గాంధీనగర్: కొత్త మోటారు వాహన చట్టం వాహనదారులకు చుక్కలు చూపిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కొత్త చలానాలకు జడిసి ఏకంగా ప్రాణాలు తీసుకుంటున్న సంఘటనల గురించి కూడా చదువుతూనే ఉన్నాం. తాజాగా ఇలాంటి సంఘటన ఒకటి గుజరాత్‌లో చోటు చేసుకుంది. ట్రాఫిక్ పోలీసులు విధించిన చలానా చూసి ఆత్మహత్యాయత్నం చేశాడో ఆటో డ్రైవర్. ఈ సంఘటన అహ్మదాబాద్‌లో చోటు చేసుకుంది. రాజు సోలంకి అనే ఆటో డ్రైవర్‌కు ట్రాఫిక్ పోలీసులు ఏకంగా రూ.18 వేల చలానా విధించారు. దాంతో తీవ్ర మనస్థాపానికి గురయిన రాజు.. ఫినాయిల్ తాగి ఆత్మహత్య ప్రయత్నం చేశాడు. దాంతో అతడిని ఆస్పత్రిలో చేర్చారు.
రాజు మాట్లాడుతూ.. ‘నేను చాలా పేదవాడిని. అలాంటది ట్రాఫిక్ అధికారులు నాకు ఏకంగా రూ. 18వేలు చలానా విధించారు. ఇంత భారీ మొత్తాన్ని నేను ఎలా చెల్లించాలి. నా ఆటోను కూడా సీజ్ చేశారు. ఇప్పుడు నేను నా కుటుంబాన్ని ఎలా పోషించాలి’ అని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు రాజు.
Comments
Please login to add a commentAdd a comment