Heavy fine
-
ఇనుప ఖనిజం అక్రమ ఎగుమతి కేసులో కాంగ్రెస్ ఎమ్మెల్యేకు ఏడేళ్ల జైలు
బెంగళూరు: బెళెకెరి నౌకాశ్రయంలోని ఇనుప ఖనిజం దొంగతనం, అక్రమ ఎగుమతి కేసులో కాంగ్రెస్ ఎమ్మెల్యే సతీశ్ కృష్ణ సాయిల్‌కు ప్రత్యేక కోర్టు ఏడేళ్ల జైలు శిక్షతోపాటు రూ.6 కోట్ల భారీ జరిమానా విధించింది. ప్రజాప్రతినిధులపై కేసులను విచారించే ప్రత్యేక న్యాయస్థానం సాయిల్‌తోపాటు ఆరుగురికి జైలు శిక్ష, భారీగా జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించింది. శ్రీ మల్లికార్జున షిప్పింగ్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండీగా ఉన్న సాయిల్(58) తాజా పరిణామంతో ఎమ్మెల్యే పదవికి అనర్హుడయ్యే అవకాశముంది. బళ్లారి గనిలో అక్రమంగా వెలికి తీసిన ఇనుప ఖనిజాన్ని 2010లో బెళెకెరి పోర్టులో అధికారులు నిల్వ ఉంచారు. దీనిపై కన్నేసిన సాయిల్, మరికొందరు కోట్లాది రూపాయల ఖనిజాన్ని దొంగచాటుగా చైనాకు ఎగుమతి చేశారు. తాజాగా దోషులుగా తేలిన వారిలో ప్రైవేట్ కంపెనీల నిర్వాహకులతోపాటు పోర్టుల డిప్యూటీ కన్జర్వేటర్ మహేశ్ జె బిలియె కూడా ఉన్నారు. ఈ నెల 24వ తేదీన తీర్పు వెలువడిన వెంటనే ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐ అధికారులు సాయిల్, మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. -
చలానాల చితకబాదుడు
న్యూఢిల్లీ: రోడ్డు ప్రమాదాలను నియంత్రించేందుకు కేంద్రం తెచ్చిన కొత్త మోటారు వాహనాల చట్టం కింద జరిమానాలు భారీగా వసూలవుతున్నాయి. ఢిల్లీలోని ఓ ట్రక్కు యజమానికి ఏకంగా రూ. 2లక్షల జరిమానా పడిందని ఢిల్లీ రవాణా శాఖ అధికారులు గురువారం వెల్లడించారు. హరియాణ రిజిస్ట్రేషన్ కలిగి ఉన్న ఈ ట్రక్కు డ్రైవరుకు సరైన డ్రైవింగ్ లైసెన్స్ లేకపోవడం, కాలుష్య పత్రాలు, రిజిస్ట్రేషన్ పత్రాలు, ఇన్సూరెన్స్ పత్రాలు లేకపోవడం, అధికలోడు, సీటుబెల్టు ధరించకపోవడం వంటి పలు కారణాలతో రూ. 2లక్షల భారీ జరిమానా విధించారు. ఈ మొత్తాన్ని ఆ లారీ ఓనర్ ఢిల్లీ కోర్టులో గురువారం చెల్లించినట్లు అధికారులు తెలిపారు. ఈ చట్టం అమల్లోకి వచ్చినప్పటి నుంచి వసూలైన అత్యధిక జరిమానా ఇదే కావడం గమనార్హం. దీనికి ముందు ఓ రాజస్తాన్ ట్రక్కుకు రూ. 1.41లక్షల ఫైన్ విధించారు. -
ఫేస్‌బుక్‌కు రూ.34 వేల కోట్ల జరిమానా!
వాషింగ్టన్: వినియోగదారుల వ్యక్తిగత సమాచారాన్ని లీక్ చేసిందనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఫేస్‌బుక్‌కు అమెరికా నియంత్రణ సంస్థలు భారీ జరిమానా విధించనున్నాయి. సోషల్ నెట్‌వర్క్‌ల గోప్యత, సమాచార రక్షణలో లోపాలు వంటి కారణాలకు గానూ ఫేస్‌బుక్‌పై జరిమానా విధించేందుకు ఫెడరల్ ట్రేడ్ కమిషన్ (ఎఫ్‌టీసీ) సిద్ధమవుతోంది. దర్యాప్తు సెటిల్మెంట్లో భాగంగా ఎఫ్‌టీసీ ఫేస్‌బుక్‌పై రూ.34,280 కోట్ల (5 బిలియన్ డాలర్లు) జరిమానా విధించనుంది. దీనికి సంబంధించిన వివరాలను వాల్‌స్ట్రీట్ జర్నల్ ఓ కథనంలో ప్రచురించింది. వ్యక్తిగత భద్రతా వైఫల్యాలకు ఓ సంస్థపై ఎఫ్‌టీసీ ఇంత భారీజరిమానా విధించడం ఇదే తొలిసారి. దీనికి అమెరికా న్యాయశాఖ ఇంకా ఆమోదించలేదు. సెటిల్మెంట్లో భాగంగా వినియోగదారుల వ్యక్తిగత భద్రతకు సంబంధించి ఫేస్‌బుక్‌కు కొన్ని కఠిన ఆంక్షలు విధించనున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది. వినియోగదారుల వ్యక్తిగత గోప్యతకు భంగం వాటిల్లకుండా ఉండేందుకు 2011లో ఎఫ్‌టీసీ ఫేస్‌బుక్‌తో ప్రైవసీ సెటిల్మెంట్ చేసుకుంది. దీని ప్రకారం వినియోగదారుల సమాచారాన్ని తమ వ్యాపార భాగస్వామ్య సంస్థలకు అందించేటప్పుడు కొన్ని నియమాలు పాటించాలి. అలా చేయని పక్షంలో జరిమానా విధించే హక్కు ఉంటుంది. -
రాంగ్ పార్కింగ్‌కు రూ. 23 వేల జరిమానా
ముంబై: రాంగ్ పార్కింగ్ చేస్తే భారీ జరిమానా విధించేలా బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ), ముంబై ట్రాఫిక్ పోలీసులు కలిసి కొత్త నిబంధనలు తీసుకొచ్చారు. నో పార్కింగ్ జోన్లలో వాహనాలను పార్క్ చేస్తే రూ. 5 వేల నుంచి 23 వేల వరకూ జరిమానా విధించనున్నారు. నిబంధనలు అతిక్రమిస్తే ద్విచక్ర వాహనాలకు రూ. 5 వేల నుంచి రూ. 8,300 వరకు, నాలుగు చక్రాల వాహనాలకు రూ. 10 వేల నుంచి రూ. 23,500 వరకు జరిమానా విధిస్తారు. అలాగే మధ్య స్థాయి వాహనదారులకు రూ. 11 వేల నుంచి 17,600 వరకు, లైట్ మోటార్ వాహనాలకు రూ. 10 వేల నుంచి రూ. 15,100 వరకు, మూడు చక్రాల వాహనాలకు రూ. 8 వేల నుంచి రూ. 12,200 వరకు పెనాల్టీ పడనుంది. వాహనదారులు ఎక్కడపడితే అక్కడ వాహనాలను పార్క్ చేస్తున్నారని, దాని వల్లే ట్రాఫిక్ జామ్ అవుతోందని బీఎంసీ అధికారులు తెలిపారు. తాజా నిబంధనలతో ట్రాఫిక్ జామ్ తగ్గుతుందన్నారు. జరిమానా వెంటనే చెల్లించకపోతే, రోజురోజుకూ అది పెరుగుతుందన్నారు. ట్రాఫిక్ పోలీసులకు తోడుగా విశ్రాంత సిబ్బందిని, ప్రైవేటు సిబ్బందిని కూడా తీసుకున్నట్లు బీఎంసీ అధికారులు తెలిపారు. పార్కింగ్ వసతి ఉన్న ప్రాంతాల్లో మొదట ఈ నిబంధనలు అమలవుతాయని తెలిపారు. ముంబైలో 30 లక్షల వాహనాలున్నట్లు ఓ అంచనా. -
సిగరెట్ పడేస్తే.. లక్షా పాతికవేలు ఫైన్..!
కెంట్ : పొగతాగడం ఆరోగ్యానికి హానికరం.. ఇది మనం ఇప్పటివరకు వింటున్న హెచ్చరిక. ఇక తాజా హెచ్చరిక ఏంటంటే.. పొగతాగి సిగరెట్ ముక్క నిర్లక్ష్యంగా ఎక్కడపడితే అక్కడ పడేస్తే మాత్రం భారీ జరిమానా తప్పదు. కాకాపోతే ఇంతటి కఠిన నిబంధనలు మన దగ్గర కాదు. యునైటెడ్ కింగ్డమ్లో. బహిరంగ దూమపానం చేస్తున్నవారిపై, నిర్లక్ష్యంగా పడేస్తున్నవారిపై అక్కడి ప్రభుత్వాలు కొరడా ఝళిపిస్తున్నాయి. తాజాగా ఓ రైల్వే స్టేషన్లో సిగరెట్ తాగిన ఓ వ్యక్తికి ఏకంగా రూ. 1.25 లక్షలు జరిమానా విధించారు. ఈ సంఘటన కెంట్లోని యాష్ఫోర్డ్ అంతర్జాతీయ రైల్వే స్టేషన్లో ఇటీవల చోటుచేసుకుంది. రైల్వే స్టేషన్ ఆవరణలో సిగరెట్ తాగి కాలికింద నలిపేసిన జాన్ విల్సన్ (56)ను సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా గుర్తించారు. ఏడు వేల రూపాయలు జరిమానా చెల్లించాల్సిందిగా కౌన్సిల్ ఎన్ఫోర్స్ ఆఫీసర్ ఆదేశాలు జారీ చేశారు. కానీ, విల్సన్ చెల్లించలేదు. దాంతో మొదట విధించిన మొత్తంతోపాటు అదనంగా మరో 25 వేలు చెల్లించాలని కోర్టు ఉత్తర్వులిచ్చింది. అయినప్పటికీ అతను జరిమానా కట్టలేదు. కాంటెర్బరీ కోర్టులో ఈ జరిమానా చలాన్లను సవాల్ చేశాడు. అయితే, వాదనలు విన్న కోర్టు.. కింది కోర్టు ఉత్తర్వులను ధిక్కరించావని ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతకుముందు విధించిన జరిమానాకు మరో 90 వేలు, ఇతర ఖర్చులు జతచేసి ఆ మొత్తం చెల్లించాలని స్పష్టం చేసింది. విల్సన్ నిరుద్యోగి కావడం గమనార్హం. ఈ భారీ జరిమానా (1.25 లక్షలు) చెల్లించేందుకు అతనికి కోర్టు 18 నెలల గడువిచ్చింది. కాగా, సిగరెట్ తాగి బహిరంగా పడేసినందుకు లిన్నెట్ విల్డిగ్ అనే మహిళకు కూడా ఇటీవలే భారీ జరిమానా విధించారు. ఈ సంఘటన స్టాఫార్డ్షైన్లోని మెక్‌డొనాల్డ్స్ కార్ పార్కింగ్ వద్ద జరిగింది. తొలుత విధించిన రూ.7 వేల జరిమానా చెల్లించకపోవడంతో ఆమె ముప్పైవేల జరిమానా కట్టక తప్పలేదు. చెత్త వేయడం, సిగరెట్లు ఎక్కడపడితే అక్కడ పడేయడం వంటివి యూకేలో శిక్షార్హం. భారీ జరిమానా తప్పదు. ఫైన్‌ను 10 నుంచి 14 రోజుల్లో చెల్లిస్తే ఏ చిక్కూ లేదు. గడువు దాటిందో.. ఆ మొత్తం భారీ మొత్తం భారీ మొత్తమయి కూర్చుకుంటుంది. -
ఫోక్స్‌వ్యాగన్‌పై 500 కోట్ల జరిమానా
న్యూఢిల్లీ: పర్యావరణానికి హాని కలిగించినందుకు జర్మనీ వాహన దిగ్గజం ఫోక్స్‌వ్యాగన్‌కు జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) రూ.500 కోట్ల జరిమానా వడ్డించింది. ఫోక్స్‌వ్యాగన్ కంపెనీ తన డీజిల్ కార్లలో చీట్ డివైస్‌ను ఉపయోగించడం ద్వారా పర్యావరణానికి హాని కలిగించిందని ఎన్జీటీ పేర్కొంది. పర్యావరణ పరీక్షలను తప్పుదోవ పట్టించే సాఫ్ట్‌వేర్‌ను ఫోక్స్‌వ్యాగన్ తన కార్లలో వినియోగించిందని, ఈ కార్ల అమ్మకాలను భారత్‌లో నిషేధించాలంటూ ఐలావాడి అనే స్కూల్ టీచర్, మరికొందరు ఫిర్యాదు చేశారు. రెండు నెలల్లో జరిమానా డిపాజిట్ చేయండి రూ.500 కోట్ల జరిమానాను రెండు నెలల్లో డిపాజిట్ చేయాలని జస్టిస్ ఆదర్శ్ కుమార్ గోయల్ అధ్యక్షతన గల ఎన్జీటీ ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ మొత్తాన్ని నేషనల్ క్యాపిటల్ రీజియన్‌తో పాటు అధికంగా కాలుష్యానికి గురైన ప్రాంతాల్లో గాలి నాణ్యతను మెరుగుపరిచేందుకు ఖర్చు చేయాలని ఎన్జీటీ పేర్కొంది. కాగా తాము బీఎస్ ఫోర్ నిబంధనలను ఉల్లంఘించలేదని ఫోక్స్‌వ్యాగన్ పేర్కొంది. రహదారి పరీక్షలు ఆధారంగా తనిఖీలు జరిపారని, ఈ రహదారి పరీక్షలకు నిర్దేశిత ప్రమాణాలు లేవని వివరించింది. -
2,000 కోట్ల భారీ జరిమానా
శాన్ఫ్రాన్సిస్కో: బహుళజాతి విత్తన, పురుగుమందుల కంపెనీ మోన్శాంటోకు అమెరికాలోని ఓ న్యాయస్థానం షాకిచ్చింది. తమ ఉత్పత్తుల్ని వాడితే కేన్సర్ సోకుతుందన్న విషయాన్ని దాచిపెట్టి ఓ వ్యక్తి కేన్సర్ బారిన పడేందుకు కారణమైనందుకు ఏకంగా రూ.2,003 కోట్ల(29 కోట్ల డాలర్లు) భారీ జరిమానా విధించింది. ఈ మేరకు శాన్ఫ్రాన్సిస్కోలోని ఓ కోర్టు జ్యూరీ తీర్పునిచ్చింది. ఈ తీర్పుపై అప్పీల్‌కు వెళతామని మోన్శాంటో ప్రతినిధులు తెలిపారు. అమెరికాలోని కాలిఫోర్నియాలో ఉంటున్న డ్వేన్ జాన్సన్(46) బెనికాలో ఓ పాఠశాలలో గ్రౌండ్‌మెన్‌గా పనిచేసేవారు. విధుల్లో భాగంగా స్కూల్ ప్రాంగణం, మైదానంలో కలుపుమొక్కలు పెరగకుండా మోన్శాంటో తయారుచేసిన ‘రౌండర్’ మందును స్ప్రే చేసేవారు. ఈ కలుపుమొక్కల నాశినిలో ప్రధానంగా ఉండే గ్లైఫోసేట్ అనే రసాయనం వల్ల కేన్సర్ సోకుతుంది. ఈ విషయం సంస్థాగత పరీక్షల్లో వెల్లడైనా మోన్శాంటో బయటకు చెప్పలేదు. రౌండప్ కలుపు నాశినిని తరచుగా వాడటంతో తెల్ల రక్తకణాలకు వచ్చే అరుదైన నాన్‌హడ్జ్‌కిన్స్ లింఫోమా అనే కేన్సర్ సోకినట్లు జాన్సన్‌కు 2014లో తెలిసింది. చికిత్స చేసినా జాన్సన్ బతికే అవకాశాలు చాలా తక్కువని వైద్యులు తేల్చారు. మరుసటి ఏడాది ప్రపంచ ఆరోగ్య సంస్థకు చెందిన ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ ఆన్ కేన్సర్(ఐఆర్క్) పరిశోధనలో సంచలన విషయం బయటపడింది. మోన్శాంటో తయారుచేస్తున్న కలుపుమొక్కల నాశనులు రౌండప్, రేంజ్ ప్రోలో కేన్సర్ కారక గ్లైఫోసేట్ అనే ప్రమాదకర రసాయనం ఉందని ఐఆర్క్ తేల్చింది. ఈ విషయాన్ని కస్టమర్లకు మోన్శాంటో తెలపలేదంది. కాలిఫోర్నియాలో కేసు దాఖలు.. మోన్శాంటో కలుపు మందులపై వినియోగదారుల్ని హెచ్చరించకపోవడంతో కాలిఫోర్నియాలోని కోర్టులో కేసు దాఖలైంది. మోన్శాంటో తయారుచేసిన రౌండప్ కారణంగా జాన్సన్‌కు కేన్సర్ సోకిందని ఆయన లాయరు వాదించారు. తమ ఉత్పత్తులు సురక్షితమైనవని మోన్శాంటో ప్రతినిధులు కోర్టులు తెలిపారు. దాదాపు 8 వారాల పాటు ఇరుపక్షాల వాదనలు విన్న జ్యూరీ.. ఐఆర్క్ నివేదికనూ అధ్యయనం చేసింది. చివరగా కేన్సర్ కారక గ్లైఫోసేట్ గురించి మోన్శాంటో వినియోగదారుల్ని హెచ్చరించలేదని న్యాయస్థానం అభిప్రాయపడింది. జాన్సన్‌కు నయంకాని కేన్సర్ సోకేందుకు కారణమైనందున ఆయనకు పరిహారంగా రూ.1,727 కోట్లు, ఇతర ఖర్చుల కింద మరో రూ.276 కోట్లు, మొత్తంగా రూ.2,003 కోట్లు(29 కోట్ల డాలర్లు) చెల్లించాలని మోన్శాంటోను ఆదేశించింది. జాన్సన్ ఆరోగ్యస్థితిపై జ్యూరీ సానుభూతి వ్యక్తం చేసింది. కోర్టు తీర్పుతో జాన్సన్ కన్నీటిపర్యంతమయ్యారు. తీర్పు ఇచ్చిన జ్యూరీలోని సభ్యులందరికీ జాన్సన్ ధన్యవాదాలు తెలిపారు. కాగా కోర్టు తీర్పుపై తాము అప్పీల్‌కు వెళతామని మోన్శాంటో కంపెనీ ఉపాధ్యక్షుడు స్కాట్ పాట్రిడ్జ్ చెప్పారు. డ్వేన్ జాన్సన్ -
‘భారతీయ’ కంపెనీపై అమెరికాలో జరిమానా
వాషింగ్టన్: హెచ్–1బీ వీసా నిబంధనలను ఉల్లంఘించినందుకు భారత సంతతి వ్యక్తికి చెందిన ఓ కంపెనీపై అమెరికాలోని కాలిఫోర్నియాలో భారీ జరిమానా పడింది. హెచ్–1బీ వీసాపై 12 మంది విదేశీ ఉద్యోగులను నియమించుకున్న క్లౌడ్‌విక్ టెక్నాలజీస్ అనే కంపెనీ వారికి నిబంధనల ప్రకారం ఇవ్వాల్సిన దానికన్నా అతి తక్కువ వేతనాలను చెల్లించింది. ఈ కంపెనీ బాధిత ఉద్యోగుల్లో భారతీయులే అధికంగా ఉన్నారు. నెలకు 8,300 డాలర్ల వేతనం ఇస్తామని చెప్పి హెచ్–1బీ వీసాపై ఉద్యోగులను రప్పించుకున్న కంపెనీ.. కొందరికి మరీ తక్కువగా నెలకు 800 డాలర్ల వేతనాన్ని మాత్రమే ఇచ్చిందని అమెరికా కార్మిక శాఖ గుర్తించింది. దీంతో 1,73,044 డాలర్ల జరిమానాను కంపెనీపై విధించి ఆ మొత్తాన్ని ఇప్పటిదాకా తక్కువ వేతనాలు అందుకున్న ఉద్యోగులకు అందజేయాలని కార్మిక శాఖ ఆదేశించింది. -
‘ట్రిపుల్ తలాక్’కు మూడేళ్ల జైలు
సాక్షి ప్రత్యేక ప్రతినిధి, న్యూఢిల్లీ: ట్రిపుల్ తలాక్ అంశాన్ని తీవ్రంగా పరిగణించిన కేంద్రం ఈ దిశగా కఠినమైన చర్యలకోసం రంగం సిద్ధం చేసింది. పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ఈ బిల్లును తీసుకురావాలని కేంద్రం భావిస్తోంది. ట్రిపుల్ తలాక్ చెప్పిన వారికి మూడేళ్ల జైలుతోపాటు భారీగా జరిమానా విధించేలా.. ముస్లిం మహిళల (రక్షణ, విడాకులపై హక్కులు) చట్టం 1986కు పలు మార్పులు చేస్తోంది. న్యాయశాఖ, హోంశాఖ వర్గాలు సంయుక్తంగా రూపొందించిన ముసాయిదాలో ట్రిపుల్ తలాక్ చెప్పటాన్ని తీవ్రంగా పరిగణించటంతోపాటు ఆ నేరానికి పాల్పడినవారికి మూడేళ్ల జైలు, జరిమానా లేదా రెండింటినీ అమలుచేసేలా నిబంధనలున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై తుది నిర్ణయం తీసుకునేందుకు మంత్రుల బృందంతో చర్చించి, రాష్ట్రాల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాత తుది ముసాయిదాను సిద్ధం చేస్తారని సమాచారం. ముస్లిం మహిళల హక్కుల చట్టాన్నే.. ‘షా బానో చట్టం–1986’గా కూడా పిలుస్తారు. ముస్లిం మతపెద్దలనుంచి తీవ్ర విమర్శలు ఎదురైనప్పటికీ రాజీవ్ గాంధీ ప్రభుత్వం షా బానో కేసు నేపథ్యంలో ఈ చట్టాన్ని తీసుకొచ్చింది. అయితే ఆ చట్టం పీఠికలో విడాకులు పొందిన తర్వాతే మహిళలకు వర్తించేలా నిబంధనలున్నాయని.. వీటిని మార్చి విడాకులకు ముందే న్యాయం జరిగేలా మార్పులు చేయాలని భావిస్తోంది. దీంతోపాటుగా నేరశిక్షాస్మృతిలోని సెక్షన్ 125 (భార్య, పిల్లలు, తల్లిదండ్రుల పోషణకు నిరాకరించినప్పుడు తీసుకునే చర్యలు)కూ సవరణలు చేయాలని కేంద్రం భావిస్తోంది. సుప్రీంకోర్టు ఈ ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నా దీనిపై ముందుకే వెళ్లాలని కేంద్రం నిర్ణయించింది. శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వాలకు ముసాయిదాలను పంపించిన న్యాయశాఖ.. దీనిపై వారి అభిప్రాయాలను కోరనుంది. ట్రిపుల్ తలాక్ మార్పులపై ఏర్పాటైన కేంద్ర మంత్రుల బృందంలో రాజ్‌నాథ్ సింగ్, సుష్మా స్వరాజ్, అరుణ్ జైట్లీ, రవిశంకర్ ప్రసాద్, న్యాయశాఖ సహాయ మంత్రి పీపీ చౌదరీలున్నారు. విడాకుల తర్వాత మైనర్ చిన్నారుల కస్టడీ (లీగల్ ప్రొటెక్షన్) విషయంలోనూ న్యాయమూర్తులు తుది నిర్ణయం తీసుకునేలా ముసాయిదాలో పేర్కొన్నారు. మాటల ద్వారానైనా, ఎస్ఎంఎస్, ఈ–మెయిల్, వాట్సప్ సందేశాల ద్వారానైనా ట్రిపుల్ తలాక్ చెప్పటం చెల్లదని స్పష్టం చేశారు. ముసాయిదాకు ఆమోదం లభిస్తే.. జమ్మూకశ్మీర్ మినహా దేశమంతా కొత్త చట్టం అమల్లోకి రానుంది. -
సిగరెట్ కంపెనీలకు 7,903 కోట్లు జరిమానా
అట్టావా: ధూమపానం ఆరోగ్యానికి హానికరమనిని హెచ్చరించనందుకు కెనడా కోర్టు సిగరెట్ కంపెనీలకు రూ.7,903 కోట్ల భారీ జరిమానా విధించింది. సిగరెట్ తాగటం వల్ల గొంతు, ఊపిరితిత్తుల కేన్సర్ బారిన పడిన 10 లక్షల మంది తరఫున క్యూబెక్ రాష్ట్రానికి కొందరు 1998లో కోర్టును ఆశ్రయించారు. కోర్టు సోమవారం తుది తీర్పునిచ్చింది. జరిమానా మొత్తాన్ని బాధితులకు నష్ట పరిహారంగా చెల్లించాలని ఆదేశించింది. కెనడా చరిత్రలోనే అతిపెద్ద జరిమానా అయిన దీనిపై పైకోర్టులో అప్పీల్ చేస్తామని ఇంపీరియల్ టొబాకో, రోత్మాన్స్ అండ్ హెడ్జెస్, జేటీఐ మెక్‌డొనాల్డ్ కంపెనీలు తెలిపాయి. -
లైంగిక వేధింపులకు 857 కోట్ల జరిమానా!
లాస్ ఏంజెలిస్: అమెరికాలో ఓ ఎలిమెంటరీ టీచర్ తన విద్యార్థుల పట్ల లైంగిక వేధింపులకు పాల్పడిన కేసులో భారీ జరిమానా పడింది. టీచర్‌పై చర్యలు తీసుకోవడంలో విఫలమైనందుకుగాను కాలిఫోర్నియా రాష్ట్రంలోనే అతిపెద్ద ప్రభుత్వ విద్యా వ్యవస్థ అయిన ‘లాస్ ఏంజెలిస్ యూనిఫైడ్ స్కూల్ డిస్ట్రిక్ట్’ 81 మంది బాధిత విద్యార్థులకు 139 మిలియన్ల(రూ.857 కోట్లు) మొత్తాన్ని పరిహారంగా చెల్లించాలంటూ కోర్టు తీర్పునిచ్చింది. మార్క్ బెనెట్ అనే ఆ టీచర్ దురాగతాలకు సంబంధించిన ఫిల్మ్ పోలీసుల చేతికి చిక్కడంతో అతడిని 2012లో అరెస్టు చేసిన నాటి నుంచీ ఈ కేసు కొనసాగుతోంది. విద్యార్థుల కళ్లకు గంతలు కట్టి వారికి తినుబండారాలపై వీర్యం వేసి బెనెట్ తినిపించేవాడని, హస్తప్రయోగం చేసేవాడని సైతం ఆరోపణలు వచ్చినా స్కూల్ చర్యలు తీసుకోలేదని న్యాయస్థానం పేర్కొంది. నేరాలకు పాల్పడినట్లు రుజువు కావడంతో న్యాయస్థానం అతడికి 25 ఏళ్ల జైలు శిక్షను విధించింది.