old lady
-
అత్యంత వృద్ధ మహిళ అస్తమయం
అమెరికాలో అత్యంత వృద్ధ మహిళ ఎలిజబెత్ ఫ్రాన్సిస్ తన 115 ఏళ్ల వయసులో మరణించారు. ‘క్వీన్ ఎలిజబెత్ ఆఫ్ హ్యూస్టన్’గా పిలుచుకునే ఫ్రాన్సిస్ అమెరికాలో అత్యంత వృద్ధురాలిగా, ప్రపంచంలో మూడో వృద్ధురాలిగా రికార్డుకెక్కారు. అమెరికాలో అత్యంత ఎక్కువ కాలం బతికిన 21వ వ్యక్తి కాగా.. ప్రపంచంలో 54వ వ్యక్తిగా చరిత్ర సృష్టించారు. ఫ్రాన్సిస్ కుటుంబమే దీర్ఘాయుష్సు ఉన్న కుటుంబం. ఆమె సోదరి బెర్తా జాన్సన్ కూడా అత్యధికకాలం జీవించారు. 2011లో మరణించేనాటికి ఆమెకు 106 ఏళ్లు. అప్పటివరకూ అక్కా చెల్లెల్లిద్దరూ కలిసే బతికారు. ఇంత కాలం బతకడం ఎలా సాధ్యమైందంటే ‘సంతోషంగా జీవించాలని ప్రతిరోజూ అనుకున్నాను. అంతా దేవుడి దయ.. నన్ను తీసుకెళ్లడానికి అతని దగ్గర ఏ కారణం లేదు’ అని చెప్పేవారు. 112 ఏళ్ల వయసులోనూ తన మనవరాళ్లు, మనవలతో కలిసి అన్ని కుటుంబ కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొన్న ఫ్రాన్సిస్ ఆయుష్షు రహస్యం మాత్రం.. ‘ఆల్కహాల్, ధూమపానానికి దూరంగా ఉండటమే’ అని చెబుతారు ఆమె దగ్గరివారు. లూసియానాలోని సెంట్ మేరీ పారి‹Ùలో 1909లో జని్మంచిన ఫ్రాన్సిస్.. తన జీవిత కాలంలో ప్రపంచంలో ఎన్నో మార్పులకు సాక్షిగా ఉన్నారు. 20 మంది అమెరికా అధ్యక్షులను, రెండు ప్రపంచ యుద్ధాలను, పౌర హక్కుల ఉద్యమాలను దగ్గరగా చూశారు. 1920లో తల్లి మరణించడంతో ఆమెకు కష్టాలు మొదలయ్యాయి. ఐదుగురు తోబుట్టువుల్లో ఒకరైన ఫ్రాన్సిస్.. టెక్సాస్‌లోని గాల్వెస్టన్లో ఉన్న అత్త దగ్గర పెరిగారు. 1928లో ఆమెకు పాప జని్మంచింది. ఒంటరి మహిళగానే కూతురిని పెంచారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
వృద్ధురాలికి సైబర్ నేరగాళ్ల టోకరా
నూజివీడు : సైబర్ నేరగాళ్లు రకరకాల పద్ధతుల్లో ప్రజలను మోసం చేస్తున్నారు. తాజాగా ఏలూరు జిల్లా నూజివీడుకు చెందిన వృద్ధురాలు సైబర్ నేరగాళ్ల మోసానికి రూ.40 లక్షలు పోగొట్టుకున్నారు. నూజివీడు పట్టణంలోని ఉషాబాలా నగర్లో నివాసముండే మందపల్లి కమలాజేసుదాసుకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు. పెద్ద కుమార్తె బెంగళూరులో, చిన్న కుమార్తె, కుమారుడు అమెరికాలో ఉంటున్నారు. కమలాజేసుదాసు ప్రైవేటు నర్సింగ్ కాలేజీలో పనిచేసి రిటైర్ అయ్యారు. ఈ నెల రెండో తేదీ మధ్యాహ్న సమయంలో 9850852151 నంబరు నుంచి ఓ మహిళ కమలా జేసుదాసుకు ఫోన్ చేసి.. తాము ముంబయి పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి మాట్లాడుతున్నామని, మీ పేరిట పార్శిల్ వచ్చిందని, అందులో ఎండీఎంఏ అనే నిషేధిత డ్రగ్స్ ఉందని చెప్పింది. మీకు మరో కాల్ వస్తుందంటూ కాల్ కట్ చేసింది. ఆ తర్వాత వెంటనే కమలాజేసుదాసుకు 7831062545 నంబర్ నుంచి వీడియో కాల్ వచ్చింది.. తాము ముంబయి పోలీసులమని, మీకు డ్రగ్స్‌తో సంబంధం ఉందని, అమెరికాలో ఉన్న మీ కుటుంబ సభ్యులకూఇందులో సంబంధం ఉందంటూ భయపెట్టారు. ఈ డ్రగ్స్ ద్వారా వచ్చిన డబ్బు మీ ఖాతాలో ఉందని, మీరు ఏ తప్పూ చేయకుంటే ఆ డబ్బును తమకు ట్రాన్స్ఫర్ చేయాలని, ఏ తప్పూ లేకపోతే మీ డబ్బు మళ్లీ మీకు తిరిగి ఇచ్చేస్తామని చెప్పారు. దీంతో భయపడిన వృద్ధురాలు ఈ నెల మూడో తేదీన రూ.20 లక్షలు, గంట తర్వాత రూ.10 లక్షలు, నాలుగో తేదీన మరో రూ.10 లక్షలు ఆర్టీజీఎస్ ద్వారా వారిచ్చిన ఖాతాలకు ట్రాన్స్ఫర్ చేసింది. అనంతరం తనకు కాల్ వచ్చిన నంబర్‌కు ఆమె ఫోన్ చేస్తే.. అది పనిచేయడం లేదు. దీంతో తాను మోసపోయానని తెలుసుకున్న కమలా జేసుదాసు.. పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఆదివారం ఫిర్యాదు చేశారు. ఈ మేరకు టౌన్ సీఐ పి.సత్యశ్రీనివాస్ కేసు నమోదు చేశారు. -
వృద్ధురాలిని పీక్కుతిన్న కుక్కలగుంపు
ముస్తాబాద్ (సిరిసిల్ల): వీధికుక్కలు జవహర్‌నగర్‌లో బాలు డిని చంపిన ఘటన మరువకముందే మ రో దారుణం చోటు చేసుకుంది. అచేతన స్థితిలో అనారోగ్యంతో మంచానికే పరిమితమైన వృద్ధురాలిపై కుక్కలగుంపు దాడి చేసి ప్రాణాలు తీశాయి. తలను పీకి.. పొట్టను చీల్చి పేగులు, కా లే యాన్ని తినేశాయి.ఈ దారుణ ఘటన రాజన్నసిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం బట్టోనితాళ్లలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం. బట్టోనితాళ్లకు చెందిన పిట్ల రామలక్ష్మి(85) ఇంట్లో నిద్రిస్తుండగా బుధవారం అర్ధరాత్రి వీధికుక్కల గుంపు విచక్షణారహితంగా దాడిచేసి ముఖాన్ని కొరుక్కుతిని, పొట్టను చీల్చాయి. వృద్ధాప్యం, అనారోగ్యంతో కదలలేని స్థితిలో ఉన్న రామలక్ష్మి ఎదురుతిరగలేని పరిస్థితిలో ప్రాణాలు విడిచింది. రామలక్ష్మి ము ఖం పూర్తిగా ఛిద్రమై ఎముకలు తేలాయి. ఆమె పడుకున్న మంచంలోనే ప్రాణాలు వదలగా, రక్తం ధారలు కట్టింది. వేర్వేరు ఇళ్లలో కొడుకులు రామలక్ష్మి ముగ్గురు కుమారులు బాలరాజు, దేవయ్య, అంజయ్యలు వేర్వేరు ఇళ్లలో ఉంటున్నారు. వ్యవసాయ పనులు ముమ్మరం కావడంతో పొద్దంతా పనులకు వెళ్లి వచ్చినవారు బుధవారం రాత్రి గాఢనిద్రలోకి జారుకున్నారు. రామలక్ష్మి తనకున్న ప్రత్యేక గదిలో నిద్రించింది. ఆ గదికి సరైన తలుపులు లేకపోవడంతో రాత్రివేళ కుక్కలు దాడి చేశాయి.మంచంలో ఎంత గింజుకున్నా, కుక్కలు వదల్లేదని అక్కడున్న పరిస్థితులను బట్టి తెలుస్తోంది. అందరూ నిద్రలో ఉండడంతో ఆమె కేకలు ఎవరికీ వినిపించలేదు. గురువారం ఉదయం రామలక్ష్మి కుటుంబీకులు జరిగిన సంఘటన చూసి బోరున విలపించారు. మృతురాలి గదంతా రక్తసిక్తమై, శరీర భాగాలు పడి ఉన్నాయి. -
మనవడికి ప్రాణభిక్ష పెట్టిన 70 ఏళ్ల అమ్మమ్మ..ఎలా అంటే!
ఆధునిక కాలంలో అవయవదానం సాధారణంగా మారిపోయింది. కానీ ఇంకా చాలామంది తన ప్రాణానికి ముప్పు వస్తుందేమో అని భయపడిపోతారు. అవగాహన ఉన్నవారు మాత్రం ఒక కిడ్నీని, లివర్‌లోని కొంత భాగాన్ని దానమిచ్చేందుకు ముందుకు వస్తున్నారు. కానీ 70 ఏళ్ల బామ్మ తన ప్రాణాన్ని పణంగా పెట్టి మరీ తన మనవడిని ఎలాగైనా రక్షించుకోవాలని తాపత్రయపడింది. ధైర్యంగా కిడ్నీని దానం చేసి నిస్వార్థ ప్రేమకు ప్రతిరూపంగా నిలిచింది. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని జబల్పూర్లో జరిగింది.వివరాల్లోకి వెళితే.. జబల్పూర్లోని సిహోరాకు చెందిన యువకుడు (23) గత కొంత కాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడు. ఈ క్రమంలో చికిత్స తీసుకున్నప్పటికీ ఫలితం లేకపోయింది. అతని రెండు కిడ్నీలు పూర్తిగా దెబ్బతిన్నాయి. దీంతో అతనికి కిడ్నీ మార్పిడి చేయడం తప్ప వేరే మార్గం లేదని వైద్యులు తెలిపారు. కిడ్నీ దాతలకోసం కుటుంబ సభ్యులు అన్వేషణ మొదలు పెట్టారు. కుటుంబ మిగిలిన సభ్యులతో పోలిస్తే బామ్మ, మనవడి బ్లడ్ గ్రూప్ ఒక్కటేనని రక్త పరీక్షల్లో తేలింది. వారిద్దరికీ సంబంధిత పరీక్షలు చేయగా, బామ్మ కిడ్నీ మ్యాచ్ అయ్యింది. అటు బామ్మ కూడాతన కిడ్నీని డొనేట్ చేయడానికి అంగీకరించింది. నెల రోజులపాటు బామ్మ శారీరక సామర్థ్యాన్ని పరిశీలించిన అనంతరం కిడ్నీ మార్పిడి ఆపరేషన్ నిర్వహించారు. అమ్మమ్మ ధైర్యంతో ముందుకువచ్చ తన మనవడికి కొత్త జీవితాన్ని ఇవ్వడం విశేషంగా నిలిచింది.కిడ్నీమార్పిడిఆపరేషన్ విజయవంతమైందనీ, ప్రస్తుతం మనవడు, బామ్మ ఇద్దరూ పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని, జబల్పూర్ మెట్రో ఆసుపత్రి నెఫ్రాలజిస్ట్ డాక్టర్ విశాల్ బదేరా, కిడ్నీ మార్పిడి సర్జన్ డాక్టర్ రాజేష్ పటేల్ వెల్లడించారు. -
సీఎం జగన్ పెద్ద కొడుకులా 3 వేలు పెన్షన్ ఇస్తున్నారు: వృద్ధురాలు
-
వారెవ్వా.. బామ్మా! ఒకేరోజు మూడు ప్రపంచ రికార్డులు
రికార్డులకు, అవార్డలుకు వయస్సుతో పనేముందని నిరూపించిందో బామ్మ. 99 ఏళ్ల వయసులో ఈజీగా ఈత కొట్టడం మాత్రమే కాదు. ఒకే రోజు ఏకంగా మూడు ప్రపంచ రికార్డులను బద్దలు కొట్టింది. డచ్-కెనడియన్ బెట్టీ బ్రస్సెల్ ఈ నెల 20న అద్భుతమైన ఈ ఫీట్ సాధించింది. 400-మీటర్ల ఫ్రీస్టైల్, 50 మీటర్ల బ్రెస్ట్ స్ట్రోక్ 50-మీటర్ల బ్యాక్ అనే మూడు విభాగాల్లో తన సత్తా చాటింది. తనకు ఏజ్ అస్సలు మేటర్ కాదంటోంది. ఇదీ చదవండి: ఏకంగా రూ.7 కోట్ల భూమిని విరాళమిచ్చిన మహిళ, ఎందుకో తెలుసా? స్విమ్మింగ్ కెనడా లెక్కల ప్రకారం 12 నిమిషాల 50 సెకన్లతో ఉన్న 400-మీటర్ల ఫ్రీస్టైల్ రికార్డును దాదాపు నాలుగు నిమిషాల్లో బ్రేక్ చేసింది. అలాగే 50-మీటర్ల బ్యాక్‌స్ట్రోక్‌ను ఐదంటే ఐదు సెకన్లలో ఛేదించి వాహ్వా అనిపించుకుంది. ‘‘నేను రేసులో ఉంటే ఇక దేన్నీ పట్టించుకోను. ఐ ఫీల్ లైక్ ఎ ఉమెన్!'‘ అని చెప్పిందామె. (Oyster Mushrooms: బెనిఫిట్స్ తెలిస్తే.. అస్సలు వదలరు!) బ్రస్సెల్ 60 సంవత్సరాల వయస్సు నుండి మాత్రమే స్విమ్మింగ్ పోటీల్లో పాల్గొంటూ ఉండటం విశేషం. కానీ ఇటీవలి అనేక ప్రపంచ రికార్డులను బద్దలు కొట్టిన ఘనతను దక్కించుకుంది. ‘‘అమ్మా నీకు ముసలి తనం వచ్చేసిందని నా 70 ఏళ్ల చిన్న కొడుకుఅంటూ ఉంటాడు. కానీ నాకు అలా అనిపించదు. నిజంగా అలసి పోయినప్పుడు మాత్రం కొంచెం అనిపిస్తుంది. అంతే’’ అంటారామె. అలాగే రికార్డుల గురించి కూడా ఆలోచించను. చేయాల్సిన పనిని ధైర్యంగా చేసేస్తాను. గెలిస్తే సంతోషిస్తాను అంటుంది బోసి నవ్వులతో. బ్రస్సెల్స్ ఇప్పటికీ కనీసం వారానికి రెండుసార్లు స్విమ్మింగ్ చేస్తుంది. -
97 ఏళ్ల వయసులో రెక్కలు కట్టుకుని...!
ఆసక్తి , పట్టుదల ఉండాలే గానీ వయసుతో పనేముంది. ఒక్కసారి మనసులో గట్టిగా అనుకుంటే చాలు.. ఎంత రిస్క్ అయినా చేయొచ్చు. బోలెడంత ఆనందాన్ని సొంతం చేసుకోవచ్చు. 97ఏళ్ల వయసులో ఈ పెద్దావిడ సాహసం, తెగువ చూస్తే మీరు కూడా ఇలాగే అనుకుంటారు. ఈ బామ్మకు సెల్యూట్ చేయకుండా ఉండరు! అందుకే పారిశ్రామికవేత్త, ఎంఅండ్ఎం అధినేత ఆనంద్ మహీంద్రను కూడా బామ్మ బాగా ఆకట్టుకుంది. ఆమే నా హీరో అంటూ ఈ వీడియోను ట్విట్ చేశారు. దీంతో నెటిజన్లు బామ్మపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. పువ్వులా నేనే...నవ్వుకోవాలి....గాలినే నేనై... సాగిపోవాలి చిన్నిచిన్నిఆశ.. అంటూ సాగే తమిళ బ్యాగ్ గ్రౌండ్ పాటతో ఈ వీడియో మరింత హృద్యంగా నిలిచింది. అనుకున్న పని సాధించాలంటే వయసుతో పని ఏముంది సార్..అని ఒకరు, అద్భుతమైన వీడియో, బామ్మకు అభినందనలు మరికొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఫ్లయింగ్ రైనో పారామోటరింగ్ అనే ఇన్‌స్టా పేజ్ ఈ వీడియోను ఇటీవల షేర్ చేసింది. 97 ఏళ్ళ వయసులో ఎగిరే ప్రయత్నం చేసిన, సక్సెస్ అయిన ఈ బామ్మ ధైర్యానికి సెల్యూట్ అని పేర్కొంది. మహారాష్ట్ర జెజురి పట్టణంలోని కొండపై ఉన్న ఖండోబా ఆలయం సమీపంలో ఈ ఫీట్ చేశారు బామ్మ. It’s NEVER too late to fly. She’s my hero of the day… pic.twitter.com/qjskoIaUt3— anand mahindra (@anandmahindra) November 23, 2023 -
వికారాబాద్: అవ్వ మిస్సింగ్, చివరకు..
సాక్షి, వికారాబాద్: ఆ అవ్వ ఆయుష్షు గట్టిదే. ప్రమాదవశాత్తూ ఓ పెద్ద కాలువలో పడినా.. రోజంతా అక్కడే గడిపి క్షేమంగా ప్రాణాలతో బయటపడింది. వికారాబాద్ తాండూరు మున్సిపల్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. తాండూర్ మున్సిపల్ పరిధిలోని గీతా మందిర్ సాయిపూర్ ప్రాంతానికి చెందిన కోస్గి భారతమ్మ (75) ఆదివారం మధ్యాహ్నాం నుంచి కనిపించకుండా పోయింది. దీంతో ఆమె మనవడు పట్టణంలో అంతా వెతికాడు. బస్టాండ్, రైల్వే స్టేషన్ అంతా గాలించాడు. పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే ఈ ఉదయం ఇంటి దగ్గర్లో ఉన్న ఓ మురుగు కాలువపై అతనికి అనుమానం వచ్చింది. రోడ్డు వెడల్పు కోసం చేపట్టిన నిర్మాణం అది. వెంటనే మున్సిపల్ పారిశుద్ధ కార్మికులను పిలిపించి అందులో వెతికించాడు. సోమవారం సాయంత్రం పెద్ద నాలాలో కింద మూలుగుతూ కూర్చున్న భారతమ్మ అతని మనవడికి కనిపించింది. మున్సిపల్ కార్మికుల సాయంతో ఆమెను బయటకు తీసుకొచ్చి. దగ్గర్లోనే ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఆమె పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు ప్రకటించగా.. ఆమె ప్రమాదవశాత్తు అందులో పడిందని మనవడు చెబుతున్నాడు. మరోవైపు.. అవ్వ మిస్సింగ్ కథ సుఖాంతం కావడంతో మృత్యువును జయించిదంటూ స్థానికులు ఈ విషయాన్ని చర్చించుకుంటున్నారు. -
హైదరాబాద్‌లో మరో హిట్ అండ్ రన్ కేసు
సాక్షి, హైదరాబాద్: నగరంలో మరో హిట్ అండ్ రన్ కేసు నమోదు అయ్యింది. అంబర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ కారు.. వృద్ధురాలు ఢీ కొట్టింది. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందగా.. కారు అక్కడి నుంచి వేగంగా వెళ్లిపోయింది. అంబర్పేట్ నుంచి ఉప్పల్ వెళ్లే రోడ్డులో.. కింగ్ ప్యాలెస్ హోటల్ వద్ద బుధవారం ఈ ఘటన చోటు చేసుకుంది. మృతురాలిని వినాయక్‌నగర్‌కు చెందిన ముత్యాలమ్మగా పోలీసులు గుర్తించారు. చెత్త పడేయడానికి వెళ్లి ఆమె ప్రమాదానికి గురైనట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. కేసు నమోదు చేసుకున్న అంబర్‌పేట పోలీసులు.. సీసీ కెమెరా ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. ఇదీ చదవండి: మొదటి భార్య ఫిర్యాదుతో శవం వెలికితీత -
ఆ అవ్వ కళ్లలో ఆనందం.. ఐపీఎస్ అనుపై ప్రశంసలు
Viral Video: భావోద్వేగ సన్నివేశాలను తెర మీద చూసినప్పుడు కలిగే ఆనందం మాటల్లో వర్ణించలేనిది. అలాంటి క్షణాలు నిజజీవితంలోనూ కలిగితే!. ఆ ఆనందానికి అవధులు ఉంటాయా?.. కొన్ని కోట్లు ఖర్చు చేసినా అలాంటి ఆనందం దొరకదు మరి. యువ ఐపీఎస్ అధికారిణి అనుకృతి విషయంలోనూ అదే జరిగిందట. ఆ క్షణాల్ని ఆమె పంచుకోగా.. పలువురు అభినందిస్తున్నారు కూడా. ఉత్తర ప్రదేశ్ బులందర్‌షెహర్ జిల్లా ఐపీఎస్ అధికారిణి అనుకృతి శర్మ స్వయంగా ‘స్వదేశ్’చిత్ర అనుభూతిని పొందారట. ఆ హిందీ చిత్రంలో నాసా సైంటిస్ట్ అయిన షారూక్ ఖాన్ తన ఊరికి కరెంట్ తెప్పించడానికి చేసే ప్రయత్నాన్ని డైరెక్టర్ అశుతోష్ గోవార్కికర్ స్క్రీన్ మీద ఎంతో ఎమోషనల్‌గా చూపించారు. అలాంటి క్షణాల్ని.. అనుభూతినే తాను పొందానని ఐపీఎస్ అను స్వయంగా ట్వీట్ చేశారు. నూర్జహాన్(70) అనే వృద్ధురాలి ఇంటికి అనుకృతి దగ్గరుండి విద్యుత్ సదుపాయం అందించారు. ఆమె ఇంట్లో లైట్ వెలగగానే అటు అను ముఖంలో.. ఇటు బామ్మ ముఖంలో సంతోషం ఒక్కసారిగా వెల్లివిరిసింది. ఆ సంతోష కాంతుల్ని ట్విటర్ ద్వారా ఆమె పంచుకున్నారు. ఆమె ఇంటికి కరెంట్ తెప్పించడంలో సహకరించిన ఎస్‌హెచ్‌వో జితేంద్రకు, మొత్తం టీంకు ఆమె కృతజ్ఞతలు సైతం తెలియజేశారు. అనుకృతి శర్మ.. 2020 ఐపీఎస్ బ్యాచ్ అధికారిణి. ప్రస్తుతం బులంద్‌షెహర్‌కు అదనపు ఎస్పీగా బాధ్యతలు నిర్వహిస్తున్నారామె. ఒంటరిగా పేదరికంలో ఉన్న నూర్జహాన్.. తన ఇంటికి వెలుగులు కావాలని నేరుగా పోలీసులను ఆశ్రయించిందట. ఆ విషయం తెలియగానే ఐపీఎస్ అనుకృతి.. ఇలా రంగంలోకి దిగి స్వయంగా ఆ ఏర్పాట్లను పర్యవేక్షించింది. అంతేకాదు ఓ ఫ్యాన్‌ను సైతం ఆ పెద్దావిడకు అందించింది. ఆపై అంతా స్వీట్లు పంచుకున్నారు. Swades moment of my life 🌸😊 Getting electricity connection to Noorjahan aunty's house literally felt lyk bringing light into her life. The smile on her face ws immensely satisfying.Thank u SHO Jitendra ji & the entire team 4 all da support 😊#uppcares @Uppolice @bulandshahrpol pic.twitter.com/3crLAeh1xv — Anukriti Sharma, IPS 🇮🇳 (@ipsanukriti14) June 26, 2023 ఇదీ చదవండి: జాతకాల పిచ్చోడా? బ్యాంక్ అధికారులకు షాకిచ్చాడుగా! -
పాపం.. బతికిందని సంతోషించేలోపే గుండె ఆగింది
ఒంట్లో ఓపికలేకున్నా.. బలానంతా కూడదీసుకుని, తానింకా బతికే ఉన్నానని శవపేటిక మూతను తట్టిమరీ కొన ఊపిరితో బయటపడిన బామ్మ ఉదంతం ప్రపంచవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తించింది. అయితే.. బతికిందని సంతోషించేలోపే.. అదీ వారంలోపే ఆమె ఉదంతం విషాదాంతం అయ్యింది. ఈక్వెడార్ బామ్మ బెల్లా మోంటోయా(76) కార్డియాక్ అరెస్ట్‌తో కన్నుమూసినట్లు ఆ దేశ ఆరోగ్యశాఖ అధికారికంగా ప్రకటించింది. ఆస్పత్రిలో ఉన్నంత సేపు ఆమె ఆరోగ్యం గురించి ఆరా తీస్తూనే ఉన్నామని, వారం తర్వాత(జూన్ 16న) ఆమె మృతి చెందినట్లు ఆరోగ్యశాఖ తన ప్రకటనలో పేర్కొంది. ఇక తల్లి మృతిపై గిల్బర్ట్ బార్బెరా స్పందిస్తూ.. తన తల్లి శాశ్వత నిద్రలోకి జారుకున్నట్లు ప్రకటించాడు. చనిపోయిందనుకుని భావించి జూన్ 9వ తేదీన శవపేటికలో ఉంచి సమాధి చేయబోతుండగా.. శవపేటికను బాది ఆమె ప్రాణాలతో బయపడి అందరినీ ఆశ్చర్యపర్చింది. సుమారు ఐదు గంటలపాటు ఆ బామ్మ శవపేటికలోనే ఉండిపోయింది. శ్వాస అందకపోవడంతో ఇబ్బంది పడిన ఆమెను అప్పటికప్పుడే ఆంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు. catalepsy(కండరాలు బిగుసుకుపోవడం) వల్ల ఆమె స్పృహ కోల్పోయి కదల్లేని స్థితిలో అచేతనంగా ఉండిపోయిందని, అలా ఆమె మరణించిందని కుటుంబ సభ్యులు భావించి ఉంటారని ఆ టైంలో వైద్య నిపుణులు పేర్కొన్నారు. అప్పటి నుంచి ఆమె ఐసీయూలో చికిత్స పొందుతూ.. వారం తర్వాత గుండెపోటు రావడంతో కన్నుమూసిందామె. ఏ స్మశానవాటికలో ఆమె బతికిందని సంతోషించారామె.. అదే చోట ఆమెను మళ్లీ ఇప్పుడు సమాధి చేశారు. Video Credits: Associated Press ఇదీ చదవండి: రక్తం కారుతున్నా లెక్క చేయకుండా.. -
వావ్.. ఆ వృద్ధురాలి కోసం రంగంలోకి అగ్నిమాపక దళం!
రోడ్డు దాటేందుకు ఓ వృద్ధురాలు అవస్థలు పడుతోంది. కార్లు రాయ్ రయ్ మంటూ దూసుకెళ్తున్నాయి. ఏ ఒక్కరూ ఆమెకు దారివ్వటం లేదు. రోడ్డు మధ్యలో నిలుచుని ఏం చేయాలో తెలియని నిస్సహాయ స్థితలో ఇబ్బందులు పడుతోంది ఆ మహిళ. అయితే, ఆమె కోసం ఏకంగా అగ్నిమాపక దళమే రంగంలోకి దిగింది. రోడ్డుకు అడ్డంగా ఫైర్ ఇంజిన్‌ను పెట్టి వాహనాలను ఆపేసి ఆమెను రోడ్డు దాటించారు ఫైర్ ఫైటర్స్. ప్రస్తుతం ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. రోడ్డు దాటేందుకు ఇబ్బందులు పడుతున్న వృద్ధురాలికి సాయం చేసిన ఫైర్ ఫైటర్స్‌పై నెటిజన్లు ప్రశంసలు కురిపించారు. రోడ్డు దాటేందుకు ఎవరైనా ఇబ్బందులు పడుతున్నప్పుడు వారికి ఇలానే సాయం చేయండి. రోడ్డుకు అడ్డుగా మీ కారు ఉంచి దారి ఇవ్వండి అంటూ ఓ యూజర్ రాసుకొచ్చారు. మరోవైపు.. దయ, మానవత్వ సంఘటనలు చాలా అరుదుగా జరుగుతాయని మరో వ్యక్తి పేర్కొన్నారు. అధికారాన్ని సరైన రీతిలో ఉపయోగించారని మరొకరు రాసుకొచ్చారు. Wow 🥰👏🏽👏🏽👏🏽👏🏽 pic.twitter.com/3ahdMoDHqt — How Things Are Manufactured (@fastworkers6) October 9, 2022 ఇదీ చదవండి: మేక మొక్కులకు భక్తులే షాకయ్యారు.. శివయ్య వరమిస్తాడా?.. వీడియో వైరల్ -
వృద్దురాలి వేషంలో వచ్చి బ్యాంకును కొల్లగొట్టి... దర్జాగా కారులో పరార్
ఇటీవల కాలంలో దొంగలు చాలా విచిత్రంగా దొంగతనాలు చేస్తున్నారు. అందినట్టే అంది చిక్కుకుండా చాలా తేలిగ్గా తప్పించుకుంటున్నారు. దొంగలు కూడా మనతోపాటే కలిసిపోయి చాలా తెలివిగా బురిడి కొట్టించి మరీ పరారవుతున్నారు. అచ్చం అలానే ఇక్కడొక వ్యక్తి చాలా తెలివిగా బ్యాంకు సొత్తును దొచుకుని పరారయ్యడు. వివరాల్లోకెళ్తే...అమెరికాలోని జార్జియాలో ఒక వ్యక్తి బ్యాంకు వద్దకు వృద్దురాలి వేషంలో వచ్చాడు. ఆ తర్వాత బ్యాంకు సిబ్బంది వద్దకు వెళ్లి తుపాకిని చూపి...బెదిరించి డబ్బు దోచుకున్నాడు. ఆ తదనంతరం బయటకు వచ్చి నెంబర్ ప్లేట్ లేని తెల్లటి ఎస్యూవీ కారులో దర్జాగా వెళ్లిపోయాడు. వాస్తవానికి బ్యాంకు పరిసర ప్రాంతంలోని వాళ్లు కూడా ఆ వింత గెటప్‌ని పసిగట్టలేకపోయారు. ఈ ఘటన అట్టాంటాలోని హెన్నీ కౌంటీలో చోటుచేసుకంది. దోపిడి చేసేటప్పుడూ ఆ వ్యక్తి పూల దుస్తులతో ఆకర్షణీయంగా వచ్చాడు.ఈ మేరకు వృద్ధురాలి రూపంలో వచ్చిన వ్యక్తి ఫోటోలను పోలీసులు నెట్టింట షేర్ చేస్తూ... ఈ విషయం గురించి వెల్లడించారు. సదరు నిందితుడి ఆచూకి కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. సిబ్బంది ఫిర్యాదు చేసేవరకు ఈ విషయం వెలుగు చూడకపోవడం గమనార్హం. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మాధ్యమంలో తెగ వైరల్ అవుతుంది. దీంతో నెటిజన్లు దొంగుల దొంగతనం చేయడం కోసం ఎంతకైన తెగిస్తారంటూ కామెంట్లు చేస్తూ.. ట్వీట్ చేశారు. (చదవండి: దెబ్బ తిన్న భారీ టెలిస్కోప్ జేమ్స్ వెబ్.. ఆందోళనలో నాసా) -
రెండేళ్లుగా కుళ్లిన వాసన.. తలుపు బద్ధలు కొట్టి చూస్తే షాక్
ఏమైందో ఏమోగానీ.. పాపం ఆ ఒంటరి పెద్దావిడ అస్థిపంజరంగా కనిపించి చుట్టుపక్కల వాళ్లకు షాక్ ఇచ్చింది. పైగా రెండున్నరేళ్లుగా ఆమె ఉండే పోర్షన్ నుంచి కంపు వాసన వస్తున్నా.. ఎవరూ పట్టించుకోలేదు. వాసనకు ఆ తలుపు బద్ధలు కొట్టే ప్రయత్నం చేయలేదు ఎవరు!. ఎందుకంటే.. లండన్‌లోని పెచ్‌కమ్‌లోని సెయింట్ మేరీస్ రోడ్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఓ మూడంతస్థుల భవనంలో సదరు మహిళ ఒంటరి(60 ఏళ్ల పైనే వయసు ఉంటుంది)గా ఉంటోంది. అయితే రెండేళ్లుగా ఆమె ఉంటున్న పోర్షన్ తలుపు మూతపడే ఉంది. పైగా ఆమె ఇంటి డోర్‌కి అడ్డంగా ఓ సైకిల్ పెట్టి ఉంది. దీంతో ఆమె ఇంట్లో లేదని అంతా అనుకున్నారు. అదే టైంలో దాదాపు రెండేళ్లుగా ఆ ఇంటి నుంచి దుర్వాసన వస్తూనే ఉంది. ఈ విషయాన్ని హౌజింగ్ అసోషియేషన్ దృష్టికి ఎన్నిసార్లు తీసుకెళ్లినా.. ప్రయోజనం లేకుండా పోయింది. దీంతో ముక్కు మూసుకుని అడ్జస్ట్ అవుతూ వస్తున్నారు. అయితే ఆ వాసన భరించడం వల్లకానీ ఓ యువతి.. పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఫిబ్రవరి 18వ తేదీన బలవంతంగా పోలీసులు డోర్లు బద్ధలు కొట్టి చూశారు. కుర్చీలో ఆ పెద్దావిడ అస్థిపంజరం కూర్చున్న పొజిషన్లో కనిపించడంతో అంతా షాక్ తిన్నారు. కుప్పలుగా లెటర్లు.. ఆవిడ ఎవరు? ఎక్కడి నుంచి వచ్చి అక్కడ ఉంటుంది? అనే వివరాలు ఎవరికీ తెలియదు. కానీ, పొరుగింట్లో ఉండే ఓ యువతి మాత్రం తాను లేని టైంలో పార్శిల్స్‌ను రిసీవ్ చేసుకోమని ఆ పెద్దావిడ సాయం తీసుకునేదట!. అక్టోబర్ 2019లో చివరిసారి ఆమెను చూశానని ఆ యువతి చెప్తోంది. అప్పటి నుంచి ఆమె బయట ఎవరికీ కనిపించలేదట. కరోనా కావడంతో లండన్‌లోని చాలామంది తమ స్వస్థలాలకు వెళ్లిపోయారు. దీంతో ఆమె కూడా తన సొంతూరికి వెళ్లిపోయి ఉంటుందని అంతా భావించారు. కానీ, కొన్నాళ్లకు ఆమె ఇంటి నుంచి దుర్వాసన రావడం మొదలైంది. దీంతో ఇంటి డోర్‌కు గుడ్డలు అడ్డుపెట్టారట చుట్టుపక్కల వాళ్లు. అయితే ఆమె ఇంటి బయట కుప్పలుగా లెటర్లు, ఇంటి అద్దె బాకీ ఉన్నట్లు నోటీసులు పేరుకుపోయి ఉన్నాయి. చివరికి గ్యాస్ చెకింగ్‌కు వచ్చిన వాళ్లు సైతం డోర్‌కు నోటీసులు అంటించడంతో ఆమె జాడ గురించి చుట్టుపక్కల వాళ్లలో అనుమానాలు మొదలయ్యాయి. హౌజింగ్ అసోషియేషన్ ఎంతకీ విషయం పట్టించుకోకపోవడంతో.. ఓ యువతి పోలీసులకు సమాచారం అందించడంతో ఈ వ్యవహారం వెలుగు చూసింది. పూర్తిగా కుళ్లిపోయి అస్థిపంజరం స్థితిలో ఆ పెద్దావిడ కనిపించింది. అనుమానాస్పద మృతి కేసుగా నమోదు చేసుకున్న పోలీసులు.. ఆమె ఎవరు? ఏం జరిగి ఉంటుందనే విషయాలపై దృష్టి పెట్టారు. ఈ ఘటన లండన్‌లో హాట్ టాపిక్‌గా మారింది ఇప్పుడు. ఇదిలా ఉండగా.. ఇటలీలోనూ ఈ మధ్య ఇలాంటి ఘటనే ఒకటి జరగడం విశేషం. చదవండి: కామంతో స్నేహితుడి భార్యపై కన్నేశాడు! ఆపై పక్కా స్కెచ్ వేసినా.. -
అవ్వా.. నీకు వందనం! అందుకే ఆ ఊరే మొక్కుతోంది మరి!
ఎప్పుడైనా మీ చుట్టుపక్కల వాళ్లకు సాయం చేశారా?. సపోజ్.. మీ దగ్గర కోటి రూపాయల డబ్బు ఉందనుకోండి!.. ఏం చేస్తారు? ఆలోచిస్తున్నారా? ఇక్కడో బామ్మ మరో ప్రస్తావన లేకుండా దానం చేసేసింది. ఎందుకో తెలియాలంటే ఈ కథనం చదవాల్సిందే. హుచ్చమ్మ చౌద్రి.. వయసు 75 ఏళ్లు. ఉండేది హవేరీ జిల్లా కునికేరి అనే చిన్న గ్రామం. చిన్న వయసులోనే బసప్ప చౌద్రిని పెండ్లి చేసుకుని ఆ ఊరికి కాపురం వచ్చింది. ఎన్నో ఏళ్లు గడిచినా పాపం పిల్లలు కలగలేదు ఆ జంటకు. ఒకరికొకరు తోడుగా పొలం పనులు చేసుకుంటూ కష్టపడి బతికేవాళ్లు. ముప్ఫై ఏళ్ల క్రితం బసప్ప చనిపోయాడు. అప్పటి నుంచి హుచ్చమ్మ ఒంటరిది అయ్యింది. కానీ, ఆమె కాయకష్టం ఆగలేదు. ఊరికి కష్టం.. పొలం పనులు చేసుకుంటున్న హుచ్చమ్మకి.. ఒకరోజు పంచాయితీలో పెద్దలు మాట్లాడుకుంటున్న విషయం చెవిన పడింది. స్కూల్లో బడి లేదు. ఎక్కడైనా స్థలం దొరికితే కట్టాలని అనుకుంటున్నారు. ఆ పెద్దావిడ ముందుకొచ్చింది. తన ఎకరం స్థలం తీసుకోమని చెప్పింది. అది వినగానే అందరూ కంగుతిన్నారు. నిజంగానే అంటున్నావా హుచ్చమ్మా? అన్నారు. ‘మనస్ఫూర్తిగా..’ అంటూ కాగితాలపై సంతకాలు చేసేసింది ఆమె. అలా ఆ ఊరికి స్కూల్ వచ్చింది. అటుపై పిల్లల ఆట స్థలం కోసం ఇబ్బంది పడకూడదని ఆ పక్కనే మరో ఎకరం కూడా ఇచ్చేసింది. ఈసారి రిజిస్ట్రేషన్ కోసం వచ్చిన అధికారులు.. ఆమెకు ఆ స్థలం విలువ చెప్పే ప్రయత్నం చేశారు. ఆ భూమిలో ఇనుము ధాతువు ఉందని, ఎకరం కనీసం అర కోటి రూపాయలకు తక్కువకు పోదని ఆమెకు వివరించారు. కానీ, నవ్వుతూ ఆ పెద్దావిడ ‘ ఆ డబ్బు నేనేం చేసుకోను అయ్యా.. ఆకలి తీర్చుకునేందుకు పని చేస్తున్నా.. సంపాదించుకుంటున్నా. ఇలాగైనా ఈ ఊరి బిడ్డలు నన్ను జీవితాంతం గుర్తు పెట్టుకుంటారు కదా’ అంటూ సంతకాలు చేసేసింది. హుచ్చమ్మ ఇప్పుడు అదే స్కూల్లో ఆమె మధ్యాహ్నన భోజన పథకం కింద వంట మనిషిగా పని చేస్తోంది. బడి బంద్ ఉన్న టైంలో పొలం పనులు చేసుకుంటోంది. బడిలో అంతా ఆమెను అజ్జీ(అవ్వ) అని పిలుస్తున్నారు. తల్లి ప్రేమను నోచుకోకపోయినా.. ఊరి బిడ్డలకు ప్రేమగా వండిపెడుతోంది. 300 మంది ఆప్యాయంగా అవ్వా అంటుంటే సరిపోదా? అంటూ బోసినవ్వులతో చెప్తోంది హుచ్చమ్మ. అందుకే ఆ అవ్వ సాయానికి ఊరంతా మొక్కుతోంది ఇప్పుడు. -
కర్ణాటకలో మంకీ ఫీవర్ కలకలం
సాక్షి, బెంగళూరు: దేశంలో కరోనా కేసులు ఆందోళనకు గురిచేస్తుండగా కర్ణాటకలో మంకీ ఫీవర్ మరోసారి కలకలం రేపుతోంది. షిమోగా జిల్లాకు చెందిన 57 ఏళ్ల మహిళకు మంకీ ఫీవర్ సోకినట్టు వైద్యులు గుర్తించారు. జ్వరంతో ఆసుపత్రిలో చేరిన బాధితురాలికి చికిత్స అందిస్తున్నా తగ్గకపోవడంతో అనుమానించిన వైద్యులు పరీక్షలు నిర్వహించగా ఈ విషయం బయటపడింది. ఈ ఏడాది నమోదైన తొలి మంకీ జ్వరం కేసు ఇదే. ప్రస్తుతం ఆమెకు తీర్థహళ్లి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. రెండు సంవత్సరాల క్రితం ఇదే రాష్ట్రంలోని సాగర్ మండలం, అరళగోడు గ్రామంలో 26 మంది మంకీ జ్వరంతో ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత మళ్లీ మంకీ ఫీవర్ వెలుగు చూడడం ఇదే తొలిసారి. ఇది వైరల్ జబ్బు. వ్యాధి సోకిన వారిలో అధిక జ్వరం, ఒళ్లు నొప్పులు వంటి డెంగీ లక్షణాలు ఉంటాయి. కోతుల ద్వారా మనుషులకు సోకుతుంది. -
‘కాళ్లు మొక్కుతా సారు.. నాకు వద్దంటే వద్దు’
సాక్షి,జోగిపేట(హైదరాబాద్): కాళ్లు మొక్కుతా నాకు సూది(వ్యాక్సిన్) వద్దు అంటూ ఒక వైపు బతిమిలాడుతూనే మరొక వైపు వైద్య సిబ్బందిని దగ్గరకు రానీయకుండా మొండికేయడంతో అధికారులు నచ్చజెప్పి ఎట్టకేలకు ఆ వృద్ధురాలికి వ్యాక్సిన్ ఇప్పించగలిగారు. ఆదివారం అందోలు మండలంలోని కొడెకల్, డాకూరు గ్రామాల్లో ఇంటింటికీ తిరుగుతూ వ్యాక్సిన్ తీసుకోని వారికి ఇప్పించారు. డాకూరు గ్రామంలో మైదాకుచెట్టు షరీఫాబీ(70) ఇంటికి వైద్య సిబ్బంది వెళ్లి వ్యాక్సిన్ వేసుకోమని కోరగా అందుకు నిరాకరించింది. కాళ్లు మొక్కుతానని, నాకు సూది ఇవ్వొదని మొరపెట్టుకుంది. అక్కడే ఉన్న జిల్లా పంచాయతీ అధికారి సురేశ్‌మోహన్ వ్యాక్సిన్ తప్పనిసరిగా వేసుకోవాలని నచ్చజెప్పారు. ఇంట్లోకి వెళ్లి దాని వల్ల ఏమి భయంలేదని, కరోనా వచ్చినా తట్టుకుంటారని చెప్పి ఎట్టకేలకు వ్యాక్సిన్ వేయించారు. అరగంట సేపు సిబ్బందిని ఇబ్బంది పెట్టిన మహిళ వ్యాక్సిన్ వేసుకోవడంతో అధికారులు వెనుదిరిగారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా వ్యాక్సిన్ వేయించుకోవాలని డీపీఓ సూచించారు. చదవండి: వంద కోసం అటెండర్ కక్కుర్తి.. పసి ప్రాణం బలైపోయింది -
‘అడుక్కోవాలని లేదు.. పెన్నులు కొనండి చాలు’
ముంబై: కొంతమంది ఆరోగ్యపరంగా ఏ లోపాలు లేకున్నా, పని చేసే సామర్థ్యం ఉన్నా చేయలేక యాచించేవాళ్లని, ఇతరులపై ఆధారపడే వాళ్లని చూస్తుంటాం. ఇంకొందరు కష్టపడి పని చేయలేక సులభమైన దారిలో డబ్బు సంపాదనకై ఇతరులను మోసం చేస్తూ సంపాదిస్తుంటారు. ప్రస్తుత రోజుల్లో ఇలాంటి ఘటనలు మనం వింటూనే ఉంటాం. కానీ వయసు మీదపడినా కూడా ఓ బామ్మ మాత్రం ఎవరి దగ్గర చేయి చాపడం ఇష్టం లేదని ఈ వయసులోనూ తన కష్టం మీదే తన జీవనాన్ని కొనసాగిస్తోంది. ప్రస్తుతం ఆ బామ్మకి సంబంధించిన ఫోటో సోషల్‌మీడియాలో చక్కర్లు కొడతూ హల్చల్ చేస్తోంది. వివరాల్లోకి వెళితే.. ఇటీవల రీఅప్ స్టూడియో వ్యవస్థాపకురాలు శిఖా రథి తన స్నేహితులతో కలిసి పూణేలోని ఎమ్‌జి రోడ్లో వెళ్తున్నప్పుడు ఈ బామ్మను(రతన్) కలిసింది. ఆ సమయంలో ఆ బామ్మ రంగురంగుల పెన్నులను కార్డ్‌బోర్డ్‌తో తయారు చేసిన పెట్టెలో పెట్టి అమ్ముతోంది. అయితే ఆ కార్డ్‌బోర్డ్‌పై ఉన్న ఓ లైన్ చూసి అశ్చర్యపోయింది. ఆ నోట్లో.. ‘నాకు ఎవరీ దగ్గర చేయి చాచను. దయచేసి రూ.10/- బ్లూ కలర్ పెన్నులు కొనండి చాలు. థ్యాంక్యు. బ్లెస్ యూ’.. అని రాసుంది. కాగా ఆ బామ్మ రోడ్లపై తిరుగుతూ విద్యార్థులను, ట్రాఫిక్ సిగ్నల్ పడగానే ఆగిన వాహనదారులను రిక్వెస్ట్ చేస్తూ పెన్నులు అమ్ముతోంది. సాయంత్రం వరకు అక్కడే ఉండి.. పెన్నులు అమ్మగా వచ్చిన డబ్బుతో తన జీవితాన్ని సాగిస్తోంది. ఈ విషయం తెలుసుకున్న రతి ఆమె ఫోటో తీసి తన ఇన్‌స్టాలో షేర్ చేసింది. ఈ ఫోటో చూసిన కొందరు నెటిజన్లు బామ్మకు హేట్సాఫ్ చెప్పడంతో పాటు మన వంతు సాయం చేయాలని కామెంట్లు పెడుతున్నారు. View this post on Instagram A post shared by Shikha Rathi (@sr1708) చదవండి: Snakes Found Home: ఆ ఇంట పాములు బాబోయ్ పాములు.. చూస్తే చెమటలు పట్టాల్సిందే! -
ప్రియురాలు పని చేసే చోట దొంగతనం.. పాపం పోవాలని పూజలు..
భోపాల్: ఫేస్బుక్లో ఓ వ్యక్తికి ఒక అమ్మాయితో పరిచయం ఏర్పడింది. కొన్ని రోజుల తర్వాత అది కాస్త ప్రేమగా మారింది. ఈ అమ్మాయి 8 సంవత్సరాలుగా ఓ వృద్ధురాలి ఇంట్లో పనిచేస్తోంది. దీంతో తన ప్రియురాలిని కలవడానికి ఆ వ్యక్తి అప్పుడప్పుడు వృద్ధురాలి ఇంటికి వెళ్లేవాడు. అలా వెళ్లిన ప్రతీసారి ఆ యువకుడు కన్ను ఆ మహిళ ఒంటిపై ఉన్న నగలపై పడింది. అలా ఓ రోజు తన ప్రియురాలు ఆ ఇంట్లో లేదని తెలుసుకున్నాడు. అదే అదునుగా భావించి తన స్నేహితునితో కలిసి ఒంటరిగా ఉన్న వృద్ధురాలి ఇంట్లోకి వెళ్లాడు. (చదవండి: గడ్డి కోసం వెళ్లిన మహిళపై తుపాకితో బెదిరించి సామూహిక లైంగిక దాడి) ఆమె అరవకుండా నోట్లో గుడ్డ కుక్కి నగలను, సొమ్మును వారిద్దరు దోచుకున్నారు. ఆ ఇంట్లోకి వచ్చిన ప్రియురాలు కూడా ఎవరో దొంగలు వచ్చారే అనుకుంది. ఈ విషయం చుట్టుపక్కలవాళ్లకు తెలియడంతో పోలీసులకు సమాచారం చేరవేయడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. సీసీటీవీ పుటేజ్ ఆధారంగా నిందితులను అదుపులోకి తీసుకున్నారు. కాగా విచారణలో వారు.. ఈ దోపిడీ తరువాత, నేరుగా ఉజ్జయినికి వెళ్లామని, అక్కడ బాబా మహాకల్‌ను దర్శనం చేసుకుని క్షమాపణ చెప్పడంతో పాటు అక్కడ దానధర్మాలు కూడా చేసినట్లు పోలీసులకు తెలిపారు. అయితే, ఈ ఘటన గురించి ఆ బాలికకు ఎటువంటి సంబంధం లేదని పోలీసులు చెబుతున్నారు. చదవండి: Uthra Murder Case: కసాయి భర్త కేసులో కోర్టు సంచలన తీర్పు -
వయసు 78.. బరిలో దిగిందో.. ప్రత్యర్థి మట్టి కరవాల్సిందే
తిరువనంతపురం: కొన్ని ఏళ్ల క్రితం మగ పిల్లలు ఆడే ఆటలపై అమ్మాయిలు అంతగా ఆసక్తి చూపేవారు కాదు. ముఖ్యంగా కరాటే, బాక్సింగ్ వంటి క్రీడలవైపు వెళ్లాలంటే అమ్మాయిలతో పాటు.. తల్లిదండ్రులు కూడా పెద్దగా ఇష్టపడేవారు కారు. ప్రస్తుతం ఈ ఆలోచన ధోరణి మారుతోంది. ఆటలకు ఆడా..మగా తేడా ఏంటని భావిస్తున్నారు. ఈ క్రమంలో చాలా వరకు క్రీడాంశాల్లో అమ్మాయిలు సత్తా చాటుతున్నారు. అయితే వీరు కూడా ఆధునిక క్రీడలవైపే మొగ్గు చూపుతున్నారు కానీ మన సంప్రదాయ ఆటలపై ఆసక్తి కనపర్చడం లేదు. ఈ క్రమంలో కేరళకు చెందిన 78 ఏళ్ల వృద్ధురాలు మీనాక్షి అమ్మ మన దేశ పురాతన మార్షల్ ఆర్ట్ అయిన కలరిపయట్టులో పరాక్రమం చూపిస్తూ ప్రత్యర్థులను మట్టి కరిపిస్తూ.. యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారు. ఆ వివరాలు.. కేరళకు చెందిన వృద్ధురాలు మీనాక్షి అమ్మ భారతదేశ పురాతన మార్షల్ ఆర్ట్ కలరిపయట్టును నేటికి కూడా సాధన చేయడమే కాక అమ్మాయిలు దాన్ని సాధన చేసేలా ప్రొత్సాహిస్తున్నారు. ఈ సందర్భంగా మీనాక్షి అమ్మ మాట్లాడుతూ.. ‘‘ఏడేళ్ల వయసు నుంచే కలరి సాధన చేయడం ప్రారంభించాను. ఇప్పటికీ ప్రాక్టీస్ చేయడమే కాక ఇతరులకు నేర్పుతున్నాను’’ అని తెలిపారు. కలరిపయట్టు నేర్పే ఈ స్కూల్‌ని మీనాక్షి భర్త 1949లో ప్రారంభించాడు. ఆయన మరణం తర్వాత మీనాక్షి ఈ స్కూల్ బాధ్యతలు చూస్తున్నారు. (చదవండి: Calicut Riders Family: సాఫ్ట్వేర్ ఇంజనీర్, హోం మేకర్స్.. ఇంకా) ‘‘రోజు ఉదయం పేపర్ తెరిచామంటే.. మహిళపై జరుగుతున్న దాడులకు సంబంధించి ఏదో ఓ వార్త ఉంటుంది. ఇలాంటి అరాచకాల నుంచి మనల్ని మనం కాపాడుకోవాలంటే కలరిపయట్టు నేర్చుకోవడం ఎంతో మంచింది. ఈ మార్షల్ ఆర్ట్ కళను నేర్చుకోవడం వల్ల మహిళలు శారీరకంగా, మానసికంగా ధృడంగా తయారవుతారు. వారి మీద వారికి నమ్మకం పెరుగుతుంది.. ఒంటరిగా ఉద్యోగాలకు వెళ్లడం.. ప్రయాణాలు చేయాల్సి వచ్చినా వారు భయపడరు’’ అన్నారు మీనాక్షి. ‘‘కలరిపయట్టులో పూర్తిగా నిమగ్నం అయితే మన శరీరమే కళ్లవుతాయి. ప్రత్యర్థి మాయమవుతాడు. దీనిలో రెండు రకాలు ఉంటాయి. ఒకటి శాంతికి సంబంధించింది అయితే మరోకటి యుద్ధంలో వాడేది. కలరిపయట్టు నేర్చుకోవడం వల్ల మనసు, బుద్ధి, శరీరం, ఆత్మ పూర్తిగా శుద్ది అవుతాయి. ఏకాగ్రత పెరుగుతుంది. వేగం, శాంతి పెరుగుతాయి. శారీరక, మానసిక శక్తి పునరుత్తేజమవుతోంది’’ అన్నారు. (చదవండి: అప్పుడు కేరళలో.. ఇప్పుడు తమిళనాడులో.. ఆ హక్కు మీకు ఉంది!) నృత్యం,యోగా అంశాలను కలిగి ఉన్న కలరిపయట్టులో కత్తులు, కవచాలు, వంటి ఆయుధాలు ఉంటాయి. కలరి 3,000 సంవత్సరాల పురాతనమైనది. దీని గురించి ప్రాచీన హిందూ గ్రంథాలలో ప్రస్తావించారు. అయితే బ్రిటీష్ పాలనలో కలరిపయట్టు సాధనపై నిషేధం విధించారు. అయితే స్వాతంత్య్రం వచ్చాక నిషేధాన్ని తొలగించినప్పటికి పూర్వ వైభవం రాలేదు. కాకపోతే 20వ శతాబ్దం ప్రారంభం నుంచి కలరిపయట్టుపై ఆసక్తి చూపే వారి సంఖ్య పెరగడం మంచి పరిణామంగా భావిస్తున్నారు. చదవండి: విద్యుత్ జమాల్.. కలరిపయట్టు -
ఆమె ఒంటరి,జ్ఞాపకాలు తప్ప మనుషులు తోడు లేరు.. చివరికి..
సాక్షి, పలాస(శ్రీకాకుళం): ఆమె ఒంటరి. జ్ఞాపకాలు తప్ప మనుషులు తోడు లేని మహిళ. కట్టుకున్న భర్త కాలం చేసిన నాటి నుంచి కన్నబిడ్డలను కష్టపడి పెంచింది. కొడుకు చేతికి అందివచ్చాడని సంతోషించే లోపు విధి అతడిని తీసుకెళ్లిపోయింది. కుమార్తె కూడా పెళ్లి చేసుకుని దూరంగా వెళ్లిపోయింది. సొంత ఇల్లు అమ్ముకోవాల్సి వచ్చింది. నా అనే వారు లేక, అద్దె ఇంటిలో కాలం గడిపిన బత్తిన ఆదిలక్ష్మి (70) మంగళవారం కాలం చేశారు. ఇన్నాళ్లుగా ఆమెను చూస్తున్న స్థానికులు ఆదిలక్ష్మి మృతితో కన్నీరు పెట్టుకున్నారు. పలాస మండలం బొడ్డపాడు గ్రామానికి చెందిన బత్తిన ఆదిలక్ష్మి(70) మంగళవారం మృతి చెందారు. ఆమె భర్త చాలా కాలం కిందటే చనిపోయారు. పదేళ్ల కిందట కొడుకు కూడా మరణించాడు. ఒక్కగానొక్క కుమార్తె సుమిత్ర వజ్రపుకొత్తూరులో తన భర్తతో కలసి ఉంటున్నారు. కొద్దికాలంగా ఆదిలక్ష్మి ఆరోగ్య స్థితి బాగోలేదు. ఇటీవల కుమార్తె వద్ద కూడా ఆమె తన నిస్సహాయతను వ్యక్తం చేశారు. మంగళవారం ఉదయం కుమార్తె తల్లి వద్దకు వచ్చే సరికి ఆదిలక్ష్మి ఇంటిలో అపస్మారక స్థితిలో పడి ఉన్నారు. వెంటనే ఆమె పలాస ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లగా.. అక్కడ చనిపోయారు. దీంతో ఆమె తాను ఉంటున్న వజ్రపుకొత్తూరుకు తల్లి మృతదేహాన్ని తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించారు. ఆమె మృతితో బొడ్డపాడు గ్రామమంతా విషాదఛాయలు అలముకున్నాయి. దుష్ప్రచారం తగదు.. పింఛన్ అందకపోవడం వల్లే వృద్ధురాలు బత్తిన ఆదిలక్ష్మి మరణించిందని సోషల్ మీడియాలో వస్తున్న ప్రచారంలో వాస్తవం లేదని పలాస ఎంపీడీఓ ఎన్.రమేష్‌నాయుడు స్పష్టం చేశారు. ప్రభుత్వ పథకాలపై విష ప్రచారం చేసే వ్యక్తులపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. చదవండి: వైరల్: ‘లారీకి దెయ్యం పట్టిందా? రెండుగా విడిపోయినా ఏంటా పరుగు’ -
నిమిషాల వ్యవధిలో రెండు సార్లు వ్యాక్సిన్.. తట్టుకోలేక..
సాక్షి, చెన్నై: నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఓ నర్సు నిమిషాల వ్యవధిలో రెండుసార్లు కరోనా టీకా వేయడంతో ఓ వృద్ధురాలు స్పృహ తప్పింది. ఆమెకు అత్యవసర చికిత్స అందిస్తున్నారు. వివరాలు.. కడలూరు జిల్లా పెన్నాడం ఆరోగ్య కేంద్రంలో కరోనా వ్యాక్సిన్ వేసుకునేందుకు అదే ప్రాంతానికి చెందిన సుబ్రమణ్యం భార్య లక్ష్మి (55) సోమవారం వచ్చారు. తొలుత ఆమెకు నర్సు వ్యాక్సిన్ వేశారు. వెనువెంటనే సహచర నర్సుతో మాట్లాడుతూ మరో టీకా కూడా వేశారు. ఒకే సమయంలో తనకు రెండు సార్లు టీకా ఎందుకు వేస్తున్నారని లక్ష్మి ప్రశ్నించినా ఆ నర్సు ఖాతరు చేయలేదు. దీంతో లక్ష్మి స్పహ తప్పింది. ఆమెకు ప్రథమ చికిత్స చేశారు. ఓ టీకా మాత్రమే వేసినట్టుగా నర్సు వాదించినా, బాధితురాలి చేతి నుంచి రెండు చోట్ల రక్తం వస్తుండడంతో ఉన్నతాధికారులు స్పందించారు. సీనియర్ వైద్యుల పర్యవేక్షణలో లక్ష్మిని ఉంచారు. ఈఘటనపై ఆరోగ్య శాఖ వర్గాలు దర్యాప్తు చేపట్టాయి. చదవండి: Tamilnadu: తల్లికి రెండో పెళ్లి చేసిన కుమారుడు -
70 ఏళ్లుగా అడవిలోనే.. కర్పూరమే ఆహారంగా
విజయనగరం: పురాణాల్లోనూ, కథల్లోనూ మునులు ఒంటరిగా అడవుల్లో తపస్సులు చేసుకుంటూ ఉంటారని విని ఉంటాం కానీ చూసిన అనుభవం లేదు. కానీ ఈ ఆధునిక యుగంలో అలాంటి వాళ్లు ఉన్నారంటే నమ్మలేం కదా! కానీ పద్మావతి అనే వృద్ధురాలిని చూస్తే నమ్మక తప్పదేమో. ఆమె ఏడు దశాబ్దాలుగా ఒంటరిగా అడవిలోనే ఉంటుంది. కర్పూరాన్ని ఆహారంగా తీసుకుంటూ దైవ చింతనలోనే గడపుతూ ఉంటుందట. ఆ వివరాలు విజయనగరం జిల్లా గజపతి నగరం మండలం పెదకాద గ్రామంలోని 85 ఏళ్ల పద్మావతి అనే వృద్ధురాలు గ్రామానికి సమీపంలోని అడవిలోనే ఏడు దశాబ్దాలుగా ఒంటరిగా జీవిస్తోంది. తనని వేంకటేశ్వర స్వామి పిలుస్తున్నారంటూ.. 12 ఏళ్ల వయసులో పద్మావతి అడవిలోకి వెళ్లి.. అక్కడే నివాసం ఏర్పరుచుకుందని స్థానికులు చెబుతున్నారు. కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఆమెను తీసుకురావాలని ఎంతగా ప్రయత్నించిన పద్మావతి అంగీకరించేది కాదట. తన దైవం వేంకటేశ్వర స్వామి అని.. అక్కడి నుంచి రాలేనని చెప్తూ.. కొండపై విగ్రహాన్ని పెట్టుకుని పూజిస్తూ ఉంటుందని అంటున్నారు స్థానికులు. ఈ క్రమంలో చుట్టుపక్కల గ్రామస్తులంతా కలిసి ఆ కొండ పై గుడి నిర్మించామని తెలిపారు. పద్మావతి భక్తుల తెచ్చే పాలు, పళ్లు, కానుకలు ఏమి తీసుకునేది కాదని, అవన్నీ మళ్లీ తిరిగి తమకే ఇచ్చేస్తుందని స్థానికులు చెబుతున్నారు. పైగా ఆహారం ఏమి తీసుకోకుండా కేవలం భక్తులు సమర్పించే కర్పూరం, అగరబత్తుల దూపం, టీ మాత్రమే తీసుకుంటుందని తెలిపారు. పద్మావతి జీవన శైలి దేవుడు ఉన్నాడు అనేదానికి నిదర్శనంగా నిలుస్తుందంటున్నారు భక్తులు -
బుల్లెట్ బండికి బామ్మ స్టెప్పులు.. వామ్మో ఏ చేసింది రా బాబు !
-
బుల్లెట్ బండికి బామ్మ అదిరిపోయే స్టెప్పులు.. వైరల్ వీడియో
సోషల్‌మీడియాలో ఏది ఎప్పుడు ట్రెండ్ అవుతుందో చెప్పలేం. అలా ఏదైనా ఓసారి నెటిజన్లను ఆకట్టుకుంటే అవి వైరల్‌గా మారి నెట్టింట రచ్చ చేస్తుంటాయి. సింపుల్‌గా చెప్పాలంటే వాటి హవా కొంత కాలం అలా కొనసాగుతూనే ఉంటుంది. ఇక ‘బుల్లెట్ బండి’ పాట గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సామాన్య ప్రజలే గాక సెలబ్రిటీల సైతం ఈ పాటకి చిందేస్తున్నారు. తాజాగా ఓ బామ్మ తన భర్త ముందు ‘బుల్లెట్ బండి’ పాటకు స్టెప్పులతో ఇరగదీసింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది. ప్రస్తుతం.. శ్రావణమాసంలో పెళ్లిళ్లతోపాటు ‘బుల్లెట్ బండి’ పాట ట్రెండ్ కూడా నడుస్తోంది. ఇంట్లో పెళ్లి పనులు ప్రారంభించినప్పటి నుంచి బరాత్ అయ్యే వరకూ ఎక్కడ చూసినా ‘డుగ్గు డుగ్గు’ అంటూ ఒకటే మ్యూజిక్ వినిపిస్తోంది. దీంతో ఈ పాటకు ఆఫ్‌లైన్‌లోనే కాదు ఆన్‌లైన్‌లోనూ అంతకంతకు క్రేజ్ పెరుగుతోంది. అయితే ఓవైపు ‘బుల్లెట్టు బండి’ వీడియోలతో పెళ్లికూతుళ్లు, యువతీయువకులు అలరిస్తుంటే మరోవైపు తాను కూడా తక్కువకాదంటూ ఓ వృద్ధురాలు ఈ పాటకు అదిరిపోయే స్టెప్పులేసింది. ఆ వీడియోలో.. దాదాపు 60 ఏళ్లకు పైగా వయసున్న ముసలావిడ .. ‘బుల్లెట్ బండి’ సాంగ్‌కి అద్భుతమైన స్టెప్పులేసింది. తన భర్త మంచంపై కూర్చొని చూస్తుండగా.. సరిగ్గా సాంగ్‌లో రిథమ్‌కి తగ్గట్టు ఆమె డాన్స్ చేసింది. అయితే అతను మాత్రం కదలకుండా అలా చూస్తూనే ఉండిపోయాడు, బహుశా షాక్‌లో ఉన్నాడేమో! ఈ వీడియో చూసిన నెటిజన్లు.. వావ్ సూపర్ బామ్మ అంటున్నారు. కొందరు ఫన్నీగా ఉందని కామెంట్ పెడుతుంటే.. మరికొందరు ‘బామ్మ నువ్వు గ్రేట్’ అని కామెంట్ పెడుతున్నారు. చదవండి: Cat Drink Pig Milk: పంది పాలు తాగిన పిల్లి.. వైరల్ అవుతున్న వీడియో