Pen
-
అయ్యో రియాన్షిక.. ప్రాణం తీసిన పెన్ను
భద్రాచలం అర్బన్, సాక్షి: కళ్ల ముందే చిరునవ్వులతో హోం వర్క్ చేస్తున్న చిన్నారి(4) ఊహించని రీతిలో ప్రమాదానికి గురైంది. తలలో పెన్నుతో నరకయాతన పడుతున్న ఆ బిడ్డను చూసి తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. ఎలాగైనా ఆమెను బ్రతికించుకునేందుకు శతవిధాల ప్రయత్నించారు. కానీ, విధికి కన్నుకుట్టి ఆ పసికందు ప్రాణాన్ని బలిగొంది.భద్రాచలం సుభాష్‌నగర్‌కు చెందిన చిన్నారి రియాన్షిక తలలో పెన్ను గుచ్చుకుని ప్రాణం పొగొట్టుకుంది. సోమవారం రాత్రి ఆమె హోం వర్క్ చేస్తున్న టైంలో బెడ్ మీద నుంచి కింద పడిపోయింది. అయితే ప్రమాదవశాత్తు పెన్ను ఆమె తలలో గుచ్చుకుంది. వెంటనే ఆమెను ఖమ్మంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అతికష్టం మీద వైద్యులు శస్త్రచికిత్స చేసి పెన్ను తొలగించారు. పెన్ను తొలగించడంతో బాలికకు ప్రాణాపాయం తప్పినట్టేనని వైద్యులు భావించారు. ఆమె తల్లి, కుటుంబసభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. ఘటనపై స్థానిక ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు సైతం వైద్యులకు ఫోన్ చేసి ఆరా తీశారు. కానీ, పరిస్థితి విషమించి రియాన్షిక కన్నుమూసింది. సర్జరీ తర్వాత ఇన్ఫెక్షన్ సోకడంతోనే ఆమె చనిపోయిందని వైద్యులు ప్రకటించారు. బతికిందని సంతోషించే లోపే బిడ్డ మృతి చెందిందన్న వార్త విని ఆ తల్లిదండ్రులు కుప్పకూలిపోయారు. గుండెలు అవిసేలా రోదిస్తుండడం.. చూసేవాళ్లను కంటతడి పెట్టిస్తోంది. -
టెక్నాలజీ తోడై..!, పెన్ను వేలెడు.. రాత బారెడు
కీచైన్‌కు వేలాడుతూ వేలెడంత కనిపించే ఈ పెన్ను మన్నిక తెలుసుకుంటే నోరెళ్లబెడతారు. నానో ఇంకుతో పనిచేసే ఈ పెన్ను వంద పెన్సిళ్ల మన్నిక కంటే ఎక్కువే! టిటానియమ్తో రూపొందించిన ఈ పెన్నులో ఒక నానో ఇంకు కాట్రిడ్జ్ ఉంటుంది. ఇది ఒక జీవితకాలం మన్నుతుంది. దీనికి రీఫిల్ వేసుకోవడం, ఇంకు నింపుకోవడం, కాట్రిడ్జ్ మార్చుకోవడం వంటి అవసరమే ఉండదు. దీనికి ఉన్న మ్యాగ్నెటిక్ క్యాప్ పెన్ను మొనను సురక్షితంగా ఉంచుతుంది. ‘ఇన్నోజూమ్’ అనే అమెరికన్ స్టార్టప్ సంస్థ క్రౌడ్‌ఫండింగ్ ద్వారా దీని రూపకల్పనకు నడుం బిగించింది. కనీస స్థాయిలో ఈ నానో ఇంకు పెన్నును మార్కెట్లోకి విడుదల చేయాలంటే 20 వేల డాలర్లు (రూ.16.67 లక్షలు) అవసరమవుతాయని ఈ సంస్థ ప్రకటించింది. ఇప్పటి వరకు మూడువేల డాలర్లు (రూ.2.50 లక్షలు) మాత్రమే పోగయ్యాయి. ఈ ప్రాజెక్టుకు ఎంత త్వరగా పూర్తి డబ్బు సమకూరితే, అంత త్వరగా ఈ పెన్ను మార్కెట్లోకి విడుదలయ్యే అవకాశం ఉంటుంది. మార్కెట్లో ఈ పెన్ను ధర డిజైన్, నాణ్యతను బట్టి 29 నుంచి 99 డాలర్ల వరకు (రూ. 2,418 నుంచి రూ.8,255) ఉండవచ్చని అంచనా. -
అరుదైన పెన్ను రూ.66.6 కోట్లు! ప్రపంచంలో అత్యంత ఖరీదైన కలం ఇదే..
World's most expensive pen: ప్రపంచ వ్యాప్తంగా అరుదైన వస్తువులను వేలం వేస్తుంటారు. ఆయా వస్తువులు కోట్లాది రూపాయలు పలకడం గురించి వింటుంటాం. ఇలాగే ఓ అరుదైన పెన్నును వేలం వేయగా 8 మిలియన్ డాలర్లు (రూ.66.6 కోట్లు) పలికింది. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైనదిగా నిలిచింది. టిబాల్డి కంపెనీ తయారు చేసిన ఈ పెన్ను పేరు ‘ఫుల్గోర్ నోక్టర్నస్’. ఇది లాటిన్ పేరు. దీనికి అర్థం నైట్ గ్లో. నల్ల వజ్రాలు పొదిగిన ఈ అసాధారణ ఫౌంటెన్ పెన్‌కి ఇది సముచితమైన పేరు. 123 కెంపులు, 945 నల్ల వజ్రాలు, బంగారం అసాధారణమైన ఫుల్గోర్ నోక్టర్నస్ పెన్ నిర్మాణం, డిజైన్ ఫై రేషియోలో ఉంటాయి. దీన్ని దైవిక నిష్పత్తిగా పేర్కొంటారు. ఫుల్గోర్ నోక్టర్నస్ బాడీ, క్యాప్‌పై నల్ల వజ్రాలు విలాసంగా పొదిగి ఉంటాయి. అలాగే అద్భుతమైన బ్లడ్ రెడ్ కెంపులు పెన్ను క్యాప్‌ని అలంకరించి ఉంటాయి. మొత్తంగా ఇందులో 945 నల్ల వజ్రాలు, 123 కెంపులు పొదిగారు. 18-క్యారెట్ల బంగారంతో దాని నిబ్‌ను తయారు చేశారు. అత్యంత ఖరీదైన పెన్ను ఈ పెన్నును ప్రత్యేక ఉంచేది దాని దైవిక ఫై నిష్పత్తి. ఈ పెన్నును క్యాప్తొ మూసేసినప్పుడు అవి 1.618 ఫై నిష్పత్తిలో ఉంటాయి. ఇలాంటి పెన్ను మరొకటి లేదు. 2020లో ఫుల్గోర్ నోక్టర్నస్ పెన్ను షాంఘైలో వేలం వేయగా అది 8 మిలియన్ డాలర్లు పలికింది. ఇంతవరకూ ఏ పెన్ను కూడా ఈ స్థాయిలో ధర పలకలేదు. దీంతో ఇదే ప్రపంచ అత్యంత ఖరీదైన పెన్నుగా నిలిచింది. ఇదీ చదవండి: Dr Ranjan Pai: నాడు అద్దె ఇల్లు.. నేడు 6 యూనివర్సిటీలు, 28 ఆస్పత్రులు -
ప్రపంచంలోనే అత్యంత నల్లని జెల్ పెన్నును చూశారా!
ప్రపంచంలోనే అత్యంత నల్లని జెల్ పెన్నును చూశారా? ఇక్కడున్న పెన్ను అదే! జపాన్‌కు చెందిన మిత్సుబిషి కంపెనీ యూని–బాల్ వన్ సిరీస్ బ్లాక్ జెల్ పెన్ను. ప్రపంచంలోనే అత్యంత నల్లని జెల్గా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ సాధించింది. దీని సిరా లోపలి వినూత్నమైన వర్ణద్రవ్య కణాల కారణంగా ఈ పెన్నుతో కాగితంపై రాస్తున్నప్పుడు ఇది ఇతర బ్లాక్ జెల్ పెన్నుల కంటే రంగును మరింత నల్లగా కనిపించేలా చేస్తుంది. ప్రస్తుతం ఈ పెన్నుకు సంబంధించిన వివరాలను కంపెనీ తమ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది వైరల్‌గా మారింది. చాలామంది ఈ పెన్నును కొనడానికి పోటీ పడుతున్నారు. కానీ ఇది ఇంకా మార్కెట్లో విడుదల కాలేదు. త్వరలోనే విడుదల చేయనున్నట్లు కంపెనీ ప్రకటించింది. (చదవండి: కథక్ నుంచి తీన్మార్ వరకు ఏదైనా..వారెవా! అనేలా ఇరగదీస్తాడు!) -
అయ్యయ్యో.. ఆ శకం ముగుస్తోందా? నిజమేనా?
Reynolds 045 Fine Carbure భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన బాల్ పెన్ రేనాల్డ్స్. 90వ దశకంలో రేనాల్డ్స్ పెన్స్ బ్రాండ్ ఒక ట్రెండ్ సృష్టించింది. బ్లూ క్యాప్, వైట్ కలర్ బాడీతో మొదలై పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసిందని చెప్పవచ్చవు. 90వ దశకంలో ఉపాధ్యాయుల నుండి విద్యార్థులు, ఉద్యోగస్తుల వరకూ అలనాటి పెన్స్ పరిచయం లేనివారెవ్వరూ ఉంటారు. రేనాల్డ్స్ పేరుతో వచ్చిన ఉత్పత్తులలో బాల్ పాయింట్, జెల్, రోలర్‌బాల్ , ఫౌంటెన్ పెన్నులు , మెకానికల్ పెన్సిల్స్ ఉన్నాయి. ఇపుడా రేనాల్డ్స్ పెన్ ఇప్పుడు మార్కెట్లో మాయమైపోతోందట. ఈ మేరకు పలు కథనాలు మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. దీంతో నెటిజన్లు కూడా స్పందించారు. రెనాల్డ్స్ పెన్.. అంటే ఒక నోస్టాల్జియా. చిన్ననాటి జ్ఞాపకాలు ఒక్కసారిగా అలా మదిలో మెదులుతాయి. ఇపుడా రెనాల్డ్స్ పెన్నుల కంపెనీ మూసివేస్తున్నారనేవార్త దావానంలా వ్యాపించింది. కేవలం 5 రూపాయలకు లభించే ఈ పెన్ను దేశంలో బాగా పాపులర్ అయింది. ప్రధానంగా రీఫిల్ లీక్‌లకు చెక్ పెడుతూ ప్రత్యర్థి కంపెనీలకు ధీటుగా వినియోగదారులను బాగా ఆకట్టుకుంది. Reynolds 045 Fine Carbure పెన్ ఉత్పత్తిని నిలిపివేసినట్లు పేర్కొంటూ @memorable_90s యూజర్ చేసిన ట్విటర్ పోస్ట్ వైరల్ అయింది. ఈ ప్రత్యేక బ్రాండ్ రేనాల్డ్స్ మిలీనియల్స్‌లో కల్ట్ ఫాలోయింగ్. ఎరుపు, నలుపు, నీలం రంగులలో వచ్చిన క్లాసిక్.ఖరీదైన 'పైలట్' పెన్నులతో పోల్చినప్పుడు సామాన్యులకు ఈజీగా అందుబాటులో వచ్చాయి. దీంతో తమకు ఇష్టమైన కలం ఉత్పత్తి ఆగి పోయిందనే విషాద వార్తపై నెటిజన్లు స్పందించారు. తమ జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. ఇప్పటికీ ఈపెన్ వాడు తున్నామంటూ కొందరు పేర్కొన్నారు. రేనాల్డ్స్ 045 ఫైన్ కార్బ్యూర్ని ది నేషనల్ పెన్ ఆఫ్ ఇండియా అంటూ ఒకరు కమెంట్ చేశారు. పెన్ బెస్ట్ సెల్లర్‌గా ఎలా అమ్ముడయ్యిందో చెబుతూ మరొక యూజర్ ట్వీట్ చేశారు. 'చౌక, గొప్ప, మన్నికైన , ఫాడూ పెన్‌గా అభవర్ణించారు. అయితే ప్రస్తుతం ఉన్న రెనాల్డ్స్ పెన్నుల చివరి బ్యాచ్ అమెజాన్‌లో అందుబాటులో ఉందంటూ మరికొందరు సూచించారు. అయితే ఇది ఫేక్ న్యూస్ అంట ఒక యూజర్ ఒకప్రకటనను షేర్ చేశారు. అసలు నిజం ఏమిటంటే వివిధ మీడియాలో ప్రచురించిన తప్పుడు సమాచారంపై రెనాల్డ్స్ ఇన్‌స్టాగ్రామ్‌లో వివరణ ఇచ్చింది ఖచ్చితమైన సమాచారం కోసం తమ వెబ్సైట్, సోషల్ మీడియా ఛానెల్స్‌ను పరిశీలించాలని కోరింది. రేనాల్డ్స్కు భారతదేశంలో 45 ఏళ్ల వారసత్వం ఉంది దాన్ని కొనసాగిస్తాం. దేశంలో రైటింగ్ బిజినెస్‌ను వృద్ధి చేయాలనే దృక్పథంతో ఉన్నామని స్పష్టం చేసింది. View this post on Instagram A post shared by Reynolds (@originalreynoldsindia) I still use the same..ordered 15 of these for my office. I think they will be the last ones now. pic.twitter.com/jdy0wrHVZx — A.K (@HaddHaiYaar) August 24, 2023 Reynolds 045 Fine Carbure will no longer be available in market, end of an era..💔 pic.twitter.com/pSU4WoB5gt — 90skid (@memorable_90s) August 24, 2023 what 😭😭😭😭 I use this pen for all of my artworks , bro 😰😢😢😢 pic.twitter.com/LrkABExkWM — Tales, Legends & Stories ♪ (@byindianwriters) August 24, 2023 -
ముచ్చటైన పెన్ను.. మూడు భాషల నిఘంటువు చేతిలో ఉన్నట్లే!
ఇది మూడు భాషల ముచ్చటైన పెన్ను. ఇది చేతిలో ఉంటే, మూడు భాషల నిఘంటువు చేతిలో ఉన్నట్లే! దీంతో రాయడానికి సాధ్యంకాదు గాని, దీనివల్ల చాలా ఉపయోగాలే ఉన్నాయి. చైనీస్ కంపెనీ ‘స్మార్ట్ యుడావో’ ఇటీవలే ఈ పెన్నును మార్కెట్లోకి తెచ్చింది. చైనీస్, ఇంగ్లిష్, స్పానిష్ భాషల్లోని పదాలను, వాక్యాలను ఈ పెన్ను ఒక భాష నుంచి మరో భాషలోకి ఇట్టే అనువదిస్తుంది. మామూలు పుస్తకం లేదా ఈ–బుక్‌లోని వ్యాక్యాలను ఈ పెన్నుతో స్కాన్ చేస్తూ ఉంటే, కోరుకున్న భాషలోకి అనువదిస్తుంది. అంతేకాదు, తెలియని పదాలకు గల అర్థాలను, పర్యాయపదాలను చెబుతుంది. విద్యార్థులకు, భాషలను ప్రత్యేకంగా అధ్యయనం చేసే ఔత్సాహికులకు ఎంతగానో ఉపయోగపడే ఈ పెన్ను ధర 199.99 డాలర్లు (రూ.16,474) మాత్రమే! -
రిషి సునాక్ వాడుతున్న పెన్నుపై వివాదం.. ఎందుకంటే..?
బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ అధికారిక పత్రాలపై ఎరేజబుల్ (చెరిపివేయదగిన) ఇంక్ పెన్నులను వాడుతారని గార్డియన్ పత్రిక తెలిపింది. దీంతో అధికారిక పత్రాల భద్రత అంశాలపై సర్వత్రా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఛాన్సలర్‌గా పనిచేసినప్పుడు కూడా అవే పెన్నులను రిషి సునాక్ ఉపయోగించినట్లు గార్డియన్ తన నివేదికలో వెల్లడించింది. చెరిపివేయదగిన ఇంక్ పెన్నులను వాడితే.. అధికారిక పత్రాలపై రాతలను తారుమారు చేసే అవకాశం ఉండకపోదని నెటిజన్లు ఆందోళన చెందుతున్నారు. చరిత్ర గుర్తుంచుకోవాల్సిన పత్రాలపై అలాంటి పెన్నుల వాడకాన్ని విమర్శిస్తున్నారు. రిషి సునాక్ ఉపయోగించే పెన్నులు యూకేలో ఒక్కోటి రూ.495 ఖరీదు ఉంటాయి. వాటిపై ఎరేజబుల్ అనే లోగో కూడా ఉంటుందని గార్డియన్ వెల్లడించింది. ఇంక్‌తో రాయడం నేర్చుకునేవారికి ఇవి ఉపయోగకరంగా ఉంటాయి. ఎందుకంటే తప్పు రాస్తే ఎరాడికేటర్లతో వెంటనే చెరిపివేసుకోవచ్చు. ఈ ఉద్దేశంతోనే ఆ సంస్థ కూడా మార్కెటింగ్ చేస్తుందని గార్డియన్ పేర్కొంది. రిషి సునాక్ అధికారిక కార్యదర్శి మాత్రం ఈ విషయాన్ని ఖండించారు. సునాక్ వాడుతున్న పెన్నులు బ్రిటన్‌లో సివిల్ సర్వీస్ ఉద్యోగులు వాడుతున్నట్లు చెప్పారు. ఉద్యోగులకు ఆ పెన్నులనే పంపిస్తున్నామని అన్నారు. చెరిగిపోయే పనులను ప్రధాని రిషి సునాక్ ఎన్నటికీ చేయరని స్పష్టం చేశారు. అయితే.. గతంలో క్యాబినెట్లో రిషి సునాక్ ఎరేజబుల్ పెన్నులను ఉపయోగిస్తున్న ఫొటోలు కూడా బయటకు ప్రచారం అయ్యాయి. పలు అధికారిక సమావేశంలోనూ ఆ పెన్నులను ఉపయోగిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. దీనిపై అన్‌లాక్ డెమోక్రసీ గ్రూప్ అధ్యక్షుడు టామ్ బ్రేక్ ప్రజల నమ్మకాలను తుడిచేయడమే ఆ పెన్నుల వాడకానికి ఉద్దేశమని విమర్శించారు. రాజకీయ నాయకుల మాటలకు నమ్మకం తక్కువ. ఎరేజబుల్ ఇంక్ పెన్నుల వాడకంతో ఆ నమ్మకం ఇక పాతాళానికి చేరుతుందని అన్నారు. ఇదీ చదవండి: 'కరోనా వైరస్ అక్కడి నుంచే..' వుహాన్ ల్యాబ్ పరిశోధకుడు సంచలన వ్యాఖ్యలు.. -
పంపించింది పెన్ను కాద్సార్! గన్ను!
పంపించింది పెన్ను కాద్సార్! గన్ను! -
ఆసక్తికర సన్నివేశం.. చంటిబిడ్డకు పెన్ను గిఫ్ట్‌గా ఇచ్చిన సీఎం జగన్
సాక్షి, అంబేద్కర్ కోనసీమ జిల్లా: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కోనసీమలోని లంక గ్రామాల పర్యటనలో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. వరద బాధితులను పరామర్శిస్తున్న క్రమంలో సీఎం జగన్ ఓ 8 నెలల పిల్లవాడిని ఎత్తుకున్నారు. ముఖ్యమంత్రి జేబులోని పెన్నుతో బుడ్డోడు ఆడుకున్నాడు. ఇంతలో ఆ పెన్ను పొరపాటున జారి కింద పడింది. అనంతరం పెన్నుపై పిల్లవాడి ముచ్చటను చూసిన సీఎం జగన్.. ఆ ఖరీదైన పెన్ను అతనికి గిఫ్ట్‌గా ఇచ్చారు. దీంతో బాబు తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు. పెదపూడి లంక గ్రామంలో ఈ ఘటన జరిగింది. చదవండి: అంబేద్కర్ కోనసీమ వరద ప్రాంతాల్లో సీఎం జగన్ పర్యటన -
సీఎం జగన్ కోనసీమ పర్యటనలో ఆసక్తికర సన్నివేశం
-
చంటోడి చిలిపి పని
-
నా.. పెన్ను పోయింది.. పోలీసులకు ఫిర్యాదు చేసిన ఎంపీ!
సాక్షి, చెన్నై: తన తండ్రి జ్ఞాపకంగా ఉంచుకున్న రూ.1.5 లక్షలు విలువ చేసే పెన్ను కనిపించడం లేదంటూ కాంగ్రెస్ ఎంపీ విజయ్ వసంత్ మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివరాలు.. గత నెల 30న విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా చెన్నైలో పర్యటించారు. ఆ సమయంలో విజయ్ మద్దతుదారులు గిండిలోని ఓ హోటల్ వద్ద హడావుడి సృష్టించారు. తమ నాయకుడికి బలం నిరూపించేలా విజయ్ను అభినందనలతో ముంచెత్తారు. ఈ సమయంలో ఆయన జేబులో ఉన్న పెన్ను మాయమైంది. ఇంటికొచ్చిన తరువాత పెన్ను కనిపించక పోవడంతో ఆయన తీవ్ర మనో వేదనలో పడ్డారు. వెంటనే ఆ హోటల్‌కు వెళ్లారు. సమావేశం జరిగిన ప్రాంతంలో క్షుణ్ణంగా గాలించారు. అక్కడి సిబ్బందిని పెన్ను గురించి ఆరా తీశారు. అక్కడి సీసీ కెమెరాలను పరిశీలించారు. అయినా ఫలితం లేకపోవడంతో మంగళవారం గిండి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన తండ్రి జ్ఞాపకంగా ఉన్న పెన్ను కనిపించడం లేదని, దీని విలువ రూ.1.5 లక్షలుగా ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ పెన్ను బంగారంతో రూపొందించారని, పై భాగంలో వజ్రం కూడా ఉంటుందని వెల్లడించారు. -
‘అడుక్కోవాలని లేదు.. పెన్నులు కొనండి చాలు’
ముంబై: కొంతమంది ఆరోగ్యపరంగా ఏ లోపాలు లేకున్నా, పని చేసే సామర్థ్యం ఉన్నా చేయలేక యాచించేవాళ్లని, ఇతరులపై ఆధారపడే వాళ్లని చూస్తుంటాం. ఇంకొందరు కష్టపడి పని చేయలేక సులభమైన దారిలో డబ్బు సంపాదనకై ఇతరులను మోసం చేస్తూ సంపాదిస్తుంటారు. ప్రస్తుత రోజుల్లో ఇలాంటి ఘటనలు మనం వింటూనే ఉంటాం. కానీ వయసు మీదపడినా కూడా ఓ బామ్మ మాత్రం ఎవరి దగ్గర చేయి చాపడం ఇష్టం లేదని ఈ వయసులోనూ తన కష్టం మీదే తన జీవనాన్ని కొనసాగిస్తోంది. ప్రస్తుతం ఆ బామ్మకి సంబంధించిన ఫోటో సోషల్‌మీడియాలో చక్కర్లు కొడతూ హల్చల్ చేస్తోంది. వివరాల్లోకి వెళితే.. ఇటీవల రీఅప్ స్టూడియో వ్యవస్థాపకురాలు శిఖా రథి తన స్నేహితులతో కలిసి పూణేలోని ఎమ్‌జి రోడ్లో వెళ్తున్నప్పుడు ఈ బామ్మను(రతన్) కలిసింది. ఆ సమయంలో ఆ బామ్మ రంగురంగుల పెన్నులను కార్డ్‌బోర్డ్‌తో తయారు చేసిన పెట్టెలో పెట్టి అమ్ముతోంది. అయితే ఆ కార్డ్‌బోర్డ్‌పై ఉన్న ఓ లైన్ చూసి అశ్చర్యపోయింది. ఆ నోట్లో.. ‘నాకు ఎవరీ దగ్గర చేయి చాచను. దయచేసి రూ.10/- బ్లూ కలర్ పెన్నులు కొనండి చాలు. థ్యాంక్యు. బ్లెస్ యూ’.. అని రాసుంది. కాగా ఆ బామ్మ రోడ్లపై తిరుగుతూ విద్యార్థులను, ట్రాఫిక్ సిగ్నల్ పడగానే ఆగిన వాహనదారులను రిక్వెస్ట్ చేస్తూ పెన్నులు అమ్ముతోంది. సాయంత్రం వరకు అక్కడే ఉండి.. పెన్నులు అమ్మగా వచ్చిన డబ్బుతో తన జీవితాన్ని సాగిస్తోంది. ఈ విషయం తెలుసుకున్న రతి ఆమె ఫోటో తీసి తన ఇన్‌స్టాలో షేర్ చేసింది. ఈ ఫోటో చూసిన కొందరు నెటిజన్లు బామ్మకు హేట్సాఫ్ చెప్పడంతో పాటు మన వంతు సాయం చేయాలని కామెంట్లు పెడుతున్నారు. View this post on Instagram A post shared by Shikha Rathi (@sr1708) చదవండి: Snakes Found Home: ఆ ఇంట పాములు బాబోయ్ పాములు.. చూస్తే చెమటలు పట్టాల్సిందే! -
‘కరోనా’ ప్రూఫ్ కారును చూశారా?
బులెట్‌ప్రూఫ్ కార్లు అందరికీ తెలిసినవే. కరోనా వైరస్ పుట్టిన చైనాలో ‘కరోనా’ప్రూఫ్ కారు వచ్చేసింది. ఇక్కడ ఫొటోలో కనిపిస్తున్నది ఆ మహత్తర వాహనమే! చైనాకు చెందిన ఆటోమొబైల్ సంస్థ ‘గీలీ’ తన ‘హెల్తీ కార్ ప్రాజెక్ట్’లో భాగంగా ఇటీవల ఈ మైక్రోబ్ప్రూఫ్ కారును రూపొందించింది. ఇందులో ‘జీ–క్లీన్’ ఇంటెలిజెంట్ ఎయిర్ ప్యూరిఫికేషన్ సిస్టమ్ కారులోని గాలిలో కలసిన సూక్ష్మజీవులను ఎప్పటికప్పుడు నిర్మూలిస్తూ, గాలిని తాజాగా ఉంచుతుంది. ఈ కారులోని ఏసీ నుంచి గాలి వెలువడే ప్రదేశం నుంచి చల్లని గాలితో పాటు శక్తిమంతమైన అల్ట్రావయొలెట్ కిరణాలు కూడా వెలువడుతూ బ్యాక్టీరియా, వైరస్ వంటి సూక్ష్మజీవులను తుదముట్టిస్తాయి. కారు లోపలి భాగం ఫొటోలను ‘గీలీ’ సంస్థ ఇటీవలే విడుదల చేసింది. (2లక్షలు దాటిన కరోనా కేసులు) యూవీ పెన్... సూక్ష్మజీవుల పాలిటి గన్ ఇక్కడ ఫొటోలో కనిపిస్తున్నది అల్ట్రావయోలెట్ స్టెరిలైజేషన్ పెన్. ఇది రాసుకోవడానికి పనికిరాదు గాని, సూక్ష్మజీవుల పాలిటి గన్లా మాత్రం భేషుగ్గా ఉపయోగపడుతుంది. ఇది పూర్తిగా వాటర్‌ప్రూఫ్. తడిగా ఉన్న ఉపరితలాలపై కూడా ఎలాంటి ఇబ్బందీ లేకుండా చక్కగా పనిచేస్తుంది. హైటెక్ వస్తువులను తయారు చేసే చైనీస్ కంపెనీ ‘జియావోమి పెటొనీర్’ ఇటీవల ఈ యూవీ స్టెరిలైజేషన్ పెన్ను తయారు చేసింది. ఇది 2200ఎంఏహెచ్ రీచార్జబుల్ బ్యాటరీ సాయంతో పనిచేస్తుంది. బ్యాటరీని ఒకసారి పూర్తిగా చార్జ్ చేసుకుంటే, ఇది నిరంతరాయంగా రెండున్నర గంటల సేపు పని చేస్తుంది. (ఇప్పుడెలాగో.. అప్పుడూ అలాగే) ఇందులో రెండు మోడ్స్ ఉంటాయి. ఒకటి 90 సెకండ్ల మోడ్, మరొకటి 60 సెకండ్ల మోడ్. ఎంపిక చేసుకున్న వేగాన్ని బట్టి ఎంచుకున్న ఉపరితలంపై ఉన్న సూక్ష్మజీవులను పూర్తిగా నిర్మూలిస్తుంది. దీని నుంచి 253.5ఎన్ఎం వేవ్‌లెంగ్త్‌తో విడుదలయ్యే అల్ట్రావయోలెట్ కిరణాలు బ్యాక్టీరియా, వైరస్ వంటి మహా మొండి సూక్ష్మజీవులను సైతం క్షణాల్లోనే ఖతం చేసేస్తాయి. గాఢమైన రసాయనాల వాసనలు సరిపడని వారు సూక్ష్మజీవులను సునాయాసంగా వదిలించుకోవాలంటే, ఇలాంటి పెన్ ఒకటి ఇంట్లో ఉండాల్సిందే! (ముఖ్యమంత్రులతో మోదీ వీడియో కాన్ఫరెన్స్) -
బాలుడి ఊపిరితిత్తుల్లో పెన్ క్యాప్..
కోల్‌కతా: సాధారణంగా చిన్న పిల్లలు పెన్నుక్యాప్లను నోట్లో పెట్టుకొని ఆడుతూ ఉంటడం చూస్తాం. కానీ, కొన్ని సార్లు పెన్నక్యాప్లు వారి శరీరంలోకి పోయి చాలా ప్రమాదకరంగా మారిన సంగతి కూడా తెలిసిందే. తాజాగా ఓ బాలుడి ఊపిరితిత్తుల్లో పెన్నుక్యాప్ ఉండటంలో వైద్యులు ఆశ్చర్యపోయారు. ఈ ఘటన కోల్‌కతాలోని గారియా ప్రాంతంలో చోటు చేసుకుంది. కొన్ని రోజులుగా తీవ్రమైన దగ్గు, జలుబుతో బాధపడుతున్న 12 ఏళ్ల బాలుడ్ని.. అతని తల్లిదండ్రులు స్థానిక ఎస్ఎస్కేఎం ఆసుపత్రికి తీసుకువెళ్లారు. దీంతో ఆస్పత్రి ఈఎన్టీ వైద్యుడు డా.అరుణాభా సేన్‌గుప్తా బాలుడికి సిటీ స్కాన్ తీశారు. సిటీ స్కాన్ రిపొర్టు పరిశీలించగా.. బాలుడి ఊపిరితిత్తుల్లో పెన్‌క్యాప్ ఉన్నట్లు తేలింది. నవంబర్‌లో తమ బాలుడు పెన్‌క్యాప్ మింగినటట్లు తల్లిదండ్రులు తెలిపారు. వెంటనే బాలుడి తల్లిదండ్రులు అతన్ని స్థానిక నర్సింగ్ హోంకి తీసుకువెళ్లారు. ఆ నర్సింగ్ హోం డాక్టర్లు.. బాలుడి శరీరంలో పెన్‌క్యాప్ ఉందని తల్లిదండ్రులు ఎంత చెప్పినా వినకుండా మాములుగా వైద్యం చేసి పంపించారు. పెన్‌క్యాప్ బాలుడి శరీరంలో ఉంటే ప్రాణాలతో ఉండేవాడు కాదని ఆ వైద్యులు తెలిపారు. దీంతో చేసేదేమి లేక బాలుడ్ని ఆ తల్లిదండ్రులు తమ ఇంటికి తీసుకువెళ్లారు. కానీ ఆ బాలుడికి రోజురోజుకి దగ్గు, జలుబు ఎక్కువ కావటంతో అతని తల్లిండ్రులు గురువారం స్థానిక ఎస్ఎస్కేఎం ఆస్పత్రికి తీసుకువెళ్లారు. బాలుడి ఎడమ ఊపిరితిత్తులో ఉన్న పెన్క్యాప్ను శుక్రవారం ఆపరేషన్ చేసి తొలగించామని డాక్టర్ అరుణాభాసేన్ గుప్తా తెలిపారు. అదేవిధంగా ప్రస్తుతం బాలుడి ఆరోగ్యపరిస్థితి నిలకడగా ఉందని ఆయన పేర్కొన్నారు. -
చెదరని సంతకం
ఒక్క సంతకం.. జీవిత గమనాన్ని మారుస్తుంది. ఒక్క సంతకం.. దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తుంది. ఒక్క సంతకం.. నీకు రక్షణగా నేనున్నాననే ధైర్యాన్నిస్తుంది. ఆ సంతకమే చెదిరిపోతే.. జీవితం చెల్లని చీటీ అవుతుంది. చెల్లని సంతకంతో జీవితం ప్రశ్నార్థకమవుతుంది. అశ్వతి రూపొందించిన ఈ పెన్ను వణికే చేతికి చెదరని సంతకాన్ని భరోసాగా ఇస్తోంది. ‘‘ఇదేంటి! నా కాఫీ కప్పు ఏమైంది? కాఫీ ఇంత పెద్ద మగ్గులో ఇచ్చావేంటమ్మా’’ కూతురిచ్చిన కాఫీ మగ్గు అందుకుంటూ అన్నారు రామకృష్ణారావు. మగ్గులో సగానికే ఉంది కాఫీ. ఇంత పెద్ద మగ్గులో నుంచి కాఫీ ఎలా తాగాలి. ‘‘కాకిలాగ అడుగున రాళ్లేసి తాగాలా? కొబ్బరి బోండాం తాగినట్లు స్ట్రా వేసుకుని తాగాలా? తల్లీ’’ కాఫీ మగ్గు మీదున్న మనవరాలి ఫొటోను చూసి మురిపెంగా నవ్వుకుంటూ కూతుర్ని అడిగారాయన. ‘‘నాన్నా! నిన్న నీళ్లు తాగేటప్పుడు మీ చెయ్యి వణికి, నీళ్లు మీమీద ఒలికిపోయాయి. గుర్తులేదా. నీళ్లు కాబట్టి సరిపోయింది. వేడి కాఫీ ఒలికితే ..?’ చిరుకోపంగా అంటూ లోపలికి వెళ్లిపోయిందామె. ‘‘నాకు వయసైపోవడమేంటి? పిల్లలతోపాటు పరుగుపెట్టగలను’’ బింకంగా అంటూ కాఫీ మగ్గులోకి తొంగి చూశారాయన. ‘‘మీ సిగ్నేచర్ ట్యాలీ కావట్లేదు. మళ్లీ చేయండి’’బ్యాంకు క్లర్క్ డిపాజిట్ ఫామ్‌ని, చెక్ లీఫ్‌ని మార్చి మార్చి చూస్తూ, కంప్యూటర్లో ఉన్న స్పెసిమెన్ సిగ్నేచర్‌తో సరిపోల్చుకుంటూ అన్నది.‘‘కొన్నేళ్లుగా నెలనెలా వచ్చి డిపాజిట్ ఫామ్, చెక్కుల మీద సంతకం చేస్తూనే ఉన్నాను కదమ్మా. ఇప్పుడు కొత్తగా సరిపోలకపోవడం ఏంటి’’ ఆందోళనగా అడిగారు సుజాతమ్మ. ‘‘రాసేటప్పుడు మీ చెయ్యి వణుకుతున్నట్లుంది. పెద్దవయసు కదా. ఇప్పుడే వస్తాను’’ అంటూ ఆ చెక్ లీఫ్ పట్టుకుని మేనేజర్ క్యాబిన్లోకి వెళ్లిందామె. సుజాతమ్మ చెవుల్లో మళ్లీ మళ్లీ వినిపిస్తున్నది ‘పెద్ద వయసు కదా’ అనే మాట ఒక్కటే. క్లర్క్ వచ్చి సీట్లో కూర్చుని మళ్లీ కంప్యూటర్ స్క్రీన్‌ని కళ్లు విప్పార్చి చూస్తోంది. ‘‘ప్రతినెలా నా పెన్షన్ నుంచి ఓ అనాథ శరణాలయానికి విరాళం పంపిస్తుంటానమ్మా. డబ్బు ఆగిపోతే వాళ్లు ఇబ్బంది పడతారు తల్లీ’’ బతిమలాడుతున్నట్లు అడిగింది సుజాతమ్మ. ‘‘ఇప్పటికి పాస్ చేస్తున్నాం. మరో రోజు వచ్చి కొత్తగా సంతకాలు చేయండి. సిస్టమ్‌లో ఫీడ్ చేస్తాం’’ అని చెప్పిందా క్లర్కు. ‘‘తాతయ్యా! నువ్వేసిన బొమ్మ చూడు, ఎలా వంకర పోయిందో’’ బుంగమూతి పెట్టాడు సుహాస్. బొమ్మ సరిగ్గా రాలేదన్న సంగతి శ్రీనివాసరావుకి తెలుస్తూనే ఉంది. గొప్ప చిత్రకారుడిగా అందుకున్న అవార్డులు ఆయన కళ్లముందు మెదిలాయి. డ్రాయింగ్ టీచర్‌గా స్కూల్లో పిల్లలకు బొమ్మలు వేయడం నేర్పించిన ముప్పై ఏళ్ల అనుభవం వంకర్లు పోతోంది. ఇంకా ఎన్నో అద్భుతమైన చిత్రాలు ఆయన కలలో ఉన్నాయి. తాను కలగన్న చిత్రాలను కాన్వాస్ మీద చూసుకోవడం అనేది కూడా ఇక కలేనా.. ఒక్కసారిగా ఆందోళన ఆవరించిందాయన్ని. ఈ సమస్య రామకృష్ణారావు, లలితమ్మ, శ్రీనివాసరావులది మాత్రమే కాదు. లక్షమందిలో ఇద్దరు– ముగ్గురు ఈ ‘ప్రోగ్రెసివ్ న్యూరో డీజనరేటివ్ డిజార్డర్’తో బాధపడుతున్నారు. డెబ్బై – ఎనభై ఏళ్లు నిండిన వాళ్లలో అయితే ప్రతి ఐదుగురిలో ఒకరు ఇలా ఇబ్బంది పడుతుంటారు. ఈ సమస్యను వాడుకలో పార్కిన్సన్స్ డిసీజ్ అంటాం. బ్రిటిష్ ఫిజీషియన్ ‘జేమ్స్ పార్కిన్సన్’ రెండు వందల ఏళ్ల కిందట ఈ వ్యాధి లక్షణాల మీద అధ్యయనం చేసి ప్రపంచానికి తెలియచేశాడు. అందుకే దీనిని పార్కిన్సన్స్ డిసీజ్ అంటున్నాం. ఇప్పుడు అశ్వతి సతీశన్ అనే 23 ఏళ్ల అమ్మాయి పార్కిన్సన్స్తో బాధపడే వాళ్ల కోసం ప్రత్యేకమైన పెన్నును డిజైన్ చేసింది. ఇలాంటి వినూత్నమైన ఉపకరణానికి రూపకల్పన చేసినందుకు ఆమె ప్రపంచంలోనే ప్రతిష్ఠాత్మకమైన ‘జేమ్స్ డైసన్ అవార్డు 2019’ అందుకున్నారు. అశ్వతి సతీశన్ అహ్మదాబాద్‌లోని ఎన్ఐడీ (నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్)లో గ్రాడ్యుయేషన్ స్టూడెంట్. ఆమె తన కోర్సు ప్రాజెక్టులో భాగంగా చేపట్టిన అధ్యయనాన్ని మరింతలోతుగా కొనసాగించారు. వందల మంది పార్కిన్సన్స్ పేషెంట్లను స్వయంగా కలిశారు. ‘‘నేను కలిసిన వాళ్లు అందరూ పెద్దవాళ్లు, ఉన్నత చదువులు చదివి మంచి హోదాలో ఉద్యోగాలు చేసి రిటైర్ అయిన వాళ్లున్నారు. అవార్డులందుకున్న గొప్ప చిత్రకారులున్నారు. అలాంటి వాళ్లను కనీసం సంతకం కూడా చేయలేని స్థితిలో చూశాను. వీళ్లకోసం కొత్త ఉపకరణాన్ని తయారు చేయాలనే నిర్ణయానికి వచ్చాను. గైరోస్కోపిక్ ప్రిన్సిపల్స్‌తో పెన్నుని డిజైన్ చేశాను. ఒక తిరిగే వస్తువు కదలికను దాని ఇరుసు నియంత్రిస్తూ ఉంటుంది. అదే విధానాన్ని ఈ పెన్ను తయారీలో అనుసరించాను. నేను తయారు చేసిన ఫ్లియో పెన్ బ్యాటరీతోనూ, కరెంట్ రీచార్జ్ ద్వారా కూడా పని చేస్తుంది. నా ప్రయోగం సక్సెస్ అయింది. నా ప్రయోగాన్ని నిపుణులు ఆమోదించి అవార్డు ఇచ్చారు. ఇది వినియోగదారుల చేతుల్లోకి రావడానికి టైమ్ పడుతుంది. యూకేకి చెందిన జేమ్స్ ఫౌండేషన్ వాళ్లు అవార్డుతోపాటు వచ్చిన రెండువేల పౌండ్లతో నా పరిశోధనను విస్తృతం చేస్తాను’’ అని చెప్పారు అశ్వతి. – వాకా మంజులారెడ్డి జీవితం సాఫీగా సాగుతుంది పార్కిన్సన్స్ వ్యాధి వచ్చిన వాళ్లలో చెయ్యి వణకడంతోపాటు స్లో నెస్, స్టిఫ్నెస్ ఉంటాయి. ఆ ప్రభావం హ్యాండ్ రైటింగ్ మీద పడుతుంది. అక్షరాల సైజు కూడా తగ్గిపోతుంది. దీనిని మైక్రో గ్రాఫియా అంటారు. మూడు నుంచి ఐదేళ్ల వరకు కొంత అసౌకర్యం ఉన్నప్పటికీ దైనందిన జీవనంలో గణనీయమైన మార్పులేవీ కనిపించవు. మొదట్లో మందుల ప్రభావం ఎనిమిది గంటల సేపు ఉంటుంది. క్రమంగా ఆరు గంటలకు తగ్గిపోతుంటుంది. నరాల బలహీనత కుడి–ఎడమల్లో కొంచెం తేడా ఉంటుంది. కుడివైపు తీవ్రత ఎక్కువగా ఉన్న వాళ్లలో అన్నం కలుçపుకునేటప్పుడు, తినేటప్పుడు చెయ్యి వణకడం స్పష్టంగా తెలుస్తుంటుంది. సంతకాలు మ్యాచ్ కాకపోవడం వంటి తీవ్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. అలాంటి దశలో సంతకాలు మానేసి వేలిముద్ర వేయాల్సి వస్తుంది. ఇప్పుడు అందుబాటులోకి వస్తున్న పెన్ను చాలా ఉపయుక్తంగా ఉంటుంది. వాళ్ల లైఫ్ ఈజీ అవుతుంది. – డాక్టర్ భూమిరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి న్యూరాలజిస్ట్ -
పెన్నుల్లో రాజా..‘రత్నం’!
ఇటీవల భారత్ పర్యటనకు వచ్చిన జర్మన్ చాన్సలర్ ఏంజెలా మెర్కెల్‌కు ప్రధాని నరేంద్ర మోదీ ఓ పెన్ను బహుమతిగా ఇచ్చారు. అది ఏ అంతర్జాతీయ బ్రాండ్లకు చెందిన మాంట్ బ్లాంక్, పార్కర్ పెన్నో కాదు.. పూర్తి స్వదేశీది. పైగా.. అచ్చమైన తెలుగు నేలపై తయారైన ‘రత్నం’ పెన్ను అది. ఎనిమిది దశాబ్దాలకు పైగా చరిత్ర.. మూడు తరాల వారసత్వం దీని ఘనత. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం వేదికగా అంతర్జాతీయ ఖ్యాతినార్జించిన ఈ కలం పుట్టుపూర్వోత్తరాలు ఇవిగో.. సాక్షి ప్రతినిధి, రాజమహేంద్రవరం : దేశంలో సిరా పెన్నుల తయారీకి తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో తొలి అడుగు పడింది. ఈ ఘనత రత్నం పెన్నుకే దక్కింది. మూడు తరాలుగా రత్నం పెన్నులు తయారై దేశ, విదేశాలకు ఎగుమతి అవుతున్నాయి. ఈ పెన్నుల తయారీ కేంద్రం తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని కోటగుమ్మం రంగిరీజు వీధిలో ఉంది. స్వాతంత్య్ర సమరానికి ముందు దేశీయంగా పెన్నుల తయారీ రంగంపై తనదైన ముద్ర వేసిన రత్నం సన్స్ కుటీర పరిశ్రమగా ఉంది. ఇక్కడ తయారైన ‘గైడర్’, ఫౌంటెన్ పెన్నులు ఖండాంతర ఖ్యాతిని ఆర్జించాయి. అనేక మోడల్ పెన్నులు మార్కెట్లోకి వస్తున్నా రత్నం సన్స్ పెన్నుకున్న ప్రాచుర్యం ఇప్పటికీ తగ్గలేదు. భారతావనిలో ప్రప్రథమంగా రత్నం పెన్ను రాజమహేంద్రవరంలో 1932లో కోసూరి రత్నం ఆవిష్కరించారు. రత్నం మరణానంతరం అతని రెండో కుమారుడు కోసూరి వెంకటరమణమూర్తి, మూడో తరంలో రత్నం మనుమలు గోపాలరత్నం (గోపీ), చంద్రశేఖర్ ఆధ్వర్యంలో పెన్నుల తయారీని కొనసాగిస్తున్నారు. రత్నం పెన్ను పుట్టుపూర్వోత్తరాలు.. స్వాతంత్య్రానికి పూర్వం సిరా పెన్నులు విడిభాగాలు విదేశాల నుంచి రప్పించుకుని కొంతమంది తయారుచేసే వారు. ఒకసారి అప్పటి ఉమ్మడి గోదావరి జిల్లాకు కృష్ణమాచార్య అనే సబ్ జడ్జి కలం కిందపడి పాళీ వంగిపోయింది. 14 క్యారెట్ల బంగారంతో చేసిన పాళీ అది. స్వర్ణకారుడైన కేవీ రత్నం, సోదరుడు సత్యం కొత్త పాళీని తయారుచేసి ఇచ్చారు. వీరి ప్రతిభను చూసి సబ్జడ్జికి ముచ్చటేసింది. ముడిసరుకు తాను తెప్పిస్తానని కలాల తయారీ చేపట్టమని సబ్‌జడ్జి రత్నంను ప్రోత్సహించారు. అలా 1932లో రత్నం పెన్నులు మార్కెట్లోకి ప్రవేశించాయి. కాలక్రమంలో వెండి, బంగారంతో పెన్నులు తయారుచేస్తూ రత్నం పెన్నులకు ఒక బ్రాండ్‌ను తీసుకువచ్చారు. గాంధీ మెచ్చిన పెన్ను అప్పట్లో అఖిల భారత గ్రామీణ పరిశ్రమల సమాఖ్య అధ్యక్షుడు జేసీ కుమారప్ప రాజమహేంద్రవరంలో మూడు రోజులు మకాం చేసి దగ్గరుండి రెండు పెన్నులు తయారుచేయించుకుని తీసుకువెళ్లారు. ఒక పెన్నును ఆయన గాంధీజీకి బహూకరించారు. పెన్నును వాడి చూసిన గాంధీ మెచ్చుకుని స్వదస్తూరితో అభినందనల లేఖ రాసి 1935 జూలై 16న రత్నంకు పంపించారు. ‘‘ప్రియమైన రత్నం.. కుమారప్ప ద్వారా ఫౌంటెన్ పెన్ను పంపినందుకు మీకు కృతజ్ఞతలు తెలపాలి. బజారులో దొరికే విదేశీ కలాలకు ఇది మంచి ప్రత్యామ్నాయం’’.. అంటూ అభినందిస్తూ వార్ధా నుంచి రత్నంకు లేఖ పంపించారు. అంతేకాదు.. ప్రముఖులు బాబూ రాజేంద్రప్రసాద్, సర్వేపల్లి రాధాకృష్ణన్, వీవీ గిరి, నీలం సంజీవరెడ్డి, జవహర్లాల్ నెహ్రు, లాల్ బహుదూర్ శాస్త్రి, ఇందిరాగాంధీ.. సినీ నటులు ఎన్టీరామారావు నుంచి చిరంజీవి వరకు రత్నం పెన్ను వినియోగించి ఆయన్ను అభినందించిన వారే. విదేశాల నుంచి యంత్రాల దిగుమతి 1930లో ఇంగ్లాండ్ నుంచి రత్నం దిగుమతి చేసుకున్న లెగ్ ఆపరేటర్ మెషిన్, జర్మనీ నుంచి దిగుమతి చేసుకున్న మైఫోర్డ్ మెషీన్లనే ఇప్పటికీ వినియోగిస్తున్నారు. అలాగే, పెన్నుల తయారీకి రబ్బర్ చెట్టు పాలు నుంచి తయారుచేసే మెటీరియల్ గుజరాత్ నుంచి, ఇరిడియమ్ను జర్మనీ నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. మార్పులకు అనుగుణంగా పెన్నుల తయారీలోను మార్పులు తీసుకురావాలని డిమాండ్ వచ్చిందని రత్నం మనుమడు గోపీ చెప్పారు. కానీ, నాడు తాత జాతీయభావంతో ఏర్పాటుచేసిన ఈ పెన్నులో ఎటువంటి మార్పులు చేయకూడదనే ఉద్దేశంతో అదే ఒరవడిని కొనసాగిస్తున్నామన్నారు. వ్యాపారాత్మక ధోరణితో కాకుండా పెట్టుబడి, రెక్కల కష్టం చేతికొస్తే చాలని సరిపెట్టుకుంటున్నామని ఆయన వివరించారు. కాగా, ఈ పెన్నుల కోసం ఇప్పటికీ దేశ, విదేశాల నుంచి ఆర్డర్లు వస్తున్నాయి. 1948లో తొలిసారి యునైటెడ్ కింగ్డమ్ హై కమిషనర్ సర్ ఆల్డ్బాల్క్ పెన్నుకు ఆర్డర్ రావడం అప్పట్లో దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఇటీవల ప్రధాని కార్యాలయం నుంచి 10 పెన్నుల ఆర్డర్ రాగా వాటిని పంపించారు. అందులో ఒక పెన్ను జర్మనీ చాన్సలర్‌కు ప్రధాని అందజేశారు. ప్రపంచంలోనే తొలి సూక్ష్మ పెన్నుకూ శ్రీకారం 3.5సెం.మీ.ల పొడవు, 1.7 గ్రాముల బరువుతో రత్నం సన్స్ తయారుచేసిన పెన్ను ప్రపంచంలో అతిచిన్న పెన్నుగా 2012 అక్టోబర్‌లో ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించింది. ఈ పెన్నులో 2.22 క్యారెట్ల బంగారం పాళీ వాడారు. 5 గ్రాముల బంగారుతో తయారుచేసిన పెన్నుపై భరతమాత, జాతీయ జెండా, జాతిపిత గాంధీ చిత్రాలను చెక్కి భారతీయతను ప్రతిబింబింపజేశారు. రత్నం సన్స్‌లో అంగుళం మొదలు 36 అంగుళాల సైజు వరకూ రత్నం పెన్నులు తయారుచేస్తున్నారు. విభజనకు ముందున్న కోస్తా, రాయలసీమ, తెలంగాణా ప్రాంతాల సంస్కృతిని అద్దంపట్టేలా గోదావరి వంతెన, తిరుపతి గోపురం, కాకతీయుల శిలాతోరణంతో ఒక కలాన్ని తయారుచేశారు. రూ.300లు నుంచి రూ.35వేల వరకూ.. స్టీల్ పాళీతో తయారుచేసిన రత్నం పెన్ను తొలినాళ్లలో రూ.2.25లు ఉండేది. ప్రస్తుతం రూ.300 నుంచి రూ.3,500 వరకూ లభిస్తోంది. బంగారం పాళీలతో తయారుచేసిన పెన్ను రూ.3,000 నుంచి రూ.35వేలు వరకూ లభిస్తున్నాయి. కాగా, మార్కెట్లో తక్కువ ధరలకు లభించే బాల్ పెన్నుల పోటీని తట్టుకుని ఇప్పటికీ రత్నం పెన్ను నిలుస్తోంది. జర్మనీ చాన్సలర్‌కు మోదీ కానుక ఇటీవల భారత్ పర్యటనకు వచ్చిన జర్మనీ చాన్సలర్ యాంజిలా మార్కల్‌కు ప్రధాని మోదీ.. రత్నం సన్స్ తయారుచేసిన సిరా పెన్నును ఢిల్లీలో బహూకరించారు. స్వాతంత్య్రానికి పూర్వం స్వదేశీ వస్తువులను మాత్రమే వినియోగించాలనే తలంపుతో నాడు గాంధీజీ కూడా రత్నం తయారుచేసిన స్వదేశీ పెన్నును ఉపయోగించారని ప్రధాని ఆమెకు వివరించడం విశేషం. పెన్నుల తయారీలో మూడోతరం గోపి, చంద్రశేఖర్ ప్రోత్సాహం కావాలి జాతీయ, అంతర్జాతీయ ఖ్యాతిని ఆర్జించిన రత్నం పెన్నుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి కాస్త గుర్తింపు, ప్రోత్సాహం కావాలి. ఇప్పటివరకూ ఎవరిపై ఆధారపడకుండా సొంతంగానే దీనిని నిర్వహించుకుంటూ వస్తున్నాం. ప్రభుత్వం మమ్మల్ని ఇప్పుడు ప్రోత్సహించి విద్యుత్, పన్ను మినహాయింపుల్లో రాయితీలు ఇస్తే బాగుంటుంది. అలాగే, మేం ఎలాంటి మార్కెటింగ్ పద్ధతులను అవలంబించం. కావల్సిన వారు నేరుగా వచ్చి పట్టుకెళ్తారు. విదేశాల నుంచీ ఆర్డర్లు వస్తున్నాయి. మాకు ఎలాంటి వెబ్సైటూ లేదు. కొనుగోలుదారుల మౌఖిక ప్రచారమే మాకు వెబ్సైటు. – వెంకటరమణమూర్తి, రత్నం కుమారుడు -
ఆ ‘కలం’.. చిరకాలం!
సాక్షి, సిటీబ్యూరో: ‘దక్కన్ పెన్’.. దశాబ్దాలుగా ఆదరణ పొందుతూనే ఉంది. నిజాం హయాంలో ప్రారంభమైన ఈ పెన్నుల దుకాణం ఇప్పటికీ విద్యావంతులు, అధ్యాపకులు, విద్యార్థులను ఆకట్టుకుంటూనే ఉంది. ఆ రోజుల్లోనే అంతర్జాతీయ ప్రమాణాలతో ఉస్మానియా విశ్వవిద్యాలయాన్ని ఏడో నిజాం ఏర్పాటు చేశారు. దీనికి తగ్గట్టుగానే ఉన్నత విద్యా బోధన జరిగేది. విద్యార్థులకు ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్యతో పాటు వారు రాసేందుకు పెన్నుల డిమాండ్ కూడా చాలా పెరిగింది. అప్పటి వరకు సాధారణంగా స్థానికంగా వినియోగించే సిరా పెన్నులే వాడేవారు. అప్పట్లో ఉన్నత విద్య అభ్యసించే విద్యార్థులు ఇంగ్లండ్, జర్మన్‌తో పాటు ఫ్రాన్స్ దేశాల్లో తయారు చేసే పెన్నులపై ఎక్కువగా మొగ్గు చూపేవారు. వీరి అభిరుచికి అనుగుణంగానే ‘దక్కన్ పెన్ స్టోర్స్’ నిర్వాహకులు అరుదైన కలాలను అందుబాటులో ఉంచేవారు. ఇప్పటికీ ఈ దుకాణం మనుగడలోనే ఉండటం గమనార్హం. నిజాం కాలంలోనే.. ‘నిజాం కాలంలోనే నగరంలో పెన్నుల దుకాణం మొదలైంది. బాల్‌పాయింట్ పెన్ లేని సమయంలో హైదరాబాద్‌లోని అబిడ్స్‌లో ‘దక్కన్ పెన్ స్టోర్’ మొదలైంది. ఆ సమయంలో ధనవంతులు పౌంటెన్ పెన్ కొనాలంటే కోల్‌కతా, ముంబై వెళ్లాల్సిందే. నగరంలో ఆ పెన్నులను అందుబాటులోకి తేవాలనే ఉద్దేశంతో ఎస్.ఎ.సిద్ధిఖీ నగరంలో ఈ పెన్నుల దుకాణం ప్రారంభించారు’ అని సిద్ధిఖీ వారసుడు ప్రస్తుత దక్కన్ స్టోర్ యజమాని హలీం చెప్పారు. అత్యాధునిక కలాలు.. దేశంలోనే అత్యాధునిక రకాల కలాలను దక్కన్ పెన్ స్టోర్‌లో చూడవచ్చు. ప్రాచీన కాలం నాటి పెన్నుల నుంచి అరుదైన రకాలూ కొలువయ్యాయి ఇక్కడ. బాల్‌పెన్, రోలర్, ఫౌంటెన్, జెల్, డిస్పోజబుల్ పెన్ అంటూ చాలా రకాల వైవిధ్యతలతో కూడినవి ఇక్కడ ఉన్నాయి. వాటర్ మ్యాన్ పెన్, పార్కర్, షెఫర్, క్రాస్, పెలికన్ తదితర రకాలను చూసి ఆశ్చర్యపోవాల్సిందే. వైవిధ్యమైనవెన్నో... వాడి పారేసే మూడు రూపాయల పెన్నుల నుంచి రూ.లక్ష.. ఆ పైచిలుకు ధర ఉన్న పెన్నులు ఇక్కడ ఉన్నాయి. రూపాయలు, వందలు, వేల రూపాయల ఖరీదైన వాటిని ఇక్కడ సందర్శనకు పెట్టారు. ప్రపంచంలో ఉన్న అన్ని రకాలను గమనించవచ్చు. ఐరోపా, అమెరికా, మధ్య ప్రాచ్య దేశాలకు చెందినవి చాలానే ఉన్నాయి. తెలుగు సినిమా నటీనటులు, ప్రముఖులు, రాజకీయ నాయకులు.. దుకాణాన్ని సందర్శించి పెన్నులను కొనుగోలు చేస్తారు. నిజాం వారసుడు మఫకంజా.. హైదరాబాద్ వచ్చిన ప్రతిసారీ పెన్స్టోర్ను దర్శిస్తారని దీని నిర్వాహకుడు హలీం చెప్పారు. దేశంలోనే ఖరీదైనవి.. ఇక్కడ ఉన్న కొన్ని పెన్నులు రూ.లక్షపైనే ధరల్లో ఉన్నాయి. వాటి వాటి ప్రత్యేకతల ఆధారంగా ధరలు నిర్ణయిస్తున్నారు. కాన్వే స్టెవార్ట్ పెన్ దక్కన్ పెన్‌స్టోర్‌లో అత్యధికంగా రూ.1,39,750 ధర పలుకుతోంది. పూర్తిగా వెండితో తయారు చేయడమే ఇందుకు కారణం. పెన్ను ముందు భాగంలో బంగారంతో తయారు చేసిన టిప్ ప్రత్యేక ఆకర్షణ. సాధారణ పెన్నులతో పోలిస్తే దీని బరువు ఎక్కువ. దేశంలో ఎక్కడా లభించని పెన్నులు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. అంతేకాదు దేశంలో అత్యధిక ధర ఉన్న పెన్నులు కూడా హైదరాబాద్‌లోని ఈ షాప్‌లోనే ఉన్నాయి. దేశ విదేశాల పెన్నులకు రిపేరింగ్ కొనుగోలు చేసిన వేల రూపాయల విలువైన పెన్నులు పాడైతే వాటిని వృథాగా పడేయకుండా ఈ దుకాణంలో బాగు చేస్తారు. కొనుగోలుదారులకు పెన్నుల గురించి సందేహాలను నివృత్తి చేస్తారు. దేశ విదేశాల్లో తయారైన హ్యాండ్‌మేడ్ పెన్నులను దక్కన్ పెన్ షాప్‌లో రిపేరింగ్ కూడా చేస్తారు. అమెరికా, ఇంగ్లండ్, ఫ్రాన్స్‌లతో పాటు మిడిల్ ఈస్ట్ నుంచి కూడా పెన్నులు రిపేరింగ్‌కు వస్తాయని నిర్వాహకులు తెలిపారు. తొలినాళ్ల నుంచే విదేశీ బ్రాండ్లు.. విశ్వవిద్యాయలం ఏర్పాటైన మూడేళ్లకే అలహాబాద్ (ప్రస్తుతం ప్రయాగ్‌రాజ్ నగర్)లో నివసించే సబీ అక్తర్ సిద్ధీఖీ ఇంగ్లండ్‌లో తయారయ్యే కన్‌వెస్టివర్డ్ పెన్, ఫ్రాన్స్‌లో తయారు అయ్యే డ్యూరో పెన్ కంపెనీల ఏజెన్సీలను తీసుకొని 1922లో నగరానికి వచ్చారు. ఇక్కడ విశ్వవిద్యాలయంతో పాటు విద్యార్థులను కలిసి పెన్నుల విశిష్టతను తెలిపి విక్రయించే వారు. ఇలా ఆరేళ్ల పాటు పెన్నులు విక్రయించి 1928లో అబిడ్స్‌లో ‘ది దక్కన్ పెన్ స్టోర్’ను ప్రారంభించారు. 90 ఏళ్లుగా దేశ విదేశాల్లో తయారయ్యే పెన్నులు ఇప్పటికీ విక్రయిస్తూనే ఉన్నారు. మూడు తరాలుగా కొనసాగిస్తున్నాం.. ఏడో నిజాం కాలంలో మా నాన్న ఎస్.ఎ.సిద్ధిఖీ ఫ్రెంచ్ పెన్నును నగరానికి పరిచయం చేశారు. డ్యూరో పెన్ ఏజెన్సీని హైదరాబాద్‌లో ప్రారంభించారు. ఆ సమయంలో ఇంటింటికీ వెళ్లి పెన్నుల గురించి ప్రచారం చేస్తూ అమ్మకాలు సాగించేవారు. అరుదైన రకాల పెన్నులేవైనా పాడైతే.. మా దగ్గరకు తెస్తే అబిడ్స్ శాఖలో రిపేరింగ్ చేస్తాం. ఇటీవల ఫ్రాన్స్‌కు చెందిన ఓ మహిళ వాటర్‌మ్యాన్ పెన్నును తీసుకొచ్చి రిపేరింగ్ చేయాల్సిందిగా కోరారు. క్వీన్ ఎలిజబెత్ నుంచి ఆ పెన్ను బహుమతిగా పొందినట్లు చెప్పారు. మా దగ్గరున్న యంత్రం సహాయంతో విడిభాగాలు తయారు చేసి, ఆ తర్వాత రిపేరింగ్ చేసి ఇచ్చాం. – హలీం అక్తర్ సిద్ధిఖీ, దక్కన్ పెన్‌స్టోర్ యజమాని -
ఈ పెన్ పదాలను లెక్కిస్తుంది..
సాక్షి, శ్రీనగర్ : కంప్యూటర్లో, మొబైల్ ఫోన్లలో మనం ఎన్ని పదాలు టైప్ చేశామో తెలుస్తుంది.. కానీ పేపర్‌పై మాత్రం ఎన్ని పదాలు రాశామో తెలుసుకోవడం కష్టమే.. కానీ ఓ తొమ్మిదేళ్ల బాలుడు తయారుచేసిన కౌంటింగ్ పెన్ దీనికి పరిష్కారం చూపింది. రాసే పెన్నుతోనే ఎన్ని పదాలు రాస్తున్నామో తెలిసుకునేలా దీనిని రూపొందించాడు. ఈ పెన్నుని తయారుచేసిన జమ్మూకాశ్మీర్‌కు చెందిన ముజఫర్ అహ్మద్ ఖాన్ని పలువురు ప్రశంసిస్తున్నారు. ఈ పెన్ ద్వారా ఎన్ని పదాలు రాస్తున్నామో వాటి సంఖ్య పెన్ను పైభాగంలో గల చిన్న ఎల్సీడీ స్ర్కీన్‌పై కనిపించడంతో పాటు మొబైల్‌కు కూడా మెసేజ్ వస్తుంది. ‘పరీక్షలో తక్కువ పదాలు రాసినందుకు తక్కువ మార్కులు వచ్చాయి. దీంతో ఎంతో కుంగిపోయాను. ఆ తర్వాత పరీక్షలో టైమ్ ఎలా సద్వినియోగం చేసుకోవాలనే దానిపై దృష్టి సాధించాను. ఆ ఆలోచనల్లో నుంచి తయారయిందే ఈ కౌంటింగ్ పెన్’ అని అహ్మద్ తెలిపాడు. డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఆధ్వర్యంలో రాష్ట్రపతి భవన్లో ఏర్పాటు చేసిన ఓ ఇన్నోవేషన్ కార్యక్రమంలో ఈ పెన్నుని ప్రదర్శించగా.. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ అహ్మద్‌ను ప్రశంసించడంతో పాటు రివార్డును అందజేశారు. నేషనల్ ఇన్నోవేషన్ పౌండేషన్ కౌంటింగ్ పెన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడానికి నిర్ణయించుకుంది. మే నుంచి ఈ పెన్ను మార్కెట్లోకి రానుంది. -
పెన్ను మూత మింగి చిన్నారి మృతి
సంజామల: పెన్నుమూత మింగి ఓ చిన్నారి మృతి చెందింది. మండలపరిధిలోని నొస్సం గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. సుమ్రమణ్యం, లక్ష్మీదేవి దంపతులకు ఇద్దరు పిల్లలు. వారిలో రెండో సంతానమైన మంగలి నాగేంద్ర(7) స్నేహితులతో ఆడుకునేందుకు ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. పొరపాటును జేబులో ఉన్న పెన్ను మూతను నోటిలో పెట్టుకొని నములుతూ మింగాడు. ఊపిరాడక ఇబ్బంది పడుతుండగా తోటి స్నేహితులు తల్లిదండ్రులకు తెలిపారు. వెంటనే చిన్నారి నాగేంద్రను చికిత్స నిమిత్తం జమ్మలమడుగు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతిచెందాడు. దీంతో కుటుంబసభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. మృతిచెందిన చిన్నారి స్థానిక నలంద ప్రైవేటు పాఠశాలలో 1వ తరగతి చదువుతున్నాడు. -
హైటెక్ పెన్ వచ్చేసింది!
వర్చువల్ రియాల్టీ కెమెరాలు ఇప్పటికే అందుబాటులో ఉన్నాయి. ఉన్నది ఉన్నట్లుగా సహజంగా దృశ్యాలను సాక్షాత్కరింపజేసే ఎన్నో ఆధునిక పరికరాలూ మార్కెట్లోకి ప్రవేశిస్తున్నాయి. అయితే మనం అనుకున్న, కనిపించిన రంగును స్కాన్ చేసి తనలో నింపుకునే ఆధునిక పరిజ్ఞానంతో కూడిన స్మార్ట్ పెన్ ఇప్పుడు మనముందుకొచ్చేసింది. చిత్రకారులు, డిజైనర్లు తమకు కావలసిన రంగులను ఎలాంటి మిక్సింగ్ లేకుండానే రూపొందించుకొని, కాన్వాస్ పై కళారూపాలను చిత్రించే అవకాశం దగ్గరలోనే ఉంది. ప్రపంచంలోనే మొట్టమొదటి కలర్ పికింగ్ పెన్ అందుబాటులోకి వచ్చేసింది. కుంచె, రంగుల అవసరం లేకుండానే ప్రకృతి చిత్రాలను, కళారూపాలను ఆవిర్భవింపచేసే అవకాశం కనిపిస్తోంది. మనకు దగ్గరలో కనిపించిన ఏ వస్తువునైనా స్కాన్ చేసి, దాని రంగును తనలోకి తీసుకోగలిగే ఈ హైటెక్ పెన్ ఇప్పుడు కళాకారులకు సైతం ఎంతగానో ఉపయోగపడే అవకాశం ఉంది. ఈ స్మార్ట్ పెన్ లో పొందుపరచిన కలర్ సెన్సార్, మైక్రో ప్రాసెసర్లు మనం అనుకున్న రంగులను గుర్తించి స్కాన్ చేస్తాయి. ఆకులు, పూలు, పళ్ళు వంటి రంగురంగుల ప్రకృతి దృశ్యాలతోపాటు ఎటువంటి వస్తువు పైన పెట్టినా.. పెన్ లోని సెన్సార్ ఆ వస్తువులోని రంగును స్కాన్ చేసి, అదే రంగును షేడ్ తో సహా మనకు అందిస్తుంది. చిత్రాన్ని స్కాన్ చేసుకున్న అనంతరం పిక్చర్ లోని కలర్ కు అనుగుణంగా పెన్ లోని స్మార్ట్ ఇంక్ కాట్రిజ్ రంగులను మార్చుకుంటుంది. ఈ కాట్రిజ్ లో ఉండే ఇంకుతో మైళ్ళకొద్దీ రాసేందుకు వీలవుతుందని సృష్టికర్తలు చెప్తున్నారు. అంతేకాదు ఈ స్క్రిబుల్ పెన్ ఇంక్.. నీటిని పీల్చదని, వెలిసిపోదని చెప్తున్నారు. ఈ స్మార్ట్ పెన్ కూడ రెండు రకాలుగా మార్కెట్లో అందుబాటులోకి వస్తుందని, ఒకటి.. నిజమైన ఇంకుతో పేపర్ మీద రాసుకునేందుకు వీలుగానూ, మరోటి చిత్రాలను స్కాన్ చేసి స్మార్ట్ ఫోన్లు, టాబ్లెట్లలో వాడుకునేందుకు గాను వీలుంటుందంటున్నారు. యూఎస్బీ కేబుల్ తో ఒకసారి ఛార్జింగ్ పెడితే ఏడు గంటల పాటు పని చేస్తుందని చెప్తున్నారు. 249 డాలర్లతో అంటే సుమారు 17 వేల రూపాయలతో ఈ స్మార్ట్ పెన్ ను ఆన్ లైన్లో ముందుగానే బుక్ చేసుకునే అవకాశం ఉన్నట్లు వెబ్ సైట్లో వివరించారు. -
పెన్ను మూతకు ఆ రంధ్రం ఎందుకు?
ప్లాస్లిక్ నమిలితే లేనిపోని రోగాలొస్తాయని పుస్తకాల్లో చదువుకుంటాం. కానీ అవే పుస్తకాలు చదివేటప్పుడు కొందరు యథాలాపంగానో, అలవాటుప్రకారమో.. పెన్ మూతలను నమిలేస్తుంటారు. తేలికగా తీసుకుంటాంకానీ ఇలా పెన్ లిడ్స్ నములుతూ అవి గొంతుకు అడ్డంపడి చనిపోయేవారి సంఖ్య ఏటా 100కు పైమాటే. నిజానికి ఈ సంఖ్య ఇంకా ఎక్కువే ఉండాల్సింది! అయితే ఒక చిన్న మార్పు మానవాళికి.. మరీ ముఖ్యంగా పెన్ను మూతలు నమిలివారికి మేలు చేసింది. పెన్ లిడ్ పై భాగంలో రంధ్రం ఎందుకుంటుంది? అనే ప్రశ్నకు సమాధానం కనిపెట్టడానికి ఏళ్లుగా సాగిన పరిశోధనలో ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. లిడ్ పై భాగంలో ఉండే రంధ్రమే వాటిని నమిలేవారి ప్రాణాలు పోకుండా కాపాడుతోందని తేలింది. ప్లాస్టిక్ తో తయారైన పెన్ మూతను నోట్లో పెట్టుకుని నమిలేటప్పుడు.. ముక్కుకు అతి సమీపంలో ఉండటం వల్ల దానిలోని రసాయనాల ఘాడత శ్వాసకోశాలను ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. దాంతో గాలిపీల్చుకోవటం కష్టమై చివరికి ఊపిరి ఆగే పరిస్థితి ఏర్పాడుతుంది. అదే లిడ్ కు రంధ్రం ఉండటంవల్ల ఇలాంటి ఇబ్బందులు ఉత్పన్నంకావు. 1991లో బిక్ అనే కంపెనీకి వచ్చిన ఈ రంధ్రం ఐడియా ఎంతో మంది ప్రాణాలు కాపాడింది. సో.. థ్యాక్స్ టు బిక్ అండ్ ద హోల్ ఎట్ ది ఎండ్ ఆఫ్ పెన్ లిడ్! -
అతిపెద్ద పెన్ను
తిక్క లెక్క సాధారణంగా పెన్నులు జేబులో ఇమిడిపోయేలా ఉంటాయి. కాస్త పొడవాటి పెన్నులైతే, టేబుల్‌పై పెన్స్టాండ్లో అలంకారంగా పెట్టుకోవడానికి అనువుగా ఉంటాయి. ఒక అడుగు పొడవు పెన్ను అయితే, అది చాలా పెద్ద పెన్ను కిందే లెక్క. అయితే, ఈ ఫొటోలో కనిపిస్తున్నది ప్రపంచంలోని పెన్నులన్నింటినీ తలదన్నే పెన్ను. దీని పొడవు 5.5 మీటర్లు... అంటే పద్దెనిమిది అడుగుల పైమాటే. బరువైతే ఏకంగా 37.23 కిలోలు. ఆచార్య మాకునూరి శ్రీనివాస కొద్దికాలం కిందట హైదరాబాద్‌లో ప్రదర్శించిన ఈ పెన్ను గిన్నెస్ రికార్డు సాధించింది. -
పెన్ను కావాలని వచ్చి ....
కాటేదాన్: పెన్ను కొనే నెపంతో కిరాణా షాపునకు వచ్చిన ఇద్దరు దుండగులు షాపు నిర్వాహకురాలి పుస్తెలతాడును తెంచుకొని పారిపోయారు. మైలార్‌దేవ్‌పల్లి క్రైం ఎస్సై వెంకటేశం తెలిపిన వివరాల ప్రకారం.. వినాయక్‌నగర్ బస్తీలో గౌలికర్ ప్రమీలా, బన్సీలాల్ దంపతులు కిరాణాషాపు నిర్వహిస్తున్నారు. శుక్రవారం రాత్రి 10 గంటల ప్రాంతంలో వీరి షాపు వద్దకు గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు నెంబర్ ప్లేట్‌లేని పల్సర్ బైక్‌పై వచ్చారు. పెన్ను కావాలని వారు అడగడంతో షాపులో ఉన్న ప్రమీల వారికి పెన్ను అందించి వెనుకకు తిరిగేసరికి ఆమె మెడలోని 3.5 తులాల పుస్తెలతాడును తెంచుకొని బైక్‌పై పారిపోయారు. బాధితురాలు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
భలే పెన్ను
మీరు రాసేది మీకే గుర్తుండటం లేదా..? మరేం ఫర్వాలేదు. మీలాంటి వారి కోసమే ఈ పెన్ను. ఇలాంటలాంటి పెన్ను కాదిది. మీరు ఏం రాసినా నిక్షేపంగా గుర్తుంచుకుంటుంది. రాసిన రాతను రాసినంత వేగంగానే స్కాన్ చేసి తన మెమొరీలో నిక్షిప్తం చేసుకుంటుంది. మరచిపోయిన మీ రాతలను అవసరమైనప్పుడు మళ్లీ గుర్తు చేస్తుంది. ఫ్రెంచి పెన్నుల బ్రాండు ‘ఓరీ’ ఈ హైటెక్ పెన్నును ‘స్టైలోగ్రాఫ్’ పెన్నుగా త్వరలోనే మార్కెట్లోకి తీసుకు రానుంది. రాగితో చూడముచ్చటగా తయారు చేసిన ఈ పెన్నుకు, కలపతో తయారు చేసిన క్యాప్ రక్షణగా ఉంటుంది. ఇందులో 0.7 ఎంఎం బాల్‌పాయింట్ రీఫిల్ ఉంటుంది. మామూలు బాల్‌పాయింట్ పెన్నుల మాదిరిగానే, అవసరమైనప్పుడు రీఫిల్‌ను మార్చేసుకోవచ్చు. దీని లోపల ఒక చిన్న బ్యాటరీ ఉంటుంది. ఒకసారి చార్జ్ చేస్తే, దీంతో రాత ఏకధాటిగా రెండు రోజులు నిరంతరాయంగా సాగిపోతుంది. దీనికి జతగా లెదర్ కవర్‌తో తయారు చేసిన నోట్‌బుక్ కూడా ఉంటుంది. ఈ నోట్‌బుక్‌లో రాసిన రాతలను బ్లూటూత్ ద్వారా స్మార్ట్‌ఫోన్‌కు పంపుకునే వెసులుబాటు ఉంది. దీని ఖరీదు 12 పౌండ్లు (రూ.1200) మాత్రమే.