాఫిక్ పోలీసులు చలానా విధించి విమర్శలు ఎదుర్కొంటున్నారు. తాజాగా హెల్మెట్ పెట్టుకోలేదన్న కారణంగా ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్‌కు చెందిన పీయూష్ వర్ష్నే అనే వ్యక్తికి ఈ-చలాన్ ద్వారా రూ. 500 జరిమానా విధించారు. అయితే తాను కారులో ప్రయాణిస్తున్న సమయంలో ఈ విధమైన చలాన్ రావడంతో అతడు కంగుతిన్నాడు. ఇక అప్పటి నుంచి కారులో కూడా హెల్మెట్ ధరించి ప్రయాణిస్తున్నాడు. ఈ విషయం గురించి పీయూష్ మాట్లాడుతూ...‘అసలే పెరిగిన జరిమానాలతో భయంభయంగా గడుపుతున్నాం. మళ్లీ చలాన్ వస్తుందేమోనని భయంగా ఉంది. అందుకే కారులో వెళ్తున్నపుడు కూడా హెల్మెట్ పెట్టుకుంటున్నాను. హెల్మెట్ పెట్టుకోలేదన్న కారణంగా నా కారు నంబరు పేరిట గతంలో చలానా వచ్చింది. అప్పటి నుంచి జాగ్రత్తగా ఉంటున్నా’ అని పేర్కొన్నాడు. కాగా ఈ విషయంపై స్పందించిన ట్రాఫిక్ ఎస్పీ.....‘డేటా తప్పిదాల వల్ల ఇలాంటి సమస్యలు తలెత్తుతున్నాయి. కారు నంబరు ఆధారంగా చలాన్‌ను వెరిఫై చేసి ఒకవేళ నిజంగా హెల్మెట్ లేని కారణంగానే చలాన్ వెళ్లిందని తేలితే దానిని రద్దు చేస్తాం. ఇకపై ఇలాంటి సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తపడతాం’ అని వివరణ ఇచ్చారు. కాగా భారీ జరిమానాల కారణంగా పలువురు వాహనదారులు మోటార్ వాహన సవరణ చట్టాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న విషయం విదితమే. చదవండి: ట్రాఫిక్ జరిమానాల ద్వారా రూ.72 లక్షలు -
ట్రాఫిక్ జరిమానాల ద్వారా రూ.72 లక్షలు
బెంగళూరు : కొత్త మోటారు వాహన సవరణ చట్టంతో వాహనదారులకు చుక్కలు కనిపిస్తున్నాయి. సెప్టెంబర్ 1 నుంచి దేశ వ్యాప్తంగా అమలులోకి వచ్చినప్పటి నుంచి వాహనాలను రోడ్డు మీదకు తీసుకురావాలంటేనే భయపడిపోతున్నారు. అయితే మిగతా దేశంతో పోల్చితే రెండు రోజులు ఆలస్యంగా ఈ చట్టాన్ని అమలులోకి తెచ్చిన కర్ణాటక రాష్ట్రం జరిమానాలలో మాత్రం దూసుకుపోతోంది. ఒక్క బెంగళూరులోనే కేవలం ఒక్క వారానికి రూ.72,49,900 వసూలు చేసి బెంగళూరు ట్రాఫిక్ పోలీసులు ఔరా అనిపించారు. మొత్తం 6,813 ట్రాఫిక్ ఉల్లంఘన కేసులను రిజిస్టర్ చేసి వాహనదారుల వద్ద నుంచి అంత మొత్తాన్ని రాబట్టారు. ట్రాఫిక్ ఉల్లంఘనలలో ఎక్కువగా హెల్మెట్ లేకుండా ఉండటం, సీటుబెల్టు పెట్టుకోకపోవడం, సరైన పత్రాలు లేకపోవడం, ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం, వన్‌వే రూట్లో రావడం తదితరాల నుంచి జరిమానాలు ఎక్కువగా వసూలు అయ్యాయి. ట్రాఫిక్ ఉల్లంఘించిన వారి నుంచి ట్రాఫిక్ పోలీసులు కఠినంగా జరిమానా విధించడం పట్ల పాదచారులు, ప్రజా రవాణా వినియోగదారులు సంతోషంగా ఉన్నారు. ఈ భారీ జరిమానాలు మార్పును తెస్తాయని బస్సులో ప్రయాణించే ఓ ప్రయాణికుడు హర్షం వ్యక్తం చేయగా.. ఈ జరిమానాలు ఎక్కువగా సామాన్యులను ప్రభావితం చేస్తున్నాయని మరో వ్యక్తి వాపోయాడు. ‘ప్రభుత్వం లైసెన్సులను సక్రమంగా జారీ చేయదు, అలాగే ట్రాఫిక్ పోలీసులు మేం చెప్పేది వినడానికి ఇష్టపడరు’ అని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇది చదవండి : ట్రక్ డ్రైవర్‌కు భారీ జరిమానా.. తొలి వ్యక్తిగా రికార్డ్ -
విక్రమ్ ల్యాండర్‌కు చలాన్ విధించం
చంద్రయాన్-2 ప్రయోగంలో భాగంగా జాబిల్లికి చేరువగా వెళ్లిన విక్రమ్ ల్యాండర్ జాడ లేకుండా పోవడం భారతీయులను తీవ్ర నిరాశకు గురిచేసిన సంగతి తెలిసిందే. తాజాగా విక్రమ్ ల్యాండర్ చంద్రునిపై హార్డ్ ల్యాండింగ్ అయినప్పటికీ సురక్షితంగా ఉందని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) ప్రకటించడంతో చంద్రయాన్-2 మిషన్‌పై భారతీయుల ఆశలు సజీవంగా నిలిచాయి. విక్రమ్ ల్యాండర్‌ను గుర్తించినట్టు ఇస్రో ప్రకటించడంతో.. ట్విటర్లో #ISROSpotsVikram హ్యాష్ ట్యాగ్ విపరీతంగా ట్రెండ్ అయింది. మరోవైపు ప్రస్తుతం దేశంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మోటార్ వాహన సవరణ చట్టం-2019 అనుసరించి ట్రాఫిక్ నిబంధనలు పాటించని వాహనదారులకు అధికారులు భారీగా జరిమానాలు విధిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో విక్రమ్ ల్యాండర్‌కు, ట్రాఫిక్ చలాన్లకు జత చేసి నాగ్‌పూర్ సిటీ పోలీసులు చేసిన ట్వీట్ పలువురు నెటిజన్లను ఆకట్టుకుంటుంది. ‘ప్రియమైన విక్రమ్.. దయచేసి స్పందించు. నువ్వు సిగ్నల్ బ్రేక్ చేసినందుకు మేము చలాన్ విధించం’ అంటూ ట్వీట్ చేశారు. నాగ్‌పూర్ సిటీ పోలీసుల ట్వీట్‌కు విపరీతమైన పైగా లైకులు వచ్చాయి. కొద్దిసేపటికే ఈ ట్వీట్ వైరల్‌గా మారడంతో పలువురు నెటిజన్లు కూడా దీనిపై ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు. కొందరు నెటిజన్ల కామెంట్లు.. ఒకవేళ విక్రమ్ స్పందిస్తే.. అది సిగ్నల్ బ్రేక్ చేసినందుకు ఆ చలాన్ నాకు పంపించండి. ఆ జరిమానాను నేను కడతాను. ఈ కేసు బెంగళూరు పోలీసుల పరిధిలోకి వస్తుంది. నాకు తెలుసు నాగ్‌పూర్ పోలీసులు చంద్రునిపై కూడా ఉన్నారు. కానీ ఓవర్ స్పీడింగ్ పరిస్థితి? Dear Vikram, Please respond 🙏🏻. We are not going to challan you for breaking the signals!#VikramLanderFound#ISROSpotsVikram @isro#NagpurPolice — Nagpur City Police (@NagpurPolice) September 9, 2019 -
నా కారుకే జరిమానా విధించారు : గడ్కరీ
ముంబై : దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మోటార్ వాహన సవరణ చట్టం-2019 పై విస్తృత చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. పలువురు వాహనదారులు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ చట్టాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇప్పటికే ఈ చట్టాన్ని అనుసరించి ట్రాఫిక్ నిబంధనలు ఉల్లఘించిన పలువురు వాహనదారులకు అధికారులు భారీ జరిమానాలు విధించారు. దీనిపై స్పందించిన కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ .. ఈ చట్టం ద్వారా ట్రాఫిక్ నిబంధనలు పాటించని వారిలో మార్పు వస్తుందనే ఆశాభావం వ్యక్తం చేశారు. అంతేకాకుండా ఈ చట్ట ప్రకారం విధించే జరిమానాలను ఆయన సమర్థించారు. ప్రధాని నరేంద్ర మోదీ 100 రోజుల పాలనపై గడ్కరీ ముంబైలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా మోటార్ వాహన సవరణ చట్టంపై ఆయన స్పందిస్తూ.. అధిక వేగం కారణంగా ముంబైలో తన వాహనం కూడా జరిమానాకు గురైందని చెప్పారు. తాను ఆ జరిమానాను చెల్లించినట్టు వెల్లడించారు. దేశంలో రోడ్డు భద్రతను మెరుగుపర్చాల్సిన అవసరం ఉందన్నారు. దేశంలోని జాతీయ రహదారులపై 786 బ్లాక్ స్పాట్స్ ఉన్నాయని చెప్పారు. అలాగే డ్రైవింగ్ లైసెన్స్‌లలో 30 శాతం నకిలీవేనని తెలిపారు. ట్రాఫిక్ అధికారులు ఎవరిపై వివక్ష చూపరని తెలిపిన ఆయన.. నిబంధనలు ఉల్లఘించిన వారు ఎవరైనా సరే తప్పకుండా జరిమానా కట్టాల్సిందేనని అన్నారు. గతంలో కొందరు ముఖ్యమంత్రుల వాహనాలకు అధికారులు జరిమానాలు విధించినట్టు గుర్తుచేశారు. వాహనదారులు డ్రైవింగ్ లైసెన్స్‌తో పాటు ఇతర పత్రాలను తమ వెంట ఉంచుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ భారీ జరిమానాల కారణంగా అవినీతి పెరుగుతుందనే ఆరోపణలను గడ్కరీ ఖండించారు. తాము అన్ని చోట్ల కెమెరాలు పెట్టామని.. అలాంటప్పుడు అవినీతికి అస్కారం ఎక్కడుందని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మోటారు వాహన సవరణ చట్టం కారణంగా ట్రాఫిక్ నిబంధనలు ఉల్లఘించినవారికి విధించే జరిమానాలు గతంతో పోల్చితే భారీగా పెరిగిన సంగతి తెలిసిందే. -
ట్రక్ డ్రైవర్‌కు భారీ జరిమానా.. తొలి వ్యక్తిగా రికార్డ్
భువనేశ్వర్: మోటారు వాహన సవరణ చట్టం–2019 దేశ వ్యాప్తంగా వాహన దారులను బెంబేలెత్తిస్తోంది. ఏ ఒక్కటీ సరిగా లేకున్నా ట్రాఫిక్ పోలీసులు జరిమానాలతో చుక్కలుచూపిస్తున్నారు. దేశ వ్యాప్తంగా ఏ వాహనదారుడిని కదిలించినా దీనిపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వేలకొద్ది జరిమానాలు విధిస్తూ పోలీసులు కొరడా జులిపిస్తున్నారు. తాజాగా ఒడిశాలో ఓ ట్రక్ డ్రైవర్‌కు (అశోక్ జాదవ్) ట్రాఫిక్ పోలీసులు భారీ జరిమానా విధించారు. వాహన పత్రాలు సక్రమంగా లేవని, వివిధ సందర్భాల్లో ట్రాఫిక్ రూల్స్‌ను అతిక్రమించారని అనేక కారణాలతో ఏకంగా రూ. 86, 500 ఫైన్ వేశారు. కొత్త మోటరు వాహన సవరణ చట్టం అమల్లోకి వచ్చిన తరువాత అత్యధిక మొత్తం జరిమానా చెల్లించిన వ్యక్తిగా జాదవ్ నిలిచారు. ఈ ఘటన ఆదివారం ఒడిశాలోని సంబల్పూర్ జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు విధించిన జరిమానా చూసి అతను షాక్‌కి గురయ్యాడు. సాధారణ ట్రక్ డ్రైవర్‌గా బతుకునీడుస్తున్న తాను ఇంత మొత్తం చెల్లించలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. దీనిపై స్థానిక ట్రాఫిక్ అధికారి మాట్లాడుతూ.. నిబంధనలకు అనుగుణంగానే అతనికి జరిమానా విధించామని తెలిపారు. ప్రమాదాల నివారణలో భాగంగా చలానాలు విధించడాన్ని తప్పుబట్టడం లేదని, కానీ, సామాన్యుడి నడ్డి విరిచేలా ఉన్న చలాన్లపై పునరాలోచించుకోవాలని వాహనదారులు కోరుతున్నారు. పోలీసులు చెబుతున్న ట్రాఫిక్ జరిమానాలు చాలా మంది నెల వేతనం కంటే అధికంగా ఉండటంతో వాహనదారులు ఆందోళన చెందుతున్నారు. ఇక నిజంగానే ఫైన్ కట్టాల్సి వస్తే తమ గతేం కాను అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
మన చలానాలూ.. సదుపాయాలూ తక్కువే
భువనేశ్వర్‌లో ఓ ఆటో డ్రైవర్‌కి ట్రాఫిక్ పోలీసులు రూ.45వేలు జరిమానా విధించారు. రోజుకు రూ.500 కిరాయి చెల్లించి నడుపుకుంటున్న ఆటోకి, అంత చలానా ఎక్కడి నుంచి తేవాలంటూ బోరుమన్నాడు. ఢిల్లీలో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించాడని ఓ వాహనదారుడికి రూ.25 వేల జరిమానా పడింది. రూ.13 వేలు పెట్టి సెకండ్ హ్యాండ్లో కొన్న బైకుకు అంత జరిమానా చెల్లించలేనంటూ పోలీసుల వద్దే దాన్ని వదిలిపోయాడు. – సాక్షి, హైదరాబాద్ మోటారు వాహన సవరణ చట్టం– 2019 ప్రస్తుతం తెలంగాణలో అమలు కాకున్నా.. వాహన దారులను మాత్రం బెం బేలెత్తిస్తోంది. అమలులో జాప్యం ఉండ వచ్చు గానీ, అమలు మాత్రం ఖాయమన్న సంగతిని వాహనదారులకు పోలీసులు ప్రచారం ద్వారా తెలియజేస్తూనే ఉన్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని కమిషనరేట్లు, జిల్లాల పరిధిలో ఇప్పటికే భారీ జరిమా నాలపై అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. కానీ, పోలీసులు చెబుతున్న ట్రాఫిక్ జరిమానాలు చాలా మంది నెల వేతనం కంటే అధికంగా ఉండటంతో వాహనదారులు ఆందోళన చెందుతున్నారు. ఇక నిజంగానే ఫైన్ కట్టాల్సి వస్తే తమ గతేం కాను అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా డ్రైవింగ్ వృత్తిగా జీవించే ఆటో, క్యాబ్, బస్సు, లారీ డ్రైవర్లు తీవ్ర మథన పడిపోతున్నారు. వీరిలో చాలా మంది బండ్లను ఫైనాన్స్‌లో తీసుకుని నెల వాయిదాలు కట్టుకుంటున్నారు. కొత్త జరిమానాలు అమలులోకి వస్తే.. తమ ఆదాయం, ఫైనాన్స్ వాయిదాలకంటే అవే అధికంగా ఉంటే తమ బతుకులు రోడ్డు పాలు అవుతాయని తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం చాలామంది డ్రైవర్ల కనీస వేతనం రూ.8,000 నుంచి రూ.15 వేల వరకు ఉంది. ఇక నెలలో రెండు ఫైన్లు పడితే రూ.10 వేలు జేబుకు చిల్లు పడుతుం దని వారు ఆందోళన చెందుతున్నారు. ఇలా అయితే ఓనర్లు తమను ఉద్యోగాల నుంచి తొలగిస్తారని వారు అంటున్నారు. ఫైనాన్స్‌లో కొని సొంతంగా నడుపుకునే ఆటో, క్యాబ్‌లలో నెల కిస్తీ రూ.8000 నుంచి రూ.13,500 నుంచి మొదలవుతాయి. రోడ్డు, పార్కింగ్ సదుపాయాలు మెరుగు పరచకుండా ఇష్టానుసారంగా ఫైన్లు విధించడం సబబు కాదంటున్నారు. పోలీసులపై మండిపడుతున్న నెటిజన్లు.. ప్రమాదాల నివారణలో భాగంగా చలానాలు విధించడాన్ని తప్పుబట్టడం లేదు. కానీ, సామాన్యుడి నడ్డి విరిచేలా ఉన్న చలాన్లపై పునరాలోచించుకోవాలని నెటిజన్లు కోరుతున్నారు. అదే సమయంలో చలానాలు విదేశాలతో పోలిస్తే.. మన వద్దే తక్కువ అయితే సంతోషమే. కానీ, ఆయా దేశాల్లో ఉన్నంత అక్షరాస్యత, విశాలమైన, నాణ్యమైన రోడ్లు, మెరుగైన వైద్య సదుపాయాలు, ప్రమాద స్థలానికి నిమిషాల్లో చేరుకోగలిగే హెలికాప్టర్ అంబులెన్సులు, గోల్డెన్ అవర్ ట్రీట్మెంట్లు, ఉచిత వైద్యం తదితర సదు పాయాలు ఇక్కడా ఉండాలి కదా మరి? అని వారు ప్రశ్నిస్తున్నారు. -
ఇప్పటిదాకా ఒక లెక్క.. ఇపుడొక లెక్క!
సాక్షి, హైదరాబాద్: హెల్మెట్ లేకపోయినా ఏం పరవాలేదు అని డ్రైవింగ్ చేస్తున్నారా.. మద్యం తాగి వాహనం నడుపుతున్నారా.. ఆ.. ఏముంది వందో రెండు వందలో జరిమానా కడితే సరిపోతుంది అని ఆలోచిస్తున్నారా?.. ఇకపై మీ పప్పులుడకవు. ఎందుకంటే వేలకు వేలు జరిమానా కట్టాల్సిందే. అంతేగాకుండా కొన్ని నిబంధనలు పాటించకుంటే ఏకంగా డ్రైవింగ్ లైసెన్స్ కూడా రద్దు చేస్తారు. ఇంకా ఉంది.. ఓవర్ లోడింగ్ ప్రయాణికులను ఎక్కించుకుంటే ఒక్కో ప్రయాణికునికి రూ.1000 చొప్పున ముక్కుపిండి మరీ వసూలు చేస్తారు. ఈ మేరకు వచ్చే ఆదివారం (సెప్టెంబర్ 1) నుంచి ‘మోటారు వాహనాల సవరణ చట్టం–2019’ అమల్లోకి రానుంది. దీనికి సంబంధించి కేంద్ర రవాణాశాఖ బుధవారం రాత్రి నోటిఫికేషన్ జారీ చేసింది. ఇకపై నిబంధనలు పాటించకుంటే జరిమానాలు 100 నుంచి 500 శాతం పెరగనున్నాయి. ప్రధానంగా 25 ఉల్లంఘనలకు సంబంధించిన జరిమానాలు భారీగా పెరుగుతున్నాయి. ఈ చట్ట సవరణలో ఉన్న మరో కీలకాంశం ఏమిటంటే.. ఇకపై ట్రాఫిక్ జరిమానాల మొత్తం ఏటా 10 శాతం చొప్పున పెరుగుతూ ఉంటుంది. గురువారం నోటిఫికేషన్ అందుకున్న రాష్ట్ర రవాణాశాఖ, వాటిని రాష్ట్రంలో అమలు చేసేందుకు కసరత్తు ప్రారంభించింది. శనివారం గాని, వినాయకచవితి సెలవు ముగిసిన త ర్వాత మంగళవారం గాని ఉత్తర్వు జారీ కానుందని రవాణాశాఖ అధికారి ఒకరు వెల్లడించారు. గోల్డెన్ అవర్ నిధి.. ప్రమాదాలు చోటుచేసుకున్నప్పుడు ‘గోల్డెన్ అవర్’ గా పరిగణించే మొదటి గంట అత్యంత కీలకం. ఈ సమయంలో వైద్యం అందితే మరణాల సంఖ్య గణనీయంగా తగ్గుతుంది. అందుకే ‘గోల్డెన్ అవర్’లో క్షతగాత్రులకు ఉచిత చికిత్స అందించేలా నిబంధన తీసుకొచ్చారు. దీని కోసం కేంద్రం ప్రత్యేకంగా ‘మోటారు వెహికిల్ యాక్సిడెంట్ ఫండ్’ ఏర్పాటు చేయనుంది. దీని ద్వారానే ఆయా ఆస్పత్రులకు చికిత్సకైన ఖర్చులు చెల్లిస్తారు. దేశంలో ఉన్న ప్రతి రోడ్ యూజర్‌కు నిబంధనలకు లోబడి ఈ ఫండ్ ద్వారా బీమా ఉంటుంది. కొత్త నిబంధనల ప్రకారం వాహనాల రిజిస్ట్రేషన్‌తోపాటు డ్రైవింగ్ లైసెన్స్ పొందడానికి ఆధార్ తప్పనిసరి. అలాగే ప్రమాదాలకు సంబంధించి వివిధ సందర్భాల్లో ప్రభుత్వాలు ఇస్తున్న పరిహారం భారీగా పెరగనుంది. గుర్తుతెలియని వాహనాలు ఢీకొని ఎవరైనా చనిపోతే ప్రభుత్వం ప్రస్తుతమిస్తున్న రూ.25 వేల పరిహారం రూ.2 లక్షలకు, క్షతగాత్రులకు ఇస్తున్న రూ.12,500 నుంచి రూ.50 వేలకు పెంచారు. రోడ్డు ప్రమాదాల్లో క్షతగాత్రులకు సహకరించే వ్యక్తులు తమ వివరాలను అటు పోలీసులు, ఇటు వైద్యాధికారులకు చెప్పాల్సిన అవసరం లేకుండా నిబంధన పొందుపరిచారు. తల్లిదండ్రులూ బాధ్యులే.. ప్రమాణాలకు అనుగుణంగా లేని వాహనాలను రీకాల్ చేసే అధికారం ప్రభుత్వాలకు ఉంటుంది. అలాంటి వాహనాలకు ఉత్పత్తి చేసిన కంపెనీలకు గరిష్టంగా రూ.500 కోట్ల వరకు జరిమానా విధించే ఆస్కారం లభిస్తుంది. మైనర్లు వాహనం నడుపుతూ చిక్కితే ఆ చర్య తమకు తెలియకుండానో, తాను వారిస్తున్నా జరిగిందని తల్లిదండ్రులు/సంరక్షకుడు నిరూపించుకోవాలి. లేదంటే వారికీ జైలు శిక్ష, జరిమానా తప్పవు. మైనర్లు వాహనాలు నడుపుతూ లేదా ఉల్లంఘనలకు పాల్పడుతూ చిక్కితే వారి తల్లిదండ్రులకు రూ.25 వేల జరిమానా, మూడేళ్ల జైలు శిక్ష తప్పదు. ఆ మైనర్పైనా చట్ట ప్రకారం చర్యలు ఉంటాయి. వాహనం రిజిస్ట్రేషన్ శాశ్వతంగా రద్దు అవుతుంది. లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలుగా పరిగణించే ట్రాఫిక్ అధికారులు, పోలీసులు ఉల్లంఘనలకు పాల్పడితే సాధారణ వ్యక్తులకు విధించే జరిమానాకు రెట్టింపు విధిస్తారు. పెండింగ్ చలాన్లు.. చకచకా.. మరో 3 రోజుల్లో కొత్తగా పెంచిన జరిమానాలు అమల్లోకి రానుండటంతో పెండింగ్ ఈ–చలాన్లను వాహన చోదకులు భారీగా క్లియర్ చేస్తున్నారు. సాధారణ రోజుల్లో ఈ–చలాన్ చెల్లింపులు రోజుకు రూ.50 లక్షల వరకు ఉంటాయి. అయితే గడిచిన 4 రోజుల చెల్లింపులు పరిశీలిస్తే రూ.65 లక్షలు, రూ.68 లక్షలు, రూ.2.08 కోట్లు, రూ.2.38 కోట్లుగా ఉండి రికార్డు సృష్టిస్తున్నాయి.