యువకుడి ఉన్మాదం
తల్లి, తమ్ముడిని హతమార్చి మూటలో కట్టి పడేశాడు
తిరువొత్తియూరులో దారుణం
సాక్షి, చైన్నె: దేశం గాని దేశానికి వెళ్లి బిడ్డల కోసం కార్మికుడిగా రేయింబవళ్లు తండ్రి శ్రమిస్తుంటే, ప్రయోజకుడై ఆయనకు తోడు ఉండాల్సిన పెద్ద కుమారుడు ఉన్మాది అయ్యాడు. చదువుకోమని పదేపదే వేధిస్తున్నారనే ఆగ్రహంతో కని పెంచిన తల్లిని, తోడ పుట్టిన తమ్ముడిని హతమార్చాడు. తానూ ఆత్మహత్యాయ త్నం చేసినా ధైర్యం చాలక పోలీసులకు పట్టుబడ్డాడు. ఉత్తర చైన్నె పరిధిలోని తిరువొత్తియూరులో ఈ దా రుణ ఘటన శనివారం వెలుగు చూసింది. వివరాలు.. తిరువొత్తియూరు తిరునగర్ మొదటి వీధికి చెందిన మురుగన్(50) ప్రొక్లయినర్ ఆపరేటర్. ఓమన్ దేశంలో పనిచేస్తున్నాడు. ఆయనకు భార్య పద్మ(45), కు మారులు నితీష్(21), సంజయ్(15) ఉన్నారు.
పద్మ అన్నాసాలైలోని ఓ అక్కుపంచర్ క్లినిక్‌లో పనిచేయగా, నితీష్ వేళచ్చేరిలోని ఓ కళాశాలలో బీఎస్సీ మూడో సంవత్సరం చదువుతున్నాడు. సంజయ్ స్థానికంగా పాఠశాలలో పదో తరగతి పూర్తి చేసిన ప్లస్–1లో చేరడానికి సిద్ధమయ్యాడు. ఈ పరిస్థితులలో శుక్రవారం తన పెద్దమ్మ మహాలక్ష్మి కుమార్తె ప్రియ ఇంటికి నితీష్ వెళ్లాడు. అక్కడ ఎవరూ లేకపోవడంతో ఇంటి ముందు ఓ బ్యాగ్ ఉంచి వెళ్లాడు. ప్రియ వాట్సాప్‌కు ఈ సమాచారం చేర వేశాడు. ఇంటికి వచ్చినానంతరం రాత్రి సమయంలో ఈ మెసేజ్ చూసుకున్న ప్రియ తీవ్ర ఆందోళనకు లోనైంది.
ఇంటికి వెళ్లి చూడగా...
నితీష్‌పెట్టిన మెసేజ్‌లను వాట్సాప్‌లో చూసుకున్న ప్రియ తీవ్ర ఆందోళనతో తన తల్లి మహాలక్ష్మికి సమాచారం అందించింది. తన మెసేజ్‌లో అమ్మ, తమ్ముడి ని చంపేశా? అని ఉన్మాదంతో నితీష్ వ్యాఖ్యలు చేసి ఉండటం కలవరాన్ని రేపింది. హుటాహుటిన మహాలక్ష్మి , ప్రియ పద్మ ఇంటికి వెళ్లి చూశారు. ఇంటిలో రెండు మూటలలో గొంతులు తెగిన స్థితిలో పద్మ, సంజయ్ మృతదేహాలు బయట పడ్డాయి. దీంతో పోలీసు కంట్రోల్ రూమ్‌కు సమాచారం అందించారు. అర్ధరా త్రి వేళ ఈ హత్యల సమాచారం తిరువొత్తియూరులో కలకలాన్ని సృష్టించింది. నితీష్ కోసం పోలీసులు తీవ్ర వేట మొదలెట్టారు. పలగై తొట్టి కుప్పం బస్టాండ్‌లో నిద్రపోతున్న నితీష్‌ను వేకువ జామున పోలీసు లు పట్టుకున్నారు. అతడిని విచారించగా ఉన్మాదం బయట పడింది.
చదువుకోమన్నందుకే..
వేళచ్చేరిలోని ఓ కళాశాలలో చదువుతున్న నితీష్ చదువుపై దృష్టి పెట్టడం మానేశాడు. దీంతో అన్ని సబ్జెక్టులలో ఫెయిల్ అయ్యాడు. దీంతో తల్లి పదే పదే చదువుకోవాలని, విదేశాలలో తండ్రి పడుతున్న కష్టాలను గుర్తు చేస్తూ, మందలిస్తూ వచ్చింది. తమ్ముడు సంజయ్ సైతం ఇదే విషయాన్ని తనకు గుర్తుచేస్తూ రావడంతో నితీష్ ఉన్మాదిగా మారాడు. తనను చదువుకో మని పదేపదే హెచ్చరించడాన్ని తీవ్రంగా పరిగణించి మనో వేదనకు లోనయ్యాడు.
ఆత్మహత్య చేసుకోవా లని నిర్ణయించుకున్నాడు. అయితే అంతుకు ముందు గా తన తల్లి, తమ్ముడిని చంపేయాలన్న ఉన్మాద నిర్ణయానికి వచ్చేశాడు. గురువారం మధ్యాహ్నం ఇంట్లో ఉన్న తల్లి గొంతుపై విచక్షణా రహితంగా కత్తితో పొడి చి చంపేశాడు. ఆ తర్వాత తమ్ముడు సంజయ్‌ను కూ డా అలాగే చంపేశాడు. తాను ఉపయోగించి న కత్తిని అక్కడే ఓ కవర్‌లో ప్యాక్ చేసి పెట్టి, మృత దేహాలను మూట కట్టి పడేసి బయటకు వెళ్లిపోయాడు. రైలు కిందపడి ఆత్మహత్య చేసుకోవాలని తొలుత నిర్ణయించి, ధైర్యం చాలక వెనక్కి వచ్చేశాడు.
తర్వాత స్నేహితుడి ఇంటికి వెళ్లాడు. అనంతరం అక్కడి థియేటర్‌లో నైట్ షో చూశాడు. చివరకు ఇంటి తాళం, సెల్‌ఫోన్ ప్రియ ఇంటి వద్ద ఉంచి సముద్రంలో దూకి ఆత్మహత్యా ప్ర యత్నం చేసి ధైర్యం చాలక, ఎక్కడికి వెళ్లాలో తెలియక బస్టాండ్‌కు వచ్చి పడుకుని నిద్ర పో యాడు. నితీష్‌ను అరెస్టు చేసిన పోలీసులు కట కటాల్లోకి నెట్టారు. కాగా ఈ హత్య సమాచారంతో ఒమన్ నుంచి తండ్రి చైన్నెకు వచ్చేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment