World's most expensive pen: ప్రపంచ వ్యాప్తంగా అరుదైన వస్తువులను వేలం వేస్తుంటారు. ఆయా వస్తువులు కోట్లాది రూపాయలు పలకడం గురించి వింటుంటాం. ఇలాగే ఓ అరుదైన పెన్నును వేలం వేయగా 8 మిలియన్ డాలర్లు (రూ.66.6 కోట్లు) పలికింది. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైనదిగా నిలిచింది. టిబాల్డి కంపెనీ తయారు చేసిన ఈ పెన్ను పేరు ‘ఫుల్గోర్ నోక్టర్నస్’. ఇది లాటిన్ పేరు. దీనికి అర్థం నైట్ గ్లో. నల్ల వజ్రాలు పొదిగిన ఈ అసాధారణ ఫౌంటెన్ పెన్‌కి ఇది సముచితమైన పేరు.
123 కెంపులు, 945 నల్ల వజ్రాలు, బంగారం
అసాధారణమైన ఫుల్గోర్ నోక్టర్నస్ పెన్ నిర్మాణం, డిజైన్ ఫై రేషియోలో ఉంటాయి. దీన్ని దైవిక నిష్పత్తిగా పేర్కొంటారు. ఫుల్గోర్ నోక్టర్నస్ బాడీ, క్యాప్‌పై నల్ల వజ్రాలు విలాసంగా పొదిగి ఉంటాయి. అలాగే అద్భుతమైన బ్లడ్ రెడ్ కెంపులు పెన్ను క్యాప్‌ని అలంకరించి ఉంటాయి. మొత్తంగా ఇందులో 945 నల్ల వజ్రాలు, 123 కెంపులు పొదిగారు. 18-క్యారెట్ల బంగారంతో దాని నిబ్‌ను తయారు చేశారు.
అత్యంత ఖరీదైన పెన్ను
ఈ పెన్నును ప్రత్యేక ఉంచేది దాని దైవిక ఫై నిష్పత్తి. ఈ పెన్నును క్యాప్‌తొ మూసేసినప్పుడు అవి 1.618 ఫై నిష్పత్తిలో ఉంటాయి. ఇలాంటి పెన్ను మరొకటి లేదు. 2020లో ఫుల్గోర్ నోక్టర్నస్ పెన్ను షాంఘైలో వేలం వేయగా అది 8 మిలియన్ డాలర్లు పలికింది. ఇంతవరకూ ఏ పెన్ను కూడా ఈ స్థాయిలో ధర పలకలేదు. దీంతో ఇదే ప్రపంచ అత్యంత ఖరీదైన పెన్నుగా నిలిచింది.
ఇదీ చదవండి: Dr Ranjan Pai: నాడు అద్దె ఇల్లు.. నేడు 6 యూనివర్సిటీలు, 28 ఆస్పత్రులు
Comments
Please login to add a commentAdd a comment