కోల్‌కతా:పశ్చిమబెంగాల్‌లో మహిళల ఉద్యమానికి కేంద్రంగా నిలిచిన సందేశ్‌ఖాలీలో సీఎం మమతాబెనర్జీ సోమవారం(డిసెంబర్30) పర్యటించనున్నారు. ఇక్కడ తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) నేతల భూకబ్జాలు,లైంగిక వేధింపులపై ఈ ఏడాది ఆరంభంలో మహిళలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేశారు.
ఈ ఆందోళనల తర్వాత ఈ ప్రాంతంలో సీఎం మమత పర్యటించడం ఇదే తొలిసారి. పౌరసరఫరాల శాఖ కార్యక్రమంలో మమత పాల్గొననున్నారు. మాజీ టీఎంసీ నేత షేక్‌షాజహాన్ తమ భూములు కబ్జా చేయడంతో పాటు లైంగికంగా వేధిస్తున్నారని సందేశ్‌ఖాలీలో మహిళలు ఉద్యమించారు.
తర్వాత రేషన్ స్కామ్‌లో మనీ లాండరింగ్ ఆరోపణలపై షేక్‌షాజహాన్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) షేక్ షాజహాన్‌ను అరెస్టు చేసింది. ఈ పరిణామాలతో అప్పట్లో అతడిని టీఎంసీ సస్పెండ్ చేసింది.
ఇదీ చదవండి: బీహార్‌లో ఉద్రిక్తతలు..ప్రశాంత్‌కిశోర్‌పై కేసు
Comments
Please login to add a commentAdd a comment