న్యూఢిల్లీ: రోడ్డు ప్రమాదాలను నియంత్రించేందుకు కేంద్రం తెచ్చిన కొత్త మోటారు వాహనాల చట్టం కింద జరిమానాలు భారీగా వసూలవుతున్నాయి. ఢిల్లీలోని ఓ ట్రక్కు యజమానికి ఏకంగా రూ. 2లక్షల జరిమానా పడిందని ఢిల్లీ రవాణా శాఖ అధికారులు గురువారం వెల్లడించారు. హరియాణ రిజిస్ట్రేషన్ కలిగి ఉన్న ఈ ట్రక్కు డ్రైవరుకు సరైన డ్రైవింగ్ లైసెన్స్ లేకపోవడం, కాలుష్య పత్రాలు, రిజిస్ట్రేషన్ పత్రాలు, ఇన్సూరెన్స్ పత్రాలు లేకపోవడం, అధికలోడు, సీటుబెల్టు ధరించకపోవడం వంటి పలు కారణాలతో రూ. 2లక్షల భారీ జరిమానా విధించారు. ఈ మొత్తాన్ని ఆ లారీ ఓనర్ ఢిల్లీ కోర్టులో గురువారం చెల్లించినట్లు అధికారులు తెలిపారు. ఈ చట్టం అమల్లోకి వచ్చినప్పటి నుంచి వసూలైన అత్యధిక జరిమానా ఇదే కావడం గమనార్హం. దీనికి ముందు ఓ రాజస్తాన్ ట్రక్కుకు రూ. 1.41లక్షల ఫైన్ విధించారు.
చలానాల చితకబాదుడు
Published Fri, Sep 13 2019 3:11 AM | Last Updated on Fri, Sep 13 2019 3:11 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment