నడిరోడ్డుపై ఖరీదైన డైమండ్లు, ఎగబడిన జనం: అదిరిపోయే ట్విస్ట్‌ | People Searching Street For Diamond Is Viral; Know The Real Story Video Viral - Sakshi
Sakshi News home page

నడిరోడ్డుపై ఖరీదైన డైమండ్లు, ఎగబడిన జనం: అదిరిపోయే ట్విస్ట్‌

Sep 25 2023 12:14 PM | Updated on Sep 25 2023 12:59 PM

People Searching Street For Diamond Is Viral know the real story video viral - Sakshi

డైమండ్‌ సిటీ సూరత్‌ డైమండ్‌ బిజినెస్‌కు పెట్టింది పేరని అందరికీ తెలుసు. అయితే తాజాగా సూరత్‌లో ఒక వ్యాపారి కోట్ల విలువైన డైమండ్లున్న ఒక వీడియో పోగొట్టు కున్నాడని వార్త  వైరల్‌ అయింది. దీంతో డైమండ్ల కోసం వేట మొదలైంది.  దీనికి  సంబంధించిన వీడియో ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతోంది.

గుజరాత్‌లోనివరచ్చా ప్రాంతంలో ఒక వ్యక్తి అనుకోకుండా వజ్రాల ప్యాకెట్‌ను  పడవేసుకున్నట్టు పుకార్లు వ్యాపించడంతో వజ్రాలకోసం ఎగబడ్డారు జనం. అహ్మదాబాద్ మిర్రర్ కథనం ప్రకారం, కోట్ల విలువైన వజ్రాలు ప్రమాదవశాత్తు రోడ్డుపై పడిపోయాయనే  వార్త  దావానలంలా  వ్యాపించింది. దీంతో జనం తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు  సిద్ధమైపోయారు. దీంతో ఆ ప్రాంతంలో భారీ రద్దీ ఏర్పడింది. కొందరైతే ఏకంగా మార్కెట్ రోడ్డులోని దుమ్మును కూడా వదిలిపెట్టకుండా డైమండ్స్‌ కోసం వెతికేశారు.  కొంతమంది వజ్రాలను దక్కించు కుని  సంబరాలు చేసుకున్నారు.  కానీ అవి నకిలీ వజ్రాలని తేలడంతో ఉసూరుమన్నారు. (మస్క్‌ మామూలోడు కాదయ్యా..వీడియో వైరల్‌! ఇక ఆ రోబో కూడా?)

అయితే తనకు దొరకింది నకిలీ వజ్రం అని తేలిందని, ఇది ఇమిటేషన్‌ జ్యూయల్లరీ, లేదా చీర పనిలో ఉపయోగించే అమెరికన్ డైమండ్‌ అని అరవింద్ పన్సేరియా వాపోయారు. ఇది ఎవరో  కావాలని చేసిన ప్రాంక్‌ అయి ఉంటుందన్నారు. వజ్రాల కొనుగోలు, అమ్మకానికి ప్రసిద్ధి చెందిన మినీ బజార్‌ వరచ్చా ప్రాంతంలో వ్యాపారి పొరపాటున వజ్రాల ప్యాకెట్‌ను జారవిడిచినట్టు వదంతులు వ్యాపించాయని తెలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement