సూరత్ అంటే ముందుగా అందరికి గుర్తొచ్చేది వజ్రాలే. ప్రపంచంలోని 90 శాతం వజ్రాలను సూరత్‌లోనే ప్రాసెస్ చేస్తారు. దీనికోసం ఇక్కడ ఏకంగా 5000 కంటే ఎక్కువ ప్రాసెస్ యూనిట్స్ ఉన్నాయి. ఇందులో సుమారు ఎనిమిది లక్షల మందికిపైగా పాలిషర్స్ ఉపాధి పొందుతున్నారు. అయితే గత కొన్నేళ్లుగా సూరత్‌లో వజ్రాల వ్యాపారం తీవ్రంగా దెబ్బతింది.
వజ్రాల వ్యాపారం దెబ్బతినడానికి కారణం
▸ఉక్రెయిన్, రష్యా యుద్ధం తరువాత యూరోపియన్ యూనియన్ దేశాలు, జీ7 దేశాలు దిగుమతులను నిషేధించడం.
▸కరోనా మహమ్మారి తరువాత విధించిన లాక్‌డౌన్ వల్ల ఎగుమతులు మందగించడం.
▸పాశ్చాత్య దేశాల నుంచి డిమాండ్ తగ్గిపోవడం, ఆర్ధిక వ్యవస్థలు మందగించడం.
▸ల్యాబ్‌లో తాయారు చేసిన వజ్రాలకు డిమాండ్ విపరీతంగా పెరిగిపోవడం. ఎందుకంటే సహజమైన వజ్రాల కంటే ల్యాబ్‌లో తయారైన వజ్రాల ధరలు కొంత తక్కువగానే ఉంటాయి. ఇది డైమండ్ మార్కెట్ మీద ప్రభావం చూపిస్తుంది.
కటింగ్, పాలిషింగ్ వంటి వాటికోసం 30 శాతం రఫ్ డైమండ్లను భారత్.. రష్యా నుంచి దిగుమతి చేసుకునేది. అయితే కరోనా, ఇతర కారణాల వల్ల చాలా దేశాలు ఆంక్షలు విధించాయి. దీంతో వజ్రాల వ్యాపారం మందగించిందని ఇండియన్ డైమండ్ ఇన్‌స్టిట్యూట్ ప్రెసిడెంట్ దినేష్ నవాడియా పేర్కొన్నారు.
ఆర్థిక మాంద్యం కారణంగా సుమారు వెయ్యి పాలిషింగ్ యూనిట్స్ మూతపడ్డాయి. దీంతో సుమారు రెండు లక్షలమంది ఉపాధి కోల్పోయారు. ఉపాధి కోల్పోవడంతో గత 16 నెలల్లో సుమారు 65 మంది ఆత్మహత్య చేసుకున్నట్లు, డైమండ్ పాలిషర్‌లకు ప్రాతినిధ్యం వహిస్తున్న స్టేట్ డైమండ్ వర్కర్స్ యూనియన్ నేతలు పేర్కొన్నారు. ఉద్యోగాలు కోల్పోయిన తరువాత.. ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోలేక, కుటుంబాలను పోషించలేకే ఈ ఆత్మహత్యలు చేసుకుంటున్నట్లు వెల్లడించారు.
ఇదీ చదవండి: అంబానీ చెప్పిన మూడు విషయాలు ఇవే..
బంగారం, వజ్రాల వ్యాపారం దేశ ఆర్ధిక వ్యవస్థ పెరగడానికి దోహదపడుతోంది. 2022లో ఈ వ్యాపారం దేశ జీడీపీ దాదాపు ఏడు శాతం దోహదపడింది. అయితే 2024 ఆర్ధిక సంవత్సరంలో రత్నాలు, ఆభరణాల ఎగుమతులు గణనీయంగా తగ్గాయి. ఈ ఎగుమతుల విలువ 1.87 లక్షల కోట్లు.
Comments
Please login to add a commentAdd a comment