diamonds
-
డిజైర్ డిజైన్స్..! మధ్యతరగతి వాళ్లు కూడా కొనేలా డైమండ్స్..
సౌందర్య రంగంలో వజ్రాలకు ఆదరణ, విలువ, గుర్తింపు గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. విలాసవంతమైన జీవనానికి వజ్రాలు ప్రతీకగా నిలుస్తున్నాయి. బంగారం, వెండి, ప్లాటినం వంటివి ఎన్ని ఉన్నా వజ్రాలకు ప్రత్యేక స్థానం ఉంది. అందుకే చాలామందికి డైమండ్ రింగ్ కొనుగోలు చేయాలనే ఆశ ఉంటుంది. ఈ నేపథ్యంలో మధ్య తరగతి కుటుంబాల్లో కూడా వజ్రాలపై ఆసక్తి పెరిగింది. వీటన్నింటి దృష్ట్యా ల్యాబ్‌లో తయారు చేస్తున్న కృత్రిమ వజ్రాలు (ల్యాబ్‌గ్రోన్ డైమండ్స్)కు డిమాండ్ పెరిగింది. సహజమైన వజ్రాలు.. ప్రత్యేకంగా ల్యాబ్‌లో తయారు చేసిన వజ్రాలు చూసేందుకు ఒకేలా ఉండటం వీటి ప్రత్యేకత. ధర కూడా తక్కువ ఉండటంతో వీటికి విపరీతమైన ఆదరణ పెరిగింది. ప్రకృతి ప్రసాదంగా లభించే వజ్రాలు చాలా అరుదైనవి, తక్కువగా దొరుకుతాయి. ఈ వజ్రాలు భూమి పొరల్లోని అంతర్భాగంలో తయారు కావడానికి సుమారు 1 నుంచి 3 బిలియన్ సంవత్సరాల సమయం పడుతుందని పరిశోధకులు చెబుతారు. ఇంతటి అరుదైనవి కాబట్టే వజ్రాలకు ధరలు ఎక్కువగా ఉంటాయి. అయితే ప్రస్తుత కాలంలో అచ్చం వజ్రాలను పోలినవి.. ప్రయోగశాలలో తయారు చేసిన వజ్రాలు అందుబాటులోకి రావడంతో వజ్రాల ప్రియులు అధికంగా వాటిని కొనుగోలు చేస్తున్నారు. ఈ వజ్రాలు కేవలం వారాలు, నెలల వ్యవధితో తయారు చేస్తున్నారు. సాధారణంగా ఈ రెండు రకాల వజ్రాలు శాస్త్రీయ రసాయణాల పరంగా ఒకే లక్షణాన్ని కలిగి ఉన్నప్పటికీ నాణ్యత, పదార్థ విశిష్టత దృష్ట్యా చాలా వ్యత్యాసం ఉంటుంది. వజ్రాల నిపుణులు, ఆభరణాల తయారీదారులు మాత్రమే వీటి మధ్య తేడాను గుర్తించగలరు. వీటి కటింగ్, పాలిషింగ్, సెట్టింగ్‌లో చాలా వైవిధ్యంతో పాటు శాస్త్రీయత పాటించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో సహజమైన వజ్రాలను కొనలేని వారు ఈ కృత్రిమ వజ్రాలపై మక్కువ చూపిస్తున్నారు. సహజ వజ్రాల్లో పరిమాణం పెరుగుతున్న కొద్దీ.. దాని క్యారెట్లను బట్టి ధర అంతకంతకూ పెరిగిపోతుంది. కానీ ప్రయోగశాలలో తయారు చేసిన వజ్రాలు తక్కువ ధరకే అదే పరిమాణంలో లభిస్తుండటం విశేషం. సహజ వజ్రాల కంటే ప్రయోగశాలలో తయారు చేసిన వజ్రాలు సుమారు 30 నుంచి 85 శాతం తక్కువ ధరల్లో లభిస్తుండటం విశేషం.అమాంతం పెరిగిన వ్యాపారం.. ఆర్థిక పరమైన అంశాలే కాకుండా సామాజికంగా సౌందర్య రంగంలోని వజ్రాల ప్రాధాన్యత వల్ల ఫ్యాషన్ రంగంలో కూడా ఈ డైమండ్స్‌కు మంచి ప్రచారం లభించింది. ముఖ్యంగా హైదరాబాద్‌తో పాటు దేశంలోని ప్రధాన నగరాల్లో ఈ వజ్రాల వ్యాపారం అమాంతంగా పెరిగిపోయింది. ఈ వజ్రాల ప్రస్థానం 2000 సంవత్సరం నుంచి పుంజుకోగా.. ఐదేళ్ల నుంచి మరింత ఎక్కువగా పెరిగిందని బంజారాహిల్స్‌లోని ఓ వ్యాపారి తెలిపారు. మొదట్లో ఉత్తరాది ప్రాంతాలకు చెందినవారే వజ్రాలు అధికంగా కొనుగోలు చేసేవారు. కొన్ని ఏళ్లుగా హైదరాబాద్, బెంగళూరులో వీటి వ్యాపారం పుంజుకుందని సోమాజిగూడలోని మరో వజ్రాల వ్యాపారి పేర్కొన్నారు. ఇలాంటి కారణాలతో ప్రస్తుతం నగరంలో ల్యాబ్ గ్రోన్ వజ్రాలకు ప్రత్యేక స్టోర్లు ప్రారంభిస్తున్నారు. అంతేకాకుండా ప్రముఖ డైమండ్ బ్రాండ్లు సైతం వారి స్టోర్లలో ల్యాబ్ గ్రోన్ వజ్రాలను అందుబాటులోకి తీసుకువస్తున్నారు. సహజ వజ్రాలు, తయారు చేసిన వజ్రాల మధ్య వ్యత్యాసాన్ని గుర్తించడానికి నిపుణుల పరిశోధక పత్రాలు, డైమండ్ వెరిఫికేషన్ ఇన్స్ట్రుమెంట్ విధానాలను వినియోగిస్తున్నారు. వజ్రాన్ని కత్తిరించి పాలిష్ చేసిన తర్వాత ప్రయోగశాలలో సర్టిఫికేట్కు అనుగుణంగా లేజర్‌తో టెక్నాలజీతో ధృవీకరిస్తారు. ల్యాబ్ గ్రోన్ డైమండ్స్కే క్రేజ్ ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ అమ్మకాలు ఈ మధ్య కాలంలో పెరుగుతున్నాయి. ముఖ్యంగా మా స్టోర్‌లో గతేడాదిలో మరింత ఎక్కువగా అమ్ముడయ్యాయి. హైదరాబాద్‌లో పెద్ద సైజుల్లో ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ ఎక్కువగా అమ్ముడవుతున్నాయి. పెద్ద సైజులో ఉండే సహజమైన వజ్రాలు కొనుగోలు చేయలేని వారు దాదాపు 50 నుంచి 90 శాతం తక్కువ ధరలకు లభించే ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ రెండు వజ్రాల మధ్య తేడాలను ప్రయోగశాలలోని ప్రత్యేక పరికరాలు ఉంటే తప్ప ఎవరూ గుర్తించలేరు. స్థానికంగా నిశ్చితార్థాలకు ఈ డైమండ్స్ ఎక్కువగా కొంటున్నారు. పార్టీలు, ఫ్యాషన్ వేర్, విభిన్న డిజైన్ల కోసం కూడా ఆసక్తి చూపిస్తున్నారు. – స్వాతి షాగర్లమూడి, రీయా లైఫ్‌స్టైల్–మణికొండ (చదవండి: ఆ జంటకి వివాహమై 84 ఏళ్లు..వంద మందికి పైగా మనవరాళ్లు..) -
చేపల వేటకు వెళ్లినట్లుగా అక్కడ వజ్రాల వేటకు వెళ్తారు
‘కేజీఎఫ్’ సినిమాలలో బంగారం వేటలో ఎంతోమంది బక్క జీవుల జీవితాలు ఆవిరైపోతాయి. అయితే అది సినిమా. ‘పన్నా’ అనేది మాత్రం నిజం. ‘కేజీఎఫ్’లో పెద్ద విలన్లు పేదవాళ్లను బలవంతంగా బంగారు గనుల్లో దింపుతారు. అయితే మధ్యప్రదేశ్‌లోని పన్నాలో మాత్రం ఎంతోమంది పేదవాళ్లు స్వచ్ఛందగా వజ్రాల వేటలోకి దిగుతున్నారు. ఎంతమందిని అదృష్టం భుజం తట్టిందో తెలియదుగానీ దురదృష్టం మాత్రం వారి ఇంటి దగ్గర భద్రంగా ఉంటుంది....‘ఈరోజు నా భర్త శుభవార్తతో వస్తాడేమో’ అని భర్త రాక కోసం ఆసక్తిగా ఎదురుచూస్తుంటుంది భగవతి.‘మా అబ్బాయికి విలువైన వజ్రం దొరకాలి’ అని ముక్కోటి దేవతలను మొక్కుకుంటుంది సీమ. ‘ఎప్పుడూ మీరే కష్టపడతారా....నేను కూడా ఈరోజు మీతోపాటు వస్తాను’ అని భర్త, అత్తమామల తోపాటు వజ్రాల వేటకు వెళుతుంది ఆశ.మత్స్యకారులు రోజూ చేపల వేటకు వెళ్లినట్లు అక్కడి ప్రజలు వజ్రాల వేటకు వెళతారు!మధ్యప్రదేశ్‌లోని ‘పన్నా’ దేశంలోని అత్యంత వెనకబడిన ప్రాంతాలలో ఒకటి. నీటికొరత నుంచి నిరుద్యోగం వరకు ఎన్నో సమస్యలు ఉన్న ఈ ప్రాంతం పేదరికానికి పెట్టింది పేరు. పేదరికం మాట ఎలా ఉన్నా ఈ ప్రాంతం వజ్రాల నిల్వలకు నిలయంగా ప్రసిద్ధి ΄పొందింది.ఒకప్పుడు అరుదైన ఆవిష్కరణలకు ప్రసిద్ధి చెందిన పన్నాలోని వజ్రాల గనులు ఇప్పుడు శిథిలావస్థకు చేరుకున్నాయి. మితిమీరిన మైనింగ్ కారణంగా నిల్వలు క్షీణించాయి. అయినప్పటికీ ఆశావహ వ్యక్తులు వజ్రాల కోసం అన్వేషణ కొనసాగిస్తూనే ఉన్నారు. తెల్లవారు జామునే తవ్వకాలు మొదలుపెడతారు. సూర్యాస్తమయం వరకు వజ్రాల కోసం జల్లెడ పడుతూనే ఉంటారు. ఈ పనిలో ప్రతి కుటుంబానికి వారి కుటుంబసభ్యులు సహాయంగా ఉంటారు. ఇందులో మహిళలు కూడా ఉంటారు. చాలామందికి వజ్రాల వేట అనేది తరతరాల కుటుంబ సంప్రదాయం. ‘వజ్రాల గురించి వెదకని రోజు నేను అనారోగ్యానికి గురవుతాను. ఇదొక మత్తుమందులాంటిది’ అంటాడు 67 సంవత్సరాల ప్రకాశ్ శర్మ. నిజానికి ఇది ప్రకాష్ మాటే కాదు...ఆ ప్రాంతంలోని వేలాది మంది ఆశావహుల మనసులో మాట! చిన్న డౌట్: ‘పన్నా’పై సినిమా వాళ్ల దృష్టి ఎందుకుపడలేదో? ప్చ్..! (చదవండి: ఆ ఎయిర్పోర్ట్ ప్రయాణికులకు లామా థెరపీని అందిస్తుందట..!) -
హైదరాబాద్‌లో సంయుక్త మీనన్ డైమండ్ స్టోర్ ప్రారంభం (ఫొటోలు)
-
దాదాపు రూ. 100 కోట్లు.. లగ్జరీ అపార్ట్మెంట్ కొన్న వజ్రాల వ్యాపారి
దేశంలోని ఖరీదైన రియల్ ఎస్టేట్ మార్కెట్‌కు పెట్టింది పేరు ముంబై. ముఖ్యంగా వర్లీ ప్రాంతం అత్యంత ఖరీదైన సీ వ్యూ లగ్జరీ అపార్ట్మెంట్లకు ప్రసిద్ధి చెందింది. అనేక మంది వ్యాపార ప్రముఖలు, సెలబ్రిటీలు ఇక్కడ నివాసాలు కొనుగోలు చేస్తుంటారు. ప్రపంచంలో అతిపెద్ద వజ్రాల కంపెనీల్లో ఒకటైన కిరణ్ జెమ్స్ డైరెక్టర్ రాజేష్ లభుభాయ్ లఖానీ తాజాగా ఇక్కడ రూ.97 కోట్లు పెట్టి లగ్జరీ సీ వ్యూ అపార్ట్మెంట్ కొనుగోలు చేశారు.త్రీసిక్స్టీ వెస్ట్‌లోని సూపర్ ప్రీమియం రెసిడెన్షియల్ టవర్‌లో రాజేష్ లఖానీ కొనుగోలు చేసిన అపార్ట్మెంట్ 44వ అంతస్తులో ఉంది. దీని విస్తీర్ణం 14,911 చదరపు అడుగులు. ‘జాప్కీ’కి లభించిన పత్రాల ప్రకారం.. రాజేష్ లఖానీ ఈ అపార్ట్‌మెంట్‌ను మరో ఇద్దరు కుటుంబ సభ్యులతో కలిసి ఉమ్మడిగా కొనుగోలు చేశారు. దీనికి సంబంధించిన రిజిస్టేషన్ మే 29న జరగగా రూ.5.84 కోట్లు స్టాంప్ డ్యూటీ కింద చెల్లించినట్లు తెలుస్తోంది.కాగా ఏప్రిల్ నెలలో కిరణ్ జెమ్స్ మేనేజింగ్ డైరెక్టర్, ప్రమోటర్ మావ్జీభాయ్ పటేల్ ఇదే టవర్లోని 47వ అంతస్తులో రూ. 97 కోట్లు వెచ్చించి అపార్ట్మెంట్ కొనుగోలు చేశారు. త్రీసిక్స్టీ వెస్ట్ రెండు టవర్లుగా ఉంటుంది. ఒక దాంట్లో రిట్జ్-కార్ల్టన్ హోటల్ నిర్వహిస్తుండగా మరో టవర్‌లో లగ్జరీ నివాసాలను ఇదే సంస్థ నిర్వహిస్తోంది. ఇందులో ఏడు కార్ పార్కింగ్ స్లాట్లు సహా అత్యాధునిక విలాసవంతమైన సదుపాయాలు ఉన్నాయి. -
జొన్నగిరిలో రూ.1.75 లక్షల వజ్రం లభ్యం
తుగ్గలి: కర్నూలు జిల్లా తుగ్గలి మండలంలో పేదలను వజ్రాలు వరిస్తున్నాయి. జొన్నగిరిలో పొలాల్లోకి వెళ్లిన ఓ వ్యక్తికి మంగళవారం వజ్రం లభ్యమైనట్లు సమాచారం. ఈ వజ్రాన్ని రూ.1.75 లక్షలు, జత కమ్మలు ఇచ్చి ఓ వజ్రాల వ్యాపారి కొనుగోలు చేసినట్లు తెలిసింది. -
12 లక్షల విలువైన వజ్రాలు ఈ నెలలో 20 లభ్యం
-
వజ్ర సంకల్పం
కర్నూలు, అనంతపురం జిల్లాల సరిహద్దుల్లో వజ్రాల నిక్షేపాలు ఉన్నాయనే విషయాన్ని జియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జీఎస్ఐ) గుర్తించింది. కర్నూలు జిల్లా తుగ్గలి, మద్దికెర మండలాల్లోని తుగ్గలి, జొన్నగిరి, పగిడిరాయి, కొత్తపల్లి, పెరవలి, అగ్రహారం, హంప, యడవలి, మద్దికెరతోపాటు అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలంలోని గంజికుంట, తట్రకల్లు, రాగులపాడు, పొట్టిపాడు, కమలపాడు, గూళపాళ్యం, ఎన్ఎంపీ తండా గ్రామాల్లో తరచూ వజ్రాలు లభ్యమవుతున్నాయి. ఈ ప్రాంతంలోని భూమి పొరల్లో కింబర్లైట్ పైప్‌లైన్ ఉందని గనులు భూగర్భ శాఖ నిర్ధారించింది. ఈ నేపథ్యంలోనే తొలకరి జల్లులు కురిసే జూన్‌లో తుగ్గలి, మద్దికెర మండలాల్లో వజ్రాల అన్వేషణ కొన్నేళ్లుగా ముమ్మరంగా సాగుతోంది. ఈ ఏడాది మే మొదటి వారంలోనే వర్షాలు కురిశాయి. ఆ వెంటనే వజ్రాన్వేషణ మొదలైంది. ఇప్పటికే కొందరికి వజ్రాలు దొరికాయి కూడా. ఈ ప్రాంతంలోని పొలాలన్నీ జనంతోనే నిండిపోయాయి. కర్నూలు, నంద్యాలతో పాటు అనంతపురం, కడప, చిత్తూరు, గుంటూరు, కృష్ణా జిల్లాల నుంచి వజ్రాన్వేషకులు తరలివచ్చారు. ఒక్కొక్కరు వారం, పది, పదిహేను రోజులపాటు ఇక్కడే మకాం వేస్తున్నారు. ఓ వైపు వజ్రాల కోసం జనాలు పొలాల్లో తిరుగుతుంటే.. వజ్రాన్వేషకులు తిరగడం వల్ల పొలం గట్టిబారి వ్యవసాయానికి ఇబ్బందిగా ఉంటోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొందరు రైతులు తమ పొలాల్లోకి ఎవరూ రావొద్దని విజ్ఞప్తి బోర్డులు తగిలిస్తున్నారు. – సాక్షి ప్రతినిధి, కర్నూలువజ్రాలు ఎలా లభ్యమవుతాయంటే.. మన దేశంలో డైమండ్ మైనింగ్ మధ్యప్రదేశ్‌లోని పన్నాలో ఉంది. అక్కడ భూమిలోని రాళ్లను తవ్వితీసి వజ్రాల తయారీ ప్రక్రియ చేపడతారు. వజ్రకరూర్, తుగ్గలి, జొన్నగిరి ప్రాంతాల్లోని భూగర్భంలో 150 మీటర్ల లోతున వజ్రాలు ఉంటాయి. భూమిలో వాతావరణ మార్పులు జరిగినప్పుడు అవి బయటకు వస్తాయి. ఆ తర్వాత వెదరింగ్ (వికోశీకరణ) వల్ల అంటే ఎండకు ఎండి, వర్షానికి తడిసి పగిలిపోతాయి. వర్షాలు, వరదలు వచ్చినపుడు ఆ రాళ్ల ముక్కలు పొలాల్లో అక్కడక్కడా దొరుకుతుంటాయి. వాగులు, వంకల ద్వారా కూడా వజ్రాలు నీటిలో కొట్టుకుని ఇతర ప్రాంతాలకు చేరతాయి. అలా చెల్లాచెదురైన వజ్రాలే ఇప్పుడు కర్నూలు, అనంతపురం జిల్లాల్లో లభిస్తున్నాయి. ఇతర దేశాలతో పోలిస్తే నాణ్యమైన వజ్రాలు వజ్రాల మైనింగ్ కోసం వజ్రకరూర్‌లో వజ్రాల ప్రక్రమణ కేంద్రాన్ని 1969లో ఏర్పాటు చేశారు. వజ్రాన్వేషణపై ఇది పెద్దగా దృష్టి సారించలేదు. ఆ తర్వాత ఓ ఆ్రస్టేలియన్ కంపెనీ వచ్చి కొద్దికాలం పాటు సర్వే చేసి తిరిగి వెళ్లింది. ఆఫ్రికాతో పాటు చాలా దేశాలతో పోలిస్తే ఇక్కడి వజ్రాలు చాలా నాణ్యమైనవి, విలువైనవి. అందుకే వీటి వెలికితీతపై ప్రత్యేక దృష్టి సారిస్తే ప్రయోజనకరంగా ఉంటుందని పలువురు కోరుతున్నారు. ‘సీమ’లో ఏజెంట్ల తిష్ట వర్షాకాలం వస్తే జనాలు ఎలా తరలివస్తారో.. వజ్రాల వ్యాపారులు కూడా గుత్తి, గుంతకల్లు, జొన్నగిరి, పెరవలిలో మకాం వేసి వజ్రాల కొనుగోలుకు ప్రయత్నిస్తారు. ఇందుకోసం వజ్రాలు లభ్యమయ్యే గ్రామాల్లో ఏజెంట్లను సైతం నియమించుకుంటున్నారు. వజ్రం దొరికిందనే సమాచారం వస్తే ఏజెంట్లు వాలిపోతారు. వజ్రం దొరికిన వారిని వ్యాపారుల వద్దకు తీసుకెళ్లి రేటు కుదురుస్తారు. వజ్రం విలువైనదైతే వ్యాపారులే వారి వద్దకు వెళ్తారు. వ్యాపారుల మధ్య పోటీ పెరిగితే బహిరంగ వేలం వేస్తారు. వజ్రం నాణ్యత(క్యారెట్)ను బట్టి రూ.20 వేల నుంచి రూ.20 లక్షల వరకు కొనుగోలు చేస్తారు. జిల్లా చరిత్రలో 2022లో లభించిన 30 క్యారెట్ల వజ్రమే అత్యంత విలువైంది. ఈ ఏడాది ఇప్పటికే 9 వజ్రాలు లభ్యమయ్యాయి. గతేడాది సరైన వర్షాలు లేవు. అయినప్పటికీ 18 వజ్రాలు దొరికాయి. ఇక్కడ వజ్రాలను స్థానిక వ్యాపారులకే విక్రయిస్తారు. ఇక్కడి వ్యాపారులు అంత నమ్మకం సాధించారు. చెప్పిన ధర చెప్పినట్టు ఇస్తారు. అదే ప్రభుత్వ అధికారులకు సమాచారం ఇస్తే దానిని స్వా«దీనం చేసుకుని పైసా కూడా ఇవ్వరనే అభిప్రాయంతో వారు అధికారులకు చెప్పకుండా విక్రయిస్తారు. విదేశాల్లో ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు ఆఫ్రికా, అంగోలా, కాంగోతో పాటు చాలా దేశాల్లో ఇదే తరహాలో వజ్రాలు లభిస్తాయి. వాటిని అల్యూవియల్ డైమండ్స్ అంటారు. అక్కడ ప్రభుత్వమే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తుంది. వజ్రాలు లభించిన వారు నేరుగా ఆ కేంద్రానికి వచ్చి చూపిస్తారు. వజ్రాల నాణ్యత ఆధారంగా కొంత మొత్తం చెల్లిస్తారు. వజ్రాలను లీగల్‌గా ప్రభుత్వం ప్రక్రియను పూర్తి చేసి విక్రయిస్తుంది. కర్నూలు జిల్లాలో ఏటా సగటున 50–60 వజ్రాలు లభిస్తున్నాయి. అలాగే వజ్రకరూరు ప్రాంతంలో కూడా ఏటా 30–40 వజ్రాలు లభిస్తాయి. అంటే ఈ రెండు జిల్లాల్లో ఏటా వంద వజ్రాలు లభిస్తున్నాయి. మైనింగ్ చేస్తే రూ. వందల కోట్ల విలువైన సంపద ప్రభుత్వానికి లభించే అవకాశం ఉంది. వజ్రాన్ని గుర్తు పడతాం మాది కలికిరి. హైదరాబాద్‌లోని స్నేహితుడు, నేను కలిసి మూడు రోజుల క్రితం ఇక్కడికి వచ్చాం. దొరికితే వజ్రం. లేదంటే కాలక్షేపంగా ఉంటుందని వచ్చాం. మేం బంగారం నగలు తయారు చేస్తాం. వజ్రం ఎలా ఉంటుందో సులువుగా గుర్తుపడతాం. – రామాంజులాచారి, కలికిరి, అన్నమయ్య జిల్లా ఐదోసారి వచ్చా వానొస్తే మా ఊరోళ్లంతా రైలెక్కి గుత్తిలో దిగి జొన్నగిరికి వస్తాం. నేను ఇక్కడికి ఐదేళ్ల నుంచి వస్తున్నాను. వచ్చి వారమైంది. ఐదేళ్లలో ఒక్క వజ్రం కూడా దొరకలేదు. తిండీ తిప్పలకు ఇబ్బందిగా ఉంది. మాతో పాటు వచ్చిన కొంతమందికి వజ్రాలు దొరుకుతున్నాయి. మాకు ఆశ చావక వెతుకుతున్నాం. – ఈరయ్య, రామాపురం, వినుకొండ, పల్నాడు జిల్లా -
నల్లమలలో ఆశల వేట!
మహానంది: నల్లమల.. ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలకు, ప్రకృతి అందాలకు, చారిత్రక విశేషాలకు పెట్టింది పేరు. నంద్యాల నుంచి గిద్దలూరు వెళ్లే ఘాట్‌రోడ్డులో సర్వనరసింహ స్వామి ఆలయం ఎంతో ప్రసిద్ధి చెందింది. ఆలయానికి సమీపంలో ఉల్లెడ మల్లేశ్వరస్వామి ఆలయంతో పాటు వజ్రాల వంక ఉంది. వర్షాలు పడితే వంకలో వజ్రాలు దొరుకుతుంటాయని ప్రజల నమ్మకం. దీంతో కర్నూలు, కడప, అనంతపురం, చిత్తూరు జిల్లాలతో పాటు గుంటూరు, పల్నాడు, ప్రకాశం జిల్లాల నుంచి వందలాది మంది ప్రజలు తమ అదృష్టాన్ని పరిక్షించుకునేందుకు ఇక్కడికి వస్తున్నారు. తాజాగా వర్షాలు పడుతుండటంతో వజ్రాన్వేషణ సాగుతోంది. విలువైన రాళ్లతో ఆదాయం వజ్రాలు దొరుకుతున్నాయని వస్తున్న వారికి పలు రకాల రంగురాళ్లు దొరుకుతున్నాయి. రంగు రాయి నాణ్యతను బట్టి రూ. 20 వేల నుంచి రూ. లక్ష వరకు వస్తుందని పలువురు చెబుతున్నారు. వారం రోజుల క్రితం గుంటూరు జిల్లాకు చెందిన ఇద్దరికి రూ. లక్ష విలువైన వజ్రాలు దొరికాయని స్థానికులు చెప్పారు. దీంతో ఇక్కడికి వచ్చిన వారు ఉదయం నుంచి చీకటి పడేవరకు వజ్రాన్వేషణ చేసి అనంతరం దగ్గరలోని ఆంజనేయపురం గ్రామం వద్ద ఉన్న ఆంజనేయస్వామి ఆలయం వద్ద రాత్రి వేళల్లో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఇటీవల వర్షాలు కురవడంతో వజ్రాన్వేషణ కోసం వస్తున్నవారి సంఖ్య గణనీయంగా పెరిగింది. -
కర్నూల్ లో వజ్రాల వేట
-
వాన పడింది..వజ్రాల వేట షురూ..
-
47వ అంతస్తు.. రూ.97 కోట్లు! ఖరీదైన ఫ్లాట్ కొన్న వజ్రాల వ్యాపారి
దేశంలోనే అత్యంత ఖరీదైన రియల్ ఎస్టేట్ మార్కెట్‌గా పేరున్న ముంబై నగరంలో కోట్లాది రూపాయలు పెట్టి భవంతులు, ఫ్లాట్లు కొనుగోలు చేస్తున్న ప్రముఖుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా ఓ వజ్రాల వ్యాపారి సుమారు రూ.97 కోట్లు పెట్టి ఫ్లాట్‌ను కొనుగోలు చేశారు.రియల్ఎస్టేట్ సమాచార సంస్థ జాప్కీకి లభించిన పత్రాల ప్రకారం.. డైమండ్ కంపెనీ కిరణ్ జెమ్స్ ప్రమోటర్ మావ్జీభాయ్ షామ్‌జీభాయ్ పటేల్ ముంబైలోని పోష్ ఒబెరాయ్ 360 వెస్ట్‌లో రూ. 97.4 కోట్లతో అపార్ట్‌మెంట్‌ను కొనుగోలు చేశారు. వర్లీలో ఉన్న ఈ అపార్ట్మెంట్ భవనాన్ని ముంబైలోని అత్యంత ఖరీదైన రియల్ ఎస్టేట్‌లో ఒకటిగా పరిగణిస్తారు.అపార్ట్మెంట్ భవనంలోని 47వ అంతస్తులో మావ్జీభాయ్ కొన్న ఫ్లాట్ 14,911 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. ఈ విస్తీర్ణాన్ని మరో 884 చదరపు అడుగులు విస్తరించుకునేందుకు అవకాశం ఉంటుంది. పత్రాల ప్రకారం.. దీని విక్రేత ఒయాసిస్ రియాల్టీ భాగస్వామి అయిన స్కైలార్క్ బిల్డ్‌కాన్ ప్రైవేట్ లిమిటెడ్. ఈ అపార్ట్మెంట్ తొమ్మిది కార్ పార్కింగ్ స్లాట్లతో వస్తుంది. సేల్ డీడ్ ఏప్రిల్ 29న జరిగినట్లు తెలుస్తోంది. ఈ లావాదేవీపై పటేల్ రూ.5.8 కోట్ల స్టాంప్ డ్యూటీ చెల్లించారు.ముంబైలోని 360 వెస్ట్ ప్రాజెక్ట్ 4 బీహెచ్‌కే, 5 బీహెచ్‌కే యూనిట్లను కలిగి ఉంటుంది. రెండు టవర్లుగా ఉండే ఈ భవనంలో ఒక దాంట్లో రిట్జ్-కార్ల్టన్ హోటల్ ఉండగా మరో టవర్‌లో విలాసవంతమైన నివాసాలు ఉన్నాయి. వీటిని గ్లోబల్ హాస్పిటాలిటీ చైన్ నిర్వహిస్తోంది. సముద్ర వీక్షణ ప్రాజెక్ట్ అయిన దీని ఎత్తు 360 మీటర్లు ఉండటం, అన్ని అపార్ట్మెంట్లు పడమర వైపు ఉన్నందున దీనికి ఈ పేరు వచ్చింది. -
గర్ల్ ఫ్రెండ్‌కో డైమండ్.. మీకో గుడ్ న్యూస్..!
సహజ వజ్రాలు భూగర్భంలో తీవ్ర ఒత్తిడి, ఉష్ణోగ్రతలలో ఏర్పడటానికి వందల, లక్షల ఏళ్లు పడుతుంది. ఇటీవలి కాలంలో బాగా పాపులర్ అయిన సింథటిక్ వజ్రాలు కొన్ని వారాల్లో తయారు చేయవచ్చు. ఇపుడిక కొన్ని నిమిషాల్లోనే తయారు చేయవచ్చు. ఎక్కడ? ఎలా అంటారా. అయితే మీరీ కథనం చదవాల్సిందే.!వజ్రాలు.. డైమండ్స్.. పేరు చెబితేనే ఖరీదైన వ్యవహారం అని అనుకుంటాం. జేమ్స్ బాండ్ మూవీ టైటిల్ ట్రాక్ ‘‘డైమండ్స్ ఆర్ ఫరెవర్’’ లో చెప్పినట్టు వజ్రాలు శాశ్వతం. అందుకే తమ ప్రేమ కలకలం నివాలని ప్రేమికులు డైమండ్ రింగులను ఇచ్చి పుచ్చుకోవడం ఫ్యాషన్. కానీ గుడ్ న్యూస్ ఏమిటంటే కేవలం కొన్ని నిమిషాల వ్యవధిలోనే తయారైన వజ్రాలు ఫ్యాషన్ మార్కెట్లలోకి రాబోతున్నాయి. దక్షిణ కొరియాలోని ఇన్స్టిట్యూట్ ఫర్ బేసిక్ సైన్స్ పరిశోధకుల బృందం డైమండ్స్ తయారీలో ఒక వినూత్న విధానాన్ని కొనుగొంది. దీంతో సింథటిక్ వజ్రాల ఉత్పత్తిలో గణనీయమైన మార్పురానుందని, సరసమైన ధరల్లో డైమండ్స్ అందుబాటులోకి రానున్నాయని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. భూమి పొరల్లో కొన్ని లక్షల సంవత్సరాలపాటు అత్యధిక ఉష్ణోగ్రత, పీడనానికి గురై కార్బన్ అణువులు ఘనీభవించడం వల్ల ఏర్పడుతుంది. అయితే ల్యాబ్‌లో వజ్రాల తయారీకి కూడా కొంత సమయం ఎక్కువ పడుతుంది. కానీ పరిశోధకులు కేవలం 150 నిమిషాల్లో వజ్రాలను తయారు చేసే ప్రక్రియను గుర్తించారు. ప్రత్యేకమైన ద్రవ లోహ మిశ్రమంతో కేవలం 150 నిమిషాల్లోనే వజ్రాలను తయారు చేసే పద్ధతిని రూపొందించారు. అది కూడా సాధారణ వాతావరణ పీడనంతోనే వాటిని తయారు చేయడం విశేషం.అయితే వజ్రాలకోసం కార్బన్‌ను ద్రవ లోహంలో కరిగించడం కొత్తదేమీ కాదు. కరిగిన ఇనుము సల్ఫైడ్ను ఉపయోగించే ప్రక్రియను 50 ఏళ్ల క్రితమే జనరల్ ఎలక్ట్రిక్ అభివృద్ధి చేసింది. అయితే ఇందుకోసం భారీ పీడనాన్ని ఉపయోగించాల్సి వచ్చేది. కొత్త విధానంలో గేలియం, ఐరన్, నికెల్, సిలికాన్ లను మీథేన్, హైడ్రోజన్ వాయువులతో కలిపి వ్యాక్యూమ్ చాంబర్ లో అత్యంత వేగంగా వేడి చేస్తారు. దీనివల్ల కార్బన్ అణువులు ద్రవ లోహంలో పారదర్శక స్పటికాలుగా మారి తరువాత డైమండ్ సీడ్స్ తయారవుతాయి. అలా మొత్తంగా 150 నిమిషాలకు వజ్రం ముక్కలు ఏర్పడతాయి. ఈ కొత్త పద్ధతి ద్వారా పారిశ్రామిక అవసరాల కోసం వజ్రాల ఉత్పత్తిని పెంచేందుకు ఉపయోగ పడుతుందని పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు. ఈ పరిశోధన వివరాలను నేచర్‌లో ప్రచురించారు. -
నూడుల్స్‌లో డైమండ్స్ : ఏం తెలివితేటలు రా అయ్యా!
బంగారం, విలువైన వజ్రాలను అక్రమంగా రవాణా చేసేందుకు కేటుగాళ్లు అనుసరిస్తున్న పద్దతులు అధికారులను సైతం విస్మయపరుస్తున్నాయి. కానీ చివరకుఅధికారుల తనిఖీల్లో అడ్డంగా దొరికి పోతున్నారు. తాజాగా ముంబై విమానాశ్రయంలో కస్టమ్స్ డిపార్ట్మెంట్ కోట్లరూపాయల విలువైన వజ్రాలను, బంగారాన్ని స్వాధీనం చేసుకుంది. ముఖ్యంగా నూడుల్స్ ప్యాకెట్లలో డైమండ్స్ దాచిన తీరు హాట్ టాపిక్‌గా నిలిచింది. ముంబైనుంచి బ్యాంకాక్‌కు వెళ్తున్న భారతీయుడు ట్రాలీ బ్యాగ్‌లో నూడుల్స్ ప్యాకెట్లో డైమండ్లను తరలిస్తూ గుట్టుగా అధికారుల కన్నుగప్పాలని చేశాడు. కానీ తనిఖీల్లో అడ్డంగా బుక్కయ్యాడు. రూ.2.02 కోట్ల విలువైన 254.71 క్యారెట్ల నేచురల్ లూజ్ డైమండ్, 977.98 క్యారెట్ ల్యాబ్ గ్రోన్ డైమండ్ లభ్యమయ్యాయి.మరో ఘటనలో కొలంబో నుండి ముంబైకి ప్రయాణిస్తున్న ఒక విదేశీ మహిళను తనిఖీ చేయగా ఆమె లోదుస్తుల లోపల దాచిన 24 క్యారెట్ల గోల్డ్ బిస్కట్లు కనుగొన్నారు. వీటి మొత్తం బరువు 321గ్రాములు. మరో వైపు ఫేస్ మాస్క్‌లోనూ డైమండ్స్ తరలిస్తున్నట్లు గుర్తించారు. దుబాయ్ నుంచి ఇద్దరు, అబుదాబి ఇద్దరు, బహ్రెయిన్ ఇద్దరు, దోహానుఎంచి ఇద్దరు రియాద్ ఇద్దరు మస్కట్ బ్యాంకాక్ ,సింగపూర్ నుంచి ఒక్కొక్కరు చొప్పున 10 మంది అనుమానితులను తనిఖీ చేయగా, రెక్టమ్, ఇతర శరీర భాగాల్లో దాచిన రూ.4.04 కోట్ల విలువైన 6.199 కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నారు. మొత్తం గా 13 వేర్వేరు కేసుల్లో రూ.6.46 కోట్ల విలువైన అక్రమ రవాణా బంగారం, డైమండ్స్,తదితరాలను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అరెస్ట్ చేశారు.During 19-21 April, 2024, Airport Commissionerate, Mumbai Customs Zone-III seized over 6.815 Kg Gold valued at Rs. 4.44 Cr & Diamonds valued at Rs. 2.02 Cr total amounting to Rs. 6.46 Cr across 13 cases. Diamonds were found concealed in noodle packets. Four pax were arrested. pic.twitter.com/j5wAPV5jAk— Mumbai Customs-III (@mumbaicus3) April 22, 2024#WATCH | Maharashtra: During 19-21 April, 2024, Mumbai Customs seized over 6.815 Kg of gold valued at Rs 4.44 crores and diamonds valued at Rs 2.02 crores, total amounting to Rs 6.46 crores across 13 cases. Diamonds were found concealed in noodle packets. Four Passengers were… pic.twitter.com/02LzDS1aDZ— ANI (@ANI) April 22, 2024 -
రూ.10 కోట్ల వజ్రాలు రూ.3 కోట్లకే
దొడ్డబళ్లాపురం: రూ.10 కోట్ల విలువైన వజ్రాలను రూ.3 కోట్లకే ఇస్తామని నమ్మించి వ్యాపారిని మోసం చేయడానికి యత్నించిన నలుగురిని బెంగళూరు కెంపేగౌడ విమానాశ్రయం పోలీసులు అరెస్టు చేసారు. రవి, నవీన్‌కుమార్, అహ్మద్, అబ్దుల్ దస్తగిరి పట్టుబడ్డ నిందితులు. లక్ష్మినారాయణ అనే వజ్రాల వ్యాపారికి వాట్సాప్ కాల్ చేసి పై విధంగా ప్రలోభపెట్టారు. డీల్ కుదుర్చుకోవడానికి నిందితులు, వ్యాపారి ఎయిర్‌పోర్టు వద్ద తాజ్ హోటల్లో కలిశారు. వ్యాపారి ఆ వజ్రాలను పరిశీలించగా అవి నకిలీవని తెలిసింది. దీంతో ఎయిర్‌పోర్టు పోలీసులకు సమాచారం ఇవ్వగా నిందితులను అరెస్టు చేసి నకిలీ వజ్రాలను సీజ్ చేశారు. -
అతిపెద్ద గొయ్యి.. ఇక్కడ తవ్వే కొద్ది వజ్రాలు!
తూర్పు సెర్బియాలో ఉన్న వజ్రాల గని ఇది. భూమ్మీద అతిపెద్ద గోతుల్లో ఒకటిగా ఇది రికార్డులకెక్కింది. దీని వ్యాసం 1200 మీటర్లు, లోతు 525 మీటర్లు. తొలిసారిగా ఈ ప్రాంతంలో వజ్రాల నిక్షేపాలు ఉన్నట్లు 1955లో నాటి సోవియట్ భూగర్భ శాస్త్రవేత్త యూరీ ఖబార్దిన్ గుర్తించారు. వజ్రాలను వెలికి తీసేందుకు అప్పటి సోవియట్ ప్రభుత్వం 1957లో ఇక్కడ మిర్నీ మైన్ పేరిట గనిని ప్రారంభించింది. ఈ గని నుంచి ఏకధాటిగా 2001 వరకు వజ్రాల వెలికితీత కొనసాగింది. తర్వాత కొన్నాళ్లు ఇది మూతబడింది. ఇది రష్యన్ వజ్రాల కంపెనీ ‘ఎయిరోసా’ చేతుల్లోకి వెళ్లడంతో 2009 నుంచి మళ్లీ వజ్రాల వెలికితీత కొనసాగుతోంది. ఇక్కడ వజ్రాల గని ప్రారంభమైన నాటి నుంచి నేటి వరకు ఏటా సగటున కోటి కేరట్ల (రెండువేల కిలోలు) వజ్రాల వెలికితీత జరిగినట్లు రికార్డులు చెబుతున్నాయి. మరో నలబై ఏళ్లకు పైగా ఇక్కడి నుంచి వజ్రాలను వెలికితీసే అవకాశాలు ఉన్నాయని ఎయిరోసా కంపెనీ భావిస్తోంది. -
ఒకే రోజు రూ.78 కోట్ల జప్తు
సాక్షి, హైదరాబాద్: శాసనసభ సాధారణ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులు గురువారం రికార్డు స్థాయిలో రూ.78.03 కోట్లు విలువ చేసే నగదు, మద్యం, ఇతర వస్తువులను జప్తు చేశారు. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో జప్తు చేసిన నగదు, ఇతర వస్తువుల మొత్తం విలువ రూ.243.76 కోట్లకు పెరిగిపోయింది. కాగా, ఇప్పటి వరకు స్వాధీనం చేసుకున్న మొత్తం నగదు రూ.87.92 కోట్లు. ఒక్క రోజు 6వేల లీటర్ల మద్యం జప్తు తాజాగా రూ.1.21 కోట్లు విలువ చేసే 6132 లీటర్ల మద్యం జప్తు చేశారు. దీంతో ఈ నెల 9 నుంచి ఇప్పటి వరకు జప్తు చేసిన మొత్తం మద్యం 65,223 లీటర్లు కాగా, దీని విలువ రూ.10.21 కోట్లు. గురువారం రూ.16.77లక్షలు విలువ చేసే 103.165 కిలోల గంజాయి స్వాధీనం చేసుకోగా, ఇప్పటి వరకు స్వాధీనం చేసుకున్న గంజాయి 2950 కిలోలకు పెరిగింది. దీని విలువ రూ.7.72 కోట్లు. ఇప్పటి వరకు మరో రూ.7.72 కోట్లు విలువ చేసే ఇతర మత్తు పదార్థాలను జప్తు చేశారు. గురువారం రూ.57.67 కోట్లు విలువ చేసే బంగారం, వెండి, ఇతర వస్తువులు పట్టుకున్నారు. 83కిలోల బంగారం పట్టివేత అందులో 83.046 కిలోల బంగారం, 212 కిలోల వెండి, 112.195 క్యారట్ల వజ్రాలు, 5.35 గ్రాముల ప్లాటినం ఉంది. దీంతో ఇప్పటి వరకు పట్టుబడిన బంగారం, వెండి, ఇతర విలువైన వస్తువుల విలువ రూ.120.40 కోట్లకు ఎగబాకింది. ఇందులో 181 కిలోల బంగారం, 693కిలోల వెండి, 154.45 క్యారెట్ల వజ్రాలున్నాయి. గురువారం రూ.8.84 కోట్లు విలువ చేసే ల్యాప్‌టాప్‌లు, వాహనాలు, కుక్కర్లు, చీరలు, క్రీడా సామగ్రి తదితర వస్తువులను పట్టుకున్నారు. దీంతో ఇప్పటి వరకు పట్టుబడిన ఇలాంటి వస్తువుల విలువ రూ.17.84 కోట్లకు చేరింది. హైవేపై రూ.750 కోట్ల నగదు కలకలం అలంపూర్: జోగుళాంబ గద్వాల జిల్లా సరిహద్దులోని 44వ జాతీయ రహదారిపై ఏకంగా రూ.750 కోట్ల నగదు పట్టుబడినట్లు సామాజిక మాధ్యమాల్లో గురువారం వైరల్ అయింది. దీంతో జిల్లా ఎన్నికల అధికారి వల్లూరు క్రాంతి ఈ ఘటనకు సంబంధించిన వివరాలను ఓ ప్రకటనలో వెల్లడించారు. ’’రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా ఆదేశాల మేరకు కేరళ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి హైదరాబాద్ యూబీఐకి నగదును బదిలీ చేస్తున్నట్టు మంగళవారం రాత్రి సమాచారం వచ్చింది. ఈ మేరకు జిల్లా నుంచి ఆర్డీఓ, లీడ్ బ్యాంక్ మేనేజర్, డీఎస్పీ అధికారులు విచారణ చేసేందుకు స్పాట్‌కు వెళ్లి, నగదుకు సంబంధించిన పత్రాలను పరిశీలించారు. ఆ తర్వాత పోలీస్ ఎస్కార్ట్‌తో నగదును హైదరాబాద్‌లోని యూబీఐకి చేరినట్లు నిర్ధారణ చేసుకున్నాము’’’ అని క్రాంతి ఆ ప్రకటనలో వివరించారు. అయితే ఎంత మేరకు నగదు ఉందనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. -
అరుదైన పెన్ను రూ.66.6 కోట్లు! ప్రపంచంలో అత్యంత ఖరీదైన కలం ఇదే..
World's most expensive pen: ప్రపంచ వ్యాప్తంగా అరుదైన వస్తువులను వేలం వేస్తుంటారు. ఆయా వస్తువులు కోట్లాది రూపాయలు పలకడం గురించి వింటుంటాం. ఇలాగే ఓ అరుదైన పెన్నును వేలం వేయగా 8 మిలియన్ డాలర్లు (రూ.66.6 కోట్లు) పలికింది. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైనదిగా నిలిచింది. టిబాల్డి కంపెనీ తయారు చేసిన ఈ పెన్ను పేరు ‘ఫుల్గోర్ నోక్టర్నస్’. ఇది లాటిన్ పేరు. దీనికి అర్థం నైట్ గ్లో. నల్ల వజ్రాలు పొదిగిన ఈ అసాధారణ ఫౌంటెన్ పెన్‌కి ఇది సముచితమైన పేరు. 123 కెంపులు, 945 నల్ల వజ్రాలు, బంగారం అసాధారణమైన ఫుల్గోర్ నోక్టర్నస్ పెన్ నిర్మాణం, డిజైన్ ఫై రేషియోలో ఉంటాయి. దీన్ని దైవిక నిష్పత్తిగా పేర్కొంటారు. ఫుల్గోర్ నోక్టర్నస్ బాడీ, క్యాప్‌పై నల్ల వజ్రాలు విలాసంగా పొదిగి ఉంటాయి. అలాగే అద్భుతమైన బ్లడ్ రెడ్ కెంపులు పెన్ను క్యాప్‌ని అలంకరించి ఉంటాయి. మొత్తంగా ఇందులో 945 నల్ల వజ్రాలు, 123 కెంపులు పొదిగారు. 18-క్యారెట్ల బంగారంతో దాని నిబ్‌ను తయారు చేశారు. అత్యంత ఖరీదైన పెన్ను ఈ పెన్నును ప్రత్యేక ఉంచేది దాని దైవిక ఫై నిష్పత్తి. ఈ పెన్నును క్యాప్తొ మూసేసినప్పుడు అవి 1.618 ఫై నిష్పత్తిలో ఉంటాయి. ఇలాంటి పెన్ను మరొకటి లేదు. 2020లో ఫుల్గోర్ నోక్టర్నస్ పెన్ను షాంఘైలో వేలం వేయగా అది 8 మిలియన్ డాలర్లు పలికింది. ఇంతవరకూ ఏ పెన్ను కూడా ఈ స్థాయిలో ధర పలకలేదు. దీంతో ఇదే ప్రపంచ అత్యంత ఖరీదైన పెన్నుగా నిలిచింది. ఇదీ చదవండి: Dr Ranjan Pai: నాడు అద్దె ఇల్లు.. నేడు 6 యూనివర్సిటీలు, 28 ఆస్పత్రులు -
రూ .50 కోట్ల విస్కీ బాటిల్
ఇది ప్రపంచంలోకెల్లా అత్యంత ఖరీదైన మద్యం సీసా! ఆ ఏముందిలే... మహా అయితే దీని ధర రూ. వేలల్లోనో లేదా ఇంకా ఎక్కువనుకుంటే రూ. కొన్ని లక్షలు ఉండొచ్చనుకుంటున్నారా? అయితే మీరు పొరబడ్డట్లే..!! ఎందుకంటే దీని ధర ఏకంగా రూ .50 కోట్లపైనే!! ఈ సీసాను 8,500 వజ్రాలు, 300 కెంపులతో పొదగడంతోపాటు వైట్ గోల్డ్‌తో మెరుగులు దిద్దారు. యూకేకు చెందిన ద లగ్జరీ బెవరేజ్ కంపెనీ... ఇసబెల్లా ఐలా ఒరిజినల్ విస్కీ పేరుతో ప్రీమియం సింగిల్ మాల్ట్ విస్కీని ఈ సీసాలో విక్రయిస్తోంది. పైగా దీన్ని ఓ అందమైన చిన్న పెట్టెలో భద్రపరిచి కొనుగోలుదారులకు అందిస్తోంది. -
వేగా శ్రీ రెండో వార్షికోత్సవం గోల్డ్ అండ్ డైమండ్స్ స్పెషల్ కలెక్షన్స్ (ఫోటోలు)
-
కట్, పాలిష్డ్ వజ్రాల ఎగుమతుల్లో క్షీణత
ముంబై: కట్, పాలిష్డ్ వజ్రాల (సీపీడీ) ఎగుమతులు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 22 శాతం తగ్గి 17.2 బిలియన్ డాలర్లుగా (రూ.1.42 లక్షల కోట్లు) ఉండొచ్చని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా అంచనా వేసింది. అమెరికా, యూరప్ వంటి కీలక వినియోగ ప్రాంతాల్లో ద్రవ్యోల్బణం ప్రభావంతో డిమాండ్ తగ్గిన విషయాన్ని ప్రస్తావించింది. ‘‘2022–23 ద్వితీయ ఆరు నెలల నుంచి సీపీడీల ఎగుమతులు క్రమంగా క్షీణిస్తూ వస్తున్నాయి. ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి ఐదు నెలల కాలంలో చూసినా (ఏప్రిల్–ఆగస్ట్) ఎగుమతులు 31 శాతం తక్కువగా నమోదయ్యాయి’’ అని ఇక్రా నివేదిక వెల్లడించింది. పండుగల సీజన్ నేపథ్యంలో రానున్న నెలల్లో ఎగుమతులు సీక్వెన్షియల్‌గా (క్రితం నెలతో పోలి్చనప్పుడు) పెరగొచ్చని పేర్కొంది. మొత్తం మీద పూర్తి ఆర్థిక సంవత్సరానికి 22 శాతం తక్కువగా నమోదు అవుతాయని తెలిపింది. ఈ రంగం అవుట్‌లుక్‌ను స్థిరత్వం నుంచి నెగెటివ్‌కు మార్చింది. ‘‘ప్రపంచవ్యాప్తంగా డైమండ్ల డిమాండ్‌లో చైనా వాటా 10–15 శాతంగా ఉంటుంది. చైనా మార్కెట్లో ఈ డిమాండ్ ఇంకా చెప్పుకోతగినంతగా పుంజుకోలేదు‘‘అని ఇక్రా వైస్ ప్రెసిడెంట్ సాక్షి సునేజా తెలిపారు. సహజ వజ్రాలతో పోలిస్తే ల్యాబ్‌లో తయారైన వజ్రాలు చాలా తక్కువ ధరలో లభిస్తుండడం కూడా అధిక పోటీకి కారణమవుతున్నట్టు చెప్పారు. గరిష్ట స్థాయిలో ముడి వజ్రాల ధరలు ముడి వజ్రాల ధరలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో గరిష్ట స్థాయిలోనే కొనసాగుతాయని ఇక్రా నివేదిక అంచనా వేసింది. ప్రస్తుత ధరలు 15 ఏళ్ల మధ్యస్థ స్థాయిలో ఉన్నాయని తెలిపింది. కరోనా తర్వాత ఒక్కసారిగా పెరిగిన డిమాండ్, మైనింగ్ కంపెనీల నుంచి సరఫరా తగ్గడం వల్లే గడిచిన రెండేళ్ల కాలంలో ధరలు పెరగడానికి దారితీసినట్టు వివరించింది. ప్రస్తుతం డిమాండ్ తగ్గినప్పటికీ రష్యా నుంచి ముడి వజ్రాల సరఫరా తగ్గడంతో ధరలు గరిష్ట స్థాయిలోనే కొనసాగుతున్నట్టు పేర్కొంది. రష్యాకు చెందిన అల్రోసా పీజేఎస్సీ మైనింగ్ సంస్థపై అమెరికా ఆంక్షలు విధించిన విషయాన్ని గుర్తు చేసింది. అదే సమయంలో ఇతర మైనింగ్ సంస్థల నుంచి అదనపు సరఫరా రాకపోవడం ధరలకు రెక్కలు వచి్చనట్టు వివరించింది. పాలిష్డ్ వజ్రాల ధరలపై ఒత్తిడి ఉన్నట్టు తెలిపింది. 15 ఏళ్ల మధ్యస్థ స్థాయి కంటే 15–20 శాతం తక్కువగా ఉన్నట్టు తెలిపింది. దీనికి తోడు డిమాండ్‌పై ఒత్తిళ్లు, కస్టమర్లకు ధరల పెంపును బదిలీ చేసే సామర్థ్యం తక్కువగా ఉండడంతో, వజ్రాల కంపెనీల లాభాల మార్జిన్లు 0.4 శాతం వరకు తగ్గిపోవచ్చని అంచనా వేసింది. నిల్వలు కూడా పెరుగుతాయని పేర్కొంది. ఎగుమతిదారులకు వెసులుబాటు 2024 జూన్ వరకూ ఆర్ఓడీటీఈపీ స్కీమ్ వర్తింపు ఎగుమతిదారుల ప్రయోజనాలకు ఉద్దేశించిన ఆర్ఓడీటీఈపీ స్కీమ్ (స్కీమ్ ఫర్ రెమిషన్ ఆఫ్ డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ ఆన్ ఎక్స్‌పోర్టెడ్ ప్రొడక్ట్స్) పథకాన్ని 2024 జూన్ వరకూ పొడిగిస్తూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. 2021 సెపె్టంబర్ నుంచి ఈ పథకం అమల్లో ఉంది. ఈ నెలతో ముగియనుంది. ప్రస్తుతం, 10,342 పైగా ఎగుమతి వస్తువులు ఈ పథక ప్రయోజనాల కిందకు వస్తున్నాయి. ఎగుమతి చేసిన ఉత్పత్తులపై సుంకాలు, పన్నుల ఉపశమన పథకం ఇది. వస్తువుల తయారీ– పంపిణీ ప్రక్రియలో ఎగుమతిదారులు చెల్లించే పన్నులు, సుంకాలు, లెవీల వాపసు కోసం ఉద్దేశించినది. ప్రస్తుత అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి పరిస్థితుల్లో ఎగుమతిదారులకు కేంద్రం తాజా నిర్ణయం ఊరటనివ్వనుందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. -
నడిరోడ్డుపై ఖరీదైన డైమండ్లు, ఎగబడిన జనం: అదిరిపోయే ట్విస్ట్
డైమండ్ సిటీ సూరత్ డైమండ్ బిజినెస్‌కు పెట్టింది పేరని అందరికీ తెలుసు. అయితే తాజాగా సూరత్‌లో ఒక వ్యాపారి కోట్ల విలువైన డైమండ్లున్న ఒక వీడియో పోగొట్టు కున్నాడని వార్త వైరల్ అయింది. దీంతో డైమండ్ల కోసం వేట మొదలైంది. దీనికి సంబంధించిన వీడియో ఇంటర్నెట్లో చక్కర్లు కొడుతోంది. గుజరాత్లోనివరచ్చా ప్రాంతంలో ఒక వ్యక్తి అనుకోకుండా వజ్రాల ప్యాకెట్‌ను పడవేసుకున్నట్టు పుకార్లు వ్యాపించడంతో వజ్రాలకోసం ఎగబడ్డారు జనం. అహ్మదాబాద్ మిర్రర్ కథనం ప్రకారం, కోట్ల విలువైన వజ్రాలు ప్రమాదవశాత్తు రోడ్డుపై పడిపోయాయనే వార్త దావానలంలా వ్యాపించింది. దీంతో జనం తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమైపోయారు. దీంతో ఆ ప్రాంతంలో భారీ రద్దీ ఏర్పడింది. కొందరైతే ఏకంగా మార్కెట్ రోడ్డులోని దుమ్మును కూడా వదిలిపెట్టకుండా డైమండ్స్ కోసం వెతికేశారు. కొంతమంది వజ్రాలను దక్కించు కుని సంబరాలు చేసుకున్నారు. కానీ అవి నకిలీ వజ్రాలని తేలడంతో ఉసూరుమన్నారు. (మస్క్ మామూలోడు కాదయ్యా..వీడియో వైరల్! ఇక ఆ రోబో కూడా?) అయితే తనకు దొరకింది నకిలీ వజ్రం అని తేలిందని, ఇది ఇమిటేషన్ జ్యూయల్లరీ, లేదా చీర పనిలో ఉపయోగించే అమెరికన్ డైమండ్ అని అరవింద్ పన్సేరియా వాపోయారు. ఇది ఎవరో కావాలని చేసిన ప్రాంక్ అయి ఉంటుందన్నారు. వజ్రాల కొనుగోలు, అమ్మకానికి ప్రసిద్ధి చెందిన మినీ బజార్ వరచ్చా ప్రాంతంలో వ్యాపారి పొరపాటున వజ్రాల ప్యాకెట్‌ను జారవిడిచినట్టు వదంతులు వ్యాపించాయని తెలుస్తోంది. #સુરત વરાછા મિનિબજાર રાજહંસ ટાવર પાસે હીરા ઢોળાયાની વાત થતા હીરા શોધવા લોકોની ભીડ થઈ. પ્રાથમિક સૂત્રો દ્વારા જાણવા મળેલ છે કે આ હીરા CVD અથવા અમેરિકન ડાયમંડ છે..#Diamond #Surat #Gujarat pic.twitter.com/WdQwbBSarl — 𝑲𝒂𝒍𝒑𝒆𝒔𝒉 𝑩 𝑷𝒓𝒂𝒋𝒂𝒑𝒂𝒕𝒊 🇮🇳🚩 (@KalpeshPraj80) September 24, 2023 -
ప్రపంచంలోనే ఖరీదైన కాయిన్.. కిలోలకొద్దీ బంగారం, వజ్రాలు.. చూస్తే కళ్లు చెదరాల్సిందే!
World's Most Expensive Coin: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కాయిన్‌ను బ్రిటన్‌లో ఆవిష్కరించారు. దివంగత క్వీన్ ఎలిజబెత్-2 (Queen Elizabeth 2) గౌరవార్థం ఈ నాణేన్ని రూపొందించారు. ఇది అన్ని కాలాలలో అత్యంత విలువైనదని భావిస్తున్నారు. దాదాపు 4 కిలోల బంగారం (Gold), 6,400 కంటే ఎక్కువ వజ్రాలతో (Diamonds) తయారు చేసిన ఈ నాణెం విలువ సుమారు 23 మిలియన్ డాలర్లు (రూ.192 కోట్లు) అని సీఎన్ఎన్ వార్తా సంస్థ నివేదించింది. (Birmingham bankrupt: బ్రిటన్‌లో సంచలనం.. దివాలా తీసిన ప్రముఖ నగరం!) లగ్జరీ లైఫ్ స్టైల్ బ్రాండ్ ఈస్ట్ ఇండియా కంపెనీ తయారు చేసిన ఈ నాణేన్ని క్వీన్ ఎలిజబెత్-2 మొదటి వర్ధంతి సందర్భంగా విడుదల చేశారు. కామన్వెల్త్ దేశాల్లోని హస్తకళాకారులు 16 నెలలపాటు శ్రమించి దీన్ని తయారు చేశారు. దీన్ని మరింత ఘనంగా రూపొంచాలనుకున్నా వజ్రాల కొరత కారణంగా సాధ్యం కాలేదు. స్కై న్యూస్ ప్రకారం.. 9.6 అంగుళాల కంటే ఎక్కువ వ్యాసం కలిగిన ఈ నాణెం బాస్కెట్‌బాల్ పరిమాణంలో ఉంది. దీనిపై ప్రఖ్యాత పోర్ట్రెయిట్ కళాకారులు మేరీ గిల్లిక్, ఆర్నాల్డ్ మచిన్, రాఫెల్ మక్లౌఫ్, ఇయాన్ ర్యాంక్-బ్రాడ్లీలు దివంగత చక్రవర్తి చిత్రాలను తీర్చిదిద్దారు. దీని మధ్య భాగంలో అమర్చిన నాణెం 2 పౌండ్లపైగా బరువుంటుంది. చుట్టూ ఉన్న చిన్న నాణేలు ఒక్కొక్కటి ఒక ఔన్స్ బరువు కలిగి ఉంటాయి. నాణెం అంచుల్లో క్వీన్ సూక్తులను ముద్రించారు. 2021 జూన్ లో సోథెబైస్ న్యూయార్క్‌లో 18.9 మిలియన్ డాలర్లు పలికిన అరుదైన 1933 యూఎస్ "డబుల్ ఈగిల్" నాణెమే ఇప్పటి వరకు వేలంలో విక్రయించిన అత్యంత ఖరీదైనది. ఇది గిన్నిస్ వరల్డ్ రికార్ట్‌లో నమోదైంది. Introducing The Crown – a once in a lifetime tribute to The Queen An extraordinary tribute coin created to commemorate the enduring legacy of Her Majesty Queen Elizabeth II. We invite you to view the piece and the making of in more detail on our website. pic.twitter.com/SiZXjfvjPB — The East India Company (@TheEastIndia) September 7, 2023 -
వజ్రాలు ఎలా లభ్యమవుతాయంటే..
సాక్షి ప్రతినిధి కర్నూలు: ఈ ఏడాది అధికమాసం కావడంతో వర్షాల రాక ఆలస్యమైంది. జూన్‌లో తొలకరి జల్లులు పడినా.. ఆ తర్వాత వరుణుడు కాస్త ముఖం చాటేశాడు. తిరిగి ఆగస్టులో మంచి వర్షం కురవడంతో వజ్రాన్వేషణ మొదలైంది. గతేడాది నుంచి కర్నూలు, నంద్యాల జిల్లాలతో పాటు ఇతర జిల్లాల వారు ఇక్కడ తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ఇక్కడ వాలిపోతున్నారు. తుగ్గలి, మద్దికెర మండలాల్లో ఏటా జూన్, జులై మాసాల్లో వజ్రాల వేట ముమ్మరంగా సాగుతుంది. దొరికిన వజ్రాలు కొనుగోలు చేసేందుకు గుత్తి, గుంతకల్లు, జొన్నగిరి, పెరవలిలో వ్యాపారులు ఉన్నారు. వీరు గ్రామాల్లో కొందరు ఏజెంట్లను నియమించుకున్నారు. వజ్రం దొరికిందనే సమాచారం రాగానే ఏజెంట్లు వారి వద్ద వాలిపోతారు. వజ్రం దొరికిన వారిని వ్యాపారులు వద్దకు తీసుకెళ్లి రేటు కుదురుస్తారు. వజ్రం బాగా విలువైంది అయితే వ్యాపారులే వారి వద్దకు వెళ్తారు. వ్యాపారుల మధ్య పోటీ పెరిగితే బహిరంగ వేలం వేస్తారు. గతంలో వేల నుంచి రూ.20 లక్షల వరకు వజ్రాలు కొనుగోలు చేశారు. ఈ ఏడాది ఇప్పటికే 8 వజ్రాలు లభ్యమయ్యాయి. ఇక్కడ వజ్రాలను స్థానిక వ్యాపారులకే విక్రయిస్తారు. అంతలా ఇక్కడి వ్యాపారులు నమ్మకం సంపాదించారు. చెప్పిన ధరకు సంబంధించిన డబ్బు వ్యాపారుల వద్దనే ఉంచితే వడ్డీ సహా చెల్లిస్తారు. అదే ప్రభుత్వ అధికారులకు సమాచారం ఇస్తే దానిని స్వాధీనం చేసుకుని పైసా కూడా రాదనే అభిప్రాయంతో వారు అధికారులకు చెప్పకుండా విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. వజ్రాలు లభ్యమయ్యే ప్రాంతాలు ఇవే.. కర్నూలు, అనంతపురం జిల్లాల సరిహద్దుల్లో వజ్రాల నిక్షేపాలు ఉన్నాయనే విషయాన్ని జీఎస్ఐ(జియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా) గుర్తించింది. ► తుగ్గలి, మద్దికెర మండలాల్లోని తుగ్గలి, జొన్నగిరి, పగిడిరాయి, కొత్తపల్లి, పెరవలి, అగ్రహారం, హంప, యడవలి, మద్దికెర ప్రాంతాల్లో వజ్రాలు లభ్యమవుతున్నాయి. ► అనంతపురం జిల్లాలోని వజ్రకరూరు మండలంలో గంజికుంట, తట్రకల్లు, రాగులపాడు, పొట్టిపాడు, కమలపాడు, గూళపాళ్యం, ఎన్.ఎంపీ.తండాలో వజ్రాల జాడ ఉంది. ► వజ్రకూరు, తుగ్గలి, మద్దికెరలో 50–60 కిలోమీటర్ల సరిహద్దులో వజ్రనిక్షేపాలను గుర్తించారు. ► ఈ ప్రాంతంలో కింబర్ లైట్ పైప్‌లైన్ ఉందని గనులు, భూగర్భ శాఖ నిర్ధారించింది. ► వజ్రాలు, బంగారు నిక్షేపాలపై గత కొన్నేళ్లుగా పరిశోధన జరుగుతుంది. ► విదేశీ సంస్థలు కూడా ఇక్కడ నిక్షేపాలపై పరిశోధన చేయడం విశేషం. చాలా దేశాలతో పోలిస్తే నాణ్యమైన వజ్రాలు వజ్రాల మైనింగ్ కోసం వజ్రకరూర్‌లో వజ్రాల ప్రక్రమణ కేంద్రాన్ని 1969లో ఏర్పాటు చేశారు. అయితే వజ్రాన్వేషణపై ఇది పెద్దగా దృష్టి సారించలేదు. ఆ తర్వాత ఓ ఆస్ట్రేలియన్ కంపెనీ వచ్చి కొద్దికాలం పాటు సర్వే చేసి తిరిగి వెళ్లింది. ఆఫ్రికాతో పాటు చాలా దేశాలతో పోలిస్తే ఇక్కడి వజ్రాలు చాలా నాణ్యమైనవి, విలువైనవి. అందుకే దీని వెలికితీతపై ప్రత్యేక దృష్టి సారిస్తే, మన దేశంలోని వజ్రాలకు ప్రపంచ మార్కెట్లో చాలా విలువ ఉంటుందనేది నిపుణుల అభిప్రాయం. విదేశాల్లో ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు ఆఫ్రికా, అంగోలా, కాంగోతో పాటు చాలా దేశాల్లో ఇదే తరహాలో వజ్రాలు లభిస్తాయి. వాటిని అల్యూవియల్ డైమండ్స్ అంటారు. అక్కడ ప్రభుత్వమే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తుంది. వజ్రాలు లభించిన వారు నేరుగా ఆ కేంద్రానికి వచ్చి చూపిస్తారు. వజ్రాల నాణ్యత ఆధారంగా కొంత మొత్తం చెల్లిస్తారు. వజ్రాలను లీగల్‌గా ప్రభుత్వం ప్రక్రియను పూర్తి చేసి విక్రయిస్తుంది. కర్నూలు జిల్లాలో ఏటా సగటున 50–60 వజ్రాలు లభిస్తున్నాయి. అలాగే వజ్రకరూరు ప్రాంతంలో కూడా ఏటా 30–40 వజ్రాలు బయటపడుతున్నాయి. అంటే ఈ రెండు జిల్లాల్లో ఏటా వంద వజ్రాలు లభిస్తున్నాయి. మైనింగ్ చేస్తే వందల కోట్ల విలువైన సంపద ప్రభుత్వానికి లభించే అవకాశం ఉంది. వజ్రాలు ఎలా లభ్యమవుతాయంటే.. మన దేశంలో డైమండ్మైనింగ్ మధ్యప్రదేశ్‌లోని పన్నాలో ఉంది. అక్కడ భూమిలోని రాళ్లు తవ్వితీసి వజ్రాల తయారీ ప్రక్రియ చేస్తారు. కానీ వజ్రకరూర్, తుగ్గలి, జొన్నగిరిలో మాత్రం రాళ్లు ఉన్నాయి. ఇవి 150 మీటర్ల లోతులో ఉంటాయి. అయితే భూమిలో కొన్ని వాతావరణ మార్పులు జరిగినప్పుడు అవి బయటకు వస్తాయి. ఆ తర్వాత వెదరింగ్(వికోశీకరణ) వల్ల అంటే ఎండకు ఎండి, వర్షానికి తడిచి పగిలిపోతాయి. అప్పుడు వర్షాలు, వరదలు వచ్చినప్పుడు ఆ రాళ్ల ముక్కలు పొలాల్లో అక్కడక్కడ నిలుస్తున్నాయి. ఇంకొన్ని వాగులు, వంకల ద్వారా ఇతర ప్రాంతాలకు కూడా చేరతాయి. అలా చెల్లాచెదురైన వజ్రాలే ఇప్పుడు రెండు జిల్లాలలో లభిస్తున్నాయి. ఈ ఏడాది లభించిన వజ్రాల వివరాలు మే 27: చిన్నగిరిలో ఓ వ్యక్తికి వజ్రం దొరికింది. దీన్ని రూ.3.03లక్షలకు విక్రయించారు. జూన్11: జొన్నగిరిలో ఓ రైతుకు వజ్రం లభిస్తే దాన్ని రూ.30వేలకు విక్రయించారు. జూన్ 26: రామాపురంలో లభించిన వజ్రాన్నిఓ వ్యక్తి రూ.1.30లక్షలకు విక్రయించారు. జూలై 23: జి.ఎర్రగుడిలో వజ్రం లభించింది.అయితే దాన్ని ఇప్పటి వరకూ విక్రయించలేదు. ఆగస్టు 31: జొన్నగిరిలో ఓ రైతుకు వజ్రం లభిస్తేరూ.40వేలకు అమ్మేశారు. సెప్టెంబర్ 2: గిరిగెట్లలో దొరికిన వజ్రాన్నిరూ.2లక్షల నగదు, రెండు తులాల బంగారానికి విక్రయించారు. అదే రోజుజొన్నగిరిలో ఓ వజ్రాన్ని రూ.40వేల నగదు, జత బంగారు కమ్మలకు ఓ వ్యాపారి కొనుగోలు చేశాడు. సెప్టెంబర్ 6: పీ.కొత్తూరులో కలుపు తీస్తున్న మహిళా కూలీకి వజ్రం లభ్యమైంది. గురువారంఅనంతపురం జిల్లా గుత్తికి చెందిన ఓవ్యాపారి టెండర్లో రూ.72 వేలకు కొనుగోలు చేశాడు. వజ్రాలు దొరుకుతాయంటే వచ్చా మాది కదిరి దగ్గర మొలకల చెరువు. ఇక్కడ వజ్రాలు దొరుకుతాయంటే ఏడుగురు గుంపుగా కలిసి వచ్చాం. పొలాల్లో విత్తనం వేశారు. రైతులు పొలాల్లోకి రానీయడం లేదు. పంట లేని పొలాల్లో తిరుగుతున్నాం. ఇంత దూరం వచ్చాక వెనక్కి వెళ్లలేక సాగు చేసిన పొలాల్లో కూడా పంట లేని చోట వెతుకుతున్నాం. వజ్రం ఎలా ఉంటుందో కూడా నేను చూడలేదు. – మహబూబ్‌బీ, మొలకల చెరువు,అనంతపురం జిల్లా రెండేళ్ల నుంచి వస్తున్నా టీవీల్లో, వాట్సాప్‌ల్లో వారంలో మూడు వజ్రాలు.. ఒక్కరోజే రెండు వజ్రాలు లభించాయని చూశాం. నేను మూడు రోజుల కిందట వజ్రాల కోసం వచ్చా. రెండేళ్ల నుంచి వస్తూనే ఉన్నా. అందరూ జొన్నగిరిలోని ఓ పొలంలో ఎక్కువ వజ్రాలు దొరుకుతాయంటారు. రైతులు పొలాల్లో తిరగనీయకుండా తరుముతున్నారు. హోటళ్లో తింటూ రాత్రిపూట ఏదో ఒక చోట తలదాటుచుకుంటాం. – శీను, పెండ్లిమర్రి, వైఎస్సార్ కడప జిల్లా -
ల్యాబ్ డైమండ్లతో ఉపాధికి ఊతం
జైపూర్: ల్యాబ్‌లలో తయారు చేసే వజ్రాలు (ఎల్జీడీ) కృత్రిమమైనవి కావని, వాటికి కూడా ప్రస్తు తం సహజ వజ్రాలుగా ఆమోదయోగ్యత పెరుగుతోందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పియుష్ గోయల్ తెలిపారు. ఇలాంటి సానుకూల పరిణామాలు పరిశ్రమ వృద్ధికి దోహదపడగలవని, దీనితో ఉపాధి కల్పనకు కూడా ఊతం లభించగలదని ఆయన చెప్పారు. ఎల్జీడీల తయారీలో సౌర, పవన విద్యుత్ వంటి వనరులను వినియోగించడం వల్ల ఇది పర్యావరణానికి కూడా అనుకూలమైనదని మంత్రి తెలిపారు. జూన్ 22న అమెరికా పర్యటన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ 7.5 క్యారట్ల ఎల్జీడీని అమెరికా ప్రథమ మహిళ జిల్ బైడెన్‌కు బహూకరించడం ల్యాబ్ డైమండ్లకు పెరుగుతున్న ఆమోదయోగ్యతకు నిదర్శనం. ఎల్జీడీల తయారీని ప్రోత్సహించేందుకు ప్రభు త్వం పలు చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా ఎల్జీ డీ సీడ్స్‌పై 5% కస్టమ్స్ సుంకాలను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. అలాగే, దేశీ యంగా ఎల్జీడీ యంత్రాలు, సీడ్స్, తయారీ విధానాన్ని రూపొందించడంపై పరిశోధనలు చేసేందుకు ఐఐటీ–మద్రాస్‌కు రీసెర్చ్ గ్రాంట్ ప్రకటించింది. 2025 నాటికి ఎల్జీడీ ఆభరణాల మార్కెట్ 5 బిలియన్ డాలర్లకు, 2035 నాటికి 15 బిలియన్ డాలర్లకు చేరుతుందని అంచనాలు ఉన్నాయి. 2021 –22లో కట్, పాలిష్డ్ ఎల్జీడీల ఎగుమతులు 1.35 బిలియన్ డాలర్లుగా ఉండగా, గతేడాది ఏప్రిల్–డిసెంబర్ వ్యవధిలో 1.4 బిలియన్ డాలర్ల స్థాయిలో నమోదైంది. -
కృష్ణమ్మ ఒడి వజ్రాల మడి..
వర్షాల సీజన్ అంటే.. రైతులకే కాదు..వజ్రాల వేటగాళ్లకు పండుగే.. అన్నదాతల కంటే ఎక్కువగా వేటగాళ్లు వర్షాల కోసం ఎదురు చూస్తారని చెప్పడంలో ఎంతమాత్రం అతిశయోక్తి లేదు. గత కొద్ది రోజులుగా వర్షాలు పడుతున్నాయి. ఈ నేపథ్యంలో వజ్రాలకు ప్రసిద్ధిగాంచిన నందిగామ ప్రాంతం సుదూర ప్రాంతాల నుంచి వచ్చే వజ్రాల వేటగాళ్లతో సందడిగా మారింది. నందిగామ: కృష్ణానది పరివాహక ప్రాంతంలో వజ్రాల వేట అనాదిగా వస్తున్న సంప్రదాయమే. ముఖ్యంగా చందర్లపాడు మండలం గుడిమెట్ల సమీపంలోని కృష్ణానది పరివాహక ప్రాంతంలో ఉన్న అటవీ ప్రాంతంలో వజ్రాల గుట్టగా పిలిచే కొండ ప్రాంతం వర్షాకాలం వచ్చిందంటే వజ్రాల అన్వేషణకు వచ్చిన వారితో సందడిగా కనిపిస్తుంది. నిత్యం ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి వందలాదిమంది ఈ వజ్రాల వేటకు వస్తుంటారు. కొందరు ఉదయమే భోజనాలు కట్టుకుని వచ్చి రామన్నపేట ప్రాంతంలోని కొండ ప్రాంతంలో తవ్వకాలు మొదలు పెడతారు. సాయంత్రం చీకట్లు కమ్ముకునే వరకు వీరి వెదుకులాట కొనసాగుతూనే ఉంటుంది. కృష్ణా తీరం వజ్రాల గని గతంతో పోల్చుకుంటే... ప్రస్తుతం వజ్రాల లభ్యత గణనీయంగా తగ్గినప్పటికీ, వెదికే వారి సంఖ్య మాత్రం తగ్గడం లేదు. కనీసం రంగు రాళ్లు లభించినా, కూలి ఖర్చులైనా గిట్టుబాటవుతాయనే భావనలో చాలా మంది ఉంటారు. ఏటా తొలకరి జల్లులు మొదలుకొని వర్షా కాలం పూర్తయ్యే వరకు ఇక్కడ వజ్రాల వేట కొనసాగుతుంది. నిత్యం 200 మంది వరకు ఇక్కడ అన్వేషణ సాగిస్తుండటం గమనార్హం. అత్యంత ఖరీదైన కోహినూర్ వజ్రం సైతం కంచికచర్ల మండలం పరిటాల చెరువు ప్రాంతంలో దొరికిందని స్థానికులు చెబుతుంటారు. గతంలో చందర్లపాడు మండలంలో వజ్రాల శుద్ధి కర్మాగారంతో పాటు వజ్రాల కోత పరిశ్రమ కూడా ఉండేదని, కాలక్రమేణా వజ్రాల కర్మాగారం తీసివేశారని చెబుతారు. క్యూ కడుతున్న వ్యాపారులు చందర్లపాడు మండలంలోని గుడిమెట్ల కొండ ప్రాంతంలో లభించే రంగు రాళ్లు, వజ్రాలు కొనుగోలు చేసేందుకు తమిళనాడు, ముంబయి, హైదరాబాదు, ఖమ్మం ప్రాంతాల నుంచి నిత్యం అనేక మంది వ్యాపారులు వచ్చి వెళుతుంటారు. వజ్రాల వేట ప్రారంభమైన నేపథ్యంలో వ్యాపారుల రాక కూడా ప్రారంభమైందని స్థానికులు చెబుతున్నారు. పోలీసులు మాత్రం వజ్రాల వేట నిషేధమని వేటకు వెళితే చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. -
డాక్టర్ ఇంటిలో రూ.11 లక్షల బంగారం, వజ్రం చోరీ
అన్నానగర్: కోయంబత్తూరులో ఆదివారం డాక్టర్ ఇంటిలో రూ.11 లక్షల బంగారం, వజ్రాలు చోరీ చేసిన దుండగుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. కోయంబత్తూరు రామనాథపురం కృష్ణస్వామి నగర్‌కు చెందిన శ్రీదేవి డాక్టర్. ఈమె ఇంటిలో కోయంబత్తూరుకు చెందిన తమిళసెల్వి (45) ఉంటూ ఇంటి పనులు చేస్తూ వచ్చింది. ఈ స్థితిలో శ్రీదేవి హ్యాండ్‌బ్యాగ్‌లో ఉంచిన డైమండ్‌రింగ్ మాయమైంది. దీనిపై అనుమానంతో తమిళ సెల్విని అడిగితే తీసుకోలేదని చెప్పింది. ఆమెను ఉద్యోగం నుంచి తొలగించిది. ఆదివారం ఉదయం ఆమె తన ఇంటి బీరువాలో ఉంచిన 11 సవర్ల నగలు, రెండు జతల డైమండ్ ముక్కుస్టడ్లు, నాలుగు ఖరీదైన వాచీలు, రూ.2 లక్షల నగదు చోరీకి గురైనట్టు తెలిసి దిగ్భ్రాంతి చెందింది. వీటి మొత్తం విలువ రూ.11 లక్షలు. వెంటనే దీనిపై శ్రీదేవి రామనాథపురం పోలీసులకు ఫిర్యాదు చేసింది. అందులో పనిమనిషి తమిళసెల్విపై తనకు అనుమానం ఉందని తెలిపింది. పోలీసులు కేసు నమోదు చేసి తమిళ్ సెల్వి కోసం గాలిస్తున్నారు. -
Samyuktha Menon: నగల షోరూం ప్రారంభోత్సవంలో నటి సంయుక్త మీనన్ సందడి (ఫొటోలు)
-
ప్రపంచంలోని టాప్ 10 అత్యంత అరుదైన ఆభరణాలు
-
బ్రిటన్ ఎత్తుకెళ్లిన వస్తువులు.. సంపద ఎంతో తెలుసా?
సాక్షి, అమరావతి: బ్రిటిష్ సామ్రాజ్యం.. దాని కాలనీలు మన దేశం సహా ప్రపంచంలోని వివిధ దేశాల నుంచి లెక్కలేనన్ని విలువైన కళాఖండాలను దోచుకెళ్లింది. 16వ శతాబ్దం చివరి నుంచి 20వ శతాబ్దం వరకు బ్రిటిష్ సామ్రాజ్యం ప్రపంచవ్యాప్తంగా తన కాలనీలు, వలస రాజ్యాలు, రక్షిత ప్రాంతాలను స్థాపించింది. బ్రిటన్‌లోని పలు మ్యూజియాలలో ప్రస్తుతం ప్రదర్శనలో ఉన్న అనేక సాంస్కృతిక కళాఖండాలు వలస రాజ్యాల ప్రజల నుంచి దోచుకున్నవే. వాటిని తిరిగి ఇచ్చేయాలని ఆ దేశాలు కోరుతున్నా.. బ్రిటన్ పట్టించుకోవడం లేదు. కోహినూర్ వజ్రం నుంచి బెనిన్ కాంస్యాలు, పారి్థనాన్ మార్బుల్స్ వంటి 8 మిలియన్లకుపైగా కళాఖండాలు బ్రిటిష్ మ్యూజియంలలో ఉన్నట్టు అంచనా. వాటిలో అత్యంత విలువైనవి కొన్ని ఇవే. టిప్పుసుల్తాన్ ఉంగరం ఈస్టిండియా కంపెనీతో 1799లో జరిగిన యుద్ధంలో టిప్పుసుల్తాన్ ఓడిపోయిన తర్వాత.. బ్రిటిష్ దళాలు సుల్తాన్‌ను చంపి ఆయన ఖడ్గం, బొమ్మ పులి, చేతి వేలి నుంచి ఉంగరాన్ని తీసుకెళ్లారు. సుల్తాన్ ఉంగరంపై దేవనాగరి లిపిలో రాముడి పేరు చెక్కి ఉండేది. ఖడ్గాన్ని భారతదేశానికి తిరిగి రప్పించారు. 41 గ్రాముల ఈ ఉంగరాన్ని 2014లో వేలం వేయగా.. అంచనా ధర కంటే పది రెట్లు ఎక్కువ ధర చెల్లించి ఒక వ్యక్తి కొనుగోలు చేశారు. టిప్పుసుల్తాన్‌కు చెందిన వేసవి రాజభవనం నుంచి తీసుకెళ్లిన బొమ్మ పులి ప్రస్తుతం విక్టోరియా ఆల్బర్ట్ మ్యూజియంలో ఉంది. కోహినూర్ వజ్రం ప్రపంచంలోనే అత్యంత విలువైన కోహినూర్ వజ్రాన్ని భారతదేశం నుంచి బ్రిటిషర్లు తీసుకుపోయారు. 105.6 క్యారెట్లు, 21.6 గ్రాముల బరువున్న కోహినూర్ వజ్రాన్ని ప్రస్తుత ఏపీలోని కొల్లూరు గనిలో సేకరించారు. మొఘల్ చక్రవర్తులు నెమలి సింహాసనంపై దీన్ని ఉంచేవారు. మొదట దీన్ని సేకరించినప్పుడు 793 క్యారెట్లతో ఉండేది. ఆ తర్వాత దాన్ని కట్ చేశారు. 1849లో బ్రిటిషర్లు దాన్ని విక్టోరియా రాణికి అప్పగించారు. ఆమె దాన్ని పలు సందర్భాల్లో తన కిరీటంపై ధరించేవారు. ప్రస్తుతం ఇది లండన్ టవర్‌కి చెందిన జ్యువెల్ హౌస్ మ్యూజియంలో ఉంది. కోహినూర్ ప్రపంచంలోనే పురాతన, అత్యంత ప్రసిద్ధ వజ్రాలలో ఒకటి. ఎల్గిన్ మార్బుల్స్ ఎల్గిన్ మార్బుల్స్ పురాతన గ్రీకు శిల్పాల సమాహారం. గ్రీస్‌లోని పార్థినాన్ నుంచి 1801–1805 సంవత్సరాల మధ్య బ్రిటిషర్లు ఎథీనా దేవతకు అంకితం చేసిన ఈ శిల్పాలను తీసుకెళ్లారు. ఈ శిల్పాలు గ్రీకుల గొప్పతనం, వారి వారసత్వం, చరిత్రను తెలుపుతాయి. 1453 నుండి దాదాపు 400 సంవత్సరాల పాటు ఒట్టోమన్ సామ్రాజ్యం గ్రీకును పాలించింది. ఆ సమయంలో బ్రిటిష్ రాయబారి లార్డ్ ఎల్గిన్, పారి్థనాన్ శిథిలాల నుంచి ఈ శిల్పాలను సేకరించి తీసుకెళ్లారని చెబుతారు. బ్రెజిల్ రబ్బరు విత్తనాలు బ్రెజిల్‌కే సొంతమైన హెవియా బ్రాసిలియెన్సిస్ (రబ్బరు చెట్టు) 70 వేల విత్తనాలను 1876లో బ్రిటిష్ యాత్రికుడు హెన్రీ విక్హామ్ దొంగిలించాడు. ఇది చరిత్ర గతిని మార్చిన ఘటనగా పేర్కొంటారు. బ్రెజిల్‌లోని శాంటారెమ్ ప్రాంతంలోని 140 అడుగుల ఎత్తుకు పెరిగిన రబ్బరు చెట్టు విత్తనాలవి. అప్పటివరకు రబ్బరు పరిశ్రమపై బ్రెజిల్‌కు ఉన్న ఆధిపత్యం ఈ ఘటనతో చెదిరిపోయింది. ఈ విత్తనాలు ప్రస్తుతం లండన్ మ్యూజియంలో ఉన్నాయి. రోసెట్టా స్టోన్ ఈజిప్టులోని రోసెట్టా ప్రాంతంలో దొరికిన పురాతన శాసనం ఇది. ఈజిప్టును పాలించిన టోలెమీ 196 బీసీలో నల్లటి బసాల్ట్ గ్రానైట్ రాయిపై ఈ శాసనాన్ని చెక్కించారు. మూడు విభిన్న ఈజిప్టియన్ భాషల్లో రాసిన ఈ శాసనం తన సామ్రాజ్యం, తాను చేసిన పనుల గురించి ఇందులో రాయించారు. 1799లో ఈ రాయిని కనుగొన్నారు. నెపోలియన్ బోనపార్టీ ఈజిప్టు నుంచి దీన్ని స్వా«దీనం చేసుకున్నారు. 1800 సంవత్సరంలో ఫ్రెంచ్ సైన్యం ఓడిపోయిన తర్వాత బ్రిటిషర్లు దీన్ని స్వా«దీనం చేసుకుని బ్రిటన్‌కు తరలించారు. ప్రాచీన ఈజిప్టు సామ్రాజ్యం, గ్రీకుల సంస్కృతి, వారసత్వం గురించి తెలిపే అత్యంత విలువైన శాసనంగా దీన్ని పరిగణిస్తారు. అందుకే దీన్ని తిరిగి ఇవ్వాలని ఈజిప్టు దేశం బ్రిటన్ను కోరినా పట్టించుకోలేదు. షాజహాన్ వైన్ జార్ మొఘల్ చక్రవర్తి షాజహాన్ వైన్ తాగే జార్‌ను కూడా బ్రిటిషర్లు తీసుకెళ్లి అక్కడి మ్యూజియంలో పెట్టుకున్నారు. తెల్లటి కప్పులా ఉండే ఈ జార్ దిగువ భాగంలో కమలం, ఆకులను పోలి ఉండేది. హ్యాండిల్‌పై కొమ్ము, గడ్డంతో ఉన్న జంతువు ఉండేది. 19వ శతాబ్దంలో ఈ అందమైన వైన్ జార్‌ను కల్నల్ చార్లెస్ సెటన్ గుత్రీ దొంగిలించి బ్రిటన్‌కు పంపినట్టు చెబుతారు. 1962 నుంచి ఇది లండన్‌లోని విక్టోరియా మ్యూజియంలో ఉంది. బెనిన్ కాంస్యాలు ఒకప్పటి బెనిన్ రాజ్యమే ఇప్పటి నైజీరియా. 1897లో బ్రిటిషర్లు బెనిన్‌పై దాడిచేసి ఆ నగరాన్ని దోచుకుంది. అక్కడి రాజ భవనంలో ఉన్న చారిత్రాత్మక వస్తువులు, 200కిపైగా కాంస్య ఫలకాలు ఇప్పుడు బ్రిటిష్ మ్యూజియంలో ఉన్నాయి. 1960లో స్వాతంత్య్రం పొందినప్పటి నుంచి నైజీరియా పలుసార్లు ఈ కాంస్యాలను తిరిగి ఇవ్వాలని కోరినా ఫలితం లేదు. ఇది కూడా చదవండి: ఒక ఇమ్రాన్.. రెండు కేసులు -
సూరత్‌లో వజ్రాల సదస్సు
ముంబై: ప్రయోగశాలల్లో తయారు చేసిన వజ్రాల (ఎల్జీడీ) విక్రేతలు, కొనుగోలుదారులకు సంబంధించి గుజరాత్‌లోని సూరత్‌లో తొలిసారిగా సదస్సును ప్రారంభించినట్లు రత్నాభరణాల ఎగుమతుల ప్రోత్సాహక మండలి (జీజేఈపీసీ) తెలిపింది. ఇందులో 13 దేశాల నుంచి 22 మంది ఎగ్జిబిటర్లు పాల్గొంటున్నట్లు పేర్కొంది. మూడు రోజుల పాటు జరిగే ఈ సదస్సులో కొనుగోలుదారులు, విక్రేతలు ప్రత్యక్షంగా డీల్స్ గురించి చర్చించుకోవచ్చని, దీర్ఘకాలిక వ్యాపార సంబంధాలను కుదుర్చుకోవచ్చని వివరించింది. గత అయిదేళ్లుగా భారత్‌లో ఎల్జీడీ విభాగం గణనీయంగా పెరిగిందని జీజేఈపీసీ చైర్మన్ విపుల్ షా వివరించారు. 2016–17లో 131 మిలియన్ డాలర్లుగా ఉన్న ఎగుమతులు 2022 ఏప్రిల్–2023 ఫిబ్రవరి మధ్య కాలంలో 1.5 బిలియన్ డాలర్లకు చేరాయని తెలిపారు. -
సింథటిక్ వజ్రాల ల్యాబ్.. ఎక్కడో తెలుసా?
న్యూఢిల్లీ: దేశీయంగా సింథటిక్ వజ్రాల తయారీకి సంబంధించిన సెంటర్‌ను (ఇన్సెంట్–ఎల్జీడీ) ఐఐటీ–మద్రాస్‌లో ఏర్పాటు చేయనున్నట్లు వాణిజ్య శాఖ వెల్లడించింది. దీనికి 5 ఏళ్లలో సుమారు రూ. 243 కోట్లు వెచ్చించనున్నట్లు పేర్కొంది. దేశీయంగా సింథటిక్ వజ్రాల తయారీ పరిశ్రమకు, వ్యాపారవేత్తలకు అవసరమైన సాంకేతిక సహాయాన్ని అందించేందుకు ఈ ప్రాజెక్టు తోడ్పడుతుందని వివరించింది. స్టార్టప్‌లకు చౌకగా టెక్నాలజీని అందించేందుకు, ఉపాధి అవకాశాలను .. ఎల్జీడీ ఎగుమతులను పెంచేందుకు ఇన్సెంట్–ఎల్‌జీడీలో పరిశోధనలు ఉపయోగపడగలవని వాణిజ్య శాఖ తెలిపింది. ల్యాబ్స్‌లో తయారయ్యే వజ్రాలను ఆభరణాల పరిశ్రమలోనే కాకుండా కంప్యూటర్ చిప్‌లు, ఉపగ్రహాలు, 5జీ నెట్‌వర్క్‌లు మొదలైన వాటిల్లోనూ ఉపయోగిస్తారు. అంతర్జాతీయంగా ఈ మార్కెట్ 2020లో బిలియన్ డాలర్ల స్థాయిలో ఉంది. 2025 నాటికి సింథటిక్ డైమండ్ ఆభరణాల మార్కెట్ 5 బిలియన్ డాలర్లకు, 2035 నాటికి 15 బిలియన్ డాలర్లకు వృద్ధి చెందుతుందన్న అంచనాలు ఉన్నాయి. 2021–22లో వీటికి సంబంధించి అంతర్జాతీయ వాణిజ్యంలో భారత్‌కు 25.8% వాటా ఉంది. కెమికల్ వేపర్ డిపోజిషన్ (సీవీడీ) టెక్నాలజీతో వజ్రాలను తయారు చేసే టాప్ దేశాల జాబితాలో భారత్ కూడా ఉంది. అయితే, కీలకయంత్ర పరికరాలు, ముడి వనరు అయిన సీడ్స్ కోసం దిగుమతులపై ఆధారపడాల్సి వస్తోంది. (ఇదీ చదవండి: కొత్త బడ్జెట్‌పై ఆర్బీఐ మాజీ గవర్నర్ విమర్శలు) -
ఆర్డర్ ఇస్తే అడ్రస్ లేకుండా పరార్.. రూ.88లక్షల విలువైన ఆభరణాలతో..
సాక్షి, హైదరాబాద్: నగలు తయారు చేసేందుకు ఇచ్చిన బంగారు, వజ్రాలతో ఓ జ్యూవెలరీ షాప్ యజమాని పరారైన సంఘటన శుక్రవారం వెలుగులోకి వచ్చింది. దీంతో బషీర్‌బాగ్‌కు చెందిన శ్రీయాష్ జ్యూవెలరీస్ భాగస్వామి ఆనంద్‌కుమార్ అగర్వాల్ నారాయణగూడ పోలీసులను ఆశ్రయించడంతో వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. నారాయణగూడలోని శ్రీయాష్ జ్యూవెలర్స్ నిర్వాహకులు దేశంలోని ప్రధాన నగరాల్లో ఉన్న గోల్డ్ షాప్‌లు, కస్టమర్ల కోరిక మేరకు వారికి నచ్చిన విధంగా బంగారు, వజ్రాభరణాలను తయారు చేసి ఇస్తుంటారు. గత ఏడాది ఆనంద్‌కుమార్ అగర్వాల్‌కు గణేష్ చంద్ర దాస్(అతిక్ జ్యువెల్లర్స్) అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. దీంతో ఆయన గత నవంబర్‌లో పలు దఫాలుగా రూ.కోటి విలువైన ఆభరణాల తయారీకి ఆర్డర్ ఇచ్చాడు. గణేష్ చంద్రదాస్ వీటిలో దాదాపు రూ.30లక్షల విలువైన ఆభరణాలను తయారు చేసి అప్పగించాడు. రూ.65లక్షల విలువైన బంగారు ఆభరణాలు, రూ.17లక్షల వజ్రాల ఆభరణాల తయారీలో జాప్యం చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఈనెల 9 తేదీ నుంచి గణేష్ చంద్ర దాస్ ఫోన్ స్విచ్చాఫ్ రావడంతో అనుమానం వచ్చిన యాష్ జ్యూవెలరీస్ యజమాని ఆనంద్‌కుమార్ అగర్వాల్ చార్మినర్‌లోని అతని దుకాణానికి వెళ్లి చూడగా తాళం వేసి ఉంది. దీంతో అతను నారాయణగూడ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. శుక్రవారం నిందితుడిని పట్టుకునేందుకు ఓ బృందం కోల్‌కత్తాకు వెళ్లింది. చదవండి: Fire Accident: లభించని ఆ ముగ్గురి ఆచూకీ.. డ్రోన్ల సాయంతో సెర్చ్ ఆపరేషన్ -
Hyderabad: రూ.కోటి విలువైన వజ్రాభరణాలు చోరీ
సాక్షి, బంజారాహిల్స్: ఫిలింనగర్‌లోని ఫేజ్–2 ప్లాట్ నెంబర్ 26ఏలో కొనసాగుతున్న శమంతక డైమండ్స్ ఎల్ఎల్పీ షోరూంలో భారీ చోరీ జరిగింది. రూ.కోటి విలువైన వజ్రాభరణాలు చోరీకి గురైనట్లు షోరూం యజమాని నల్లబోతు పవన్‌కుమార్ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళ్తే.. మాజీ మంత్రి నల్లబోతు చెంచురామయ్య మనువడు పవన్‌కుమార్ వజ్రాభరణాల వ్యాపారం చేస్తున్నాడు. 2016 నుంచి ఈ వ్యాపారంలో కొనసాగుతున్న ఆయన వజ్రాభరణాలు తయారు చేయించి కస్టమర్లకు పంపిణీ చేసేవాడు. మూడు రోజుల క్రితం మాదాపూర్ నుంచి శమంతక డైమండ్స్ షోరూంను ఫిలింనగర్ వెంచర్–2కు మార్చారు.. ఈ నెల 20న రాత్రి ఉద్యోగి జీవన్ కార్యాలయానికి తాళాలు వేసి వెళ్లిపోయాడు. 21న ఉదయం షాప్ తెరిచి చూడగా షోరూంలోని వస్తువులు చిందరవందరగా పడి ఉన్నాయి. క్యాబిన్లు, డ్రాలు తెరిచి ఉండటంతో వాటిని పరిశీలించగా కబోర్డ్‌లో ఉండాల్సిన వజ్రాలు, బంగారు ఆభరణాలు, బంగారు హారాలు కనిపించలేదు. చోరీ జరిగిందని గుర్తించిన బాధితుడు బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. 200 క్యారెట్ల డైమండ్లు, నాలుగు కిలోల బంగారు ఆభరణాలు, కిలో గోల్డ్ సెట్ హారం, నాలుగు ఉంగరాలు అపహరణకు గురైనట్లు ఫిర్యాదులో పేర్కొన్నాడు. క్రైం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. ఈ షోరూం వెనుకాల కిటికీ గ్రిల్ తొలగించి దొంగలు లోనికి ప్రవేశించి ఆభరణాలను సంచుల్లో వేసుకుని అదే దారి నుంచి బయటికి వెళ్లినట్లుగా గుర్తించారు. షాపు వద్ద సీసీ కెమెరాలు అందుబాటులో లేకపోవడంతో పోలీసులు ఫిలింనగర్ నుంచి రహదారులపై ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను పరిశీలించగా నెంబర్ ప్లేట్ లేని యాక్టీవాపై వచ్చిన ఇద్దరు ఆగంతకులు మంకీ క్యాప్‌లు ధరించి లోపలికి వెళ్లడమే కాకుండా ఓ బ్యాగ్‌లో ఆభరణాలు పెట్టుకుని సీవీఆర్ న్యూస్ చౌరస్తా నుంచి జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు వైపు వెళ్లినట్లుగా గుర్తించారు. నిందితుల కోసం ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి గాలింపు చేపట్టారు. బంజారాహిల్స్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. పోలీసుల అదుపులో నిందితుడు? కాగా చోరీ వ్యవహారంలో అనుమానితుడిని గురువారం రాత్రి బంజారాహిల్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. సీసీ ఫుటేజీల ఆధారంగా ఒకరిని గుర్తించినట్లు తెలుస్తుంది. పట్టుబడిన వ్యక్తి ద్వారా మరొకరిని పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. మరో అనుమానితుడు చిక్కితే నగలు జాడ చిక్కే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. -
కోటిన్నర నగలు కొట్టేశారు.. బాలల నిర్వాకం, 4 గంటల్లో ఆటకట్టు
చెన్నై: చెన్నైలోని ఓ దుకాణం నుంచి రూ.1.50 కోట్ల విలువైన బంగారం, వజ్రాల ఆభరణాలను ఎత్తుకుపోయిన ముగ్గురు బాలురను పోలీసులు నాలుగు గంటల్లోనే పట్టుకున్నారు. అస్సాంకు చెందిన ఈ ముగ్గురు నగల దుకాణానికి సమీపంలోని జ్యూస్షాప్లో పనిచేసేవారు. పథకం ప్రకారం వారు..లిఫ్టు పక్కనున్న ఖాళీ స్థలం గుండా దుకాణంలోకి ప్రవేశించారు. వారు లోపలికి చేరుకున్న వెంటనే సెక్యూరిటీ వ్యవస్థ ద్వారా దుకాణం యజమానికి వెంటనే ఉదయం 5 గంటలకు అలెర్ట్ చేరింది. అప్రమత్తమైన యజమాని వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దుకాణం వద్దకు చేరుకున్న పోలీసులు సీసీ టీవీ ఫుటేజీ ఆధారంగా అప్పటికే పరారైన ముగ్గురి కోసం వేట మొదలుపెట్టి, నాలుగు గంటల్లోనే వారి ఆటకట్టించారు. -
దీపావళికి గోల్డ్ అండ్ డైమండ్స్ కలెక్షన్స్ ...
-
మ్యాన్ మేడ్ స్టోన్: మనిషి చితికి చేరినా, వజ్రంగా మెరుస్తూ..
సైన్స్ వైఫల్యాలలో మనిషి మరణం ఒకటి. ఎన్నో వింతలు, విడ్డూరాలు చేయగలిగిన టెక్నాలజీ, మరణాన్ని జయించడంలో పదేపదే విఫలమవుతూ వస్తోంది. అయితే ప్రస్తుతం చనిపోయిన వారిని ఎప్పటికీ చెరగని జ్ఞాపకంగా మార్చడంలో మాత్రం విజయవంతమైంది. మృతదేహాన్ని దహనం చేశాక మిగిలే బూడిదతో వజ్రాలను తయారుచేసి, ఆత్మీయులకు చిరకాల జ్ఞాపికలుగా అందిస్తోంది. అమెరికా, స్విట్జర్లాండ్, యూకే వంటి పలు దేశాల ప్రజలు మరణించిన తమవారిని చెక్కుచెదరని వజ్రాభరణాలుగా మార్చుకుంటున్నారు. వాటిని నిత్యం ధరిస్తూ మరణించిన ఆత్మీయులు తమతోనే ఉన్నట్లు భావిస్తున్నారు. వీటిని లక్కీ డైమండ్స్, మెమోరియల్ డైమండ్స్ అని పిలుచుకుంటున్నారు. మనిషి శరీరంలోని ఘన మూలకాల్లో కార్బన్ అత్యధికంగా ఉంటుంది. మనిషి శరీరం దహనమైపోయినా, అధిక పరిమాణంలో మిగిలే కార్బన్ తో వజ్రాలను తయారు చేసే ప్రక్రియను కొన్నేళ్ల కిందటే శాస్త్రవేత్తలు కనుగొన్నారు. శాస్త్రవేత్తలు అందించిన పరిజ్ఞానంతో కొన్ని అంతర్జాతీయ కంపెనీలు ఇలా ఆత్మీయుల చితాభస్మంతో వజ్రాలను తయారు చేసి, వారిని కోల్పోయిన కుటుంబ సభ్యులకు అందిస్తున్నాయి. అయితే, ఇదంతా పెద్ద స్కామ్ అని, ఎమోషనల్‌గా కనెక్ట్ చేసి డబ్బులు గుంజడానికే కంపెనీలు ఇలా మోసం చేస్తున్నాయని, డైమండ్ తయారీకి చితాభస్మం నుంచి 10% కార్బన్ మాత్రమే వాడుతున్నారని, మిగిలిన 90% సాధారణ స్టాక్ కార్బన్ వాడుతుంటారనే విమర్శలు ఉన్నాయి. అయితే ఈ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చి చాలా కాలం అయినా.. కరోనా వంటి విపత్కర పరిస్థితుల తర్వాత ఇది విపరీతంగా విస్తరించింది. కోవిడ్ మహమ్మారి కారణంగా అయిన వారిని కోల్పోయి, కనీసం కడసారి చూపులకైనా నోచుకోలేని స్థితిలో అల్లాడిపోయిన ఎందరికో ఈ విధానం ఊరటనిస్తోంది. తమవారు లేరనే విషాదం నుంచి కోలుకునేందుకు ప్రేమపూర్వక జ్ఞాపికగా మిగులుతోంది. స్నేహితుల్ని, ఆత్మీయుల్ని ఎంతో మంది ఈ వజ్రాలను తయారు చేయించుకోవడానికి మక్కువ చూపిస్తున్నారు. నిజానికి ఈ మనిషి చితాభస్మంతో తయారైన వజ్రాలు (మ్యాన్ మేడ్ స్టోన్) మొదట 1980లలో వాణిజ్యపరంగా అందుబాటులోకి వచ్చినా, ఇటీవలి కాలంలోనే వీటికి ఆదరణ పెరుగుతోంది. -
Most Expensive Rakhi: ఖరీదైన రాఖీ... వజ్రాలపై ‘ఓం’గుర్తు’తో..
ఇప్పుడెక్కడ చూసినా రాఖీ ముచ్చటే. గుజరాత్‌లోని సూరత్ మాత్రం ఇంకాస్త స్పెషల్. ఎందుకంటే... అక్కడంతా ఈ ఫొటోలో ఉన్న రాఖీ గురించే మాట్లాడుకుంటున్నారు. అందులో ఏముంది? అంటే. దాని విలువ. ఆ రాఖీ ఖరీదు ఐదు లక్షలు. బంగారంతో డిజైన్ చేసిన రాఖీ మధ్యలో వజ్రాలను పొదిగారు. ఆ వజ్రాలపై మళ్లీ ‘ఓం’గుర్తును పొందుపరిచారు. ప్రతి ఏటా వివిధ రకాల బంగారు, వెండి, ప్లాటినమ్ రాఖీలతో ఆకట్టుకునే ఆ షాప్ ఈసారి... వజ్రాలు పొదిగిన రాఖీని తయారు చేసింది. సాధారణంగా రాఖీని రెండు, మూడు రోజుల తరువాత తీసేస్తారు. కానీ ఈ రాఖీని ఎప్పుడైనా ఆభరణంగా కూడా ధరించే వీలుందంటున్నాడు నగల షాప్ యజమాని దీపక్ భాయ్ చోక్సీ. అంతవిలువైన రాఖీని మీ అక్కనో, చెల్లెనో కడితే బాగుండేది అనుకుంటున్నారా.. అయితే అంతకంటే విలువైన గిఫ్ట్‌ను రెడీ చేసుకోవాల్సి ఉంటుంది మరి! -
అదృష్టం తలుపు తట్టింది.. ఆ కుటుంబాలకు వజ్రాల రూపంలో లక్షలు..
తుగ్గలి: అదృష్టం తలుపు తట్టడంతో కర్నూలు జిల్లాలో రెండు కుటుంబాలకు బుధవారం వజ్రాల రూపంలో రూ.లక్షలు లభించాయి. తుగ్గలి మండలంలో ఒక రైతు కుటుంబం, ఒక కూలీ కుటుంబం వజ్రాలు దొరకడంతో లబ్ధిపొందాయి. జి.ఎర్రగుడిలో రైతు కుటుంబానికి చెందిన యువతి పొలం పనులకు వెళ్లింది. సొంత పొలంలో ఆముదం పంటలో కలుపుతీస్తుండగా మెరుగురాయి తళుక్కుమంది. దాన్ని కుటుంబసభ్యులకు చూపించడంతో వజ్రం అని నిర్ధారణ చేసుకున్నారు. దాదాపు పది క్యారెట్లు ఉన్న ఈ వజ్రాన్ని పెరవలి, జొన్నగిరి, గుత్తికి చెందిన పలువురు వ్యాపారులు సిండికేట్ అయి రూ.34 లక్షల నగదు, 10 తులాల బంగారం ఇచ్చి కొనుగోలు చేసినట్లు తెలిసింది. జొన్నగిరిలో టమాటాలు తెంచేందుకు కూలికి వెళ్లిన మహిళకు రంగురాయి దొరికింది. దాన్ని తీసుకెళ్లి వ్యాపారికి చూపించగా వజ్రమని తేల్చి రూ.6 లక్ష లకు కొనుగోలు చేసినట్లు తెలిసింది. ఈ ఏడాది ఇప్పటివరకు జొన్నగిరి, జి.ఎర్రగుడి, పగిడిరాయి, గిరిగెట్ల గ్రామాల్లో ఏడువజ్రాలు లభ్యమయ్యాయి. ఏటా తొలకరి వర్షాలకు ఈ ప్రాంతంలో విలువైన వజ్రాలు లభ్యమవుతుంటాయి. వజ్రాలు వెతికేందుకు ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని పలు జిల్లాల నుంచి జనం వస్తుంటారు. జనం తాకిడి ఎక్కువ కావడంతో ఈ ఏడాది జొన్నగిరిలో రైతులంతా కలిసి కాపలాదారులను పెట్టారు. వజ్రాన్వేష కులు రాకుండా కాపలాదారులు నిలువరిస్తున్నారు. చదవండి: (హాస్టళ్లకు మహర్దశ) -
వజ్రాల వేట.. అత్యంత ఖరీదైన కోహినూర్ వజ్రం కూడా అక్కడే..
కృష్ణా: అనాది కాలం నుంచి కృష్ణా నది పరీవాహక ప్రాంతం వజ్రాల వేటకు పెట్టింది పేరు. ముఖ్యంగా కంచికచర్ల మండల పరిధిలోని పరిటాల, చందర్లపాడు మండల పరిధిలోని గుడిమెట్ల (రామన్నపేట), కృష్ణా తీరం వజ్రాల గనిగా వాసికెక్కింది. మనసు పెట్టి అన్వేషణ సాగిస్తే, ఏదో ఒకటి దొరుకుతుందన్న నమ్మకం ఎప్పటి నుంచో ఉంది. సాధారణ రకం మొదలుకొని లక్షల విలువ చేసే వజ్రాలు లభ్యమైన సందర్భాలు అనేకం ఉండటమే ఇందుకు నిదర్శనం. అత్యంత ఖరీదైన కోహినూర్ వజ్రం కూడా పరిటాల చెరువులోనే లభించిందనే కథనం కూడా ప్రచారంలో ఉండటం గమనార్హం. ఒకప్పుడు చందర్లపాడు మండలంలో ఏకంగా వజ్రాల కోత పరిశ్రమ ఉండేదంటే.. ఈ ప్రాంతంలో వజ్రాల వేట ఏ స్థాయిలో జరిగేదో.. ఎంతలా వజ్రాలు దొరికేవో అర్థం చేసుకోవచ్చు. నాటి నుంచి నేటి వరకు.. గుడిమెట్ల ప్రాంతంలో వజ్రాల వేట ఈనాటిది కాదు.. దశాబ్దాల కాలంగా జరుగుతున్నదే.. ఇప్పటికీ వర్షాకాలం వచ్చిందంటే.. ఎక్కడెక్కడి నుంచో వజ్రాల వేటగాళ్లు ఇదే పనిలో ఉంటారు. కొందరు ఉదయమే భోజనాలు కట్టుకొని రామన్నపేట ప్రాంతంలోని కొండ ప్రాంతంలో తవ్వకాలు మొదలు పెడతారు. సాయంత్రం చీకట్లు కమ్ముకునే వరకు వీరి వెదుకులాట కొనసాగుతూనే ఉంటుంది. గతంతో పోల్చుకుంటే.. ప్రస్తుతం వజ్రాల లభ్యత గణనీయంగా తగ్గిపోయినప్పటికీ, వెదుకులాడే వారి సంఖ్య మాత్రం తగ్గడం లేదు. కనీసం రంగు రాళ్లు లభించినా, కూలి అంత సొమ్మైనా దొరుకుతుందన్న భావనలో చాలా మంది ఉంటారు. అదృష్టం కలసి వస్తే, ఒకేసారి లక్షాధికారులయ్యే అవకాశాలు కూడా లేకపోలేదు. ఆశావహులు తొలకరి జల్లులు కురిస్తే చాలు వజ్రాల వేటకు బయలుదేరుతారు. ఇందుకోసం వీరు ప్రధానంగా చందర్లపాడు మండల పరిధిలోని గుడిమెట్ల శివార్లలో కృష్ణా నది ఒడ్డును ఎంచుకుంటారు. ఇక్కడే తవ్వకాలు అధికంగా సాగిస్తారు. ఏటా తొలకరి జల్లులు మొదలుకొని వర్షా కాలం పూర్తయ్యే వరకు ఇక్కడ వజ్రాల వేట కొనసాగుతుండటం ఆనవాయితీ. పొరుగు జిల్లాల నుంచి కూడా జనం అధిక సంఖ్యలో తరలివచ్చి వజ్రాల వేట సాగిస్తుంటారు. నిత్యం 200 మంది వరకు ఇక్కడ అన్వేషణ సాగిస్తుండటం గమనార్హం. ఇక్కడ వజ్రాలతోపాటు రంగు రాళ్లు కూడా అధిక సంఖ్యలో లభ్యమవుతాయి. దీంతో కూలి ఖర్చుకు ఢోకా ఉండదని చెబుతారు. ఇదిలా ఉండగా పోలీసులు మాత్రం వజ్రాల వేట నిషేధమని.. నిబంధనలు మీరి వెళితే చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. -
ఆపరేషన్ ఆర్కిటిక్.. మంచు ఖండం గర్భంలో అంతులేని సంపద
దొడ్డ శ్రీనివాసరెడ్డి ఆర్కిటిక్ ఖండంలో శరవేగంగా కరుగుతున్న మంచు ప్రపంచ దేశాల నైసర్గిక స్వరూపాన్నే మార్చేస్తోంది. 40 సంవత్సరాల క్రితంతో పోలిస్తే ఇప్పటికే 50 శాతం మంచు కరిగిపోయింది. 2040 సంవత్సరం నాటికి మరో 25 శాతం మంచు మాయమౌతుందని అంచనా. ప్రపంచ పర్యావరణానికి ప్రమాదకరమైన ఈ పరిణామం కొన్ని దేశాలకు కొత్త అవకాశాలను తెచ్చి పెట్టనుంది. ఆర్కిటిక్‌లో దాగున్న అపార సంపదపై ఇప్పుడు అనేక దేశాల చూపు పడింది. ఉత్తర ధ్రువం చుట్టూ ఆవరించి ఉన్న ఆర్కిటిక్ మంచు అడుగున అపార ఖనిజ సంపద ఉందని గతంలోనే వెల్లడైంది. ప్రపంచ చమురు నిల్వల్లో 25 శాతం.. అంటే 9,000 కోట్ల బ్యారెళ్లు అక్కడ ఉన్నట్టు అమెరికా జియోలాజికల్ సర్వే సంస్థ గతంలో అంచనావేసింది. ప్రపంచ సహజవాయు నిల్వల్లో 30 శాతానికిపైగా దాగున్నట్టు ఓ అంచనా. ద్రవ రూపంలో మరో 4,400 కోట్ల బ్యారళ్ల సహజ వాయువు అక్కడ ఉందట. యురేనియం, బంగారం, వజ్రాల వంటి అతి విలువైన ఖనిజ సంపదకు ఆర్కిటిక్ ఆలవాలం. దాంతో ఈ మంచు ఖండంపై ఆధిపత్యం కోసం దేశాలు అనేక వ్యూహాలు రచిస్తున్నాయి. ఆధిపత్యమెవరిదో! నిజానికి ఆర్కిటిక్ ఎవరి సొంతమూ కాదు. కానీ ఆ సముద్రం హద్దుగా ఉన్న ఎనిమిది దేశాలు ఇప్పుడు వ్యూహాత్మకంగా అక్కడి పలు ప్రాంతాలను తమ సరిహద్దులుగా పేర్కొంటున్నాయి. వాటిని అధీనంలోకి తీసుకోవాలని ప్రయత్నిస్తున్నాయి. వీటిలో ముఖ్యమైనది రష్యా. అమెరికా, కెనడా, డెన్మార్క్, ఫిన్లాండ్, ఐస్లాండ్, నార్వే, స్వీడన్.. ఆర్కిటిక్ సరిహద్దు దేశాలే. ఇవి తమ వివాదాల పరిష్కారానికి ఆర్కిటిక్ కౌన్సిల్‌ను ఏర్పాటు చేసుకున్నాయి. భారత్ సహా 13 దేశాలు ఇందులో పరిశీలక హోదాలో చేరాయి. ఈ దేశాల సరిహద్దుల నిర్ధారణకు ఐరాస 234 ఆర్టికల్‌ను రూపొందించింది. దీని ప్రకారం అవి తమ తీరాల నుంచి 200 మైళ్ల వరకు చేపలు పట్టడం, ఖనిజాన్వేషణ వంటి కార్యకలాపాలు చేసుకోవచ్చు. మిగతా ప్రాంతంపై ఎవరికీ హక్కు లేదు. అది ప్రపంచ మానవాళి ఉమ్మడి సంపద. నిప్పు రాజుకుంటోంది ఐరాస సూత్రీకరణలు ఎలా ఉన్నా ఆర్కిటిక్‌పై ఆధిపత్యాన్ని పెంచుకునే ప్రయత్నాలకు సరిహద్దు దేశాలు పదును పెడుతున్నాయి. ఆర్కిటిక్‌తో అక్షరాలా 24,000 కిలోమీటర్ల మేరకు సరిహద్దు ఉన్న రష్యా ఈ విషయంలో అందరికంటే ముందుంది. రెండేళ్లుగా ఆర్కిటిక్ వైపు బలగాల మోహరింపును ముమ్మరం చేస్తోంది. కొత్తగా ఆర్కిటిక్ బ్రిగేడ్‌ను ఏర్పాటు చేసింది. మూతబడ్డ నౌకా స్థావరాలన్నింటినీ పునరుద్ధరిస్తోంది. వైమానిక స్థావరాన్ని ఏర్పాటు చేసింది. ఈ జలాల్లో ముందస్తు అనుమతి లేకుండా నౌకాయానానికి వీల్లేదని, అనుమతి పొందిన నౌకలు టోల్ ట్యాక్స్ కట్టాలని వాదిస్తోంది. అవసరమైతే 1859 సంవత్సరంలో అమెరికాకు ఇచ్చేసిన అలాస్కాను వెనక్కు తీసుకుంటామని రష్యా పార్లమెంటు ‘డ్యూమా’ చైర్మన్ ఇటీవలే ప్రకటన చేశారు. రాజుకుంటున్న నిప్పుకు ఇది సూచన మాత్రమేనని విశ్లేషణలు వెలువడ్డాయి. దీంతో అమెరికా చకచకా పావులు కదుపుతోంది. అలాస్కా నుంచి నౌకా మార్గానికి అనువుగా ఆర్కిటిక్‌లో కొంత భాగాన్ని తమదిగా చెబుతూ కొత్త మ్యాప్‌లు తయారు చేస్తోంది. కెనడా అయితే తమ దేశం నుంచి ఉత్తర ధ్రువం దాకా ఉన్న ప్రాంతమంతా తమదేనని తెగేసి చెబుతోంది! సరికొత్త మార్గాలు ఆర్కిటిక్ మంచు కరిగి సముద్రంగా మారిపోతున్న కొద్దీ సరికొత్త నౌకా మార్గాలకు ద్వారాలు తెరుచుకుంటాయి. ఆర్కిటిక్ ప్రస్తుతం నౌకాయానానికి కొంతమేరకే అనువుగా ఉంది. దీని మార్గం ద్వారా ఏడాదికి వంద నౌకలు మాత్రమే ప్రయాణిస్తున్నాయి. మున్ముందు ఈ మార్గం వేలాది నౌకల రాకపోకలతో రద్దీగా మారనుంది. ప్రస్తుతం పనామా కాల్వ మార్గంలో ఏడాదికి 14 వేలు, సూయజ్ కాల్వ మార్గంలో 20 వేల నౌకలు ప్రయాణిస్తున్నాయి. ఆర్కిటిక్ సముద్ర మార్గం పూర్తిగా తెరుచుకుంటే యూరప్, ఆసియా ఖండాల మధ్య దూరం 40 శాతం పైగా తగ్గిపోతుంది. సరుకు రవాణా ఖర్చులు ఆ మేరకు తగ్గుతాయి. భారత్ వైఖరేమిటి? ఆర్కిటిక్ వాతావరణం భారత్‌లో రుతుపవనాల తీరుతెన్నులను ప్రత్యక్షంగా ప్రభావితం చేస్తుంది. దాంతో భారత్ ఇటీవల ఆ ప్రాంతంపై దృష్టి సారించింది. ఆర్కిటిక్ పాలసీ పేరిట అధికారిక నివేదిక విడుదల చేసింది. ఆర్కిటిక్‌లో శాశ్వత స్థావరం ఏర్పాటుతో పాటు ఉపగ్రహాలను అనుసంధానించే గ్రౌండ్ స్టేషన్లు, పరిశోధన కేంద్రాల నిర్మాణానికి యోచిస్తోంది. -
ఒక్క ఉంగరంలోనే ఏకంగా 20 వేల వజ్రాలు... రికార్డు సృష్టించింది
తిరువనంతపురం: భారతదేశంలోని ప్రముఖ ఆభరణాల తయారీ కంపెనీలలో ఒకటైన ఎస్‌డబ్ల్యూఏ ఒక్క ఉంగరంలో ఒకటి రెండూ కాదు దాదాపు 24 వేల వజ్రాలతో ఒక ఉంగరాన్ని రూపొందించింది. కేరళలోని మలప్పురం జిల్లాలో తయారైన ఈ ఉంగరం గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ తోపాటు ఏషియన్ బుక్ ఆఫ్ రికార్డ్సు వంటి ప్రతిష్టాత్మకమైన అవార్డులను గెలుచుకుంది. ఈ ఉంగరానికి ది టచ్ ఆఫ్ అమీ' అని పేరు పెట్టారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ నుంచి లైఫ్‌స్టైల్ యాక్సెసరీ డిజైన్‌లో పోస్ట్ గ్రాడ్యుయేట్ అయిన శ్రీమతి రిజిషా దీన్ని రూపొందించారు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 24,679 వజ్రాలతో కేరళలో తయారైన ఉంగరం గిన్నిస్ రికార్డు సాధించింది. అత్యధిక వజ్రాలు సెట్ ఇన్ వన్ రింగ్ విభాగం పేరిట ఈ రికార్డును నమోదు చేసింది. ప్రపంచవ్యాప్తంగా వజ్రాల పరిశ్రమలో ఆధిపత్యం చెలాయించే బెల్జియం వంటి దేశాలను వెనక్కి నెట్టి మరీ ఈ ప్రతిష్టాత్మక టైటిల్‌ను గెలుచుకోవడం నిజంగా గొప్ప విజయం అని ఎస్‌డబ్ల్యూఏ కంపెనీ యజమాన్యం చెబుతోంది. (చదవండి: అనధికార భవనాలను కూల్చేయండి! కీలక వ్యాఖ్యలు చేసిన హైకోర్టు) -
ధగధగల బంగారు నిధి.. సముద్ర గర్భంలో.. లక్ష కోట్ల విలువ!
కార్టజినా: 300 ఏళ్లుగా సముద్ర గర్భాన దాగున్న శాన్‌జోస్ అనే యుద్ధనౌకలోని అపార సంపదతో జాడ ఎట్టకేలకు దొరికింది. కార్టజినా తీరానికి సమీపంలో దీన్ని కనుగొన్నట్లు కొలంబియా నేవీ ప్రకటించింది. సంబంధిత ఫుటేజీని విడుదల చేసింది. కొలంబియా స్వాతంత్య్ర పోరాటానికి ముందు బ్రిటన్, స్పెయిన్ మధ్య 1708లో జరిగిన యుద్ధంలో శాన్‌జోస్ మునిగిపోయింది. స్పెయిన్ రాజు ఫిలిప్–5కు చెందిన ఈ నౌకలో ఘటన సమయంలో 600 మంది ఉన్నారని భావిస్తున్నారు. సముద్ర గర్భంలో 3,100 అడుగుల లోతులో ఉన్న శిథిల నౌక వద్దకు రిమోట్‌తో పనిచేసే యంత్రాన్ని పంపి ఫొటోలను సేకరించారు. చెల్లా చెదురుగా పడి ఉన్న బంగారు నాణేలు, వజ్రాలు, అమూల్యమైన ఖనిజాలు, పింగాణీ కప్పులు, మృణ్మయపాత్రలు అందులో కనిపిస్తున్నాయి. ఈ సంపద విలువ లక్ష కోట్లకు పైమాటేనని అంచనా. దీనిపై తమకే హక్కులున్నాయంటూ కొలంబియా అంటుండగా స్పెయిన్, ఒక అమెరికా కంపెనీతోపాటు, బొలీవియా ఆదివాసులు కూడా పోటీకి వస్తున్నారు. ఈ నౌక ఇతివృత్తంగా కొలంబియా రచయిత గాబ్రియేల్ గార్సియా మార్కెజ్ రాసిన ‘లవ్ ఇన్ ది టైమ్ ఆఫ్ కలరా’ నవల నోబెల్ బహుమతి కూడా గెలుచుకుంది! -
Kurnool: మొదలైన వజ్రాల అన్వేషణ
ఎక్కడైనా తొలకరి వర్షాలు కురవగానే పొలాల్లో పంట సాగు పనులు ప్రారంభమవుతాయి. కానీ పత్తికొండ ప్రాంతంలో మాత్రం వజ్రాలన్వేషణ మొదలవుతుంది. స్థానికులే కాకుండా సుదూర ప్రాంతాల నుంచి సైతం జనం ఇక్కడికి తరలివచ్చి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటారు. రెండురోజుల క్రితం కురిసిన చినుకులకు పుడమి తడవడంతో ఎప్పటిలాగే ఈసారి కూడా ఆశల వేటను మొదలు పెట్టారు. సాక్షి, కర్నూలు(తుగ్గలి): కరువుకు నిలయమైన పత్తికొండ నియోజకవర్గంలో ఏటా తొలకరిలో వజ్రాల పంట పండుతోంది. దాదాపు 40 ఏళ్లకు పైగా ఈ ప్రాంతంలో వాటి అన్వేషణ కొనసాగుతోంది. మొదట్లో వ్యవసాయ పనులకు వెళ్లిన వారికి వజ్రాలు దొరికాయి. క్రమంగా ఇది వేటగా మారి పోయింది. అదృష్టం వరిస్తే క్షణాల్లో లక్షాధికారులు అవుతున్నారు. స్థానికులే కాకుండా వైఎస్సార్, నెల్లూరు, గుంటూరు, ప్రకాశం, అనంతపురం, తెలంగాణాలోని మహబూబ్‌నగర్ జిల్లాల నుంచి పలువురు ఇక్కడికి చేరుకొని వజ్రాన్వేషణ కొనసాగిస్తుంటారు. తొలకరి వర్షాలు కురవగానే తుగ్గలి మండలంలోని పగిడిరాయి, తుగ్గలి, రామాపురం, చిన్నజొన్నగిరి, జి.ఎర్రగుడి, ఉప్పర్లపల్లి, తుగ్గలి, గిరిగెట్ల, మద్దికెర మండలంలోని పెరవలి,బసినేపల్లి, మద్దికెర, అనంతపురం జిల్లాలోని బేతాపల్లి, ఊటకల్లు, బసినేపల్లి, వజ్రకరూర్ తదితర ప్రాంతాల్లో వజ్రాల అన్వేషణ మొదలవుతుంది. వర్షాలు బాగా కురిస్తే తెల్లారేసరికి జనం పొలాల్లో వాలిపోతుంటారు. ఏటా విలువైన వజ్రాలు లభ్య మవుతుండడంతో జనం పిల్లాపాపలతో వచ్చి వెతుకుతుంటారు. దొరికిన వజ్రాలను కొందరు రహస్యంగా, మరికొందరు టెండరు పద్ధతి ద్వారా అమ్ముకుంటుంటారు. వజ్రం రంగు, జాతిని బట్టి క్యారెట్ల రూపంలో లెక్కకట్టి నగదు, బంగారం ఇచ్చి వ్యాపారులు కొనుగోలు చేస్తారు. గతేడాది విలువైన వజ్రం లభ్యం.. గతేడాది చిన్న జొన్నగిరికి చెందిన ఓ రైతుకు విలువైన వజ్రం లభ్యమైంది. రూ.1.20 కోట్ల విలువైన డైమండ్ దొరికింది. ఇదే ఇప్పటి వరకు అత్యధిక ధర పలికిన వజ్రం. వేలు, లక్షల విలువైన వజ్రాలు సైతం లభ్యమవుతుంటాయి. ప్రస్తుతం తొలకరి సీజన్ ప్రారంభం కావడంతో వ్యాపారులు కూడా తమ అనుచరులను అప్రమత్తం చేసే పనిలో పడ్డారు. ఎవరికైనా వజ్రం లభ్యమైనట్లు తెలియగానే తమ ఆసాముల వద్దకు తీసుకెళ్లడంలో అనుచరులు కీలక పాత్ర పోషిస్తారు. 2000 సంవత్సరంలో రాంపల్లిలో పొలం పనులకు వెళ్లిన వారికి విలువైన వజ్రం లభ్యమైంది. అయితే ఇద్దరి మధ్య తగాదా రావడంతో ఆ వజ్రాన్ని అప్పట్లో రెవెన్యూ అధికారులు ట్రెజరీకి పంపారు. ఈ ప్రాంతంలో ఏటా వజ్రాలు దొరుకుతుండడంతో కేంద్ర ప్రభుత్వం కూడా నిక్షేపాల కోసం అన్వేషించింది. చివరకు బంగారం నిక్షేపాలు ఉన్నాయని గుర్తించింది. 2013లో బంగారం నిక్షేపాల వెలికితీతకు జియోమైసూర్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి అనుమతులు ఇచ్చింది. చదవండి: (Palle Vs JC: పల్లె ఉక్కిరిబిక్కిరి.. తెరవెనుక అధిష్టానం..?) వజ్రాన్వేషణతో రైతులకు అవస్థలు వజ్రాన్వేషణకు వివిధ ప్రాంతాల నుంచి జనం వస్తుండడంతో రైతులు అవస్థలు పడుతున్నారు. కురిసిన వర్షాలకు విత్తనం వేసుకునేందుకు పొలాలు దుక్కిదున్ని సిద్ధం చేసుకుంటున్నారు. ఇలాంటి సమయంలో జనం తొక్కుతుండడంతో పొలాలు గట్టి పడుతున్నాయని రైతులు వాపోతున్నారు. పైగా పొలాల్లో పనికోసం వెళ్లిన వారిపై కొందరు దౌర్జన్యానికి దిగుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో వజ్రాన్వేషణకు వచ్చేవారిని నియంత్రించేందుకు గ్రామస్తులు ఓ నిర్ణయానికి వచ్చారు. పొలాల్లో జనం తిరిగినా, సమీపంలో వాహనాలు నిలిపినా జరిమానాలు విధించాలని తీర్మానించుకున్నారు. వజ్రాన్వేషణకు ఎవరూ రావద్దని వస్తే జరిమానా విధిస్తామని హెచ్చరిస్తున్నారు. 8 ఏళ్ల నుంచి వస్తున్నాను వజ్రాలు వెతికేందుకు ప్రతి సంవత్సరం తొలకరిలో నేను ఇక్కడికి వస్తున్నాను. 8 ఏళ్ల నుంచి పొలాల్లో వెతుకుతున్నాను. ఈసారి మేము ఎనిమిది మంది వచ్చాం. మూడు, నాలుగు రోజులుండి తిరిగి ఊరెళ్లిపోతాం. – నాగరాజు, కారుడ్రైవరు, ఒంగోలు -
జోయాలుక్కాస్‌లో అక్షయ తృతీయ క్యాష్ బ్యాక్ ఆఫర్లు
హైదరాబాద్: ఆభరణాల సంస్థ జోయాలుక్కా స్ అక్షయ తృతీయ సందర్భంగా జ్యుయలరీ కొనుగోళ్లపై ప్రత్యేకమైన క్యాష్ బ్యాక్ ఆఫర్లను ప్రకటించింది. రూ.50,000 అంతకుపైబడిన వజ్రాలు, అన్‌కట్ వజ్రాలను కొనుగోలు చేసిన కస్టమర్లకు రూ.2,000 విలువైన గిఫ్ట్ వోచర్‌ను ఇవ్వనుంది. అలాగే రూ.50,000, అంతకు పైబడిన బంగారు ఆభరణాలు కొనుగోలు చేసిన వారికి రూ.1,000 విలువ గల గిఫ్ట్ వోచర్, రూ.10,000 విలువైన వెండి ఆభరణాలు కొనుగోలు చేసిన కస్టమర్లకు రూ.500 విలువైన గిఫ్ట్ వోచర్‌ను అందించనున్నట్లు తెలిపింది. అలాగే ఎస్బీఐ డెబిట్ లేదా క్రెడిట్ కార్డు ద్వారా చెల్లింపులు జరిపిన వారికి 5 శాతం రాయితీ కూడా ఇస్తుంది. ఈ నెల 22 నుంచి మే 3వ తేదీ వరకు ఈ ఆఫర్ దేశవ్యా ప్తంగా ఉన్న అన్ని షోరూమ్‌లలో అందుబాటులో ఉంటుందని జోయాలుక్కాస్ తెలిపింది. -
పార్శిల్లో రూ.4.45 కోట్ల విలువైన వజ్రాలు
సాక్షి, చెన్నై: శ్రీలంక నుంచి చెన్నైకు వచ్చిన పార్శిల్లో రూ.4.45 కోట్ల విలువైన వజ్రాలు, రత్నాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. శనివారం ఉదయం చెన్నై విమానాశ్రయానికి శ్రీలంకన్ ఎయిర్‌లైన్స్ విమానం వచ్చింది. ఇందులో వచ్చిన పార్శిల్‌పై అధికారులకు అనుమానం కలిగింది. చెన్నైకు చెందిన ఓ పారిశ్రామివేత్త చిరునామాతో రావడం.. రూ.5.85 లక్షల విలువైన సెమీ వజ్రాలు ఉన్నట్లు రశీదులో పేర్కొని ఉండటంతో అనుమానంతో తెరిచి చూశారు. అందులో ఉన్న వజ్రాలు, రత్నాలను నిపుణుల ద్వారా పరీక్షించగా, వాటి విలువ రూ.4.45 కోట్లుగా తేలింది. దీంతో చెన్నైలోని ఆ పారిశ్రామికవేత్తను కస్టమ్స్ అధికారులు విచారించే పనిలో పడ్డారు. -
బంగారం, వజ్రాలు పట్టివేత
కర్నూలు: హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న ఓ ప్రైవేట్ బస్సులో భారీగా బంగారు నగలు, వజ్రాలు పట్టుబడ్డాయి. కర్నూలు మండలం పంచలింగాల చెక్‌పోస్టు వద్ద ఎస్ఈబీ సీఐ మంజుల, ఎస్ఐ ప్రవీణ్‌కుమార్‌నాయక్ నేతృత్వంలో సిబ్బంది సోమవారం వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న ట్రావెల్స్ బస్సులోని ప్రయాణికులను తనిఖీ చేయగా.. రాజస్తాన్‌లోని జున్జును పట్టణానికి చెందిన కపిల్ అనే యువకుడి బ్యాగులో 840 గ్రాముల బంగారు ఆభరణాలు, 57 వజ్రాలు బయటపడ్డాయి. వీటి విలువ సుమారు రూ.39.28 లక్షలుంటుందని అధికారులు అంచనా వేశారు. బిల్లులు, జీఎస్టీ ట్యాగ్లు లేకపోవడంతో.. కపిల్‌ను విచారణ నిమిత్తం కర్నూలు అర్బన్ తాలూకా పోలీసులకు అప్పగించారు. -
వజ్రాలు, రత్నాలు కొనేవారికి కేంద్రం శుభవార్త..!
న్యూఢిల్లీ: మీరు వజ్రాలు, రత్నాలు కొనాలని చూస్తున్నారా? అయితే, మీకు ఒక శుభవార్త. కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ నేడు లోక్ సభలోప్రవేశ పెట్టిన 2022-23 బడ్జెట్లో పాలిష్ చేసిన వజ్రాలు, రత్నాలపై దిగుమతి సుంకాన్ని 5 శాతానికి తగ్గిస్తున్నట్లు ప్రకటించారు. అలాగే, పాలిష్ చేయని వజ్రాలపై ఎలాంటి దిగుమతి సుంకం ఉండదని పేర్కొన్నారు. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంతో ఆ మేరకు వజ్రాలు, రత్నాల ధరలు తగ్గనున్నాయి. ప్రస్తుతం కట్ అండ్ పాలిష్ చేసిన డైమండ్స్, రత్నాలపై 7.5 శాతం దిగుమతి సుంకాన్ని విధిస్తున్నారు. లోక్ సభలో 2022-23 బడ్జెట్ సమర్పించిన సీతారామన్, ఈ కామర్స్ ద్వారా ఆభరణాల ఎగుమతి చేయడానికి ప్రభుత్వం సులభతరం విధానాన్ని ఈ ఏడాది జూన్ నాటికి తీసుకొని రానున్నట్లు ప్రకటించారు. తక్కువ విలువ కలిగిన అనుకరణ ఆభరణాల దిగుమతులను తగ్గించడానికి కస్టమ్స్ సుంకాన్ని కిలోకు కనీసం రూ.400 చెల్లించే విధంగా సిఫారసు చేస్తున్నట్లు ఆమె తెలిపారు. బడ్జెట్ ప్రతిపాదనపై ఆల్ ఇండియా జెమ్ అండ్ జ్యూయలరీ డొమెస్టిక్ కౌన్సిల్ చైర్మన్ ఆశిష్ పెతే మాట్లాడుతూ.. "మొత్తం మీద బడ్జెట్ 2022-23 సానుకూలంగా కనిపిస్తోంది. కానీ, ఈ బడ్జెట్లో పరిశ్రమకు నిర్దిష్టమైన ప్రోత్సాహకాలు ఏమీ లేవు. పాలిష్ చేసిన వజ్రాలు, రత్నాలపై కస్టమ్స్ సుంకంలో కోత తప్ప" అని ఆయన అన్నారు. కేంద్రం వజ్రాలు, రత్నాలపై దిగుమతి సుంకాన్ని తగ్గించడంతో ఆ రంగానికి చెందిన షేర్లు స్టాక్ మార్కెట్లో దూసుకెళ్తున్నాయి. (చదవండి: కేంద్రం కీలక సంస్కరణ.. దేశంలో ఎక్కడి నుంచైనా భూ రిజిస్ట్రేషన్..!) -
గనుల వేలానికి హైపవర్ కమిటీ ఆమోదం
సాక్షి, అమరావతి: బంగారం, వజ్రాలు సహా 22 అత్యంత విలువైన గనుల వేలానికి రాష్ట్ర ప్రభుత్వం నియమించిన హైపవర్ కమిటీ ఆమోదం తెలిపింది. వెలగపూడి సచివాలయంలో బుధవారం మైనింగ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది నేతృత్వంలో జరిగిన హైపవర్ కమిటీ సమావేశంలో వేలానికి ఆమోదముద్ర వేశారు. సమావేశంలో మైనింగ్ డైరెక్టర్ వీజీ వెంకటరెడ్డి పాల్గొనగా, ఇండియన్ బ్యూరో ఆఫ్ మైనింగ్ రీజినల్ కంట్రోలర్ శైలేంద్రకుమార్, జియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా సదరన్ రీజియన్ డైరెక్టర్ ప్రసూన్ఘోష్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. జీఎస్ఐ ప్రతిపాదించిన 9, రాష్ట్ర మైనింగ్ శాఖ ధ్రువీకరించిన 13 గనుల వేలానికి సంబంధించిన విధివిధానాలను కమిటీలో ఖరారు చేశారు. ప్రీమియం, రిజర్వు ధరలు, వేలం నిర్వహణపై మార్గదర్శకాలు నిర్దేశించారు. వీటి ప్రకారం 22 గనులకు వేలం నిర్వహించాలని మైనింగ్ శాఖకు స్పష్టం చేసింది. 21 గనులకు కాంపోజిట్ లీజులు, ఒక గనికి సాధారణ లీజు ఇచ్చేందుకు అంగీకరించింది. కమిటీ సూచించిన మార్గదర్శకాల ప్రకారం వెంటనే టెండర్ల ప్రక్రియ ప్రారంభిస్తామని మైనింగ్ డైరెక్టర్ వెంకటరెడ్డి తెలిపారు. -
AP: వజ్రాల వేటకు ఓకే
సాక్షి, అమరావతి: వైఎస్సార్ జిల్లా ఉప్పరపల్లెలో వజ్రాల అన్వేషణకు మైనింగ్ శాఖ త్వరలో టెండర్లు పిలవనుంది. ఉప్పరపల్లె ప్రాంతంలో వజ్రాల లభ్యత ఉన్నట్లు ఇటీవల జియోగ్రాఫికల్ సర్వే ఆఫ్ ఇండియా (జీఎస్ఐ) ధృవీకరించి, ఆ నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చింది. ప్రాథమిక సర్వే (జీ–4) ప్రకారం వజ్రాల లభ్యత ఉన్నట్లు తేలింది. గతంలో జీ–4 సర్వే ఆధారంగా గనులకు వేలం నిర్వహించకూడదని కేంద్రం స్పష్టం చేయడంతో వజ్రాల గనిపై ముందడుగు పడలేదు. ఆదాయం పెంచుకోవాల్సిన నేపథ్యంలో కేంద్రం ఇటీవలే తాజాగా ఎంఎండీఆర్ (మైన్స్ అండ్ మినరల్స్ డెవలప్మెంట్ అండ్ రెగ్యులేషన్) చట్టాన్ని సవరించి జీ–4 సర్వే ప్రకారం గనుల్ని లీజుకిచ్చే అవకాశం కల్పించింది. దీంతో ఉప్పరపల్లెలో వజ్రాల గనికి సానుకూలత ఏర్పడింది. వాస్తవానికి మైనింగ్ శాఖ గతంలోనే ఈ ప్రాంతంలో వజ్రాల లభ్యత ఉన్నట్లు గుర్తించింది. కేంద్రం ఆంక్షలు, వజ్రాల వెలికితీత కష్టతరం కావడం, భారీగా ఖర్చయ్యే పరిస్థితి ఉండడంతో అప్పట్లో దానిపై అంతగా దృష్టి సారించలేదు. మరింత లోతుగా సర్వే తాజాగా కేంద్ర ప్రభుత్వ వైఖరి మారడంతోపాటు వజ్రాల వెలికితీతకు అవకాశాలు మెరుగు పడడంతో మరింత లోతుగా అన్వేషణ కోసం టెండర్లు పిలవడానికి సిద్ధమైంది. జీ–4 సర్వే ఆధారంగా ఈ గనికి వేలం నిర్వహించి కాంపోజిట్ లీజు ఇవ్వనున్నారు. ఈ లీజు తీసుకున్న వారు వెంటనే మైనింగ్ చేసుకునే అవకాశం ఉండదు. ఆ బ్లాకుల్లో ఖనిజం ఎక్కడ, ఏ స్థాయిలో ఉందో తెలుసుకోవడానికి సొంతంగా జీ–3, జీ–2, జీ–1 స్థాయి సర్వేలు చేయించుకోవాల్సి ఉంటుంది. వైఎస్సార్ జిల్లా ఉప్పరపల్లె గ్రామంలో వజ్రాల నిక్షేపాలు ఉన్న భూములు ఇందుకు రెండు నుంచి ఐదేళ్లు అవకాశం ఇస్తారు. ఆ తర్వాత వారికిచ్చిన కాంపోజిట్ లీజును సాధారణ లీజుగా మార్పు చేస్తారు. ఉప్పరపల్లె ప్రాంతంలో 37.65 చదరపు కిలోమీటర్లలో వజ్రాల లభ్యతకు అవకాశం ఉన్నట్లు ప్రాథమిక అంచనాల్లో తేలింది. లీజు పొందిన సంస్థ పూర్తి స్థాయిలో సర్వేలు చేస్తే, వజ్రాల లభ్యత గురించి పూర్తి సమాచారం అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మైనింగ్ శాఖ టెండర్లు పిలిచేందుకు రంగం సిద్ధం చేసి ప్రభుత్వ ఆమోదానికి పంపింది. ప్రభుత్వం నుంచి ఆమోదం రాగానే టెండర్లు పిలవనున్నట్లు మైనింగ్ శాఖ అధికారులు తెలిపారు. -
బంపర్ ఆఫర్ ఇదే! పొలంలో వజ్రాల పంట
భోపాల్: మధ్యప్రదేశ్‌లోని పన్నా జిల్లాలో ఒక రైతుకు నిజంగా జాక్ పాట్ తగిలింది. రైతు భూమిలో అతి విలువైన వజ్రాలు పండుతున్నాయి. వినడానికి కొంచెం అతిశయోక్తిలా అనిపించినా ఇది నిజం. ఇలా ఒకసారి రెండు సార్లు కాదు రెండేళ్లలో ఏకంగా ఆరుసార్లు జరూర్‌పూర్ అనే గ్రామంలో ప్రకాశ్ మజుందార్ అనే రైతుకు డైమండ్స్ రూపంలో అనుకోని అదృష్టం కలిసి వచ్చింది. తాజాగా ప్రకాశ్‌కు 6. 47 క్యారెట్ల బరువు ఉన్న వజ్రం దొరికింది. దీని విలువ సుమారు 30 లక్షల రూపాయలు ఉంటుందని అంచనా. ఇలా రెండేళ్లలో ఆరుసార్లు అధిక నాణ్యత గల వజ్రాన్ని సొంతం చేసుకున్నాడు. ప్రభుత్వం నుండి లీజుకు తీసుకున్న భూమిలో వజ్రాలున్నాయని గమనించిన ప్రకాశ్ స్నేహితుల సాయంతో తవ్వకాలు చేపట్టాడు. దీంతో మరో డైమండ్‌ను వెలికి తీసాడు. శుక్రవారం జిల్లాలోని జరువాపూర్ గ్రామంలోని గనిలో కనుగొన్నట్లు ఇన్ఛార్జ్ వజ్రాల అధికారి నూతన్ జైన్ తెలిపారు. రాబోయే వేలంలో ఈ 6.47 క్యారెట్ల వజ్రాన్ని విక్రయిస్తామన్నారు. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ధర నిర్ణయిస్తామని చెప్పారు. మరోవైపు వేలంలోవచ్చిన సొమ్మును తన నలుగురు భాగస్వాములతో కలిసి పంచుకుంటానని ప్రకాశ్ చెప్పారు. గత సంవత్సరం తనకు 7.44 క్యారెట్ల వజ్రం దొరికిందనీ, గత రెండు సంవత్సరాలలో 2 నుండి 2.5 క్యారెట్ల బరువున్న నాలుగు విలువైన రాళ్లను కూడా సొంతం చేసుకున్నానని తెలిపారు. -
గాజుతో వజ్రాన్నీ కోయవచ్చు!
వజ్రాన్ని వజ్రంతోనే కోయగలమని అంటుంటారు కదా! కానీ, ఇప్పుడు గాజుతోనూ వజ్రంపై గాట్లు పెట్టవచ్చంటున్నారు చైనాలోని మెటీరియల్స్ సైంటిస్ట్‌లు. అంతేకాదు.. వజ్రం కంటే దృఢంగా ఉండే ఈ సరికొత్త గాజు సిలికాన్ మాదిరిగా అర్ధ వాహకం కూడా. ఏఎం–3 అని పిలుస్తున్న ఈ పదార్థం సౌరశక్తి ఘటకాల తయారీలో ఇప్పటివరకూ అసాధ్యమనుకున్న ఎన్నో పనులను సుసాధ్యం చేస్తుందని అంచనా. సహజ, మానవ నిర్మిత వజ్రాలతో కొన్ని పోలికలు ఉన్నప్పటికీ ఏఎం–3లో అణువులు, పరమాణువుల అమరిక వజ్రాల మాదిరిగా స్పష్టంగా ఉండదు. ఇలా నిర్మాణంలో తేడాలున్న వాటిని అమార్ఫస్ అని పిలుస్తుంటారు. ప్లాస్టిక్‌తోపాటు జెల్, గాజు కూడా ఈ కోవలోనివే. కానీ, గాజు మాత్రం దృఢంగా ఉండదన్నది మనకు తెలిసిన విషయమే. అయితే చైనాలోని యన్శాన్ వర్సిటీ శాస్త్రవేత్తలు గాజుకు కూడా ఈ దృఢత్వాన్ని అందించేందుకు కొన్ని ప్రయత్నాలు చేశారు. బంతి ఆకారంలో ఉండే కర్బన అణువుల సాయంతో గాజు అణు నిర్మితిని మార్చే ప్రయత్నం చేసి విజయం సాధించారు. పదార్థపు దృఢత్వాన్ని లెక్కించే వికర్స్ హార్డ్నెస్ టెస్ట్‌లో ఏఎం–3 113 జీపీఏ కలిగి ఉందని పరీక్షల్లో తేలింది. ఉక్కు వికర్స్ సూచీ కేవలం తొమ్మిది మాత్రమే. అంటే.. దీనికి కనీసం 13 రెట్లు ఎక్కువ దృఢమైన గాజు తయారైందన్నమాట. సహజసిద్ధమైన వజ్రాల వికర్స్ సూచీ 70 – 100 వరకూ ఉంటుంది. కానీ, శాస్త్రవేత్తలు ఏఎం–3తో వజ్రాన్ని కోసే ప్రయత్నం చేస్తే గాట్లు పడినట్లు స్పష్టమైంది. అంతేకాకుండా.. ఏఎం–3 గాజు 1.5 – 2.2 ఎలక్ట్రాన్ వోల్టుల బ్యాండ్ గ్యాప్‌లో అర్ధవాహకంగా పనిచేస్తున్నట్లు తెలిసింది. మైక్రోప్రాసెసర్ల తయారీకి ఉపయోగించే సిలికాన్ కూడా ఈ బ్యాండ్గ్యాప్లోనే పనిచేస్తుండటం విశేషం. ఇలాంటి పదార్థం అందుబాటులో ఉంటే.. కాంతిని నేరుగా విద్యుత్తుగా మార్చవచ్చని అంచనా. పరిశోధన వివరాలు నేషనల్ సైన్స్ రివ్యూ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. -
ఆవిష్కరణ: ప్లాస్టిక్ అవుతుంది వెనీలా ఫ్లేవర్!
లండన్: మనిషికి ప్రియమైన శత్రువుగా పిలిచే ప్లాస్టిక్ సీసాలను వెనీలా ఫ్లేవర్‌గా రీసైకిల్ చేసేందుకు శాస్త్రవేత్తలు ఓ కొత్త పద్ధతిని కనుగొన్నారు. బ్రిటన్‌లోని ఎడిన్‌బరో యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఒక అడుగు ముందుకేసి.. ప్లాస్టిక్ చెత్తను కాస్తా ఉపయోగకరమైన పదార్థంగా మార్చేశారు. ఇందుకోసం వారు ఈ–కోలి బ్యాక్టీరియాలో కొన్ని మార్పులు చేశారు. ఇలా మార్పులు చేసిన బ్యాక్టీరియా ప్లాస్టిక్ చెత్తను జీర్ణం చేసుకుని వెనీలా ఫ్లేవర్ ముడి పదార్థమైన వనిల్లిన్గా మార్చేశాయి. బ్యాక్టీరియా సాయంతో ప్లాస్టిక్ చెత్తకు విరుగుడు కనిపెట్టేందుకు చాలాకాలం నుంచి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రత్యేకంగా పెట్బాటిళ్లలోని టెరిఫ్తాలిక్ యాసిడ్ అనే పదార్థాన్ని నాశనం చేసేలా ఈ–కోలి బ్యాక్టీరియాలోఎడిన్బరో శాస్త్రవేత్తలు మార్పులు చేశారు. కొన్ని మార్పులు, చేర్పుల తర్వాత ఈ డిజైనర్ ఈ–కోలి బ్యాక్టీరియా అందించిన ప్లాస్టిక్‌లో 79 శాతాన్ని వనిల్లిన్గా మార్చేయగలిగాయి. సాధారణంగా వనిల్లిన్ను వనీలా గింజల నుంచి వేరు చేస్తారు. ఆహారంతో పాటు దీన్ని కీటకనాశినులు, ఫినాయిల్, ఫ్లోర్ క్లీనర్ల వంటి వాటి తయారీలోనూ వాడుతుంటారు. ప్లాస్టిక్ బాటిళ్ల నుంచే దీన్ని నేరుగా తయారు చేయగలిగితే ఏటా వేల టన్నుల వనిల్లిన్ ఉత్పత్తికి వనీలా గింజలపై ఆధారపడాల్సిన అవసరం తగ్గుతుంది. చిటికెలో నానో వజ్రాలు... పెన్సిల్‌కు.. వజ్రాలకు మధ్య చాలా దగ్గరి సంబంధం ఉంది. రెండూ కర్బనంతోనే తయారవుతాయి. అయితే అణువుల అమరికలో తేడా ఉంటుంది. ఈ తేడాల వల్లనే ఒకటి పెన్సిల్ (గ్రాఫైట్)గా మారిపోతే.. ఇంకోటి విలువైన వజ్రమవుతుంది. ఈ గ్రాఫైట్ పొరను అదేనండి.. గ్రాఫీన్‌ను చిటికెలో వజ్రాలుగా మార్చేసే కొత్త టెక్నిక్ ను అమెరికాలోని రైస్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. అదెలాగో తెలుసా కార్బన్‌కు కరెంట్ షాకిస్తే.. అది వజ్రంగా మారిపోతుంది. ఎంత మోతాదులో ఇవ్వాలి? ఎంత సమయం ఇవ్వాలన్న దానిపై వజ్రం తుదిరూపు ఆధారపడి ఉంటుంది. ఫ్లాష్ జౌల్ హీటింగ్ అని పిలిచే ఈ కొత్త పద్ధతి గత ఏడాది జనవరిలోనే ప్రపంచానికి పరిచయమైంది. ఇందులో కార్బన్‌తో కూడిన పదార్థాన్ని 2,727 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతలకు వేడి చేస్తారు. దాంతో కార్బన్ కాస్తా.. గ్రాఫీన్ పొరలుగా మారిపోతుంది. రైస్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఈ పద్ధతికి మరికొంత మెరుగుపరిచారు. పది మిల్లీ సెకన్ల స్థానంలో 10 నుంచి 500 మిల్లీ సెకన్ల వరకు వేడిచేస్తే.. కార్బన్ ఇతర రూపాల్లోకి అంటే నానోస్థాయి వజ్రాలుగా రూపాంతరం చెందుతాయని వీరు గుర్తించారు. అంతేకాదు.. నానో వజ్రాల చుట్టూ కర్బన అణువుల కవచం ఉండే ‘కాన్సెంట్రిక్ కార్బన్’ను కూడా ఈ పద్ధతిలో తయారు చేయొచ్చని ఈ పరిశోధనలకు నేతృత్వం వహించిన శాస్త్రవేత్త జేమ్స్ టూర్ తెలిపారు. ఎలక్ట్రానిక్ పరికరాల తయారీలో ఉపయోగపడే ఫ్లోరిన్తో కూడిన నానో వజ్రాలను పెద్ద ఎత్తున తయారు చేసేందుకూ ఫ్లాష్ జౌల్ హీటింగ్‌ను వాడుకోవచ్చని వివరించారు. బోరాన్, ఫాస్ఫరస్, నైట్రోజన్ వంటి రసాయనాలతోనూ ఈ పద్ధతిని పరీక్షించేందుకు ప్రస్తుతం ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారు. మూలకణాలతో కండలు వయసు పెరుగుతున్న కొద్దీ శరీరంలోని కండరాలు బలహీనపడటం సహజం. కొన్ని రకాల వ్యాధులున్నా.. మందుల వాడినా కూడా కండరాలు బలహీనపడిపోతుంటాయి. వ్యాయామం వంటి వాటితో ఈ నష్టాన్ని కొంతవరకు ఆలస్యం చేయవచ్చు. అయితే... శరీరంలోని ఏ కణంగానైనా మారిపోగల శక్తి ఉన్న మూలకణాలతో ఈ సమస్యను అధిగమించవచ్చని గుర్తించారు అమెరికాలోని సాల్క్ ఇన్స్టిట్యూట్ శాస్త్రవేత్తలు. గాయాల ద్వారా లేదా మరే ఇతర కారణాల వల్లనైనా బలహీనపడ్డ కండరాలను మళ్లీ పూర్వస్థితికి తీసుకెళ్లేందుకు మూలకణాలు ఉపయోగపడతాయని వీరు అంటున్నారు. మూలకణ చికిత్సలపై జరుగుతున్న పరిశోధనల్లో భాగంగా యమనాక ఫ్యాక్టర్స్ అని పిలిచే కొన్ని ప్రొటీన్లపై చాలాకాలంగా పరిశోధనలు జరుగుతున్నాయి. సాధారణ కణాలను కూడా ఈ ప్రొటీన్లు మూలకణాలుగా మార్చగలవు. ఇలా చర్మకణాలను మూలకణాలుగా మార్చి.. వాటి ద్వారా కండర కణజాలాన్ని వృద్ధి చేసేందుకు ఉపయోగిస్తుంటారు. అయితే ఇదంతా ఎలా జరుగుతుందో.. ఇప్పటికీ అస్పష్టమే. ఈ మిస్టరీని విప్పేందుకు సాల్క్ ఇన్స్టిట్యూట్ శాస్త్రవేత్త ఛావ్ వాంగ్ పరిశోధనలు చేసినప్పుడు కొన్ని కొత్త సంగతులు తెలిశాయి. యమనక ఫ్యాక్టర్ ప్రొటీన్లు బాసల్ లామినా అనే పొరలో ఉండే శాటిలైట్ కణాలపై ప్రభావం చూపుతున్నట్లు తెలిసింది. కండరాల పోగుల్లోకి యమనక ఫ్యాక్టర్లను చేర్చినప్పుడు ఈ కణాలు చైతన్యవంతమై కండరాల వృద్ధికి సంకేతాలు ఇస్తున్నట్లు స్పష్టమైంది. నిశిత పరిశీలన తరువాత తేలిందేమిటంటే.. ఈ యమనక ఫ్యాక్టర్లు డబ్ల్యూఎన్‌టీ4 పేరున్న ప్రొటీన్ల మోతాదును తగ్గిస్తున్నాయి అని. ఈ ప్రొటీన్‌ను అర్థం చేసుకోగలిగితే కండరాల పునరుజ్జీవానికి కొత్త మందులు తయారుచేయొచ్చని ఛావ్ వాంగ్ అంటున్నారు. -
నన్ను వజ్రాల నెక్లెస్‌తో అలంకరించినందుకు థ్యాంక్స్: సన్నీలియోన్
‘పలాస’ చిత్రంలోని ‘నాదీ నక్కిలీసు గొలుసు’ పాట గుర్తుంది కదా! ఇది సినిమాలోని స్పెషల్ సాంగ్. ఇప్పుడు సన్నీ లియోన్ కూడా నాదీ నక్కిలీసు గొలుసు అంటున్నారు. అయితే ఇది పాట కాదు. ఎంతో ప్రేమగా భర్త డేనియల్ వెబర్ కానుకగా ఇచ్చిన వజ్రాల నెక్లెస్ గురించి చెబుతున్నారు. ఈ ఇద్దరికీ పెళ్లయి, పదేళ్లయింది. ‘‘నన్ను వజ్రాల నెక్లెస్‌తో అలంకరించినందుకు థ్యాంక్స్. పదమూడేళ్ళ అనుబంధంలో పదేళ్ల వివాహ జీవితం మనది(భర్తని ఉద్దేశించి). మన జీవన ప్రయాణం అత్యద్భుతంగా ఉంటుందని ఒకరికొకరం చేసుకున్న ఒక్క ప్రామిస్ వల్ల ఈ రోజు మనం ఈ మనోహరమైన జీవితాన్ని ఆస్వాదిస్తున్నాం. చాలా సంతోషంగా ఉంది’’ అని పేర్కొన్నారు సన్నీలియోన్. ప్రస్తుతం మలయాళంలో ‘షీరో’ చిత్రంతో పాటు ఓ టీవీ షోతో సన్నీ ఫుల్ బిజీగా ఉన్నారు. 2017లో నిషా అనే అమ్మాయిని దత్తత తీసుకున్నారు డేనియల్ వెబర్, సన్నీ. ఆ తర్వాత సరోగసీ ద్వారా ఇద్దరు బిడ్డలకు వారు తల్లితండ్రులయ్యారు. View this post on Instagram A post shared by Sunny Leone (@sunnyleone) -
వజ్రం మెరిసె..మగువ మురిసె..
-
అదృష్టం అంటే అతనిదే.. రాత్రికి రాత్రే
భోపాల్ : అదృష్టం ఎప్పుడు, ఎలా, ఎవరిని వరిస్తుందో ఎవరికీ తెలియదనడానికి ఇదో తాజా ఉదాహరణ. రాత్రికి రాత్రే కోటిశ్వరుడయ్యాడన్న వార్తలు ఇప్పటికే మీరు చాలా చదివి ఉంటారు. అయితే ఇక్కడ ఒక వ్యక్తిని కోటీశ్వరున్ని చేయలేదుగాని లక్షాధికారిగా మారే అవకాశం వచ్చింది. మధ్యప్రదేశ్ లోని ఓ గనిలో పనిచేస్తున్న కార్మికుడికి ఒకటి, రెండు కాదు... ఏకంగా మూడు విలువైన వజ్రాలు దొరికాయి. వీటి విలువ సుమారు రూ. 30 లక్షల నుంచి రూ. 35 లక్షల వరకూ ఉంటుందని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. సుబాల్ అనే కార్మికుడు పన్నా జిల్లాలో తవ్వకాలు జరుపుతుండగా.. అతనికి 7.5 క్యారెట్ల వజ్రాలు దొరికాయని జిల్లా డైమండ్ ఆఫీసర్ ఆర్కే పాండే వెల్లడించారు. అయితే ఆ వ్యక్తి వాటిని తనతో పాటు తీసుకెళ్లకుండా నిజాయితీగా జిల్లా వజ్రాల కేంద్రానికి అప్పగించాడని, ప్రభుత్వ నిబంధనల మేరకు వాటిని వేలం వేస్తామని తెలిపారు. వేలం తరువాత 12 శాతం పన్నును మినహాయించుకుని, మిగిలిన 88 శాతం మొత్తాన్ని సుబాల్ కు అందిస్తామని తెలియజేశారు. కాగా, కొన్ని రోజుల క్రితం బుందేల్ ఖండ్ రీజియన్ లోని గనుల్లో ఓ కార్మికుడికి 10 క్యారెట్లకు పైగా విలువైన వజ్రాలు లభించాయి. దేశంలోని అత్యంత వెనుకబడిన జిల్లాల్లో ఒకటిగా ఉన్న పన్నా, వజ్రాల గనులకు మాత్రం ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడి గనుల్లో నిత్యం వందలాది మంది వజ్రాల కోసం అన్వేషణలు సాగిస్తుంటారు. -
ఎగుమతులు డౌన్
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా మందగమన ధోరణుల నేపథ్యంలో మార్చిలో ఎగుమతులు ఏకంగా 34.57 శాతం క్షీణించి 21.41 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. 2008–09 తర్వాత ఒక నెలలో ఇంత భారీగా ఎగుమతులు క్షీణించడం ఇదే ప్రథమం. 2009 మార్చిలో ఇవి 33.3 శాతం క్షీణించాయి. తాజాగా మార్చి గణాంకాలను కూడా కలిపి చూస్తే.. 2019–20 ఆర్థిక సంవత్సరం మొత్తానికి ఎగుమతులు 4.78 శాతం తగ్గి 314.31 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. లెదర్, వజ్రాభరణాలు, పెట్రోలియం ఉత్పత్తుల ఎగుమతులు గణనీయంగా పడిపోవడం ఇందుకు కారణం. ‘అంతర్జాతీయంగా నెలకొన్న మందగమన ధోరణులకు కరోనా వైరస్‌పరమైన కారణాలు మరింత ఆజ్యం పోశాయి. ప్రధానంగా ఈ కారణాలతో ఎగుమతులు క్షీణించాయి. కరోనా సంక్షోభం కారణంగా సరఫరా వ్యవస్థలు, డిమాండ్ తీవ్రంగా దెబ్బతినడంతో ఆర్డర్ల రద్దుకు దారితీసింది‘ అని కేంద్ర వాణిజ్య శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఊహించినదే..: మార్చి ద్వితీయార్థంలో ఎగుమతిదారులు ఉత్పత్తులు పంపలేకపోవడం, ఆర్డర్ల రద్దు, ఎగుమతుల్లో జాప్యం వంటి సమస్యలు నెలకొన్న నేపథ్యంలో తాజా గణాంకాలు ఊహించినవేనని భారతీయ ఎగుమతి సంస్థల సమాఖ్య ఎఫ్ఐఈవో ప్రెసిడెంట్ శరద్ కుమార్ సరాఫ్ వ్యాఖ్యానించారు. 2020–21 తొలి త్రైమాసికంలో కూడా ఇదే ధోరణి ఉండొచ్చన్నారు. అయితే, అంతర్జాతీయ మార్కెట్ల పరిస్థితులను బట్టి రెండో త్రైమాసికం నుంచి ఎగుమతులు ఓ మోస్తరుగా పెరిగే అవకాశాలు ఉన్నాయని సరాఫ్ తెలిపారు. పూర్తి ఆర్థిక సంవత్సరానికి చాలా రంగాలు నెగెటివ్ వృద్ధే నమోదు చేశాయి. వీటిలో పెట్రోలియం (8.10 శాతం), హస్తకళలు (2.36 శాతం), ఇంజనీరింగ్ (5.87 శాతం), వజ్రాభరణాలు (11 శాతం), లెదర్ (9.64 శాతం) మొదలైనవి ఉన్నాయి. తేయాకు, కాఫీ, బియ్యం, పొగాకు మొదలైనవి కూడా 2019–20లో ప్రతికూల వృద్ధి నమోదు చేశాయి. దిగుమతుల్లో కూడా తగ్గుదల .. గత నెలలో దిగుమతులు కూడా 28.72% క్షీణించి 31.16 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. వాణిజ్యలోటు 9.76 బిలియన్ డాలర్లకు తగ్గింది. ఇక పూర్తి ఆర్థిక సంవత్సరంలో చూస్తే 9.12% క్షీణతతో 467.19 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. 2019–20లో నెగెటివ్ వృద్ధి నమోదైన దిగుమతి విభాగాల్లో పసిడి, వెండి, ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు, రవాణా పరికరాలు, ఉక్కు, బొగ్గు, పెట్రోలియం ఉన్నాయి. ఉత్పత్తులు, సేవల ఎగుమతులు కలిపి 2019–20 ఆర్థిక సంవత్సరంలో 528.45 బిలియన్ డాలర్లుగా ఉంటాయని అంచనా. అంతక్రితం ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 1.36% నెగటివ్ వృద్ధి ఉంటుందని అంచనా. -
సుబ్బరామిరెడ్డి అన్న కొడుకు ఇంట్లో భారీ చోరీ
సాక్షి, హైదరాబాద్ : బంజారాహిల్స్ రోడ్ నెంబర్-2లో భారీ దొంగతనం జరిగింది. రాజ్యసభ సభ్యుడు టి.సుబ్బరామిరెడ్డి అన్న కుమారుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నివాసంలో సుమారు రూ.3 కోట్ల విలువ చేసే వజ్రాభరణాలు, నగదు చోరీ అయ్యాయి. బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసుకుని ముమ్మర దర్యాప్తు చేపట్టారు. -
వజ్రాలు కొన్నాడు... డబ్బు ఎగ్గొట్టాడు
బంజారాహిల్స్: కొనుగోలు చేసిన వజ్రాలకు సంబంధించి డబ్బు ఇవ్వకపోగా అడిగితే అంతు చూస్తానంటూ బెదిరిస్తున్నాడని నగరానికి చెందిన వజ్రాల వ్యాపారిపై గుజరాత్‌కు చెందిన వజ్రాల వ్యాపారి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుజరాత్ రాష్ట్రం వెస్ట్ సూరత్‌లో నివసించే వజ్రాల వ్యాపారి వికాస్ చోప్రాకు మూడున్నరేళ్ళ క్రితం సోమాజి గూడలో వజ్రాల వ్యాపారం నిర్వహించే మదన్ సిసోడియాతో పరిచయం ఏర్పడింది. ఎనిమిదిసార్లు ఇద్దరూ కలిసి వజ్రాల వ్యాపారంలో భాగంగా లావాదేవీలు జరుపుకున్నారు. 2017 జూన్ 30న బంజారాహిల్స్ రోడ్ నెం. 2లో జరిగిన లావాదేవీల్లో భాగంగా వికాస్ చోప్రా తన వద్ద ఉన్న రెండు వజ్రాలను రూ. 24.72 లక్షలకు సిసోడియాకు విక్రయించాడు. ఇందుకు సంబంధించిన బిల్లుకూడా ఇచ్చాడు. రెండువారాలు దాటినా సిసోడియా డబ్బు ఇవ్వడంలో విఫలమయ్యాడు. దీంతో పలుమార్లు బాధితుడు ప్రశ్నించారు. కావాలనే మోసం చేశాడని తెలుసుకున్న బాధితుడు ఇంటికి వెళ్ళి ప్రశ్నించగా మరోసారి డబ్బు అడిగితే చంపేస్తానంటూ బెదిరించాడు. ఇటీవల ఫోన్ కాల్స్ కూడా స్వీకరించడం లేదు. పలు హెచ్చరికలతో కూడిన మెసేజ్‌లు పంపుతున్నాడని తనకు సిసోడియా నుంచి ప్రాణహాని ఉందని బాధితులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. వజ్రాల వ్యాపారి మదన్‌సిసోడియాపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
షావొమీ ‘గోల్డ్’ ఫోన్ @ 4.8 లక్షలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రీమియం ఫీచర్లతో తక్కువ ధరలో స్మార్ట్ఫోన్లను విక్రయిస్తున్న చైనా టెక్నాలజీ కంపెనీ షావొమీ.. మరో సంచలనానికి సిద్ధమైంది. ‘రెడ్మీ కె20 ప్రో’ మోడల్ ఆధారంగా లిమిటెడ్ ఎడిషన్‌లో అత్యంత ఖరీదైన వేరియంట్ తయారీకి శ్రీకారం చుట్టింది. దీని ఖరీదు రూ.4.8 లక్షలు. బంగారంతో తయారైన బ్యాక్ ప్యానెల్‌తో ఇది రూపుదిద్దుకుంది. 100 గ్రాముల పసిడి వాడారు. ప్యానెల్ వైపు ‘కె’ అనే అక్షరంపై 20 వజ్రాలను పొదిగారు. కేవలం 20 పీసులను మాత్రమే తయారు చేస్తారు. విశేషమేమంటే ఇవి భారత్‌లో తయారవుతున్నాయి. అంతేకాదు భారత్‌కు మాత్రమే ప్రత్యేకం. ఫోన్ నుంచి ప్యానెల్‌ను విడదీయడానికి వీలుకాకుండా డిజైన్ చేశారు. చారిటీకి వినియోగిస్తాం.. ఈ వేరియంట్‌ను విక్రయించాలా వద్దా అన్న విషయం ఇంకా నిర్ణయించలేదని షావొమీ ఇండియా ఎండీ మను కుమార్ జైన్ శుక్రవారమిక్కడ మీడియాకు తెలిపారు. ‘ఇన్విటేషన్ ద్వారా విక్రయించాలా, బహుమతిగా ఇవ్వడమా, వేలం వేయడమా అన్నది ఇంకా తేల్చలేదు. వీటి విక్రయం ద్వారా వచ్చిన డబ్బులను సామాజిక కార్యక్రమాలకు వెచ్చిస్తాం. కె20 గుర్తుగా బ్యాక్ ప్యానెల్‌పై ‘కె’ అని ముద్రించాం. ఇప్పటికే ఆసక్తి కనబరిచిన కస్టమర్లు ‘కె’ బదులు, తమ పేరులోని మొదటి అక్షరాన్ని ముద్రించాలని కోరారు’ అని వివరించారు. కస్టమైజ్ చేయాల్సిందే.. చైనాలో షావొమీ విస్తృత శ్రేణిలో పలు ఉత్పత్తులను రూపొందించి విక్రయిస్తోందని, వీటిని భారత్‌లో ప్రవేశపెట్టాలంటే ప్రతి ఉత్పాదనలో మార్పులు చేయాల్సి ఉంటుందని మను కుమార్ వెల్లడించారు. దశలవారీగా వీటిని ఇక్కడ పరిచయం చేస్తామన్నారు. షావొమీ కోసం షూస్, టీ–షర్ట్స్, ఫిట్నెస్ బ్యాండ్స్ తయారీకై దేశంలోని పలు మాన్యుఫ్యాక్చరింగ్ కంపెనీలతో చర్చిస్తున్నట్టు చెప్పారు. స్మార్ట్‌ఫోన్లకై సంస్థకు దేశంలో నాలుగు ప్రాంతాల్లో ఏడు తయారీ కేంద్రాలున్నాయి. సెకనుకు మూడు ఫోన్లు ఉత్పత్తి చేయగలిగే సామర్థ్యం ఉంది. -
వజ్రాల కోసం పొలాల జల్లెడ
ఒక్కటి...ఒక్కటంటే ఒక్కటి దొరికితే జీవితమే మారిపోతుంది. అందుకే జనమంతా ఆ ఒక్కటి కోసం ఎర్రనేలలను జల్లెడ పడుతున్నారు. మిరిమిట్లు గొలిపే వజ్రాల కోసం అన్వేషిస్తున్నారు. ఏటా లాగే ఈ సారి కూడా తొలకరి పలకరించగానే వజ్రకరూరు ప్రాంతంలో వజ్రాల వేట ప్రారంభమైంది. స్థానికులతో పాటు ఇతర ప్రాంతాల నుంచి కూడా జనం తరలిరావడంతో పొలాలన్నీ జనంతో నిండిపోయాయి. సాక్షి, వజ్రకరూరు: వజ్రాలకు పేరుగాంచింది...వజ్రకరూరు. అందుకే ఏటా తొలకరి వర్షాలు కురవగానే ఇక్కడ ఆశల వేట ప్రారంభమవుతుంది. స్థానికులతో పాటు ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారు కూడా పొలాల్లో వజ్రాల వెతుకులాటలో నిమగ్నమవుతుంటారు. దొరికిన వారి జీవితాలే మారిపోగా...ఎప్పటికైనా అదృష్టం తలుపుతట్టకపోతుందా...ఓ రంగురాయి తమ జీవితం మార్చకపోతుందా అని ఏళ్లుగా వెతులాడే వారే ఎక్కువగా కనిపిస్తారు. ఇక్కడి వజ్రాలకు భారీ డిమాండ్ వజ్రకరూరు ప్రాంతంలో లభించే వజ్రాలకు మార్కెట్లో భారీ రేటు పలుకుతోంది. ఇక్కడి పొలాల్లో ఏటా 10 నుంచి 20 వరకు వజ్రాలు దొరుకుతున్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఇటీవల వజ్రకరూరు పరిసర ప్రాంతంలో మోస్తరు జల్లులు కురిశాయి. దీంతో వారం రోజులుగా ఉదయాన్నే స్థానికులతోపాటు ఇతర ప్రాంతాలకు చెందిన వ్యక్తులు వజ్రకరూరు పరిసర ప్రాంతంలోని పొలాలకు చేరుకుని వజ్రాలకోసం వెతుకులాటలో నిమగ్నమవుతున్నారు. పొలాల్లో విత్తనం వేసేంతవరకు ఈ వజ్రాల వేట కొనసాగుతుందని ఇక్కడి వారు చెబుతున్నారు. లోతట్టు ప్రాంతాల్లోనే అన్వేషణ వర్షం కురిసినప్పుడు పైభాగంలోనుంచి నీరుకిందకు ప్రవహిస్తూ ఒక ప్రాంతంలోనికి చేరి...అక్కడే ఇంకిపోతుంది. ఈ క్రమంలో నీటి వెంట వజ్రాలు వస్తాయని ఇక్కడి వారి నమ్మకం. అందుకే పొలాల్లోని లోతట్టు ప్రాంతాల్లోనే వజ్రాల అన్వేషణ ఎక్కువగా జరుగుతోంది. గుట్టుచప్పుడు కాకుండా విక్రయాలు ఇక్కడ ఎవరికైనా వజ్రం లభిస్తే గుట్టుచప్పుడు కాకుండా ఇతర ప్రాంతాలకు తీసుకువెళ్లి విక్రయిస్తారు. లేదంటే వజ్రకరూరు పరిసరాల్లోనే తిష్టవేసిన వ్యాపారులకు అమ్ముకుంటారు. ఇలా కొనుగోలు చేసిన వజ్రాలను వ్యాపారులు ఇతర ప్రాంతాలకు తీసుకువెళ్లి అత్యధిక ధరకు అమ్ముకుంటుంటారు. గత ఏడాది కూడా ఈప్రాంతంలో రూ.లక్షలు విలువచేసే వజ్రాలు లభ్యమైనట్లు తెలుస్తోంది. -
వజ్రాల కోసం పొలాల జల్లెడ
ఒక్కటి...ఒక్కటంటే ఒక్కటి దొరికితే జీవితమే మారిపోతుంది. అందుకే జనమంతా ఆ ఒక్కటి కోసం ఎర్రనేలలను జల్లెడ పడుతున్నారు. మిరిమిట్లు గొలిపే వజ్రాల కోసం అన్వేషిస్తున్నారు. ఏటా లాగే ఈ సారి కూడా తొలకరి పలకరించగానే వజ్రకరూరు ప్రాంతంలో వజ్రాల వేట ప్రారంభమైంది. స్థానికులతో పాటు ఇతర ప్రాంతాల నుంచి కూడా జనం తరలిరావడంతో పొలాలన్నీ జనంతో నిండిపోయాయి. సాక్షి, వజ్రకరూరు: వజ్రాలకు పేరుగాంచింది...వజ్రకరూరు. అందుకే ఏటా తొలకరి వర్షాలు కురవగానే ఇక్కడ ఆశల వేట ప్రారంభమవుతుంది. స్థానికులతో పాటు ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారు కూడా పొలాల్లో వజ్రాల వెతుకులాటలో నిమగ్నమవుతుంటారు. దొరికిన వారి జీవితాలే మారిపోగా...ఎప్పటికైనా అదృష్టం తలుపుతట్టకపోతుందా...ఓ రంగురాయి తమ జీవితం మార్చకపోతుందా అని ఏళ్లుగా వెతులాడే వారే ఎక్కువగా కనిపిస్తారు. ఇక్కడి వజ్రాలకు భారీ డిమాండ్ వజ్రకరూరు ప్రాంతంలో లభించే వజ్రాలకు మార్కెట్లో భారీ రేటు పలుకుతోంది. ఇక్కడి పొలాల్లో ఏటా 10 నుంచి 20 వరకు వజ్రాలు దొరుకుతున్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఇటీవల వజ్రకరూరు పరిసర ప్రాంతంలో మోస్తరు జల్లులు కురిశాయి. దీంతో వారం రోజులుగా ఉదయాన్నే స్థానికులతోపాటు ఇతర ప్రాంతాలకు చెందిన వ్యక్తులు వజ్రకరూరు పరిసర ప్రాంతంలోని పొలాలకు చేరుకుని వజ్రాలకోసం వెతుకులాటలో నిమగ్నమవుతున్నారు. పొలాల్లో విత్తనం వేసేంతవరకు ఈ వజ్రాల వేట కొనసాగుతుందని ఇక్కడి వారు చెబుతున్నారు. లోతట్టు ప్రాంతాల్లోనే అన్వేషణ వర్షం కురిసినప్పుడు పైభాగంలోనుంచి నీరుకిందకు ప్రవహిస్తూ ఒక ప్రాంతంలోనికి చేరి...అక్కడే ఇంకిపోతుంది. ఈ క్రమంలో నీటి వెంట వజ్రాలు వస్తాయని ఇక్కడి వారి నమ్మకం. అందుకే పొలాల్లోని లోతట్టు ప్రాంతాల్లోనే వజ్రాల అన్వేషణ ఎక్కువగా జరుగుతోంది. గుట్టుచప్పుడు కాకుండా విక్రయాలు ఇక్కడ ఎవరికైనా వజ్రం లభిస్తే గుట్టుచప్పుడు కాకుండా ఇతర ప్రాంతాలకు తీసుకువెళ్లి విక్రయిస్తారు. లేదంటే వజ్రకరూరు పరిసరాల్లోనే తిష్టవేసిన వ్యాపారులకు అమ్ముకుంటారు. ఇలా కొనుగోలు చేసిన వజ్రాలను వ్యాపారులు ఇతర ప్రాంతాలకు తీసుకువెళ్లి అత్యధిక ధరకు అమ్ముకుంటుంటారు. గత ఏడాది కూడా ఈప్రాంతంలో రూ.లక్షలు విలువచేసే వజ్రాలు లభ్యమైనట్లు తెలుస్తోంది. -
వజ్రాల వేలం.. కోట్లలో అమ్ముడుపోయాయి!
-
వజ్రాల కోసం వెతుకులాట
సాక్షి, వజ్రకరూరు: కరువుసీమగా పేరుగాంచిన అనంతపురం జిల్లాలో వజ్రాల వేట ప్రారంభమైంది. వజ్రకరూరు మండలంలోని పొలాల్లో వజ్రాల అన్వేషణ కొనసాగుతోంది. తొలకరి పలకరించడంతో పరిసర ప్రాంతాల వారే కాకుండా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారు పొలాలను తూర్పారబడుతున్నారు. ఏ చిన్న రంగురాయి దొరికినా ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. ఈ ప్రాంతమంతా ఇసుకతో కూడిన ఎర్రనేలలు కావడంతో జూన్ మాసంలో తొలకరి వర్షాలు ప్రారంభం కాగానే భూమిలోపల ఉన్న వజ్రాలు పైకి వస్తాయని, పొలంలో నీరు పారినప్పుడు అవన్నీ ఏటవాలుగా ఉన్న ప్రాంతానికి చేరుకుంటాయని స్థానికులు చెబుతున్నారు. అందువల్లే ఇక్కడికి వచ్చే వారంతా పొలాల్లో అణువణువూ వెతుకుతూ తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. వజ్రకరూరు ప్రాంతంలో ఏటా 10 నుంచి 20 దాకా వజ్రాలు దొరుకుతాయనీ, ఇక్కడ లభించే వజ్రాలు కోహినూర్‌తో సమానంగా ధర పలుకుతాయని స్థానికులు చెబుతున్నారు. ఆదివారం రాత్రి వజ్రకరూరు పరిసర ప్రాంతంలో మోస్తరు వర్షం కురవగా... స్థానికులతో పాటు ఇతర ప్రాంతాల వారు కూడా ఉదయాన్నే పొలాలకు వెళ్లి వజ్రాలకోసం వేట కొనసాగిస్తున్నారు. ఏటా ఇక్కడ లభించే వజ్రాలను గుట్టు చప్పుడు కాకుండా కొందరు దళారులు కొనుగోలు చేసి ఇతర ప్రాంతాల్లో విక్రయిస్తారనీ, గత ఏడాది కూడా రూ.లక్షలు విలువచేసే వజ్రాలు లభ్యమయ్యాయని స్థానికులు చెబుతున్నారు. -
లక్ష్మీ కాసుల గలగలలు
ప్రతీ ఏటా కాసు శ్రావణమాసం వ్రతానికి ప్రతియేటా లక్ష్మీ కాసును కొనడం ఆనవాయితీగా ఉంటుంది చాలామందికి. ఈ కాసులు కొన్ని పోగయ్యాక వాటితో సింపుల్ డిజైన్స్ చేయించుకోవచ్చు. ఇవి ప్లెయిన్ శారీస్, అనార్కలీ వంటి వాటి మీదకూ ధరించవచ్చు. మామిడి కాసులు మామిడి పిందెల రూపంలో ఉండే కాసులను కూడా ఇప్పుడు తయారు చేస్తున్నారు. వీటిని మ్యాంగోమాల అంటారు. మన సంప్రదాయ వేడుకల్లో మామిడితో ఉన్న అనుబంధం వర్ణించలేనిది. అందుకే మామిడి పిందెల డిజైన్లు గల జరీ చీరలు, ఆభరణాలు ఎప్పుడూ గ్రాండ్‌గా ఉంటాయి. కనీసం 25 పైసలంత సైజ్‌లో ఉండే కాసులతో తయారయ్యే మాల 30 నుంచి 300గ్రాముల దాకా బరువు ఉంటున్నాయి. డైమండ్స్‌కు కాసుల జత కాసు హారానికి ఫ్లాట్ డైమండ్స్, సింగిల్ కట్ డైమండ్స్, కెంపులు, పచ్చలు, ముత్యాలతోనూ... ఇలా కంటెంపరరీగా డిజైన్ చేయించుకోవచ్చు. జూకాలు, గాజులు కూడా కాసులతో చేయించుకుంటే పట్టు చీరల మీదకు ఈ డిజైన్ ఆభరణాలు బాగా నప్పుతాయి. శ్రావణమాసం వ్రతాలు, వివాహ వేడుకలకు పట్టు చీరల మీదకు కాంబినేషన్‌గా ఎంత హెవీగా ఆభరణాలు వేసుకున్నా అందంగానే ఉంటుంది. వాటిలో బామ్మల కాలం నాటి లక్ష్మీ కాసుల మాలలు/హారాలు మాత్రం ఎప్పుడూ సవ్వడి చేస్తూనే ఉన్నాయి. అందుకే కాసుల పేరు అనేది ఆధునిక మహిళల మెడలోనూ గలగల మంటోంది. -
భూమి లోపల వజ్రాల కొండ!
భూమ్మీద ఉన్న వజ్రాల పరిమాణమెంతో తెలుసా? ఊహూ.. ఇప్పటికే తవ్వి తీసింది.. నగల రూపంలో ఉన్నవి కాదు. భూగర్భంలో దాక్కుని ఇప్పటివరకూ బయటకు రాని వాటి సంగతి! వందలు, వేలు, లక్షలు కూడా కాదు. ఏకంగా పదివేల లక్షల కోట్ల టన్నులు!! ఇంకోలా చెప్పాలంటే ఒకటి పక్కన 15 సున్నాలు పెడితే వచ్చే సంఖ్య అన్నమాట! భూగర్భ శాస్త్రవేత్తలు అధ్యయనం ద్వారా తెలుసుకున్న తాజా విషయమిది. మన అడుగున భూగర్భంలో ఏముందో తెలుసుకునేందుకు శాస్త్రవేత్తలు ధ్వని తరంగాలు వాడతారని మనకు తెలుసు. ఈ తరంగాలు భూమి గుండా ప్రయాణించే క్రమంలో అక్కడ ఉండే రాళ్లను బట్టి వేర్వేరు వేగాలతో ప్రయాణిస్తాయి. శాస్త్రవేత్తలు ఈ తేడాలను గుర్తించి అక్కడ ఏముందో అంచనా వేస్తారు. అయితే భూమ్మీద ఒక ప్రాంతంలో మాత్రం శాస్త్రవేత్తల అంచనాలు తారుమారయ్యాయి. సుమారు 320 కిలోమీటర్ల లోతుల్లో ఉండే ఈ భారీ రాతి పలకల ప్రాంతంలో ఏముందో తెలుసుకోవడానికి... ఇప్పటికే అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా త్రీడీ మోడళ్లు తయారు చేశారు. ఆ ప్రాంతంలో ధ్వని తరంగాలను పరిశీలించి.. దానికి దగ్గరగా ఏ రకమైన రాళ్లు ఉన్నాయో పరిశీలించినప్పుడు అవి వజ్రాలని తేలింది. భూగర్భంలో ఉండే భారీ రాతి ఫలకాల ప్రాంతం మొత్తాన్ని పరిగణనలోకి తీసుకున్నప్పుడు అక్కడ ఉండే వజ్రాల పరిమాణం ప్రస్తుతం అందుబాటులో ఉన్నదానికంటే వెయ్యిరెట్లు ఎక్కువ ఉండవచ్చు. నానో గుళికలతో వ్యాధులకు చికిత్స! కేన్సర్ చికిత్సకు మానిజ్ యూనివర్శిటీ మెడికల్ సెంటర్ శాస్త్రవేత్తలు ఓ వినూత్నమైన పద్ధతిని ఆవిష్కరించారు. కేన్సర్ చికిత్సకు వాడే మందులకు సూక్ష్మస్థాయి గుళికలు (నానోస్థాయి) సిద్ధం చేసి వాటిని శరీర రోగ నిరోధక వ్యవస్థ కణాలతో జోడించేలా చేయగలిగితే అవి నేరుగా కణితిపై దాడి చేస్తాయని వీరు అంటున్నారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న చికిత్సలతో పోలిస్తే ఈ కొత్త పద్ధతి వల్ల ఆరోగ్యకరమైన కణజాలానికి ఏమాత్రం నష్టం జరగదని అంచనా. భవిష్యత్తులో ఈ పద్ధతిని కేన్సర్‌కు మాత్రమే కాకుండా ఇతర వ్యాధులకూ ఉపయోగించవచ్చునని, తద్వారా మందులతో వచ్చే దుష్ప్రభావాలను గణనీయంగా తగ్గించవచ్చునని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త వోల్కర్ మెయిలిండర్ తెలిపారు. మనిషి వెంట్రుకలో వెయ్యోవంతు మందం ఉండే నానో మందుల గుళికల ద్వారా వ్యాధికి చికిత్స అందించే స్థాయిలో మందులు చేర్చగలమని, ఈ గుళికల పైభాగానికి ప్రత్యేకమైన పూత పూసి రోగ నిరోధక కణాలకు అతుక్కునేలా చేయడం ఈ పద్ధతిలో కీలకమని చెప్పారు. పరిశోధన వివరాలు నేచర్ నానోటెక్నాలజీ తాజా సంచికలో ప్రచురితమయ్యాయి. సూర్యుడిపైకి పార్కర్ ఉపగ్రహం! అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ వచ్చే నెలలో సూర్యుడిపైకి ఓ ఉపగ్రహాన్ని ప్రయోగించనుంది. కోటానుకోట్ల మైళ్ల దూరం ప్రయాణించి ఈ ఉపగ్రహం సూర్యుడి ఉపరితలానికి దగ్గరగా వెళుతుందని నాసా అంటోంది. మరి... సూర్యుడిపైన దుర్భరమైన వేడిని తట్టుకుని ఉపగ్రహం ఉపరితలాన్ని తాకడం ఎలా? ఇలా జరక్కుండా కొన్ని ఏర్పాట్లు ఉన్నాయి. వాటి గురించి తెలుసుకునే ముందు వేడి.. ఉష్ణోగ్రతలను అర్థం చేసుకోవాలి. మామూలుగానైతే ఇవి రెండూ ఒకటే అనిపిస్తుంది. కానీ అంతరిక్షంలో ఉష్ణోగ్రత వేల డిగ్రీల సెల్సియస్ ఉన్నప్పటికీ వేడి మాత్రం ఆ స్థాయిలో ఉండదని శాస్త్రవేత్తలు అంటున్నారు. కణాలు ఎంత వేగంగా కదులుతాయన్న అంశంపై ఉష్ణోగ్రతను నిర్ణయిస్తారు. వేడి మాత్రం ఎంత శక్తి ఉత్పత్తి అయిందన్న అంశంపై ఆధారపడి ఉంటుంది. అంతరిక్షంలో కణాలు వేగంగా కదులుతున్నా శక్తి ఉత్పత్తి, సరఫరా తక్కువ కాబట్టి వేడి తక్కువ. సూర్యుడిపైకి ప్రయోగించే పార్కర్ ఉపగ్రహంపై ప్రత్యేకమైన పదార్థపు పూత ఉంటుంది. ఇది ఎనిమిది అడుగుల వెడల్పు, నాలుగున్నర అంగుళాల మందం ఉంటుంది. అతి తేలికగా ఉండటం, ప్రత్యేకమైన పదార్థంతో తయారవడం వల్ల పార్కర్ ఉపగ్రహం సూర్యుడిపై వేడిని తట్టుకోగలదని అంచనా. -
బెంట్లీ కారు..ఇటాలియన్ సూటు
సాక్షి నాలెడ్జ్ సెంటర్: దేశంలోని బ్యాంకుల్లో దాదాపు రూ.4,500 కోట్ల మేర అప్పులు చేసి, పంజాబ్ నేషనల్ బ్యాంకుకు ఎల్ఓయూల పేరిట రూ.11,400 కోట్ల కుచ్చుటోపీ పెట్టి దేశాన్ని దాటేసిన నీరవ్ దీపక్ మోదీ.. అమెరికాలో తలదాచుకున్నట్టు వార్తలొస్తున్నాయి. అక్కడ కూడా ఆయన విలాసాలకు కొదవేం లేదని తెలుస్తోంది. న్యూయార్క్‌లోని అత్యంత ఖరీదైన హోటల్లో రోజుకు రూ.75 వేల అద్దె ఉండే సూట్‌ను ఏకంగా 90 రోజుల పాటు బుక్ చేసుకున్నట్లు ఓ ఆంగ్ల పత్రిక శనివారం వెల్లడించింది. అంటే.. కేవలం మూడు నెలల అద్దె దాదాపు రూ.70 లక్షలు! ఇక భార్య అమీ, ముగ్గురు పిల్లలతో ఉంటారు కనక మిగతా ఖర్చుల్ని ఊహించలేం. అయినా ఖర్చెంతయితే ఏంటి చెప్పండి!! ఆయనకు రుణాలివ్వటానికి, ఎగ్గొడితే వాటిని ఎన్పీఏలుగా మార్చి మన నెత్తిన రుద్దటానికి మన బ్యాంకులు సిద్ధంగానే ఉన్నాయి కదా! బెల్జియంలో పుట్టుక.. భారత్‌లో వ్యాపారం అంతర్జాతీయ డైమండ్స్ కేంద్రం బెల్జియంలోని ఆంట్వర్ప్లో 1971లో పుట్టిన నీరవ్ మోదీ... అక్కడే పెరిగి పాఠశాల విద్యను పూర్తి చేసుకున్నాడు. అపర కుబేరుల పిల్లలు వ్యాపార రహస్యాలు తెలుసుకునే అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియా వార్టన్ బిజినెస్ స్కూల్లో చేరినా... మధ్యలోనే చదువు ఆపేశాడు. భారత ఆర్థిక రాజధాని ముంబై చేరుకున్నాడు. అప్పటికే నీరవ్ మేనమామలు మెహుల్ చోక్సీ తదితరులు వజ్రాల వ్యాపారంలో ఉన్నారు. వారు గీతాంజలి జెమ్స్‌ను నడిపిస్తున్నారు. వారి వద్దే వజ్రాల వ్యాపారంలో ఓనమాలు దిద్దుకున్నాడు నీరవ్. తొమ్మిదేళ్లపాటు అక్కడే కొనసాగాడు. దశ మార్చిన ఆమె చెవి రింగులు మొదట్లో నీరవ్‌కు సంగీతంపై విపరీతమైన ఆసక్తి ఉండేది. చదువుకునే రోజుల్లో మ్యూజిక్ (ఆర్కెస్ట్రా) కండక్టర్ కావాలనేది ఆయన కోరిక. హైఫై సంగీత సాధనాలపై మోజుతో రణంగా బాంగ్, ఒలూఫ్సన్ వంటి ప్రఖ్యాత కంపెనీలకు పబ్లిసిటీ కూడా చేశాడు. అయితే అనుకోకుండా తన 37వ ఏట ఓ స్నేహితురాలి కోరిక మేరకు నీరవ్ ఆమె చెవి రింగుల్ని డిజైన్ చేశాడు. అవి తనకు నచ్చటంతో... నీరవ్ మోదీ బ్రాండ్ శకం మొదలైంది. అదే పేరుతో అత్యంత ఖరీదైన ఫ్యాషన్ వజ్రాభరణాల వ్యాపారంలోకి దిగాడు నీరవ్. ఫైర్‌స్టార్ డైమండ్ ఇంటర్నేషనల్ పేరిట సొంత కంపెనీని ఏర్పాటు చేశాడు. 2009లో ఆరంభమైన ఆభరణాల డిజైనింగ్.. నీరవ్‌కు ఊహించని స్థాయిలో ఆదాయాన్ని, పేరు ప్రఖ్యాతుల్ని తెచ్చిపెట్టింది. అమెరికాలో ప్రఖ్యాత నగల కంపెనీ ఫ్రెడరిక్ గోల్డ్మన్లో భారీ వాటాను కొనుగోలు చేయడం నీరవ్ వ్యాపారాన్ని కొత్త మలుపు తిప్పింది. తన కంపెనీకన్నా ఏడు రెట్లు పెద్దదైన గోల్డ్‌మన్ కొనుగోలుతో ఆ దేశంలోని జేసీ పెనీ, సియర్స్, వాల్‌మార్ట్‌లో నీరవ్ మోదీ బ్రాండ్ ఆభరణాల అమ్మకాలు ఆరంభమయ్యాయి. హాంకాంగ్‌లో అంతర్జాతీయ ఖ్యాతి! లండన్ ప్రఖ్యాత వేలం సంస్థ క్రిస్టీస్ వేలం వస్తువుల కేటలాగ్ మొదటి పేజీలో నీరవ్ ఫొటోను ప్రచురించింది. ఈ అదృష్టం దక్కిన తొలి భారతీయుడు ఇతడే! ఆయన రూపొందించిన గోల్కొండ నెక్లెస్‌కు 2010లో హాంకాంగ్‌లో నిర్వహించిన ఈ వేలంలో దాదాపు 35 లక్షల డాలర్ల ధర పలికింది. 2012 అక్టోబర్‌లో మరో ప్రఖ్యాత వేలం సంస్థ సతబీజ్ హాంకాంగ్‌లోనే జరిపిన వేలంలో నీరవ్ డిజైన్ చేసిన రివియెరీ డైమండ్ నెక్లెస్ ఏకంగా 51 లక్షల డాలర్లకు అమ్ముడుపోయింది. దీంతో మరుసటేడాదే (2013లో) ఫోర్బ్స్ బిలియనీర్ల జాబితాలో తొలిసారి నీరవ్ పేరు చేరింది. నీరవ్ మోదీ, ఎ.జఫే పేరుతో నీరవ్ ఆభరణాల బ్రాండ్లు ప్రపంచ ప్రసిద్ధికెక్కాయి. ఈ రెండు బ్రాండ్లనూ వందేళ్ల చరిత్ర ఉన్న వాన్ క్లీఫ్, ఆర్పెల్స్, రిచ్‌మాంట్ ఎస్యేస్ కార్టియర్ వంటి ప్రఖ్యాత వజ్రాభరణాల బ్రాండ్లతో పోటీపడే స్థాయికి తీసుకెళ్లాడు నీరవ్. బ్రాండ్లేని ఆభరణాలను తయారు చేయించి అమెరికాలోని ఇతర కంపెనీలకు సరఫరా చేసేవాడు. ప్రముఖ హాలీవుడ్ తార కేట్ విన్స్లెట్... నీరవ్ రూపొందించిన డైమండ్ నెక్లెస్ ధరించి 2016 ఆస్కార్ అవార్డుల కార్యక్రమానికి హాజరైంది. ట్రంప్ చేతుల మీదుగా న్యూయార్క్ షోరూం 2013లో భారత బిలియనీర్ల జాబితాలో చోటుతో నీరవ్ పేరు ప్రపంచవ్యాప్తంగా తెలిసింది. 2015లో న్యూయార్క్ లోని మాడిసన్ అవెన్యూలో నీరవ్ డైమండ్స్ షోరూమ్‌ను అప్పటి రియల్ ఎసేŠట్ట్ వ్యాపారి, ఇప్పటి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రారంభించడంతో మోదీ జీవనశైలి ఒక్కసారిగా మారిపోయింది. ఆయన విలాసవంత జీవితం అప్పట్నుంచే వెలుగులోకి వచ్చింది. కళ్లు చెదిరే పార్టీలు వ్యాపారవృద్ధి ప్రయత్నాల్లో భాగంగా అనేక ప్రపంచ నగరాల్లో నీరవ్ ఇచ్చిన అత్యంత ఖరీదైన విందుల గురించి వింటే కళ్లు బైర్లు కమ్ముతాయి. వాటి వివరాలన్నీ అగ్ర శ్రేణి పత్రికలు, మేగజీన్లలో వచ్చేవి. నీరవ్ మోదీ వజ్రాభరణాలకు ప్రియాంకా చోప్రా, రోసీ హటింగ్టన్ వైట్లీ, ఆండ్రియా దియాకొను వంటి అగ్రశేణి తారలు, మోడల్స్ ప్రచారకర్తలుగా ఉండటంతో ఆయన పార్టీలకు ఆహ్వానం అందటమే గొప్ప విషయంగా మారింది. కిందటి నవంబర్‌లో ముంబైలోని ఫోర్‌సీజన్స్ హోటల్లో నీరవ్ ఇచ్చిన విందు గురించి ఇప్పటికీ కథలు కథలుగా చెప్పుకుంటారు. ఎందుకంటే స్టార్ షెఫ్ మసీమో బొతూరా ఆధ్వర్యంలో ఈ పార్టీ అతి«థుల కోసం ప్రత్యేక వంటకాలు తయారు చేశారు. ఇటలీకి చెందిన బొతూరా సొంత రెస్టారెంట్ మోడెనా ఇటీవల ప్రపంచంలోనే 50 అత్యుత్తమ రెస్టారెంట్లలో ఒకటిగా ఎన్నికైంది. అక్కడ సీటును మూడు నెలల ముందే రిజర్వు చేసుకోవాలంటే ఆయనకున్న డిమాండ్ అర్థం చేసుకోవచ్చు. మోడల్ లీసా కోసం ప్రత్యేక విందు! తన బ్రాండ్ అంబాసిడర్లకు అట్టహాసంగా విందులు, విలువైన బహుమతులు ఇవ్వటం నీరవ్‌కు అలవాటే. టాప్ మోడల్, హాలీవుడ్ నటి లీసా హేడన్ కిందటేడాది మగబిడ్డను ప్రసవించిన కొన్ని నెలలకు ఆయన ఆమెకు పారిస్‌లో మంచి పార్టీ ఇచ్చారు. ఈ విందులో నీరవ్ డిజైన్ చేసిన పియర్ ఎమరాల్డ్ గొలుసును ధరించారు లీసా. అత్యంత ఖరీదైన బెంట్లీ కార్లలో తిరగడంతోపాటు ఇటాలియన్ సూట్లు ధరించడం ఈ వజ్రాల వ్యాపారికి చాలా ఇష్టం. ముంబై కాలా ఘోడా ప్రాంతంలో 70 ఏళ్లపాటు సాగిన మ్యూజిక్ స్టోర్ రిదమ్ హౌస్‌ను కిందటేడాది రూ.25 కోట్లకు కొనుగోలు చేసి కొత్త వజ్రాల షోరూం ప్రారంభించాడు నీరవ్. 2017 ఫోర్బ్స్ జాబితాలో... నీరవ్‌కు 2017 ఫోర్బ్స్ ప్రపంచ బిలియనీర్ల జాబితాలో 1,234వ ర్యాంక్ లభించింది. భారత అపర కుబేరుల లిస్టులో ఈయనది 85వ స్థానం. వజ్రాభరణాల డిజైనింగ్, ప్రపంచవ్యాప్తంగా ఉన్న జువెలరీ రిటైల్ వ్యాపారాల ద్వారా ఆయనకున్న ఆర్థిక సంపద రూ.లక్ష కోట్లపైనేనని అంచనా వేశారు. లండన్, న్యూయార్క్, పారిస్ నగరాల్లో జరిగే ఆభరణాల ప్రదర్శనల్లో ప్రఖ్యాత అంతర్జాతీయ తారలు, మోడల్స్ నీరవ్ బ్రాండ్ నగలు ధరించి చేసిన క్యాట్‌వాక్‌లు అమ్మకాలు విపరీతంగా పెరగడానికి దోహదం చేశాయి. -
రూ.510 కోసం రూ.10 లక్షలు పోగొట్టుకున్నాడు
ముంబై : రూ.510 కోసం కారు దిగితే.. రూ.10 లక్షల విలువైన డైమాండ్స్‌ను పోగొట్టుకున్నాడు ఓ వ్యాపారవేత్త. వివరాల్లోకి వెళ్తే... దక్షిణ ముంబైలో ఓ వ్యాపారవేత్త తన కారులో కూర్చుని ఉన్నాడు. ఆయన్ను సమీపించిన నలుగురు గుర్తుతెలియని వ్యక్తులు, తన కారు బయట డబ్బులు పడి ఉన్నాయని, తమకు చెందినవే అని అడిగారు. ఆ డబ్బుల కోసం కారు దిగిన వ్యాపారవేత్తకు ఆ దొంగలు దిమ్మతిరిగే షాకిచ్చారు. రూ.510 కోసం అతను కారు దిగగానే.. వెంటనే వెనక డోరును తెరుచుకుని, సీటులో ఉన్న బ్యాగ్‌ను ఎత్తుకుని వెళ్లారు. ఈ బ్యాగులో రూ.10 లక్షల విలువైన డైమాండ్స్‌ను ఉన్నట్టు బాధితుడు పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఇదే రకమైన దొంగతనం కేసు సమ్తా నగర్ పోలీసుల స్టేషన్లో కూడా నమోదైంది. ఆ ఘటనలో వ్యాపారవేత్త రూ.2.5 లక్షల నగదును, లైసెన్స్డ్ గన్ను పోగొట్టుకున్నట్టు తెలిసింది. రూ.10, రూ.20కు చెందిన కొన్ని నోట్లు అంటే మొత్తం రూ.510 విలువైన డబ్బులు వ్యాపారవేత్త కారుకు వెలుపల పడేసి ఉన్నాయని, ఇవి తన డబ్బులేనా? అని వారు అతని అడిగారని డీబీ మార్గ్ పోలీసు స్టేషన్ ఆఫీసర్ చెప్పారు. డబ్బుల్ని చూసిన ఆ వ్యాపారవేత్త, కారు దిగాడని, అంతలోనే గ్యాంగ్ సభ్యుల్లో ఒకరు వెనుక డోరు తెరచి, బ్యాగ్‌ను తీసుకొని పారిపోయాడని తెలిసింది. వారు కొట్టేసిన అనంతరం తన వెనుక సీట్లో ఉన్న బ్యాగ్ పోయినట్టు వ్యాపారవేత్త గుర్తించాడని పోలీసు అధికారి పేర్కొన్నారు. సమ్తా నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో నమోదైన కేసులో కూడా ఇదే మాదిరి గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి, కారు బయట డబ్బులు పడి ఉన్నాయని చెప్పి, నగదును కొట్టేసుకుని వెళ్లారని తెలిసింది. -
105 కోట్ల రూపాయల కెంపుల సెట్
ధర వినగానే గుండె గుభిల్లుమనే ఉంటుంది. కళ్లు పెద్దవి చేసుకొని ఎందుకు ఇంత ధర అని వెతికే క్రమంలో పడే ఉంటారు. అంతర్జాతీయ మార్కెట్లో మన దేశఖ్యాతిని పెంచిన జాబితాలో తాజాగా ఈ కెంపుల సెట్ కూడా చేరింది. ఈ కెంపుల వెనుక కథేంటి, ఆ ఖరీదు విశేషమేంటో తెలుసుకుందామనే ఆసక్తీ మొదలైందంటే ఈ న్యూస్ మీ కోసమే! అంతర్జాతీయ వజ్రాభరణాల డిజైనర్‌గా పేరొందిన నీరవ్‌మోడి ఓ కెంపుల నెక్లెస్, చెవి పోగులు, బ్రేస్లెట్ రూపొందించాడు. వీటి ధర అక్షరాలా 105 కోట్ల రూపాయలు. ఈ సెట్లో మొత్తం 27 కెంపులు పొదిగారు. ఈ విలువైన కెంపులను మయన్మార్‌లోని మొగక్ మైన్స్ నుంచి సేకరించారట. కెంపుల చుట్టూ ఖరీదైన ఫైన్ కట్ వజ్రాలను పొదిగారు. ఈ సెట్లో వాడిన కెంపులను ఈ దశకు తీసుకు రావడానికి ఐదేళ్లు పట్టిందట. తర్వాత డిజైన్ గీసుకొని, ఆభరణంగా తయారు చేయడానికి ముంబైలోని మోడీ, అతని బృందానికి మరో రెండేళ్లు పట్టిందట. అన్ని కోట్ల విలువైన ఆభరణాన్ని చేజిక్కించుకునే అదృష్టం ఎవరికి దక్కనుందో! మూడేళ్ల క్రితం న్యూ ఢిల్లీలో సొంతంగా ఆభరణాల షాప్‌ను ప్రారంభించిన నీరవ్‌మోడీకి దేశవ్యాప్తంగా ఇప్పుడు 15 స్టోర్స్ ఉన్నాయి. మోడీ చేతిలో రూపుదిద్దుకున్న ప్రతీ ఒక్క ఆభరణం ఒక మోడల్ పీస్‌లా ఉంటుంది. ప్రారంభ ధర రెండు లక్షల రూపాయల నుంచి 105 కోట్లు పెట్టి కొనుగోలు చేసే ఆభరణాలూ ఇతని స్టోర్‌లో ఉన్నాయన్నమాట. -
ఆరు వజ్రాలు చోరీ.. ఆపై !
అన్నానగర్: నమ్మకంగా పనిచేస్తునే ఇద్దరు వ్యక్తులు యాజమానికి టోపి పెట్టారు. పనిచేసే చోట ఇద్దరు నాలుగు లక్షల విలువ గల ఆరు వజ్రాలను చోరీ చేశారు. వీరిద్దరిని పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. ఈ ఘటన చెన్నైలో చోటుచేసుకుంది. వివరాలివి.. చెన్నై ఐనావరానికి చెందిన రాజేష్(39) ఇంట్లోనే బంగారం, వజ్రాల వ్యాపారం చేస్తున్నాడు. అతని దగ్గర దినేష్(25), ఎతిరాజ్(30) పనిచేస్తున్నారు. వేలూరుకు చెందిన మహావీర్ అనే వ్యక్తి ఆరు వజ్రాలను ఉంగరం చేయమని చెప్పి ఆగస్టులో రాజేశ్‌కు ఇచ్చాడు. అతను బుధవారం ఉంగరం చేయడానికి లాకర్ తెరచి చూడగా అందులో నాలుగు లక్షల విలువైన ఆరు వజ్రాలు కనిపంచలేదు. వెంటనే రాజేష్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు దుకాణ కార్మికుల వద్ద విచారణ చేశారు. దినేష్, ఎతిరాజ్‌లు వజ్రాలను చోరీ చేసినట్లు విచారణలో తెలిసింది. పోలీసులు వీరిద్దరిని అరెస్టు చేసి ఆరు వజ్రాలను స్వాధీనం చేసుకుని రాజేష్‌కి అప్పగించారు. -
పొట్టలో కండోమ్‌లు..వాటిల్లో వజ్రాలు
చెన్నై: బంగారం అక్రమ రవాణాకు స్మగ్లర్లు కొత్త కొత్త ఐడియాలు ఫాలో అవుతున్నారు. ఎన్నిరకాలుగా భద్రత కట్టుదిట్టం చేసినా నిఘా అధికారుల కళ్లుగప్పి ఏదో మార్గంలో బంగారం, విలువైన వజ్రాలను దొంగ రవాణ చేయడానికి ప్రయతిస్తునే ఉన్నారు స్మగ్లర్లు. తాజాగా ఓ స్మగ్లర్‌కు వైద్య పరీక్షలు నిర్వహించిన అధికారులు అవాక్కయ్యారు. వివరాల్లోకి వెళితే... కొలంబో నుంచి చెన్నైకు నిన్న (శుక్రవారం) సాయింత్రం వచ్చిన విమాన ప్రయాణీకులను కస్టమ్స్ అధికారులు తనిఖీలు జరిపారు. ఆ సమయంలో అనుమానాస్పదంగా కనిపించిన ఓ యువకుడిని అదుపులోకి తీసుకుని సోదాలు చేశారు. చెన్నైకి చెందిన అతని పేరు మహ్మద్ ఇర్ఫాన్ టూరిస్టు వీసాలో శ్రీలంకకు వెళ్లాడు. తిరిగి చెన్నై విమానాశ్రయం చేరుకున్న అతడి ప్రవర్తన అసహజంగా ఉండటంతో..కస్టమ్స్ అధికారులు... ప్రత్యేక గదికి తీసుకువెళ్లి వైద్యుల ద్వారా పరీక్షలు నిర్వహించగా అతడి కడుపులో కొన్ని వస్తువులు ఉన్నట్లు గుర్తించారు. దీంతో అతనికి వైద్యులు ఎనిమా ఇచ్చారు. కొద్దిసేపటికి అతని కడుపులో నుంచి మూడు కండోమ్‌లు వెలుపలికి వచ్చాయి. ఇందులో 18 వజ్రపు రాళ్లు ఉండడం చూసి వైద్యులు కంగుతిన్నారు. వీటి విలువ రూ.60 లక్షలుగా తెలిసింది. అతనిని కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. అలాగే శ్రీలంక నుంచి చెన్నైకు శుక్రవారం రాత్రి వచ్చిన విమానంలో ముగైదీన్ (33) అనే వ్యక్తి బంగారు కడ్డీలను తరలిస్తూ పట్టుబడ్డాడు. ఇతని మలద్వారంలో 300 గ్రాముల బరువు కలిగిన మూడు బంగారు కడ్డీలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ తొమ్మిది లక్షల రూపాయిలు. అలాగే, చెన్నై నుంచి సింగపూర్‌కు వెళ్లిన విమానంలో ప్రయాణించేందుకు వచ్చిన అబ్దుల్ (40) హ్యాండ్ బ్యాగ్‌ను పరిశీలించగా అందులో అమెరికా డాలర్లు, సింగపూర్ కరెన్సీ ఉన్నట్లు తెలిసింది. వీటి విలువ రూ.15 లక్షలుగా తెలిసింది. -
అరటన్ను బంగారం, అర కేజీ వజ్రాలు స్వాధీనం
ఢాకా: బంగ్లాదేశ్ అధికారులు ఓ ప్రముఖ బంగారు వ్యాపారికి చెందిన అర టన్ను(500 కేజీలు) పసిడిని, అరకేజీ వజ్రాలను స్వాధీనం చేసుకున్నారు. అపన్ జ్యువెల్లర్స్‌కు చెందిన ఐదు షాపుల్లో గత నెలలో దాడులు చేసి వీటిని పట్టుకున్నట్లు కస్టమ్స్ అధికారులు ఆదివారం వెల్లడించారు. బంగారం విలువ రూ.201 కోట్లు. అపన్ జ్యువెల్లర్స్ యజమాని కొడుకు ఓ కేసులో తొలుత అరెస్టయ్యాడు. తన గురించి పోలీసుల వద్ద అతను గొప్పలు చెప్పుకోవడంతో అనుమానమొచ్చిన అధికారులు దాడులు చేసి బంగారం, వజ్రాలను స్వాధీనం చేసుకున్నారు. -
అక్షయ తృతీయ : బంగారంపై భారీ డిస్కౌంట్లు
అక్షయ తృతీయ సెలబ్రేషన్స్... హిందూ పురాణాల ప్రకారం ఈ రోజును ఎంతో పవిత్రమైనదిగా భావిస్తారు. ఈ రోజు బంగారం కొంటే అదృష్టదేవత వెన్నంటే ఉండి, విజయ బాటలో నడిపిస్తుందని నమ్మకం. పెట్టుబడుల కోసం బంగారం కొంటే, మంచి ఫలితాలనిస్తాయని ఇన్వెస్టర్లు నమ్ముతుంటారు. దీంతో అక్షయ తృతీయ రోజున సాధారణ రోజులంటే ఎక్కువగానే బంగారం కొనుగోళ్లు జరుపుతుంటారు. వినియోగదారులను ఆకట్టుకోవడానికి బంగారం దుకాణాలు సైతం డిస్కౌంట్ ఆఫర్ల వెల్లువతో మారు మోగిస్తుంటాయి. ఈ సారి బంగారం దుకాణాలతో పాటు ఈ-కామర్స్ దిగ్గజాలు ఫ్లిప్ కార్ట్, అమెజాన్, స్నాప్ డీల్ సంస్థలు భారీ డిస్కౌంట్లను ప్రకటించాయి. బంగారం, ప్లాటినం, డైమాండ్ జువెల్లరీలపై డిస్కౌంట్లను అందించనున్నట్టు ఈ సంస్థలు పేర్కొన్నాయి. ముంబాయికి చెందిన వర్క్యూవల్ మార్కెట్ ప్లేస్ ఏకంగా ట్రూబిల్ డైరెక్ట్ నుంచి కారు బుక్ చేసుకున్న ప్రతి కస్టమర్ కి 24 క్యారెట్ల ఒక గ్రాము గోల్డ్ కాయిన్ ఇవ్వనున్నట్టు తెలిపింది. ఈ ఆఫర్ కేవలం అక్షయ తృతీయ రోజేనని ప్రకటించింది. తమ ప్లాట్ పామ్ పై గోల్డ్ రింగ్, నెక్లెస్, చైన్, పెండెంట్స్, ఈయరింగ్ వంటి బంగార ఆభరణాలను కొనుగోలు చేస్తే 70 శాతం తగ్గింపు ఇవ్వనున్నట్టు ఈకామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ తెలిపింది. యాక్సిస్ బ్యాంకు బుజ్ క్రెడిట్ కార్డు హోల్డర్స్ కైతే అదనంగా 5 శాతం తగ్గిస్తామని తెలిపింది. సెన్కో గోల్డ్, జోయల్కాస్, మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్, టీబీజడ్-ది ఒరిజినల్ వంటి బ్రాండులను కలిగి ఉన్నఅ అమెజాన్ సంస్థ, జువెల్లరీ కొనుగోలు చేసే ఐసీఐసీఐ బ్యాంకు క్రెడిట్ , డెబిట్ కార్డు దారులకు 5-20 శాతం తగ్గింపును ప్రకటించింది. నేటి వరకే ఈ ఆఫర్ ఉండబోతున్నట్టు తెలిపింది. ఒర్రా సైతం తన ఆన్ లైన్ పోర్టలో బంగారం కాయిన్లకు, బార్స్ కు అక్షయ తృతీయ సందర్భంగా ఎలాంటి మేకింగ్ ఛార్జీలు వేయమని తెలిపింది. ఈ ఆఫర్ ఏప్రిల్ 30 వరకూ అందుబాటులో ఉంచనుందట. ఏకంగా పేటీఎం డిజిటల్ వ్యాలెట్ అయితే ఒక్క రూపాయికే బంగారాన్ని విక్రయించనున్నట్టు వెల్లడించింది. అక్షయ తృతీయ సందర్భంగా ప్లెయిన్ గోల్డ్ జువెలరీపై 25 శాతం వరకు మేకింగ్ చార్జీలను తగ్గిస్తున్నట్టు తనిష్క్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ (రిటైల్, మార్కెటింగ్) సందీప్ కుల్హాలి తెలిపారు. డైమండ్ జువెలరీ విలువపై 25 శాతం వరకు తగ్గింపును ఇస్తున్నట్టు చెప్పారు. ఇలాంటి ఆఫర్లకు ఇప్పటికే కస్టమర్ల నుంచి మంచి స్పందన లభిస్తోందని ఆయన చెప్పారు. మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ సంస్థ కూడా ఎస్బీఐ డెబిట్ కార్డు హోల్డర్స్ కు అదనంగా 5 శాతం క్యాష్ బ్యాక్ ఆఫర్ చేస్తోంది. అయితే ఈ ఆఫర్ కేవలం గుర్గావ్, ఢిల్లీ స్టోర్లకు మాత్రమేనని తెలిపింది. తమ ఆన్ లైన్ పోర్టల్ లో బంగారం జువెల్లరీ మేకింగ్ ఛార్జీలపై 30 శాతం, డైమండ్ విలువపై 15 శాతం తగ్గింపును ఆఫర్ చేయనున్నట్టు ప్రకటించింది. గురువారంలోగా అడ్వాన్స్ బుకింగ్‌లు చేసుకున్న ఆభరణాలపై వెండిని ఉచితంగా అందిస్తున్నట్టు తెలిపింది. -
వజ్రాభరణాల సంస్థ కీర్తిలాల్స్ ప్రత్యేక డిస్కౌంట్స్
-
కెమికల్ కంపెనీలో ఎగిసిపడిన మంటలు
-
ఖరీదైన చోరీలు..
ప్రపంచమొత్తం మీద నిత్యం ఎన్నో దొంగతనాలు జరుగుతుంటాయి. వాటిలో కొన్ని దొంగతనాలు చిన్న చితకాగా ఉన్నప్పటికీ, మరికొన్ని మాత్రం చాలా భారీగా ఉంటాయి. ఇలాంటి దోపిడిల్లో కోల్పోయిన వస్తువుల విలువ చాలా భారీగా ఉంటుంది. అలాంటి భారీ దొంగతనాల గురించి ఓసారి తెలుసుకుందాం.. ఫాబెర్జ్ ఎగ్స్ రష్యాను రాజులు ఏలుతున్న కాలంలో వారి వద్ద అత్యంత విలువైన సంపద ఉండేది. అందులో ముఖ్యమైంది ఫాబెర్జ్ ఎగ్స్ అనే అతి విలువైన వస్తువులు ఉండేవి. వీటిని పీటర్ కార్ల్ ఫాబెర్జ్ అనే వ్యక్తి రూపొందించాడు. ఇవి మొత్తం 52 ఉండేవి. 1917లో రష్యాలో నియంతృత్వమైన రాచరిక పాలనకు వ్యతిరేకంగా బోల్ష్ విక్ విప్లవం మొదలైంది. అ విప్లవంలో పెదఎత్తున పాల్గొన్న ప్రజలు.. రాజ వంశంలోని అందర్ని హత్యచేసి నిర్మూలించారు. ఈక్రమంలో చాలా విలువైన సంపద రాజ భవనం నుంచి అదృశ్యమైంది. అందులో ఈ ఫాబెర్జ్ ఎగ్స్ కూడా మాయమయ్యాయి. అప్పట్లోనే ఒక్కో ఎగ్ విలువ ఒక మిలియన్ డాలర్‌గా ఉండేదని తెలుస్తోంది. 3 టన్నుల బంగారం చోరీ.. ఈ దొంగతనం ఇంగ్లండ్ రాజధాని లండన్‌లో జరిగింది. ప్రపంచంలోనే అత్యంత రద్దీ గల హీత్రూ విమానశ్రయ ప్రాంగణంలో జరిగింది. నిజానికి దొంగలు విమానశ్రయంలో అత్యంత విలువైన వస్తువులు భద్ర పరిచే గిడ్డంగిలో దొంగతనానికి ప్లాన్ వేశారు. ఈ దొంగతనం ద్వారా 3 మిలియన్ డాలర్ల విలువైన వస్తువుల్ని కొట్టేయాలని అనుకున్నారు. అయితే గిడ్డంగిలోకి ప్రవేశించిన అనంతరం వారికి కళ్లు తిరిగినంత పనైంది. పెద్ద పెద్ద బాక్సులలో 3 టన్నుల బంగారు కడ్డీలు దర్శనమిచ్చాయి. వీటి విలువ 34 మిలియన్ డాలర్లకు సమానం కావడం విశేషం. దొంగతనం జరిగిన తర్వాత చాలా మంది దొంగల్ని పోలీసులు పట్టుకున్నప్పటికీ బంగారాన్ని మాత్రం రికవరీ చేయలేకపోయారు. డైనోసార్ శిలాజం వినడానికి విచిత్రంగా ఉన్నప్పటికీ డైనోసార్ అస్థిపంజరంలోని ఎముకల దొంగతనం జరిగింది. డైనోసార్లలోని ఉపజాతి అయిన టైరనోసారస్ బాటర్ శిలాజాన్ని 1945 మంగోలియాలో కనుగొన్నారు. అయితే ఈ శిలాజంలోని పూర్తి భాగం మాత్రం 2012లో ఓ రూపు వచ్చింది. ఎందుకంటే ఈ శిలాజంలోని కొన్ని వస్తువులు చోరీకి గురయ్యాయి. అమెరికా వాసి ఎరిక్ ప్రొక్పొయ్ మంగోలియా నుంచి అమెరికాకు ఈ శిలాజంలోని కొంత భాగాన్ని దొంగతనంగా తరలించాడు. ఈ క్రమంలో మన్‌హట్టన్‌లోని ఓ వ్యాపారికి 1.1 మిలియన్ డాలర్లకు అమ్మాలని చూశాడు. దీనిపై సమాచారమందుకున్న ఎఫ్‌బీఐ అధికారులు దాడిచేసి ప్రొక్పోయ్ను అరెస్ట్ చేశారు. నిజానికి పురాతన శిలాజాలను దొంగతనంగా విక్రయించడం ప్రొక్పొయ్ అలవాటని దర్యాప్తులో తెలుసుకున్నారు. అనంతరం డైనోసార్ శిలాజాలను మంగోలియాకు తరలించారు. మోనాలిసా ఇటలీకి చెందిన బహుముఖ ప్రజ్ఞాశాలి లియోనార్డో డావిన్సీ గీసిన అద్భుత కళాఖండం ‘మోనాలిసా’. ప్రపంచంలోనే అత్యధిక మంది సందర్శించిన చిత్ర పటంగా మోనాలిసా గుర్తింపు పొందింది. క్రీ.శ. 1503 కాలంలో రూపుదిద్దుకున్న ఈ కళాఖండం అత్యంత ఖరీదైనది. 1797లో ఫ్రాన్స్ రాజు పారిస్‌లోని లార్విన్ మ్యూజియానికి ఈ చిత్రరాజాన్ని బహుకరించాడు. అయితే 1911లో అదే మ్యూజియంలో పనిచేసే విన్సెంజో పెరుజ్జియా అనే వ్యక్తి దీన్ని దొంగిలించాడు. అయితే మరో రెండేళ్ల తర్వాత ఈ పెయింటింగ్‌ను కనిపెట్టి యథావిథిగా మ్యూజియంలో భద్రపరిచారు. అప్పట్లోనే దీని ధర 100 మిలియన్ డాలర్లు కాగా.. ప్రస్తుతం రెండు బిలియన్లకు పైగా రేటు పలుకుతుంది. అతిపెద్ద వజ్రాల దొంగతనం.. అత్యంత ఖరీదైన వజ్రాల్ని దొంగలు చిత్రమైన వేషాలు వేసి దొంగలు కొట్టేయడం మనం చాలా సినిమాల్లో చూసే ఉంటాం. ఇలాంటి సంఘటనే నెదర్లాండ్స్ రాజధాని ఆమ్‌స్టార్‌డమ్‌లో జరిగింది. అక్కడి కేఎల్ఎమ్ ఏయిర్లైన్స్లో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఇద్దరు దొంగలు ఏయిర్‌లైన్స్ సిబ్బందిలాగా దుస్తులు వేసుకుని స్థానిక షిపోల్ విమానశ్రయంలోకి ప్రవేశించారు. అనంతరం ఖరీదైన వజ్రాలతో లోడింగ్‌కు సిద్ధంగా ఉన్న భారీ ట్రక్‌ను హైజాక్ చేశారు. ఆఖరికి నిర్మానుష్యంగా ఉన్న చోట ఈ ట్రక్‌ను పోలీసులు కనుగొన్నారు. అయితే అందులో వారికి ఒక్క డైమండ్ కూడా లభించలేదు. దొంగతనానికి గురైన డైమండ్ల విలువ 118 మిలియన్ డాలర్ల పైమాటే కావడం విశేషం. ఖరీదైన వయోలిన్ శాస్త్రియ సంగీతానికి ఉపయోగించే పరికరాల్లో వయోలిన్ ముఖ్యమైనది. స్ట్రాడివారస్ అనే ప్రముఖ సంస్థ అత్యంత ఖరీదైన, మన్నికైన వయోలిన్ లాంటి పరికరాలను ఉత్పత్తి చేసేది.1727లో ఈ కంపెనీ ఉత్పత్తి చేసిన ఓ వయోలిన్‌ను ప్రముఖ సంగీతకారుడు ఎరికా మోరిన్ ఉపయోగించేవాడు. ఒకరోజున మోరిన్ నివాసముండే అపార్ట్మెంట్లో చోరీ జరిగింది. దొంగ ఈ వయోలిన్‌ను చోరీ చేశాడు. కాలక్రమంలో మోరిన్ పరమపదించినా ఆ వయోలిన్ జాడ ఇప్పటికీ తెలియలేదు. ఇంతకీ ఆ వయోలిన్ విలువ ప్రస్తుత లెక్కల ప్రకారం 3.5 మిలియన్ డాలర్లు ఉంటుందని అంచనా.. -
ఈ వజ్రాలకు రక్తం మరకలు లేవు!
కాలిఫోర్నియా: తళతళ మెరసే వజ్రాల వెనక రక్తం మరకలు ఉన్నాయన్న విషయం మనకు తెల్సిందే. వజ్రాల కోసం అంగోల, కాంగో, లిబేరియా దేశాల్లో రక్తం ఏరులై పారింది. సియెర్రా లియోన్ లాంటి దేశాల్లో బానిసలతో వజ్రపు గనులను తవ్వించారు. ప్రపంచంలో వజ్రాల కోసం యుద్ధాలు జరిగిన సంఘటనలే కాకుండా వజ్రాలతో ఆయుధాలు కొనుగోలు చేసి యుద్ధాలు చేసిన చరిత్ర కూడా ఉంది. ఒక్క మాటలో చెప్పాలంటే రక్తం ధారల నుంచి పుట్టుకొచ్చిందే వజ్రం. అందుకనే 2007లో హాలివుడ్లో ‘బ్లడ్డైమండ్’ పేరితో ఓ సినిమా వచ్చింది. ఆ సినిమాలో ప్రముఖ హాలివుడ్ నటుడు లియోనార్డో డికాప్రియో హీరోగా నటించారు. స్వచ్ఛమైన కార్బన్ నుంచి వజ్రాలు ప్రకృతి సిద్ధంగా తయారవుతాయని తెల్సిందే. వందల కోట్ల సంవత్సరాల అత్యున్నత ఉష్ణోగ్రత, భూపొరల్లో కలిగే అత్యధిక ఒత్తిడి కారణంగా భూగర్భంలో వందకిలోమీటర్ల లోపల బొగ్గుగనులు వ జ్రాల గనులుగా మారుతాయి. ప్రపంచం మొత్తంలో ఇప్పటివరకు ఉత్పత్తయిన వజ్రాల్లో కేవలం 0.1 శాతం మాత్రమే రక్తపుటేరులతో తడిసిపోయాయని, నాటు వజ్రాల వ్యాపారాన్ని నిర్వహించే ‘కింబర్లే ప్రాసెస్’ వెల్లడించింది. అయినా రక్తపు చరిత్రలేని ఈకో ఫ్రెండ్లీ కృత్రిమ వజ్రాల ఫ్యాక్టరీ ఇప్పుడు అమెరికాలోని కాలిఫోర్నియాలో అందుబాటులోకి వచ్చింది. ‘డైమండ్ ఫౌండ్రీ’ని ఆస్ట్రియా, అమెరికనైన మార్టిన్ రుషుసు గతేడాది నవంబర్‌లో స్థాపించి, దానికి ప్రస్తుతం సీఈవోగా వ్యవహరిస్తున్నారు. ట్విట్టర్ వ్యవస్థాపకుడు ఎవాన్ విలియమ్స్‌తోపాటు, బ్లడ్ డైమండ్‌లో నటించిన డికాప్రియో తదితర 12 మంది బిలియనీర్లు ఇందులో పెట్టుబడులు పెట్టారు. ఇంతకుముందు తనతోపాటు కలసి నానో సోలార్ కంపెనీలో పనిచేసిన ఇంజనీర్ల బృందాన్నే మార్టిన్ ఇందులోకి తీసుకున్నారు. సూర్యుడి ఉపరితలంపై ఉండే వేడికి సమానమైన, దాదాపు పదివేల ఫారన్‌హీట్ డిగ్రీల ఉష్ణోగ్రత కలిగిన ప్లాస్మాను రియాక్టర్లో ఉత్పత్తి చేయడం ద్వారా ఈ కంపెనీ కృత్రిమ వజ్రాలను తయారు చేస్తోంది. ప్రపంచంలో కృత్రిమ వజ్రాలను ఉత్పత్తిచేసే కంపెనీలు ఇప్పటికే మార్కెట్లో ఉన్నాయని, అయితే తాము అనుసరించే విధానం ఇతర కంపెనీలకన్నా భిన్నమైనదని, తాము పర్యావరణానికి అనుకూలమైన ఇంధనాన్ని మాత్రమే వజ్రాల తయారీకి వినియోగిస్తామని మార్టిన్ వివరించారు. మార్కెట్లో దొరికే వజ్రాలకన్నా తాము పది నుంచి 15 శాతం తక్కువకు వజ్రాలను సరఫరా చేస్తామని, నెలకు వెయ్యి కారెట్ల బరువుగల వజ్రాలను తయారు చేస్తామని ఆయన చెప్పారు. ఇప్పటి వరకు తమ కంపెనీ తయారు చేసిన వజ్రాల్లో 12 క్యారెట్ల వజ్రమే అతి పెద్దదని ఆయన తెలిపారు. 0.13 క్యారెట్ల బరువుగల వజ్రం 305 డాలర్లకు, 2.30 క్యారెట్లు కలిగిన వజ్రం 23 వేల డాలర్లకు విక్రయిస్తున్నామని ఆయన చెప్పారు. ప్రకృతి సిద్ధంగా దొరికే వజ్రాలకు, కృత్రిమ వజ్రాలకు ధరలో పెద్ద తేడా ఏమీ ఉండదని, ఏదైనా వజ్రం, వజ్రమేకదా! అని మార్టిన్ వ్యాఖ్యానించారు. రక్తం మరకలు గుర్తురాకుండా ఉండాలంటే ఈ కృత్రిమ వజ్రాలే మేలేమో! -
రాయల దేవరకొండపై వజ్రాలు !?
వజ్రాలున్నాయంటూ ప్రచారం గుర్తు తెలియని వ్యక్తుల తవ్వకాలు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు ఆ గ్రామస్తులు దైవంగా పూజించే కొండను గుర్తు తెలియని వ్యక్తులు కొన్నాళ్లుగా రోజూ వచ్చి ఏదో తవ్వి తీసుకువెళ్తున్నట్టు ప్రచారం జరిగింది. అది ఉత్తుత్తిదేనని కొన్నాళ్లుగా కొట్టి పారేస్తున్న గ్రామస్తులకు ఈ నెల 11న కొండపైకి వెళ్లిన ఓ వ్యక్తికి అక్కడ తవ్వకాలు జరిగిన ప్రదేశం కనిపించింది. ఆ విషయం కాస్త చూసిన వ్యక్తి కొండపై జరిగిన తంతును, తవ్వకాలను గ్రామస్తులకు తెలిపాడు. అంతే..ఆదివారం గ్రామస్తులంతా కొండెక్కారు. తవ్వకాలను కళ్లారా చూశారు.. అసలేం జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో కలవరానికి గురయ్యారు. దీనిపై అధికారులే నిజాల నిగ్గు తేల్చాలని కోరుతున్నారు. వారే శ్రీకాకుళం జిల్లాలోని రాయల గ్రామస్తులు. తవ్వకాలకు గురైనది ఈ గ్రామానికి సమీపంలో ఉన్న దేవరకొండ. వివరాల్లోకి వెళ్తే... కొత్తూరు : జిల్లాలోని కొత్తూరు మండలంలోని రాయల గ్రామానికి సమీపంలో ఉన్న దేవరకొండ శిఖర భాగంలో రెండు బండరాళ్ల మధ్య అడుగున వజ్రాలు, వైఢూర్యాలతో పాటు విలువైన రంగురాళ్లు ఉన్నాయన్న ప్రచారం ఆదివారం కలకలం రేపింది. ప్రచారాన్ని నమ్మిన గ్రామస్తులు దేవరకొండ పైకి వెళ్లారు. వీఆర్వో కలమట రమేష్‌కు గ్రామస్తులు కొందరు ఫిర్యాదు చేశారు. కొండ మీద తవ్వకాలు పరిశీలించి జరిగిన సంఘటనపై తహశీల్దార్ కార్యాలయూనికి నివేదిక అందించినట్టు వీఆర్వో తెలిపారు. దీనిపై వివరాలు సేకరించగా పై రెండు బండరాళ్ల మధ్యన రెండు నెలల నుంచి గుర్తు తెలియని వ్యక్తులు కొందరు తవ్వకాలు చేసినట్టు తెలిసింది. వీరు ఆటో, కారు, బైక్‌ల మీద రోజూ వచ్చి తవ్వకాలు గోప్యంగా చేస్తున్నట్టు సమాచారం. సాయంత్రం పూట గోనె సంచులతో ఆటో మీద తిరిగి వెళ్తున్నట్టు స్థానికులు చెబుతున్నారు. రెండు నెలల నుంచి ఈ తంతు జరుగుతున్నా గ్రామస్తులు పెద్దగా పట్టించుకోలేదు. ఈ క్రమంలో ఈ నెల 11న కొండ మీద ఉన్న ప్రాంతంలో జీడి తోట ఉన్న ముగితి భాస్కరరావు తోట కాపు ఎలా ఉందో చేసేందుకు వెళ్లాడు. అప్పటికే ఆ ప్రాంతంలో తవ్వి బయట పడేసిన రాళ్లను చూసి విషయూన్ని గ్రామస్తులకు తెలిపాడు. దీంతో తవ్వకానికి మళ్లీ వచ్చిన వారిని మాజీ సర్పంచ్ జనార్ధనరావు 11న ప్రశ్నించారు. రాళ్ల కింద మట్టి ఔషధాల కోసం ఉపయోగపడుతుందని వారు చెప్పగా ఇకపై ఇక్కడ ఎటువంటి తవ్వకాలు చేయొద్దని ఈ కొండను దేవతలుగా పూజిస్తున్నామని తెలిపారు. అరుుతే శనివారం కూడా వేరే మార్గంలో వారు వచ్చి వెళ్లినట్టు గ్రామస్తులకు తెలిసింది. అదే సమయంలో తవ్వకాల ద్వారా విలువైన రంగురాళ్లు, వజ్రాలు దొరికినట్టు ప్రచారం జరగడంతో గ్రామస్తులు ఆదివా రం కొండపైకి వెళ్లారు. తవ్విన చోట పరిశీలించారు. తవ్వకాలు చేసిన వారిలో ఒకరు రుద్రాక్షమాలలు వేసి ఉండగా మిగతా నలుగురు మామూలుగా ఉన్నారని, వీరు తమ వివరాలు ఎవరికీ చెప్పకుండా గోప్యంగా వచ్చి వెళ్తున్నారని తెలిసింది. దీంతో ఈ విషయం పరిసర ప్రాంతాల్లో వ్యాపించి ఆదివారం పెద్ద చర్చనీయూంశమైంది. ఇది లా ఉండగా గ్రామస్తులు దేవర కొండను దేవతల కొండగా భావిస్తూ వర్షాలు కురవని సమయంలో పూజలుచేస్తూ విశ్వాసం ప్రదర్శిస్తారు.ఈక్రమంలోజరిగిన తవ్వకాలపై అధి కారులు సమగ్ర దర్యాప్తు అనుమానాలు నివృత్తి చేయూలని స్థానికులు కోరుతున్నారు. -
వజ్రాలున్నాయని వినాయక విగ్రహం పేల్చివేత
మడికొండ: వజ్రాలున్నాయనే అనుమానంతో ఓ పురాతన రాతి వినాయక విగ్రహాన్ని కొందరు దుండగులు పేల్చివేశారు. అందులో ఏమి లభించకపోవడంతో విగ్రహ శకలాలను చెరువులో వేసేందుకు వెళ్తూ పోలీసులకు చిక్కారు. ఈ సంఘటన మడికొండ పోలీస్‌స్టేషన్ పరిధిలోని కొండపర్తిలో జరిగింది. మడికొండ సీఐ డేవిడ్‌రాజ్ కథనం ప్రకారం.. హన్మకొండ మండలం కొండపర్తి గ్రామంలోని త్రికుటాలయంలో వినాయకుడి రాతి విగ్రహం ఉంది. ఈ విగ్రహంలో వజ్రాలున్నాయని ప్రచారం ఉండడంతో 2015 నవంబర్ 22న ఇల్లందుల వీరస్వామి, కట్కూరి మధుకర్(కొండపర్తి), గొలనుకొండ నవీన్, కొమురవెల్లి అనిల్ కుమార్(జేపీఎన్ రోడ్డు, వరంగల్), ఇల్లందుల అజయ్, ముప్పారపు మనోజ్(శివనగర్), నెల కంటి యాకూబ్(పడమర కోట), నల్లం దుర్గ(గిర్మాజీపే ట), మంద కిషోర్(కరీమాబాద్), తాటికాయల ఏలియా(మల్లక్‌పల్లి), సతీష్, మంద సతీష్(పసరకొండ) దొంగి లించారు. విగ్రహాన్ని పేలుడు పదార్థంతో పేల్చగా ముక్కలైపోయింది. అందులో ఏమి దొరకకపోవడంతో శకలాలను ఉర్సు దగ్గర చెరువులో వేయడానికి బయల్దేరారు. పోలీసులకు పక్కా సమాచారం అందడంతో వారు నింది తులను అదుపులోకి తీసుకుని విచారించగా చేసిన నేరం అంగీకరించారు. వారు ఉపయోగించిన జేసీబీ ప్రొక్లైనర్, 2 బైక్‌లు, 8 సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. వారిని కోర్టులో హాజరుపరిచినట్లు సీఐ డేవిడ్‌రాజ్ తెలిపారు. -
తక్కువ ధరకు వజ్రం..
అయిజ: అసలే ఇది ఆఫర్ల కాలం. కస్టమర్లను ఆకట్టుకునే క్రమంలో వేలకొద్దీ కంపెనీలు లక్షల రకాల ఆఫర్లిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రూ. 50 లక్షల విలువైన వజ్రం రూ.15 లక్షలకే లభిస్తుందని ఓ వ్యాపారికి ఆఫర్ వచ్చింది. ఎంతో ఆశగా అడ్వాన్స్ సైతం చెల్లించిన ఆయన.. చివరికి ఎలా మోసపోయాడో మహబూబ్ నగర్ పోలీసులు వెల్లడించారు. కర్నూలు జిల్లా డోన్ కు చెందిన బాబన్న రియల్టర్. గత అక్టోబర్ 20న బాబన్న డ్రైవర్ గా పనిచేస్తున్న తిరుపతికి ఓ అజ్ఞాత వ్యక్తి నుంచి ఫోన్ కాల్ వచ్చింది. రూ. 50 లక్షల విలువైన వజ్రాన్ని అమ్మాలనుకుంటున్నట్లు, రూ. 15 లక్షలకైనాసరే ఇచ్చేస్తామని ఫోన్ సారాంశం. ఇదే విషయాన్ని డ్రైవర్ తిరుపతి.. బాబన్నకు చెప్పాడు. అదేరోజు డీల్ కుదుర్చుకునేందుకు ఐదుగురు వ్యక్తులు డోన్ కు వచ్చారు. మొదట 5 లక్షలు అడ్వాన్స్ చెల్లిస్తే, వజ్రం ఇచ్చేలా డీల్ కుదిరింది. ఈ నెల 29న అడ్వాన్స్ మొత్తం అందుకున్న డైమండ్ గ్యాంగ్ పత్తాలేకుండా పారిపోయిన తర్వాతగానీ మోసపోయామని గ్రహించిన బాబన్న పోలీసులను ఆశ్రయించాడు. ఈ కేసుకు సంబంధించి మధ్యప్రదేశ్ కు చెందిన ఆకాశింగ్, పాపింగ్, శోకింగ్, శాంచర్, కమతిసింగ్, పెనుకుమార్, కసాత్సింగ్ అనే ఏడుగురిని శనివారం గద్వాల రైల్వే స్టేషన్ లో అరెస్ట్ చేసినట్లు గద్వాల డీఎస్సీ బాలకోటి తెలిపారు. -
పగిడిరాయిలో వజ్రాలు
కర్నూలు జిల్లా తుగ్గలి మండలం పగిడిరాయి గ్రామంలో సోమవారం స్థానికులకు రెండు వజ్రాలు లభించాయి. వాటిని పెరవలికి చెందిన ఓ వ్యాపారి రూ.25 వేలకు కొనుగోలు చేసినట్టు సమాచారం. వర్షాలు పడినప్పుడు ఈ ప్రాంతంలో వజ్రాలు లభిస్తాయని స్థానికుల నమ్మకం. వజ్రాల కోసం స్థానికులు వెతకటం సర్వ సాధారణం. కాగా.. వజ్రాలకు సంబంధించి సమాచారం కోసం అధికారులు ఆరా తీస్తున్నారు.