diamonds
-
చేపల వేటకు వెళ్లినట్లుగా అక్కడ వజ్రాల వేటకు వెళ్తారు
‘కేజీఎఫ్’ సినిమాలలో బంగారం వేటలో ఎంతోమంది బక్క జీవుల జీవితాలు ఆవిరైపోతాయి. అయితే అది సినిమా. ‘పన్నా’ అనేది మాత్రం నిజం. ‘కేజీఎఫ్’లో పెద్ద విలన్లు పేదవాళ్లను బలవంతంగా బంగారు గనుల్లో దింపుతారు. అయితే మధ్యప్రదేశ్‌లోని పన్నాలో మాత్రం ఎంతోమంది పేదవాళ్లు స్వచ్ఛందగా వజ్రాల వేటలోకి దిగుతున్నారు. ఎంతమందిని అదృష్టం భుజం తట్టిందో తెలియదుగానీ దురదృష్టం మాత్రం వారి ఇంటి దగ్గర భద్రంగా ఉంటుంది....‘ఈరోజు నా భర్త శుభవార్తతో వస్తాడేమో’ అని భర్త రాక కోసం ఆసక్తిగా ఎదురుచూస్తుంటుంది భగవతి.‘మా అబ్బాయికి విలువైన వజ్రం దొరకాలి’ అని ముక్కోటి దేవతలను మొక్కుకుంటుంది సీమ. ‘ఎప్పుడూ మీరే కష్టపడతారా....నేను కూడా ఈరోజు మీతోపాటు వస్తాను’ అని భర్త, అత్తమామల తోపాటు వజ్రాల వేటకు వెళుతుంది ఆశ.మత్స్యకారులు రోజూ చేపల వేటకు వెళ్లినట్లు అక్కడి ప్రజలు వజ్రాల వేటకు వెళతారు!మధ్యప్రదేశ్‌లోని ‘పన్నా’ దేశంలోని అత్యంత వెనకబడిన ప్రాంతాలలో ఒకటి. నీటికొరత నుంచి నిరుద్యోగం వరకు ఎన్నో సమస్యలు ఉన్న ఈ ప్రాంతం పేదరికానికి పెట్టింది పేరు. పేదరికం మాట ఎలా ఉన్నా ఈ ప్రాంతం వజ్రాల నిల్వలకు నిలయంగా ప్రసిద్ధి ΄పొందింది.ఒకప్పుడు అరుదైన ఆవిష్కరణలకు ప్రసిద్ధి చెందిన పన్నాలోని వజ్రాల గనులు ఇప్పుడు శిథిలావస్థకు చేరుకున్నాయి. మితిమీరిన మైనింగ్ కారణంగా నిల్వలు క్షీణించాయి. అయినప్పటికీ ఆశావహ వ్యక్తులు వజ్రాల కోసం అన్వేషణ కొనసాగిస్తూనే ఉన్నారు. తెల్లవారు జామునే తవ్వకాలు మొదలుపెడతారు. సూర్యాస్తమయం వరకు వజ్రాల కోసం జల్లెడ పడుతూనే ఉంటారు. ఈ పనిలో ప్రతి కుటుంబానికి వారి కుటుంబసభ్యులు సహాయంగా ఉంటారు. ఇందులో మహిళలు కూడా ఉంటారు. చాలామందికి వజ్రాల వేట అనేది తరతరాల కుటుంబ సంప్రదాయం. ‘వజ్రాల గురించి వెదకని రోజు నేను అనారోగ్యానికి గురవుతాను. ఇదొక మత్తుమందులాంటిది’ అంటాడు 67 సంవత్సరాల ప్రకాశ్ శర్మ. నిజానికి ఇది ప్రకాష్ మాటే కాదు...ఆ ప్రాంతంలోని వేలాది మంది ఆశావహుల మనసులో మాట! చిన్న డౌట్: ‘పన్నా’పై సినిమా వాళ్ల దృష్టి ఎందుకుపడలేదో? ప్చ్..! (చదవండి: ఆ ఎయిర్పోర్ట్ ప్రయాణికులకు లామా థెరపీని అందిస్తుందట..!) -
హైదరాబాద్‌లో సంయుక్త మీనన్ డైమండ్ స్టోర్ ప్రారంభం (ఫొటోలు)
-
దాదాపు రూ. 100 కోట్లు.. లగ్జరీ అపార్ట్మెంట్ కొన్న వజ్రాల వ్యాపారి
దేశంలోని ఖరీదైన రియల్ ఎస్టేట్ మార్కెట్‌కు పెట్టింది పేరు ముంబై. ముఖ్యంగా వర్లీ ప్రాంతం అత్యంత ఖరీదైన సీ వ్యూ లగ్జరీ అపార్ట్మెంట్లకు ప్రసిద్ధి చెందింది. అనేక మంది వ్యాపార ప్రముఖలు, సెలబ్రిటీలు ఇక్కడ నివాసాలు కొనుగోలు చేస్తుంటారు. ప్రపంచంలో అతిపెద్ద వజ్రాల కంపెనీల్లో ఒకటైన కిరణ్ జెమ్స్ డైరెక్టర్ రాజేష్ లభుభాయ్ లఖానీ తాజాగా ఇక్కడ రూ.97 కోట్లు పెట్టి లగ్జరీ సీ వ్యూ అపార్ట్మెంట్ కొనుగోలు చేశారు.త్రీసిక్స్టీ వెస్ట్‌లోని సూపర్ ప్రీమియం రెసిడెన్షియల్ టవర్‌లో రాజేష్ లఖానీ కొనుగోలు చేసిన అపార్ట్మెంట్ 44వ అంతస్తులో ఉంది. దీని విస్తీర్ణం 14,911 చదరపు అడుగులు. ‘జాప్కీ’కి లభించిన పత్రాల ప్రకారం.. రాజేష్ లఖానీ ఈ అపార్ట్‌మెంట్‌ను మరో ఇద్దరు కుటుంబ సభ్యులతో కలిసి ఉమ్మడిగా కొనుగోలు చేశారు. దీనికి సంబంధించిన రిజిస్టేషన్ మే 29న జరగగా రూ.5.84 కోట్లు స్టాంప్ డ్యూటీ కింద చెల్లించినట్లు తెలుస్తోంది.కాగా ఏప్రిల్ నెలలో కిరణ్ జెమ్స్ మేనేజింగ్ డైరెక్టర్, ప్రమోటర్ మావ్జీభాయ్ పటేల్ ఇదే టవర్లోని 47వ అంతస్తులో రూ. 97 కోట్లు వెచ్చించి అపార్ట్మెంట్ కొనుగోలు చేశారు. త్రీసిక్స్టీ వెస్ట్ రెండు టవర్లుగా ఉంటుంది. ఒక దాంట్లో రిట్జ్-కార్ల్టన్ హోటల్ నిర్వహిస్తుండగా మరో టవర్‌లో లగ్జరీ నివాసాలను ఇదే సంస్థ నిర్వహిస్తోంది. ఇందులో ఏడు కార్ పార్కింగ్ స్లాట్లు సహా అత్యాధునిక విలాసవంతమైన సదుపాయాలు ఉన్నాయి. -
జొన్నగిరిలో రూ.1.75 లక్షల వజ్రం లభ్యం
తుగ్గలి: కర్నూలు జిల్లా తుగ్గలి మండలంలో పేదలను వజ్రాలు వరిస్తున్నాయి. జొన్నగిరిలో పొలాల్లోకి వెళ్లిన ఓ వ్యక్తికి మంగళవారం వజ్రం లభ్యమైనట్లు సమాచారం. ఈ వజ్రాన్ని రూ.1.75 లక్షలు, జత కమ్మలు ఇచ్చి ఓ వజ్రాల వ్యాపారి కొనుగోలు చేసినట్లు తెలిసింది. -
12 లక్షల విలువైన వజ్రాలు ఈ నెలలో 20 లభ్యం
-
వజ్ర సంకల్పం
కర్నూలు, అనంతపురం జిల్లాల సరిహద్దుల్లో వజ్రాల నిక్షేపాలు ఉన్నాయనే విషయాన్ని జియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జీఎస్ఐ) గుర్తించింది. కర్నూలు జిల్లా తుగ్గలి, మద్దికెర మండలాల్లోని తుగ్గలి, జొన్నగిరి, పగిడిరాయి, కొత్తపల్లి, పెరవలి, అగ్రహారం, హంప, యడవలి, మద్దికెరతోపాటు అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలంలోని గంజికుంట, తట్రకల్లు, రాగులపాడు, పొట్టిపాడు, కమలపాడు, గూళపాళ్యం, ఎన్ఎంపీ తండా గ్రామాల్లో తరచూ వజ్రాలు లభ్యమవుతున్నాయి. ఈ ప్రాంతంలోని భూమి పొరల్లో కింబర్లైట్ పైప్‌లైన్ ఉందని గనులు భూగర్భ శాఖ నిర్ధారించింది. ఈ నేపథ్యంలోనే తొలకరి జల్లులు కురిసే జూన్‌లో తుగ్గలి, మద్దికెర మండలాల్లో వజ్రాల అన్వేషణ కొన్నేళ్లుగా ముమ్మరంగా సాగుతోంది. ఈ ఏడాది మే మొదటి వారంలోనే వర్షాలు కురిశాయి. ఆ వెంటనే వజ్రాన్వేషణ మొదలైంది. ఇప్పటికే కొందరికి వజ్రాలు దొరికాయి కూడా. ఈ ప్రాంతంలోని పొలాలన్నీ జనంతోనే నిండిపోయాయి. కర్నూలు, నంద్యాలతో పాటు అనంతపురం, కడప, చిత్తూరు, గుంటూరు, కృష్ణా జిల్లాల నుంచి వజ్రాన్వేషకులు తరలివచ్చారు. ఒక్కొక్కరు వారం, పది, పదిహేను రోజులపాటు ఇక్కడే మకాం వేస్తున్నారు. ఓ వైపు వజ్రాల కోసం జనాలు పొలాల్లో తిరుగుతుంటే.. వజ్రాన్వేషకులు తిరగడం వల్ల పొలం గట్టిబారి వ్యవసాయానికి ఇబ్బందిగా ఉంటోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొందరు రైతులు తమ పొలాల్లోకి ఎవరూ రావొద్దని విజ్ఞప్తి బోర్డులు తగిలిస్తున్నారు. – సాక్షి ప్రతినిధి, కర్నూలువజ్రాలు ఎలా లభ్యమవుతాయంటే.. మన దేశంలో డైమండ్ మైనింగ్ మధ్యప్రదేశ్‌లోని పన్నాలో ఉంది. అక్కడ భూమిలోని రాళ్లను తవ్వితీసి వజ్రాల తయారీ ప్రక్రియ చేపడతారు. వజ్రకరూర్, తుగ్గలి, జొన్నగిరి ప్రాంతాల్లోని భూగర్భంలో 150 మీటర్ల లోతున వజ్రాలు ఉంటాయి. భూమిలో వాతావరణ మార్పులు జరిగినప్పుడు అవి బయటకు వస్తాయి. ఆ తర్వాత వెదరింగ్ (వికోశీకరణ) వల్ల అంటే ఎండకు ఎండి, వర్షానికి తడిసి పగిలిపోతాయి. వర్షాలు, వరదలు వచ్చినపుడు ఆ రాళ్ల ముక్కలు పొలాల్లో అక్కడక్కడా దొరుకుతుంటాయి. వాగులు, వంకల ద్వారా కూడా వజ్రాలు నీటిలో కొట్టుకుని ఇతర ప్రాంతాలకు చేరతాయి. అలా చెల్లాచెదురైన వజ్రాలే ఇప్పుడు కర్నూలు, అనంతపురం జిల్లాల్లో లభిస్తున్నాయి. ఇతర దేశాలతో పోలిస్తే నాణ్యమైన వజ్రాలు వజ్రాల మైనింగ్ కోసం వజ్రకరూర్‌లో వజ్రాల ప్రక్రమణ కేంద్రాన్ని 1969లో ఏర్పాటు చేశారు. వజ్రాన్వేషణపై ఇది పెద్దగా దృష్టి సారించలేదు. ఆ తర్వాత ఓ ఆ్రస్టేలియన్ కంపెనీ వచ్చి కొద్దికాలం పాటు సర్వే చేసి తిరిగి వెళ్లింది. ఆఫ్రికాతో పాటు చాలా దేశాలతో పోలిస్తే ఇక్కడి వజ్రాలు చాలా నాణ్యమైనవి, విలువైనవి. అందుకే వీటి వెలికితీతపై ప్రత్యేక దృష్టి సారిస్తే ప్రయోజనకరంగా ఉంటుందని పలువురు కోరుతున్నారు. ‘సీమ’లో ఏజెంట్ల తిష్ట వర్షాకాలం వస్తే జనాలు ఎలా తరలివస్తారో.. వజ్రాల వ్యాపారులు కూడా గుత్తి, గుంతకల్లు, జొన్నగిరి, పెరవలిలో మకాం వేసి వజ్రాల కొనుగోలుకు ప్రయత్నిస్తారు. ఇందుకోసం వజ్రాలు లభ్యమయ్యే గ్రామాల్లో ఏజెంట్లను సైతం నియమించుకుంటున్నారు. వజ్రం దొరికిందనే సమాచారం వస్తే ఏజెంట్లు వాలిపోతారు. వజ్రం దొరికిన వారిని వ్యాపారుల వద్దకు తీసుకెళ్లి రేటు కుదురుస్తారు. వజ్రం విలువైనదైతే వ్యాపారులే వారి వద్దకు వెళ్తారు. వ్యాపారుల మధ్య పోటీ పెరిగితే బహిరంగ వేలం వేస్తారు. వజ్రం నాణ్యత(క్యారెట్)ను బట్టి రూ.20 వేల నుంచి రూ.20 లక్షల వరకు కొనుగోలు చేస్తారు. జిల్లా చరిత్రలో 2022లో లభించిన 30 క్యారెట్ల వజ్రమే అత్యంత విలువైంది. ఈ ఏడాది ఇప్పటికే 9 వజ్రాలు లభ్యమయ్యాయి. గతేడాది సరైన వర్షాలు లేవు. అయినప్పటికీ 18 వజ్రాలు దొరికాయి. ఇక్కడ వజ్రాలను స్థానిక వ్యాపారులకే విక్రయిస్తారు. ఇక్కడి వ్యాపారులు అంత నమ్మకం సాధించారు. చెప్పిన ధర చెప్పినట్టు ఇస్తారు. అదే ప్రభుత్వ అధికారులకు సమాచారం ఇస్తే దానిని స్వా«దీనం చేసుకుని పైసా కూడా ఇవ్వరనే అభిప్రాయంతో వారు అధికారులకు చెప్పకుండా విక్రయిస్తారు. విదేశాల్లో ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు ఆఫ్రికా, అంగోలా, కాంగోతో పాటు చాలా దేశాల్లో ఇదే తరహాలో వజ్రాలు లభిస్తాయి. వాటిని అల్యూవియల్ డైమండ్స్ అంటారు. అక్కడ ప్రభుత్వమే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తుంది. వజ్రాలు లభించిన వారు నేరుగా ఆ కేంద్రానికి వచ్చి చూపిస్తారు. వజ్రాల నాణ్యత ఆధారంగా కొంత మొత్తం చెల్లిస్తారు. వజ్రాలను లీగల్‌గా ప్రభుత్వం ప్రక్రియను పూర్తి చేసి విక్రయిస్తుంది. కర్నూలు జిల్లాలో ఏటా సగటున 50–60 వజ్రాలు లభిస్తున్నాయి. అలాగే వజ్రకరూరు ప్రాంతంలో కూడా ఏటా 30–40 వజ్రాలు లభిస్తాయి. అంటే ఈ రెండు జిల్లాల్లో ఏటా వంద వజ్రాలు లభిస్తున్నాయి. మైనింగ్ చేస్తే రూ. వందల కోట్ల విలువైన సంపద ప్రభుత్వానికి లభించే అవకాశం ఉంది. వజ్రాన్ని గుర్తు పడతాం మాది కలికిరి. హైదరాబాద్‌లోని స్నేహితుడు, నేను కలిసి మూడు రోజుల క్రితం ఇక్కడికి వచ్చాం. దొరికితే వజ్రం. లేదంటే కాలక్షేపంగా ఉంటుందని వచ్చాం. మేం బంగారం నగలు తయారు చేస్తాం. వజ్రం ఎలా ఉంటుందో సులువుగా గుర్తుపడతాం. – రామాంజులాచారి, కలికిరి, అన్నమయ్య జిల్లా ఐదోసారి వచ్చా వానొస్తే మా ఊరోళ్లంతా రైలెక్కి గుత్తిలో దిగి జొన్నగిరికి వస్తాం. నేను ఇక్కడికి ఐదేళ్ల నుంచి వస్తున్నాను. వచ్చి వారమైంది. ఐదేళ్లలో ఒక్క వజ్రం కూడా దొరకలేదు. తిండీ తిప్పలకు ఇబ్బందిగా ఉంది. మాతో పాటు వచ్చిన కొంతమందికి వజ్రాలు దొరుకుతున్నాయి. మాకు ఆశ చావక వెతుకుతున్నాం. – ఈరయ్య, రామాపురం, వినుకొండ, పల్నాడు జిల్లా -
నల్లమలలో ఆశల వేట!
మహానంది: నల్లమల.. ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలకు, ప్రకృతి అందాలకు, చారిత్రక విశేషాలకు పెట్టింది పేరు. నంద్యాల నుంచి గిద్దలూరు వెళ్లే ఘాట్‌రోడ్డులో సర్వనరసింహ స్వామి ఆలయం ఎంతో ప్రసిద్ధి చెందింది. ఆలయానికి సమీపంలో ఉల్లెడ మల్లేశ్వరస్వామి ఆలయంతో పాటు వజ్రాల వంక ఉంది. వర్షాలు పడితే వంకలో వజ్రాలు దొరుకుతుంటాయని ప్రజల నమ్మకం. దీంతో కర్నూలు, కడప, అనంతపురం, చిత్తూరు జిల్లాలతో పాటు గుంటూరు, పల్నాడు, ప్రకాశం జిల్లాల నుంచి వందలాది మంది ప్రజలు తమ అదృష్టాన్ని పరిక్షించుకునేందుకు ఇక్కడికి వస్తున్నారు. తాజాగా వర్షాలు పడుతుండటంతో వజ్రాన్వేషణ సాగుతోంది. విలువైన రాళ్లతో ఆదాయం వజ్రాలు దొరుకుతున్నాయని వస్తున్న వారికి పలు రకాల రంగురాళ్లు దొరుకుతున్నాయి. రంగు రాయి నాణ్యతను బట్టి రూ. 20 వేల నుంచి రూ. లక్ష వరకు వస్తుందని పలువురు చెబుతున్నారు. వారం రోజుల క్రితం గుంటూరు జిల్లాకు చెందిన ఇద్దరికి రూ. లక్ష విలువైన వజ్రాలు దొరికాయని స్థానికులు చెప్పారు. దీంతో ఇక్కడికి వచ్చిన వారు ఉదయం నుంచి చీకటి పడేవరకు వజ్రాన్వేషణ చేసి అనంతరం దగ్గరలోని ఆంజనేయపురం గ్రామం వద్ద ఉన్న ఆంజనేయస్వామి ఆలయం వద్ద రాత్రి వేళల్లో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఇటీవల వర్షాలు కురవడంతో వజ్రాన్వేషణ కోసం వస్తున్నవారి సంఖ్య గణనీయంగా పెరిగింది. -
కర్నూల్ లో వజ్రాల వేట
-
వాన పడింది..వజ్రాల వేట షురూ..
-
47వ అంతస్తు.. రూ.97 కోట్లు! ఖరీదైన ఫ్లాట్ కొన్న వజ్రాల వ్యాపారి
దేశంలోనే అత్యంత ఖరీదైన రియల్ ఎస్టేట్ మార్కెట్‌గా పేరున్న ముంబై నగరంలో కోట్లాది రూపాయలు పెట్టి భవంతులు, ఫ్లాట్లు కొనుగోలు చేస్తున్న ప్రముఖుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా ఓ వజ్రాల వ్యాపారి సుమారు రూ.97 కోట్లు పెట్టి ఫ్లాట్‌ను కొనుగోలు చేశారు.రియల్ఎస్టేట్ సమాచార సంస్థ జాప్కీకి లభించిన పత్రాల ప్రకారం.. డైమండ్ కంపెనీ కిరణ్ జెమ్స్ ప్రమోటర్ మావ్జీభాయ్ షామ్‌జీభాయ్ పటేల్ ముంబైలోని పోష్ ఒబెరాయ్ 360 వెస్ట్‌లో రూ. 97.4 కోట్లతో అపార్ట్‌మెంట్‌ను కొనుగోలు చేశారు. వర్లీలో ఉన్న ఈ అపార్ట్మెంట్ భవనాన్ని ముంబైలోని అత్యంత ఖరీదైన రియల్ ఎస్టేట్‌లో ఒకటిగా పరిగణిస్తారు.అపార్ట్మెంట్ భవనంలోని 47వ అంతస్తులో మావ్జీభాయ్ కొన్న ఫ్లాట్ 14,911 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. ఈ విస్తీర్ణాన్ని మరో 884 చదరపు అడుగులు విస్తరించుకునేందుకు అవకాశం ఉంటుంది. పత్రాల ప్రకారం.. దీని విక్రేత ఒయాసిస్ రియాల్టీ భాగస్వామి అయిన స్కైలార్క్ బిల్డ్‌కాన్ ప్రైవేట్ లిమిటెడ్. ఈ అపార్ట్మెంట్ తొమ్మిది కార్ పార్కింగ్ స్లాట్లతో వస్తుంది. సేల్ డీడ్ ఏప్రిల్ 29న జరిగినట్లు తెలుస్తోంది. ఈ లావాదేవీపై పటేల్ రూ.5.8 కోట్ల స్టాంప్ డ్యూటీ చెల్లించారు.ముంబైలోని 360 వెస్ట్ ప్రాజెక్ట్ 4 బీహెచ్‌కే, 5 బీహెచ్‌కే యూనిట్లను కలిగి ఉంటుంది. రెండు టవర్లుగా ఉండే ఈ భవనంలో ఒక దాంట్లో రిట్జ్-కార్ల్టన్ హోటల్ ఉండగా మరో టవర్‌లో విలాసవంతమైన నివాసాలు ఉన్నాయి. వీటిని గ్లోబల్ హాస్పిటాలిటీ చైన్ నిర్వహిస్తోంది. సముద్ర వీక్షణ ప్రాజెక్ట్ అయిన దీని ఎత్తు 360 మీటర్లు ఉండటం, అన్ని అపార్ట్మెంట్లు పడమర వైపు ఉన్నందున దీనికి ఈ పేరు వచ్చింది. -
గర్ల్ ఫ్రెండ్‌కో డైమండ్.. మీకో గుడ్ న్యూస్..!
సహజ వజ్రాలు భూగర్భంలో తీవ్ర ఒత్తిడి, ఉష్ణోగ్రతలలో ఏర్పడటానికి వందల, లక్షల ఏళ్లు పడుతుంది. ఇటీవలి కాలంలో బాగా పాపులర్ అయిన సింథటిక్ వజ్రాలు కొన్ని వారాల్లో తయారు చేయవచ్చు. ఇపుడిక కొన్ని నిమిషాల్లోనే తయారు చేయవచ్చు. ఎక్కడ? ఎలా అంటారా. అయితే మీరీ కథనం చదవాల్సిందే.!వజ్రాలు.. డైమండ్స్.. పేరు చెబితేనే ఖరీదైన వ్యవహారం అని అనుకుంటాం. జేమ్స్ బాండ్ మూవీ టైటిల్ ట్రాక్ ‘‘డైమండ్స్ ఆర్ ఫరెవర్’’ లో చెప్పినట్టు వజ్రాలు శాశ్వతం. అందుకే తమ ప్రేమ కలకలం నివాలని ప్రేమికులు డైమండ్ రింగులను ఇచ్చి పుచ్చుకోవడం ఫ్యాషన్. కానీ గుడ్ న్యూస్ ఏమిటంటే కేవలం కొన్ని నిమిషాల వ్యవధిలోనే తయారైన వజ్రాలు ఫ్యాషన్ మార్కెట్లలోకి రాబోతున్నాయి. దక్షిణ కొరియాలోని ఇన్స్టిట్యూట్ ఫర్ బేసిక్ సైన్స్ పరిశోధకుల బృందం డైమండ్స్ తయారీలో ఒక వినూత్న విధానాన్ని కొనుగొంది. దీంతో సింథటిక్ వజ్రాల ఉత్పత్తిలో గణనీయమైన మార్పురానుందని, సరసమైన ధరల్లో డైమండ్స్ అందుబాటులోకి రానున్నాయని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. భూమి పొరల్లో కొన్ని లక్షల సంవత్సరాలపాటు అత్యధిక ఉష్ణోగ్రత, పీడనానికి గురై కార్బన్ అణువులు ఘనీభవించడం వల్ల ఏర్పడుతుంది. అయితే ల్యాబ్‌లో వజ్రాల తయారీకి కూడా కొంత సమయం ఎక్కువ పడుతుంది. కానీ పరిశోధకులు కేవలం 150 నిమిషాల్లో వజ్రాలను తయారు చేసే ప్రక్రియను గుర్తించారు. ప్రత్యేకమైన ద్రవ లోహ మిశ్రమంతో కేవలం 150 నిమిషాల్లోనే వజ్రాలను తయారు చేసే పద్ధతిని రూపొందించారు. అది కూడా సాధారణ వాతావరణ పీడనంతోనే వాటిని తయారు చేయడం విశేషం.అయితే వజ్రాలకోసం కార్బన్‌ను ద్రవ లోహంలో కరిగించడం కొత్తదేమీ కాదు. కరిగిన ఇనుము సల్ఫైడ్ను ఉపయోగించే ప్రక్రియను 50 ఏళ్ల క్రితమే జనరల్ ఎలక్ట్రిక్ అభివృద్ధి చేసింది. అయితే ఇందుకోసం భారీ పీడనాన్ని ఉపయోగించాల్సి వచ్చేది. కొత్త విధానంలో గేలియం, ఐరన్, నికెల్, సిలికాన్ లను మీథేన్, హైడ్రోజన్ వాయువులతో కలిపి వ్యాక్యూమ్ చాంబర్ లో అత్యంత వేగంగా వేడి చేస్తారు. దీనివల్ల కార్బన్ అణువులు ద్రవ లోహంలో పారదర్శక స్పటికాలుగా మారి తరువాత డైమండ్ సీడ్స్ తయారవుతాయి. అలా మొత్తంగా 150 నిమిషాలకు వజ్రం ముక్కలు ఏర్పడతాయి. ఈ కొత్త పద్ధతి ద్వారా పారిశ్రామిక అవసరాల కోసం వజ్రాల ఉత్పత్తిని పెంచేందుకు ఉపయోగ పడుతుందని పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు. ఈ పరిశోధన వివరాలను నేచర్‌లో ప్రచురించారు. -
నూడుల్స్‌లో డైమండ్స్ : ఏం తెలివితేటలు రా అయ్యా!
బంగారం, విలువైన వజ్రాలను అక్రమంగా రవాణా చేసేందుకు కేటుగాళ్లు అనుసరిస్తున్న పద్దతులు అధికారులను సైతం విస్మయపరుస్తున్నాయి. కానీ చివరకుఅధికారుల తనిఖీల్లో అడ్డంగా దొరికి పోతున్నారు. తాజాగా ముంబై విమానాశ్రయంలో కస్టమ్స్ డిపార్ట్మెంట్ కోట్లరూపాయల విలువైన వజ్రాలను, బంగారాన్ని స్వాధీనం చేసుకుంది. ముఖ్యంగా నూడుల్స్ ప్యాకెట్లలో డైమండ్స్ దాచిన తీరు హాట్ టాపిక్‌గా నిలిచింది. ముంబైనుంచి బ్యాంకాక్‌కు వెళ్తున్న భారతీయుడు ట్రాలీ బ్యాగ్‌లో నూడుల్స్ ప్యాకెట్లో డైమండ్లను తరలిస్తూ గుట్టుగా అధికారుల కన్నుగప్పాలని చేశాడు. కానీ తనిఖీల్లో అడ్డంగా బుక్కయ్యాడు. రూ.2.02 కోట్ల విలువైన 254.71 క్యారెట్ల నేచురల్ లూజ్ డైమండ్, 977.98 క్యారెట్ ల్యాబ్ గ్రోన్ డైమండ్ లభ్యమయ్యాయి.మరో ఘటనలో కొలంబో నుండి ముంబైకి ప్రయాణిస్తున్న ఒక విదేశీ మహిళను తనిఖీ చేయగా ఆమె లోదుస్తుల లోపల దాచిన 24 క్యారెట్ల గోల్డ్ బిస్కట్లు కనుగొన్నారు. వీటి మొత్తం బరువు 321గ్రాములు. మరో వైపు ఫేస్ మాస్క్‌లోనూ డైమండ్స్ తరలిస్తున్నట్లు గుర్తించారు. దుబాయ్ నుంచి ఇద్దరు, అబుదాబి ఇద్దరు, బహ్రెయిన్ ఇద్దరు, దోహానుఎంచి ఇద్దరు రియాద్ ఇద్దరు మస్కట్ బ్యాంకాక్ ,సింగపూర్ నుంచి ఒక్కొక్కరు చొప్పున 10 మంది అనుమానితులను తనిఖీ చేయగా, రెక్టమ్, ఇతర శరీర భాగాల్లో దాచిన రూ.4.04 కోట్ల విలువైన 6.199 కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నారు. మొత్తం గా 13 వేర్వేరు కేసుల్లో రూ.6.46 కోట్ల విలువైన అక్రమ రవాణా బంగారం, డైమండ్స్,తదితరాలను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అరెస్ట్ చేశారు.During 19-21 April, 2024, Airport Commissionerate, Mumbai Customs Zone-III seized over 6.815 Kg Gold valued at Rs. 4.44 Cr & Diamonds valued at Rs. 2.02 Cr total amounting to Rs. 6.46 Cr across 13 cases. Diamonds were found concealed in noodle packets. Four pax were arrested. pic.twitter.com/j5wAPV5jAk— Mumbai Customs-III (@mumbaicus3) April 22, 2024#WATCH | Maharashtra: During 19-21 April, 2024, Mumbai Customs seized over 6.815 Kg of gold valued at Rs 4.44 crores and diamonds valued at Rs 2.02 crores, total amounting to Rs 6.46 crores across 13 cases. Diamonds were found concealed in noodle packets. Four Passengers were… pic.twitter.com/02LzDS1aDZ— ANI (@ANI) April 22, 2024 -
రూ.10 కోట్ల వజ్రాలు రూ.3 కోట్లకే
దొడ్డబళ్లాపురం: రూ.10 కోట్ల విలువైన వజ్రాలను రూ.3 కోట్లకే ఇస్తామని నమ్మించి వ్యాపారిని మోసం చేయడానికి యత్నించిన నలుగురిని బెంగళూరు కెంపేగౌడ విమానాశ్రయం పోలీసులు అరెస్టు చేసారు. రవి, నవీన్‌కుమార్, అహ్మద్, అబ్దుల్ దస్తగిరి పట్టుబడ్డ నిందితులు. లక్ష్మినారాయణ అనే వజ్రాల వ్యాపారికి వాట్సాప్ కాల్ చేసి పై విధంగా ప్రలోభపెట్టారు. డీల్ కుదుర్చుకోవడానికి నిందితులు, వ్యాపారి ఎయిర్‌పోర్టు వద్ద తాజ్ హోటల్లో కలిశారు. వ్యాపారి ఆ వజ్రాలను పరిశీలించగా అవి నకిలీవని తెలిసింది. దీంతో ఎయిర్‌పోర్టు పోలీసులకు సమాచారం ఇవ్వగా నిందితులను అరెస్టు చేసి నకిలీ వజ్రాలను సీజ్ చేశారు. -
అతిపెద్ద గొయ్యి.. ఇక్కడ తవ్వే కొద్ది వజ్రాలు!
తూర్పు సెర్బియాలో ఉన్న వజ్రాల గని ఇది. భూమ్మీద అతిపెద్ద గోతుల్లో ఒకటిగా ఇది రికార్డులకెక్కింది. దీని వ్యాసం 1200 మీటర్లు, లోతు 525 మీటర్లు. తొలిసారిగా ఈ ప్రాంతంలో వజ్రాల నిక్షేపాలు ఉన్నట్లు 1955లో నాటి సోవియట్ భూగర్భ శాస్త్రవేత్త యూరీ ఖబార్దిన్ గుర్తించారు. వజ్రాలను వెలికి తీసేందుకు అప్పటి సోవియట్ ప్రభుత్వం 1957లో ఇక్కడ మిర్నీ మైన్ పేరిట గనిని ప్రారంభించింది. ఈ గని నుంచి ఏకధాటిగా 2001 వరకు వజ్రాల వెలికితీత కొనసాగింది. తర్వాత కొన్నాళ్లు ఇది మూతబడింది. ఇది రష్యన్ వజ్రాల కంపెనీ ‘ఎయిరోసా’ చేతుల్లోకి వెళ్లడంతో 2009 నుంచి మళ్లీ వజ్రాల వెలికితీత కొనసాగుతోంది. ఇక్కడ వజ్రాల గని ప్రారంభమైన నాటి నుంచి నేటి వరకు ఏటా సగటున కోటి కేరట్ల (రెండువేల కిలోలు) వజ్రాల వెలికితీత జరిగినట్లు రికార్డులు చెబుతున్నాయి. మరో నలబై ఏళ్లకు పైగా ఇక్కడి నుంచి వజ్రాలను వెలికితీసే అవకాశాలు ఉన్నాయని ఎయిరోసా కంపెనీ భావిస్తోంది. -
ఒకే రోజు రూ.78 కోట్ల జప్తు
సాక్షి, హైదరాబాద్: శాసనసభ సాధారణ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులు గురువారం రికార్డు స్థాయిలో రూ.78.03 కోట్లు విలువ చేసే నగదు, మద్యం, ఇతర వస్తువులను జప్తు చేశారు. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో జప్తు చేసిన నగదు, ఇతర వస్తువుల మొత్తం విలువ రూ.243.76 కోట్లకు పెరిగిపోయింది. కాగా, ఇప్పటి వరకు స్వాధీనం చేసుకున్న మొత్తం నగదు రూ.87.92 కోట్లు. ఒక్క రోజు 6వేల లీటర్ల మద్యం జప్తు తాజాగా రూ.1.21 కోట్లు విలువ చేసే 6132 లీటర్ల మద్యం జప్తు చేశారు. దీంతో ఈ నెల 9 నుంచి ఇప్పటి వరకు జప్తు చేసిన మొత్తం మద్యం 65,223 లీటర్లు కాగా, దీని విలువ రూ.10.21 కోట్లు. గురువారం రూ.16.77లక్షలు విలువ చేసే 103.165 కిలోల గంజాయి స్వాధీనం చేసుకోగా, ఇప్పటి వరకు స్వాధీనం చేసుకున్న గంజాయి 2950 కిలోలకు పెరిగింది. దీని విలువ రూ.7.72 కోట్లు. ఇప్పటి వరకు మరో రూ.7.72 కోట్లు విలువ చేసే ఇతర మత్తు పదార్థాలను జప్తు చేశారు. గురువారం రూ.57.67 కోట్లు విలువ చేసే బంగారం, వెండి, ఇతర వస్తువులు పట్టుకున్నారు. 83కిలోల బంగారం పట్టివేత అందులో 83.046 కిలోల బంగారం, 212 కిలోల వెండి, 112.195 క్యారట్ల వజ్రాలు, 5.35 గ్రాముల ప్లాటినం ఉంది. దీంతో ఇప్పటి వరకు పట్టుబడిన బంగారం, వెండి, ఇతర విలువైన వస్తువుల విలువ రూ.120.40 కోట్లకు ఎగబాకింది. ఇందులో 181 కిలోల బంగారం, 693కిలోల వెండి, 154.45 క్యారెట్ల వజ్రాలున్నాయి. గురువారం రూ.8.84 కోట్లు విలువ చేసే ల్యాప్‌టాప్‌లు, వాహనాలు, కుక్కర్లు, చీరలు, క్రీడా సామగ్రి తదితర వస్తువులను పట్టుకున్నారు. దీంతో ఇప్పటి వరకు పట్టుబడిన ఇలాంటి వస్తువుల విలువ రూ.17.84 కోట్లకు చేరింది. హైవేపై రూ.750 కోట్ల నగదు కలకలం అలంపూర్: జోగుళాంబ గద్వాల జిల్లా సరిహద్దులోని 44వ జాతీయ రహదారిపై ఏకంగా రూ.750 కోట్ల నగదు పట్టుబడినట్లు సామాజిక మాధ్యమాల్లో గురువారం వైరల్ అయింది. దీంతో జిల్లా ఎన్నికల అధికారి వల్లూరు క్రాంతి ఈ ఘటనకు సంబంధించిన వివరాలను ఓ ప్రకటనలో వెల్లడించారు. ’’రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా ఆదేశాల మేరకు కేరళ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి హైదరాబాద్ యూబీఐకి నగదును బదిలీ చేస్తున్నట్టు మంగళవారం రాత్రి సమాచారం వచ్చింది. ఈ మేరకు జిల్లా నుంచి ఆర్డీఓ, లీడ్ బ్యాంక్ మేనేజర్, డీఎస్పీ అధికారులు విచారణ చేసేందుకు స్పాట్‌కు వెళ్లి, నగదుకు సంబంధించిన పత్రాలను పరిశీలించారు. ఆ తర్వాత పోలీస్ ఎస్కార్ట్‌తో నగదును హైదరాబాద్‌లోని యూబీఐకి చేరినట్లు నిర్ధారణ చేసుకున్నాము’’’ అని క్రాంతి ఆ ప్రకటనలో వివరించారు. అయితే ఎంత మేరకు నగదు ఉందనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. -
అరుదైన పెన్ను రూ.66.6 కోట్లు! ప్రపంచంలో అత్యంత ఖరీదైన కలం ఇదే..
World's most expensive pen: ప్రపంచ వ్యాప్తంగా అరుదైన వస్తువులను వేలం వేస్తుంటారు. ఆయా వస్తువులు కోట్లాది రూపాయలు పలకడం గురించి వింటుంటాం. ఇలాగే ఓ అరుదైన పెన్నును వేలం వేయగా 8 మిలియన్ డాలర్లు (రూ.66.6 కోట్లు) పలికింది. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైనదిగా నిలిచింది. టిబాల్డి కంపెనీ తయారు చేసిన ఈ పెన్ను పేరు ‘ఫుల్గోర్ నోక్టర్నస్’. ఇది లాటిన్ పేరు. దీనికి అర్థం నైట్ గ్లో. నల్ల వజ్రాలు పొదిగిన ఈ అసాధారణ ఫౌంటెన్ పెన్‌కి ఇది సముచితమైన పేరు. 123 కెంపులు, 945 నల్ల వజ్రాలు, బంగారం అసాధారణమైన ఫుల్గోర్ నోక్టర్నస్ పెన్ నిర్మాణం, డిజైన్ ఫై రేషియోలో ఉంటాయి. దీన్ని దైవిక నిష్పత్తిగా పేర్కొంటారు. ఫుల్గోర్ నోక్టర్నస్ బాడీ, క్యాప్‌పై నల్ల వజ్రాలు విలాసంగా పొదిగి ఉంటాయి. అలాగే అద్భుతమైన బ్లడ్ రెడ్ కెంపులు పెన్ను క్యాప్‌ని అలంకరించి ఉంటాయి. మొత్తంగా ఇందులో 945 నల్ల వజ్రాలు, 123 కెంపులు పొదిగారు. 18-క్యారెట్ల బంగారంతో దాని నిబ్‌ను తయారు చేశారు. అత్యంత ఖరీదైన పెన్ను ఈ పెన్నును ప్రత్యేక ఉంచేది దాని దైవిక ఫై నిష్పత్తి. ఈ పెన్నును క్యాప్తొ మూసేసినప్పుడు అవి 1.618 ఫై నిష్పత్తిలో ఉంటాయి. ఇలాంటి పెన్ను మరొకటి లేదు. 2020లో ఫుల్గోర్ నోక్టర్నస్ పెన్ను షాంఘైలో వేలం వేయగా అది 8 మిలియన్ డాలర్లు పలికింది. ఇంతవరకూ ఏ పెన్ను కూడా ఈ స్థాయిలో ధర పలకలేదు. దీంతో ఇదే ప్రపంచ అత్యంత ఖరీదైన పెన్నుగా నిలిచింది. ఇదీ చదవండి: Dr Ranjan Pai: నాడు అద్దె ఇల్లు.. నేడు 6 యూనివర్సిటీలు, 28 ఆస్పత్రులు -
రూ .50 కోట్ల విస్కీ బాటిల్
ఇది ప్రపంచంలోకెల్లా అత్యంత ఖరీదైన మద్యం సీసా! ఆ ఏముందిలే... మహా అయితే దీని ధర రూ. వేలల్లోనో లేదా ఇంకా ఎక్కువనుకుంటే రూ. కొన్ని లక్షలు ఉండొచ్చనుకుంటున్నారా? అయితే మీరు పొరబడ్డట్లే..!! ఎందుకంటే దీని ధర ఏకంగా రూ .50 కోట్లపైనే!! ఈ సీసాను 8,500 వజ్రాలు, 300 కెంపులతో పొదగడంతోపాటు వైట్ గోల్డ్‌తో మెరుగులు దిద్దారు. యూకేకు చెందిన ద లగ్జరీ బెవరేజ్ కంపెనీ... ఇసబెల్లా ఐలా ఒరిజినల్ విస్కీ పేరుతో ప్రీమియం సింగిల్ మాల్ట్ విస్కీని ఈ సీసాలో విక్రయిస్తోంది. పైగా దీన్ని ఓ అందమైన చిన్న పెట్టెలో భద్రపరిచి కొనుగోలుదారులకు అందిస్తోంది. -
వేగా శ్రీ రెండో వార్షికోత్సవం గోల్డ్ అండ్ డైమండ్స్ స్పెషల్ కలెక్షన్స్ (ఫోటోలు)
-
కట్, పాలిష్డ్ వజ్రాల ఎగుమతుల్లో క్షీణత
ముంబై: కట్, పాలిష్డ్ వజ్రాల (సీపీడీ) ఎగుమతులు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 22 శాతం తగ్గి 17.2 బిలియన్ డాలర్లుగా (రూ.1.42 లక్షల కోట్లు) ఉండొచ్చని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా అంచనా వేసింది. అమెరికా, యూరప్ వంటి కీలక వినియోగ ప్రాంతాల్లో ద్రవ్యోల్బణం ప్రభావంతో డిమాండ్ తగ్గిన విషయాన్ని ప్రస్తావించింది. ‘‘2022–23 ద్వితీయ ఆరు నెలల నుంచి సీపీడీల ఎగుమతులు క్రమంగా క్షీణిస్తూ వస్తున్నాయి. ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి ఐదు నెలల కాలంలో చూసినా (ఏప్రిల్–ఆగస్ట్) ఎగుమతులు 31 శాతం తక్కువగా నమోదయ్యాయి’’ అని ఇక్రా నివేదిక వెల్లడించింది. పండుగల సీజన్ నేపథ్యంలో రానున్న నెలల్లో ఎగుమతులు సీక్వెన్షియల్‌గా (క్రితం నెలతో పోలి్చనప్పుడు) పెరగొచ్చని పేర్కొంది. మొత్తం మీద పూర్తి ఆర్థిక సంవత్సరానికి 22 శాతం తక్కువగా నమోదు అవుతాయని తెలిపింది. ఈ రంగం అవుట్‌లుక్‌ను స్థిరత్వం నుంచి నెగెటివ్‌కు మార్చింది. ‘‘ప్రపంచవ్యాప్తంగా డైమండ్ల డిమాండ్‌లో చైనా వాటా 10–15 శాతంగా ఉంటుంది. చైనా మార్కెట్లో ఈ డిమాండ్ ఇంకా చెప్పుకోతగినంతగా పుంజుకోలేదు‘‘అని ఇక్రా వైస్ ప్రెసిడెంట్ సాక్షి సునేజా తెలిపారు. సహజ వజ్రాలతో పోలిస్తే ల్యాబ్‌లో తయారైన వజ్రాలు చాలా తక్కువ ధరలో లభిస్తుండడం కూడా అధిక పోటీకి కారణమవుతున్నట్టు చెప్పారు. గరిష్ట స్థాయిలో ముడి వజ్రాల ధరలు ముడి వజ్రాల ధరలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో గరిష్ట స్థాయిలోనే కొనసాగుతాయని ఇక్రా నివేదిక అంచనా వేసింది. ప్రస్తుత ధరలు 15 ఏళ్ల మధ్యస్థ స్థాయిలో ఉన్నాయని తెలిపింది. కరోనా తర్వాత ఒక్కసారిగా పెరిగిన డిమాండ్, మైనింగ్ కంపెనీల నుంచి సరఫరా తగ్గడం వల్లే గడిచిన రెండేళ్ల కాలంలో ధరలు పెరగడానికి దారితీసినట్టు వివరించింది. ప్రస్తుతం డిమాండ్ తగ్గినప్పటికీ రష్యా నుంచి ముడి వజ్రాల సరఫరా తగ్గడంతో ధరలు గరిష్ట స్థాయిలోనే కొనసాగుతున్నట్టు పేర్కొంది. రష్యాకు చెందిన అల్రోసా పీజేఎస్సీ మైనింగ్ సంస్థపై అమెరికా ఆంక్షలు విధించిన విషయాన్ని గుర్తు చేసింది. అదే సమయంలో ఇతర మైనింగ్ సంస్థల నుంచి అదనపు సరఫరా రాకపోవడం ధరలకు రెక్కలు వచి్చనట్టు వివరించింది. పాలిష్డ్ వజ్రాల ధరలపై ఒత్తిడి ఉన్నట్టు తెలిపింది. 15 ఏళ్ల మధ్యస్థ స్థాయి కంటే 15–20 శాతం తక్కువగా ఉన్నట్టు తెలిపింది. దీనికి తోడు డిమాండ్‌పై ఒత్తిళ్లు, కస్టమర్లకు ధరల పెంపును బదిలీ చేసే సామర్థ్యం తక్కువగా ఉండడంతో, వజ్రాల కంపెనీల లాభాల మార్జిన్లు 0.4 శాతం వరకు తగ్గిపోవచ్చని అంచనా వేసింది. నిల్వలు కూడా పెరుగుతాయని పేర్కొంది. ఎగుమతిదారులకు వెసులుబాటు 2024 జూన్ వరకూ ఆర్ఓడీటీఈపీ స్కీమ్ వర్తింపు ఎగుమతిదారుల ప్రయోజనాలకు ఉద్దేశించిన ఆర్ఓడీటీఈపీ స్కీమ్ (స్కీమ్ ఫర్ రెమిషన్ ఆఫ్ డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ ఆన్ ఎక్స్‌పోర్టెడ్ ప్రొడక్ట్స్) పథకాన్ని 2024 జూన్ వరకూ పొడిగిస్తూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. 2021 సెపె్టంబర్ నుంచి ఈ పథకం అమల్లో ఉంది. ఈ నెలతో ముగియనుంది. ప్రస్తుతం, 10,342 పైగా ఎగుమతి వస్తువులు ఈ పథక ప్రయోజనాల కిందకు వస్తున్నాయి. ఎగుమతి చేసిన ఉత్పత్తులపై సుంకాలు, పన్నుల ఉపశమన పథకం ఇది. వస్తువుల తయారీ– పంపిణీ ప్రక్రియలో ఎగుమతిదారులు చెల్లించే పన్నులు, సుంకాలు, లెవీల వాపసు కోసం ఉద్దేశించినది. ప్రస్తుత అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి పరిస్థితుల్లో ఎగుమతిదారులకు కేంద్రం తాజా నిర్ణయం ఊరటనివ్వనుందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. -
నడిరోడ్డుపై ఖరీదైన డైమండ్లు, ఎగబడిన జనం: అదిరిపోయే ట్విస్ట్
డైమండ్ సిటీ సూరత్ డైమండ్ బిజినెస్‌కు పెట్టింది పేరని అందరికీ తెలుసు. అయితే తాజాగా సూరత్‌లో ఒక వ్యాపారి కోట్ల విలువైన డైమండ్లున్న ఒక వీడియో పోగొట్టు కున్నాడని వార్త వైరల్ అయింది. దీంతో డైమండ్ల కోసం వేట మొదలైంది. దీనికి సంబంధించిన వీడియో ఇంటర్నెట్లో చక్కర్లు కొడుతోంది. గుజరాత్లోనివరచ్చా ప్రాంతంలో ఒక వ్యక్తి అనుకోకుండా వజ్రాల ప్యాకెట్‌ను పడవేసుకున్నట్టు పుకార్లు వ్యాపించడంతో వజ్రాలకోసం ఎగబడ్డారు జనం. అహ్మదాబాద్ మిర్రర్ కథనం ప్రకారం, కోట్ల విలువైన వజ్రాలు ప్రమాదవశాత్తు రోడ్డుపై పడిపోయాయనే వార్త దావానలంలా వ్యాపించింది. దీంతో జనం తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమైపోయారు. దీంతో ఆ ప్రాంతంలో భారీ రద్దీ ఏర్పడింది. కొందరైతే ఏకంగా మార్కెట్ రోడ్డులోని దుమ్మును కూడా వదిలిపెట్టకుండా డైమండ్స్ కోసం వెతికేశారు. కొంతమంది వజ్రాలను దక్కించు కుని సంబరాలు చేసుకున్నారు. కానీ అవి నకిలీ వజ్రాలని తేలడంతో ఉసూరుమన్నారు. (మస్క్ మామూలోడు కాదయ్యా..వీడియో వైరల్! ఇక ఆ రోబో కూడా?) అయితే తనకు దొరకింది నకిలీ వజ్రం అని తేలిందని, ఇది ఇమిటేషన్ జ్యూయల్లరీ, లేదా చీర పనిలో ఉపయోగించే అమెరికన్ డైమండ్ అని అరవింద్ పన్సేరియా వాపోయారు. ఇది ఎవరో కావాలని చేసిన ప్రాంక్ అయి ఉంటుందన్నారు. వజ్రాల కొనుగోలు, అమ్మకానికి ప్రసిద్ధి చెందిన మినీ బజార్ వరచ్చా ప్రాంతంలో వ్యాపారి పొరపాటున వజ్రాల ప్యాకెట్‌ను జారవిడిచినట్టు వదంతులు వ్యాపించాయని తెలుస్తోంది. #સુરત વરાછા મિનિબજાર રાજહંસ ટાવર પાસે હીરા ઢોળાયાની વાત થતા હીરા શોધવા લોકોની ભીડ થઈ. પ્રાથમિક સૂત્રો દ્વારા જાણવા મળેલ છે કે આ હીરા CVD અથવા અમેરિકન ડાયમંડ છે..#Diamond #Surat #Gujarat pic.twitter.com/WdQwbBSarl — 𝑲𝒂𝒍𝒑𝒆𝒔𝒉 𝑩 𝑷𝒓𝒂𝒋𝒂𝒑𝒂𝒕𝒊 🇮🇳🚩 (@KalpeshPraj80) September 24, 2023 -
ప్రపంచంలోనే ఖరీదైన కాయిన్.. కిలోలకొద్దీ బంగారం, వజ్రాలు.. చూస్తే కళ్లు చెదరాల్సిందే!
World's Most Expensive Coin: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కాయిన్‌ను బ్రిటన్‌లో ఆవిష్కరించారు. దివంగత క్వీన్ ఎలిజబెత్-2 (Queen Elizabeth 2) గౌరవార్థం ఈ నాణేన్ని రూపొందించారు. ఇది అన్ని కాలాలలో అత్యంత విలువైనదని భావిస్తున్నారు. దాదాపు 4 కిలోల బంగారం (Gold), 6,400 కంటే ఎక్కువ వజ్రాలతో (Diamonds) తయారు చేసిన ఈ నాణెం విలువ సుమారు 23 మిలియన్ డాలర్లు (రూ.192 కోట్లు) అని సీఎన్ఎన్ వార్తా సంస్థ నివేదించింది. (Birmingham bankrupt: బ్రిటన్‌లో సంచలనం.. దివాలా తీసిన ప్రముఖ నగరం!) లగ్జరీ లైఫ్ స్టైల్ బ్రాండ్ ఈస్ట్ ఇండియా కంపెనీ తయారు చేసిన ఈ నాణేన్ని క్వీన్ ఎలిజబెత్-2 మొదటి వర్ధంతి సందర్భంగా విడుదల చేశారు. కామన్వెల్త్ దేశాల్లోని హస్తకళాకారులు 16 నెలలపాటు శ్రమించి దీన్ని తయారు చేశారు. దీన్ని మరింత ఘనంగా రూపొంచాలనుకున్నా వజ్రాల కొరత కారణంగా సాధ్యం కాలేదు. స్కై న్యూస్ ప్రకారం.. 9.6 అంగుళాల కంటే ఎక్కువ వ్యాసం కలిగిన ఈ నాణెం బాస్కెట్‌బాల్ పరిమాణంలో ఉంది. దీనిపై ప్రఖ్యాత పోర్ట్రెయిట్ కళాకారులు మేరీ గిల్లిక్, ఆర్నాల్డ్ మచిన్, రాఫెల్ మక్లౌఫ్, ఇయాన్ ర్యాంక్-బ్రాడ్లీలు దివంగత చక్రవర్తి చిత్రాలను తీర్చిదిద్దారు. దీని మధ్య భాగంలో అమర్చిన నాణెం 2 పౌండ్లపైగా బరువుంటుంది. చుట్టూ ఉన్న చిన్న నాణేలు ఒక్కొక్కటి ఒక ఔన్స్ బరువు కలిగి ఉంటాయి. నాణెం అంచుల్లో క్వీన్ సూక్తులను ముద్రించారు. 2021 జూన్ లో సోథెబైస్ న్యూయార్క్‌లో 18.9 మిలియన్ డాలర్లు పలికిన అరుదైన 1933 యూఎస్ "డబుల్ ఈగిల్" నాణెమే ఇప్పటి వరకు వేలంలో విక్రయించిన అత్యంత ఖరీదైనది. ఇది గిన్నిస్ వరల్డ్ రికార్ట్‌లో నమోదైంది. Introducing The Crown – a once in a lifetime tribute to The Queen An extraordinary tribute coin created to commemorate the enduring legacy of Her Majesty Queen Elizabeth II. We invite you to view the piece and the making of in more detail on our website. pic.twitter.com/SiZXjfvjPB — The East India Company (@TheEastIndia) September 7, 2023 -
వజ్రాలు ఎలా లభ్యమవుతాయంటే..
సాక్షి ప్రతినిధి కర్నూలు: ఈ ఏడాది అధికమాసం కావడంతో వర్షాల రాక ఆలస్యమైంది. జూన్‌లో తొలకరి జల్లులు పడినా.. ఆ తర్వాత వరుణుడు కాస్త ముఖం చాటేశాడు. తిరిగి ఆగస్టులో మంచి వర్షం కురవడంతో వజ్రాన్వేషణ మొదలైంది. గతేడాది నుంచి కర్నూలు, నంద్యాల జిల్లాలతో పాటు ఇతర జిల్లాల వారు ఇక్కడ తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ఇక్కడ వాలిపోతున్నారు. తుగ్గలి, మద్దికెర మండలాల్లో ఏటా జూన్, జులై మాసాల్లో వజ్రాల వేట ముమ్మరంగా సాగుతుంది. దొరికిన వజ్రాలు కొనుగోలు చేసేందుకు గుత్తి, గుంతకల్లు, జొన్నగిరి, పెరవలిలో వ్యాపారులు ఉన్నారు. వీరు గ్రామాల్లో కొందరు ఏజెంట్లను నియమించుకున్నారు. వజ్రం దొరికిందనే సమాచారం రాగానే ఏజెంట్లు వారి వద్ద వాలిపోతారు. వజ్రం దొరికిన వారిని వ్యాపారులు వద్దకు తీసుకెళ్లి రేటు కుదురుస్తారు. వజ్రం బాగా విలువైంది అయితే వ్యాపారులే వారి వద్దకు వెళ్తారు. వ్యాపారుల మధ్య పోటీ పెరిగితే బహిరంగ వేలం వేస్తారు. గతంలో వేల నుంచి రూ.20 లక్షల వరకు వజ్రాలు కొనుగోలు చేశారు. ఈ ఏడాది ఇప్పటికే 8 వజ్రాలు లభ్యమయ్యాయి. ఇక్కడ వజ్రాలను స్థానిక వ్యాపారులకే విక్రయిస్తారు. అంతలా ఇక్కడి వ్యాపారులు నమ్మకం సంపాదించారు. చెప్పిన ధరకు సంబంధించిన డబ్బు వ్యాపారుల వద్దనే ఉంచితే వడ్డీ సహా చెల్లిస్తారు. అదే ప్రభుత్వ అధికారులకు సమాచారం ఇస్తే దానిని స్వాధీనం చేసుకుని పైసా కూడా రాదనే అభిప్రాయంతో వారు అధికారులకు చెప్పకుండా విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. వజ్రాలు లభ్యమయ్యే ప్రాంతాలు ఇవే.. కర్నూలు, అనంతపురం జిల్లాల సరిహద్దుల్లో వజ్రాల నిక్షేపాలు ఉన్నాయనే విషయాన్ని జీఎస్ఐ(జియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా) గుర్తించింది. ► తుగ్గలి, మద్దికెర మండలాల్లోని తుగ్గలి, జొన్నగిరి, పగిడిరాయి, కొత్తపల్లి, పెరవలి, అగ్రహారం, హంప, యడవలి, మద్దికెర ప్రాంతాల్లో వజ్రాలు లభ్యమవుతున్నాయి. ► అనంతపురం జిల్లాలోని వజ్రకరూరు మండలంలో గంజికుంట, తట్రకల్లు, రాగులపాడు, పొట్టిపాడు, కమలపాడు, గూళపాళ్యం, ఎన్.ఎంపీ.తండాలో వజ్రాల జాడ ఉంది. ► వజ్రకూరు, తుగ్గలి, మద్దికెరలో 50–60 కిలోమీటర్ల సరిహద్దులో వజ్రనిక్షేపాలను గుర్తించారు. ► ఈ ప్రాంతంలో కింబర్ లైట్ పైప్‌లైన్ ఉందని గనులు, భూగర్భ శాఖ నిర్ధారించింది. ► వజ్రాలు, బంగారు నిక్షేపాలపై గత కొన్నేళ్లుగా పరిశోధన జరుగుతుంది. ► విదేశీ సంస్థలు కూడా ఇక్కడ నిక్షేపాలపై పరిశోధన చేయడం విశేషం. చాలా దేశాలతో పోలిస్తే నాణ్యమైన వజ్రాలు వజ్రాల మైనింగ్ కోసం వజ్రకరూర్‌లో వజ్రాల ప్రక్రమణ కేంద్రాన్ని 1969లో ఏర్పాటు చేశారు. అయితే వజ్రాన్వేషణపై ఇది పెద్దగా దృష్టి సారించలేదు. ఆ తర్వాత ఓ ఆస్ట్రేలియన్ కంపెనీ వచ్చి కొద్దికాలం పాటు సర్వే చేసి తిరిగి వెళ్లింది. ఆఫ్రికాతో పాటు చాలా దేశాలతో పోలిస్తే ఇక్కడి వజ్రాలు చాలా నాణ్యమైనవి, విలువైనవి. అందుకే దీని వెలికితీతపై ప్రత్యేక దృష్టి సారిస్తే, మన దేశంలోని వజ్రాలకు ప్రపంచ మార్కెట్లో చాలా విలువ ఉంటుందనేది నిపుణుల అభిప్రాయం. విదేశాల్లో ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు ఆఫ్రికా, అంగోలా, కాంగోతో పాటు చాలా దేశాల్లో ఇదే తరహాలో వజ్రాలు లభిస్తాయి. వాటిని అల్యూవియల్ డైమండ్స్ అంటారు. అక్కడ ప్రభుత్వమే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తుంది. వజ్రాలు లభించిన వారు నేరుగా ఆ కేంద్రానికి వచ్చి చూపిస్తారు. వజ్రాల నాణ్యత ఆధారంగా కొంత మొత్తం చెల్లిస్తారు. వజ్రాలను లీగల్‌గా ప్రభుత్వం ప్రక్రియను పూర్తి చేసి విక్రయిస్తుంది. కర్నూలు జిల్లాలో ఏటా సగటున 50–60 వజ్రాలు లభిస్తున్నాయి. అలాగే వజ్రకరూరు ప్రాంతంలో కూడా ఏటా 30–40 వజ్రాలు బయటపడుతున్నాయి. అంటే ఈ రెండు జిల్లాల్లో ఏటా వంద వజ్రాలు లభిస్తున్నాయి. మైనింగ్ చేస్తే వందల కోట్ల విలువైన సంపద ప్రభుత్వానికి లభించే అవకాశం ఉంది. వజ్రాలు ఎలా లభ్యమవుతాయంటే.. మన దేశంలో డైమండ్మైనింగ్ మధ్యప్రదేశ్‌లోని పన్నాలో ఉంది. అక్కడ భూమిలోని రాళ్లు తవ్వితీసి వజ్రాల తయారీ ప్రక్రియ చేస్తారు. కానీ వజ్రకరూర్, తుగ్గలి, జొన్నగిరిలో మాత్రం రాళ్లు ఉన్నాయి. ఇవి 150 మీటర్ల లోతులో ఉంటాయి. అయితే భూమిలో కొన్ని వాతావరణ మార్పులు జరిగినప్పుడు అవి బయటకు వస్తాయి. ఆ తర్వాత వెదరింగ్(వికోశీకరణ) వల్ల అంటే ఎండకు ఎండి, వర్షానికి తడిచి పగిలిపోతాయి. అప్పుడు వర్షాలు, వరదలు వచ్చినప్పుడు ఆ రాళ్ల ముక్కలు పొలాల్లో అక్కడక్కడ నిలుస్తున్నాయి. ఇంకొన్ని వాగులు, వంకల ద్వారా ఇతర ప్రాంతాలకు కూడా చేరతాయి. అలా చెల్లాచెదురైన వజ్రాలే ఇప్పుడు రెండు జిల్లాలలో లభిస్తున్నాయి. ఈ ఏడాది లభించిన వజ్రాల వివరాలు మే 27: చిన్నగిరిలో ఓ వ్యక్తికి వజ్రం దొరికింది. దీన్ని రూ.3.03లక్షలకు విక్రయించారు. జూన్11: జొన్నగిరిలో ఓ రైతుకు వజ్రం లభిస్తే దాన్ని రూ.30వేలకు విక్రయించారు. జూన్ 26: రామాపురంలో లభించిన వజ్రాన్నిఓ వ్యక్తి రూ.1.30లక్షలకు విక్రయించారు. జూలై 23: జి.ఎర్రగుడిలో వజ్రం లభించింది.అయితే దాన్ని ఇప్పటి వరకూ విక్రయించలేదు. ఆగస్టు 31: జొన్నగిరిలో ఓ రైతుకు వజ్రం లభిస్తేరూ.40వేలకు అమ్మేశారు. సెప్టెంబర్ 2: గిరిగెట్లలో దొరికిన వజ్రాన్నిరూ.2లక్షల నగదు, రెండు తులాల బంగారానికి విక్రయించారు. అదే రోజుజొన్నగిరిలో ఓ వజ్రాన్ని రూ.40వేల నగదు, జత బంగారు కమ్మలకు ఓ వ్యాపారి కొనుగోలు చేశాడు. సెప్టెంబర్ 6: పీ.కొత్తూరులో కలుపు తీస్తున్న మహిళా కూలీకి వజ్రం లభ్యమైంది. గురువారంఅనంతపురం జిల్లా గుత్తికి చెందిన ఓవ్యాపారి టెండర్లో రూ.72 వేలకు కొనుగోలు చేశాడు. వజ్రాలు దొరుకుతాయంటే వచ్చా మాది కదిరి దగ్గర మొలకల చెరువు. ఇక్కడ వజ్రాలు దొరుకుతాయంటే ఏడుగురు గుంపుగా కలిసి వచ్చాం. పొలాల్లో విత్తనం వేశారు. రైతులు పొలాల్లోకి రానీయడం లేదు. పంట లేని పొలాల్లో తిరుగుతున్నాం. ఇంత దూరం వచ్చాక వెనక్కి వెళ్లలేక సాగు చేసిన పొలాల్లో కూడా పంట లేని చోట వెతుకుతున్నాం. వజ్రం ఎలా ఉంటుందో కూడా నేను చూడలేదు. – మహబూబ్‌బీ, మొలకల చెరువు,అనంతపురం జిల్లా రెండేళ్ల నుంచి వస్తున్నా టీవీల్లో, వాట్సాప్‌ల్లో వారంలో మూడు వజ్రాలు.. ఒక్కరోజే రెండు వజ్రాలు లభించాయని చూశాం. నేను మూడు రోజుల కిందట వజ్రాల కోసం వచ్చా. రెండేళ్ల నుంచి వస్తూనే ఉన్నా. అందరూ జొన్నగిరిలోని ఓ పొలంలో ఎక్కువ వజ్రాలు దొరుకుతాయంటారు. రైతులు పొలాల్లో తిరగనీయకుండా తరుముతున్నారు. హోటళ్లో తింటూ రాత్రిపూట ఏదో ఒక చోట తలదాటుచుకుంటాం. – శీను, పెండ్లిమర్రి, వైఎస్సార్ కడప జిల్లా -
ల్యాబ్ డైమండ్లతో ఉపాధికి ఊతం
జైపూర్: ల్యాబ్‌లలో తయారు చేసే వజ్రాలు (ఎల్జీడీ) కృత్రిమమైనవి కావని, వాటికి కూడా ప్రస్తు తం సహజ వజ్రాలుగా ఆమోదయోగ్యత పెరుగుతోందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పియుష్ గోయల్ తెలిపారు. ఇలాంటి సానుకూల పరిణామాలు పరిశ్రమ వృద్ధికి దోహదపడగలవని, దీనితో ఉపాధి కల్పనకు కూడా ఊతం లభించగలదని ఆయన చెప్పారు. ఎల్జీడీల తయారీలో సౌర, పవన విద్యుత్ వంటి వనరులను వినియోగించడం వల్ల ఇది పర్యావరణానికి కూడా అనుకూలమైనదని మంత్రి తెలిపారు. జూన్ 22న అమెరికా పర్యటన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ 7.5 క్యారట్ల ఎల్జీడీని అమెరికా ప్రథమ మహిళ జిల్ బైడెన్‌కు బహూకరించడం ల్యాబ్ డైమండ్లకు పెరుగుతున్న ఆమోదయోగ్యతకు నిదర్శనం. ఎల్జీడీల తయారీని ప్రోత్సహించేందుకు ప్రభు త్వం పలు చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా ఎల్జీ డీ సీడ్స్‌పై 5% కస్టమ్స్ సుంకాలను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. అలాగే, దేశీ యంగా ఎల్జీడీ యంత్రాలు, సీడ్స్, తయారీ విధానాన్ని రూపొందించడంపై పరిశోధనలు చేసేందుకు ఐఐటీ–మద్రాస్‌కు రీసెర్చ్ గ్రాంట్ ప్రకటించింది. 2025 నాటికి ఎల్జీడీ ఆభరణాల మార్కెట్ 5 బిలియన్ డాలర్లకు, 2035 నాటికి 15 బిలియన్ డాలర్లకు చేరుతుందని అంచనాలు ఉన్నాయి. 2021 –22లో కట్, పాలిష్డ్ ఎల్జీడీల ఎగుమతులు 1.35 బిలియన్ డాలర్లుగా ఉండగా, గతేడాది ఏప్రిల్–డిసెంబర్ వ్యవధిలో 1.4 బిలియన్ డాలర్ల స్థాయిలో నమోదైంది. -
కృష్ణమ్మ ఒడి వజ్రాల మడి..
వర్షాల సీజన్ అంటే.. రైతులకే కాదు..వజ్రాల వేటగాళ్లకు పండుగే.. అన్నదాతల కంటే ఎక్కువగా వేటగాళ్లు వర్షాల కోసం ఎదురు చూస్తారని చెప్పడంలో ఎంతమాత్రం అతిశయోక్తి లేదు. గత కొద్ది రోజులుగా వర్షాలు పడుతున్నాయి. ఈ నేపథ్యంలో వజ్రాలకు ప్రసిద్ధిగాంచిన నందిగామ ప్రాంతం సుదూర ప్రాంతాల నుంచి వచ్చే వజ్రాల వేటగాళ్లతో సందడిగా మారింది. నందిగామ: కృష్ణానది పరివాహక ప్రాంతంలో వజ్రాల వేట అనాదిగా వస్తున్న సంప్రదాయమే. ముఖ్యంగా చందర్లపాడు మండలం గుడిమెట్ల సమీపంలోని కృష్ణానది పరివాహక ప్రాంతంలో ఉన్న అటవీ ప్రాంతంలో వజ్రాల గుట్టగా పిలిచే కొండ ప్రాంతం వర్షాకాలం వచ్చిందంటే వజ్రాల అన్వేషణకు వచ్చిన వారితో సందడిగా కనిపిస్తుంది. నిత్యం ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి వందలాదిమంది ఈ వజ్రాల వేటకు వస్తుంటారు. కొందరు ఉదయమే భోజనాలు కట్టుకుని వచ్చి రామన్నపేట ప్రాంతంలోని కొండ ప్రాంతంలో తవ్వకాలు మొదలు పెడతారు. సాయంత్రం చీకట్లు కమ్ముకునే వరకు వీరి వెదుకులాట కొనసాగుతూనే ఉంటుంది. కృష్ణా తీరం వజ్రాల గని గతంతో పోల్చుకుంటే... ప్రస్తుతం వజ్రాల లభ్యత గణనీయంగా తగ్గినప్పటికీ, వెదికే వారి సంఖ్య మాత్రం తగ్గడం లేదు. కనీసం రంగు రాళ్లు లభించినా, కూలి ఖర్చులైనా గిట్టుబాటవుతాయనే భావనలో చాలా మంది ఉంటారు. ఏటా తొలకరి జల్లులు మొదలుకొని వర్షా కాలం పూర్తయ్యే వరకు ఇక్కడ వజ్రాల వేట కొనసాగుతుంది. నిత్యం 200 మంది వరకు ఇక్కడ అన్వేషణ సాగిస్తుండటం గమనార్హం. అత్యంత ఖరీదైన కోహినూర్ వజ్రం సైతం కంచికచర్ల మండలం పరిటాల చెరువు ప్రాంతంలో దొరికిందని స్థానికులు చెబుతుంటారు. గతంలో చందర్లపాడు మండలంలో వజ్రాల శుద్ధి కర్మాగారంతో పాటు వజ్రాల కోత పరిశ్రమ కూడా ఉండేదని, కాలక్రమేణా వజ్రాల కర్మాగారం తీసివేశారని చెబుతారు. క్యూ కడుతున్న వ్యాపారులు చందర్లపాడు మండలంలోని గుడిమెట్ల కొండ ప్రాంతంలో లభించే రంగు రాళ్లు, వజ్రాలు కొనుగోలు చేసేందుకు తమిళనాడు, ముంబయి, హైదరాబాదు, ఖమ్మం ప్రాంతాల నుంచి నిత్యం అనేక మంది వ్యాపారులు వచ్చి వెళుతుంటారు. వజ్రాల వేట ప్రారంభమైన నేపథ్యంలో వ్యాపారుల రాక కూడా ప్రారంభమైందని స్థానికులు చెబుతున్నారు. పోలీసులు మాత్రం వజ్రాల వేట నిషేధమని వేటకు వెళితే చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. -
డాక్టర్ ఇంటిలో రూ.11 లక్షల బంగారం, వజ్రం చోరీ
అన్నానగర్: కోయంబత్తూరులో ఆదివారం డాక్టర్ ఇంటిలో రూ.11 లక్షల బంగారం, వజ్రాలు చోరీ చేసిన దుండగుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. కోయంబత్తూరు రామనాథపురం కృష్ణస్వామి నగర్‌కు చెందిన శ్రీదేవి డాక్టర్. ఈమె ఇంటిలో కోయంబత్తూరుకు చెందిన తమిళసెల్వి (45) ఉంటూ ఇంటి పనులు చేస్తూ వచ్చింది. ఈ స్థితిలో శ్రీదేవి హ్యాండ్‌బ్యాగ్‌లో ఉంచిన డైమండ్‌రింగ్ మాయమైంది. దీనిపై అనుమానంతో తమిళ సెల్విని అడిగితే తీసుకోలేదని చెప్పింది. ఆమెను ఉద్యోగం నుంచి తొలగించిది. ఆదివారం ఉదయం ఆమె తన ఇంటి బీరువాలో ఉంచిన 11 సవర్ల నగలు, రెండు జతల డైమండ్ ముక్కుస్టడ్లు, నాలుగు ఖరీదైన వాచీలు, రూ.2 లక్షల నగదు చోరీకి గురైనట్టు తెలిసి దిగ్భ్రాంతి చెందింది. వీటి మొత్తం విలువ రూ.11 లక్షలు. వెంటనే దీనిపై శ్రీదేవి రామనాథపురం పోలీసులకు ఫిర్యాదు చేసింది. అందులో పనిమనిషి తమిళసెల్విపై తనకు అనుమానం ఉందని తెలిపింది. పోలీసులు కేసు నమోదు చేసి తమిళ్ సెల్వి కోసం గాలిస్తున్నారు.