Diamond industry
-
వజ్రాల పరిశ్రమ పునరుజ్జీవం
న్యూఢిల్లీ: కట్ చేసిన, సానబట్టిన వజ్రాలను సుంకాల్లేకుండా దిగుమతి చేసుకునేందుకు వీలు కల్పిస్తూ ‘డైమండ్ ఇంప్రెస్ట్ ఆథరైజేషన్ స్కీమ్’ను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఎగుమతులను పెంచడం, విలువను జోడించడం ఈ పథకం ఉద్దేశ్యాలుగా ఉన్నాయి. ఏప్రిల్ 1 నుంచి ఈ పథకం అమల్లోకి రానుంది. వజ్రాల పరిశ్రమ ఎగుమతులు క్షీణత, ఉపాధి నష్టాన్ని ఎదుర్కొంటోందని కేంద్ర వాణిజ్య శాఖ పేర్కొంది.తాజా పథకం ఈ ధోరణికి చెక్‌పెట్టి పరిశ్రమకు పునరుజ్జీవాన్ని కల్పిస్తుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేసింది. అంతర్జాతీయంగా భారత వజ్రాల పరిశ్రమ పోటీతత్వాన్ని పెంచుతుందని, ఎంఎస్ఎంఈలకు తగిన అవకాశాలను కల్పిస్తుందని తెలిపింది. మరిన్ని ఉపాధి అవకాశాలకు మార్గం కల్పిస్తుందని పేర్కొంది. రెండు స్టార్ల ఎగుమతి హోదా కలిగి, ఏడాదిలో 15 మిలియన్ డాలర్లు అంతకంటే అధిక విలువ మేర ఎగుమతులు చేస్తున్న సంస్థలు ఈ పథకం కింద ప్రయోజనానికి అర్హులని వెల్లడించింది.ఇదీ చదవండి: భారత్ క్రెడిట్ రేటింగ్‌కు సవాళ్లు25 క్యారట్ (25 సెంట్లు) అంతకంటే తక్కువ ఉన్న సహజ కట్, పాలిష్డ్ వజ్రాలను సుంకాల్లేకుండా దిగుమతి చేసుకునేందుకు పథకం అనుమతిస్తుందని స్పష్టం చేసింది. గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనీషియేటివ్ (జీటీఆర్ఐ) అనే స్వతంత్ర సంస్థ గణాంకాల ప్రకారం.. 2021–22లో ముడి వజ్రాల దిగుమతులు 18.5 బిలియన్ డాలర్లుగా ఉంటే, 2023–24 నాటికి 14 బిలియన్ డాలర్లకు క్షీణించాయి. కట్, పాలిష్డ్ వజ్రాల ఎగుమతులు ఇదే కాలంలో 24.4 బిలియన్ డాలర్ల నుంచి 13.1 బిలియన్ డాలర్లకు తగ్గిపోవడం గమనార్హం. -
వజ్రాల ధగధగలపై చీకట్ల ముసురు!
సూరత్ అంటే ముందుగా అందరికి గుర్తొచ్చేది వజ్రాలే. ప్రపంచంలోని 90 శాతం వజ్రాలను సూరత్‌లోనే ప్రాసెస్ చేస్తారు. దీనికోసం ఇక్కడ ఏకంగా 5000 కంటే ఎక్కువ ప్రాసెస్ యూనిట్స్ ఉన్నాయి. ఇందులో సుమారు ఎనిమిది లక్షల మందికిపైగా పాలిషర్స్ ఉపాధి పొందుతున్నారు. అయితే గత కొన్నేళ్లుగా సూరత్‌లో వజ్రాల వ్యాపారం తీవ్రంగా దెబ్బతింది.వజ్రాల వ్యాపారం దెబ్బతినడానికి కారణం▸ఉక్రెయిన్, రష్యా యుద్ధం తరువాత యూరోపియన్ యూనియన్ దేశాలు, జీ7 దేశాలు దిగుమతులను నిషేధించడం. ▸కరోనా మహమ్మారి తరువాత విధించిన లాక్డౌన్ వల్ల ఎగుమతులు మందగించడం.▸పాశ్చాత్య దేశాల నుంచి డిమాండ్ తగ్గిపోవడం, ఆర్ధిక వ్యవస్థలు మందగించడం.▸ల్యాబ్‌లో తాయారు చేసిన వజ్రాలకు డిమాండ్ విపరీతంగా పెరిగిపోవడం. ఎందుకంటే సహజమైన వజ్రాల కంటే ల్యాబ్‌లో తయారైన వజ్రాల ధరలు కొంత తక్కువగానే ఉంటాయి. ఇది డైమండ్ మార్కెట్ మీద ప్రభావం చూపిస్తుంది.కటింగ్, పాలిషింగ్ వంటి వాటికోసం 30 శాతం రఫ్ డైమండ్లను భారత్.. రష్యా నుంచి దిగుమతి చేసుకునేది. అయితే కరోనా, ఇతర కారణాల వల్ల చాలా దేశాలు ఆంక్షలు విధించాయి. దీంతో వజ్రాల వ్యాపారం మందగించిందని ఇండియన్ డైమండ్ ఇన్స్టిట్యూట్ ప్రెసిడెంట్ దినేష్ నవాడియా పేర్కొన్నారు.ఆర్థిక మాంద్యం కారణంగా సుమారు వెయ్యి పాలిషింగ్ యూనిట్స్ మూతపడ్డాయి. దీంతో సుమారు రెండు లక్షలమంది ఉపాధి కోల్పోయారు. ఉపాధి కోల్పోవడంతో గత 16 నెలల్లో సుమారు 65 మంది ఆత్మహత్య చేసుకున్నట్లు, డైమండ్ పాలిషర్లకు ప్రాతినిధ్యం వహిస్తున్న స్టేట్ డైమండ్ వర్కర్స్ యూనియన్ నేతలు పేర్కొన్నారు. ఉద్యోగాలు కోల్పోయిన తరువాత.. ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోలేక, కుటుంబాలను పోషించలేకే ఈ ఆత్మహత్యలు చేసుకుంటున్నట్లు వెల్లడించారు.ఇదీ చదవండి: అంబానీ చెప్పిన మూడు విషయాలు ఇవే..బంగారం, వజ్రాల వ్యాపారం దేశ ఆర్ధిక వ్యవస్థ పెరగడానికి దోహదపడుతోంది. 2022లో ఈ వ్యాపారం దేశ జీడీపీ దాదాపు ఏడు శాతం దోహదపడింది. అయితే 2024 ఆర్ధిక సంవత్సరంలో రత్నాలు, ఆభరణాల ఎగుమతులు గణనీయంగా తగ్గాయి. ఈ ఎగుమతుల విలువ 1.87 లక్షల కోట్లు. -
సంక్షోభంలో వజ్రాల పరిశ్రమ
న్యూఢిల్లీ: దేశ వజ్రాల పరిశ్రమ తీవ్ర సంక్షోభంతో కుదేలవుతోందని, పరిశ్రమలు మూత పడుతుండడంతో ఎంతో మంది ఉపాధి కల్పోతున్న పరిస్థితులు నెలకొన్నాయని గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనీషియేటివ్ (జీటీఆర్ఐ) అనే స్వతంత్ర సంస్థ వెల్లడించింది. ఆర్డర్లు తగ్గడంతో ముడి వజ్రాల నిల్వలు పెరుగుతున్నాయని, ల్యాబ్‌లో తయారైన వజ్రాల నుంచి పోటీ ఎక్కువగా ఉందని వివరించింది. ‘‘ఈ పరిస్థితులు రుణ ఎగవేతలు, పరిశ్రమల మూతకు, ఉపాధి నష్టానికి కారణమవుతోంది. గుజరాత్ వజ్రాల పరిశ్రమకు చెందిన 60 మంది ఇప్పటి వరకు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఇది దేశ వజ్రాల పరిశ్రమ ఎదుర్కొంటున్న తీవ్ర ఆర్థిక సమస్యలను తెలియజేస్తోంది’’అని జీటీఆర్ఐ వ్యవస్థాపకుడు అజయ్ శ్రీవాస్తవ తెలిపారు. తక్షణమే ఈ సమస్యలు పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని, అప్పుడే ఈ పరిశ్రమ భవిష్యత్‌కు రక్షణ కలి్పంచినట్టు అవుతుందన్నారు. ఎగుమతుల్లో క్షీణత.. జీటీఆర్ఐ నివేదిక ప్రకారం 2021–22లో ముడి వజ్రాల దిగుమతులు 18.5 బిలియన్ డాలర్లుగా ఉంటే, 2023–24 నాటికి 25 శాతం మేర క్షీణించి 14 బిలియన్ డాలర్లకు తగ్గిపోయాయి. ఇక్కడి నుంచి చేసిన ముడి వజ్రాల ఎగుమతులను సర్దుబాటు చేసి చూస్తే, నికర దిగుమతులు 25 శాతం తగ్గి 17.5 బిలియన్ డాలర్ల నుంచి 13.1 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. కట్, పాలి‹Ù్డ వజ్రాల ఎగుమతులు 35 శాతం మేర తగ్గాయి. 2021–22లో 24.4 బిలియన్ డాలర్లుగా ఉంటే, 2023–24లో 13.1 బిలియన్ డాలర్లకు క్షీణించాయి. పైగా ఇదే కాలంలో విక్రయం కాని వజ్రాలను భారత్‌కు తిప్పిపండం అన్నది 35 శాతం నుంచి 45.6 శాతానికి పెరిగింది. నికర కట్, పాలి‹Ù్డ వజ్రాల ఎగుమతులు 45 శాతం మేర తగ్గి 15.9 బిలియన్ డాలర్ల నుంచి 8.7 బిలియన్ డాలర్లకు తగ్గిపోయినట్టు జీటీఆర్ఐ నివేదిక వివరించింది. నికర ముడి వజ్రాల దిగుమతులు, నికర కట్, పాలిష్ పట్టిన వజ్రాల ఎగమతుల మధ్య అంతరం 2021–22లో 1.6 బిలియన్ డాలర్లు ఉంటే, 2024 మార్చి నాటికి 4.4 బిలియన్ డాలర్లకు పెరిగిపోయినట్టు తెలిపింది. ముడి వజ్రాలను దిగుమతి చేసుకుని, ఇక్కడి పరిశ్రమలు కట్, పాలిష్డ్ రూపంలో, ఆభరణాల రూపంలో విదేశాలకు ఎక్కువగా ఎగుమతి చేస్తుంటాయి. సవాళ్లకు ఎన్నో కారణాలు.. నియంత్రణపరమైన అంశాలకుతోడు, పరిశ్రమలో అంతర్గతంగా ఉన్న సామర్థ్యాల లేమి ప్రస్తుత సవాళ్లకు కారణమని జీటీఆర్ఐ వివరించింది. యూఎస్, చైనా, యూరప్‌లో ఆర్థిక అనిశి్చతులు, ద్రవ్యోల్బణం, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు లగ్జరీ ఉత్పత్తులపై వినియోగం తగ్గేందుకు దారితీసినట్టు తెలిపింది. ‘‘అంతర్జాతీయంగా వజ్రాల ధరల్లో అస్థిరతలు అనిశి్చతికి కారణమయ్యాయి. ధరలు మరింత తగ్గుతాయన్న అంచనాతో పరిశ్రమలు ముడి వజ్రాల కొనుగోలుకు దూరంగా ఉన్నాయి’’అని ఈ నివేదిక తెలిపింది. రష్యా–ఉక్రెయిన్ యుద్ధం సైతం అంతర్జాతీయంగా వజ్రాల సరఫరా వ్యవస్థలో అవరోధాలకు దారితీసినట్టు శ్రీవాస్తవ తెలిపారు. తక్కువ ధరలకు వచ్చే ల్యాబ్ వజ్రాలవైపు కస్టమర్లు మొగ్గు చూపిస్తుండడం సహజ వజ్రాల డిమాండ్‌ను ప్రభావం చేస్తున్నట్టు చెప్పారు. పెరిగిపోతున్న కారి్మక, ఇంధన, మెటీరియల్స్ వ్యయాలతో చాలా యూనిట్లు మనుగడ సాగించలేని పరిస్థితులు నెలకొన్నట్టు వివరించారు. ఇదే పరిశ్రమల మూతకు దారితీస్తున్నట్టు పేర్కొన్నారు. ఎగుమతులకు సంబంధించి రుణ సాయం, విదేశీ ముడి వజ్రాల విక్రేతలకు కార్పొరేట్ పన్ను నుంచి మినహాయించడం, ల్యాబ్ వజ్రాల పరిశ్రమను నియంత్రించడం, దుబాయి నుంచి కట్, పాలి‹Ù్డ వజ్రాల దిగుమతులపై సున్నా టారిఫ్ వంటి చర్యలను పరిశీలించాలని ప్రభుత్వానికి జీటీఆర్ఐ సూచించింది.వజ్రాల పరిశ్రమకు గడ్డుకాలం దశాబ్ద కనిష్టానికి ఆదాయం: క్రిసిల్ దేశ వజ్రాల పరిశ్రమ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోందని ప్రముఖ రేటింగ్ సంస్థ క్రిసిల్ రేటింగ్స్ సైతం తెలిపింది. వజ్రాల పాలిషింగ్ పరిశ్రమ ఆదాయం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2023–24)లో 25–27 శాతం మేర క్షీణించి, దశాబ్ద కనిష్ట స్థాయి అయిన 12 బిలియన్ డాలర్లకు పరిమితం అవుతుందని క్రిసిల్ రేటింగ్స్ అంచనా వేసింది. కీలక ఎగుమతి మార్కెట్లు అయిన యూఎస్, చైనాలో డిమాండ్ తక్కువగా ఉండడం, వినియోగదారులు ల్యాబ్ తయారీ వజ్రాల వైపు మొగ్గు చూపడాన్ని కారణాలుగా ప్రస్తావించింది. దీంతో వజ్రాల సరఫరా పెరిగి ధరలు 10–15 శాతం వరకు తగి్టనట్టు తెలిపింది. ఈ మేరకు పరిశ్రమపై ఒక నివేదికను తాజాగా విడుదల చేసింది. సహజ వజ్రాలను సానబట్టే పరిశ్రమ ఆదాయం తగ్గడం వరుసగా ఇది మూడో ఆర్థిక సంవత్సరం అవుతుందని పేర్కొంది. 2023–24లోనూ 29 శాతం, 2022–23లో 9 శాతం చొప్పున ఆదాయం క్షీణించినట్టు తెలిపింది. తాజా పరిణామాల నేపథ్యంలో వజ్రాల పాలిషర్లు ముడి వజ్రాల కొనుగోళ్లను తగ్గించినట్టు, దీంతో వజ్రాల మైనింగ్ సంస్థలు ఉత్పత్తిని తగ్గించుకున్నట్టు వివరించింది. ఇది ధరల పతనాన్ని కొంత వరకు అడ్డుకున్నట్టు పేర్కొంది. పరిశ్రమ ఆపరేటింగ్ మార్జిన్లు 2024–25లో 4.5–4.7 శాతం మధ్య స్థిరపడొచ్చని తెలిపింది. మొత్తం మీద మూలధన అవసరాలు తగ్గడంతో రుణాలపై ఆధారపడడం తగ్గుతుందని, ఇది కంపెనీల రుణ పరపతికి మద్దతుగా నిలుస్తుందని అంచనా వేసింది. -
పదేళ్లలో 17 బిలియన్ డాలర్లు..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశీ వజ్రాల పరిశ్రమ 2030 నాటికి 17 బిలియన్ డాలర్లకు చేరవచ్చని అంచనాలు ఉన్నాయని డైమండ్ మైనింగ్ దిగ్గజం డిబీర్స్ ఇండియా మార్కెటింగ్ డైరెక్టర్ తొరాంజ్ మెహతా తెలిపారు. ప్రస్తుతం ఇది 7 బిలియన్ డాలర్ల స్థాయిలో ఉందని వివరించారు. అమెరికా, చైనా తర్వాత మూడో అతి పెద్ద మార్కెట్‌గా ఉన్న భారత్ ఇప్పుడిప్పుడే గణనీయంగా వృద్ధి చెందుతోందని ఆమె తెలిపారు. ‘‘మెచ్యూరిటీని బట్టి చూస్తే జపాన్ పూర్తి స్థాయిని దాటేసింది. అమెరికా ప్రస్తుతం దగ్గర్లో ఉంది. చైనా వృద్ధి దశలోనూ, భారత్ వర్ధమాన స్థాయిలోనూ ఉంది’’ అని మెహతా వివరించారు. మధ్య ప్రాచ్యం, యూరప్ మొదలైన ప్రాంతాల మార్కెట్ వాటా సుమారు చెరో 7 శాతం స్థాయిలో ఉన్నాయని పేర్కొన్నారు. సూరత్‌లోని డిబీర్స్ అధునాతన ఇన్స్టిట్యూట్ ఆఫ్ డైమండ్స్ సందర్శన సందర్భంగా ఆమె ఈ విషయాలు తెలిపారు. ‘‘భారత ఎకానమీ వేగంగా వృద్ధి చెందుతోంది. మధ్యతరగతి జనాభా పెరగనుంది. డైమండ్స్ కొనుగోలు చేసే సంపన్న వర్గాల సంఖ్య మరింత ఎక్కువగా 25 శాతం మేర పెరగవచ్చని అంచనా. అలాగే వయస్సు రీత్యా చూస్తే కూడా వజ్రాల వైపు మొగ్గు చూపే యువత సంఖ్య కూడా పెరుగుతోంది. ఇవన్నీ కూడా రాబోయే దశాబ్దకాలంలో దేశీయంగా పరిశ్రమ వృద్ధికి తోడ్పడనున్నాయి’’ అని మెహతా వివరించారు. ఫరెవర్ మార్క్ అనే తమ బ్రాండ్ విషయానికొస్తే అమ్మకాలపరంగా భారత్ అతి పెద్ద మార్కెట్‌గా ఉంటోందని ఆమె చెప్పారు. ప్రస్తుతం తమకు 60 నగరాల్లో 270 పైచిలుకు రిటైల్ అవుట్‌లెట్స్, 14 ఎక్స్‌క్లూజివ్ స్టోర్స్ ఉన్నాయని మెహతా వివరించారు. కార్యకలాపాలను మరింతగా విస్తరించే క్రమంలో ఈ నెలాఖరు నాటికి ఇండోర్, మంగళూరులో కొత్తగా రెండు ఎక్స్‌క్లూజివ్ స్టోర్స్‌ను తెరుస్తున్నట్లు ఆమె తెలిపారు. దక్షిణాదిలో నాణ్యత .. ఉత్తరాదిలో పరిమాణం.. దక్షిణాది, ఉత్తరాది మార్కెట్లలో డిజైన్ల ప్రాధాన్యాలు చాలావరకు భిన్నంగా ఉంటాయని మెహతా తెలిపారు. దక్షిణాదిలో డైమండ్ పరిమాణం చిన్నదిగా ఉన్నా మంచి రంగు, అత్యుత్తమ క్వాలిటీకి ప్రాధాన్యమిస్తారని, అదే ఉత్తరాదిలో డైమండ్ పరిమాణానికి కొంత ఎక్కువ ప్రాధాన్యమిస్తుంటారని పేర్కొన్నారు. తమకు దక్షిణాది మార్కెట్లో అమ్మకాలు అత్యధికంగా ఉండగా, ఉత్తరాదిలో పుంజుకుంటున్నాయని మెహతా చెప్పారు. అతి పెద్ద కేంద్రం.. డిబీర్స్కు ప్రపంచవ్యాప్తంగా మూడు (బ్రిటన్, బెల్జియం, భారత్) డైమండ్ ఇనిస్టిట్యూట్స్ ఉన్నాయి. వీటన్నింటిలోకెల్లా సూరత్‌లోని ఇనిస్టిట్యూట్ అతి పెద్దది. దీని ద్వారా డిబీర్స్ అధునాతన యంత్రాలు, నిపుణులతో డైమండ్ గ్రేడింగ్, టెస్టింగ్, ఇన్స్క్రిప్షన్ సేవలు అందిస్తోంది. 2015లో ప్రారంభించిన ఈ కేంద్రంపై దాదాపు 15 మిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేసింది. ఏడాదికి దాదాపు 10 లక్షల సర్టిఫికెషన్లు చేసే సామర్థ్యాలతో ఇది ఏర్పాటైంది. -
వజ్రాల ఎగుమతులకూ దెబ్బ..
ముంబై: ప్రపంచవ్యాప్తంగా కోవిడ్–19 వైరస్ మరింతగా ప్రబలుతున్న నేపథ్యంలో భారత వజ్రాల ఎగుమతులు గణనీయంగా తగ్గనున్నాయి. 2020–21 ఆఖరు నాటికి 19 బిలియన్ డాలర్ల స్థాయికి పడిపోనున్నాయి. ఆ తర్వాతి ఆర్థిక సంవత్సరంలోనూ ఎగుమతులు తగ్గడమో లేదా అదే స్థాయిలో ఉండవచ్చని క్రిసిల్ రేటింగ్స్ ఒక నివేదికలో వెల్లడించింది. 2018–19లో భారత్ నుంచి వజ్రాల ఎగుమతులు 24 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి తొమ్మిది నెలల్లో భారత్ నుంచి మొత్తం వజ్రాల ఎగుమతులు విలువపరంగా 18% తగ్గాయి. వీటిలో 40% ఎగుమతులు హాంకాంగ్‌కి జరిగాయి. అయితే, జనవరి 15 నుంచి హాంకాంగ్‌కు ఎగుమతులు నిల్చిపోయాయి. ‘ఈ ఆర్థిక సంవత్సరం ఆఖరు త్రైమాసికంలో ఎగుమతులు మరింత తగ్గవచ్చు. ఆగ్నేయాసియా ప్రాంతంలో సెలవులు, కోవిడ్ వ్యాప్తితో మార్కెట్లు మూతబడటం మొదలైన అంశాల కారణంగా ఈ ఒక్క త్రైమాసికంలోనే దాదాపు బిలియన్ డాలర్ల ఎగుమతులపై ప్రతికూల ప్రభావం ఉండొచ్చని అంచనా’ అని క్రిసిల్ రేటింగ్స్ సీనియర్ డైరెక్టర్ సుబోధ్ రాయ్ తెలిపారు. ఇప్పటికే డిమాండ్ పడిపోయి, వసూళ్లు తగ్గిపోవడం.. హాంకాంగ్‌లో రాజకీయ సంక్షోభం వంటి సమస్యలతో సతమతమవుతున్న వజ్రాల పరిశ్రమకు కోవిడ్19 మరో కొత్త సమస్యగా పరిణమించిందని పేర్కొన్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరం మధ్య భాగంలో గానీ పరిశ్రమ పరిస్థితి చక్కబడకపోవచ్చని చెప్పారు. -
కరోనా ఎఫెక్ట్ : రూ 8000 కోట్ల నష్టం
అహ్మదాబాద్ : చైనాలో కరోనా వైరస్ కలకలంతో సూరత్ డైమండ్ పరిశ్రమపై ప్రతికూల ప్రభావం పడింది. సూరత్ నుంచి వజ్రాలు ఎగుమతయ్యే హాంకాంగ్‌లో కరోనా వైరస్ నేపథ్యంలో ఎమర్జెన్సీ ప్రకటించడంతో రానున్న రెండు నెలల్లో ఇక్కడి డైమండ్ పరిశ్రమకు దాదాపు రూ 8000 కోట్ల మేర నష్టం వాటిల్లవచ్చనే ఆందోళన వ్యక్తమవుతోంది. కరోనా వ్యాప్తితో హాంకాంగ్‌లో మార్చి తొలివారం వరకూ స్కూల్స్, కాలేజీలను మూసివేశారు. మరోవైపు వైరస్ భయంతో వ్యాపారాలు కూడా తగ్గుముఖం పట్టాయని నిపుణులు చెబుతున్నారు. సూరత్ నుంచి హాంకాంగ్‌కు ఏటా రూ 50,000 కోట్ల విలువైన పాలిష్డ్ వజ్రాలు ఎగుమతవుతాయని, ఇక్కడి నుంచి డైమండ్ ఎగుమతుల్లో ఇవి 37 శాతమని జెమ్స్ అండ్ జ్యూవెలరీ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ ప్రాంతీయ చైర్మన్ దినేష్ నవదియా పేర్కొన్నారు. హాంకాంగ్‌లో నెలరోజుల పాటు సెలవులు ప్రకటించడంతో అక్కడి కార్యాలయాల్లో పనిచేస్తున్న గుజరాతీ వ్యాపారులు భారత్‌కు తిరిగి వస్తున్నారని చెప్పారు. హాంకాంగ్‌లో పరిస్థితి మెరుగుపడకుంటే సూరత్ డైమండ్ పరిశ్రమకు భారీ నష్టం వాటిల్లుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇక కరోనా వైరస్ కలకలంతో వచ్చే నెలలో హాంకాంగ్‌లో జరగనున్న అంతర్జాతీయ జ్యూవెలరీ ఎగ్జిబిషన్ రద్దయ్యే అవకాశం ఉందని, ఇదే జరిగితే సూరత్‌లో జ్యూవెలరీ వ్యాపారానికి భారీ షాక్ తప్పదని డైమండ్ వ్యాపారి ప్రవీణ్ నానావతి చెప్పుకొచ్చారు. చైనాకు ముఖద్వారంగా భావించే హాంకాంగ్‌లో ఇప్పటికే 18 మందికి కరోనా వైరస్ పాజిటివ్ కేసులు గుర్తించగా ఓ వ్యక్తి మరణించారని అధికారులు తెలిపారు. చదవండి : తిరగడానికి దెయ్యాలు కూడా భయపడతాయి.. -
సంక్షోభంలో డైమండ్ బిజినెస్
సాక్షి, గుజరాత్ : ఓ పక్క బంగారం ధరలు విపరీతంగా పెరిగిపోతుంటే మరోపక్క డైమండ్ పరిశ్రమ రాను రాను సంక్షోభంలో కూరుకుపోతోంది. మరోసారి మాంద్యం పరిస్థితులు, అటు పరిశ్రమను, ఇటు కార్మికులను చుట్టుముడుతోంది. ప్రధానంగా సూరత్‌లోని వజ్రాల పరిశ్రమ మాంద్యం కారణంగా అత్యంత ఘోరమైన దశలను ఎదుర్కొంటోంది. ఆభరణ పరిశ్రమ రంగంలో సూరత్ భారత దేశానికి మార్గదర్శిగా ఉన్న విషయం తెలిసిందే. ఆర్థిక మాంద్యానికి తోడు డైమండ్ వ్యాపారుల స్కాంలు బ్యాంకులను భయపెడుతున్నాయి. డైమండ్ కింగ్, నీరవ్ మోడీ, మెహుల్ చోక్సీ, జతిన్ మెహతాల కుంభకోణాల తరువాత బ్యాంకులు రుణాలు ఇవ్వడం లేదు. దీంతోపాటు నోట్ల రద్దు, జీఎస్టీ పరిశ్రమపై ప్రతికూలంగా ప్రభావితం చేశాయి. దీంతో డిమాండ్ తగ్గి భారీగా నష్టపోతున్న డైమండ్ వ్యాపారం దాదాపు మరణశయ్యపై కునారిల్లుతోంది. ఇప్పటికే ఉద్యోగాన్నికోల్పోయిన సూరత్ వజ్రాల కార్మికుడు సుభాష్ మన్సూరియా స్పందిస్తూ తాను ఉద్యోగం వదిలి రెండు నెలలయిందని తన కుటుంబాన్ని ఎలా పోషించాలో అర్థం కావట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గత ఆరు సంవత్సరాలుగా ఇదే రంగాన్ని నమ్ముకున్న తనకు ఇలాంటి పరిస్థితి వస్తుందని ఊహించలేదన్నారు. కనీసం తాను చేసిన పనికి సరైన వేతనం కూడా చెల్లించలేదని యూనియన్ల సహకారంతో తాను వేతనం పొందానని అన్నారు. ఇదంతా తమ దురదృష్టమని వాపోయారు. తేజస్ పటేల్ అనే మరో వజ్ర ఉద్యోగి మాట్లాడుతూ గత ఎనిమిది సంవత్సరాలుగా ఇదే రంగాన్ని నమ్ముకున్నానని అన్నారు. ప్రస్తుతం 18,000తో తన కుటుంబాన్ని పోషిస్తున్నానన్నారు. తాను పెద్దగా చదువుకోలేదని ఏ రంగంలో నైపుణ్యం లేదని భవిష్యత్ గురించి తలచుకుంటేనే భయమేస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. కార్మికులు సంఘటితం కాకపోవడం బాధాకరమని తమ హక్కుల గురించి పోరాడే వారే లేరని ఆవేదన వ్యక్తం చేశారు. గుజరాత్ రాష్ట్ర వ్యాప్తంగా 60 వేల మంది ఉపాది కోల్పోగా కేవలం సూరత్ నుంచే13వేల మంది ఉండడం గమనార్హం. గత జనవరినుంచి చాలా కంపెనీల యజమానులు ఉద్యోగులను, పని గంటలను తగ్గించుకుంటున్నాయని చెప్పారు. కఠిన పరీక్షలను ఎదుర్కొంటున్నాం నీరవ్ మోడీ, చోక్సీ, జతిన్ మెహతాల అవినీతి ఆరోపణల కారణంగానే బ్యాంకులు వజ్ర పరిశ్రమకు రుణాలు ఇవ్వట్లేదని శ్రేయాన్ బిజినెస్ పేర్కొంది. అందుకే వజ్ర వ్యాపారాన్ని వృద్థిలోకి తీసుకురావడమే లక్ష్యంగా మూడు రోజుల ఎగ్జిబిషన్‌ను నిర్వహించామని సూరత్ డైమండ్ అసోసియేషన్ వెల్లడించింది. ప్రస్తుత పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయని డైమండ్ వర్కర్స్ యూనియన్ ప్రెసిడెంట్ రన్మల్ జిలారియా తెలిపారు. ఇప్పటికే 900 మందికి పైగా ఉద్యోగాలు కోల్పాయన్నారు. కంపెనీలు కనీసం నోటీసులు ఇవ్వకుండా తొలగిస్తున్నాయన్నారు. ఉపాధి కోల్పోయిన వారి వివరాలను సేకరిస్తున్నామని, ప్రభుత్వమే తమ ఉద్యోగాలకు రక్షణ కల్పించాలని కోరారు. కాగా సూరత్‌లో భారీ, సూక్ష్మ స్థాయి పరిశ్రమలు వజ్రాల వ్యాపారంలో ప్రముఖంగా ఉండగా దాదాపు 6 లక్షల మందికిపైగా ఈ రంగంలో ఉపాధి పొందుతున్నారు. గత పదేళ్ళ కాలంలో రెండవసారి మాంద్యం ముప్పు ముంచుకొస్తుండడం ఆందోళన పుట్టిస్తోంది. 2017 దీపావళి తరువాత, అనేక వజ్రాల పరిశ్రమలు పనిచేయడం మానేశాయి. వాటిలో 40 శాతం మూతపడ్డాయి. 2018లో సుమారు 750 మంది ఉద్యోగులను తొలగించారు. గుజరాత్ డైమండ్ వర్కర్స్ యూనియన్ లెక్కల ప్రకారం, 2018లో 10 మందికి పైగా డైమండ్ ఆభరణాల చేతివృత్తులవారు ఉద్యోగం కోల్పోయిన తరువాత ఆత్మహత్య చేసుకున్నారు. -
సిబ్బందికి కార్లూ, డబుల్ బెడ్రూమ్ ఇళ్లు!
సూరత్‌కి చెందిన వజ్రాల సంస్థ దీపావళి నజరానా 491 ఫియట్ పుంటో కార్లు, 200 ఫ్లాట్లు, ఆభరణాలు అహ్మదాబాద్: వజ్రాల పరిశ్రమ సమస్యలు ఎలా ఉన్నా సూరత్‌కి చెందిన హరికృష్ణ ఎక్స్‌పోర్ట్స్ సంస్థలో పనిచేసే 1,200 మంది ఉద్యోగులు ఈసారి మాత్రం దీపావళిని మరింత ఘనంగా జరుపుకోనున్నారు. కంపెనీ ఏకంగా 491 ఫియట్ పుంటో కార్లు, 200 డబుల్ బెడ్రూమ్ ఇళ్లు.. ఇంకా ఆభరణాలు మొదలైనవి ఉద్యోగులకు పండుగ కానుకగా అందించింది. గడిచిన అయిదేళ్లుగా అత్యుత్తమ పనితీరు కనపర్చి, సంస్థ వృద్ధికి తోడ్పడిన ఉద్యోగులను ప్రోత్సహించే ఉద్దేశంతో వీటిని అందించినట్లు సంస్థ సీఎండీ సావ్జీ ఢోలకియా తెలిపారు. ఈ ప్రోత్సాహకాల విలువ దాదాపు రూ. 50 కోట్లు ఉంటుందని, తాము సాధారణంగానే దీపావళి సందర్భంలో ఇలాంటి బోనస్‌లు అందిస్తూనే ఉంటామని ఆయన వివరించారు. 1991లో ఏర్పాటైన హరికృష్ణ ఎక్స్‌పోర్ట్స్ వార్షిక టర్నోవరు రూ. 5,000 కోట్లు కాగా.. బెల్జియం, హాంకాంగ్, ఇంగ్లండ్ తదితర దేశాల్లో కంపెనీ కార్యకలాపాలు ఉన్నాయి. కంపెనీలో 6,000 మంది పైచిలుకు సిబ్బంది ఉండగా 1,200 మందే ప్రోత్సాహకాలకు అర్హత సాధించినట్లు ఢోలకియా వివరించారు.