![3 boys steal gold, diamond jewellery worth crores from Chennai shop - Sakshi](/styles/webp/s3/article_images/2022/11/28/SOP.jpg.webp?itok=DNw1HkEn)
చెన్నై: చెన్నైలోని ఓ దుకాణం నుంచి రూ.1.50 కోట్ల విలువైన బంగారం, వజ్రాల ఆభరణాలను ఎత్తుకుపోయిన ముగ్గురు బాలురను పోలీసులు నాలుగు గంటల్లోనే పట్టుకున్నారు. అస్సాంకు చెందిన ఈ ముగ్గురు నగల దుకాణానికి సమీపంలోని జ్యూస్‌షాప్‌లో పనిచేసేవారు. పథకం ప్రకారం వారు..లిఫ్టు పక్కనున్న ఖాళీ స్థలం గుండా దుకాణంలోకి ప్రవేశించారు.
వారు లోపలికి చేరుకున్న వెంటనే సెక్యూరిటీ వ్యవస్థ ద్వారా దుకాణం యజమానికి వెంటనే ఉదయం 5 గంటలకు అలెర్ట్ చేరింది. అప్రమత్తమైన యజమాని వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దుకాణం వద్దకు చేరుకున్న పోలీసులు సీసీ టీవీ ఫుటేజీ ఆధారంగా అప్పటికే పరారైన ముగ్గురి కోసం వేట మొదలుపెట్టి, నాలుగు గంటల్లోనే వారి ఆటకట్టించారు.
Comments
Please login to add a commentAdd a comment