ఆరు వజ్రాలు చోరీ.. ఆపై ! | Two persons Theft the Six Diamonds in Chennai | Sakshi
Sakshi News home page

ఆరు వజ్రాలు చోరీ.. ఆపై !

Published Thu, Sep 21 2017 7:14 PM | Last Updated on Tue, Aug 21 2018 6:00 PM

ఆరు వజ్రాలు  చోరీ.. ఆపై ! - Sakshi

ఆరు వజ్రాలు చోరీ.. ఆపై !

అన్నానగర్‌: నమ్మకంగా పనిచేస్తునే ఇద్దరు వ్యక్తులు యాజమానికి టోపి పెట్టారు. పనిచేసే చోట ఇద్దరు నాలుగు లక్షల విలువ గల ఆరు వజ్రాలను చోరీ చేశారు.  వీరిద్దరిని పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. ఈ ఘటన చెన్నైలో చోటుచేసుకుంది. వివరాలివి.. చెన్నై ఐనావరానికి చెందిన రాజేష్‌(39)  ఇంట్లోనే బంగారం, వజ్రాల వ్యాపారం చేస్తున్నాడు.

అతని దగ్గర దినేష్‌(25),  ఎతిరాజ్‌(30)  పనిచేస్తున్నారు. వేలూరుకు చెందిన మహావీర్‌ అనే వ్యక్తి ఆరు వజ్రాలను ఉంగరం చేయమని చెప్పి ఆగస్టులో రాజేశ్‌కు ఇచ్చాడు. అతను బుధవారం ఉంగరం చేయడానికి లాకర్‌ తెరచి చూడగా అందులో నాలుగు లక్షల విలువైన ఆరు వజ్రాలు కనిపంచలేదు.

వెంటనే రాజేష్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు దుకాణ కార్మికుల వద్ద విచారణ చేశారు. దినేష్‌, ఎతిరాజ్‌లు వజ్రాలను చోరీ చేసినట్లు విచారణలో తెలిసింది.  పోలీసులు వీరిద్దరిని అరెస్టు చేసి ఆరు వజ్రాలను స్వాధీనం చేసుకుని రాజేష్‌కి అప్పగించారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement