సిబ్బందికి కార్లూ, డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు! | Surat diamond firm gifts 491 cars, 200 two-bedroom houses & jewellery to 1,200 staff | Sakshi
Sakshi News home page

సిబ్బందికి కార్లూ, డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు!

Published Tue, Oct 21 2014 3:33 AM | Last Updated on Sat, Sep 2 2017 3:10 PM

హరికృష్ణ ఎక్స్‌పోర్ట్స్ సంస్థ

హరికృష్ణ ఎక్స్‌పోర్ట్స్ సంస్థ

సూరత్‌కి చెందిన వజ్రాల సంస్థ  దీపావళి నజరానా
491 ఫియట్ పుంటో కార్లు, 200 ఫ్లాట్లు, ఆభరణాలు

 
అహ్మదాబాద్: వజ్రాల పరిశ్రమ సమస్యలు ఎలా ఉన్నా సూరత్‌కి చెందిన హరికృష్ణ ఎక్స్‌పోర్ట్స్ సంస్థలో పనిచేసే 1,200 మంది ఉద్యోగులు ఈసారి మాత్రం దీపావళిని మరింత ఘనంగా జరుపుకోనున్నారు. కంపెనీ ఏకంగా 491 ఫియట్ పుంటో కార్లు, 200 డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు.. ఇంకా ఆభరణాలు మొదలైనవి ఉద్యోగులకు పండుగ కానుకగా అందించింది. గడిచిన అయిదేళ్లుగా అత్యుత్తమ పనితీరు కనపర్చి, సంస్థ వృద్ధికి తోడ్పడిన ఉద్యోగులను ప్రోత్సహించే ఉద్దేశంతో వీటిని అందించినట్లు సంస్థ సీఎండీ సావ్‌జీ ఢోలకియా తెలిపారు.

ఈ ప్రోత్సాహకాల విలువ దాదాపు రూ. 50 కోట్లు ఉంటుందని, తాము సాధారణంగానే దీపావళి సందర్భంలో ఇలాంటి  బోనస్‌లు అందిస్తూనే ఉంటామని ఆయన వివరించారు. 1991లో ఏర్పాటైన హరికృష్ణ ఎక్స్‌పోర్ట్స్ వార్షిక టర్నోవరు రూ. 5,000 కోట్లు కాగా.. బెల్జియం, హాంకాంగ్, ఇంగ్లండ్ తదితర దేశాల్లో కంపెనీ కార్యకలాపాలు ఉన్నాయి. కంపెనీలో 6,000 మంది పైచిలుకు సిబ్బంది ఉండగా 1,200 మందే ప్రోత్సాహకాలకు అర్హత సాధించినట్లు ఢోలకియా వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement