‘మా రాష్ట్రంలో ట్రాఫిక్‌ చలాన్లు పెంచం’ | Mamata Banerjee Said Increased Traffic Fines Will Not Apply In Bengal | Sakshi
Sakshi News home page

సామాన్యుల తాట తీసేలా కొత్త మోటారు వాహన చట్టం: దీదీ

Published Wed, Sep 11 2019 6:37 PM | Last Updated on Wed, Sep 11 2019 6:40 PM

Mamata Banerjee Said Increased Traffic Fines Will Not Apply In Bengal - Sakshi

కోల్‌కతా: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మోటారు వాహన సవరణ చట్టం-2019పై దేశవ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. కొత్త చట్టం మూలంగా ట్రాఫిక్‌ చలాన్లు భారీగా పెరిగి.. సామాన్యులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోన్న సంగతి తెలిసిందే. కొత్త మోటారు వాహన చట్టాన్ని పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ చట్టం ఎంతో కఠినంగా ఉందని.. సామాన్యుల తాట తీసేందుకే ఈ చట్టాన్ని తీసుకొచ్చారని ఆమె ఆరోపించారు. అంతేకాక ఈ చట్టాన్ని తమ రాష్ట్రంలో అమలు చేయడం లేదని దీదీ స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా దీదీ మీడియాతో మాట్లాడుతూ.. ‘ఈ చట్టాన్ని మేం పార్లమెంటులోనే వ్యతిరేకించాం. ఈ చట్టాన్ని అమలు చేస్తే.. సామాన్యులు తీవ్రంగా ఇబ్బంది పడతారు. ధనార్జనే ప్రభుత్వ లక్ష్యం కాకూడదు. కొన్ని సందర్భాల్లో సమస్యను మానవతా దృక్పథంలో కూడా చూడాలి. ప్రస్తుతం మా రాష్ట్రంలో ‘సేఫ్‌ డ్రైవ్‌-సేవ్‌ లైఫ్‌’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. గతంతో పోలిస్తే ప్రస్తుతం రాష్ట్రంలో యాక్సిడెంట్ల సంఖ్య తగ్గింద’న్నారు దీదీ.
(చదవండి: ఇప్పుడెలా వేస్తారు ట్రాఫిక్‌ చలానా!?)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement