ముంబై: కొంతమంది ఆరోగ్యపరంగా ఏ లోపాలు లేకున్నా, పని చేసే సామర్థ్యం ఉన్నా చేయలేక యాచించేవాళ్లని, ఇతరులపై ఆధారపడే వాళ్లని చూస్తుంటాం. ఇంకొందరు కష్టపడి పని చేయలేక సులభమైన దారిలో డబ్బు సంపాదనకై ఇతరులను మోసం చేస్తూ సంపాదిస్తుంటారు. ప్రస్తుత రోజుల్లో ఇలాంటి ఘటనలు మనం వింటూనే ఉంటాం. కానీ వయసు మీదపడినా కూడా ఓ బామ్మ మాత్రం ఎవరి దగ్గర చేయి చాపడం ఇష్టం లేదని ఈ వయసులోనూ తన కష్టం మీదే తన జీవనాన్ని కొనసాగిస్తోంది. ప్రస్తుతం ఆ బామ్మకి సంబంధించిన ఫోటో సోషల్‌మీడియాలో చక్కర్లు కొడతూ హల్‌చల్ చేస్తోంది.
వివరాల్లోకి వెళితే.. ఇటీవల రీఅప్ స్టూడియో వ్యవస్థాపకురాలు శిఖా రథి తన స్నేహితులతో కలిసి పూణేలోని ఎమ్‌జి రోడ్‌లో వెళ్తున్నప్పుడు ఈ బామ్మను(రతన్) కలిసింది. ఆ సమయంలో ఆ బామ్మ రంగురంగుల పెన్నులను కార్డ్‌బోర్డ్‌తో తయారు చేసిన పెట్టెలో పెట్టి అమ్ముతోంది. అయితే ఆ కార్డ్‌బోర్డ్‌పై ఉన్న ఓ లైన్ చూసి అశ్చర్యపోయింది. ఆ నోట్‌లో.. ‘నాకు ఎవరీ దగ్గర చేయి చాచను. దయచేసి రూ.10/- బ్లూ కలర్ పెన్నులు కొనండి చాలు. థ్యాంక్యు. బ్లెస్ యూ’.. అని రాసుంది.
కాగా ఆ బామ్మ రోడ్లపై తిరుగుతూ విద్యార్థులను, ట్రాఫిక్ సిగ్నల్ పడగానే ఆగిన వాహనదారులను రిక్వెస్ట్ చేస్తూ పెన్నులు అమ్ముతోంది. సాయంత్రం వరకు అక్కడే ఉండి.. పెన్నులు అమ్మగా వచ్చిన డబ్బుతో తన జీవితాన్ని సాగిస్తోంది. ఈ విషయం తెలుసుకున్న రతి ఆమె ఫోటో తీసి తన ఇన్‌స్టాలో షేర్ చేసింది. ఈ ఫోటో చూసిన కొందరు నెటిజన్లు బామ్మకు హేట్సాఫ్ చెప్పడంతో పాటు మన వంతు సాయం చేయాలని కామెంట్లు పెడుతున్నారు.
చదవండి: Snakes Found Home: ఆ ఇంట పాములు బాబోయ్ పాములు.. చూస్తే చెమటలు పట్టాల్సిందే!
Comments
Please login to add a commentAdd a comment