మూతపడుతున్న పరిశ్రమలు
ఉపాధి కోల్పోతున్న పరిస్థితులు
తక్షణ చర్యలు అవసరమన్న జీటీఆర్‌ఐ
న్యూఢిల్లీ: దేశ వజ్రాల పరిశ్రమ తీవ్ర సంక్షోభంతో కుదేలవుతోందని, పరిశ్రమలు మూత పడుతుండడంతో ఎంతో మంది ఉపాధి కల్పోతున్న పరిస్థితులు నెలకొన్నాయని గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనీషియేటివ్ (జీటీఆర్‌ఐ) అనే స్వతంత్ర సంస్థ వెల్లడించింది. ఆర్డర్లు తగ్గడంతో ముడి వజ్రాల నిల్వలు పెరుగుతున్నాయని, ల్యాబ్‌లో తయారైన వజ్రాల నుంచి పోటీ ఎక్కువగా ఉందని వివరించింది.
‘‘ఈ పరిస్థితులు రుణ ఎగవేతలు, పరిశ్రమల మూతకు, ఉపాధి నష్టానికి కారణమవుతోంది. గుజరాత్ వజ్రాల పరిశ్రమకు చెందిన 60 మంది ఇప్పటి వరకు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఇది దేశ వజ్రాల పరిశ్రమ ఎదుర్కొంటున్న తీవ్ర ఆర్థిక సమస్యలను తెలియజేస్తోంది’’అని జీటీఆర్‌ఐ వ్యవస్థాపకుడు అజయ్ శ్రీవాస్తవ తెలిపారు. తక్షణమే ఈ సమస్యలు పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని, అప్పుడే ఈ పరిశ్రమ భవిష్యత్‌కు రక్షణ కలి్పంచినట్టు అవుతుందన్నారు.
ఎగుమతుల్లో క్షీణత..
జీటీఆర్‌ఐ నివేదిక ప్రకారం 2021–22లో ముడి వజ్రాల దిగుమతులు 18.5 బిలియన్ డాలర్లుగా ఉంటే, 2023–24 నాటికి 25 శాతం మేర క్షీణించి 14 బిలియన్ డాలర్లకు తగ్గిపోయాయి. ఇక్కడి నుంచి చేసిన ముడి వజ్రాల ఎగుమతులను సర్దుబాటు చేసి చూస్తే, నికర దిగుమతులు 25 శాతం తగ్గి 17.5 బిలియన్ డాలర్ల నుంచి 13.1 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. కట్, పాలి‹Ù్డ వజ్రాల ఎగుమతులు 35 శాతం మేర తగ్గాయి. 2021–22లో 24.4 బిలియన్ డాలర్లుగా ఉంటే, 2023–24లో 13.1 బిలియన్ డాలర్లకు క్షీణించాయి.
పైగా ఇదే కాలంలో విక్రయం కాని వజ్రాలను భారత్‌కు తిప్పిపండం అన్నది 35 శాతం నుంచి 45.6 శాతానికి పెరిగింది. నికర కట్, పాలి‹Ù్డ వజ్రాల ఎగుమతులు 45 శాతం మేర తగ్గి 15.9 బిలియన్ డాలర్ల నుంచి 8.7 బిలియన్ డాలర్లకు తగ్గిపోయినట్టు జీటీఆర్‌ఐ నివేదిక వివరించింది. నికర ముడి వజ్రాల దిగుమతులు, నికర కట్, పాలిష్ పట్టిన వజ్రాల ఎగమతుల మధ్య అంతరం 2021–22లో 1.6 బిలియన్ డాలర్లు ఉంటే, 2024 మార్చి నాటికి 4.4 బిలియన్ డాలర్లకు పెరిగిపోయినట్టు తెలిపింది. ముడి వజ్రాలను దిగుమతి చేసుకుని, ఇక్కడి పరిశ్రమలు కట్, పాలిష్డ్ రూపంలో, ఆభరణాల రూపంలో విదేశాలకు ఎక్కువగా ఎగుమతి చేస్తుంటాయి.
సవాళ్లకు ఎన్నో కారణాలు..
నియంత్రణపరమైన అంశాలకుతోడు, పరిశ్రమలో అంతర్గతంగా ఉన్న సామర్థ్యాల లేమి ప్రస్తుత సవాళ్లకు కారణమని జీటీఆర్‌ఐ వివరించింది. యూఎస్, చైనా, యూరప్‌లో ఆర్థిక అనిశి్చతులు, ద్రవ్యోల్బణం, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు లగ్జరీ ఉత్పత్తులపై వినియోగం తగ్గేందుకు దారితీసినట్టు తెలిపింది. ‘‘అంతర్జాతీయంగా వజ్రాల ధరల్లో అస్థిరతలు అనిశి్చతికి కారణమయ్యాయి. ధరలు మరింత తగ్గుతాయన్న అంచనాతో పరిశ్రమలు ముడి వజ్రాల కొనుగోలుకు దూరంగా ఉన్నాయి’’అని ఈ నివేదిక తెలిపింది.
రష్యా–ఉక్రెయిన్ యుద్ధం సైతం అంతర్జాతీయంగా వజ్రాల సరఫరా వ్యవస్థలో అవరోధాలకు దారితీసినట్టు శ్రీవాస్తవ తెలిపారు. తక్కువ ధరలకు వచ్చే ల్యాబ్ వజ్రాలవైపు కస్టమర్లు మొగ్గు చూపిస్తుండడం సహజ వజ్రాల డిమాండ్‌ను ప్రభావం చేస్తున్నట్టు చెప్పారు. పెరిగిపోతున్న కారి్మక, ఇంధన, మెటీరియల్స్ వ్యయాలతో చాలా యూనిట్లు మనుగడ సాగించలేని పరిస్థితులు నెలకొన్నట్టు వివరించారు. ఇదే పరిశ్రమల మూతకు దారితీస్తున్నట్టు పేర్కొన్నారు. ఎగుమతులకు సంబంధించి రుణ సాయం, విదేశీ ముడి వజ్రాల విక్రేతలకు కార్పొరేట్ పన్ను నుంచి మినహాయించడం, ల్యాబ్ వజ్రాల పరిశ్రమను నియంత్రించడం, దుబాయి నుంచి కట్, పాలి‹Ù్డ వజ్రాల దిగుమతులపై సున్నా టారిఫ్ వంటి చర్యలను పరిశీలించాలని ప్రభుత్వానికి జీటీఆర్‌ఐ సూచించింది.
వజ్రాల పరిశ్రమకు గడ్డుకాలం
దశాబ్ద కనిష్టానికి ఆదాయం: క్రిసిల్
దేశ వజ్రాల పరిశ్రమ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోందని ప్రముఖ రేటింగ్ సంస్థ క్రిసిల్ రేటింగ్స్ సైతం తెలిపింది. వజ్రాల పాలిషింగ్ పరిశ్రమ ఆదాయం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2023–24)లో 25–27 శాతం మేర క్షీణించి, దశాబ్ద కనిష్ట స్థాయి అయిన 12 బిలియన్ డాలర్లకు పరిమితం అవుతుందని క్రిసిల్ రేటింగ్స్ అంచనా వేసింది. కీలక ఎగుమతి మార్కెట్లు అయిన యూఎస్, చైనాలో డిమాండ్ తక్కువగా ఉండడం, వినియోగదారులు ల్యాబ్ తయారీ వజ్రాల వైపు మొగ్గు చూపడాన్ని కారణాలుగా ప్రస్తావించింది. దీంతో వజ్రాల సరఫరా పెరిగి ధరలు 10–15 శాతం వరకు తగి్టనట్టు తెలిపింది.
ఈ మేరకు పరిశ్రమపై ఒక నివేదికను తాజాగా విడుదల చేసింది. సహజ వజ్రాలను సానబట్టే పరిశ్రమ ఆదాయం తగ్గడం వరుసగా ఇది మూడో ఆర్థిక సంవత్సరం అవుతుందని పేర్కొంది. 2023–24లోనూ 29 శాతం, 2022–23లో 9 శాతం చొప్పున ఆదాయం క్షీణించినట్టు తెలిపింది. తాజా పరిణామాల నేపథ్యంలో వజ్రాల పాలిషర్లు ముడి వజ్రాల కొనుగోళ్లను తగ్గించినట్టు, దీంతో వజ్రాల మైనింగ్ సంస్థలు ఉత్పత్తిని తగ్గించుకున్నట్టు వివరించింది. ఇది ధరల పతనాన్ని కొంత వరకు అడ్డుకున్నట్టు పేర్కొంది. పరిశ్రమ ఆపరేటింగ్ మార్జిన్లు 2024–25లో 4.5–4.7 శాతం మధ్య స్థిరపడొచ్చని తెలిపింది. మొత్తం మీద మూలధన అవసరాలు తగ్గడంతో రుణాలపై ఆధారపడడం తగ్గుతుందని, ఇది కంపెనీల రుణ పరపతికి మద్దతుగా నిలుస్తుందని అంచనా వేసింది.
Comments
Please login to add a commentAdd a comment